Search for a command to run...
6 Sept 2007
దాదీ చేతిలో ప్రత్యక్షత పరదాను తెరిచే బటన్ ఉంది, ఇందులో మీరందరూ కూడా సహయోగిగా అవ్వండి
6 September 2007 · తెలుగు
సద్గురువారం 6 సెప్టెంబరు 2007, విశేషంగా భోగ్ సమయంలో (దాదీ ప్రకాశ్మణిగారు శరీరం విడిచిపెట్టిన 12వ రోజున) బాప్‌దాదా పధరామణి - మధ్యాహ్నం 11.30 గం.లు
ఈరోజు బాలకులు సో మాలికులు అయిన పిల్లల పిలుపు మేరకు బాప్‌దాదా హజూర్ హాజరు అయ్యారు. బాప్‌దాదా తమ పిల్లలందరినీ శిరో కిరీటాలుగా చూస్తున్నారు. మీ అందరి ప్రియమైన దాదీ తమ ఇచ్ఛ అనుసారంగా, ఎంతో ప్రేమతో నిస్సంకల్ప సమాధి మరియు సాధనలో ఉన్నప్పటికీ స్వ ఇచ్ఛతో బాబా సమానంగా తీవ్రంగా అనంతమైన సేవను అనుభవం చేయడానికి, సహచరునిగా, సాక్షి మరియు సమాన స్థితిని అనుభవం చేయడానికి బాబా వద్దకు వతనానికి చేరుకోవడాన్ని బాప్‌దాదా చూసారు. ఆది నుండి అంతిమం వరకు నిస్వార్థ సేవ, నిర్వికల్ప సాధన, పరిస్థితి మరియు స్తుతి రెండిటి నుండి అతీతంగా మరియు సర్వులకు ప్రియమైన జీవితం యొక్క ప్రభావాన్ని నలువైపుల ఎటువంటి శ్రమ లేకుండా, చెప్పాల్సిన అవసరం లేకుండా దేశవిదేశాలలో పవిత్ర ప్రేమ యొక్క వైబ్రేషన్లను స్వతహాగా సహజంగా వ్యాపించడాన్ని అందరూ అనుభవం చేసారు. పిలవకపోయినా కానీ అందరి హృదయాల నుండి రెస్పాండ్ అవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగా కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష స్నేహి, సహయోగి, సమాన స్థితి యొక్క ప్రభావం ఇది. దాదీ జీవితంలో ఒకే సంకల్పం ఉండేది - ఇప్పుడు త్వరత్వరగా బాబా ప్రత్యక్షత జరిగి శబ్దం వ్యాపించాలి. కావున ప్రత్యక్షత, దాదీ ప్రత్యక్షత ద్వారా ఈశ్వరీయ విశ్వ విద్యాలయం మరియు బాప్‌దాదా యొక్క ప్రత్యక్షత యొక్క మొదటి అధ్యాయం, చిన్నని అధ్యాయం ఆరంభమయింది. వీరు ఎవరు, ఈ ఆధ్యాత్మిక విద్యాలయం ఏమిటి అని అందరి దృష్టిలో, మనసులో, హృదయంలో ప్రశ్నల రూపంలో ఉత్పన్నమయ్యాయి. మొదట్లో, ఎవరు, ఏమిటి... అన్న ప్రశ్నలు ఉండేవి, ఇప్పుడు వీరు ఇది అన్న సమాధాన రూపం కనిపిస్తుంది. దాదీకు ఒకే ఉల్లాసం ఉండేది - ఏదైనా నవీనత చేయాలి, విశాల రూపంలో సేవ జరగాలి అని దాదీకి ఈ ఒక్క ఆలోచనే ఉండేది, అలాగే స్వతహాగా సహజంగానే విశాల పరిచయం అనే జెండా ఎగురుతుంది. ఇప్పుడు మీ అందరూ ప్రేమ స్వరూపాన్ని ప్రత్యక్ష రూపంలో చూపించి ఈ ప్రత్యక్షత జెండాను ఇంకా పైకి ఎగురవేయాలి. దాదీ అయితే ప్రత్యక్షత జెండాను, ప్రత్యక్షత పరదా యొక్క స్విచ్‌ను ఆన్ చేయడానికి బటన్‌ను చేతిలో పట్టుకుని ఉన్నారు, ఇందులో మీరందరూ కూడా తోడుగా ఉన్నారు కదా. దాదీపై చాలా ప్రేమ ఉంది కదా, మరి ఎలా అయితే దాదీ స్వ ఇచ్ఛతో ఎవరెడీ, నష్టోమోహగా అయ్యారో, అందరూ ఎదురుగా నిల్చుని ఉన్నారు అయినా కానీ నిర్మోహి మూర్తిగా ఎగిరిపోయారు. ఎలా అయితే దాదీ ఫాలో బ్రహ్మా బాబా చేసారో అలా మీరూ చేయండి. అకస్మాత్తు పాఠంలో పాస్ అయ్యారు. ఈ అంతిమ పాఠం గురించి ప్రేమి, స్నేహి ఆత్మలైన మీ అందరికీ సూచనను ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు మీరు మీ గురించి ఆలోచించండి, దాదీ ఏదైతే ప్రత్యక్షత పరదాను తెరిచే బటన్ చేతిలో పట్టుకున్నారో అందులో మేము ఎలా సహయోగిగా అవ్వాలి అని ఆలోచించండి! బటన్ తెరవడంలో ఆలస్యం అవ్వదు, కానీ ప్రత్యక్షత జెండాను పైకి ఎగురవేసేవారు, ప్రత్యక్షత పరదాను తెరిచేకన్నా ముందు విశేష పాత్రధారులైన సహచరులు ఎవరెడీగా ఉన్నారా? మేము సెంటరు నివాసులము, మధుబన్ నివాసులము హద్దు సేవాధారులము అని భావించకండి, అలా కాదు, మీరందరూ విశ్వ స్టేజిపై విశేష పాత్రధారులు. పూర్తి విశ్వం యొక్క దృష్టి ఇప్పుడు దాదీ ప్రత్యక్షతతో మీ వైపున ఉంది. విశ్వం యొక్క దృష్టి మీపై ఉంది, ఎవరైతే బ్రహ్మాకుమార్ కుమారి అని పిలువబడుతున్నారో, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, ఏ సేవకైనా నిమిత్తం అయి ఉండవచ్చు, చిన్న కార్యానికి నిమిత్తంగా ఉన్నాకానీ ప్రతి ఒక్కరిపై, అందరి దృష్టి మీపై ఉంది. మాపై ఇంతటి బాధ్యత ఉంది అని భావిస్తున్నారా లేక పెద్దలనే చూస్తున్నారా? పెద్దవారికే తెలుసు అనకండి, ఇందులో సంగఠన శక్తి కావాలి. ఇది ఆత్మిక కోట. కోటలోని ప్రతి ఇటుకకు బాధ్యత ఉంది. బ్రహ్మాకుమార్ కుమారిగా ఉన్నారంటే ఈ ఆత్మిక కోట యొక్క ప్రత్యక్షతకు నిమిత్తమైన ఆత్మలు, కోటలోని ప్రతి ఇటుకకు బాధ్యత ఉంది. క్రింది ఇటుక కావచ్చు, మధ్య ఇటుక కావచ్చు, పైన ఉన్న ఇటుక కావచ్చు, ఒక్క ఇటుక కదిలినా కానీ దాని ప్రభావం పడుతుంది. మరి దాదీ అంటే ప్రేమ ఉంది కానీ దాదీకు ఎవరిపై ప్రేమ ఉంది! దాదీ తమ ప్రేమమూర్తికి రిటర్న్‌గా అనంతమైన ప్రేమ లభించడాన్ని బాప్‌దాదా చూసారు కానీ దాదీకు దేనిపై ప్రేమ ఉండేది? నిన్నటి విషయాలను విడిచిపెట్టండి, ఈరోజు కూడా వద్దు, ఇప్పుడు... అని దాదీ అనేవారు. ప్రత్యక్షత జెండాను పైకి ఎగురవేయడానికి తమ ఉన్నత స్థితిని, సమాన స్థితిని చూపించండి. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో, దాదీ అంటున్నారు, మీ అందరినీ అడగమన్నారు, నా సంకల్పాన్ని మరియు బాబా సంకల్పాన్ని పూర్తి చేయడానికి ఏమి పరివర్తన చేసుకోవలసిన వచ్చినా కానీ, సహనం చేయవలసి వచ్చినా కానీ, దయా భావనను పెట్టుకోవలసి వచ్చినా కానీ, నిర్మల వాణి ఉండాల్సి వచ్చినా, శుభ భావన, శుభ కామనను నేచురల్ నేచర్‌గా తయారు చేసుకోవలసి వచ్చినా కానీ, దాదీ అంటున్నారు నా ఈ మాటను మీరు అడగండి, నా సమానంగా తయారవ్వడానికి తయారుగా ఉన్నారా? మరి మీరు చెప్పండి, తయారుగా ఉన్నారా? ఊరికే అలా చేతులెత్తకండి, మనసు యొక్క చేతిని ఎత్తండి. ఈ బాహువుల చేతులు పెద్ద విషయం కాదు కానీ గుర్తుగా ఈ చేతులనే ఎత్తవలసి ఉంటుంది. ఏమి జరిగినా కానీ నేను మారవలసిందే. నేను మారి విషయాలను మార్చాలి. వీరు ఇలా, ఇది ఇలా, వీరిలా చేస్తారు, వీరు మాట్లాడరు, అలా అయితే జరుగుతూ ఉంటుంది... కానీ నేను ఏమి చేయాలి? దాదీ సమానంగా అయితే అవ్వాలి కదా, దాదీ ఇంతమందిని నడిపించి చూపించారు, ఎన్ని సంవత్సరాలు, ఒకటి రెండు సంవత్సరాలు కాదు, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, కర్మణ వారు కావచ్చు, భాషణవారు కావచ్చు, జోన్‌వారు కావచ్చు, దాదీలు కావచ్చు, దీదీలు కావచ్చు. నిర్మోహిగా అయిపోయారు కదా, చివర్లో ఎవరినైనా గుర్తు చేసారా? చేసారా? మీరు ఎదురుగా నిల్చుని ఉన్నారు, ఎవరికైనా ఎవరన్నా గుర్తుకు వస్తుంటే శ్వాస కనిపిస్తుంది. ఒక శాంతిదేవిలా ఉన్నారు, సమ భావన, శ్రేష్ఠ భావన, ప్రత్యక్ష రూపంలో కనిపించడాన్ని అనుభవం చేసారు కదా. చుట్టూ అందరూ నిల్చుని ఉన్నారు మరియు చూస్తున్నారు, దాదీ వెళ్తున్నారు, వెళ్తున్నారు, ఈ విధంగా శ్వాసను విడిచిపెట్టడం చరిత్రలో ఇదే మొదటి ఉదాహరణ. బాప్‌దాదా అయితే మనసులో ఉన్నారు కానీ సాకారంలో అందరూ ఎదురుగా ఉన్నారు, ఈ విధంగా సెలవు ఎవ్వరూ తీసుకోలేదు. మరి విన్నారా, ఇప్పుడు ఏమి చేయాలి? విన్నారా! శ్రద్ధగా విన్నారా? వెనుక వారు విన్నారా! అచ్ఛా, ఏమి జరిగినా కానీ, ఎంత సహించాల్సి వచ్చినా కానీ, పరివర్తన అవ్వవలసిందే అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా, పక్కా చేయి ఎత్తారు కదా లేక కొంచెం అలా అలా అంటారా, లోపలి చేతిని ఎత్తారు కదా? చూద్దాము, ప్రయత్నిస్తాము అనవద్దు. ప్రయత్నం చేస్తాములే లే, లే అనకండి. చాలా మంచిది.
దాదీకు మీ సందేశాన్ని ఇచ్చాము, మేము విశేషంగా వస్తాము, ఆత్మిక సంభాషణను చేస్తాము అని దాదీ అన్నారు, ఇకపోతే మీ అందరి ప్రేమ, భావన అన్నీ దాదీ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఎదురుగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఎవరి మానసిక స్థితి ఎంత రియల్‌గా ఉంది అన్నది కూడా దాదీ అంతటా తిరిగి నోట్ చేసారు. నేను వచ్చి వినిపిస్తాను అని అన్నారు. ఎవరు ఎంత దాచిపెట్టినా కానీ, వతనంలో దాగదు. అక్కడి యంత్రాలు ఆత్మిక యంత్రాలు. అచ్ఛా.
నలువైపుల దాదీ ప్రేమను ప్రత్యక్ష రూపంలో చూపించేవారు, ఎలా అయితే దాదీ ఫాలో బ్రహ్మా బాబా సాకార జీవితాన్ని ఫాలో చేసి చూపించారో, అలా బాబా మరియు గారాల పిల్లలు దాదీని ఫాలో చేసి ప్రత్యక్షత పరదాను, ప్రత్యక్షత జెండాను ఎగురవేసేందులో తోడుగా నిలిచే ఆత్మలకు, దేశవిదేశాల పిల్లలు సమానంగా అవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాలు నిండిన ప్లాన్‌ను తయారు చేస్తుండటాన్ని బాప్‌దాదా చూస్తున్నారు, ఆ రోజును ఇప్పుడు సమీపంగా తీసుకురావాలి, సమయం వచ్చినప్పుడు కాదు, సమయాన్ని మీరు సమీపంగా తీసుకురావాలి. మరి ఇలా స్వ పరివర్తక, దృఢ సంకల్పధారిగా ఉన్న నలువైపులలోని పిల్లలకు, చూస్తున్నవారు కావచ్చు, ఎదురుగా వచ్చినా రాకపోయినా కానీ బాప్‌దాదా మరియు దాదీ నలువైపుల ఉన్న గీతా పాఠశాలలోని పిల్లలను కూడా చూస్తున్నారు. మరి బాబా సహచరులు, దాదీ సహచరులు, బ్రాహ్మణ ఆత్మలకు బాప్‌దాదా మరియు దాదీ తరఫున ఒక్కొక్కరికీ పేరు సహితంగా విశేషత సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ మీ క్లాసులోకి వస్తూ ఉంటారు, రారు అని కాదు. మీరు ఏదైతే సమాధి తయారు చేసారో, అక్కడకు కూడా వస్తూ ఉంటారు. కానీ మీతో చాలా చాలా ఆత్మిక సంభాషణను చేయాలనుకుంటున్నారు అందుకని కొంత సమయం కావాలి. దాదీకు 12 రోజులు సమాప్తమయ్యాయి, దాదీకి సాకార వతనంలో విశేషంగా అతీతంగా మరియు ప్రియంగా అయ్యి అత్యవసరమైన కార్యాన్ని ఒకటి నిమిత్తమాత్రంగా చేయాల్సి ఉంది. కానీ దాదీ జన్మ, కార్యం అతి అతీతమైనవి, దాని గురించి మరోసారి విస్తారంగా వినిపిస్తాము. బాప్‌దాదా కూడా డ్రామాలో ఫిక్స్ అయిన పాత్రను చేయవలసి ఉంటుంది, చేయించేలా కూడా చూడాలి. అలౌకికత అంటే ఏమిటి అన్నది మరోసారి వినిపిస్తాము. సరేనా. మొదటి లైను వారు అందరూ మంచిగా ఉన్నారా? దాదీలు మంచిగా ఉన్నారా? పాండువులు కూడా మంచిగా ఉన్నారా? పాండవులు అందరూ మంచిగా ఉన్నారు కదా. డబల్ ఫాలో. దాదీ చెప్పిన మూడు మాటలు సదా గుర్తుంచుకోండి - నిమిత్తము, నిర్మానము మరియు నిర్మల వాణి. ఈ మూడు మాటలు ప్రతి ఘడియ, ప్రతి కార్యాన్ని ఆరంభించేటప్పుడు, కార్యం మారినా కానీ ఈ మూడు మాటల స్మృతి మాత్రం మారకూడదు, ఎటువంటి కఠిన కార్యం అయినా కానీ ఈ మూడు మాటలను ఎలా భావించండంటే ఇవి బాప్‌దాదా, దాదీ, దీదీ అనుకోండి, ఈ మూడు మాటలను మర్చిపోకండి, ఏ కార్యం ఆరంభించే ముందైనా ఇది గుర్తు చేసుకుని కార్యాన్ని ప్రారంభించండి. అప్పుడు చాలా త్వరగా, సహజంగా మరియు సమానంగా అయిపోతారు. అచ్ఛా - ఇప్పుడు ఏమి చేయాలి?
(దాదీలు అందరూ బాప్‌దాదాను కలుస్తున్నారు, ముందుగా నిర్మల్శాంత దాదీ కలిసారు తర్వాత ఇతర దాదీలు)
దాదీ నిర్మల్శాంత:- చాలా మంచిగా అయ్యారు, ధైర్యశాలిగా అయ్యారు, చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు.
దాదీ శాంతమణి:- బాగా కోలుకున్నారు, ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది ప్రాక్టికల్లోకి వస్తుంది, ఇందుకు అభినందనలు.
మనోహర్ దాదీ:- యజ్ఞం యొక్క ఆది, సహయోగి ఆత్మ మీరు. సహయోగిని, సహయోగిగా ఉంటాను, అండర్లైన్ ఎందుకంటే దాదీలు అలంకారం కదా కావున మీరు దాదీలు ఒక్కరు కూడా మిస్ కాకూడదు. హా జీ అనండి, శక్తి వస్తుంది, హాజీ చేసి చూపించండి, చేయవలసిందే, ఎవరు ఎంతగా ఆపినా కానీ నేను చేయవలసిందే. దాదీకు సఖి కదా మీరు. మరి దాదీ ఎప్పుడూ నో అనలేదు, ప్రతి కార్యంలో హా జీ, హా జీ, హా జీ అన్నారు. అలాగే చేయండి.
రతన్మోహిని దాదీ:- మీరైతే ఆల్‌రౌండర్ ఉన్నారు, ఇప్పుడు దాదీలు, మీ పాత్రను విశేషంగా అందరి ముందు సంగఠనలో చూపించాలి. అందరి దృష్టి పాండవులు మరియు దాదీల వైపుకు నేచురల్‌గా వెళ్తుంది. ఉన్నారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. మంచిది.
పాండవులు ఏమి చేస్తారు? ముగ్గురూ రండి (నిర్వైర్ అన్నయ్య, రమేష్ అన్నయ్య, బృజ్‌మోహన్ అన్నయ్య) మీ ముగ్గురూ ఇప్పుడు ఏమి చేయాలి? మూడు మాటలు విశేషంగా దాదీ విశేషత అని చెప్పవచ్చు, చిన్న పెద్ద అందరూ మా దాదీ అనుకునేవారు, నా వారు అన్న భావనను అందరికన్నా ఎక్కువగా దాదీ ఇచ్చారు. ఈ దాదీలు కూడా ఉన్నారు కానీ దాదీలో ఎక్కువగా విశేషత ఉండినది, మరి మీ కర్తవ్యం కూడా ఇలాగే ఉండాలి, వీరు మావారు అని అనిపించేలా మిలనం ఉండాలి, మన అన్న భావన అనుభవం కావాలి, డ్యూటీవారిగా కాదు. మన అన్న భావన ఎంతగా తెస్తారో, దాదీకి ఇంతగా ప్రేమ రెస్పాంస్ ఎందుకు లభించింది? వి.ఐ.పీలు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మనవారు అన్న భావన కలిగేది, మన దాదీ. ఇప్పుడు కూడా చూడండి దాదీ మా(దాదీ అమ్మ), దాదీ మా... ఇలా అనమని ఎవ్వరూ చెప్పడం లేదు కానీ ప్రేమతో స్వతహాగా అంటున్నారు, మనవారు అన్న అనుభూతిని చేయించినందుకు ఇది రిజల్టు. ఎలా అయితే దాదీల వైపు అందరి దృష్టి ఉన్నదో అలాగే విశేష నిమిత్త పాండవుల వైపు కూడా దృష్టి ఉంది. మరి చేయాలి, చేయాలి కదా. చేయాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ, మీడియా వారు కావచ్చు, వి.ఐ.పీలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ ఇంట్లో కూర్చునే శ్రద్ధాంజలిని అర్పించారు, ఇక్కడకు రాకపోయినా కానీ టి.వి ద్వారా అందరూ మెజారిటీ చూసారు మరియు సహయోగిగా కూడా అయ్యారు. ఇప్పుడిక ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం దాగి ఉండదు, ఒక్కొక్క కార్యం వైపు అందరి దృష్టి ఉంది, తిరకాసు వారు తిరకాసుగా చూస్తారు, మంచివారు మంచిగా చూస్తారు, కానీ అందరి దృష్టి అయితే పడింది. ఆ విధంగా మీ అందరూ కలిసి అన్ని స్థానాలలోని వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయాలి ఎందుకంటే దాదీ విశ్వం దృష్టిలోకి తెచ్చారు. ఒకటి - ముందు ఎవరైతే ప్రెజిడెంట్ అయ్యేవారున్నారో వారి కారణంగా అందరి దృష్టిలోకి వచ్చింది తర్వాత దాదీ కారణంగా ఎక్కువగా దృష్టిలోకి వచ్చింది కావున అందరి దృష్టి ఇప్పుడు విశేష విశ్వ విద్యాలయం వైపు ఉంది. కావున అండర్లైన్. విన్నారా!
మున్నీ అక్కయ్య:- (బాబా, దాదీ కాటేజ్ ఖాళీ ఖాళీగా ఉంది) ఇప్పుడు కూడా అక్కడ సేవా సాధనను తయారు చేసి ఉంచండి. (మేము దేనిపై శ్రద్ధ వహించాలి) ఎలా అయితే దాదీ చేసేవారో అలా నవ్వుతూ శక్తిశాలి దృష్టినిస్తూ, దయాహృదయ భావన, సంతుష్టత భావన, సంతుష్టత అనే టోలీని తినిపిస్తూ ఉండండి. ఖాళీ చేతులతో పంపకండి. (దాదీ బాగా గుర్తుకొస్తున్నారు) గుర్తుకైతే వస్తారు, ఎలా మర్చిపోగలరు, కొన్ని రోజులైతే తప్పకుండా గుర్తుకు వస్తారు సాకారం ప్రకారంగా, ఎందుకంటే 24 గంటలు వారితో కలిసి ఉన్నారు కదా కనుక గుర్తుకు వస్తారు. దాదీ కలవడానికి వస్తారు, తారీఖు ఫిక్స్ అవ్వలేదు, తప్పక వస్తారు!
దాదీ జానకి:- (రేపు విదేశాలకు వెళ్తున్నాను) అనుమతి ఇచ్చాము కానీ షార్ట్ కట్, తయారై ఉంది కదా.
మోహిని అక్కయ్య:- (ఇప్పుడు మేము ఏమి చేయాలి) దాదీ భాసనను ఇవ్వండి. దాదీ పాత్ర ఎటువంటిదంటే వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాగలరు, మీకు తెలుస్తుంది. మీరు కూడా వతనాన్ని అనుభవం చేసుకున్నారు కదా, మీకు భాసన వస్తుంది. బాప్‌దాదా ఎంతో చక్కని పాత్రను పోషించేలా చేస్తారు, కేవలం ఈ మూడు మాటలను ప్రతి కర్మకు ముందు గుర్తు చేసుకోండి. సేవ చేయండి, ఆల్‌రౌండ్ సేవలో బిజీగా ఉండండి, ఇక్కడ కూడా బిజీగా ఉండండి, నలువైపుల సేవలకు సమయం లభించేది కాదు కదా, ఇప్పుడు సమయం ఇవ్వండి, మంచి సేవ జరుగుతుంది, చింతించకండి, బాబా తోడుగా ఉన్నారు.
(ఎవరైతే దాదీజీ సేవను చేసారో ఆ గ్రూపు మొత్తం బాప్‌దాదా ముందు ఉంది) చాలా మంచిది - ఎంత మంచి గ్రూపు. చూడండి, ప్రతి ఒక్కరూ డ్రామా అనుసారంగా తమ తమ పాత్రను పోషించారు. అందరూ మంచి పాత్రను నిర్వహించారు కానీ ఇప్పుడు స్వ పరివర్తనతో వాయుమండల పరివర్తన. మీలో బాబా లక్షణాలు కనిపించాలి. ఎలా అయితే లౌకికంలో కూడా కొంతమంది పిల్లలలో తండ్రి లక్షణాలు, తండ్రివంటి ముఖం కనిపిస్తుందో, అలా మీ ప్రతి ఒక్కరిలో బాబా లక్షణాలు కనిపించాలి. లక్షణాలు వస్తే ఏమవుతుందంటే లక్ష్యం స్పష్టమవుతుంది. ఈరోజుల్లో లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుంటున్నారు కానీ లక్షణాలు ఉండటం లేదు, మీరు లక్షణాల ద్వారా లక్ష్యాన్ని స్పష్టం చేయండి ఎందుకంటే అందరి దృష్టి లక్షణాల వైపు ఉంటుంది. కావున ఎంతగా లక్షణధారి నడవడిక ఉంటుందో అంతగా లక్ష్యం ఆటోమేటిక్‌గా సిద్ధి అవుతుంది - వీరు ఎవరు, ఏమి చేస్తున్నారు. సరే, ఏదైనా విషయం జరిగింది అనుకోండి, పరిస్థితులైతే వస్తూ ఉంటాయి కదా, మాల కదా, నంబరువారీగా ఉన్నారు కదా, వీరు ఏమి చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అని అనకండి. నేను ఏమి చేయాలి, ఈ పరిస్థితిలో నేను ఏ విధంగా సహాయం అందించగలను, సహాయం చేయలేకపోతే ప్రక్కకు తప్పుకోండి కానీ అందులో కొట్టుకుపోకండి, వాయుమండలంలో. నిమిత్త ఆత్మలైన మీరు ఇటువంటి స్థితిలో ఉంటే ఆటోమేటిక్‌గా వాయుమండలం తయారైపోతుంది. కష్టమనిపించదు, కేవలం నేను చేయాలి అనుకోండి, అంతే, పక్కా. సరేనా.
శక్తి సైన్యం తక్కువేమీ కాదు. శక్తులు కూడా తక్కువ కాదు. నేను వాయుమండలాన్ని శ్రేష్ఠంగా చేయాలి. ఏదైనా చిన్న విషయం జరిగితే దానిని రిపీట్ చేయకండి. ఒకరికి వర్ణన చేసారు అంటే అనేకుల చెవుల వరకు వెళ్ళింది అని అర్థం. అంతర్ముఖి సదా సుఖి. ఎలా అయితే దాదీ ఆత్మిక ఆప్యాయతను ఇచ్చారు, భౌతికం కాదు, ఆప్యాయతకు ఇది రిజల్టు, ఒకటి ఉపరామము, మరొకటి ఆప్యాయత. సూచన కూడా ఇచ్చారు కానీ మనసులో పెట్టుకోలేదు, నోటితో చెప్పారు వెంటనే సమాప్తం చేసేసారు, మనసులో పెట్టుకోలేదు. ఇలా మీరు కూడా నిమిత్తులు, మరి నిమిత్తమైనవారు దాదీని ఫాలో చేయడం చాలా అవసరం. అందరిలో అయితే శక్తి లేదు కదా, నంబరువారీగా ఉన్నారు, సహయోగం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, దయ చూపండి, ఆత్మిక ప్రేమను ఇవ్వండి ఎందుకంటే అందరి దృష్టి ఇప్పుడు దేశవిదేశాలలోని నిమిత్త ఆత్మల వైపు ఉంది ఎందుకంటే ఈ మీడియా నలువైపుల స్పష్టంగా చూపించింది, ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఏమి జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని మరింత ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకు, ఏమిటి అనుకుంటున్నారు కనుక కోటను పటిష్టంగా చేయండి, మీరు నిమిత్తము. కొద్దిమందే వచ్చినా కానీ వినడమైతే అందరూ వింటారు కదా. అయినా కానీ చేరుకున్నారు, ఇందుకు అభినందనలు. ఎవరెడీగా అయితే అయ్యారు కదా. దాదీతోపాటు మీరందరూ కూడా ఎవరెడీ పాఠాన్ని చదువుకున్నారు కదా. సరేనా. నేను నిమిత్తంగా ఉన్నాను, వాయుమండలాన్ని శక్తిశాలి చేయడంలో నేను నిమిత్తుడిని, వేరే వారు కాదు, అని అందరూ స్వయం గురించి భావించాలి. ఇతరులైతే నంబరువారీగా ఉన్నారు కానీ మీరైతే నిమిత్తంగా ఉన్నారు. చాలా మంచిది, సరే.
(దాదీకు సేవ చేసిన సోదరీలతో) చాలా బాగా సేవ చేసారు (దాదీ చాలా గుర్తుకు వస్తున్నారు) గుర్తుకు వస్తారు, బాప్‌దాదా యొక్క వతనం నుండి వెళితే బాప్‌దాదాకు గుర్తుకు రారా, గుర్తుకు వస్తారు. సేవ కదా, జగత్తుకు దాదీ కదా కేవలం మధుబన్ దాదీ కాదు కదా. అయితే అందరూ ఎంతో ప్రేమతో సేవను చేసారు ఇప్పుడు కూడా సమానంగా అయ్యే సేవను చేయండి. ప్రేమకు రిటర్న్ ఇదే ఉంటుంది, అచ్ఛా. పాండవులు కూడా సేవలో మంచిగా ఉన్నారు. పాండవులు కూడా సేవ బాగా చేసారు. ప్రేమ స్వరూపాన్ని చూపంచారు. అందరూ తమ తమ సేవ అనుసారంగా బాగా సహయోగిగా అయ్యారు. ఇప్పుడు వాయుమండలాన్ని పవర్‌ఫుల్‌గా చేసే సేవలో ఇలాగే తోడుగా నిలవండి, ఎలా అయితే దాదీ సేవలో తోడుగా ఉన్నారో అలా ఉండండి ఎందుకంటే అందరి దృష్టి అయితే ఉంది కదా, వీరు ఏమి చేస్తారు అని చూస్తున్నారు. ఏమి చేస్తారు వీరు అని చూస్తున్నారు, అందరి దృష్టి ఉంది కదా. వాహ్ వాహ్ అనే పాట మ్రోగేలా ఏదైనా చేసి చూపించండి. దాదీ యొక్క ప్రత్యక్ష స్నేహము మీ నడవడికలో కనిపించాలి. కనిపిస్తుంది, ఎందుకంటే ప్రేమ ఉంది కదా. ప్రేమలో అయితే పాస్ అయిపోయారు. ప్రేమ సర్టిఫికేట్ అయితే చాలా బాగుంది.
బాప్‌దాదా అందరి నుండి వీడ్కోలు తీసుకుని వతనానికి వెళ్ళారు. దాదీ గుల్జార్ వతనం నుండి తిరిగి వచ్చినప్పుడు వతనం దృశ్యాన్ని వినిపించారు:
దాదీ వీడ్కోలు సాయంకాలం జరగాల్సి ఉంది, కనుక నేను కలిసి వచ్చాను అని బాబా అన్నారు, నేను కూడా దాదీని కలిసాను. నన్ను బాబా పంపిస్తున్నారు అని దాదీ అన్నారు. ఈ 12 రోజుల్లో నేను ఏదైతే అనుభవం చేసానో అది చాలా చాలా బాగుంది, ఎంతో అనుభవం చేసాను. మామూలుగా అయితే చూడటానికి వీలు లేనివి, చూడనివి చూసాను. ఇలా వినిపించి ఇంకా ఇలా అన్నారు, బాబా ఇప్పుడు పంపిస్తున్నారు. నాకేమని ఉందంటే, నా సంకల్పం ఏమిటంటే నేను జన్మ తీసుకోకూడదని కానీ బాబా నాకు రహస్యాన్ని అర్థం చేయించారు, కనుక నేను సంతోషంగా వెళ్తున్నాను. దాదీని బాబా ఇలా ఎలా పంపిస్తున్నారు అని మాకు కూడా అనిపిస్తుంది. నేను బాబా రహస్యాన్ని అర్థం చేసుకున్నాను కనుక సంతోషంగా వెళ్తున్నాను అని దాదీ అన్నారు. మరో విషయం - సాయంకాలం వీడ్కోలు ఉంటుంది, అది చూసి అందరికీ వినిపించండి. నా తరఫున అందరికీ ఒక్కొక్కరికీ పేరు సహితంగా దాదీ స్మృతిని అందించండి. స్మృతితో పాటు ప్రేమ ఉండనే ఉంటుంది. వీడ్కోలు సందేశం తర్వాత వినిపిస్తాము. అచ్ఛా!
ఓంశాంతి