Search for a command to run...
7 Apr 2009
కారణము అన్న మాట నుండి ముక్తులై ముఖము మరియు నడవడిక ద్వారా ముక్తిని ఇచ్చే ముక్తిదాతలుగా అవ్వండి, సేవ పట్ల ఉల్లాస-ఉత్సాహాలతో పాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తితో ఉండండి
7 April 2009 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలను, ఎవరైతే డబల్ యజమానిగా ఉన్నారో వారందరినీ చూస్తున్నారు. ఒకటి, బాబా ఖజానాలన్నిటికీ యజమానులు మరియు రెండు, స్వరాజ్యానికి కూడా యజమానులు. రెండు యాజమాన్యాలు పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా ద్వారా లభించి ఉన్నాయి. బాలకులు కూడా మరియు యజమానులు కూడా. నా బాబా అన్నారు మరియు బాబా కూడా నా పిల్లలు అన్నారు. మరి బాలకులు మరియు యజమానులు, రెండింటి అనుభవం ఉంది.
ఈరోజు చాలా చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరంలో చివరి టర్న్. ఈరోజు బాప్‌దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని పరిశీలించారు. మరి ఏమి చూసి ఉంటారో చెప్పండి? నా పురుషార్థము ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి సంతోషపడ్డారు కానీ బాబాకు ఒక్క ఆశ ఉంది, అది ఏమిటో చెప్పమంటారా! బాబా ఆశను పూర్తి చేస్తారు కదా! ఒక్కటే ఆశ ఉంది, చెప్పమంటారా! ఆశను పూర్తి చేస్తాము అన్నవారు చేతులెత్తండి. చాలా మంచిది. చిన్నని ఆశ, అదేమిటంటే ఈరోజు నుండి ఒక్క మాటను మార్చండి, ఏ మాట? మాటిమాటికీ క్రిందకు తీసుకువచ్చే మాట – “కారణము”. ఈ కారణము అన్న మాటను పరివర్తన చేసి నివారణ అన్న మాటను సదా ధారణ చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీ సేవ కూడా ఏమిటి? విశ్వంలోని ఆత్మలందరి సమస్యల కారణానికి నివారణ చేసి, నివారణ చేయగానే నిర్వాణధామంలోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు. మరి ఇతరులకు కూడా ముక్తిని ఇచ్చేవారు కాబట్టి స్వయం కూడా కారణాన్ని నివారణ చేస్తారు, అప్పుడు ఇతరులకు ముక్తిని ఇవ్వగలరు. నిర్వాణంలోకి పంపగలరు. మరి ఈ ఒక్క మాటలో మార్పును తీసుకురావడము కష్టమా లేక సహజమా? ఆలోచించండి.
ఈరోజు బాప్‌దాదా ఇక్కడకు వచ్చినవారికి, తమ తమ స్థానాలలో చూస్తున్నవారికి, వింటున్నవారికి, వారందరి నుండి ఒక్క మాటలో పరివర్తనను కోరుకుంటున్నారు ఎందుకంటే కారణమే క్రిందకు తీసుకు వస్తుంది. కారణంలోనే అర్థకల్పం ఉన్నారు, ఇప్పుడు నివారణ చేసే సమయము. నివారణ మరియు నిర్వాణము, ముక్తి. మరి ఈరోజు బాబాకు ఇది ఇవ్వడానికి ధైర్యము ఉందా? చివరి టర్న్ కదా, అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో వచ్చారు, బాప్‌దాదా ఒక్కొక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు. పడుకోవడానికి, భోజనానికి కష్టంగా ఉంది, కానీ అందరూ స్నేహంతో, స్నేహము అను ప్లేన్(విమానము) మీ అందరినీ మధువనానికి చేర్చింది. బాప్‌దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి, ప్రతి ఒక్కరికీ పదమారెట్లు హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ స్నేహంలో మీరు ఏమి చేస్తారు? ఎవరితో అయితే స్నేహము ఉంటుందో, వారికి స్నేహంతో బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు బాప్‌దాదా బహుమతి రూపంలో ఈ కారణము అన్న మాటను తీసుకోవాలని ఆశిస్తున్నారు. బాప్‌దాదాకు ఉన్న ఈ ఆశను పూర్తి చెయ్యాలి కదా! అయితే చేతులెత్తండి, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ గేట్ నుండి బయటకు వెళ్తే కారణము అన్న మాట సమాప్తమై ఉండాలి. పొరపాటున మీ వద్దకు మళ్ళీ వచ్చేసినా బాబాకు ఇచ్చిన వస్తువు ఇక బాబా ఆస్తి. మరి బాబా అమానత్తును ఏమి చేస్తారు? తిరిగి తీసుకుంటారా? మరి అందరూ దృఢ సంకల్పం చేసారా? చేసారా? మళ్ళీ చేతులెత్తండి. వెనుకవారు చేతులు ఊపండి. (ఈరోజు శాంతివనంలో షుమారు 28-29 వేల మంది సోదరసోదరీలు బయట లోపల కూర్చుని మురళిని వింటున్నారు, అందరూ చేతులు ఊపుతున్నారు) అచ్ఛా. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీ వద్దకు క్యూ రానున్నది. ఎందుకని క్యూ వస్తుంది? హే ముక్తిదాతా, ముక్తిని ఇవ్వండి. మరి ఇచ్చేవారు, ముక్తిదాతలు ముందుగా మీరు ఈ మాటనుండి ముక్తులుగా అవ్వండి అప్పుడే ముక్తుని ఇవ్వగలరు.
బాప్‌దాదా కోరుకుంటున్నది ఏమిటంటే ఇప్పుడు ఈ సంవత్సరం హోమ్‌వర్క్ ఇదే ఉండాలి, నేను ముక్తి అయి ముక్తిని ఇప్పించాలి ఎందుకంటే సమస్యలు రోజు రోజుకూ పెరగనున్నాయి. కావున సమస్య సమాధాన రూపంలో మారిపోవాలి. సమస్యను తొలగించడంలో కష్టము, సమయము పట్టకూడదు. మీకు మీ భక్తులు మరియు సమయపు పిలుపు వినిపించడం లేదా! ఇప్పుడు సమయానుసారంగా దేనిని పరివర్తన చేయడం అవసరము? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవీమూర్తులుగా అయి ఏదో ఒక అనుభూతిని చేయించాల్సిన అవసరము ఉంది. కావున ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే, వీరు ముక్తిదాత పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అని మీ అందరి ముఖము, నడవడికలో స్పష్టంగా కనిపించాలి. మీ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రం అనుభవం కావాలి. కేవలం వినిపించడం ద్వారా కాదు, కేవలం ముఖము ద్వారానే అనుభవం కావాలి ఎందుకంటే అనుభవం దగ్గరకు తీసుకువస్తుంది. ఈ అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చూపించండి. చూడండి, ఎలా అయితే సైన్స్ సాధనాలు అనుభవం చేయిస్తాయి కదా, ఇప్పుడు ఎండల సీజన్ అయితే వేడి మరియు చల్లదనాన్ని అనుభవం చేయిస్తున్నాయి కదా. సైన్స్ సాధనాలు అనభవీగా చేస్తున్నప్పుడు సైలెన్స్ పవర్ శక్తిని అనుభవం చేయించలేదా! కావున ఇప్పుడు బాప్‌దాదా పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారంటే అనుభవం అనే స్థితిలో స్థితులై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్న విషయము, విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ సమస్య వచ్చినప్పుడు మర్చిపోతారు. కానీ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు.
ఒకటి, బాప్‌దాదా కారణాన్ని చూసారు. రిజల్ట్‌ను కూడా చూసారు, ఒక రిజల్ట్‌ను చూసి చాలా-చాలా అభినందనలు ఇచ్చారు. ఆ రిజల్ట్ ఏమిటి? ఈరోజు వరకు సేవలో ఉల్లాస-ఉత్సాహము బాగుంది. కావున బాప్‌దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు, సేవను పెంచుతున్నారు కూడా, ప్లాన్లు కూడా మంచిగా చేస్తున్నారు, రిజల్ట్ కూడా యథా శక్తి లభిస్తుంది కానీ అనుభవం చేయించడానికి ఒక్క విషయంలో స్వయంపై అటెన్షన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. ఎలా అయితే మీ సేవ ఇప్పుడు ప్రసిద్ధి అవుతూ ఉంటుందో, సంతోషంగా కూడా ఉంటారు. ఈరోజుల్లో ఇంటరెస్ట్ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడిక అనుభవం చేయించడానికి విధి ఏమిటి? అది, ఉల్లాస-ఉత్సాహాలతో పాటు, ఎంత ఉల్లాసమో అంతగా సమయానుసారంగా ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి కూడా కావాలి. పురుషార్థంలో ఏదైనా సమస్యా రూపంగా అవుతుందంటే అందుకు కారణము అనంతమైన వైరాగ్య వృత్తిలో లోపము. ఇప్పుడు అనంతమైన వైరాగ్యము కావాలి. అనంతమైన వైరాగ్యము సదాకాలం ఉంటుంది. ఒకవేళ సమయానికి ఉంటే అప్పుడు సమయము నంబర్‌వన్ అయిపోతుంది, మీరు నంబర్ టూ అవుతారు. సమయము మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది. అనంతమైన వైరాగ్యము సదాకాలం ఉంటుంది. ఒకవైపు ఉల్లాస-ఉత్సాహము, సంతోషము మరియు మరో వైపు అనంతమైన వైరాగ్యము. అనంతమైన వైరాగ్యము సదా ఉండకపోవడానికి కారణము ఏమిటి? అందుకు కారణము దేహ అభిమానము అని బాప్‌దాదా చూసారు. దేహము అన్న మాట అన్నింటిలోనూ వస్తుంది - దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు - దేహము అన్న మాట అన్నింటిలో వస్తుంది. దేహ అభిమానము విశేషంగా ఎందులో వస్తుంది? దేహీ అభిమానము నుండి దేహ అభిమానములోకి తీసుకు వస్తుంది, ఆ ముఖ్య కారణము, పాత సంస్కారము ఇప్పటి వరకు క్రిందకు తీసుకు రావడాన్ని బాప్‌దాదా పరిశీలించారు. సంస్కారాలను తొలగించుకున్నారు కానీ ఏదో ఒక సంస్కారము నేచర్‌గా ఇప్పటికీ పని చేస్తుంది. ఎలా అయితే దేహ అభిమానము అన్న నేచర్(స్వభావము) నేచురల్‌గా(సహజంగా) అయిపోయిందో అలా దేహీ అభిమానము అన్న నేచర్ నేచురల్‌గా కాలేదు. మేము సమాప్తం చేసాము అని అంటారు కానీ పూర్తిగా బీజాన్ని భస్మం చెయ్యలేదు. అందుకే సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ దేహ అభిమాన సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. కావున ఇప్పుడు దేహ భానము అన్న నేచర్‌ను పవర్ఫుల్ దేహీ అభిమాని యొక్క శక్తితో వంశంతో సహా నాశనం చెయ్యాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము అనుకోలేదు కానీ అప్పుడప్పుడూ వచ్చేస్తుంది అని పిల్లలు అంటారు. ఎందుకు వస్తుంది? అంశము ఉంటేనే వంశమై బయటకు వస్తుంది. కావున ఇప్పుడు శక్తి స్వరూపులుగా కావలసిన అవసరము ఉంది. ఇందుకు ఆధారము - ఏ స్వరూపంలోనైనా అంశమాత్రంగానైనా పాత దేహ భాన సంస్కారము ఉండిపోలేదు కదా అని పరిశీలించుకోవడము. అది అనంతమైన వైరాగ్య వృత్తితోటే సమాప్తం అవుతుంది. సేవను చూసి, విని బాప్‌దాదా సంతోషిస్తున్నారు కానీ ఎలాగైతే సేవా దృశ్యము, స్థితి లోకులకు కనిపిస్తుందో, సేవ అనుభవమవుతుందో, అలాగే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం ఉండాలి అని బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజుల్లో సేవ ద్వారా మీ ప్రశంస పెరుగుతుంది, ప్రకృతి మీకు దాసి అవుతుంది. అనుభవం చేసుకుంటారు, సాధనాలు పెరుగుతాయి కానీ అనంతమైన వైరాగ్య వృత్తితో సాధనాలు మరియు సాధన మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. ఎలా అయితే మీరు ప్రవృత్తిలో ఉండేవారికి ఉదాహరణ ఇస్తారు కదా, అన్నీ చేస్తూ కూడా కర్మయోగిలా, కమల పుష్ప సమానంగా ఉండండి అని, అలాగే మీరందరూ కూడా సేవ చేస్తూ, సాధనాలు లభిస్తున్నప్పటికీ, సాధనాలు మరియు సాధనలో బ్యాలెన్స్‌ను ఉంచాలి. కావున ఇప్పుడు సేవతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తిని ఎడిషన్ చేయడం అవసరము. నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేష ఆత్మలు అని అనుభవం చేసుకోవాలి. కేవలం యోగంలో కూర్చున్నప్పుడే కాదు, భాషణ చేసే సమయంలోనే కాదు, నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకంలో శాంతి, శక్తి, సంతోషాల అనుభూతి జరగాలి ఎందుకంటే సమయానుసారంగా ఇప్పుడు సమయం మారుతూ ఉంటుంది.
మరి బాప్‌దాదా అయితే సమయానుసారంగా సూచనను అయితే ఇచ్చారు కానీ ఈరోజు విశేషంగా బాప్‌దాదా ఒకటి, అనంతమైన వైరాగ్య వృత్తి వైపు సూచనను ఇస్తున్నారు, ఇందుకోసం దేహీ అభిమానానికి విఘ్నంగా ఉన్న దేహ అభిమానమును పరిశీలించుకోండి. అనేక రకాల దేహ అభిమానాల అనుభవం ఉంది, వీటిని పరివర్తన చెయ్యండి. రెండవ విషయము, బహుకాలం కోసం స్వయం గురించి ఆలోచించండి. బహుకాలపు అభ్యాసము కావాలి. బహుకాలపు పురుషార్థము, బహుకాలపు ప్రాలబ్ధము. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అటెన్షన్‌ను తక్కువగా ఇస్తే అంతిమ కాలంలో బహుకాలము జమ చేసుకోలేము. టూ లేట్ బోర్డ్ వచ్చేస్తుంది. కావున బాప్‌దాదా ఈరోజు వచ్చే సంవత్సరానికి హోమ్‌వర్క్‌ను ఇస్తున్నారు. ఈ దేహ అభిమానము అన్ని సమస్యలకు కారణం అవుతుంది. పిల్లలు రమణీకమైనవారు కదా, సమయానికి తయారైపోతాము బాబా అని పిల్లలు బాబాకే ధైర్యం చెప్తారు. సమయము మీ టీచరా అని బాప్‌దాదా అడుగుతున్నారు. సమయానికి సరిగ్గా అయిపోతాము అంటే అప్పుడు మీ టీచరు ఎవరైనట్లు? మీ క్రియేషన్ అయిన సమయము మీకు టీచర్ అయితే బాగుంటుందా? కావున సమయాన్ని మీరు సమీపంలోకి తీసుకురావాలి. మీరు సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చేవారు. సమయానికి ఉండేవారు కాదు. సమయాన్ని టీచర్‌గా చేసుకోవద్దు.
మరి బాప్‌దాదా ఈరోజు పదే పదే ఈ సూచననే ఇస్తున్నారు - స్వయాన్ని పరిశీలించుకోండి, పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి మరియు పరివర్తన తీసుకురండి. బహుకాలపు పరివర్తన, బహుకాలపు ప్రాలబ్ధానికి అధికారిగా చేస్తుంది. ఇప్పటివరకు ఢీలా ఢీలా పురుషార్థీలే అయినా కానీ లాస్ట్ నంబర్ పిల్లలపై కూడా బాబాకు స్నేహము ఉంది. స్నేహము ఉంది కనుకనే బాబా పిల్లలుగా అయ్యారు, బాబాను గుర్తించారు, నా బాబా అని అయితే అంటారు అందుకే సమయానికి విడిచిపెట్టకండి. సమయము రాదు, సంపూర్ణత యొక్క సమయాన్ని మనము సమీపంగా తీసుకురావాలి. బాప్‌దాదా యొక్క విశ్వ పరివర్తనా కార్యంలో మీరందరూ సహచరులు. ఒంటరిగా బాబా ఈ కార్యాన్ని చెయ్యలేరు. పిల్లల తోడు కావాలి. ముందుగా పిల్లలు, ముందు పిల్లలు అని బాబా అంటారు. మరి వచ్చే సంవత్సరంలో రావాలంటే ఈ హోమ్‌వర్క్ చేసి పెట్టండి! చేస్తారా? చేతులెత్తండి. అచ్ఛా. వెనుకవారు కూడా చేతులెత్తుతున్నారు.
చూడండి, ఈరోజు సంఖ్య పెరిగిపోయింది కావున బాప్‌దాదా బిడ్డకు సూచన ఏమి ఇచ్చారంటే వెళ్ళి చూసి రండి, ఎక్కడెక్కడ పడుకున్నారు, ఎలా లైన్లో తింటున్నారు అని. పెద్ద లైన్ ఉంది. కానీ అందరి ముఖాలలో సంతోషము ఉంది. మధువనంలో అయితే ఉన్నారు కదా. కానీ ఈ సంతోషాన్ని మధువనంలోనే వదిలి వెళ్ళకండి. మీతో పాటు తీసుకువెళ్ళండి. బాప్‌దాదా వతనంలో కూర్చుని మీ అందరూ పడుకోవడం, భోజనం దగ్గర క్యూ అన్నీ చూసారు. ఇప్పుడే రజాయిలు, పరుపుల వర్షం కురవాలి అన్న సంకల్పం బాప్‌దాదాకు కలిగింది. కానీ ఇది కూడా ఆనందాల మేళా. ఎక్కడ లభించినా, ఎలా లభించినా అందరూ మెజారిటీ బాగా పాస్ అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. చప్పట్లు కొట్టండి. కానీ ఈ హోమ్‌వర్క్‌ను మర్చిపోకండి. ఇందులో చప్పట్లు కొట్టడం లేదు. బాప్‌దాదా, విశేషంగా బ్రహ్మా బాబా ఎల్లప్పుడూ పిల్లలను మధువనానికి అలంకారము అని అనేవారు. మీరందరూ మధువనానికి వచ్చారు, బాప్‌దాదా కూడా సాకార రూపంలో ఇంతటి పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. సహనం చేయవలసి వచ్చింది, కానీ ఈ సహనము సదాకాలం కోసం సహనశక్తిని పెంచుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కదా! కష్టం కాలేదు కదా! ఇంకా చూడండి, ఇంతటి పరివారంలో కూడా నీరు లభిస్తూ ఉంది. అందరూ నీటిని ఉపయోగించారు కదా! కొంచెం తక్కువగా ఉంటే శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది కానీ ఈరోజుల్లో గ్రామాల్లో త్రాగడానికి కూడా నీళ్ళు లభించడము లేదు, ఇక్కడైతే మీకు బట్టలు ఉతుక్కోవడానికి కూడా లభించాయి. ఇంత పరివారాన్ని చూసి సంతోషంగా కూడా ఉంటుంది. పూర్తి కల్పంలో ఇంతటి పరివారం ఇంకెవరికీ లేదు అని బాప్‌దాదాకు గర్వంగా ఉంటుంది.
ఎవరైతే మొదటి సారి బాప్‌దాదాను కలుసుకోవడానికి వచ్చారో వారు లేవండి. చూడండి, సగం క్లాస్ మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. వెనుకవారు చేతులెత్తండి. నిల్చోని చూడండి. మొదటిసారి వచ్చిన వారందరికీ బాప్‌దాదా క్రొత్త జన్మకు, జన్మ దిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. లక్ష రెట్లు అభినందనలు అని లోకులు అంటారు కానీ బాబా పదమా పదమ రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు వచ్చేవారికి బాప్‌దాదా సదా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ అవకాశము ఏమిటంటే ఇప్పుడు వచ్చేవారు కూడా ఒకవేళ తీవ్ర పురుషార్థం చేస్తే బాప్‌దాదా మరియు డ్రామా వారికి లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ ఇస్తారు. వీరు కూడా ముందు నంబర్‌ను తీసుకోవచ్చు. అవకాశం ఉంది. ఛాన్సలర్‌గా అవ్వండి. కేవలం అటెన్షన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. బాగుంది, మీ అందరికీ కూడా పరివార వృద్ధి మంచిగా అనిపిస్తుంది కదా. ప్రతి జోన్ వారు టర్న్ అనుసారంగా వస్తారు, మధువన సేవాధారులు కూడా సహయోగులు కానీ మధువన నివాసులు అందరూ మధువనానికి భుజాలు, వీరందరూ మధువనానికి భుజాలు అని దాదీ అనేవారు. క్రిందవారు కానీ, పైన ఉండేవారు కానీ, తోటలోని వారుకానీ, హాస్పిటల్ వారు కానీ, క్రింద ఉండే మధువన నివాసులు కావచ్చు, పైన ఉండే మధువన నివాసులు కావచ్చు, అందరూ మధువనానికి భుజాలు. ఈరోజు మధువనంవారు త్యాగం చెయ్యడం బాప్‌దాదా చూసారు. ఇక్కడకు రావడానికి బదులుగా అందరూ తమ తమ స్థానాలలో కూర్చుని ఉన్నారు, కానీ వారిని బాప్‌దాదా దూరంగా చూడటం లేదు, హృదయంలో ఇమిడి ఉన్నట్లుగా చూస్తున్నారు. నిర్విరామ సేవాధారులుగా అయి సేవలో సహయోగులుగా అయితే అవుతున్నారు. ఈరోజు విశేషంగా మధువనం, దాని సర్వ భుజాలు, అందరికీ బాప్‌దాదా విశేషంగా మధువన నివాసులకు అభినందనలు తెలియజేస్తున్నారు, అభినందనలు, అభినందనలు. చివరి టర్న్, చివరి మునక. చివరి టర్న్ అని అందరూ ఒకరికొకరు చర్చించుకుంటున్నారు, చివరి మునకకు కూడా మహత్వము ఉంటుంది. చూడండి 40 సంవత్సరాలు కూడా పూర్తి కావస్తున్నాయి. 40 సంవత్సరాలలో సేవ ఛాన్స్‌ను తీసుకున్నవారు ఎంతటి అదృష్టవంతులు. సేవ అనగా మేవ(ప్రాప్తి). సేవ చెయ్యడం కాదు, మేవ తినడము. బాబా దృష్టిలో, హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు. బాబా నన్ను చూసారో లేదో అని ఎవ్వరూ అనుకోకండి. బాప్‌దాదా పిల్లలు ఒక్కొక్కరిని దూరదేశంలో ఉన్నా కానీ హృదయ సింహాసనాధికారిగానే చూస్తున్నారు. వెనుక ఉన్నవారు కూడా వెనుక లేరు, బాప్‌దాదా హృదయంలో ఉన్నారు. అనేకులు ఉన్నప్పటికి కూడా సైలెన్స్ ఎంత బాగుందో చూడండి. ఎందుకని? అందరూ స్నేహంలో మునిగి ఉన్నారు. బాప్‌దాదా మరియు పరివార స్నేహ శక్తి అందర్నీ ఆకర్షిస్తుంది. ఇంతటి పరివారము శాంతి శక్తిలో సంతోషాలను జరుపుకోవడము, ఇదే ఈ సైలెన్స్ పరివారపు విశేషత. సీట్ ఎటువంటిది లభించినా కానీ మీరు ఏ సీట్‌పై కూర్చుని ఉన్నారు? వెనుక ఉన్నారు, ప్రక్కన ఉన్నారు, ఎదురుగా లేరు, కానీ ఒక్కొక్కరూ స్నేహము అనే సీట్‌పై కూర్చుని ఉన్నారు. మధువన నివాసులు (భుజాలతో సహా) ఒక్కొక్కరికీ బాప్‌దాదా పదమారెట్ల స్నేహాన్ని ఇస్తున్నారు. ఈరోజు దాదీలకు కూడా మరియు తోడుగా ఉండే నిమిత్తమైనవారికి కూడా బాప్‌దాదా నిర్విరామంగా అయి సేవ చేసినందుకు అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాక ఈ బిడ్డకు, రథానికి కూడా బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. మీ కౌగిలింత చేరుకుంది. చూడండి, ఇది వీరికి చిన్నప్పటి నుండి వరదానము. ఈ బిడ్డకు ట్రాన్స్ యొక్క వరదానము చిన్నప్పటి నుండి ఉంది. వీరిలో ఉన్న సరళత మరియు సహనశీలత కారణంగా ఈ నిమిత్త పాత్ర లభించింది. ప్రతి ఒక్కరిదీ తమ తమ మంచి పాత్ర ఉంది. దాదీలను సంభాళించేవారు, మున్ని-మోహినిలకు కూడా విశేషంగా పెద్ద దాదీకు తోడుగా ఉన్నందుకు బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకా ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారందరికీ అభినందనలు. మరియు సేవాస్థానాలలో టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లకు కూడా ఎక్కడి నుండి వచ్చినా, ఇప్పుడు ఎవరి టర్న్ ఉందో వారైతే వస్తారు, ఆ టీచర్లందరికీ కూడా బాప్‌దాదా అభినందనలు చెప్తున్నారు. టీచర్లు ఎక్కడి నుండి వచ్చినాగానీ, వారికి బాప్‌దాదా ఒక విశేషమైన సేవను గుర్తు తెప్పిస్తున్నారు. ఆ హోమ్‌వర్కు చేయాల్సి ఉంటుంది. టీచర్లకు హోమ్‌వర్క్ ఏమిటంటే సదా టీచర్ స్వయాన్ని బాప్‌దాదాకు సత్యమైన సహవాసిగా, సమీప సహవాసిగా, తమ ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేవారిగా, మిమ్మల్ని ఎవరు చూసినా వీరిని తయారు చేసేవారు ఎవరు! వీరికి కూడా తండ్రి శిక్షకుడు సద్గురువు ఎవరు! అని అనిపించాలి. మిమ్మల్ని చూడకూడదు, బాబాను చూడాలి. ఈ స్వమానంలోనే, ఈ 6-7 మాసాల సమయంలో ఈ హోమ్‌వర్కును చేయాలి, తర్వాత బాప్‌దాదా హోమ్‌వర్క్‌ను అడుగుతారు. ప్రతి ఒక్కరూ ఎంత శాతంలో చేసారు? ఎక్కువ సమాచారాన్ని అడగము, ఎంత శాతంలో ఈ హోమ్‌వర్క్‌ను చేసారు? మీరు కనిపించకూడదు, బాబా కనిపించాలి. ఇందులో అన్ని ధారణలు వచ్చేస్తాయి. మధువనం వారికి కూడా బాప్‌దాదా ప్రియస్మృతులనైతే ఇస్తున్నారు, కానీ నలువైపుల ఉన్న మధువనం వారు కూడా మధువనంలో ఉన్న ఒక్కొక్క రత్నము విశేషంగా బాబాను ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తము అని భావించండి. పూర్తి సమయము మధువనం వారు ఇటువంటి మనసా సేవ, కర్మణ సేవ మరియు అందరినీ తండ్రి సమానంగా తయారుచేసే ఉదాహరణగా తయారై చూపించండి. తండ్రి సమానంగా అయ్యే పటాన్ని స్వయంలో చూపించారా అన్న రిజల్ట్‌ను మధువనం వారు ఇవ్వవలసి ఉంటుంది. వాహ్ బాబా పిల్లలు, వాహ్! అని ప్రతి ఒక్కరి నోటి నుండి రావాలి. మీరందరూ ఏమి చేస్తారు? మీరందరూ స్వయాన్ని నంబరువారీగా కాదు, నంబర్‌వన్‌గా అయ్యే ఉదాహరణగా అయి చూపించాలి. నంబర్‌వారీగా అవ్వడంలో మజా లేదు, అయితే నంబర్‌వన్‌గా అవ్వాలి. నంబర్‌వారీగా అవ్వడము ఏమంత పెద్ద విషయము! మరి అందరూ విన్ మరియు వన్ అన్న రిజల్ట్‌ను వినిపించండి. అచ్ఛా.
అన్ని వైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు మరియు భవిష్యత్తులో రాజ్య సింహాసనాధికారులు, బాప్‌దాదాకు ఇటువంటి అతి గారాల, పదమా పదమరెట్ల భాగ్యశాలీ పిల్లలకు, సదా తమ నయనాల ద్వారా ఆత్మికతను అనుభవం చేయించేవారికి, ముఖము ద్వారా అదృష్టవంతులు, మనసు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వీరికున్న సంతోషం ఇంకెక్కడా ఉండదు అని అందరూ అనుభవం చెయ్యాలి మరియు అందరూ ఈ పాఠాన్ని నేర్చుకుని వెళ్ళాలి. ఇలా బాబా ప్రతి సంతానము తమ ద్వారా బాబాను, నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తారు కానీ నయనాలు మరియు ముఖము ద్వారా తండ్రిని సాక్షాత్కారం చేయించేవారు, ఇటువంటి నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరైతే ఉత్తరాలు పంపారో, ఈ-మెయిల్ చేసారో, అందరివీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. మీరు ఎప్పుడు పంపారో ఆ సమయమే అవి బాబా వద్దకు చేరుకున్నాయి. (ఎదురుగా కూర్చున్న వారందరితో) మీరెవరైతే పంపారో, ఆ సమయమే చేరుకున్నాయి. అందుకే చాలా-చాలా అభినందనలు. దేశ విదేశాలలోని పిల్లలందరికీ బాబా హృదయ స్నేహానికి రెస్పాండ్ అవుతున్నారు. నలు వైపుల ఉన్న పిల్లలకు బాప్‌దాదా పదమారెట్లు హృదయపూర్వక అనురాగము, హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు, అందరికీ నమస్తే చేస్తున్నారు. అచ్ఛా - ఈరోజు ఎవరి టర్న్?
ఈస్టర్న్ జోన్, నేపాల్, తమిళనాడు (బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం):- (టీచర్లు కిరీటం ధరించి ఉన్నారు) అచ్ఛా - ఈ జోన్లో ఇతర జోన్లు కూడా కలిసి ఉన్నాయి. అయితే నేపాల్ వారు చేతులెత్తండి. అచ్ఛా - చెన్నై వారు, తమిళనాడు వారు చేతులెత్తండి. అచ్ఛా. అన్నిటినీ కలిపి ఈస్టర్న్ జోన్ అని అంటారు. జ్ఞాన సూర్యుడు ఉదయించిన వైపు. అంటే జ్ఞాన సూర్యుని ప్రభావంతో ఉన్న శక్తిశాలి ధరిణి. భారతదేశంలోనే బాబా ఎందుకు వచ్చారు అని ఫారెన్ వారు అడుగుతారు కదా. అంటే భారతదేశంలో ప్రభావం ఉంది కదా. ఇటువంటి భారతదేశంలో కూడా ఈస్టర్న్‌లో జ్ఞాన సూర్యుడు ఉదయించారు. కావున ధరణిలో ప్రభావం ఉంది అందుకే ఈ జోన్లో ఇతర జోన్లు కూడా ఉన్నాయి. మంచి, భిన్న భిన్న విధాలుగా సేవను చేస్తున్నారు. ఇప్పుడు బాప్‌దాదా ఏదైనా అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రతి జోన్‌వారు విశేషంగా తమ వి.ఐ.పిలను తయారు చెయ్యండి అని బాప్‌దాదా ముందుకూడా చెప్పి ఉన్నారు. కానీ కేవలం స్నేహి, సహయోగిగా కాదు, సేవలోని ప్రతి కార్యంలో తోడుగా ఉండాలి, కేవలం సహయోగిగా కాదు. తోడుగా కూడా ఉండాలి, సహయోగిగా కూడా ఉండాలి, మైక్ కూడా, ఇటువంటి లిస్ట్‌ను ఇప్పటి వరకు కొన్ని కొన్ని జోన్లు ఇచ్చాయి కానీ మిక్స్ వి.ఐ.పిలు ఉన్నారు. వారస క్వాలిటీకు దగ్గరగా ఉండే వి.ఐ.పిలుగా ఉండాలి. ప్రాక్టికల్‌గా వారసులుగా కాకపోయినా కానీ, సరెండర్ కాకపోయినా కానీ క్వాలిటీ వారసులుగా ఉండాలి. ఇటువంటి గ్రూప్ బాప్‌దాదా వద్దకు రాలేదు. రెండు, నాలుగు పేర్లు విడిగా పంపారు కానీ పేరు వచ్చి, ఆ పేరును విశేష కమిటీ పాస్ చేస్తే అప్పుడు ఆ గ్రూప్‌ను బాప్‌దాదా విశేష కార్యంలో ఉంచుతారు. అయినప్పటికీ వృద్ధి-విస్తారము మంచిగా ఉన్నాయి. వీరికి బెంగాల్, బీహార్ అని పేరు పెడ్దాము, ఇది కూడా టైటిల్ ఇవ్వడము. బీహార్‌లో బహార్(ఆనందం) వచ్చింది అన్న ఫోటో వచ్చింది. ఎప్పటి నుండైతే అలజడి జరిగిందో (వరద వచ్చింది) ఆ ఏరియాలో సెంటర్లు తెరుచుకున్నాయి అని మంచి సమాచారాన్ని వినిపించారు. ఇందుకు అభినందనలు. బెంగాల్ వారు కూడా చుట్టుప్రక్కల పెరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏ హోమ్‌వర్క్ అయితే ఇచ్చామో అందులో నంబర్‌వన్‌గా అవుతారు కదా. ఇకపోతే సేవా క్షేత్రంలో నలువైపుల ఉన్న శ్రమను, ప్లాన్‌ను బాప్‌దాదా చూస్తూ ఉంటారు మరియు సంతోషిస్తూ ఉంటారు. ఢిల్లీలో కూడా ఇప్పుడు అయింది కదా. ఇలా ఏదో ఒక నవీనతను తీసుకురండి. విఘ్నాలు వచ్చినా కానీ యోగ శక్తితో కవర్ చేసారు. ఇలా చిన్న-పెద్ద చిన్న చిన్న ప్రోగ్రామ్‌లను చేస్తూ ఉండండి. ఒకే సమయంలో ఒకే టాపిక్‌పై ప్రతి జోన్లో, భారతదేశంలో, విదేశంలో జరగాలి అని బాప్‌దాదా ఈ సంవత్సరానికి ఇచ్చిన ప్లాన్ యొక్క రిజల్ట్ కూడా బాప్‌దాదా వద్దకు వచ్చింది. ఎంతోమందికి ఉల్లాస ఉత్సాహము కూడా ఉంది, మీటింగ్‌లో దీనికి ప్లాన్ వేస్తారు. ఇది కూడా బాగుంది. ఎలా అయితే ఢిల్లీలో మీడియాలో ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పటి నుండి రిజల్ట్ ఉంది కదా. ఎన్నో చోట్ల స్టూడెంట్లు తయారయ్యారు. ఇది రిజల్ట్. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పట్టణంలో లేక జోన్లో చెయ్యవచ్చు. ఏదో ఒక ప్రోగ్రామ్ సమయంలో మీడియా ద్వారా నాలుగు వైపుల చూపించండి, ఎవరైనా ఇటువంటి ఏర్పాటును చెయ్యండి. ఎందుకంటే ఇంట్లో కూర్చునే చూడటానికి లభిస్తే మీ ఫిర్యాదు కూడా పూర్తవుతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మిగతా ఖర్చుల్లా కొంచెం ఖర్చు పెట్టండి, మీడియా ద్వారా కూడా నలువైపుల చూడాలి, ఈ ఏర్పాటును కూడా చెయ్యడం మంచిది, నలువైపుల ఉన్న మీడియా వారు మీ ఫంక్షన్ చూసి, శుభ భావన చూసి మీకు తోడుగా కూడా నిలువవచ్చు. తోడుగా కాకపోయినా, సహయోగిగా అయితే అవుతారు. కావున సేవ చెయ్యండి కానీ సేవతో పాటు తమ అనంతమైన వైరాగ్యమును పరిశీలించుకోవడము తప్పకుండా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. అచ్ఛా, జోన్‌కు అభినందనలు. అందరినీ చూడండి, ఎంతమందికి యజ్ఞ సేవకు ఛాన్స్‌ను ఇచ్చారు. మంచిగా ఉంది కదా. మంచిగా ఉందా? యజ్ఞ సేవకు వేయి రెట్లు ఎక్కువగా పుణ్యం తయారవుతుంది. ఎవరైతే సత్యమైన హృదయము, పెద్ద మనసుతో సేవ చేసేవారిగా ఉన్నారో వారికి వేయి రెట్లు ఎక్కువగా పుణ్య ఖాతా జమ అయింది. బాగుంది, సంఖ్య కూడా బాగుంది. ఇకపోతే ఏదైనా క్రొత్త పనిని చేసి చూపించండి. అచ్ఛా. అందరికీ, జోన్లో వచ్చిన ఒక్కొక్క భాగ్యశాలీ ఆత్మకు బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- (40 దేశాల నుండి 300మంది సోదరసోదరీలు వచ్చారు) మీరు విదేశీయులా? కానీ అందరికంటే పెద్ద విదేశీయుడు ఎవరు? బాప్‌దాదా అయితే మీకన్నా పెద్ద విదేశీయుడు. ఎంత దూరం నుండి వస్తారు. మీ ఏరియానైతే కొలవచ్చు కానీ బాబా ఏరియాను లెక్కగట్టగలరా? మీకు విదేశాల నుండి దేశంలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? బాప్‌దాదా రావడానికి ఎంత సమయము పడుతుంది? విదేశాలలో కూడా సేవ మరియు స్వ పరివర్తన అల నడుస్తుంది. బాప్‌దాదా ఏ సమాచారమును విన్నారంటే, ఏదో ఒక కారణం చేత ఎవరైతే మధువనానికి రాలేదో, వారికి కూడా తమ తమ స్థానాలలో ట్రైనింగ్ లేక భట్టీ కార్యక్రమాలు పెడ్తున్నారు, ఇది కూడా మంచి విషయము. వారు కూడా మనసు ద్వారా మధువనానికి చేరుకున్నట్లుగా అనుభవం చేస్తారు. మీరు తనువు మరియు మనసుతో చేరుకున్నారు, వారు మనసుతో చేరుకుంటారు. అచ్ఛా, గాయత్రి చేరుకున్నారు. బాగుంది. మంచి అనుభవం జరుగుతుంది. అంకుల్ మరియు ఆంటీల ప్రియస్మృతులు చేరుకున్నాయి. బాప్‌దాదా అయితే ఎప్పుడూ అంటారు, మొదటి వి.ఐ.పి విదేశాలలో నిమిత్తమైనది అంకుల్ ఆంటీలే, ప్రేమ మరియు స్మృతి కూడా బాగున్నాయి. బాప్‌దాదా కూడా ఇటువంటి సేవాధారి పిల్లలకు విశేషమైన కిరణాలను ఇస్తారు. బ్రహ్మా బాబా సాకారంలో కూడా ఇటువంటి గారాల పిల్లలకు రాత్రి మేల్కొని కరెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా బాప్‌దాదా వతనం నుండి పిల్లలకు, స్నేహి పిల్లలకు, సేవాధారి పిల్లలకు కరెంట్‌ను ఇస్తారు, సకాశ్ను ఇస్తారు మరియు సకాశ్ చేరుకుంటుంది.
డబల్ విదేశీయులు డబల్ పురుషార్థీలు. అంతే కదా. డబల్ తీవ్ర పురుషార్థీలు, అలా ఉన్నారు కదా? చేతులెత్తండి. అచ్ఛా. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తీవ్ర పురుషార్థిగా చూడాలని ఆశిస్తున్నారు. పురుషార్థిగా కాదు, తీవ్ర పురుషార్థి. (మురళి అన్నయ్య కూడా చాలా గుర్తు చేస్తున్నారు) బాప్‌దాదా వద్దకు స్మృతి చేరుకుంటుంది. వారు కూడా నిమిత్తమయ్యారు కదా. రజని బిడ్డ కూడా గుప్త రూపంలో లండన్ సెంటర్‌ను తెరిపించడంలో నిమిత్తంగా అయ్యారు. ఇన్‌డైరెక్ట్‌గా మురళి బిడ్డ భాగ్యము తయారయింది. ఇప్పుడైతే పిల్లవాడిగా అయ్యారు. వారు కూడా గుర్తు చేస్తారు. నలువైపుల ఉన్న దేశంవారు లేక విదేశంవారు ఎవరైతే గుర్తు చేస్తున్నారో, బాప్‌దాదా వద్ద ఆ లిస్ట్ పెద్దగా ఉంది. మనస్ఫూర్తిగా నా బాబా అని వస్తుంది మరియు బాప్‌దాదా హాజరవుతారు. మంచిది. అచ్ఛా, వీరు (కువైట్ నుండి వజీహా అక్కయ్య) వచ్చారు, మీ గ్రూప్ ఎక్కడ ఉంది? చూడండి, తోటివారిని కూడా తయారు చేసారు. గారాల పిల్లలను తీసుకువచ్చారు. అచ్ఛా. బాబాకు ఒక్కొక్క బిడ్డపై ఒకరిని మించి మరొకరిపై ప్రేమ ఉంది. పేరు తీసుకోవాలంటే ఎంతమంది పేర్లు తీసుకోవాలి. మా పేరు బాబా హృదయంలో ఉంది అని అందరూ భావించండి. మంచి సేవను చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మిడిల్ ఈస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ధర్మాలకు సందేశమైతే అందాలి కదా.
ఇప్పుడు ప్రతి జోన్ ఒక పురుషార్థాన్ని చెయ్యండి, ఏమి చేస్తారు? ఎవరైనా ఒక నాస్తికుడిని, కఠినమైన నాస్తికుడిని ఆస్తికుడిగా చేసి తీసుకురండి. అప్పుడు వారు, నాస్తికుడి నుండి ఆస్తికుడిగా ఎలా అయ్యాను అని అందరి ముందు వారి అనుభవం వినిపించాలి. పెద్ద సభలో వినిపించాలి. చిన్నవారు కాదు, జనంపై వారి ప్రభావం పడేవారు ఉండాలి. ఎలా అయితే ప్రతి వర్గంలో సేవ చేస్తారు కదా, ఇలా కూడా ఎవరినైనా తయారు చెయ్యండి. అలాగే ఎవరైనా అథారిటీ ఉన్న ధర్మంవారిని తయారు చెయ్యండి, సరైన పరమాత్మ పరిచయాన్ని బ్రహ్మా కుమారీలు ఇస్తున్నారు అని వారు తమ అనుభవంలో వినిపించాలి. బ్రహ్మా కుమారీలు చెప్పేది ఎలా రైట్ అవుతుంది? అని వారి నోటి ద్వారానే అథారిటితో కూడిన మాటలు రావాలి. చివరిగా ఒక పాయింట్ మిగిలిపోయింది, గీతా భగవంతుడు ఎవరు? అది కూడా నిరూపణ అవుతుంది కదా. ఇది నిరూపణ అయినప్పుడు భగవంతుడు వచ్చాడు అని అప్పుడు అంటారు. చాలా బాగుంది. మధువనానికి అలంకారంగా వస్తారు, ఇది చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా.
దాదీలతో:- (సభతో) మీరు దూరంగా కూర్చుని ఉన్నా కానీ బాప్‌దాదా మీ అందరినీ కౌగిలించుకుంటున్నాము. వెనుక ఉన్నవారిని ముందుగా కౌగిలించుకుంటున్నాము. స్నేహము ఏమి అనుభవం చేయించలేదు! అచ్ఛా. (డా.నిర్మలతో) మంచి పాత్రను వహిస్తున్నారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
పర్దాదీతో:- (ఈస్టర్న్ జోన్ ఇన్ఛార్జ్) నిమిత్తంగా అయితే అయ్యారు. నిమిత్తంగా అయ్యారు, మీ కారణంగా అందరూ బాబా, బాబా అని గుర్తు చేస్తారు. క్రొత్తగా వచ్చినవారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడరు, బాబాను చూస్తారు. ఇది విశేషమైన వరదానము. అచ్ఛా.
శాంతమణి దాదీతో:- అందరూ తమ తమ పాత్రను సమయానికి మంచిగా వహిస్తున్నారు. కానీ పాతవారిని అందరూ ఏ దృష్టితో చూస్తారు? ఆది సమయం వారు. ఆది సమయానికి మహత్వం ఉంది. కొద్దిమందే మిగిలి ఉన్నారు, కానీ ఆది రత్నాలు కదా. అచ్ఛా.
బృజ్ మోహన్ అన్నయ్యతో:- ఢిల్లీ ప్రోగ్రామ్ బాగా అయింది. ఒకసారి సిస్టమ్ తయారైతే రాబోవు కాలం కోసం కూడా తయారవుతుంది. ఏ కార్యాలు చేస్తున్నారు అని ఇప్పుడు అందరి దృష్టిలోకి వస్తుంది.
ఢిల్లీ టీచర్లు లేవండి. లేచి నిల్చోండి. అచ్ఛా. సేవ చేస్తే మంచిగా అనిపించింది కదా. అందరి ఒకే సంకల్పము తోడుగా నిలిచింది. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది. అనుభవం వచ్చినప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఏ కార్యంలో అయినా సఫలత కావాలనుకుంటే అందుకు మొదటి పునాది అందరి ఏకమతము. అందరి మనసులలో ఉల్లాస ఉత్సాహము ఉండాలి. పేపర్ కూడా అనుభవీగా చేస్తుంది. ఇదే విధంగా సంగఠన శక్తి అన్నిటినీ సహజం చేసేస్తుంది. బాప్‌దాదా మీ ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ ప్రకృతి యొక్క అనుచరులందరి సహకారం కూడా లభిస్తుంది. అభినందనలు.
(ఇప్పుడు దీనికన్నా పెద్ద సభను ఏర్పాటు చేస్తాము, అందులో బాప్‌దాదా కూడా రావాలి) బాప్‌దాదా అయితే ఇప్పుడు కూడా చూసారు. మీరు చూడలేదు. (అజ్మేర్లో కూడా మంచి ప్రోగ్రామ్ జరిగింది) మంచి ధైర్యాన్ని ఉంచారు. ధైర్యమును ఉంచారు కనుక సఫలత లభించింది.
చెన్నై సమాచారమును కూడా విన్నాము. ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారో, చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ రిజల్ట్ మంచిగా ఉంది. (చెన్నై టీచర్లు లేవండి) బాగుంది. బాప్‌దాదా రిజల్ట్ విన్నారు. తక్కువ ఖర్చుతో మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే శివుని పూజ అటువైపు మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్నని మేళా(జ్యోతిర్లింగ మేళా) కానీ రిజల్ట్ మంచిగా ఉంది. ప్రతి జోన్ ఏదో ఒకటి చేస్తూ ఉంది. ఒకసారి ఒకరు చేస్తారు, మరోసారి ఇంకొకరు చేస్తారు కానీ అన్ని జోన్లకు, ఎవరైతే చెయ్యలేదో వారికి కూడా చేసేందుకు ముందుగానే అభినందనలు. అచ్ఛా!
ఓంశాంతి