Search for a command to run...
20 Mar 2004
"ఈ సంవత్సరాన్ని విశేషముగా జీవన్ముక్తి సంవత్సరము రూపములో జరుపుకోండి, ఏకత మరియు ఏకాగ్రతతో బాబా యొక్క ప్రత్యక్షత చెయ్యండి"
20 March 2004 · తెలుగు
ఈరోజు స్నేహ సాగరుడు నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను చూస్తున్నారు. బాబాకు కూడా పిల్లల పట్ల హృదయపూర్వకమైన అవినాశి స్నేహము ఉంది మరియు పిల్లలకు కూడా హృదయాభిరాముడైన బాబా పట్ల హృదయపూర్వకమైన స్నేహము ఉంది. ఈ పరమాత్మ స్నేహము, హృదయపూర్వకమైన స్నేహము కేవలము బాబాకు మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. పరమాత్మ స్నేహానికి పాత్రులు కేవలము బ్రాహ్మణ ఆత్మలైన మీరే. భక్త ఆత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహార్తులై ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. భాగ్యవాన్ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆ ప్రేమను ప్రాప్తి చేసుకోవడానికి పాత్రులు. పిల్లలకు బాబా పట్ల విశేషమైన ప్రేమ ఎందుకు ఉంది అనేది బాప్‌దాదాకు తెలుసు, ఎందుకంటే ఈ సమయములోనే సర్వ ఖజానాల యజమాని ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఈ ఖజానాలు కేవలము ఇప్పటి ఈ ఒక్క జన్మకు మాత్రమే ఉండవు కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశి ఖజానాలు మీతో పాటు ఉంటాయి. బ్రాహ్మణ ఆత్మలైన మీరు ప్రపంచములోని వారిలా ఖాళీ చేతులతో వెళ్ళరు, సర్వ ఖజానాలు మీతో పాటు ఉంటాయి. మరి ఇటువంటి అవినాశి ఖజానాల ప్రాప్తి యొక్క నషా ఉంటుంది కదా! మరియు పిల్లలందరూ అవినాశి ఖజానాలను జమ చేసుకున్నారు కదా! జమ యొక్క నషా, జమ యొక్క సంతోషము కూడా సదా ఉంటాయి. ప్రతి ఒక్కరి ముఖముపై ఖజానాల జమ యొక్క మెరుపు కనిపిస్తుంది. ఏ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తించాయి అనేది తెలుసు కదా? ఎప్పుడైనా మీ జమ ఖాతాను చెక్ చేసుకుంటున్నారా? బాబా అయితే పిల్లలందరికీ ప్రతి ఒక్క ఖజానాను తరగనంతగా ఇస్తారు. కొందరికి కొంచెము, కొందరికి ఎక్కువ ఇవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని, అఖండమైన, అవినాశి ఖజానాలకు యజమానులు. బాలకులుగా అవ్వటము అనగా ఖజానాలకు యజమానులుగా అవ్వటము. కనుక, ఎన్ని ఖజానాలను బాప్‌దాదా ఇచ్చారో ఇమర్జ్ చేసుకోండి.
అన్నింటికన్నా మొదటి ఖజానా - జ్ఞాన ధనము, మరి అందరికీ జ్ఞాన ధనము లభించిందా? లభించిందా లేక లభించాలా? అచ్ఛా - జమ కూడా అయి ఉందా? లేక కొంచెం జమ అయ్యింది, కొంచెం పోయిందా? జ్ఞాన ధనము అనగా వివేకవంతులుగా అయ్యి, త్రికాలదర్శులుగా అయ్యి కర్మలు చెయ్యటము. జ్ఞాన సంపన్నులుగా అవ్వటము. పూర్తి జ్ఞానాన్ని మరియు మూడు కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞాన ధనాన్ని కార్యములో వినియోగించడము. ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితములో, ప్రతి కార్యములో ఉపయోగించటము ద్వారా విధి ద్వారా సిద్ధి లభిస్తుంది - దీని ద్వారా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది. అనుభవము చేస్తున్నారా? సత్యయుగములోనే జీవన్ముక్తి లభిస్తుందని కాదు, ఇప్పుడు కూడా ఈ సంగమయుగ జీవితములో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. జీవితము బంధనముక్తిగా అవుతుంది. ఎన్ని బంధనాల నుండి ఫ్రీ అయిపోయారో తెలుసు కదా! ఎన్ని రకాల అయ్యో అయ్యో అనేవాటి నుండి విముక్తులైపోయారు! సదా కొరకు అయ్యో అయ్యో అనేవాటిని సమాప్తము చేసి, వాహ్-వాహ్ అనే పాటలను పాడుతూ ఉంటారు. ఒకవేళ ఏ విషయములోనైనా, ఏ కొంచెమైనా, నోటి నుండే కాదు, కనీసము సంకల్పమాత్రముగానైనా, స్వప్నమాత్రముగానైనా... అయ్యో అనేది మనసులో వచ్చిందంటే జీవన్ముక్తులుగా లేనట్లు. వాహ్! వాహ్! వాహ్! ఇలా ఉన్నారా? మాతలూ, అయ్యో, అయ్యో అనైతే అనటము లేదు కదా? అనటము లేదా? అప్పుడప్పుడు అంటున్నారా? పాండవులు అంటున్నారా? నోటి నుండి అనకపోయినా కానీ మనసులో సంకల్పమాత్రముగానైనా ఒకవేళ ఏ విషయములోనైనా అయ్యో అనేది ఉన్నట్లయితే ఎగరలేరు. అయ్యో అనగా బంధనము మరియు ఎగరటము, ఎగిరే కళ అనగా జీవన్ముక్తి, బంధనముక్తి. కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు ఎప్పటివరకైతే స్వయం బంధనముక్తులుగా అవ్వరో, ఏ రకమైన బంగారము లేక వజ్రాలకు సంబంధించిన రాయల్ బంధనము అనే తాడుతో బంధింపబడి ఉన్నట్లయితే, సర్వ ఆత్మల కొరకు ముక్తి ద్వారము తెరుచుకోలేదు. మీరు బంధనముక్తులుగా అవ్వటముతో సర్వాత్మల కొరకు ముక్తి గేట్ తెరుచుకుంటుంది. కనుక గేట్‌ను తెరిచే మరియు సర్వాత్మలను దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేసే బాధ్యత మీపై ఉంది.
కనుక చెక్ చేసుకోండి - మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించారు? మీరందరూ బాప్‌దాదాతో పాటు విశ్వ పరివర్తనా కార్యాన్ని చేసే కాంట్రాక్ట్ చేపట్టారు. మీరు కాంట్రాక్టరులు, బాధ్యత కలవారు. ఒకవేళ బాబా కావాలనుకుంటే అన్నీ చెయ్యగలరు కానీ బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది, వారు ఒంటరిగా చెయ్యాలనుకోరు, బాబా అవతరించగానే పిల్లలైన మిమ్మల్నందరినీ వారితో పాటే అవతరింపజేసారు. శివరాత్రిని జరుపుకున్నారు కదా! ఎవరిది జరుపుకున్నారు? కేవలము బాప్దాదాది మాత్రమే జరుపుకున్నారా? మీ అందరిదీ కూడా జరుపుకున్నారు కదా! మీరు బాబాకు ఆది నుండి అంతిమము వరకు సహచరులు. ఆది నుండి అంతిమము వరకు మేము సహచరులము అన్న నషా ఉందా? మీరు భగవంతునికి సహచరులు.
మరి బాప్‌దాదా ఇప్పుడు ఈ సంవత్సరము యొక్క సీజన్ అంతిమ పాత్రను పోషిస్తూ పిల్లలందరి నుండి దీనిని కోరుకుంటారు, ఏం కోరుకుంటున్నారో చెప్పమంటారా? చెయ్యాల్సి ఉంటుంది. కేవలము వినటము కాదు, చెయ్యాల్సి ఉంటుంది. టీచర్లూ, సరేనా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు విసనకర్రలు కూడా ఊపుతున్నారు, వేడిగా అనిపిస్తుంది. అచ్ఛా, టీచర్లందరూ చేస్తారా, చేయిస్తారా? చేయిస్తారా, చేస్తారా? అచ్ఛా. గాలి కూడా తగులుతుంది, చేతులు కూడా ఊపుతున్నారు. దృశ్యము బాగా అనిపిస్తుంది. చాలా మంచిది. బాప్‌దాదా ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహములో ఒక్క క్రొత్త రకమైన దీపావళిని జరపాలనుకుంటున్నారు. అర్థమైందా! ఒక క్రొత్త రకమైన దీపావళిని జరపాలనుకుంటున్నారు. మరి మీరందరూ అటువంటి దీపావళిని జరుపుకోవటానికి సిద్ధముగా ఉన్నారా? ఎవరైతే సిద్ధముగా ఉన్నారో వారు చేతులెత్తండి. ఊరికే అలా సరే అని అనవద్దు. బాప్‌దాదాను సంతోషపరిచేందుకు చేతులెత్తవద్దు, మనస్ఫూర్తిగా ఎత్తండి. అచ్ఛా. బాప్‌దాదా తమ హృదయములోని ఆశలను సంపన్నము చేసే దీపాలను వెలిగి ఉన్నట్లుగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక బాప్‌దాదా ఆశల దీపాల దీపావళిని జరపాలని కోరుకుంటున్నారు. ఎటువంటి దీపావళిని జరపాలనుకుంటున్నారో అర్థమైందా? స్పష్టమైందా?
బాప్‌దాదా ఆశల దీపాలు అంటే ఏమిటి? రాబోయే సంవత్సరము నుండి, ఈ సంవత్సరము యొక్క సీజన్ పూర్తయిపోయింది. బాప్‌దాదా చెప్పారు మరియు మీరందరూ సంకల్పము కూడా చేసారు, గుర్తుందా? కొందరు ఆ సంకల్పాన్ని కేవలము సంకల్పము వరకే పూర్తి చేసారు, కొందరు సంకల్పాన్ని సగం పూర్తి చేసారు మరియు కొందరు ఆలోచిస్తారు కానీ ఆలోచన, ఆలోచన వరకే ఉంది. ఆ సంకల్పము ఏమిటి? అది క్రొత్త విషయమేమీ కాదు, పాత విషయమే - స్వ పరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. విశ్వము యొక్క విషయాన్ని వదిలేయండి, కానీ బాప్‌దాదా - స్వ పరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివారము యొక్క పరివర్తన అన్నదానిని చూడాలనుకుంటున్నారు. ఇలా ఉంటే ఇది అవుతుంది, వీరు మారితే నేను మారుతాను, వీరు చేస్తే నేను చేస్తాను... ఇప్పుడు ఇటువంటివి వినాలనుకోవటము లేదు. ఇందులో విశేషముగా ప్రతి బిడ్డకు బ్రహ్మా బాబా విశేషముగా చెప్తున్నారు - నా సమానముగా హే అర్జున్‌గా అవ్వండి. ఇందులో ‘ముందు నేను’. ముందు వారు అని కాదు, ముందు నేను. ఇటువంటి ‘‘నేను’’ అనేది కళ్యాణకారీ అయినది. మిగిలిన హద్దులోని నేను, నేను అనేవన్నీ కింద పడేస్తాయి. ఇందులో - ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యతను స్వీకరిస్తారో వారే అర్జునులు అనే సామెత ఉంది కదా, అక్కడ అర్జున్ అనగా నంబర్ వన్. నంబరువారు కాదు, నంబర్ వన్. మరి మీరు రెండవ నంబరువారుగా అవ్వాలనుకుంటున్నారా లేక నంబర్ వన్‌గా అవ్వాలనుకుంటున్నారా? చాలా కార్యాలలో బాప్‌దాదా చూసారు - నవ్వు వచ్చే విషయమే, పరివారము యొక్క విషయము వినిపిస్తాము. పరివారము కూర్చుని ఉంది కదా! ఏవైనా అటువంటి పనులు ఉన్నప్పుడు బాప్‌దాదా వద్దకు సమాచారాలు వస్తాయి. కొన్ని కార్యాలు, కొన్ని ప్రోగ్రాములు ఎలా ఉంటాయంటే అవి కేవలము విశేష ఆత్మల నిమిత్తమే ఉంటాయి. బాప్‌దాదా వద్దకు, దాదీల వద్దకు సమాచారాలు వస్తుంటాయి ఎందుకంటే సాకారములో అయితే దాదీలు ఉన్నారు. బాప్‌దాదా వద్దకైతే సంకల్పాలు చేరుకుంటాయి. ఎటువంటి సంకల్పాలు చేరుకుంటాయి? నా పేరు కూడా ఇందులో ఉండాలి, నేనేమన్నా తక్కువనా! నా పేరు ఎందుకు లేదు! అప్పుడు బాబా ఏమంటారంటే - హే అర్జున్ (బాధ్యత తీసుకునే) విషయములో మీ పేరు ఎందుకు లేదు! ఉండాలి కదా! లేక ఉండాల్సిన అవసరము లేదా? ఉండాలా? ఎదురుగా మహారథులు కూర్చుని ఉన్నారు, ఉండాలి కదా! ఉండాలా? మరి బ్రహ్మా బాబా ఏదైతే చేసి చూపించారో, అందులో ఎవ్వరినీ చూడలేదు, వీరు చెయ్యరు, వారు చెయ్యరు అని అనుకోలేదు. ముందు నేను. ఈ ‘నేను’ అనేదానిలో అనేక రకాల రాయల్ రూపాల నేను అనేవి ఏవైతే ఉంటాయో, వాటిని ఇంతకుముందు వినిపించాము కదా, ఈ ‘నేను’ అనేదానిలో అవన్నీ సమాప్తమైపోతాయి. ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాప్‌దాదా యొక్క ఆశలు ఏమిటంటే - పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా చెప్పుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, తెలుసుకున్నారో, ఆ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సంకల్పములో కూడా ఏవైతే హద్దు యొక్క బంధనాలు ఉన్నాయో, ఆ బంధనాల నుండి కూడా విముక్తులవ్వాలి. బ్రహ్మా బాబా సమానముగా బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అవ్వాలి. బ్రాహ్మణ జీవిన్ముక్తులుగా అవ్వాలి, సాధారణ జీవన్ముక్తులుగా కాదు, బ్రాహ్మణ శ్రేష్ఠ జీవన్ముక్తులుగా ఈ విశేష సంవత్సరాన్ని జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మకు తన సూక్ష్మ బంధనాల గురించి తనకు ఎంతగా తెలుసో, అంతగా ఇతరులు తెలుసుకోలేరు. బాప్దాదాకైతే తెలుసు ఎందుకంటే బాప్‌దాదా వద్దనైతే టి.వి. ఉంది, మనసుకు చెందిన టి.వి., శరీరానికి చెందిన టి.వి. కాదు, మనసుకు చెందిన టి. వి. మరి ఇప్పుడు మళ్ళీ సీజన్ ఉంటుంది కదా, సీజన్ ఉంటుందా లేక సెలవు ఇమ్మంటారా? ఒక సంవత్సరము సెలవు ఇమ్మంటారా? వద్దా? ఒక సంవత్సరమైతే సెలవు ఉండాలా? ఉండకూడదా? పాండవులూ, ఒక సంవత్సరము సెలవు ఇమ్మంటారా? (దాదీజీ అంటున్నారు, నెలలో 15 రోజులు సెలవు) అచ్ఛా. చాలా మంచిది, అందరూ చెప్తున్నారు. ఎవరైతే సెలవు వద్దు అని అంటున్నారో వారు చేతులెత్తండి. సెలవు వద్దా? మంచిది. పైన గ్యాలరీలో ఉన్నవారు చేతులు ఊపటం లేదు. (మొత్తం సభ అంతా చేతులు ఊపింది). చాలా మంచిది. బాబా అయితే సదా పిల్లలకు హాజీ, హాజీ అని అంటారు, అంతేనా. మరి ఇప్పుడు బాబాకు పిల్లలు ఎప్పుడు హాజీ అని అంటారు! బాబా చేత హాజీ అనిపించారు. మరి బాబా అంటున్నారు, బాబా కూడా ఇప్పుడు ఒక షరతు పెడుతున్నారు, ఆ షరతుకు అంగీకారమేనా? అందరూ హాజీ అనైతే అనండి. పక్కా? కొంచెము కూడా పెడచెవిన పెట్టరు కదా? ఇప్పుడు అందరి ముఖాలను టి.వి.లో చూపించండి. మంచిది. పిల్లలందరూ హాజీ, హాజీ అని అనేవారని బాబాకు కూడా సంతోషము కలుగుతుంది.
బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఈ కారణము ఉంది, ఈ కారణము ఉంది, అందుకే ఈ బంధనముంది... అని కారణాలేవీ చెప్పకూడదు. సమస్యగా కాదు, సమాధాన స్వరూపులుగా అవ్వాలి మరియు సహచరులను కూడా తయారుచెయ్యాలి ఎందుకంటే సమయము యొక్క పరిస్థితి చూస్తున్నారు. భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరుగుతూ ఉన్నాయి. భ్రష్టాచారము, అత్యాచారము అతిలోకి వెళ్తున్నాయి. కనుక శ్రేష్ఠాచారము యొక్క జెండా ముందుగా ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క మనసులో ఎగరాలి, అప్పుడు విశ్వములో ఎగురుతుంది. ఎన్ని శివరాత్రులను జరుపుకున్నారు! ప్రతి శివరాత్రికి - విశ్వములో బాబా జెండాను ఎగురవేయాలి అని ఇదే సంకల్పము చేస్తారు. విశ్వములో ఈ ప్రత్యక్షతా జెండాను ఎగురవేసే కన్నా ముందు బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ తమ మనసులో సదా తమ హృదయ సింహాసనముపై బాబా జెండాను ఎగురవేయాల్సి ఉంటుంది. ఈ జెండాను ఎగురవేసేందుకు కేవలము రెండు పదాలను ప్రతి కర్మలోకి తీసుకురావలసి ఉంటుంది. కర్మలోకి తీసుకురావాలి, సంకల్పములోకో, బుద్ధిలోకో కాదు. మనసులోకి, కర్మలోకి, సంబంధములోకి, సంపర్కములోకి తీసుకురావలసి ఉంటుంది. అవి కష్టమైన పదాలేమీ కాదు, మామూలు పదాలే. అవేమిటంటే - ఒకటి - సర్వ సంబంధ-సంపర్కాలలో పరస్పరము ఏకత. అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ అనేకతలో ఏకత ఉండాలి. మరియు రెండవది - ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో, అవి బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. మీరు సంకల్పాలు చేస్తారు కదా, అప్పుడు బాప్‌దాదా ఆ సంకల్పాలు చూసి, విని, చాలా సంతోషిస్తారు. వాహ్! వాహ్! పిల్లలూ వాహ్! వాహ్! శ్రేష్ఠ సంకల్పము వాహ్! అని అంటారు. కానీ, కానీ... అనేది వచ్చేస్తుంది. రాకూడదు కానీ వచ్చేస్తుంది. సంకల్పాల అనేవి మెజారిటీ, మెజారిటీ అనగా 90 శాతము సంకల్పాలు అనేవి చాలామంది పిల్లలవి చాలా మంచిగా ఉంటాయి. ఈ రోజు ఈ బిడ్డ సంకల్పము చాలా బాగుంది, ఉన్నతిలోకి వెళ్తారు అని బాప్‌దాదా భావిస్తారు కానీ మాటలలోకి వచ్చేసరికి సగం తగ్గిపోతుంది, కర్మలలోకి వచ్చేసరికి మూడు వంతులు తగ్గిపోతుంది, మిక్స్ అయిపోతుంది. దీనికి కారణమేమిటి? సంకల్పములో ఏకాగ్రత, దృఢత లేదు. ఒకవేళ సంకల్పములో ఏకాగ్రత ఉన్నట్లయితే ఏకాగ్రత సఫలతకు సాధనము. దృఢత సఫలతకు సాధనము. అందులో తేడా వచ్చేస్తుంది. దానికి కారణమేమిటి? ఒకటే విషయాన్ని బాప్‌దాదా రిజల్టులో చూసారు, అదేమిటంటే, ఇతరుల వైపు ఎక్కువగా చూస్తారు. మీరు చెప్తూ ఉంటారు కదా, (బాప్‌దాదా ఒక వేలును ముందుకు పెట్టి చూపించారు) వేలు ఇలా పెట్టినప్పుడు ఒక వేలు ఇతరుల వైపుకు ఉంటే, నాలుగు వేళ్ళు మీ వైపుకు ఉంటాయి. నాలుగు వేళ్ళను చూడరు, ఒక వేలునే చాలా ఎక్కువ చూస్తారు, అందుకే దృఢత మరియు ఏకాగ్రత, ఏకత చలించిపోతాయి. వీరు చేస్తే నేను చేస్తాను, ఇందులో అర్జునుడిగా అవుతారు, అందులోనేమో రెండవ నంబరువారిగా అవుతారు. లేదంటే మీ స్లోగన్‌ను మార్చేయండి. స్వ పరివర్తనతో విశ్వ పరివర్తన అన్నదానికి బదులుగా విశ్వ పరివర్తనతో స్వ పరివర్తన, ఇతరుల పరివర్తనతో స్వ పరివర్తన అని మార్చేయండి. మార్చమంటారా? మార్చమంటారా? మార్చవద్దా? మరి అటువంటప్పుడు బాప్‌దాదా కూడా ఒక షరతును పెడతారు, అంగీకారమేనా, చెప్పమంటారా? బాప్‌దాదా 6 నెలల్లో రిజల్టును చూస్తారు, అప్పుడు వస్తారు, లేదంటే రారు. బాబా హాజీ అని అన్నప్పుడు, మరి పిల్లలు కూడా హాజీ అనాలి కదా! ఏమి జరిగినా సరే, బాప్‌దాదా అయితే అంటారు, స్వ పరివర్తన కొరకు ఈ హద్దు యొక్క మైపన్ (నేను అన్న భావన) నుండి మరణించాల్సి ఉంటుంది, మైపన్ నుండి మరణించాలి, శరీరముతో మరణించడము కాదు. శరీరముతో మరణించడము కాదు, మైపన్ (నేను అన్న భావన) నుండి మరణించాలి. నేను రైట్, నేను ఇది, నేనేమైనా తక్కువా, నేను కూడా సర్వస్వము, ఈ నేను అన్నదాని నుండి మరణించాలి. కావున మరణించవలసి వచ్చినా కానీ ఈ మృత్యువు చాలా మధురమైన మృత్యువు. ఇది మరణించడము కాదు, 21 జన్మలు రాజ్య భాగ్యములో జీవించడము. మరి అంగీకారమేనా? టీచర్లూ అంగీకారమేనా? డబల్ విదేశీయులు? డబల్ విదేశీయులు ఏ సంకల్పమునైతే చేస్తారో, అది చేయడములో ధైర్యము పెట్టుకుంటారు, ఇది వారి విశేషత. భారతవాసులు ట్రిపుల్ (మూడు రెట్లు) ధైర్యము కలవారు. వారు డబల్ అయితే వీరు ట్రిపుల్. కావున బాప్‌దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. అర్థమైందా! బాప్‌దాదా ఈ శ్రేష్ఠ ఆశల దీపాన్ని, ప్రతి బిడ్డలో వెలుగుతూ ఉండటాన్ని చూడాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ సారి ఈ దీపావళిని జరుపుకోండి. 6 నెలల తర్వాతైనా జరుపుకోండి. బాప్‌దాదా ఈ దీపావళి సమారోహాన్ని చూసిన తర్వాత తమ ప్రోగ్రామ్‌ను ఇస్తారు. చెయ్యటమైతే చెయ్యాల్సిందే. మీరు చెయ్యకపోతే వెనక వచ్చేవారు చేస్తారా ఏమిటి! మాల అయితే మీదే కదా! 16108 మాలలోకైతే పాతవారైన మీరే వచ్చేది ఉంది కదా. కొత్తవారైతే వెనుక-వెనుక వస్తారు. అయితే, కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ వస్తారు. కొందరు లాస్ట్‌లో వచ్చినా ఫాస్ట్‌గా వెళ్తారు, ఫస్ట్ వస్తారు. కానీ కొద్దిమందే అలా ఉంటారు. ఇక మిగిలింది మీరే. మీరే ప్రతి కల్పము తయారయ్యారు, మీరే తయారయ్యేది ఉంది. ఎక్కడ కూర్చుని ఉన్నా కానీ, విదేశాలలో కూర్చుని ఉన్నా, దేశములో కూర్చుని ఉన్నా కానీ, మీలో ఎవరైతే బహుకాలము నుండి పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో వారు తప్పకుండా అధికారులే. బాప్‌దాదాకు ప్రేమ ఉంది కదా, కావున ఎవరైతే బహుకాలము నుండి మంచి పురుషార్థులో, సంపూర్ణ పురుషార్థులు కాకపోయినా ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉన్నారో, వారిని బాప్‌దాదా వదిలి వెళ్ళరు, తమతోపాటు తీసుకువెళ్తారు. అందుకే పక్కా నిశ్చయము పెట్టుకోండి - మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము, మేమే వారితో పాటు ఉంటాము. సరేనా? పక్కాయేనా? కేవలము శుభ చింతకులుగా ఉండండి, శుభ చింతన, శుభ భావన, పరివర్తన భావన, సహయోగము ఇచ్చే భావన, దయాహృదయ భావన, వీటిని ఇమర్జ్ చెయ్యండి. ఇప్పుడు మర్జ్ చేసి పెట్టుకున్నారు, వాటిని ఇమర్జ్ చెయ్యండి. శిక్షణ ఎక్కువ ఇవ్వకండి, క్షమించండి. ఇతరులకు శిక్షణ ఇవ్వటములో అందరూ తెలివైనవారే, కానీ క్షమతోపాటు శిక్షణను ఇవ్వండి. మురళిని వినిపించే విషయములో, కోర్సు చెప్పే విషయములో లేక మీరు ఏవైతే ప్రోగ్రాములు చేస్తారో, వాటికి సంబంధించి శిక్షణను ఇవ్వండి కానీ పరస్పరము కార్య-వ్యవహారాలలోకి వచ్చినప్పుడు క్షమతోపాటుగా శిక్షణను ఇవ్వండి. కేవలము శిక్షణను ఇవ్వకండి, దయాహృదయులుగా అయ్యి శిక్షణను ఇచ్చినట్లయితే మీరు చూపించే దయ ఎలా పని చేస్తుందంటే దాని వలన ఇతరులలోని బలహీనత క్షమించబడుతుంది. అర్థమైందా. అచ్ఛా!
ఇకపోతే సేవలనైతే అందరూ చాలా రకాలుగా చేసారు మరియు చేస్తున్నారు కూడా కానీ బాప్‌దాదా ఒక సూచనను ఇస్తున్నారు – క్వాలిటీ మరియు క్వాంటిటీ, క్వాంటిటీ యొక్క సేవను కూడా చేయండి కానీ క్వాంటిటీని సేవకు సహయోగులుగా చేయండి. క్వాలిటీవారిని ఎదురుగా తీసుకురండి, సేవా స్టేజిపైకి తీసుకురండి. క్వాలిటీ మరియు క్వాంటిటీ రెండు సేవలను కలిపి చేయండి. క్వాంటిటీ వెనుక క్వాలిటీ ఉండిపోకూడదు ఎందుకంటే సమయం సమీపిస్తుంది. కార్యాన్ని మరియు బాబాను క్వాలిటీ వారు ప్రత్యక్షం చేసినప్పుడే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. సందేశం ఇవ్వడం కూడా అవసరమే కానీ సందేశవాహకులుగా తయారు చేయడం కూడా అవసరమే. ఇప్పుడు కూడా భిన్న భిన్న వర్గాలవారు వచ్చి ఉన్నారు. బాప్‌దాదా విన్నారు, భిన్న-భిన్న వర్గాలవారు ఎవరెవరైతే వచ్చారో వారు ఒక చేయిని ఊపండి.
స్పోర్ట్స్, ఎడ్మినిస్ట్రేటర్, యూథ్, ఐ.టి గ్రూప్, ఈ అన్ని గ్రూపులవారిని బాప్‌దాదా చేతులు ఎత్తించారు
ఏ వర్గం వారైతే వచ్చారో, మీటింగ్ అయితే చేసారు కానీ బాప్‌దాదాకు ప్రతి వర్గం వారు తమ సేవలో వెలువడిన నంబర్‌వన్ ఐ.పిని ఎదురుగా చూపించలేదు. ఏ వర్గం తరఫున మైక్ తయారయ్యారు, చెప్పండి. ప్రతి వర్గం నుండి ఎవరినైనా మైక్‌గా తయారు చేసారా, వారు మైక్ అయితే మీరు మైట్ అవుతున్నారా? ఏ వర్గంవారు చేసారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు వర్గాల ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో, అందులో ప్రతి వర్గం వారు తమ చిన్నని మైక్ గ్రూపును మధుబన్ ఎదుటకు తీసుకురండి. ఇదైతే చేయగలరు కదా! ఏ పిల్లలు తయారయ్యారో బాప్‌దాదా కూడా చూడాలి కదా. బాప్‌దాదా ముందుకు తీసుకురాకండి, ముందుగా దాదీల ఎదుటకు తీసుకురండి. వారు పాస్ చేసిన తర్వాత అప్పుడు బాప్‌దాదా ముందుకు తీసుకురండి. బాగుంది. అచ్ఛా – వినడమైతే చాలా విన్నారు. ఇప్పుడు వినడము అంటే ఇముడ్చుకోవడము. ఇముడ్చుకోవడము అంటే స్వరూపంలోకి తీసుకురావడము. ఇప్పుడు 6 లక్షలమంది బ్రాహ్మణ పరివారము పరస్పరంలో సదా స్నేహి, సహయోగి మరియు సదా ధైర్యాన్ని పెంచేవారిగా ఉండాలి. అచ్ఛా.
సేవ టర్న్ రాజస్థాన్ వారిది, యు.పి సహయోగిగా ఉంది:- బాగుంది కదా, రాజస్థాన్‌కు ఎక్కువ ఛాన్స్ లభించింది – ఎక్కువ పుణ్యం జమ చేసుకోవడానికి. చూడండి, ఎంతగా సంఖ్య పెరిగిందో, అంతగా ఆత్మల పుణ్యము సేవాధారుల ఖాతాలో జమ అయింది. రాజస్థాన్‌కు ఆలోచించకుండానే పుణ్యం యొక్క గోల్డెన్ లాటరీ లభించింది. మంచిది. రాజస్థాన్‌కు లభిస్తే అందరూ సంతోషిస్తున్నారు. బాగుంది, అందరూ మంచిగా సమయాన్ని కేటాయించి నిర్వర్తించారు. అచ్ఛా (ఈరోజు సభలో 25 వేలమందికన్నా ఎక్కువమంది సోదరసోదరీలు ఉన్నారు) మీరందరూ కూడా దాదీలకు, సేవాధారులకు అభినందనలు తెలిపారు. ఇంత కష్టం చేయించారు. బాగా చప్పట్లు కొట్టండి. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క క్షణములో మనసుకు యజమానిగా అయ్యి మనసును ఎంత సమయము కావాలంటే అంత సమయము ఏకాగ్రము చెయ్యగలరా? చెయ్యగలరా? అయితే ఇప్పుడు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ను చెయ్యండి. పూర్తిగా మనసులో ఏకాగ్రత ఉండాలి. సంకల్పములో కూడా అలజడి ఉండకూడదు. అచలముగా ఉండాలి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖజానాల యజమానులకు, సదా సంగమయుగ శ్రేష్ఠ బంధనముక్తి, జీవన్ముక్తి స్థితిలో స్థితులై ఉండేవారికి, సదా బాప్‌దాదా యొక్క ఆశలను సంపన్నము చేసేవారికి, సదా ఏకత మరియు ఏకాగ్రతా శక్తి సంపన్నులైన మాస్టర్ సర్వశక్తిమాన్ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
నలువైపులా దూరములో కూర్చుని ఉన్న పిల్లలకు, ఎవరైతే ప్రియస్మృతులను పంపించారో, ఉత్తరాలు పంపించారో, వారికి కూడా బాప్‌దాదా చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమతోపాటు ప్రియస్మృతులను ఇస్తున్నారు. అలాగే చాలామంది పిల్లలు మధుబన్ యొక్క రిఫ్రెష్‌మెంట్‌కు చెందిన చాలా మంచి-మంచి ఉత్తరాలను పంపారు, ఆ పిల్లలకు కూడా విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే.