Search for a command to run...
13 Feb 2003
"వర్తమాన సమయములో మీ దయా హృదయాన్ని మరియు దాతా స్వరూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి"
13 February 2003 · తెలుగు
ఈరోజు వరదాత తండ్రి తమ జ్ఞాన దాతలు, శక్తి దాతలు, గుణ దాతలు, పరమాత్మ సందేశవాహకులు అయిన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మాస్టర్ దాతగా అయ్యి ఆత్మలను బాబాకు సమీపముగా తీసుకువచ్చేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నారు. విశ్వములో అనేక రకాల ఆత్మలు ఉన్నారు, కొన్ని ఆత్మలకు జ్ఞానామృతము కావాలి, ఇతర ఆత్మలకు శక్తి కావాలి, గుణాలు కావాలి, పిల్లలైన మీ వద్ద అన్ని ఖజానాలు అఖండముగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మ యొక్క కోరికను పూర్తి చేసేవారు మీరు. రోజురోజుకూ సమయము సమాప్తికి సమీపముగా వస్తున్న కారణముగా ఇప్పుడు ఆత్మలు ఏదైనా కొత్త ఆధారాన్ని వెతుకుతున్నారు. ఆత్మలైన మీరు ఆ కొత్త ఆధారాన్ని ఇవ్వడానికి నిమిత్తులుగా అయ్యారు. బాప్‌దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. ఒకవైపు అవసరము ఉంది మరియు ఇంకొకవైపు ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. అవసరమైన సమయములో ఒక్క బిందువుకు కూడా మహత్వము ఉంటుంది. కనుక ఈ సమయములో మీరు ఇచ్చే అంచలికి, సందేశానికి కూడా మహత్వము ఉంటుంది.
వర్తమాన సమయము పిల్లలైన మీ అందరి దయా హృదయము మరియు దాతా స్వరూపము ప్రత్యక్షమయ్యే సమయము. బ్రాహ్మణ ఆత్మలైన మీ అనాది స్వరూపములో కూడా దాతాతనపు సంస్కారాలు నిండి ఉన్నాయి, అందుకే కల్పవృక్షము చిత్రములో మీరు వృక్షము యొక్క వేర్లలో చూపించబడ్డారు ఎందుకంటే వేర్ల ద్వారానే మొత్తము వృక్షానికి అన్నీ చేరుకుంటాయి. మీ ఆది స్వరూపము దేవతా రూపము, దేవత అన్నదాని అర్థమే దేవత అనగా ఇచ్చేవారు. మీ మధ్యకాల స్వరూపము పూజ్యనీయ చిత్రము కనుక మధ్యకాలములో కూడా పూజ్య రూపములో మీరు వరదానాలను ఇచ్చే, దీవెనలను ఇచ్చే, ఆశీర్వాదాలను ఇచ్చే దాతా రూపులు. కనుక ఆత్మలైన మీ విశేష స్వరూపమే దాతాతనపు స్వరూపము. అలాగే ఇప్పుడు కూడా పరమాత్ముని సందేశ వాహకులుగా అయ్యి విశ్వములో బాబా ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపజేస్తున్నారు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి - అనాది, ఆది దాతాతనపు సంస్కారాలు ప్రతి ఒక్కరి జీవితములో సదా ఇమర్జ్ రూపములో ఉంటున్నాయా? దాతాతనపు సంస్కారాలు కల ఆత్మలకు గుర్తు ఏమిటంటే - ఎవరైనా ఇస్తే మేము ఇస్తాము, ఎవరైనా చేస్తే మేము చేస్తాము అని వారు ఎప్పుడూ సంకల్పమాత్రముగా కూడా ఇలా అనుకోరు. వారు నిరంతరము తెరిచియున్న భాండాగారములా ఉంటారు. బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క దాతాతనపు సంస్కారాలను చూస్తూ ఉన్నారు. ఏం చూసి ఉంటారు? నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు కదా! ఎప్పుడూ కూడా ఈ సంకల్పాన్ని చెయ్యకండి - ఇది ఇలా ఉంటే నేను కూడా చేస్తాను అని. దాతాతనపు సంస్కారాలు కలవారికి అన్ని వైపుల నుండి సహయోగము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. కేవలము ఆత్మల ద్వారానే కాకుండా ప్రకృతి కూడా సమయమనుసారముగా సహయోగిగా అయిపోతుంది. ఒక సూక్ష్మమైన లెక్క ఏమిటంటే - ఎవరైతే సదా దాతగా అవుతారో, ఆ ఆత్మకు ఆ పుణ్యానికి ఫలముగా అవసరమైన సమయానికి సహయోగము, అవసరమైన సమయానికి సఫలత సహజముగా ప్రాప్తిస్తుంది. అందుకే సదా దాతాతనపు సంస్కారాలను ఇమర్జ్ రూపములో ఉంచుకోండి. పుణ్య ఖాతా ఒకటికి పది రెట్లు ఫలాన్ని ఇస్తుంది. కనుక మొత్తం రోజంతటిలో నోట్ చేసుకోండి - సంకల్పాల ద్వారా, వాణి ద్వారా, సంబంధ-సంపర్కాల ద్వారా పుణ్య ఆత్మగా అయ్యి పుణ్య ఖాతాను ఎంత జమ చేసుకున్నాను? మనసా సేవ కూడా పుణ్య ఖాతాను జమ చేస్తుంది. వాణి ద్వారా ఎవరైనా బలహీన ఆత్మను సంతోషములోకి తీసుకురావటము, ఆందోళనలో ఉన్నవారిని తమ గౌరవము యొక్క స్మృతిలోకి తీసుకురావటము, నిరాశలో ఉన్న ఆత్మను తమ వాణి ద్వారా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురావటము, సంబంధ-సంపర్కము ద్వారా ఆత్మకు తమ శ్రేష్ఠ సాంగత్యపు రంగును అనుభవము చేయించటము, ఈ విధి ద్వారా పుణ్య ఖాతాను జమ చేసుకోగలరు. ఈ జన్మలో ఎంత పుణ్యము జమ చేసుకుంటారంటే ఇక అర్థకల్పము ఆ పుణ్య ఫలాన్ని తింటారు మరియు అర్థకల్పము మీ జడ చిత్రాలు పాప ఆత్మలను వాయుమండలము ద్వారా పాపాల నుండి ముక్తులుగా చేస్తాయి. పతిత-పావనిగా అయిపోతారు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జమ అయిన పుణ్య ఖాతాను చూస్తూ ఉంటారు.
బాప్‌దాదా వర్తమాన సమయములో పిల్లల్లో ఉన్న సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. మెజారిటీ పిల్లలలో సేవకు సంబంధించిన ఉల్లాసము బాగుంది. అందరూ తమ-తమ వైపు నుండి సేవా ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకువస్తున్నారు. ఇందుకు బాప్‌దాదా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. బాగా చేస్తున్నారు మరియు బాగా చేస్తూ ఉంటారు. అన్నిటికంటే మంచి విషయము ఏమిటంటే - అందరి సంకల్పాలు మరియు సమయము బిజీగా అయిపోయాయి. ప్రతి ఒక్కరికీ ఈ లక్ష్యము ఉంది - నలువైపులా చేసే సేవ ద్వారా ఇప్పుడు ఫిర్యాదులను తప్పకుండా పూర్తి చెయ్యాలి అని.9 లక్షలమంది కావాలి అని దాదీ అంటారు, ఒకవేళ 3-4 స్థానాల నుండి లక్ష-లక్ష మంది వస్తే, అప్పుడు ఏమి జరుగుతుంది? 6 లక్షలమంది అయితే ఉన్నారు, ఇక కావలసిందీ 3 లక్షలే! మరి ఇంతమందికి సందేశాన్ని ఏదైతే ఇస్తున్నారో, దేశవిదేశాలలో, పిల్లల ఉత్సాహం గురించి బాప్‌దాదా విన్నారు. తయారు చేస్తున్నారు కదా – అక్కడ కూడా చాలా మంచి ప్రోగ్రాములు తయారు చేస్తున్నారు. ప్రతి స్థానం యొక్క విధి వేరువేరుగా ఉంటుంది, కానీ సేవ చేయాలన్న ఉత్సాహం అందరిలో ఉంది. మరి 9 లక్షలు ఏమిటి, కేవలం 3 లక్షలు ఇంకా కావాలి, ఇదేమంత పెద్ద విషయము? మొదటి నంబరు గుజరాత్ బాధ్యత తీసుకుంది, మంచిగా చేసారు. గుజరాత్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? (200 సెంటర్లు, 1000 ఉప సేవాకేంద్రాలు/పాఠశాలలు ఉన్నాయి) ఒక్కొక్క సెంటరు నుండి ఒకవేళ 10-10 మంది వచ్చినా కూడా ఎంతమంది అవుతారు? అలా ఢిల్లీ, బాంబే, మద్రాస్. మద్రాస్ అయితే ఫ్లయింగ్, ఎగురుతుంది. కలకత్తా, హైదరాబాద్, ఫారన్ కూడా ఉన్నాయి. 3 లక్షలు ఏమంత పెద్ద విషయము? టీచర్లు చెప్పండి, ఇది పెద్ద విషయమా? అయితే 9 లక్షల మంది తయారైపోతారు కదా! ఇందులో చేయి ఊపడం లేదు! పాండవులు చేతులు ఊపుతున్నారు. బ్రాహ్మణుల దృఢ సంకల్పములో చాలా శక్తి ఉంది. ఒకవేళ బ్రాహ్మణులు దృఢ సంకల్పము చేస్తే ఏదైనా ఎందుకని అవ్వదు! అన్నీ అవుతాయి. కేవలము యోగాన్ని జ్వాలా రూపముగా చెయ్యండి. యోగము జ్వలారూపముగా అయినట్లయితే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తాయి ఎందుకంటే జ్వాల (వెలుగు) లభించటముతో వారికి దారి కనిపిస్తుంది. ఇప్పుడు యోగమైతే జోడిస్తున్నారు కానీ యోగము జ్వాలారూపముగా ఉండాలి. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా పెరుగుతున్నాయి కానీ యోగములో జ్వాలారూపాన్ని ఇప్పుడు అండర్లైన్ చెయ్యాలి. మీ దృష్టిలో ఎటువంటి మెరుపు రావాలంటే ఆ దృష్టి ద్వారా ఏదో ఒక అనుభూతిని అనుభవం చెయ్యాలి.
బాప్‌దాదాకు విదేశాలవారు చేసిన ‘కాల్ ఆఫ్ టైమ్ (సమయము యొక్క పిలుపు)’ అన్న సేవ ఏదైతే ఉందో, దాని విధి బాగా అనిపించింది, ఇందులో చిన్న సంగఠనను సమీపముగా తీసుకువచ్చారు. ఈ విధంగా ప్రతి జోన్ వారు, ప్రతి సెంటరు వారు వేర్వేరు సేవలనైతే చేస్తున్నారు కానీ అన్ని వర్గాల సంగఠనను ఏదైనా తయారుచెయ్యండి. బాప్‌దాదా అన్నారు - చెల్లాచెదురై ఉన్న సేవ చాలా ఉంది, కానీ చెల్లాచెదురుగా వ్యాపించి ఉన్న సేవ ద్వారా సమీపముగా వచ్చే కొందరు యోగ్య ఆత్మల సంగఠనను ఎంచుకోండి, ఎప్పటికప్పుడు ఆ సంగఠనను సమీపముగా తీసుకువస్తూ ఉండండి మరియు వారిలో సేవా ఉల్లాసాన్ని పెంచండి. బాప్‌దాదా చూస్తున్నారు - అటువంటి ఆత్మలు ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఆ శక్తిశాలి పాలన సంగఠిత రూపములో లభించటం లేదు. వేర్వేరుగా యథా శక్తి పాలన లభిస్తూ ఉంది కానీ సంగఠనలో ఒకరిని చూసి ఒకరికి ఉల్లాసము కూడా వస్తుంది. వారు దీనిని చెయ్యగలిగినప్పుడు నేను కూడా చెయ్యగలను, నేను కూడా చేస్తాను అన్న ఉల్లాసము వస్తుంది. బాప్‌దాదా ఇప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష సంగఠిత రూపాన్ని చూడాలనుకుంటున్నారు. బాగా కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరూ తమ వర్గము యొక్క, ఏరియా యొక్క, జోన్ యొక్క, సేవాకేంద్రము యొక్క సేవను చేస్తున్నారు, ఇందుకు బాప్‌దాదా సంతోషిస్తారు. ఇప్పుడు కొందరిని బాబా ఎదురుగా తీసుకురండి. ప్రవృత్తిలో ఉన్నవారి ఉల్లాసము కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంటుంది. డబల్ విదేశీయులు కూడా డబల్ కార్యములో ఉంటూ సేవలో మరియు స్వ పురుషార్థములో మంచి ఉల్లాసములో ఉంటున్నారు, ఇది చూసి కూడా బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
బ్రాహ్మణ ఆత్మలు వర్తమాన వాయుమండలాన్ని చూసి విదేశాలలో భయపడటం లేదు కదా? రేపు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది... అనైతే ఆలోచించరు కదా? రేపు మంచిగా అవుతుంది. మంచిగా ఉంది మరియు మంచే జరగనున్నది. ప్రపంచములో ఎంతగా అలజడి ఉంటుందో, అంతగానే బ్రాహ్మణులైన మీ స్థితి అచలముగా ఉంటుంది. అలా ఉన్నారా? డబల్ విదేశీయులు అలజడిలో ఉన్నారా లేక అచలముగా ఉన్నారా? అచలముగా ఉన్నారా? అలజడిలో అయితే లేరు కదా! ఎవరైతే అచలముగా ఉన్నారో వారు చేతులెత్తండి. అచలముగా ఉన్నారా? రేపు ఏదైనా అయితే? ఏదైనా అయినా కూడా అచలముగా ఉంటారు కదా! ఏమవుతుంది, ఏమీ కాదు. బ్రాహ్మణులైన మీపై పరమాత్ముని ఛత్రఛాయ ఉంది. ఏదైనా వాటర్‌ప్రూఫ్‌గా ఉంటే, ఎంత వాటర్ ఉన్నా కానీ వాటర్‌ప్రూఫ్ ద్వారా వాటర్ ప్రూఫ్‌గా (తడవకుండా) అయిపోతారో, అలాగే ఎంత అలజడి ఉన్నా సరే బ్రాహ్మణాత్మలు పరమాత్ముని ఛత్రఛాయ క్రింద సదా సురక్షితముగా ఉంటారు. నిశ్చింత చక్రవర్తులు కదా! లేదా ఏమవుతుందో అని కొంచెం-కొంచెం చింత ఉందా? లేదు. నిశ్చింతులు. స్వరాజ్య అధికారులుగా అయ్యి, నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి, అచల్-అడోల్ (చలించని-స్థిరమైన) సీట్‌పై సెట్ అయ్యి ఉండండి. సీట్ నుండి కిందకు దిగకండి. అప్సెట్ (మానసిక అలజడి) అనగా సీట్‌పై సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు. సీట్‌పై ఎవరైతే సెట్ అయి ఉంటారో, వారు స్వప్నములో కూడా అప్సెట్ అవ్వలేరు.
మాతలు ఏమనుకుంటున్నారు? సీట్‌పై సెట్ అవ్వటము, కూర్చోవటము వస్తుందా? అలజడి అయితే కలగడం లేదు కదా? బాప్‌దాదా కంబైండుగా ఉన్నారు, సర్వశక్తిమంతుడు మీతో కంబైండుగా ఉన్నప్పుడు ఇక మీకు ఏం భయము! ఒంటరిగా భావిస్తే అలజడిలోకి వస్తారు. కంబైండుగా ఉంటే ఎంత అలజడి ఉన్నా సరే మీరు అచలముగా ఉంటారు. సరేనా మాతలూ? సరే కదా, కంబైండుగా ఉన్నారు కదా! ఒంటరిగా అయితే లేరు కదా? బాధ్యత బాబాది, ఒకవేళ మీరు సీట్‌పై సెట్ అయ్యి ఉంటే బాబాది బాధ్యత, అప్సెట్ అయితే మీది బాధ్యత.
ఆత్మలకు సందేశము ద్వారా అంచలిని ఇస్తూ ఉన్నట్లయితే దాత స్వరూపములో స్థితులై ఉంటారు, అప్పుడు దాతాతనపు పుణ్య ఫలముగా శక్తి లభిస్తూ ఉంటుంది. నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని కరావన్‌హార్ ఆత్మగా (చేయించే ఆత్మగా) భావించాలి మరియు ఈ కర్మేంద్రియాలను కరన్‌హార్ (చేసేవి) కర్మచారులుగా భావించాలి. ఈ ఆత్మ స్మృతి యొక్క అనుభవము సదా ఇమర్జ్ రూపములో ఉండాలి, నేను ఉన్నదే ఆత్మ కదా అని ఇలా అనుకోవటము కాదు. ఇలా కాదు. స్మృతిలో ఇమర్జ్ అయ్యి ఉండాలి. మర్జ్ రూపములో ఉంటుంది కానీ ఇమర్జ్ రూపములో ఉన్నట్లయితే ఆ నషా, సంతోషము మరియు కంట్రోలింగ్ పవర్ ఉంటాయి. మజా కూడా వస్తుంది, ఎందుకని! సాక్షిగా అయ్యి కర్మలు చేయిస్తారు. కనుక పదే-పదే చెక్ చేసుకోండి – కరావన్‌హార్ (చేయించేవాని) గా అయ్యి కర్మలు చేయిస్తున్నానా? ఏ విధంగా రాజు తన కర్మచారులను తన ఆజ్ఞలో ఉంచుకుంటాడో, ఆజ్ఞాపించి చేయిస్తాడో, అలాగే ఆత్మ కరావన్‌హార్ (చేయించేవాడు) అన్న స్వరూపము యొక్క స్మృతి ఉన్నట్లయితే సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారముగా ఉంటాయి. మాయ ఆర్డర్ (ఆజ్ఞ) లో ఉండవు, మీ ఆర్డర్లో ఉంటాయి. లేదంటే మాయ గమనిస్తూ ఉంటుంది, కరావన్‌హార్ (చేయించే) ఆత్మ నిర్లక్ష్యముగా అయితే ఇక మాయ ఆర్డర్ చేయటం మొదలుపెడుతుంది. ఒక్కోసారి సంకల్ప శక్తి, ఒక్కోసారి వాచా శక్తి మాయ ఆర్డర్ అనుసారముగా నడవడం మొదలుపెడతాయి, అందుకే సదా అన్ని కర్మేంద్రియాలను మీ ఆర్డర్ అనుసారముగా నడిపించండి. అలా అవ్వాలనుకోలేదు, కానీ అలా అయిపోయింది అని అనకండి. ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది. ఇప్పటినుండే రాజ్యాధికారిగా అయ్యే సంస్కారాన్ని నింపుకుంటేనే, అక్కడ కూడా రాజ్యాన్ని నడిపిస్తారు. స్వరాజ్య అధికారి అన్న సీట్ నుండి ఎప్పుడూ కిందకు రాకండి. ఒకవేళ కర్మేంద్రియాలు ఆర్డర్లో ఉన్నట్లయితే ప్రతి శక్తి కూడా మీ ఆర్డర్లో ఉంటుంది. ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరముంటుందో, అది ఆ సమయములో చిత్తం ప్రభూ అంటూ హాజరైపోతుంది. అలా కాకుండా పని అయిపోయిన తర్వాత సహనశక్తి రా అని మీరు ఆర్డర్ చేయడము మరియు అది పని అయిపోయిన తర్వాత రావడము కాదు. ప్రతి శక్తి మీ ఆర్డర్ అనుసారముగా చిత్తం ప్రభూ అని అంటూ హాజరవుతుంది ఎందుకంటే ఈ ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక. కనుక పరమాత్మ ఇచ్చిన కానుక మీ వస్తువైపోయింది. మీ వస్తువు అన్నప్పుడు మీరు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, అలాగే ఈ సర్వ శక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి, సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి, వీరినే స్వరాజ్య అధికారులు, మాస్టర్ సర్వశక్తిమంతులు అని అంటారు. పాండవులు అటువంటివారేనా? మాస్టర్ సర్వశక్తిమంతులు కూడా మరియు స్వరాజ్య అధికారులు కూడా. నోటి నుండి అలా మాటలు వచ్చేసాయి అని అనకండి. అలా రావటానికి ఆర్డర్ ఇచ్చింది ఎవరు! చూడాలనుకోలేదు, కానీ చూసేసాను. చెయ్యాలనుకోలేదు కానీ చేసేసాను. ఇలా ఎవరి ఆర్డర్‌పై జరుగుతుంది? వీరిని అధికారులు అని అంటారా లేక అధీనులు అని అంటారా? అధికారులుగా అవ్వండి, అధీనులుగా కాదు. అచ్ఛా!
అందరూ చేరుకున్నారు, ఈ సంగఠన ఎంతో ప్రియంగా అనిపిస్తుంది. బాబాకు కూడా పిల్లల సంగఠన మంచిగా అనిపిస్తుంది. మన పరివారాన్ని చూసే ఛాన్స్ లభిస్తుంది. మేము మా పెద్ద పరివారాన్ని చూసాము అనైతే ఎవరికైనా చెప్పవచ్చు కదా. మధుబన్‌లో అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి కదా! నీళ్ళు ఉన్నయా? నీరు లభిస్తుంది కదా! భోజనము, పడుకోవడము, కలవడము, అన్నీ లభిస్తున్నాయి. బాప్‌దాదా అంటారు - ఎలా అయితే ఇప్పుడు మధుబన్‌లో అందరూ చాలా-చాలా సంతోషముగా ఉన్నారో, అలాగే సదా సంతోషముగా, సంపన్నముగా ఉండండి. మీరు ఆత్మిక గులాబీలు. చూడండి, నలువైపులా చూడండి, అందరూ ఆత్మిక గులాబీలు, వికసించిన గులాబీలు. వాడిపోయినవారు కాదు, వికసించిన గులాబీలు. కనుక సదా ఇలాగే భాగ్యశాలిగా, సంతోషకరమైన ముఖముతో ఉండండి. ఎవరైనా మీ ముఖాన్ని చూస్తే మీకు ఏం లభించింది, చాలా సంతోషముగా ఉన్నారే అని మిమ్మల్ని అడగాలి. ప్రతి ఒక్కరి ముఖము బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఏ విధంగా చిత్రము పరిచయము ఇస్తుందో, అలా మీ ముఖము - బాబా లభించారు అని బాబా పరిచయమును ఇవ్వాలి. అచ్ఛా.
అందరూ బాగున్నారా? విదేశాలవారు కూడా చేరుకున్నారు. ఇక్కడ బాగా అనిపిస్తుంది కదా? (న్యూయార్కు మోహిని దీదీ) అల్లకల్లోలాన్ని వినటం నుండైతే రక్షింపబడ్డారు కదా. మంచిగా చేసారు, అందరూ కలిసి చేరుకున్నారు, చాలా బాగా చేసారు. అచ్ఛా - డబల్ విదేశీయులు, డబల్ నషా ఉంది కదా! నషాలో ఉన్నామంటే అది డబల్ విదేశీయులైన మేమే ఉన్నాము అని చెప్పేంత నషా ఉంది అని చెప్పండి. డబల్ నషా ఉంది, స్వరాజ్య అధికారులే విశ్వ అధికారులు. డబల్ నషా ఉంది కదా! బాప్‌దాదాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా గ్రూపులో డబల్ విదేశీయులు లేకపోతే మంచిగా అనిపించదు. విశ్వ పిత కదా, కనుక విశ్వములోని వారు కావాలి కదా! అందరూ కావాలి. మాతలు లేకపోయినా కూడా ఆ శోభ ఉండదు. పాండవులు లేకపోయినా కూడా ఆ శోభ తక్కువైపోతుంది. చూడండి, ఏ సెంటరులోనైనా కేవలము మాతలే ఉండి పాండవులు లేకపోతే మంచిగా అనిపిస్తుందా! కేవలము పాండవులే ఉండి, శక్తులు లేకపోయినా కూడా సేవాకేంద్రము అలంకరించబడినట్లుగా అనిపించదు. ఇరువురూ కావాలి. పిల్లలు కూడా కావాలి. మా పేరు ఎందుకు తీసుకోలేదు అని పిల్లలు అడుగుతారు. పిల్లల యొక్క శోభ కూడా ఉంటుంది.
మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ వారి సేవ టర్న్:- బాగుంది, ఇది కూడా సమీపంగా వచ్చేందుకు ఛాన్స్. లేకపోతే గ్రూపులో వచ్చినప్పుడు స్పెషల్‌గా దాదీలు కలవరు. సేవలో వస్తే స్పెషల్‌గా దాదీలు కూడా కలుస్తారు కదా! అచ్ఛా. మహారాష్ట్ర వారు లేవండి. మహారాష్ట్రకు భుజాలు చాలా ఉన్నాయి. ఈ కారణం చేతనే మహారాష్ట్ర అన్న పేరుకు తగ్గట్లుగానే సంఖ్య కూడా మహాగా ఉంది. మహారాష్ట్ర కూడా ఛాన్స్ తీసుకుంటుంది అన్న విషయాన్ని బాప్‌దాదా విన్నారు. అచ్ఛా – ఈ సెంటర్ల వారు, 3 లక్షల మందిని ఏదైతే పూర్తి చేయాలో, మహారాష్ట్ర కూడా చేస్తుంది, గుజరాత్ కూడా చేస్తుంది, పంజాబ్ కూడా చేస్తుంది... అలాంటప్పుడు 3 లక్షలు పూర్తయిపోతారు. ఇంకా కూడా చేస్తున్నారు. 3 లక్షలు ఏమంత పెద్ద విషయము కాదు! 3 లక్షలు పూర్తి చేస్తారా? పంజాబ్, చేస్తారా? గుజరాత్ కూడా చేస్తుంది. ఇంకా కూడా చేస్తున్నారు. మరుసటి సీజన్‌కు, 9 లక్షల మంది బ్రాహ్మణులు పూర్తయ్యారు అన్న శుభవార్త బాప్‌దాదాకు చేరాలి. సరేనా, అయిపోతుందా? ఇప్పుడైతే 9 లక్షలమంది ఉన్నారు, 9 కోట్లమంది వరకు వెళ్ళాలి. అఛ్ఛా – చూడండి, సత్యయుగ ఆరంభంలో 9 లక్షలమంది ఉంటారు, త్రేతా వరకు పెరుగుతారా లేక పెరగరా? మరైతే తయారు చేయాలి కదా! చాలా బాగుంది, మహారాష్ట్ర సదా మహాన్ స్థితిలో స్థితి అయ్యే మహా రాష్ట్రము. అచ్ఛా.
భోపాల్:- భోపాల్‌లో కూడా వృద్ధి జరుగుతుంది కదా! మరి 3 లక్షలకు భోపాల్ ఎంతమందిని జత చేస్తారు? (50 వేలమందిని భోపాల్ తీసుకువస్తుంది) అభినందనలు, చాలా బాగుంది. ఏమంత పెద్ద విషయము, విశ్వ కళ్యాణకారులు 50 వేల మంది యొక్క కళ్యాణాన్ని ఎందుకు చేయలేరు? చాలా మంచి ఛాన్స్‌ను తీసుకున్నారు, అందుకని ఛాన్సలర్‌గా అయిపోయారు. మాతలు కూడా ఉన్నారు, పాండవులు కూడా ఉన్నారు, చాలా బాగుంది. ఛాన్స్ తీసుకోవడంలో సదా ముందుండాలి. ప్రతి విషయంలో ఛాన్స్ తీసుకోండి, తప్పుడు పనులలో కాదు, మంచి పనులలో. ఈ భోపాల్ కూడా మంచిగా ఆది నుండి నిమిత్తంగా అయి ఉంది. బాప్‌దాదా ప్రతి జోన్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు మరియు సదా వృద్ధిని పొందుతూ ఉండండి. అచ్ఛా.
ట్రాన్స్పోర్ట్ వింగ్:- ట్రాన్స్పోర్ట్ వారైతే అందరినీ విమానంకన్నా ఎత్తులో పైకి ఎగిరిస్తారు కదా. విమానమైతే ఇక్కడి వరకే ఎగురుతుంది, మీరైతే పరంధామము వరకు ఎగిరిస్తారు. మూడు లోకల షికారును చేయించే వారు ట్రాన్స్పోర్ట్ వింగ్. బాగుంది, ఈ వర్గాలు ఏవైతే తయారు చేసారో, అందులో కూడా ప్రతి ఒక్క వర్గం వారిలో జాగృతి చేయాలన్న ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి. రేస్ కూడా చేస్తారు. పాండవులు బాప్‌దాదాకు ఒక దృశ్యాన్ని చూపించారు, అదేమిటి? ఇక్కడ శాంతివన్ దృశ్యాన్ని చూసాము. ప్రతి వర్గానికి ఒక టేబుల్ వేసి ఉంది, ప్రతి వర్గం వారు ఒకరితో మరొకరు రేస్ చేస్తున్నారు, మేము కూడా ముందుకు వెళ్తాము, మేము కూడా ముందుకు వెళ్తాము. బాప్‌దాదా ప్రత్యేకంగా టి.వీలో చూసారు, టేబుల్‌ను అలంకరించి పెడ్తారు. బాగుంది, ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి. కానీ రీస్ (అసూయ)తో రేస్ (పోటీ) చేయకండి, రేస్ తప్పకుండా చేయండి. ట్రాన్స్పోర్ట్ కూడా మంచి ఉల్లాస-ఉత్సాహాలలో ఉంది. ఏదైనా నవీనత యొక్క ప్లాన్‌ను తయారు చేసి ఉండవచ్చు. బాగుంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఇంజినీరింగ్-సైంటిస్ట్ వింగ్:- సైన్స్ మరియు ఇంజినీర్, మీరు చాలా ప్లాన్లు తయారు చేసి ఉండవచ్చు. ఎలా అయితే ఈరోజుల్లోని సైన్స్ చాలా వేగంగా వెళ్తుందో అలాగే మీరు కూడా ఎటువంటి సేవ ప్లాన్లను తయారు చేయాలంటే త్వరత్వరగా స్థాపన అనే భవనము తయారైపోవాలి, అప్పుడే వినాశనము అవుతుంది కదా. స్థాపనా కార్యము అనే బిల్డింగ్ త్వరత్వరగా తయారైపోవాలి. ఇంజినీర్లు కూడా చేయగలరు, సైన్స్ వారు కూడా చేయగలరు. ఇప్పుడు తీవ్రగతి యొక్క ప్లాన్‌ను ఏదైనా తయారు చేయండి. దృష్టి ఇవ్వాలి, దృష్టి ఇవ్వగానే సృష్టి మారిపోవాలి, ఇలా ఉండాలి. లాస్ట్‌లో మీరిచ్చే ఒక్క సెకండు యొక్క దృష్టి అద్భుతాన్ని చేస్తుంది. శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఇలా ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్‌ను తయారు చేయండి. బాగుంది. వర్గం సేవ అయితే జరుగుతుంది. అచ్ఛా.
గుజరాత్ మంచి జంప్ చేసింది:- (గుజరాత్లో 23 ఫిబ్రవరి నాడు 1 లక్షమంది యొక్క సభను ప్రోగు చేసి విశాలమైన ప్రోగ్రామ్‌ను చేయబోతున్నారు) గుజరాత్ యొక్క టీచర్లు మరియు పాండవులు లేవండి. తక్కువమంది వచ్చారు, తయారీలు చేస్తున్నారు. మంచిది, ఇప్పుడు గుజరాత్‌ను అందరూ ఫాలో చేస్తారు. ఒకరినొకరు చూసుకుని ఉత్సాహము వస్తూ ఉంటుంది. అచ్ఛా, కూర్చోండి, చాలా మంచి ధైర్యాన్ని ఉంచారు. ధైర్యము ఉంచినందుకు బాప్‌దాదా ఇన్‌అడ్వాన్స్ గుజరాత్‌కు అభినందనలు ఇస్తున్నారు.
అచ్ఛా - ఇప్పుడు ఒక్క సెకండులో నిరాకారీ ఆత్మగా అయ్యి నిరాకార బాబా యొక్క స్మృతిలో లవ్లీనులైపోండి (డ్రిల్)
నలువైపులా ఉన్న సర్వ స్వరాజ్య అధికారులకు, సదా సాక్షితనమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండే అచలమైన-స్థిరమైన ఆత్మలకు, సదా దాతాతనపు స్మృతితో సర్వులకు జ్ఞానము, శక్తులు, గుణాలను ఇచ్చే దయాహృదయ ఆత్మలకు, సదా తమ ముఖము ద్వారా బాబా చిత్రాన్ని చూపించే శ్రేష్ఠ ఆత్మలకు, సదా భాగ్యశాలిగా, సంతోషముగా ఉండే ఆత్మిక గులాబీలకు, ఆత్మిక గులాబీ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (సేవతోపాటుగా అన్ని వైపుల 108 గంటల యోగానిది కూడా మంచి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది) ఈ యోగ జ్వాల ద్వారానే వినాశన జ్వాల తీవ్రమవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ తయారుచేస్తారు, మళ్ళీ ఆలోచనలో పడిపోతారు. యోగము వలన వికర్మలు వినాశనమవుతాయి, పాప కర్మల భారము భస్మమవుతుంది, సేవ ద్వారా పుణ్య ఖాతా జమ అవుతుంది. కనుక పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నారు కానీ గత సంస్కారాల భారమేదైతే ఉందో అది యోగ జ్వాల ద్వారానే భస్మమవుతుంది. సాధారణ యోగముతో అవ్వదు. ఇప్పుడేమిటంటే, యోగమైతే చేస్తారు కానీ పాపాలు భస్మమయ్యేంత జ్వాలారూపము లేదు, అందుకే కొద్ది సమయము కొరకు సమాప్తమవుతుంది, మళ్ళీ వస్తుంది. అందుకే రావణుడిని చూడండి, హతమారుస్తారు, కాలుస్తారు, ఇంకా ఎముకలను కూడా నీటిలో వేసేస్తారు, పూర్తిగా భస్మమైపోవాలి అని. గత సంస్కారాలు, బలహీన సంస్కారాలు పూర్తిగా భస్మమైపోవాలి. అవి ఇంకా భస్మమవ్వలేదు. చనిపోతాయి కానీ భస్మమవ్వటం లేదు, చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతాయి. సంస్కార పరివర్తనతోనే సంసార (ప్రపంచ) పరివర్తన అవుతుంది. ఇప్పుడు సంస్కారాల లీల నడుస్తూ ఉంది. సంస్కారాలు మధ్యమధ్యలో ఇమర్జ్ అవుతుంటాయి కదా! నామ-రూపాలు కూడా అంతమైపోవాలి. సంస్కార పరివర్తన - ఇది విశేషముగా అండర్లైన్ చేయవలసిన విషయము. సంస్కార పరివర్తన లేనట్లయితే వ్యర్థ సంకల్పాలు కూడా ఉంటాయి, సమయము కూడా వ్యర్థంగా పోతుంది, అనవసరమైన నష్టము కూడా జరుగుతుంది. అది జరగాల్సిందే. సంస్కారాల మిలనము యొక్క మహారాస్ గాయనము చేయబడింది. ఇప్పుడు రాస్ జరుగుతుంది, మహారాస్ ఇంకా జరగలేదు. (మహారాస్ ఎందుకు జరగటం లేదు). దానిని అండర్లైన్ చెయ్యలేదు, దృఢత లేదు. నిర్లక్ష్యము రకరకాలుగా ఉంది. అచ్ఛా! మీరందరూ మంచిగా ఉన్నారు కదా!
దాదీజీతో:- చెకింగ్ మంచిగా జరిగిందా? (అంతా ఓ.కే) మంచిగా ఉండవలసిందే. అయినా కూడా చాలా మంచిగా నడుస్తున్నారు, నడుస్తూ ఉంటారు. అందరి ఆశీర్వాదాలు నడిపిస్తున్నాయి. మీ అందరి శరీర ఆయుష్షు ప్రకారంగా చూస్తే అందరూ సంతోషిస్తారు, ఇంత చేస్తున్నారు, ఇంత నడిపిస్తున్నారు, నడవవలసిందే. ఇది కూడా నిశ్చితమే మరియు నడవవలసిందే. అచ్ఛా!