Search for a command to run...
24 Mar 2009
బాప్‌దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో నింపుకుని కార్యంలో వినియోగించండి, అనుభవంలో అథారిటీలుగా అవ్వండి
24 March 2009 · తెలుగు
ఈరోజు నలువైపుల సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్నమైన పిల్లలను చూస్తున్నాము. దీనితోపాటు పిల్లలు ప్రతి ఒక్కరు ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారు అన్న రిజల్ట్‌ను కూడా చూసాము. ఖజానాలైతే బాప్‌దాదా ద్వారా అనేకమైనవి, అవినాశీగా ప్రాప్తించాయి. అన్నిటికన్నా మొదటిది, అతి పెద్ద ఖజానా - జ్ఞాన ధనము. దీని ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము మరియు పాత ప్రపంచము నుండి ముక్తి, జీవన్ముక్తి స్థితి మరియు ముక్తిధామంలోకి వెళ్ళడము పిల్లలందరికీ ప్రాప్తించాయి. ఒక్క జ్ఞాన ఖజానాయే కాదు, యోగము కూడా ఖజానాయే. దీని ద్వారా సర్వ శక్తుల ప్రాప్తి జరుగుతుంది. దీనితోపాటు ధారణ చేసుకునే ఖజానా ద్వారా సర్వగుణాల ప్రాప్తి జరుగుతుంది. దీనితోపాటు సేవా ఖజానా ద్వారా ఆశీర్వాదాల ఖజానా, సంతోష ఖజానా ప్రాప్తిస్తాయి. అంతేకాక అన్నిటికన్నా అతి పెద్ద ఖజానా - వర్తమాన సంగమయుగ సమయము. ఎందుకంటే పూర్తి కల్పంలో ఈ సంగమ సమయము అమూల్యమైన ఖజానా. ఈ సంగమ సమయములోని ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క క్షణము అతి అమూల్యమైనవి ఎందుకంటే సంగమ సమయములోనే బాప్‌దాదా మరియు పిల్లల మధుర మిలనము జరుగుతుంది. మరే యుగములోనూ పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మిలనము జరుగదు. దీనితోపాటు సంగమ సమయములోనే బాప్‌దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యేందుకు సమయము సంగమయుగమే. ఇతర ఏ యుగములోనూ జమ ఖాతా, జమ చేసుకునే బ్యాంకే లేదు. కేవలం ఒక్క సంగమయుగములోనే ఎన్ని ఖజానాలు జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. సంగమ సమయానికి ఉన్న మహత్వము ఏమిటంటే ఒక్క జన్మలో అనేక జన్మల కోసం ఖజానాలను జమ చేసుకోవచ్చు. కావున ఈ చిన్నని యుగానికి చాలా మహత్వము ఉంది మరియు ఖజానాలు కూడా బాప్‌దాదా ద్వారా పిల్లలందరికీ లభిస్తాయి. బాబా అందరికీ ఇస్తారు కానీ ఖజానాలను జమ చేసుకోవడము పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారంగా చేస్తున్నారు. ఇచ్చే బాబా ఒక్కరే మరియు ఒకే విధంగా అందరికీ ఇస్తారు. ఒకే సమయంలో ఇస్తారు. కానీ ధారణ చేయడంలో ఏమి చూసారు? బాబా అయితే ఒకే విధంగా ఇచ్చారు కానీ ధారణ చెయ్యడంలో ప్రతి ఒక్కరిదీ వారి వారి పురుషార్థం ఉంది ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవడానికి మొదటిది, తమ పురుషార్థంతో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు, రెండవది, సదా స్వయం సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. సంతుష్టత అను విశేషతతో ఖజానాలను జమ చేసుకోవచ్చు మరియు మూడవది, సేవ ద్వారా. ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు సంతోషము ప్రాప్తిస్తుంది కావున సంతోష ఖజానాను ప్రాప్తి చేసుకుంటారు. తమ పురుషార్థము, సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు మూడవది, సేవా పురుషార్థము. ఈ మూడు విధాలుగా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడంలో విశేషంగా సంబంధ సంపర్కాలలోకి వచ్చేటప్పుడు నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభ కామనను ఉంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ సేవలో మరియు సంబంధ సంపర్కాలలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా చాలా సహజంగా జమ కాగలవు.
మరి బాప్‌దాదా అందరి లెక్కలను చూస్తున్నారు. ఏమి చూసారు? నలువైపుల ఉన్న పిల్లలను నంబరువారీగా చూసారు. బాబా ఒక్కరే, ఒకే సమయములో ఇస్తారు కానీ జమ చేసుకోవడంలో మూడు విధాల పిల్లలను చూసారు. ఒక రకం పిల్లలైతే జమ అయిన ఖజానాను తింటారు, జమ కూడా చేసుకుంటారు మరియు తినేసి సమాప్తం చేసేస్తారు. రెండవ రకం, తింటారు, జమ చేసుకుంటారు, ఇంకా జమ చేసుకోవడానికి అటెన్షన్‌ను పెట్టి పెంచుకుంటారు కూడా. ఖజానాలను పెంచుకునేందుకు సాధనము ఏమిటి? పెంచుకునేందుకు సాధనము - ఏ ఖజానా అయితే లభిస్తుందో దానిని సమయానికి వచ్చిన పరిస్థితి అనుసారంగా కార్యంలో వినియోగించడము. ఎవరైతే కార్యంలో వినియోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో వారికి జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో వినియోగించరో వారికి జమ కాదు. కావున సమయానికి స్వ మరియు ఇతరుల కోసం కార్యంలో వినియోగిస్తున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి! ఎంతగా కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే కార్యంలో వినియోగించడం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే అనుభవం అనే అథారిటీ కలుస్తూ ఉంటుంది. కావున ఈ ఖజానాలన్నీ జమ అయి ఉన్నాయా అని పరిశీలించుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. పెంచుకునే సాధనాన్ని సమయానికి కార్యంలో వినియోగిస్తున్నానా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉందా? ఎందుకంటే అన్ని అథారిటీలలోకి అనుభవం యొక్క అథారిటీ గొప్పది అన్న గాయనము ఉంది. మరి ప్రతి ఒక్కరూ తమ ఖాతాను పెంచుకోవాలి. పరిశీలించుకోవాలి ఎందుకంటే పరిశీలించుకునేందుకు ఇదే సమయము. ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అవకాశము ఉంది. తర్వాత అవకాశము కూడా సమాప్తమైపోతుంది. ఖజానాలను పెంచుకోవాలనుకుంటారు కానీ పెంచుకోలేరు.
బాప్‌దాదా ఏమి చూసారంటే ఖజానాలు లభిస్తాయి, ఎంతో సంతోషంగా వాటిని స్వయంలో నింపుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు కానీ ఖజానాలు లభించేటప్పుడు, మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి. రెండు విధాల పిల్లలున్నారు. ఒకరు- వినేవారు, రెండు - నింపుకునేవారు. కొంతమంది పిల్లలు విని చాలా సంతోషపడిపోతారు కానీ వినడం మరియు నింపుకోవడం రెండింటిలో చాలా తేడా ఉంది. నింపుకునేవారు అనుభవీగా అవుతూ ఉంటారు ఎందుకంటే విన్నదానిని తమలో నింపుకుని సమయానికి కార్యంలో వినియోగిస్తూ, ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తూ ఉంటారు, చాలా బాగా వినిపించారు, బాబా చాలా మంచి విషయాలను చెప్పారు అంటారు కానీ నింపుకోకపోతే సమయానికి కార్యంలో వినియోగించలేరు. కావున మీ అందరూ పరిశీలించుకోండి - నింపుకునేవారా? కొంచెం కూడా ఒకవేళ తక్కువగా ఉంటే, నిండుగా లేకపోతే అలజడి జరుగుతుంది. కానీ నింపుకున్నవారు ఫుల్‌గా(నిండుగా) ఉంటారు కాబట్టి అలజడి జరుగదు. అందుకే ఈరోజు బాప్‌దాదా అందరి ఖజానాలను పరిశీలించారు. మూడు విధాల పిల్లలు అని వినిపించాము కదా, ఇప్పుడు నేను ఎవరిని అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఖజానాలను పెంచుకోవడము అంటే సమయానికి కార్యంలో వినియోగించడము. ఎంతగా కార్యంలో వినియోగిస్తూ ఉంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఖజానా ఉన్నా, ఖజానాలకు యజమాని ఖజానాను కార్యంలోకి తీసుకువస్తాడు. ఖజానా మిమ్మల్ని కార్యంలో వినియోగించదు. మరి మీ అందరికీ సర్వ ఖజానాలను బాబా వారసత్వంగా ఇచ్చారు. బాబా ఖజానాలను తమ ఖజానాలుగా చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ అటెన్షన్‌ను ఇవ్వండి. ఎందుకంటే ఎంతైతే ఖజానాలు పరిపూర్ణంగా ఉంటాయో అంతగా పరిపూర్ణ స్థితిలో అచలంగా, నిశ్చలంగా ఉంటారు.
పిల్లలు ప్రతి ఒక్కరు సంపన్నంగా కావాలి, తక్కువగా కాదు అని బాప్‌దాదా కోరుకుంటున్నారు ఎందుకంటే బాబా ద్వారా అవినాశి ఖాతాను జమ చేసుకునే ఈ అవకాశము ఇప్పుడే వీలవుతుంది. అందుకే ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు అంటారు. ఇది సంగమ యుగము గురించే గాయనము. భవిష్యత్తులో అయితే ఏదైతే జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని పొందుతారు. కానీ ప్రాప్తి చేసుకోవడానికి మాత్రం ఇదే సమయము. మరి ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి భండారా ఎంత నిండుగా ఉంది అని వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలుస్తుంది. వారి ముఖము మరియు నడవడిక వికసించిన గులాబి పుష్పంలా ఉంటాయి. బాప్‌దాదా ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖము ద్వారా వీరు ఎంత హర్షితంగా, సంతోషంగా ఉన్నారు అని చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మికత, ముఖము ద్వారా చిరునవ్వు మరియు కర్మ ద్వారా ప్రతి ఒక్క గుణము అందరికీ అనుభవం అవుతాయి. కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోండి.
బాప్‌దాదాకు పిల్లలందరిపట్ల ఉన్న శుభ భావన ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరు అనేక ఆత్మలను ఈ విధంగా ఖజానాలతో సంపన్నంగా చేయాలి. ఈరోజు విశ్వంలోని ఆత్మలందరూ ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే దాతలు బ్రాహ్మణ ఆత్మలైన మీరే. ఎందుకంటే హోలియస్ట్ (అతి పవిత్రమైనవారు), హైయెస్ట్(అతి ఉన్నతమైనవారు) మరియు రిచెస్ట్ ఆత్మలు(అతి ధనవంతులు) మీరే. అందరి ఆత్మలకన్నా మీరే హోలియస్ట్. మీకు జరిగే విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరుగదు. ఇప్పుడు అంతిమ జన్మలో కూడా మీ ఆత్మలకు విధిపూర్వకంగా జరిగే పూజ నిమిత్తమైన ధర్మపితలు మరియు మహాత్ములకు కూడా జరుగదు, వారి స్మృతిచిహ్నాలు తయారుకావచ్చు కానీ విధిపూర్వక పూజ జరుగదు. మీకున్న ఖజానాలు, రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచంలోనే అతి ధనవంతులు), బ్రాహ్మణ ఆత్మలైన మీ ఒక్క జన్మ ఖజానాలు 21 జన్మల వరకు గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే బాబా ద్వారా బాబా వారసత్వము లభించింది. ఎలా అయితే బాబా అవినాశీగా ఉన్నారో అలాగే బాబా ద్వారా లభించిన ఖజానాలు కూడా అవినాశీగా ఉంటాయి. అందుకే రిచెస్ట్ ఇన్ ది వరల్డ్, హోలియస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచంలోనే అతి పవిత్రమైనవారు).
మరి అందరూ స్వయాన్ని ఇటువంటి విశేషమైన సేవాధారిగా భావిస్తున్నారు కదా! ఈనాటి సమయానుసారంగా విశ్వాత్మలకు ఆవశ్యకమైనదేమిటో తెలుసు కదా! ఈరోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహము యొక్క ఆవశ్యకత ఉంది. ఆత్మిక స్నేహమును కోరుకుంటున్నారు కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఇప్పుడు సమయానుసారంగా దాతలుగా అవ్వండి. మనసు ద్వారా శక్తులను ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానమును ఇవ్వండి మరియు కర్మణ ద్వారా గుణదానాన్ని ఇవ్వండి. బ్రహ్మా బాబా అంతిమంలో మూడు మాటలను అందరికీ బహుమతిగా ఇచ్చారు. గుర్తుంది కదా! ఈ మూడు మాటలను ఒకవేళ సేవలో వినియోగించినట్లయితే అనేక ఆత్మలను సంతుష్టపరచగలరు. ఆ మూడు మాటలు - నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి. మనసు ద్వారా నిరాకారి, వాచ ద్వారా నిరహంకారి మరియు కర్మణ ద్వారా నిర్వికారి. ఈ మూడు మాటలను సేవలో వినియోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొంచెం హృదయపూర్వక ఆనందము, సుఖము యొక్క ప్రాప్తి జరగాలి, అందరూ నిరాశతో ఉన్నారు మరియు మీరు విశ్వానికి ఆశా సితారలు. బాప్‌దాదా పిల్లలందరినీ బాబా యొక్క ఆశా సితారలుగా చూస్తారు. కేవలం నమ్మకమైన సితారలుగా కాదు, ఆశలను పూర్తి చేసే ఆశా సితారలు.
బాప్‌దాదా వద్దకు పిల్లల స్నేహము సదా చేరుకుంటుంది. అన్నిటికన్నా సహజమైన పురుషార్థము ఏమిటి? భిన్న భిన్న పురుషార్థాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా సహజమైన పురుషార్థము - స్నేహము. స్నేహములో కష్టము కూడా ప్రేమగా మారిపోతుంది. బాబాకు స్నేహితునిగా కావడము అంటే సహజ పురుషార్థము చేయడము. మీరందరూ స్వయాన్ని స్నేహితునిగా భావిస్తున్నారా, అప్పుడప్పుడూ కాదు, సదా స్నేహి. ఎవరైతే స్వయాన్ని సదా స్నేహ సాగరంలో మునిగి ఉన్నట్లుగా భావిస్తున్నారో, సదా మరియు స్నేహ సాగరంలో మునిగి ఉండటము, మునిగి లేచేవారు కాదు, మునిగి ఉండేవారు. స్నేహ సాగరంలో మునిగి ఉన్నాము అని భావిస్తున్నారా, అలా స్వయాన్ని భావించుకునేవారు చేతులెత్తండి. సదా? సదా అన్న మాటను అండర్లైన్ చెయ్యండి. చేతులెత్తండి, సదా, సదా? చేతులైతే బాగా ఎత్తుతారు. చేతులను చూసి బాప్‌దాదా సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యమును ఉంచుతారు. ఒకవేళ తక్కువైనా చేతులెత్తాము అని గుర్తుకు వస్తుంది ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలు ఒక్కొక్కరిపై అతి స్నేహము ఉంది. ఎందుకని? ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆత్మ అనేక సార్లు స్నేహిగా అయింది, ఇప్పుడు కూడా అవుతుంది మరియు ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహిగా అవుతాయి. మేమే ప్రతి కల్పమునకు అధికారీ ఆత్మలము అన్న నషా ఉందా, సంతోషము ఉందా?
బాప్‌దాదా ఇటువంటి అధికారీ ఆత్మలను చూసి హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సదా నిర్విరామంగా అయ్యి ఎగురుతూ ఉండండి. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే స్వ స్థితిని తారుమారు చేసుకోవద్దు. స్వ స్థితి ముందు పరిస్థితి ఏమీ చెయ్యలేదు. అచ్ఛా.
మొదటిసారి ఎవరు వచ్చారు, వారు చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాప్‌దాదాకు పిల్లలు ఒక్కొక్కరిని చూసి చాలా గర్వంగా ఉంటుంది, వాహ్ నా పిల్లలు వాహ్! ఎలా అయితే మీరు స్వతహాగా హృదయంలో వాహ్ బాబా వాహ్! నా బాబా వాహ్! అని పాట పాడుతారో అలాగే బాబా కూడా పిల్లల కోసం వాహ్ ప్రతి ఒక్క పిల్లలు వాహ్! అని పాడుతూ ఉంటారు ఎందుకంటే బాబాకు కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు, ఒక్కొక్కరు విశ్వం ఎదుట మహాన్‌గా ఉన్నారు. కావున బాబా కూడా వాహ్ పిల్లలు వాహ్! అని పాట పాడుతూ ఉంటారు. వాహ్ వాహ్ కదా! వాహ్! వాహ్! పిల్లలు కదా! వాహ్!వాహ్! పిల్లలు, చేతులెత్తండి.
మేము వాహ్ వాహ్! పిల్లలము అని సదా గుర్తుంచుకోండి. పురుషార్థీలే కావచ్చు కానీ వాహ్!వాహ్! పిల్లలు, బాబాకు వాహ్! వాహ్! పిల్లలు. బాబాతోటే వెళ్తారు. ఉండిపోరు కదా! పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహపు ఒడిలో తోడుగా తీసుకువెళ్తాము అని బాబా అంటారు. మరి తయారుగా ఉన్నారా! తయారుగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా? తోడుగా వస్తారు ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది, ప్రతిజ్ఞను పాటించేవారు మీరు.
ఇప్పుడు మీ ఫరిశ్తా రూపాన్ని మీరు ఇమర్జ్ చేసుకోవాలని బాప్‌దాదా కోరుకుంటున్నారు. నడుస్తూ తిరుగుతూ ఫరిశ్తా డ్రెస్ వారిగా అనుభవం చేయించండి. బాప్‌దాదా డ్రిల్‌ను వినిపించారు కదా. వస్త్రాన్ని మార్చుకునే అలవాటైతే ఉంది కదా! ఎలా అయితే శరీర డ్రెస్‌ను మారుస్తారో అలాగే ఆత్మ స్వరూపమైన ఫరిశ్తాను పదే పదే అనుభవం చెయ్యండి. ఫరిశ్తా డ్రెస్ ఇష్టమే కదా! ఎలా అయితే బ్రహ్మా బాబా అవ్యక్త ఫరిశ్తా రూపంలో వతనంలో కూర్చుని ఉన్నారో అలాగే తండ్రి సమానంగా మీరందరూ కూడా నడుస్తూ తిరుగుతూ ఫరిశ్తా రూపంలో అనుభవం చెయ్యండి ఎందుకంటే ఫరిశ్తా రూపము ఉంటేనే దేవతగా అవుతారు. ఎలా అయితే బాబా యొక్క మూడు రూపాలు గుర్తుంటాయి కదా - తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు - అలాగే స్వయానికి ఉన్న మూడు రూపాలను కూడా గుర్తుంచుకోండి - బ్రాహ్మణ్ సో ఫరిశ్తా మరియు ఫరిశ్తా సో దేవత. ఈ మూడు రూపాలు పక్కాగా ఉన్నాయి కదా! ఒకసారి బ్రాహ్మణ డ్రెస్‌ను ధరించండి, ఒకసారి ఫరిశ్తా, మరోసారి దేవత. ఈ మూడు రూపాలతో త్రికాలదర్శి సీట్లో కూర్చుని సాక్షిగా అయి ప్రతి కార్యాన్ని స్వతహాగా చేస్తూ ఉంటారు. కావున సదా బాబాతో ఉండండి, ఒంటరిగా ఉండద్దు అని బాప్‌దాదా అందరినుండి ఆశిస్తున్నారు. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు ఉన్నట్లయితే తోడుగా ఎలా వెళ్ళగలరు! స్నేహితుడు, స్నేహితుడిని ఎప్పుడూ మర్చిపోలేడు. రోజంతటిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడే బ్రాహ్మణ, ఇప్పుడే ఫరిశ్తా, ఇప్పుడే దేవత. అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ పిల్లలకు ఎవరైతే సదా ఖజానాలతో సంపన్నంగా ఉన్నారో, సదా తమ నడవడిక మరియు ముఖముతో సేవాధారిగా ఉన్నారో, ఎందుకంటే మేము విశ్వ పరివర్తకులుగా అయి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని మీ అందరూ ప్రతిజ్ఞ చేసారు, కావున నడుస్తూ తిరుగుతూ కూడా సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాధారి, విశ్వ పరివర్తకులైన పిల్లలు ప్రతి ఒక్కరినీ తండ్రి ఖజానాలతో నిండుగా చేసే నలువైపుల ఉన్న బాప్‌దాదా పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. అచ్ఛా.
సేవ టర్న్ మహారాష్ట్ర జోన్వారిది:- (అందరూ నో ప్రాబ్లమ్ అన్న కిరీటాన్ని ధరించి ఉన్నారు) అందరూ తమపై కిరీటాన్ని పెట్టుకుని మంచిగా చేసారు. ఎలా అయితే నో ప్రాబ్లమ్ అన్న కిరీటాన్ని ధరించారో అందరి తరఫున “సదా నో ప్రాబ్లమ్ భవ” అన్న ఆశీర్వాదాన్ని ఇస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ మనసు-వాణి-కర్మ-సంగఠనలో సదా నో ప్రాబ్లమ్ వారిగా ఉండండి. ప్రాబ్లమ్ క్షణంలో పరివర్తన అయిపోవాలి. ప్రాబ్లమ్ రూపంలో వచ్చి సంపన్న స్వరూపంలోకి మారిపోవాలి. బాగుంది, దృశ్యం ఎంత బాగుందో చూసారా. సంకల్పము మరియు శ్వాసలో నో ప్రాబ్లమ్. ఎవరైతే కిరీటధారిగా అయ్యారో వారికి అందరి తరఫున అభినందనలు, చప్పట్లు కొట్టండి. అందరూ పెద్ద స్క్రీన్‌పై చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. బాప్‌దాదా నో ప్రాబ్లమ్ అని సంకల్పం చేసినవారికి అనగా బాబా సమానంగా సదా ఉంటాము అన్నారు కాబట్టి బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా. పేరే మహారాష్ట్ర. మహారాష్ట్ర అనగా మహాన్ స్వరూపం ద్వారా మహాన్ సేవను చేసేవారు. ఇప్పుడు మహారాష్ట్ర పెద్ద ప్రోగ్రామ్ ఏమీ చెయ్యలేదు, చాలా సమయము అయింది, ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ చేసి మహాన్ సేవను చేసే పాత్రలో, బాప్‌దాదాకు గుర్తుంది, మహారాష్ట్ర ప్రదర్శని మొదలుపెట్టే మంచి పాత్రను చేసారు, ఇప్పటిదాకా ప్రదర్శని ద్వారా సేవ జరుగుతూ ఉంది. ఎలా అయితే ఈ విశేషమైన బిడ్డ రమేష్ నిమిత్తమయ్యారో, నిమిత్తమయ్యారు ఇప్పటివరకూ అది స్మృతిచిహ్నముగా ఉంది. ఇటువంటి ఏదైనా ఇన్వెన్షన్‌ను ఇప్పుడు మహారాష్ట్ర చెయ్యాలి. చెయ్యాలా? ఏదైనా క్రొత్త విషయము చెయ్యండి. ఎలా అయితే ఢిల్లీవారు ధైర్యమునుంచారో, అలా అందరికీ సందేశమును ఇవ్వాలి. పెద్ద మైదానంలో సందేశాన్ని ఇవ్వండి. వార్తాపత్రికల ద్వారా కావచ్చు, టి.వి ద్వారా కావచ్చు, మీడియా ద్వారా సందేశాన్ని ఇవ్వవలసిందే. ఫిర్యాదు రాకూడదు. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండండి ఎందుకంటే ఆధ్యాత్మికత అవసరము, శాంతి కావాలి అని ఆత్మలు ఇప్పుడు భావిస్తున్నాయి కానీ పాపం వారికి సాధనము లభించడం లేదు. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేవారెవ్వరూ లభించలేదు. అందుకే ప్రతి జోన్ వారు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మధువనంలో ఎలా అయితే ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందో అలా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉండాలి. బ్రాహ్మణుల ప్రోగ్రామ్ కావచ్చు, సందేశమును ఇచ్చే ప్రోగ్రామ్ కావచ్చు, తమ ఉన్నతికి క్రొత్త క్రొత్త ప్రోగ్రామ్‌లు కావచ్చు ఎందుకంటే ఏదైనా క్రొత్త ప్రోగ్రామ్ వస్తే దేశ విదేశాల వారు ఎంతో అభిరుచితో స్వీకరించడం బాప్‌దాదా చూసారు.
బాగుంది. చేస్తూ ఉంటారు మరియు చేస్తూ ఉండండి. అచ్ఛా. ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేస్తారు కదా? ఎంత సమయంలో చేస్తారు? తయారు చెయ్యడానికి ఎన్ని మాసాలు కావాలి? పరస్పరంలో మీటింగ్ చేసుకోండి, తారీఖును ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే ఢిల్లీ మరియు బాంబే రెండు స్థానాలలో మంచి మంచి మహారథి సర్వీసబుల్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ప్రతి జోన్‌లోనూ సర్వీసబుల్ పిల్లలు పెరుగుతూ ఉండటం చూస్తున్నాము. సేవా ప్లాన్లను చేసే అథారిటీలు చాలామంది ఉన్నారు. చిన్న జోన్ కావచ్చు, పెద్దది కావచ్చు కానీ సర్వీసబుల్గా అయ్యారు అందుకే ఇప్పుడు సందడి చేయండి. ఒక ప్రోగ్రామ్ ఎలా చెయ్యండంటే అన్ని జోన్లలో ఒకేసారి అది జరగాలి, దీనితోపాటు మీడియా ద్వారా అనౌన్స్ కావాలి, ఫలానా ఫలానా స్థానంలో ఒకే ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రతి ఒక్క జోన్లో మరియు వార్తాపత్రికల్లో ఈ ఈ స్థానాలలో ప్రోగ్రామ్ జరుగుతుంది అని వేయాలి. అన్ని స్థానాల అడ్రస్ మరియు టాపిక్, టాపిక్ ఒకటే ఉండాలి. ఒకే సమయము ఉండాలి, ఒకే టాపిక్ ఉండాలి, ఎక్కడకు వెళ్ళినా ఒకే టాపిక్ కనిపించాలి. ఇది వీలవుతుంది కదా! వీలవుతుందా? విదేశాలలో కూడా ఇదే తారీఖున ఇదే ప్రోగ్రామ్. అంటే నలువైపుల ఒకటే ఉండాలి. (ఈ సంవత్సరం కూడా పరమాత్మ వరదానాలను ప్రాప్తి చేసుకోవడము అన్న థీమ్‌ను పెట్టుకోవడము జరిగింది) ఈ టాపిక్ బాగుంది, ఏదైనా పరస్పరంలో ఫైనల్ చేసుకోండి. పరస్పరం కలిసి తారీఖు, టాపిక్ మరియు ఎడ్వర్టైజ్ ఎలా చెయ్యాలి, ఇది తయారుచేసి ఇవ్వండి. ఏ టాపిక్‌ను పెట్టుకున్నా అది ముందునుండే బాప్‌దాదాకు ఇష్టము. బాగుంది, ఎందుకంటే ఇప్పుడు కోరికతో ఉన్నారు, ఒకప్పుడు వింటే దూరంగా పారిపోయేవారు, ఇప్పుడు ఏదైనా వినాలని ఆశిస్తున్నారు. వి.ఐ.పిలు కూడా శ్రద్ధ చూపిస్తారు. ఇప్పుడు ఒకే మాట వ్యాపించాలి. నలువైపుల ఎక్కడకు వెళ్ళినా ఇదే వినిపించాలి. అచ్ఛా. బాగుంది, నలువైపుల వృద్ధి కూడా బాగా జరుగుతూ ఉండటం కనిపిస్తుంది, బ్రాహ్మణులు పెరుగుతున్నారు. ఇప్పుడు నంబరువారీగా ఉన్నారు కానీ నంబర్‌వన్‌గా కావాలని బాప్‌దాదా కోరుకుంటున్నారు. నంబరువారీగా కాదు, నంబర్‌వన్. బాగుంది. మహారాష్ట్ర ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ చేసి సేవలో నవీనత వ్యాప్తి చేస్తుంది. బాగుంది. బాప్‌దాదాకు చాలా చాలా మహారథి సర్వీసబుల్ పిల్లలు కనిపిస్తున్నారు. టీచర్లు కూడా చాలా చక్కగా తమ తమ సేవాకేంద్రాలను సంభాళిస్తున్నారు, ఇందుకు అభినందనలు మరియు పదమారెట్లు బాప్‌దాదా ఆశీర్వాదాలను ఇస్తున్నారు.
ధార్మిక వింగ్, స్పోర్ట్స్ వింగ్ :- అచ్ఛా. వీరు ఝండీలు ఊపుతున్నారు. బాగుంది. ఇప్పుడు ఆటలవారు ఆటలోనే సందేశమును ఇవ్వగలిగే ఆటను తయారుచెయ్యండి. ఎలా అయితే ఈ మధ్యలో ఇండియా ఆటలో నంబర్ తీసుకుంటుందో, అలాగే ఆధ్యాత్మిక ఆట ఎలా రావాలంటే ఉదాహరణకు అమెరికాలో గాలిపటాలు ఎగురవేసే కారణంగా మంచి సేవ జరిగింది అని సమాచారము వచ్చింది, ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఈ విధితో లోకులకు సందేశము అందాలని ఆశిస్తుంది. ఇలాగే ఇటువంటి ఆటనేదైనా తయారుచెయ్యండి, దీని ద్వారా నలువైపుల ఆట ద్వారా సందేశం లభించాలి. అర్థమయిందా. ఇటువంటి ఆటను తయారుచెయ్యండి.
ట్రాన్స్‌పోర్టు యొక్క అధికారి బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు:- ఈరోజుల్లో ఇండియాలో ట్రాన్స్పోర్ట్ స్థితి చాలా చెడుగా ఉంది, రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలనుండి ఎలా జాగ్రత్తపడాలి, నడిపించేవారు జాగ్రత్తగా ఉండే విధంగా ఏదైనా తయారు చెయ్యండి. ఏదైనా ఒక విధిని తయారుచెయ్యండి. నడిపించేవారికి ఆ విధిని నేర్పించడం ద్వారా, వినిపించడం ద్వారా వారి మనసు శీతలమై, ఏకాగ్రం కావాలి. దీనిని కొంచెం విస్తారం చేసి నలువైపుల సేవను చెయ్యాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజుల్లో దీని ఆవశ్యకత ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే కార్యాన్ని పరివర్తన చేసి ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రభుత్వానికి చూపించండి. ఈ కార్యం చేయడం ద్వారా ఎటువంటి తేడా కనిపించింది అని చూపించండి. ఈరోజుల్లో ప్రాక్టికల్‌గా చూడాలని ఆశిస్తున్నారు. మరి ఇప్పుడు ఎటువంటి గ్రూప్‌ను తయారుచెయ్యండంటే నడిపించే డ్రైవర్ ప్రభుత్వం ముందు ఉదాహరణను తయారు చేసి చూపించాలి. అప్పుడే అందరి అటెన్షన్ వెళ్తుంది. కోర్స్‌ను చేయిస్తారు, ప్రోగ్రామ్ కూడా చేస్తారు కానీ ఎటువంటి గ్రూప్‌ను తయారు చెయ్యండంటే యాక్సిడెంట్‌ను చేసేవారు పరివర్తన కావాలి. ఎలా అయితే మద్యం త్రాగేవారిని మార్చి చూపిస్తారు కదా అలాగే యాక్సిడెంట్ చేసేవారు పరివర్తన అయి చూపించాలి, ఇటువంటి గ్రూప్‌ను ప్రభుత్వం ముందుకు తీసుకురండి. గ్రామీణ వింగ్ వారు కూరగాయలు మొదలైనవి పండించేటప్పుడు అందులో చెడు వస్తువులు(హానికారకమైన మందులు మరియు ఎరువు మొదలైనవి) వెయ్యకుండా యోగబలం ద్వారా కూరగాయలను తయారుచేస్తూ ఉండటం బాప్‌దాదా చూసారు, అలాగే ప్రభుత్వానికి కూడా ఉదాహరణను చూపిస్తున్నారు. ఇక్కడ ఆబూలో కూడా ఈ అభ్యాసము చేసారని బాప్‌దాదా విన్నారు, ఇటువంటి ఋజువులను ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వానికి ఉన్న సమస్యలో వారికి సహయోగము లభించాలి. లాభము కలగాలి. ఇలా ప్రతి ఒక్క వింగ్ ప్రాక్టికల్ ఋజువును తయారు చెయ్యండి. ఇలా జరుగుతుంది అని వింటాము కానీ ఇటువంటి ప్రాక్టికల్ ఋజువుగా ఉన్న గ్రూప్‌ను ప్రభుత్వం ముందుకు తీసుకురండి. ప్రతి వర్గంవారు మంచి సేవను చేసారు, సేవలో వృద్ధి కలిగింది, అందరూ బిజీ అయిపోయారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్మెంట్కు ఋజువును చూపించాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఒక్కొక్క మినిస్ట్రీలో ఏదో ఒక ఋజువు ఉండాలి. ఎలా అయితే హార్ట్‌కు సంబంధించి ఋజువు ఉంది కదా. కొందరి హార్ట్ ఆపరేషన్ లేకుండానే, మందులు లేకుండానే మంచిగా అయ్యాయి. ఇలా ప్రతి వర్గంవారు తమ ఋజువును చూపించండి. అచ్ఛా. ఇటువంటి ఆటను తయారుచెయ్యండి. బాప్‌దాదా కూడా చూస్తారు.
ఇటువంటి గ్రూప్‌ను తయారుచేసి బాబా ఎదుట ఏ వర్గంవారు రిపోర్ట్ ఇస్తారో బాప్‌దాదా చూస్తారు. ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఉండాలి. ఒకవేళ ఒక్కొక్క మినిస్ట్రీలో ఋజువు ఉన్నట్లయితే స్వతహాగా ఈ వార్త ఒకరి ద్వారా మరొకరికి చేరుతుంది. ప్రభుత్వం దగ్గర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సేవకోసం డబ్బులు కూడా చాలా ఉన్నాయి కానీ ప్రాక్టికల్‌లో ఉపయోగపడవు. సహయోగమును ఇవ్వగలరు. కానీ ఋజువు కావాలి. ఎలా అయితే గ్రామీణ వింగ్వారికి ప్రభుత్వం సహాయం చేసి సాల్వేషన్ను ఇచ్చిందో అలాగే ప్రతి వర్గంవారు ఇలా చూపించాలి. రెండు, నాలుగు గ్రామాలనైతే తయారుచేసారు కదా. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- యూత్ గ్రూప్ కూడా ఉంది, చేతులెత్తండి. అచ్ఛా. డబల్ విదేశీయులు మధువనంలో తమ మరియు తమ తోటివారి ఉన్నతి కోసం ప్రోగ్రాములు మంచిగా చేసారు, రిజల్ట్‌ను కూడా బాప్‌దాదా విన్నారు. అందరూ మధువన వాతావరణంలో మంచిగా రిఫ్రెష్ అయి వెళ్తారు, టీచర్లు కూడా ఎంతో ప్రేమతో కష్టపడుతున్నారు. డబల్ విదేశీయులు స్వయం కూడా లాభాన్ని పొందుతున్నారు మరియు ఇతరులకు కూడా లాభాన్ని చేకూరుస్తున్నారు. ఈ సమాచారాన్ని బాప్‌దాదా విన్నారు మరియు రిజల్ట్‌ను కూడా విన్నారు. బాగుంది. ఇప్పుడు బాప్‌దాదా డబల్ విదేశీయుల ద్వారా, యూత్ కావచ్చు, టీచర్లు కావచ్చు, పిల్లల ప్రోగ్రామ్ కావచ్చు వాటిని విన్నారు. కానీ ఇప్పుడు విదేశీయుల ద్వారా ఎటువంటి ప్రోగ్రామ్ జరగాలంటే భారతదేశంలో ఉన్న వి.ఐ.పిలు, ప్రతి పట్టణంలోని అతి విశేషమైన సంబంధ సంపర్కంలోని వి.ఐ.పిలకు ఇప్పుడు ఇండియాలో ప్రోగ్రామ్ జరగాలి. వి.ఐ.పిలది. ప్రతి ఒక్క దేశంలో ఎవరో ఒక వి.ఐ.పి ఉంటారు, మరి విశేషంగా ఏ ముఖ్య దేశమైతే ఉందో, దానిలోని సంపర్కంలోని వి.ఐ.పిలు, బ్రాహ్మణులు కాదు వి.ఐ.పి, బ్రాహ్మణులదైతే తయారుచేసారు, అది కూడా మంచిది. ఒకవైపు బ్రాహ్మణులది జరగాలి, మరోవైపు వి.ఐ.పిలది జరగాలి. దేశవిదేశాలలోని వారు లాభం పొందుతున్నారు అని మీడియాలో రావాలి. ఇకపోతే సేవనైతే మంచిగా వృద్ధిని చేస్తున్నారు, ప్రతి టర్న్‌లో అనేక దేశాల బ్రాహ్మణులు కలుస్తారు, ఇది కూడా బ్రాహ్మణ పరివారానికి ఒక శోభ. ఇది విశ్వాత్మల ఇంటరెస్ట్ అని దీని ద్వారా ఋజువు అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మిడిల్ ఈస్ట్‌లో సందేశం మంచిగా వ్యాపిస్తుంది. ఇతర ధర్మంవారైనా కానీ ఇంటరెస్ట్ బాగా ఉంది. ఇటువంటి వి.ఐ.పి గ్రూప్‌ను తీసుకురండి, అప్పుడు చాలా బాగుంటుంది. సరేనా. బాగుంది. వీరు ప్రతిజ్ఞను తీసుకున్నారు, రండి (డా.నిర్మల దీదీను బాప్‌దాదా స్టేజ్ మీదకు పిలిచారు) చాలా బాగుంది. దేశ విదేశాలలో ఇండియాలో కూడా మరియు విదేశాలలో కూడా రెండు వైపుల అటెన్షన్‌ను ఇచ్చి తమ బాధ్యతను సంభాళించారు, అందుకే బాప్‌దాదాకు విదేశీ బ్రాహ్మణులపై విశేషమైన గర్వము, విదేశము మరియు దేశము రెండింటి బాధ్యతను సంభాళించారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఇప్పుడు విదేశంవారు ప్రతి దేశంలో ఒకే సమయంలో ఒకే టాపిక్, పూర్తి విదేశాలలోని ముఖ్య పట్టణాలలో బ్రహ్మా కుమారీల ప్రోగ్రామ్ ప్రతి దేశంలో ఒకే సమయానికి జరుగుతుంది అని వ్యాపించాలి. ఇది కూడా పరస్పరంలో కూర్చుని ప్రోగ్రామ్‌ను తయారుచెయ్యండి. దేశంలో కూడా, విదేశంలో కూడా. ఇష్టమే కదా! అచ్ఛా. విదేశంవారు బాప్‌దాదాకు ఒక విషయంలో నచ్చుతారు, ఏ విషయంలో మెజారిటీ, మిక్స్ అయితే అవుతారు కానీ మెజారిటీ తమ హృదయంలో ఏదైనా విషయము ఒకవేళ నియమానికి విరుద్ధంగా జరిగితే స్పష్టంగా చెప్పేస్తారు. ఎక్కువ సమయము మనసులో పెట్టుకోరు, మనసు నుండి వచ్చేస్తుంది. కాబట్టి ఏ విషయమునైనా ఎక్కువ సమయము మనసులో పెట్టుకోవద్దు. ఏదైనా బలహీనతను ఒకవేళ ఎక్కువ సమయము మనసులో పెట్టుకుంటే అది సంస్కారంగా అవుతుంది, నేచర్‌గా(స్వభావంగా) అవుతుంది. అందుకే ఈ సంస్కారము మంచిది, ఏ బలహీనత వచ్చినా దానిని త్వరగా వినిపించేసి పరివర్తన చెయ్యండి. ఇలా చెయ్యడంలో కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, తమ స్థితిని స్పష్టంగా వినిపిస్తారు. ఇది చాలా మంచి విషయము. మిక్స్ అయితే అవుతుంది కానీ మెజారిటీ. ఇకపోతే ఉన్నతి అయితే జరుగుతుంది మరియు ఉన్నతి జరుగుతూనే ఉంటుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా.
దాదీలతో:- మంచిగా నడుస్తుంది, ఇక ముందు కూడా మంచిగా నడుస్తూ ఉంటుంది. పరస్పరంలో కలుసుకుంటూ ఉండండి. ఇతరుల సంస్కారాలను తెలుసుకుని వారినుండి సహాయమును తీసుకుంటూ ముందుకు ఎగురుతూ ఉండండి ఎందుకంటే ప్రతి ఒక్కరి విశేషత వారి వారిది, ఆ విశేషతతో కార్యం తీసుకోండి. నిమిత్తంగా అయినవారిలో ఏ ఒక్క విశేషత లేదు అని అనడానికి లేదు. కానీ ఆ విశేషత అనుసారంగా వారికి సహయోగాన్ని అందించి స్వయం ముందుకు వెళ్ళండి, సంగఠనను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. సరేనా. బాగుంది. ప్రతి ఒక్కరిలోని విశేషత అయితే తెలుసు కదా, ప్రతి ఒక్కరూ తమ తమ విశేషతలను సేవలో వినియోగించాలి. విశేషతలే లేని వారు ఎవ్వరూ లేరు కానీ వారి విశేషతను ముందుంచి వారినుండే కార్యమును తీసుకోండి. ఇకపోతే నడవాల్సిందే, సఫలత అయితే సదా కోసం తయారయ్యే ఉంది. ప్రతి ఒక్కరి తమ-తమ పాత్ర కూడా ఫిక్స్ అయి ఉంది, సఫలత ఉండనే ఉంది. మీరు నిమిత్తమయ్యారు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి సఫలత వరదానంగా లభించి ఉంది. తమ విశేషతను సంగఠిత రూపంలో కార్యంలో వినియోగించండి. సఫలతలో ఒకరికొకరు సహయోగమును ఇచ్చుకుంటూ వాతావరణంలో సఫలతను వ్యాపింపజేయండి. బాగుంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు సంగఠనను పక్కా చేయండి. మీరైతే బాగున్నారు కానీ సంగఠనను మరింత పటిష్టంగా చెయ్యండి, దీనికోసం ఏదైనా ప్లాన్ తయారు చెయ్యండి. ఇప్పుడు టైమ్ కేటాయించండి, ఇది తప్పనిసరి. ఎలా అయితే అందరినీ రిఫ్రెష్ చెయ్యడం అవసరమో అలాగే ఆ సంగఠన కూడా తప్పనిసరి. ఆ తారీఖును ఎలా నిర్ధారించండంటే వస్తూ పోతూ ఉండే నిమిత్తమైన వారందరికీ ఆ తారీఖు తెలియాలి, ఎవ్వరూ కూడా ఆ రోజు మరే ప్రోగ్రామ్‌ను పెట్టుకోకూడదు, అప్పుడే జరుగుతుంది. నెలలో రెండు సార్లయినా చేయండి. లక్ష్యము పెట్టుకుంటారు కదా, సోదరీలు పరస్పరంలో చేసుకోండి లేక పెద్ద మీటింగ్ అయినా చెయ్యండి కానీ ఫిక్స్ చెయ్యండి. ప్రోగ్రామునే ఈ విధితో తయారు చేయండి. వచ్చేపోయే ప్రోగ్రామ్‌ను తమ తమ అనుసారంగా తయారు చేసుకుంటారు కాబట్టి మిస్ అవుతూ ఉంటారు అని వినిపించాము కదా. వచ్చే పోయే ప్రోగ్రామ్‌ను ఈ విధితో తయారు చేసుకోండి. అప్పుడు సరిపోతుంది.
ముగ్గురు పెద్దన్నయ్యలతో:- నిమిత్తమైన మీరు సోదరులు కావచ్చు, సోదరీలు కావచ్చు, ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో, పరివారం నిర్విఘ్నంగా ఉండటానికి ఒక టైమ్‌ను ఫిక్స్ చేసుకోండి. అమృతవేళ బాబాకైతే తమ సమయాన్ని ఇస్తారు, సేవ కోసం కూడా సమయాన్ని ఇస్తారు. ముఖ్యంగా పరివార ఉన్నతి కోసం మరియు యజ్ఞ వ్యవహారాలు ముందుకు వెళ్తూ ఉండాలి, ప్రభుత్వం ద్వారా పరస్పరం నిర్విఘ్నం కావడానికి అమృతవేళ 10 నిమిషాలు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఏ పరిస్థితి అయినా అందరి యోగముతో, అందరూ సమయాన్ని ఇవ్వడము ద్వారా మంచిగా అయిపోతుంది. అందరికీ ఒకే సంకల్పం ఉండాలి, అప్పుడే జరుగుతుంది. మంచిది. పెద్ద మనసు పెట్టుకోండి, వస్తూ ఉంటుంది. ఇది చెయ్యనా, చెయ్యవద్దా, చెయ్యవద్దా, చెయ్యనా అన్నదానిలో సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. ఇప్పుడు సమయము ఉంది, ఒకవేళ మీరందరూ శుభ భావనతో జరగాల్సిందే అన్న ఒక్క సంకల్పమును పెట్టుకోండి, అప్పుడు జరిగిపోతుంది. ఇది వరదానము. నియమానుసారంగా కూడా మరియు మనసు పెద్దదిగా ఉండాలి, కేవలం నియమంగా కాదు, మనసు పెద్దదిగా పెట్టుకుని తర్వాత నియమము. అందరిదీ ఒకే సంకల్పము ఉండాలి, జరగాలి, ఎందుకు-ఏమిటి కాదు, కావలసిందే. మరి ఈ విధితో అంతా సహజమైపోతుంది. కేవలం 10 నిమిషాలు, నిమిత్తమైన మీరందరూ ముఖ్యంగా నిర్విఘ్నంగా, పరివార నిర్విఘ్నం కొరకు 10 నిమిషాలు యోగం చెయ్యాలి అప్పుడు సహజమవుతుంది. ఇప్పుడు సమయముంది, సహజంగా అవుతుంది. కేవలం జరిగిపోతుంది, జరిగిపోతుంది...
ఢిల్లీలో జరగబోయే ప్రోగ్రామ్ గురించిన సమాచారమును ఆశా అక్కయ్య బాప్‌దాదాకు వినిపిస్తున్నారు:- మంచి ధైర్యమును ఉంచారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ప్రోగ్రామ్ సమయంలో ఢిల్లీలోని ప్రతి ఒక్కరూ మేము మనసా సేవను అందించాలి అని భావించాలి. వైబ్రేషన్లను కూడా వ్యాపింపజేయాలి. సెంటర్లో ఉన్నా కానీ నేను సేవలో ఉన్నాను అని భావించాలి. ఆ గంట ఎక్కడున్నా కానీ మా సేవ ఉంది అని భావించాలి అప్పుడు మంచిగా అవుతుంది. (అందరూ చేస్తున్నారు, మీ కృపా దృష్టి ఉండాలి) మీరందరూ కృపా దృష్టిని ఉంచండి.
గాయత్రి అక్కయ్యతో:- మీకు బాప్‌దాదా మరియు అందరి ప్రియస్మృతులు లభిస్తూ ఉన్నాయి. వీరి మనసు ఇక్కడ ఉంది, శరీరం అక్కడ ఉంది.
జర్మనీలో రిట్రీట్ స్థానాన్ని తయారుచెయ్యాలి:- బాగుంది, ఎవరికైనా చూపించండి, తయారైతే మంచిదే.
అతిథులతో:- మీరు మెహమానులా(అతిథులా) లేక మహాన్‌గా అయ్యారా? అతిథులుగా అయితే భావించడం లేదు కదా. మహాన్‌గా అయ్యేవారు. మహాన్‌గా కావలసిందే. ఇక్కడకు రావడము, సంబంధంలోకి రావడము అంటే ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆశీర్వాదము ఉండనే ఉంటుంది.
చూడండి, మీరు ఇక్కడివరకు చేరుకున్నారంటే ఇక్కడకు ఎవరు చేర్చారు, డ్రామా మిమ్మల్ని ఇక్కడకు చేర్చింది. ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత మనసులో ఏమనిపిస్తుంది? మేమూ సేవ చెయ్యాలి. మీరు పరివారానికి తోడుగా నిలిచేవారే కదా, లేక సాక్షిగా ఉన్నారా! సాక్షిగా కాదు తోడుగా నిలిచేవారు. మరి తోడుగా ఉన్నవారు ఏమి చేస్తారు? సహయోగమును ఇస్తారు. మరి అందరూ ఎవరు? స్నేహి, సహయోగి, లక్కీ. బాప్‌దాదాకు కూడా మీ అందరినీ చూసి సంతోషంగా ఉంది. ఏ సంతోషము? తప్పిపోయిన పిల్లలు కలిసారు అన్న సంతోషము. ఇప్పుడు మర్చిపోవద్దు. మీ ఇల్లు కదా. మా ఇంటికి వచ్చాము అని మీకు అనిపించిందా? మరి మీ ఇంటిని ఎప్పుడైనా మర్చిపోతారా? కావున మర్చిపోరు, వస్తూనే ఉంటారు. ఏదైతే లభించిందో దానిని పంచకుండా ఉండలేరు. సరేనా. ఈ సేవను చేస్తూ ఉంటారు. బాగుంది.
ఎవరైతే ఇలా ఇలా ఉన్నారో, మీ పట్టణంలోనే ఇటువంటి గ్రూప్‌ను తయారు చెయ్యండి. కావలసిందే, కేవలం నిమిత్తంగా అవ్వాలి. అందరూ ఒకరిని మించి మరొకరు లక్కీగా ఉన్నారు. ఇక్కడకు రావడము అంటే ఆశీర్వాదాలు లభించడము. ఏ సేవనైతే చెయ్యగలరో దానిని చేస్తూ వెళ్ళండి.
మధ్యమధ్యలో సేవ చేస్తూ ఉంటారు, ఇది మంచిది. చివరకు అందరికీ సందేశము అందుతుంది. ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు. చాలా బాగా చేసారు. వచ్చేసారు, చాలా మంచిది.
మిడిల్ ఈస్ట్ సోదర సోదరీలతో:- (వీరు అరబిక్ భాషలో కోర్స్ చేయిస్తారు) చాలా మంచిది, బాప్‌దాదా నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. వీరు కూడా సేవకు మంచి ఋజువును ఇచ్చారు. ఏ విశేషత అయితే ఉందో దానిని కార్యంలో వినియోగించారు, వినియోగిస్తూ ఉండండి. ఇది వరదానము. ఇటువంటి ఆత్మలు తయారైతే సందేశము వ్యాపిస్తూ ఉంటుంది. చాలా మంచిది. (చిన్న పిల్లవాడితో) వీరు కూడా గుర్తు చేస్తారా! బాబాను గుర్తు చేస్తారా! వీరు తోడుగా ఉన్నారు. మంచి హ్యాండ్, బాబా సందేశాన్ని ఇవ్వడానికి యోగ్యమైన ఆత్మ. చాలా చెయ్యగలరు, ఇంకా ఎక్కువ కూడా చెయ్యగలరు. మీ తోటివారు కూడా మంచిగా ఉన్నారు. ఒకరికొకరు తోడును ఇచ్చుకుంటూ వెళ్ళండి. అచ్ఛా!
ఓంశాంతి