Search for a command to run...
18 Jan 2009
40 సంవత్సరముల అవ్యక్త పాలనకు రిటర్ను - 4 విషయాలు - శుభ చింతకులుగా అవ్వండి, శుభ చింతన చేయండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలమును తయారు చేయండి మరియు జీరో (0) - హీరో స్మృతిలో ఉండండి
18 January 2009 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ సేవా సహచరులైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. ఆది సమయములోని సేవా సహచరులు మరియు ఇంకా ఇతర సేవా సహచరులు తయారై సేవా వృద్ధిని చాలా మంచి రీతిలో చేస్తున్నారు, కావున బాప్‌దాదా తమ సహచరులను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయములో వాహ్! నా విశ్వ పరివర్తక సేవా సహచరులారా వాహ్! అని గానము చేస్తున్నారు.
ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా స్నేహ మాలలను బాప్‌దాదాకు వేస్తున్నారు. మూడు ప్రకారాల మాలలు ఉన్నాయి. ఒకటి-తండ్రి సమానంగా అయ్యేందుకు ఉల్లాస-ఉత్సాహాల మాల, రెండు-చాలా తప్పిపోయిన బంధనములో ఉన్న బంధేలీ గోపికల మాల, వారి మాల అయితే ఉంది కానీ మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన అశ్రువుల మాల కూడా ఉంది. ఒక్కొక్క అశ్రు బిందువు ముత్యము వలె ప్రకాశిస్తూ ఉంది మరియు మూడవ మాల-కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాల.
ఈరోజు అమృతవేళ నుండి అందరిలో విశేష స్నేహము నిండి ఉండటము కనిపిస్తూ ఉంది. బాప్‌దాదా విరాటరూపము వలె బాహువులను విస్తరింపచేసి పిల్లలందరినీ తమ బాహువులలో ఇముడ్చుకున్నారు. ఈరోజు స్నేహముతోపాటు అన్ని పవర్ల విల్‌ను ఇచ్చిన రోజు కూడా. ఒక బిడ్డ చేతిలో చెయ్యి వేసి, విల్ పవర్స్ యొక్క విల్‌ను పిల్లలందరికీ (శక్తి సైన్యం మరియు పాండవులకు) ఇచ్చాము, కొంతమంది పాండవులు కూడా మరియు శక్తులు కూడా గుప్త రూపములో అంతర్ముఖులుగా అయ్యి పురుషార్థములో తీవ్రగతిలో వెళ్తూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. పైకి కనిపించకపోయినా కానీ మంచి పురుషార్థీలు. బాప్‌దాదా ఈరోజు పిల్లల విశేష రూపాన్ని చూసారు, స్నేహమనే సబ్జెక్టు అందరి ముఖాలను మెరిసేలా చేస్తుంది. పిల్లలు జ్ఞానీ ఆత్మలుగా అయితే ఉన్నారు కానీ స్నేహ సబ్జెక్టు ఆవశ్యకము ఎందుకంటే స్నేహీలు శ్రమ తక్కువగా మరియు ప్రేమ అనుభవములో సహజముగా ఉంటారు. స్నేహ శక్తి పర్వతములాంటి ఎటువంటి సమస్యనయినా, పర్వతమును కూడా దూదిలా చేసేస్తుంది. పర్వతమును కూడా నీరులా తేలికగా చేసేస్తుంది. స్నేహము ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణంగా వారు సదా సురక్షితముగా ఉంటారు. సహజమవుతుంది. స్నేహము ద్వారా పరమాత్మ లేక భగవంతుడిని కూడా తమ స్నేహితునిగా చేసుకుంటారు. ఖుదా దోస్త్ అన్న స్మృతి చిహ్నము ఉంది. ఖుదాను (భగవంతుడిని) దోస్త్‌గా (స్నేహితునిగా) చేసుకొని ఎటువంటి సమస్యనయినా స్నేహ సంబంధము ద్వారా సహజము చేసేస్తారు. తండ్రిని తమ సహచరునిగా తయారుచేస్తారు. జ్ఞానము బీజము, కానీ ప్రేమ అనే నీరు బీజములో ఫలాలను ఇస్తుంది, ప్రాప్తి ఫలాలు. కావున తండ్రికి స్నేహీలైన అటువంటి పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యటమును కష్టముగా భావించరు కానీ మర్చిపోవటమును కష్టముగా భావిస్తారు. స్నేహీలు ఎప్పుడూ స్నేహమును మర్చిపోజాలరు. నా బాబా అని అన్నారు, హృదయపూర్వక స్నేహముద్వారా మిగిలిన అన్ని ఖజానాల తాళం చెవి లభించేస్తుంది. కావున బాప్‌దాదా ఇరువురూ అటువంటి స్నేహీల ముందు బాప్‌దాదా కూడా హజూర్ హాజరు అయిపోతారు. స్మృతినైతే అందరూ చేస్తారు కానీ కొందరు కష్టముతో స్మృతి చేస్తారు మరియు కొందరు సదా స్నేహ సాగరములో లవలీనులై పోతారు. ప్రపంచంవారు ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అంటారు, కానీ ఆత్మ పరమాత్మ ప్రేమలో లవలీనమవుతుంది. లీనమవ్వదు కానీ లవలీనమవుతుంది.
మరి ఈరోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు. కష్టము సమాప్తమై ప్రేమ రూపములోకి మారిపోతుంది. బాప్‌దాదా పిల్లలందరి రిజల్టును కూడా చూసారు, మెజారిటీ వారు హోమ్‌వర్కును చేసారు. తండ్రి సమానంగా అయ్యే లక్ష్యమును పదే-పదే రివైజ్ కూడా చేసారు, రియలైజ్ కూడా చేసారు. 75 శాతం పిల్లల రిజల్టు మంచిగా ఉంది. తండ్రి సమానంగా అయితే అవ్వవలసే ఉంది, ఎటువంటి తుఫానులు వచ్చినాగానీ, ఉన్నదే కలియుగ సమాప్తి సమయము, కావున తుఫానులైతే వచ్చేదే ఉంది. పరివర్తన సమయము కదా, కానీ పిల్లలైన మీకొరకు తుఫానేంటి! తుఫాను తుఫాను కాదు కానీ తోఫా (కానుక) ఎందుకంటే బాప్‌దాదా వరదానీ హస్తము పురుషార్థీ పిల్లల శిరస్సుపై ఉంది. ఎవరైతే దృఢ సంకల్పమును చేసారో అనగా దృఢత తాళం చెవిని కార్యములో వినియోగించారో వారికి ఇప్పటి రిజల్టు ప్రమాణంగా సఫలత కూడా ప్రాప్తించింది కానీ సదాకాలమునకు తుఫానును తోఫాగా చేసి, సమస్యకు సమాధాన రూపమునిచ్చి ముందుకు వెళ్తూ ఉండండి. బాప్‌దాదా ఇప్పటి రిజల్టుకు సంతోషించారు. ఏదైతే యోగ తపస్యను చేసారో అందులో తయారవ్వవలసిందే అన్న లక్ష్యమును దృఢంగా ఉంచారు.
40 సంవత్సరముల అవ్యక్త పాలన పూర్తయ్యింది. మరి 40 సంవత్సరములలో మొదట ఏమొస్తుంది - బిందువు, జీరో. నేను హీరోను, సత్యమైన హీరోను, గొప్ప హీరోను మరియు హీరో పాత్రధారిగా అయ్యి ప్రతి కార్యమును హీరో సమానంగా చెయ్యాలి అని జీరో స్మృతినిప్పిస్తుంది. కావున జీరో, హీరో - ఇవి సదా గుర్తుండాలి. మిగిలిన నాలుగు ఏవైతే ఉన్నాయో, వాటిలో నాలుగు విషయాలు నేచురల్ జీవితములో చేయాలి, దృఢతాపూర్వకముగా చేయాలి, చేస్తారా? తయారుగా ఉన్నారా? ఎటువంటి పేపరు వచ్చినాగానీ నాలుగు విషయాలు తమ జీవితములో చేయాల్సిందే. పక్కా? పక్కా? వెనుక ఉన్నవారు, పక్కానే కదా? కచ్చాగా ఉన్నవారిని మాయ తినేస్తుంది కావున పక్కాగా ఉండండి. మొదటి విషయము - సదా శుభచింతకులు, ఎవరి బలహీనతను చూసినా లేక విన్నా దయాహృదయులై, శుభచింతకులై వారికి సహయోగమును ఇవ్వవలసిందే. బలహీనతను చూడకూడదు కానీ సహయోగమునైతే ఇవ్వవలసిందే. వీరినే శుభచింతకులు అని అంటారు. దృఢంగా ఉంటారు కదా! ఆధారమునిచ్చే దాతలు, దయాహృదయులై సహయోగమునివ్వండి. వారినుండి దూరంగా తొలగటము లేక అసహ్యించుకోవటము చెయ్యకూడదు. క్షమించండి. పర వశులై ఉన్నవారిని ద్వేషించుకోవడం జరగదు, ఆధారమును ఇవ్వడం జరుగుతుంది. కావున శుభచింతకులు. రెండవది శుభచింతన. మెజారిటీ పిల్లలలో అప్పుడప్పుడు చాలా వ్యర్థ సంకల్పాలు నడవటమును ఈరోజుల్లో బాప్‌దాదా చూసారు. జమ చేసుకొన్న తమ శక్తులన్నీ ఈ వ్యర్థ సంకల్పాలలో వ్యర్థముగా పోతాయి. కావున శుభచింతన యొక్క, స్వమానము యొక్క ఏదో ఒక టైటిల్‌ను మనస్సుకు హోమ్వర్కుగా ఇవ్వండి, మనస్సు యొక్క టైమ్‌టేబుల్‌ను తయారు చేయండి, కర్మకు చెందిన టైమ్‌టేబుల్‌ను చేస్తారు కానీ మనస్సు యొక్క టైమ్‌టేబుల్‌ను తయారు చేయండి. అమృతవేళ మిలనము చేసిన తరువాత మనస్సుకు ఏదో ఒక స్వమానమును ఇవ్వండి. ముందు వినిపించినట్లుగా 12-13 సార్లు అయితే అందరికీ సమయము లభిస్తుంది, అందులో రియలైజ్ కూడా, రివైజ్ కూడా చేసినట్లయితే మనస్సు బిజీగా ఉండటం వలన వ్యర్థ సంకల్పాలలో సమయము పోదు, శ్రమ పడవలసిన అవసరము ఉండదు, ప్రతి సమయము, సంగమయుగపు ఆనందాల యుగము ఏదైతే ఉందో ఆ ఆనందములో ఉంటారు. కావున శుభచింతన రెండవదిగా వినిపించాము. చెక్ (పరిశీలన) చేసుకోండి మరియు ఛేంజ్ (పరివర్తన) అవ్వండి. మూడవది - శుభ వృత్తి. అశుభ వృత్తి కూడా వాయుమండలములో అశుద్ధతను వ్యాపింపచేస్తుంది కావున శుభ వృత్తి. నాల్గవది - శుభ వాయుమండలమును తయారు చేయడము నా పని, నేను చేయాలి, ఇందులో ఇతరులను చూడకూడదు అన్న ఈ బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలి. ఎప్పుడైనా వాయుమండలములో దుర్గంధము ఉన్నట్లయితే ఏం చేస్తారు? సుగంధాన్ని వ్యాపింపచేస్తారు కదా! దుర్గంధమును సహించలేరు, సుగంధాన్నిచ్చే ఏదో ఒక సాధనాన్ని వాడుతారు, అలా సాధారణ వాయుమండలము లేక అశుభ వాయుమండలము మారవలసిందే. చిన్నవారైనా కానీ, క్రొత్తవారైనాగానీ ఇది అందరి బాధ్యత. నేను శుభ వాయుమండలమును తయారు చేయవలసిందే అన్న దృఢ సంకల్పమును చేయాలి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది. ప్రతిజ్ఞ చేస్తారు, బాప్‌దాదా సంతోషిస్తారు కానీ ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత ఉండదు, అందువలన సఫలతనైతే కోరుకుంటారు కానీ ఎంత కోరుకుంటారో అంత ఉండదు. మొత్తము విశ్వము యొక్క, ప్రకృతి యొక్క, ఆత్మల యొక్క, ఆత్మలలో బ్రాహ్మణ ఆత్మలు కూడా వస్తారు, ప్రతి ఒక్కరూ దృఢతతో తమ సేవాస్థానాల వాయుమండలమును అలా తయారు చేయండి, కొంత త్యాగము చెయ్యవలసి వస్తే చేయండి, వీరు త్యాగము చేస్తే నేను చేస్తాను, అలా కాదు. సిస్టమ్ (పద్ధతి) సరిగ్గా ఉన్నట్లయితే..... తే, తే అని అనకండి. నేనైతే చెయ్యవలసిందే. విశ్వ పరివర్తక స్వమానము ఉంది కదా! అందరూ విశ్వ పరివర్తకులే కదా! చేతులెత్తండి. మంచి విశ్వ పరివర్తకులు. చాలా మంచిది. మరి బాప్‌దాదా దీనిని మొదట చూడాలనుకుంటున్నారు, ఉండి ఉండవచ్చు కూడా కానీ ఈ సంవత్సరములో చిన్న లేక పెద్ద సేవాకేంద్రాల పరిక్రమణ చేసినప్పుడు వాయుమండలము ఎలా ఉండాలి? ఈరోజు ఎలాగైతే స్నేహము మరియు శక్తిగల రోజుగా ఉందో అలా ప్రతి గ్రామములోని సెంటరు, పెద్ద సెంటర్ల వాయుమండలము చైతన్య మందిరమువలె ఉండాలి. నెగటిన్ను పాజిటివ్‌గా చెయ్యటము-ఇందులో మొదట నేను. మొదట మీరు అని అనకండి, మొదట నేను, ఎందుకంటే బాప్‌దాదా, అడ్వాన్స్ పార్టీ మరియు ఇప్పటి ప్రకృతి కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. ఏర్పాట్లను చేసేవారు మీరు, మీరు ఎదురు చూడకూడదు, ఏర్పాట్లను చేయాలి.
నేడు నలువైపుల భయము వ్యాపించి ఉంది, ప్రపంచములోని మెజారిటీ వారిలో, ప్రతి ఒక్కరి మనసులో ఒక్కటే ఆలోచన - రేపు ఏమౌతుందో! రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసా? కావున పరివర్తన అవ్వడంలో మొదట నేను నిమిత్తముగా అవుతాను, ఇటువంటి సంకల్పమును ఎవరు చేస్తారు? ఇందులో చేయి ఎత్తండి. చేయవలసి ఉంటుంది. చేయవలసి ఉంటుంది. మారవలసి ఉంటుంది. రక్షకులుగా అవ్వవలసి ఉంటుంది. కొంత వదలవలసి ఉంటుంది, ప్రేమను తీసుకోవలసి ఉంటుంది. మనస్సనే చేతిని ఎత్తారా లేక ఈ చేతిని ఎత్తారా! మనస్సనే చేతిని ఎవరు ఎత్తారు? ఎందుకంటే మనస్సు మారితే విశ్వము మారుతుంది. మరి ఈ సంవత్సరములో ఏ స్లోగను ఉంటుంది? ఏ స్లోగను ఉంటుంది? ‘‘నో ప్రాబ్లమ్”. విజయ పతాకము మనస్సులో ఎగురుతుంది. మరియు అందరూ సంతోషపు డ్యాన్స్‌ను సదా మనస్సులో చేస్తారు, సంతోషమే మనస్సు యొక్క డ్యాన్స్. కావున ప్రతి సమయము సంతోషపు డ్యాన్స్‌ను చేస్తారు. దాత పిల్లలు కావున ఎవరు వచ్చినాకానీ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక గుణాన్ని బహుమతిగా ఇవ్వండి. కావున ఒక్క సెకండులో ఆ దృఢ సంకల్పము, దాత సంకల్పము లిఫ్టుగా అవుతుంది మరియు క్షణకాలములో పరంధామము, సూక్ష్మవతనము, స్థూల మధువనపు సాకార వతనము, ఎక్కడకు కావాలంటే అక్కడకు కష్టము లేకుండానే సెకండులో చేరుకుంటారు. ఎవరు ఎదురుగా వచ్చినాగానీ వారిని ఖాళీ చేతులతో పంపించకూడదు, ఏదో ఒక గుణాన్ని, ముఖముద్వారా, నడవడికద్వారా, నోటిద్వారా గుణపు బహుమతి లేకుండా కలవకూడదు.
మరి ఈ సంవత్సరపు ప్రతి మాసపు రిజల్టును మీవద్ద కూడా ఉంచుకోవాలి మరియు యజ్ఞములోని టీచరుద్వారా ఓ.కే అన్న కార్డును పంపించాలి, పెద్ద లేఖను పంపవద్దు, ఓ.కే అన్న కార్డును పంపించాలి, కార్డు కూడా పెద్దది పంపవద్దు, ప్రపంచములో చలామణిలో ఉన్న కార్డు కాకుండా, టీచరుద్వారా ఏదైతే వరదానపు కార్డు లభిస్తుందో దానిని పంపాలి. గుణాల కానుకలు, శక్తుల కానుకలు ఎన్ని ఉన్నాయి? లిస్టును లెక్కించినట్లయితే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది! ఎంతగా ఇస్తూ ఉంటారో అంత తక్కువగా అవ్వవు కానీ పెరుగుతూ ఉంటాయి. ఛూ మంత్రమని అంటుంటారు కదా, అలాగే ఈ శివ మంత్రముద్వారా ఎప్పుడూ ఏ గుణమూ మీనుండి తక్కువ అవ్వదు, ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే దానము ఇచ్చినట్లయితే గ్రహణము వదులుతుంది అన్న నానుడి ఉంది. అచ్ఛా!
ఈసారి మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు లేచి నిల్చోండి. మంచిది. (మధ్యప్రదేశ్‌కు చెందిన గవర్నర్ ఎదురుగా కూర్చుని ఉన్నారు) ఈ సంగఠనలోకి విచ్చేసారు, మంచిది. బాప్‌దాదా మీ అందరికీ, వచ్చినవారికి ఈ వరదానమును ఇస్తున్నారు - సదా తండ్రికి గుడ్‌మార్నింగ్ మరియు గుడ్నైట్ను తప్పకుండా చెయ్యాలి, ఎందుకంటే కనులు తెరవటంతోనే మొట్టమొదటగా తండ్రిని చూసినట్లయితే మొత్తము రోజంతా మంచిగా ఉంటుంది. మొదటిసారి వచ్చే పిల్లలకు బాప్‌దాదా యొక్క పదమాగుణ ప్రియస్మృతులు మరియు అభినందనలు. అచ్ఛా. ఇప్పటి టర్ను ఎవరిది?
సేవా టర్ను ఇండోర్ జోన్ వారిది:- అచ్ఛా, గుర్తును మంచిగా ఉంచారు. (అందరి చేతిలో కమల పుష్పము ఉంది) అచ్ఛా. వీరిని ఇండోర్ అని అన్నారు కదా, ఇండోర్ అంటే అర్థం ఏమిటి? ఇన్ డోర్ అనగా అంతర్ముఖి. ఈ గుర్తును ఏదైతే ఉంచారో, ఆ గుర్తు అనుసారంగా సదా కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండండి. అంతర్ముఖీ సదా సుఖీ. అంతర్ముఖి సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు. అంతర్ముఖులు సదా సర్వులకు ప్రియముగా ఉంటారు. అచ్ఛా . ఎక్కువ మంది వచ్చారు, అభినందనలు. యజ్ఞ సేవ యొక్క సువర్ణ అవకాశము లభించటమన్నది చాలా ఎక్కువ పుణ్యమును జమ చేసుకోవటము. ప్రతి అడుగు యజ్ఞ సేవను చెయ్యటము అనగా తమ పుణ్య ఖాతాను జమ చేసుకోవటము. మరి ఈ 10-15 రోజులలో ప్రతి అడుగు సేవ చేసినట్లయితే ఎన్ని పదమాలు తయారయ్యాయి? యజ్ఞ సేవ చాలా గొప్ప సేవ. ఏ జోన్‌వారు ఈ సేవ యొక్క బంగారు అవకాశాన్ని తీసుకుంటారో వారు చాలా చాలా ప్రేమతో సేవ చెయ్యడాన్ని బాప్‌దాదా చూసారు. రిజల్టు వెరీగుడ్గా ఉంటుంది. మరి మీ అందరి రిజల్టు కూడా మంచిగా ఉంది మరియు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. నేను ఎవరిని అన్న విషయమును ఇప్పుడు గుర్తు ఉంచుకోవాలి. కమలమును. కమలము నీటిలో ఉంటూ కూడా అతీతముగా ఉంటుంది, అలాగే ఎటువంటి సమస్య వచ్చినా లేక ఎటువంటి వాయుమండలములో ఉన్నా అతీతముగా మరియు ప్రియముగా ఉండాలి ఎందుకంటే సమయమైతే దుఃఖపు సమయముగా, భయము కలిగించేదిగా ఉంది కానీ మీకొరకు సదా మనస్సులో సంతోషపు నగారా మ్రోగుతూ ఉంటుంది. సదా సంతోషంగా ఉంటారు కదా! చేతులెత్తండి. సంతోషమును వదలవద్దు, సంతోషము పోయినట్లయితే జీవితము ఎందుకూ పనికిరానిదవుతుంది. నీరసమైన జీవితము మంచిగా ఉండదు. అందుకని సదా సంతోషంగా ఉండాలి, ఉండాలి కదా మరియు సంతోషాన్ని పంచాలి. పంచేంతగా మరియు సంతోషంగా ఉండేంతగా సంతోషము ఉందా ఎందుకంటే తండ్రికి చెందిన బ్రాహ్మణ పిల్లలుగా అవ్వటము అనగా అదృష్టవంతులుగా అవ్వటము, భాగ్యశాలురుగా అవ్వటము. అదృష్టవంతులు అన్న మీ టైటిల్‌ను సదా గుర్తుంచుకోండి ఎందుకంటే తండ్రి లభించారు అంటే సర్వ ప్రాప్తుల భండారము లభించినట్లు. భండారము నిండుగా ఉంది, అన్ని దుఃఖాలు దూరము అన్న నానుడి ఉంది, మరి ఏం చేస్తారు? సంతోషమే ఉంటుంది కదా! మంచి సేవను కూడా చేస్తున్నారు. సేవ చెయ్యటము అనగా వరదానములను ప్రాప్తి చేసుకోవటము. మరి సేవలో సఫలతామూర్తులు కదా! చేతులూపండి. టీచర్స్, సఫలతామూర్తులే కదా! సఫలత మా జన్మసిద్ధ అధికారము అని అనండి. చెప్పండి. సఫలత మా మెడలోని హారము. అచ్ఛా.
మెడికల్ వింగ్:- మెడికల్ మరియు మెడిటేషన్ ఇద్దరి గ్రూపు ఉంది, ఎందుకంటే డబల్ డాక్టర్లు కదా! మెడిటేషన్ ద్వారా తండ్రితో కలిపించటము మరియు మెడికల్ ద్వారా దుఃఖమును దూరము చెయ్యటము. టెంపరరీగా(తాత్కాలికంగా) అయినాగానీ చెయ్యటమునైతే చేస్తున్నారు కదా! తండ్రి దుఃఖహర్త కదా, మరి డాక్టర్లు లేక మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా కొద్ది సమయము కొరకు పేషెంటు దుఃఖమును దూరము చేసేస్తారు. కానీ ఇప్పుడైతే మీరందరూ వారికి మెడిటేషన్‌ను నేర్పించండి, ఇది కూడా పుణ్యమును జమ చేసుకొనే మెడికల్ డిపార్ట్మెంటు. అందరూ డబల్ సేవను చేస్తారు. ఎవరైతే డబల్ సేవ చేస్తారో, ఎవరైతే డబల్ డాక్టర్లో వారు చేతులెత్తండి. సింగల్ డాక్టర్లైతే చాలామంది ఉన్నారు కానీ మీరు డబల్ సేవాధారులు, డబల్ పని చేసే వారు. బాప్‌దాదాకు మంచిగా అనిపించింది. ఈ సేవద్వారా కూడా చాలామంది సంతోషిస్తారు, అదృష్టవంతులుగా అవుతారు. బాంబేలోని హాస్పిటల్ కూడా చాలా సేవకు నిమిత్తమవ్వటమును బాప్‌దాదా చూసారు. ఆబూలో అయితే మొదటినుండే ఉంది కానీ అది మధ్యలో, పట్టణం మధ్యలో ఉన్న కారణంగా ఎక్కువ సేవ చేసే అవకాశము ఉంది. బాగా చేస్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్ళేందుకు అవకాశము మరియు వరదానము రెండూ ఉన్నాయి. మంచిది. ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లానును తయారుచేసారు కదా, తయారుచేసారా? మంచిది. తయారుచేస్తూ ఉండండి, విశ్వ పరివర్తనను చేస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా!
యూత్ గ్రూపు:- ఇప్పటి గవర్నమెంటుకు కూడా యువత కోసం చాలా ఉల్లాసము ఉంది, సంకల్పము ఉంది ఎందుకంటే ఏది అనుకుంటే, ఏది ఆలోచిస్తే దానిని చేసే చూపించటమన్నది యువత విశేషత. శారీరకంగా మరియు మాససికంగా కూడా యువతకు డబల్ శక్తి ఉంది, యువత సంగఠితమై ఏది కావాలనుకుంటే దానిని చెయ్యగలరు. యువత నలువైపుల ముఖ్యంగా తమ స్కూలు సహచరుల సేవ చాలా బాగా చేస్తున్నారన్నదానిని పాండవ గవర్నమెంటు కూడా చూస్తుంది. బాప్‌దాదా వద్దకు యువ వర్గం యొక్క రిపోర్టు వస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి అదనంగా దీనిని చేర్చండి - ఈ సంవత్సరములో బ్రాహ్మణ మర్యాదలేవైతే ఉన్నాయో, ప్రతిఒక్క మర్యాదను సంపూర్ణ రీతిలో మనస్సుద్వారా, వాచ ద్వారా, కర్మణద్వారా మరియు సంబంధ-సంపర్కముద్వారా నాలుగు రూపాలలో పాలన చేసేవారు - ఇటువంటి గ్రూపును తయారుచెయ్యండి, ఈ సంవత్సరములో ఏ మర్యాద కూడా భంగమవ్వకూడదు. అటువంటి గ్రూపును తయారుచెయ్యండి, పరస్పరములో చెయ్యండి. ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. ఇష్టమేనా? ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? చేతులెత్తండి? చేస్తారా? యువత అందరూ చేస్తారా? ఎంతమంది ఉన్నారు? (400 మంది) పరస్పరములో ప్రతి గ్రూపులో దృఢంగా చెయ్యండి, అప్పుడు వీరు మర్యాదా పురుషోత్తములు అని గవర్నమెంటుకు చూపిస్తారు. గవర్నమెంటు కూడా కోరుకుంటుంది కానీ చెయ్యలేకపోతుంది, మీరు చేసి చూపించండి. ఉదాహరణగా అయ్యి చూపించండి. హోమ్‌వర్కు లభించింది కదా! నలువైపుల ఉన్న బ్రాహ్మణ ఆత్మలు ఈ సంవత్సరములో అద్భుతమును చేసి చూపించాలన్నదానినే బాప్‌దాదా కోరుకుంటున్నారు. వ్యర్థ సంకల్పాలతో కిందకు పడిపోవటము కూడా ఉండకూడదు. వ్యర్థము వచ్చేందుకు సమయము కూడా లేనంతగా శుద్ధ సంకల్పాలను జమ చేసుకోండి. ఖజానా అయితే ఉంది కదా! శుద్ధ సంకల్పాలతో కూడిన అంత పెద్ద ఖజానా ప్రోగై ఉందా? ఉందా, చేతులెత్తండి. శక్తులు కూడా, మంచిది, శక్తులు కూడా ఉదాహరణమూర్తులుగా అవ్వాలి మరియు పాండవులు కూడా ఉదాహరణమూర్తులుగా అవ్వాలి. అచ్ఛా. బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
సెక్యూరిటీ వింగు:- సెక్యూరిటీ వారు, మీరు కూడా డబల్ సెక్యూరిటీ వారు కదా! ఒకటేమో ఎవరైతే అల్లర్లు చేస్తుంటారో వారినుండి సెక్యూరిటీ చేస్తారు, రెండవది మేము సదా సుఖముగా ఉండాలి, శాంతిలో ఉండాలి అని పాపం ఎవరైతే కోరికను ఉంచుతారో వారి సెక్యూరిటీని కూడా చెయ్యండి. వారికి మన్మనాభవ మంత్రమును ఇచ్చి, శివ మంత్రమును ఇచ్చి కనీసం సుఖముగా ఉండే, సంతోషపు సెక్యూరిటీ, సంతోషము పోకుండా ఉండే ఈ మార్గమును చూపించండి. మరి డబల్ సెక్యూరిటీ చేసినట్లయితే మీకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! దుఃఖింగా ఉన్నవారిని సుఖవంతులుగా చేయండి, బాధలో ఉన్నవారిని సంతోషపెట్టండి, అప్పుడు మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈవిధంగా ప్రతి ఇంటికి చిన్ని మంత్రాన్ని ఇవ్వండి, దీనితో సంతోషమును పోగొట్టుకోరు, ప్రతి ఇంటిలో సంతోషము ఉంటుంది. ఈ సేవను ఎంతగా చేస్తారో అంతగా డబల్ సెక్యూరిటీ వారిగా అయిపోతారు. వ్యాపింపచేయండి. ప్రతి స్థానములో ఈ బాధ్యతను ఇవ్వండి. అన్ని స్థానాలవారైతే ఉన్నారు, మీ దేశములో మొదట ఈ సెక్యూరిటీ పనిని చెయ్యండి, గ్రామ గ్రామము, పెద్ద పెద్ద స్థానాలు ఆనందంగా అయిపోతాయి. మరి చేస్తారా? చేస్తారా? అచ్ఛా.
ఇప్పుడు అందరూ సదా నాలుగు విషయాలేవైతే విన్నారో మరియు ఐదవది జీరో మరియు హీరో వినిపించామో, మరి ఈ విషయాలను మననము చేస్తూ మగ్న అవస్థలో ఉండే బ్రాహ్మణులనుండి ఫరిశ్తాగా అయ్యే ఆత్మలు, దేవతగా అవ్వటము అన్నది మీ జన్మసిద్ధ అధికారము, ఫరిస్తాలనుండి దేవతలుగా అయితే ఉండనే ఉంది, సదా స్నేహము యొక్క ప్రేమలో లీనమయ్యేవారు, లవలీనమై ఉండేవారు, సదా దృఢతతోకూడిన సంకల్పమనే తాళం చెవిని మనస్సులో, బుద్ధిలో స్మృతిలో ఉంచుకొనేవారు, ఎందుకంటే ఈ తాళం చెవి వెనుక మాయ చాలా తిరుగుతూ ఉంటుంది. కావున మనస్సు మరియు బుద్ధిద్వారా సదా సమర్థముగా ఉండేటువంటి నలువైపుల ఉన్న పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (జానకి దాదీతో) పర్యటన చేసి వచ్చారు, చాలా మంచిది. ఏదైతే చేస్తున్నారో అది చాలా మంచిది. జగదంబ మధ్యలో నిలబడి జెండా ఎగురవేస్తూ ఉంటే వెనుక శక్తులందరూ తోడుగా నిలబడి ఉండే చిత్రము బాబాకు గుర్తు వచ్చింది. మరి ఇప్పుడు ఆ చిత్రాన్ని బాప్‌దాదా విశ్వము ముందు చూపించాలని కోరుకుంటున్నారు. మొత్తము బ్రాహ్మణులతో శక్తి సేనను ఎలా తయారు చెయ్యాలంటే వారు నిమిత్తులుగా అవ్వాలి, పరిక్రమణ చేస్తూ వాయుమండలమును శక్తిశాలీగా తయారుచెయ్యాలి మరియు దృఢ సంకల్పమును చేసినట్లయితే మేము వాయుమండలమును మార్చి చూపిస్తాము అన్న దృఢ సంకల్పమును ఉంచుతారు. ఈ జెండాను ఎత్తుతారు. పర్యటనలు చేస్తూ తమ స్థితి, వాణి మరియు సాంగత్యముద్వారా వాయుమండలమును మంచిగా చేసేటువంటి గ్రూపును తయారుచెయ్యండి. అటువంటి గ్రూపును తయారుచేసి చూపించండి. బాప్‌దాదాకు చిత్రము గుర్తు వచ్చిందంటే అది ప్రాక్టికల్ అవ్వాలి. సమయము లభించదని అనవద్దు. సమయము లభించదని ఎవరూ అనవద్దు. శుభ భావన ఉన్నట్లయితే సమయము లభిస్తుంది, అటువంటి గ్రూపును తయారుచేసి బాప్‌దాదాకు ఇవ్వాలి.
పర్దాదీతో:- సేవను చేస్తున్నారు, మనసా సేవద్వారా ప్రకాశమును, శక్తిని చాలా ఇస్తున్నారు. సేవలో బిజీగా ఉంటారు.
కలకత్తావారు పూల అలంకారమును చేసారు:- అచ్ఛా, ఎప్పుడూ చేస్తారు.
(డాక్టర్ అశోక్ మెహతా మరియు యోగిని అక్కయ్యతో):- ఇద్దరూ చాలా ధైర్యమును ఉంచారు మరియు సరైన సమయానికి చేర్చారు (గుల్జార్దాదీని నిన్న బొంబాయినుండి మధువనమునకు తీసుకొని వచ్చారు) అందుకు అభినందనలు. ఏ డ్యూటీనైతే ఇచ్చారో దానిని చేసారు.
అవ్యక్త బాప్‌దాదాను మధ్యప్రదేశ్ గవర్నర్ మహామహిమ్ బలరామ్ జాఖడ్ గారు కలుస్తున్నారు:
చాలా మంచిది, చూడండి, ఇటువంటి సంగఠనలోకి చేరుకోవటము కూడా మీ భాగ్యము. ఈ సంగఠనలో మెడిటేషన్‌ను నేర్పిస్తారు కదా, మూడు గంటల మెడిటేషన్ ఉంటుంది, దానిని తప్పకుండా చెయ్యాలి అని బాప్‌దాదా చెప్తున్నారు. చూడండి, మూడు గంటలు విడివిడిగా ఇవ్వాలి. ఒకవేళ బిజీగా ఉన్నట్లయితే సెలవు రోజును ఇవ్వండి. మంచిది. ఎందుకంటే తండ్రి వద్దకు వచ్చారంటే తండ్రి కానుకనైతే ఇస్తారు కదా! మెడిటేషన్ద్వారా సదా సంతోషంగా ఉంటారు అన్నదే ఆశీర్వాదము. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎప్పుడు ఏ విషయము వచ్చినాగానీ, బాబా, శివబాబా అని అనండి. ఆ విషయాన్ని తండ్రికి ఇచ్చేసెయ్యండి, మీరు సంతోషంగా ఉండండి.
ఓంశాంతి