Search for a command to run...
31 Dec 2008
ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానము ద్వారా నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసి, సంకల్పము, శ్వాస, సమయమును సఫలం చేయండి, సఫలతామూర్తులుగా కండి
31 December 2008 · తెలుగు
ఈరోజు నూతన జీవితాన్ని ఇచ్చే బాబా తమ నలువైపుల ఉన్న నూతన జీవితాన్ని ధారణ చేసుకున్నటువంటి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ నూతన జీవితము ఉన్నదే నూతన యుగమును తయారు చేయడానికి. మనుష్యులు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. మీరందరూ నూతన జీవితంతో ఉన్న పిల్లలు. మీరు ఆత్మలందరికీ అభినందనలు తెలుపుతారు మరియు దీనితో పాటు నూతన యుగము రానున్నది అన్న శుభవార్తను కూడా తెలుపుతారు. పిల్లలైన మీ అందరికీ బాబా వారసత్వంగా గోల్డెన్ ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రపంచంలో అనేక గోల్డెన్ బహుమతులు ఉండనే ఉన్నాయి. ఈ గోల్డెన్ ప్రపంచ బహుమతి అయితే మా జన్మ సిద్ధ అధికారము అన్న నషా మీ అందరికీ ఉంది కదా! ఈనాటి ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా కానీ, పెద్ద బహుమతి అయితే కిరీటము లేక సింహాసనమే కదా. కానీ మీ గోల్డెన్ ప్రపంచ బహుమతి ముందు అది ఏమైనా పెద్దదా? మా తండ్రి మాకు అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన నూతన యుగాన్ని బహుమతిగా ఇచ్చారు అని మీకు మనసులో సంతోషం ఉంది. నిశ్చయము ఉంది మరియు ఇది నిశ్చితము. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఈ అచంచల నిశ్చయము సదా స్మృతిలో ఉంటుందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడూ తగ్గుతుందా? జన్మ సిద్ధ అధికారము అన్నప్పుడు జన్మ సిద్ధ అధికారము ఎప్పుడూ చలించదు.
ఈరోజు మీరందరూ వేరు వేరు స్థానాల నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ నూతన సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. ఈ నూతన సంవత్సరానికి ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారు? ఈ నూతన సంవత్సరంలో విశేషంగా ఏమి చెయ్యాలి? ఈ నూతన సంవత్సర విశేషత - బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావలసిందే. ఏ పురుషార్థం చేయవలసి వచ్చినా కానీ బాబా సమానంగా కావలసిందే అన్నది నిశ్చితము. చెప్పండి, అందరి మనసులలో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా! అవునా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా కావాలి అని బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అయితే బాబాయే కానీ పిల్లలు తండ్రికన్నా ఉన్నతులు. మరి బాబా సమానంగా కావాలన్న లక్ష్యాన్ని పూర్తి చెయ్యడానికి బాబాను ఫాలో చెయ్యవలసి ఉంటుంది. ఆలోచించండి, బాబా, బ్రహ్మా బాబా ఎలా సంపూర్ణమయ్యారు? వారి విశేషత ఏమిటి? సంపూర్ణతకు విశేషంగా ఏది ఆధారంగా నిలిచింది? బ్రహ్మా బాబా తమ ప్రతి సమయాన్ని సఫలం చేసారు. శ్వాస-శ్వాస, క్షణ-క్షణము సఫలం చేసారు. మరి బాబా సమానంగా కావడానికి ఈ సంవత్సరము ఏ లక్ష్యాన్ని తీసుకుంటారు? సఫలం చేయాలి మరియు సఫలతామూర్తులుగా కావలసిందే. సఫలత మన మెడలో హారము. సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వము. మరి ఈ లక్ష్యముతో పరిశీలించుకోండి - సఫలతామూర్తులుగా అయి సమయము, శ్వాస, ఖజానా, శక్తులు, గుణాలు అన్నీ సఫలం చేసామా అని ప్రతి రోజూ స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకుంటారో 21 జన్మలకు దాని ఫలితము జమ అవుతుంది. తెలుసు కదా, ముందు కూడా వినిపించి ఉన్నాము - ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్య భాగ్యము పూర్తి సమయము ప్రాప్తిస్తుంది. శ్వాస సఫలం చేసుకుంటే 21 జన్మలు స్వస్థతతో ఉంటారు. ఎప్పుడూ ఏ విధంగానూ స్వస్థతలో లోటు ఉండదు. అలాగే ఏ ఖజానాలైతే జమ చేసుకుంటారో, అన్నిటికన్నా పెద్ద ఖజానా జ్ఞానము. జ్ఞానము అనగా తెలివి. మరి జ్ఞాన ఖజానాను సఫలం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు ఎంత తెలివైనవారిగా అవుతారంటే మీకు మంత్రుల నుండి సలహా తీసుకోవలసిన అవసరం రాదు. స్వయమే రాజ్యాన్ని అఖండంగా, అచలంగా నడిపిస్తారు, మీ రాజ్యంలో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నము, అఖండము, అచలము. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవడం వలన లభించే ఫలితము ఇది. ఒక్క జన్మ సఫలం చేసి అనేక జన్మలు సఫలతలోని ఫలితాన్ని తింటారు. అలాగే ప్రాప్తించిన శక్తులను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సఫలం చేస్తే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వ శక్తులు ఉంటాయి. ఎప్పుడూ శక్తి తగ్గదు. ఏ శక్తిలోనూ లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలు దానం చేస్తే మీ అంతిమ జన్మ, 84 జన్మలలో మీ జడ చిత్రాలను చేసినప్పుడు అందులో అంతిమం వరకు మీ మహిమ ఏమని గాయనం చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఒక్కొక్క దాన్ని సఫలం చేసి అనేక జన్మలు ప్రాప్తికి అధికారులుగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏమి చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణం కూడా అసఫలం కాకూడదు. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయము ఒక చిన్నని జన్మ మరియు ఫలితము పొందే సమయము 21 జన్మలు, మరి ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే లక్ష్యము ఉందా? అందరికీ బాబా సమానంగా కావాలన్న లక్ష్యము ఉందా? కావలసిందే, కావలసిందే. కావలసిందే, అండర్లైన్. అచ్ఛా. పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారా? పిల్లల కిరీటము బాగుంది. (పిల్లలందరూ కిరీటము ధరించి ఉన్నారు) చాలా బాగుంది.
ఈ సంవత్సరానికి లక్ష్యము కూడా తీసుకున్నారు, దీనితో పాటు తండ్రిని ఫాలో(అనుసరించుట) చేసే మంత్రము - సఫలం చేసి సఫలతామూర్తులుగా కావాలి. ఇందుకోసం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరము లేదు. బాప్‌దాదా పిల్లలకు కష్టాన్ని ఇవ్వరు, చాలా సహజమైన విధి చెబుతారు, సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా కూడా బాబాకు ఈ సంకల్పము ఉండేదా అని ముందు పరిశీలించుకోండి. మాట మాట్లాడినప్పుడు బాబా సమానంగా ఉందా అని పరిశీలించుకోండి. మరి సంకల్పము, మాట మరియు కర్మ, సంబంధ సంపర్కములలో బాబా ఇలా ఉండేవారా అని ముందు ఆలోచించండి, పరిశీలించుకోండి. అటువంటి స్వరూపంగానే కండి. బ్రహ్మా బాబాను ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అని అయితే గాయనము ఉంది కదా! కొంతమంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలను చూపిస్తారు. ఎటువంటి ఆటలను చూపిస్తారో తెలుసా? అనుకోలేదు కానీ, అయిపోయింది. ముందు ఆలోచించి, కేవలం ఆలోచించడమే కాక దాని స్వరూపంలోకి రండి. ఒకవేళ స్వరూపంగా అయితే అనుకోలేదు కానీ అయిపోయింది అని అనరు. చేసేవారు, ఆలోచించేవారు శ్రేష్ఠ ఆత్మలు, యజమానులైన మీరు. అయిపోయింది అంటే కర్మేంద్రియాలపై కంట్రోల్(నియంత్రణ) లేదు అని అర్థం.
మరి ఈ సంవత్సరంలో ఇదే స్లోగన్ గుర్తుంచుకోండి - బాబా సమానంగా కావలసిందే, కావలసిందే. కష్టమైతే కాదు కదా? బాబా ఎలా చేసారో అలాగే చేయండి. కాపీ చెయ్యడమైతే సహజమే కదా. ఆలోచించే అవసరము కూడా లేదు. ఎలా అయితే బాబా, బ్రహ్మా బాబా ఫరిశ్తాగా అయ్యారో, అంటే మీరు కూడా ఫరిశ్తా సో దేవతలుగా కావాలన్నది నిశ్చితము. మీరు కూడా ఫరిశ్తా సో దేవతగా కావలసిందే. కొంతమంది పిల్లలు అంటారు, నడుస్తూ నడుస్తూ చాలా అపోజిషన్(విరుద్ధము) వస్తుంది అని, మరి అపోజిషన్‌కు కారణము పొజిషన్ నుండి కిందకు దిగడమే. కానీ గుర్తుంచుకోండి బాబా సమానంగా కావాలంటే స్థాపన ఆదిలో బ్రహ్మా బాబా ఎన్ని అపోజిషన్లను పొజిషన్లలోకి మార్చారు? ప్రతి విషయము క్రొత్తది, ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడైతే కాలమెంతో మారిపోయింది. కానీ ఒంటరిగా బ్రహ్మా బాబా ఎంతగా స్వమానము అనే సీట్‌పై కూర్చుని పొజిషన్ ద్వారా అపోజిషన్‌ను ఎదుర్కొన్నారు! ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చేయలేదు. ముందు ఏమనేవారు? ధమాల్ చేస్తున్నారు అని, మరి ఇప్పుడు ఏమని అంటున్నారు? కమాల్ చేస్తున్నారు. ఇంత తేడా వచ్చింది. కారణము ఏమిటి? బ్రహ్మా బాబా స్వయము స్వమానము అనే సీట్ మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా అపోజిషన్‌ను సమాప్తం చేసారు. మరి మీరు ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? సమానంగా కావాలి కదా, మరి సదా ఒకవేళ అపోజిషన్ ఉన్నప్పటికీ స్వమానము అనే సీట్‌పై కూర్చుండిపోండి అప్పుడు అపోజిషన్, పొజిషన్లోకి మారిపోతుంది. ధైర్యముందా? బ్రహ్మా బాబా సమానంగా కావలసిందే, ఇందులో అయితే చేతులెత్తారు, కానీ ఇంత ధైర్యముందా? ముందు స్వ పరివర్తన, తర్వాత అనేక సంబంధ సంపర్క ఆత్మలు, ఆ తర్వాత విశ్వ ఆత్మలు. వీరందరినీ తమ మనసా శుభ భావన, శుభ కామన ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చెయ్యండి.
ఈ సంవత్సరం బాప్‌దాదా విశేషంగా ఒక శాంతి వరదానాన్ని కూడా ఇస్తున్నారు. నా బాబా అని మనస్ఫూర్తిగా అంటే శక్తి హాజరు, ఊరికే నా బాబా అని కాదు, మనస్ఫూర్తిగా అంటే, అధికారము ఉంచితే, నా బాబా అనగానే శక్తి మీ ఎదుట హాజరు అయిపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తితో విశేషంగా నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి మార్చండి. నెగిటివ్ సంకల్పము, నెగిటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్‌లోకి మార్చండి. పాజిటివ్ చూడటం, మాట్లాడటం, చెయ్యడం కేవలం శుభ భావన, శుభ కామనల ద్వారానే సహజమవుతుంది ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. మరి అర్థమయిందా, ఈ సంవత్సరపు విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. పరివర్తన చేయగలరు కదా? మీ ఛాలెంజ్ ఉంది, గుర్తుంది కదా! విశ్వ పరివర్తకులు కదా! విశ్వ పరివర్తకులు అన్న టైటిలే ఉన్నప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడము కష్టమా! మనసులో ఎటువంటి కష్టము వచ్చినా, నిజానికి కష్టము అనేది ఏదీ ఉండదు కానీ మీరు చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తిమంతులకు కష్టమా? కానీ మీరు ఒక పొరపాటు చేస్తారు, కష్టంగా చేసేసుకుంటారు. ఎలా అయితే ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారమైపోతే ఎవరైనా పొరపాటున అంధకారాన్ని పారద్రోలాలని చూస్తే అంధకారము పోతుందా? సరైన విధి ఏమిటంటే మీరు ప్రకాశమును ఇచ్చే స్విచ్‌ను ఆన్ చేస్తే అంధకారం సెకండులో పారిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు, ఏ విషయమైతే అయిపోయిందో, దానికి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా... ఈ క్యూలో వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు, అప్పుడు పెద్ద విషయము కష్టంగానే అనిపిస్తుంది కదా. చిన్న విషయముగా చేసుకోండి అప్పుడు సహజమవుతుంది. ఏ శక్తినయినా కార్యంలో వినియోగించడానికి బాబా సహజమైన విధి చెప్పారు - నేను మాస్టర్ సర్వశక్తిమంతుడను అన్న మీ స్వమానపు సీట్‌పై కూర్చోండి, ఒకవేళ ఈ సీట్‌పై కూర్చుంటే అప్సెట్ అవ్వరు. సీటు లేకపోతే అప్సెట్ అవుతారు, సీట్ ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. 63 జన్మలు ఎలా ఉంది? ఒకసారి సెట్, ఒకసారి అప్సెట్. కావున సదా స్వమానము అను సీట్‌పై సెట్ అయి ఉండండి. ఇంకా ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? నూతన సంవత్సరంలో బహుమతినైతే అందరికీ ఇస్తారు కదా. మరి ఏ బహుమతిని ఇస్తారు? అభినందనలతోపాటు ఏ బహుమతిని ఇస్తారు? మీ వద్ద అయితే బహుమతులు చాలానే ఉన్నాయి. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వగలరు. స్థూలమైన బహుమతులైతే అల్పకాలం వరకే ఉంటాయి, అవినాశీ బాబా సమానంగా అయ్యే మీరు అవినాశీ బహుమతిని ఇవ్వండి. మనసు ద్వారా శక్తుల బహుమతిని ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానాన్ని బహుమతిగా ఇవ్వండి మరియు కర్మణ ద్వారా గుణాలను బహుమతిగా ఇవ్వండి. ఉన్నాయి కదా అందరి దగ్గర? ఉంటే తల ఊపండి. ఖజానాలు చాలా ఉన్నాయి, తక్కువైతే లేవు కదా. ఎవరితో అయినా కార్యంలోకి రండి, కార్యంలోకి రావలసి ఉంటుంది కదా. వారికి ఈ సంవత్సరం బాగా బహుమతులను ఇవ్వండి. కానీ అవినాశీ బహుమతులు. వినిపించాము కదా, ఎవ్వరినీ ఖాళీగా పోనివ్వద్దు. మనసా బహుమతిని ఇవ్వండి, లేక వాణి, కర్మణ ఏదైనా కావచ్చు. ఇందుకోసం మీరు సదా ఒక అటెన్షన్‌ను పెట్టవలసి ఉంటుంది, ప్రతి సమయము మనసులో శక్తుల స్టాకును ఇమర్జ్ చేసుకుని పెట్టుకోవాలి, ఎన్ని శక్తులున్నాయి? లిస్టు అయితే ఉంది కదా! వాచ కారణంగా సదా మనసులో మనన శక్తి, జ్ఞానాన్ని మననం చేసే శక్తి, స్మృతిలో పెట్టుకోవలసి వస్తుంది. నడవడికలో, ముఖంలో, కర్మలో గుణ స్వరూపులుగా కావాలి. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవలసి ఉంటుంది. అంతే కానీ శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానము ఉంది కదా... అని అనకండి. కానీ స్వరూపంగా కావాలి. ప్రతి ఒక్కరినీ ఈశ్వరీయ దృష్టి, వృత్తితో చూడాలి. ఈ సంవత్సరం సమానంగా కావలసిందే అన్నప్పుడు అందులో అయితే చేతులెత్తారు, బాప్‌దాదా వతనంలో అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడ ఈ చిన్న టి.వి ఉండదు, చాలా పెద్దది. ఒక్క సెకండులో అన్ని సెంటర్ల రిజల్టును చూడవచ్చు. మరి బాబా సమానంగా కావాలన్న మీ ఉత్సాహాన్ని చూసి సంతోషిస్తున్నారు. అదృష్టవంతులు, సంతోషపు ముఖాన్ని కలిగినవారు, ఎప్పుడూ ఆవేశపు ముఖాన్ని పెట్టుకోకండి. సదా సంతోషము, మీరు ఎంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటును సరిదిద్దుతున్నా, అర్థం చేయిస్తున్నా కానీ ఆవేశముతో ఉన్న ముఖము, మాటలు ఉండకూడదు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తనను తీసుకురండి. బహుమతి ఇస్తాము. పూర్తి సంవత్సరంలో ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో, ఎటువంటి విషయము వచ్చినా కానీ, కొంతమంది సోదరసోదరీలు అంటారు, అందరూ ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఏమంటారంటే ఆవేశంతో చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారనే మారరు అని. మీరు ముందుగానే వీరు మారరు అన్న భావన పెట్టుకున్నప్పుడు మీ వైబ్రేషన్ ముందుగానే చేరుకుంది. కావున ఈ సంవత్సరంలో క్రోధానికి, దాని సంతానానికి వీడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశము కూడా వద్దు. బాబా ప్రశ్నిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎవరైతే పని కావడానికి, బాగు చెయ్యడానికి క్రోధము చేస్తున్నారో, అక్కడ బాగవుతుందా? క్రోధం వలన ఎవరైనా మారారా? ఆ లిస్టు చూపించండి. మరింత విసుగు చెందుతారు, బాగుపడరు. మనసులో అపోజిషన్ చేస్తారు. ఒకవేళ పెద్దవారైతే మనసులో అపోజిషన్ జరుగుతుంది, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడుస్తారు. మరి ఈ సంవత్సరం ఏమేమి చేయాలి అని అన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారా? ఇప్పుడు చేతులెత్తండి. చేస్తారా? టి.వి.వారు ఈ ఫోటోను తీయండి. చేతులెత్తండి. కొంచెం ఎత్తి ఉంచండి. టి.వి.వారు తీస్తున్నారు.
బాప్‌దాదా ఏ విషయాలైతే వినిపించారో, ఈ సంవత్సరంలో చేయాలి. ప్రతి నెలలోని లాస్ట్ తారీఖున, ప్రతి ఒక్కరూ తమ చార్టును వరదానము లభించేటువంటి చిన్నని కాగితంలో ఓ.కే. అని వ్రాయండి. ఒకవేళ వినిపించిన విషయాలలో రెండు విషయాలు చెయ్యలేకపోతే, ఒకవేళ కాకపోతే ఓ.కే మధ్యలో గీత పెట్టండి. అంతే, కేవలం ఇలా రిజల్టును వ్రాయండి. పెద్ద కాగితంలో వ్రాయద్దు. ఒకవేళ పెద్ద కాగితంలో వ్రాస్తే చదివే వారి సగం సమయము అందులోనే పోతుంది. అందుకే చిన్నని చీటీలో ఓ.కే అని వ్రాయండి, అప్పుడు చదవడానికి సహజంగా ఉంటుంది. మరి ఓ.కే అని వ్రాయడము, గీత పెట్టడము. సహజము కదా. విశేషంగా ఈ క్రోధము అనే భూతాన్ని ఈ సంవత్సరం పారద్రోలాలి. ఆవేశము కూడా వద్దు, కొందరు కళ్ళతో కూడా క్రోధము చేస్తారు, చూసారా? ముఖముతో కూడా క్రోధము చేస్తారు. మరి ఏమి చేస్తారు? దేనికైనా విడాకులు ఇవ్వాలి కదా. ఇస్తారా? మధువనంవారు ఇస్తారా? మధువనంవారు చేతులెత్తండి. అచ్ఛా, ఇంతమంది కూర్చుని ఉన్నారు. అచ్ఛా, ఇక్కడ కూర్చుని ఉన్నారు. మరి ముందుగా మధువనంవారికి బాప్‌దాదా చెప్తున్నారు, ఇందులో ముందు నేను, ముందు మధువనం నుండి వీడ్కోలు ఇద్దాము. మధువన ప్రభావము సెంటర్లపై ఆటోమేటిక్‌గా పడుతుంది. మధువనము బీజము, కాండము. కానీ మీ అందరి పర్మనెంట్ అడ్రెస్ ఏమిటి? మధువనం కదా. మరి మీరు అర్థం చేసుకుంటున్నారా లేక కేవలం మధువన నివాసులే చేస్తారా! మీరందరూ మధువన నివాసులు. ఎందుకంటే మీ పర్మనెంట్ అడ్రెస్ అయితే మధువనము. ఇదంతా సేవ కోసం మీరంతా భిన్న భిన్న స్థానాలకు వెళ్ళారు. ఫారెన్‌కు వెళ్ళేవారు తమ జన్మించిన గ్రామాన్ని మర్చిపోతారా? ఫారెన్‌లో ఉన్న ఇండియావారు, ఎవరికైతే ఇండియాలో వారి గ్రామము ఉందో, స్థానము ఉందో, వారికి ఫారెన్‌లో ఉంటూ కూడా తమ జన్మ భూమి, గ్రామము, పట్టణములో సెంటరు స్థాపన చేసి ఉంటే, బాప్‌దాదా ఆ పిల్లలకు చాలా చాలా పుణ్య ఆత్మ అనే టైటిల్ ఇస్తున్నారు. కమాల్ చేసారు మరియు ఏ కష్టమూ లేదు కదా, అంతా బాగుందా అని అడుగుతూ ఉంటారు. ఇది పుణ్య ఆత్మల కర్తవ్యము. పరివారము ఇది. ఒక పరివారము. రెండు పరివారాలు కాదు, ఒక పరివారము. ఈరోజు మీరు లండన్‌కు ఏ కారణం చేతనైనా వెళ్తే మీరు ఏమని అంటారు? మా సెంటరు అని అంటారా లేక లండన్వారిది అని అంటారా? మాది అని అంటారు కదా! మనది అంటే దాని భావము అక్కడకు వెళ్ళిపోయి ఉండండి అని కాదు. బాబా అయితే ప్రతి ఒక్కరికీ వారి సేవా స్థానాలను ఇచ్చి ఉన్నారు. మరి విన్నారా ఏమి చేయాలో? మధువనంవారు మరియు మిగతా అందరూ తమ సర్టిఫికేటును తీసుకోవాలి. అచ్ఛా. చాలా పని ఇచ్చేసాము కదా కానీ బాప్‌దాదా మీకు తోడుగా ఉన్నారు, ఎక్కడ కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా బాబా, నా బాబా, నా తోడు రండి, సహాయం చేయండి అని అనండి. అప్పుడు బాబా కూడా బంధింపబడి ఉంటారు. కేవలం మనసుతో అనాలి. ఎందుకంటే సమయాన్ని, స్వయాన్ని రెండింటినీ చూడాలి. సమయం ఛాలెంజ్ చేస్తుంది మరియు మీరు మాయను ఏమి చేస్తావో చెయ్యి అని ఛాలెంజ్ చేయండి!
మరి సమయ ప్రమాణంగా ఇప్పుడు సమయపు వేగము తీవ్రంగా ఉండటం బాప్‌దాదా చూసారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపు, భక్తుల పిలుపు, సమయపు పిలుపును పిల్లలు తక్కువగా వినడం బాప్‌దాదా చూసారు. పాపం ధైర్యహీనులు, వారికి రెక్కలను ఇస్తే కదా ఎగిరేది. ధైర్యము అనే రెక్కలు, ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలను ఇవ్వండి. అచ్ఛా.
బాప్‌దాదా అన్ని వైపుల నుండి వచ్చిన కార్డులు, ఈమెయిల్స్, అభినందనలను స్వీకరించారు కూడా మరియు ఇక్కడ కూడా చూసారు. మీ హృదయపూర్వక అభినందనలను బాప్‌దాదా వజ్రాలకన్నా పదమారెట్లు ఎక్కువ విలువైనవిగా స్వీకరించారు. దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా బాబా హృదయం ఎదురుగానే ఉన్నారు. బాప్‌దాదా దృష్టిని ఇచ్చేటప్పుడు కేవలం ఈ హాలులో మాత్రమే ఇవ్వరు, బాప్‌దాదా ఎదురుగా అన్ని స్థానాలలోని పిల్లలు హృదయం ఎదుట హాజరై ఉంటారు. కావున పదమారెట్ల అభినందనలు కూడా మరియు బంగారు బహుమతికి అయితే బాప్‌దాదా అందరినీ అధికారులుగా చేసేసారు. ఈ బంగారు బహుమతిలో అనేక బహుమతులు ఇమిడి ఉన్నాయి. ఏది తలుచుకుంటే అది హాజరైపోతుంది. ఇక్కడి అనుసారంగా 12 గంటలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది, మా కొరకైతే సదా నయనాలలో, హృదయంలో ఏమి గుర్తుంటుంది? గోల్డెన్ ప్రపంచము. ఇప్పుడే ఇక వచ్చేయనుంది. అలా అనిపిస్తుంది కదా! ఈరోజు ఇక్కడ ఉన్నాము, మరి కొద్ది సమయంలో మన ప్రపంచంలోకి వెళ్తాము. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రావారిది:- చాలా మంచిది, సుందరమైన దృశ్యము కనిపిస్తుంది. సేవా పుణ్యము జమ చేసుకోవడం ద్వారా మనసు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది కదా! అచ్ఛా. టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు. టీచర్లు చేయి ఊపండి. బాగుంది, సంగఠన బాగుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమి చేస్తుంది? ముందు కూడా వినిపించి ఉన్నాము, ఈ మేళా చెయ్యడము, ప్రోగ్రాము చెయ్యడము ఇవైతే కామన్ అయిపోయాయి. రీతి ప్రమాణంగా అయిపోయాయి. సీజన్ అయిపోగానే వర్గాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు బాప్‌దాదా రెండు విషయాలలో సూచన ఇచ్చి ఉన్నారు, వి.ఐ.పి.ల సేవ బాగా చేసారు, సమయానికి సహయోగిగా కూడా అవుతున్నారు, మంచి సహయోగాన్ని కూడా ఇస్తున్నారు కానీ ఇప్పుడు సహయోగి నుండి వారసులుగా కావాలి. వాస్తవానికి ఢిల్లీలో కూడా చాలా సమయం నుండి వారస క్వాలిటీవారు వెలువడ్డారు కానీ అది ఇంతకుముందు విషయం. ఇప్పుడు మైకులుగా కావాలి మరియు వారస క్వాలిటీ కూడా కావాలి, సహయోగి కాదు, సహయోగిగా అయితే చేస్తారు, అవుతున్నారు కానీ వారస క్వాలిటీ. ఇప్పుడు నలువైపుల నుండి మైక్ కూడా కావాలి, సహయోగులు కూడా కావాలి కానీ వారస క్వాలిటీ. వారు గుప్తంగా ఉన్నా ఫర్వాలేదు. వారసులు గుప్తంగా ఉన్నా కూడా ప్రత్యక్షంగానే ఉంటారు. ఇటువంటి గ్రూపును ఎక్కడినుండైనా తయారు చేయండి, ఏ వర్గంవారైనా కావచ్చు, దేశమువారు కానీ, ఎక్కడివారైనా కానీ ఇటువంటి క్వాలిటీ వారిని మాలగా కాకపోయినా సరే, కంకణముగానన్నా తయారు చేయండి. ఎలా అయితే పూర్వ కాలంలో త్వరత్వరగా వారసులు తయారయ్యారో, అలాగే ఇప్పుడు మిగతా అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ వారస క్వాలిటీ ప్రతి శ్రీమతము, ప్రతి డైరెక్షన్‌పై మనసుతో గుప్తంగా అయినా నడవాలి. భిన్న భిన్న స్థానాల నుండి ఇటువంటి గ్రూపును తయారు చెయ్యడానికి ఎవరైనా నిమిత్తం కావాలి అని బాప్‌దాదా ఆశ. ఈ నవీనతను ఏ సెంటరు అయినా, ఏ వర్గమైనా చేసి చూపించండి. విదేశాల నుండి తయారు చెయ్యండి, భారతదేశం నుండి తయారు చేయండి, వీలవుతుంది కదా! వీలవుతుంది! టీచర్లు చెప్పండి వీలవుతుందా? చేతులెత్తండి. ఢిల్లీవారు. వాహ్! బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. మంచి ధైర్యాన్ని ఉంచారు. ఇప్పుడు ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నాము. ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా చేస్తారు కదా అప్పుడు ఎటువంటి అభినందనలు ఇస్తాము? వాహ్! ప్రియమైన పిల్లలు వాహ్! ఎవ్వరైనా చెయ్యండి, బాంబే చెయ్యండి, మహారాష్ట్ర చెయ్యండి, ఆంధ్ర చెయ్యండి, ఎవ్వరైనా చెయ్యండి, మధువనం చెయ్యండి. సరేనా. బాగుంది. ఢిల్లీలో బ్రహ్మా బాబా, బ్రహ్మా బాబాతో పాటు శివబాబా అయితే ఉండనే ఉన్నారు కానీ విశేషంగా బ్రహ్మా బాబాకు ఢిల్లీ, బాంబే, కలకత్తాలపై మొదటినుండి బాప్‌దాదాకు ఆశ ఉంది. కలకత్తావారు కూడా చెయ్యగలరు. అచ్ఛా. ఇప్పుడు కమాల్ చేసి మరో సంవత్సరం వచ్చినప్పుడు తయారీ చేసుకుని రండి. సరేనా? పాండవులందరూ చేతులెత్తండి. చూడండి, ఎంతమంది పాండవులు ఉన్నారో! మరి ఢిల్లీ పాండవులు కమాల్ చేసి వస్తారు కదా. చేస్తారా? బాప్‌దాదా ఎప్పుడూ పదే పదే ఢిల్లీ పేరు తీసుకుంటూ ఉంటారు. అందరికోసం, బ్రాహ్మణులందరికోసం ఢిల్లీలో దర్బారు తయారు చేస్తారు కదా. రాజ్యం చేస్తారు కదా. రాజ్య సభ ఢిల్లీలో ఉంటుంది కదా. మరి ఢిల్లీవారు ఢిల్లీని ఎంతగానో తయారు చెయ్యవలసి ఉంటుంది. అందరికీ మహలు ఇవ్వాలి కదా. మహలు ఢిల్లీలో లభిస్తుంది. అచ్ఛా, కమాల్‌ను చూస్తాము. ఏదైనా నవీనత చెయ్యండి. ఇప్పుడు పదే పదే ఫంక్షన్లు, మేళాలు జరగడం అందరూ చూసేసారు. అచ్ఛా.
జ్యూరిస్ట్ వింగ్, కల్చరల్ వింగ్ మరియు మీడియా వింగ్ వారు వచ్చారు:- ముందుగా జ్యూరిస్ట్వారు లేవండి. జ్యూరిస్టుల పని లా అండ్ ఆర్డర్‌ను పటిష్టంగా చెయ్యడము. మరి మీరందరూ ఈ పాత ప్రపంచంలో కూర్చొని క్రొత్త ప్రపంచపు లా అండ్ ఆర్డర్‌ను తయారు చేస్తున్నారు. ప్లాను మంచిగా చేసారు. ఈ డిపార్టుమెంటులో కూడా భిన్న భిన్న స్థానాల నుండి సహయోగులు ఉన్నారు. అన్ని వైపులవారు కలిసి చేస్తే వాణి ద్వారా, భాషణ ద్వారా ఎటువంటి వాతావరణాన్ని తయారు చెయ్యండి అంటే అనేకులు మీకు తోడుగా అయి అశాంతి సమయంలో మేము శాంతిని కాపాడుతాము అనే విధంగా ముందుగా వారు సహయోగులుగా కావాలి. శాంతి స్థాపకులుగా అయి మీకు తోడుగా నిలవాలి. ఇలా అని సంతకం తీసుకోండి. అనేక ప్రదేశాలలో తమ సేవ ద్వారా మేము శాంతిగా ఉంటాము, లా అండ్ ఆర్డర్లో నడుచుకుంటాము మరియు ఇతరులను నడిపిస్తాము అని వ్రాయించుకోండి. ఇటువంటి లిస్టును తయారు చెయ్యండి మరియు మేము ఏమి చేస్తున్నాము అని దానిని ప్రభుత్వానికి చూపించండి. ఆ గ్రూపు ప్రాక్టికల్‌గా లా అండ్ ఆర్డర్ అనుసారంగా నడుస్తుందా లేదా అని మధ్య మధ్యలో పరిశీలిస్తూ ఉండండి. ఇటువంటి సహయోగి గ్రూపు, యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కానీ తెలివైన పిల్లలు, సంఖ్యను ప్రోగు చెయ్యండి. వీరిని మాటిమాటికీ యాత్ర చేయించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా పెద్ద స్థానములో వారి సంగఠనను చేస్తూ ఉండండి. అన్ని వర్గాలవారు ఉండే విధంగా సంగఠనను తయారు చెయ్యండి. ప్రభుత్వం కూడా వీరు ఏమి చేస్తున్నారు అని చూడాలి. ప్రభుత్వం కోరుకుంటుంది కానీ చెయ్యలేకపోతుంది, మీరు చేసి చూపించండి. బాగుంది. సంగఠన బాగుంది మరియు చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు గర్జన పెంచాలి. ఎవరైతే నిమిత్తమయ్యారో వారికి బాబా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు, చేస్తూ ఉండండి, ముందుకు సాగుతూ ఉండండి, ముందుకు నడిపిస్తూ ఉండండి. ఇప్పుడు ప్రభుత్వం చెవులకు ధ్వనిని పంపించండి, కొంచెం చెవులను కదపండి. ఎన్ని వర్గాలు ఉన్నాయో అవన్నీ తమ తమ సేవల ద్వారా వారికి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వండి. తమ చిక్కుముళ్ళలోనే బిజీగా ఉండేవారిని లేపండి. ఏదైతే చేస్తున్నారో అది బాగుంది, ఇప్పుడు ఇంకా మంచిగా చేయండి. బాప్‌దాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు ఈ గ్రూపుకు ఉన్నాయి మరియు అభినందనలు.
మీడియా వింగ్:- మీడియావారు ఇప్పుడు కొద్ది కొద్దిగా ప్రజల చెవులను తెరిచారు. ఇప్పుడు వినడం మంచిగా అనిపిస్తుంది, కొందరు అలా అవడం కూడా ప్రారంభించారు. ఎంతమంది వింటున్నారో అందరూ అయిపోతే ఏమవుతుంది? మీడియా కమాల్ చెయ్యగలదు అని బాప్‌దాదా సాకారంలో కూడా అనేవారు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో చూస్తున్నారు, కొద్దిగా ఆలస్యంగా చేసారు కానీ ఆలస్యంలో కూడా సరైన రీతిలో ఉంది. సందేశాన్ని వ్యాపింప చేసే సాధనము ఇంట్లో కూర్చునే చెయ్యగలగడము మీడియానే చేయగలదు ఎందుకంటే ఈరోజుల్లో మనుష్యులు సమయము ఉండి కూడా ఏమని సాకు చెప్తారంటే బాగుంది కానీ సమయం లేదు అని అంటారు. ఈ సాకును కూడా మీడియావారు సమాప్తం చేయగలరు. కేవలం మంచిగా అనిపించింది కాదు, మంచిగా తయారు చేసి చూపించండి. ప్రారంభమయింది, మంచి ప్రభావముంది, శ్రమ కూడా బాగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు కొంచెం ధ్వనిని మరింత పెంచండి. క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారు చెయ్యండి. ధ్వనిని పెంచడంలో మీకు సహయోగిగా అయ్యేవారిని తయారుచెయ్యండి. ఇటువంటివారిని కూడా తయారు చెయ్యండి. కొందరు చేయించేవారు, కొందరు చేసేందుకు నిమిత్తమయ్యేవారు, బాగుంది. మీడియాకు అనేక రకాల సేవలు ఉన్నాయి కావున భిన్న భిన్న ప్రకారాలుగా ధ్వని వ్యాపిస్తూ ఉంటుంది. సంబంధ సంపర్కంలోకి తీసుకు వస్తూ ఉండండి. మరి మీడియా డిపార్టుమెంటుకు కూడా, ఎంతైతే చేసారో, బాగా చేసారు, అందుకు బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. బాప్‌దాదా విని, సంతోషంగా ఉండటం చూసి సంతోషిస్తారు ఎందుకంటే దుఃఖీ ఆత్మల దుఃఖాన్ని చూసి దయ కలుగుతుంది. పిల్లలే కదా, సొంతవారైనా, పరాయివారైనా కానీ పిల్లలే కదా అందుకే మరిన్ని ప్లాన్లను పెంచుతూ వెళ్ళండి. అచ్ఛా.
కల్చరల్ వింగ్:- కల్చరల్ - కల్చర్ రెండూ కలుస్తాయి. మరి కల్చరల్ ద్వారా కల్చర్ తయారు కావాలి, ఇదే సేవను చేస్తున్నారు. బాప్‌దాదా ప్రతి వర్గంవారి ఉల్లాస ఉత్సాహాలను చూస్తుంటారు కూడా. ప్రతి ఒక్కరూ తమ తమ విధితో సేవను అయితే పెంచుతున్నారు కానీ ఇప్పుడు నిమిత్తంగా ఉన్నది కల్చరల్, ఏమి తయారు చేయాలి? కల్చర్. ఎప్పుడైతే మనుష్యాత్మల కల్చర్ మారిపోతుందో, ఇప్పుడైతే మీరు కల్చరల్ చూపిస్తారు కానీ కల్చర్ మారడం ద్వారా వారు కూడా తమ కార్యాలలో ఉంటూ కూడా సంతోషపు నాట్యాన్ని చేయడం ప్రారంభిస్తారు. ఎలా అయితే మీరు డాన్స్ చేసి చూపిస్తారు కదా, మరి ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా కానీ మనసులో సంతోషపు నాట్యం జరగాలి. ఇంటింటిలో డాన్సు జరగాలి. లక్ష్యమైతే మంచిగా ఉంది. లక్ష్యాన్ని తీసుకుని సేవను పెంచుతూ కూడా ఉన్నారు కానీ ఎవరు కంకణాన్ని తయారు చేసి తీసుకు వస్తారో చూడాలని బాబా ఆశిస్తున్నారు. ఏ వర్గం ఇందులో నంబరువన్ లేక నంబర్‌వన్‌కు సహయోగిగా అవుతుంది? ఇప్పుడు కొంచెం నవీనత కావాలి ఎందుకంటే బీజమైతే వేసారు. అన్ని వర్గాలవారు బీజమునైతే బాగా వేసారు కానీ ఇప్పుడు ఫలము కనిపించాలి. కనీసం 9 లక్షలకన్నా కొంచెం పెరగాలి కదా. మరి మంచిది, పిల్లలందరూ భిన్న భిన్న వర్గాల కారణంగా బాధ్యులుగా అయితే అయ్యారు. అటెన్షన్ కూడా వెళ్తుంది, ఇప్పుడు వృద్ధిని కొంచెం త్వరగా చేయండి ఎందుకంటే సమయపు పిలుపు చాలా ఉంది, దుఃఖము, అశాంతి పెరుగుతన్నాయి, భయము పెరుగుతుంది. మీరు సంతోషపు డాన్సును వెయ్యండి. భయభీతులను రక్షించండి. బాగుంది. ప్రతి ఒక్కరూ సేవా క్షేత్రంలో బిజీగా కూడా ఉంటున్నారు, ఇది కూడా మంచిది. ముందుకు సాగుతూ వెళ్ళండి, కల్ప క్రితపు తమ తోటివారిని కూడా వెతికి పట్టుకోండి. అచ్ఛా. చాలా బాగుంది, బాగుగా ఉంటుంది మరియు వృద్ధి అవుతూ ఉంటుంది.
ఇంటర్నేషనల్ యూత్ మరియు చిల్డ్రన్ రిట్రీట్ జరుగుతుంది:- పిల్లలను ముందుంచండి. బాప్‌దాదా పిల్లల సమాచారాన్ని కూడా విన్నారు. బాగుంది, ఒకవేళ పిల్లలు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు తయారైతే పిల్లలు సుభాన్ అల్లాహ్ పిల్లలు అని బాప్‌దాదాకు సంతోషముగా ఉంటుంది. కానీ ఏ ప్రతిజ్ఞనైతే చేసారో, ఏదైతే వ్రాసారో, తయారు చేసిన కమల పుష్పాన్ని చూపించండి. ప్రభుత్వం కూడా యూత్ గ్రూపులో పరివర్తనను చూడాలని ఆశిస్తుంది ఎందుకంటే యూత్‌లో ఒక విశేషత ఉంది, యూత్ గ్రూప్ ఏది తలుచుకుంటే అది, ఒకవేళ మనసులో సంకల్పం చేస్తే అది చెయ్యగలరు. అది చెడుగా కావచ్చు, మంచిగా కావచ్చు కానీ యూత్ కమాల్ చేసేవారు. ధమాల్ కాదు, కమాల్. ప్రభుత్వం కూడా యూత్‌ను ఇష్టపడుతుంది. బాబా ఎదుట ఈ కమల పుష్పంలో తమ ప్రతిజ్ఞలను చక్కగా వ్రాసారు. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు, పరివర్తన గురించి సదా అమృతవేళ బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తూ బాప్‌దాదాకు రిజల్టును వినిపించండి. అంతే కాక ఏ సేవా స్థానంలో ఉంటారో అక్కడ తమ టీచరుకు ప్రతిజ్ఞ మరియు లాభము - ఏ ప్రతిజ్ఞ అయితే చేసారో దానివలన ఎంత లాభము కలిగింది అని రిజల్టును ఇస్తూ ఉండండి. టీచర్లు బాప్‌దాదా వద్దకు చేరుస్తూ ఉంటారు. ట్రైనింగ్ రూపురేఖలు చాలా బాగున్నాయి అని బాప్‌దాదా విన్నారు. అందరూ ఎంతో అభిరుచితో చేసారు, ఇందుకు యూత్ గ్రూపుకు బాప్‌దాదా పదమా పదమారెట్ల అభినందనలు ఇస్తున్నారు. పక్కాగా ఉండండి, కచ్చాగా కాదు. కచ్చాగా ఉంటే దానిని పక్షి తినేస్తుంది, పక్కాగా ఉన్నవాటిని తినదు. సదా ఫరిశ్తాగా అయి ఎగురుతూ ఉండండి. ఈ దేహ రూపి ధరిత్రిపై పాదము పెట్టకండి, ఎగురుతూ ఉండండి. బాగుంది, కుమారీలు కూడా ధైర్యవంతులు. భట్టీ చేసేవారు కాదు, భట్టీలో విన్నదాన్ని చేసి చూపించేవారు. అంతే కదా. చేసి చూపిస్తాము అన్న వారు చేతులెత్తండి. చేసి చూపించేవారు, అచ్ఛా. చాలా మంచిది. చెప్పినట్లుగా చెప్పిన వెంటనే చేసేవారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. పిల్లలతో కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలు తమ ఉల్లాస ఉత్సాహాలతో సమయాన్ని కేటాయించారు మరియు ప్రామిస్ కూడా చేసారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు.
డబల్ విదేశీయులు:- డబల్ తీవ్ర పురుషార్థీలు. ఇప్పుడు డబల్ విదేశీయులు కాదు, డబల్ తీవ్ర పురుషార్థీలు. డబల్ విదేశీయుల విశేషత ఏమిటంటే వారు ఎక్కువగా చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంటారు. మరి మీరందరూ పక్కాగా బాప్‌దాదా చేతిలో చేయి వేసారు కదా, అంటే తమ సహవాసిగా చేసుకోవడము, స్నేహితుడిగా చేసుకోవడము. లవ్లీ ఫ్రెండ్. మరి ఫ్రెండ్‌గా చేసుకున్నారా? స్నేహ బంధం త్వరగా గుర్తుకు వస్తుంది, ఏ కష్టము వచ్చినా తండ్రికి చెప్పరు, స్నేహితునికి చెప్తారు. మీరు ఖుదాను తమ నేస్తంగా చేసుకున్నారు. అవును కదా, ఖుదా దోస్తు కదా. బాగుంది, బాప్‌దాదాకు విదేశీయులను చూసి సంతోషంగా ఉంటుంది ఎందుకంటే, కారణము ఏమిటి? బాబాకు ఉన్న ఒక పేరును వీరు ఋజువు చేసారు, విశ్వ పిత, విశ్వ కళ్యాణకారి. మొదట భారత కళ్యాణకారిగా ఉన్నారు కానీ విదేశీయులు బాబాకున్న విశ్వ కళ్యాణకారి పేరును ప్రత్యక్షం చేసారు. మొదట్లో విశ్వ సేవ కేవలం మనసు ద్వారానే చేసేవారు, ఇప్పుడు విశ్వంలోని అన్ని వైపుల సేవ చేయడానికి నిమిత్తమయ్యారు. ఇంకా చూడండి, మూల మూలల నుండి తప్పిపోయిన వాహ్ వాహ్ పిల్లలు ఎంత మంది వెలువడ్డారో! మేము ప్రతి కల్పానికి సహవాసులము అని మీకు నషా ఉంది. ఉన్నారు మరియు ఉంటారు కూడా. అవును కదా. నషా ఉంది కదా! చూడండి, మీరు మూల మూలన ఉన్నప్పటికీ బాబా దృష్టి మిమ్మల్ని గుర్తించింది. బాబా కూడా గుర్తించారు, మీరు కూడా గుర్తించారు. ప్రజలు పాపం వస్తారు, వస్తారు, వస్తారు అని అంటుంటారు. మరి మీరేమంటారు? వచ్చేసారు. పాట పాడుతారు కదా, నా బాబా వచ్చేసారు (మేరా బాబా ఆ గయా). చాలా బాగుంది, అందరికీ బాబా హృదయపూర్వక ప్రేమను, ప్రియస్మృతులను, హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు.
అచ్ఛా, సింధీ గ్రూపు కూడా వచ్చింది. బాప్‌దాదా విశేషంగా మీ ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు. నిమిత్తమై ఇప్పుడు ఫాస్టుగా వెళ్ళే సంకల్పాన్ని తీసుకున్నందుకు అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఫాస్టుగానే ఉండండి. ఢీలా కాకండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎగురుతూ ఉండండి. అవును, చప్పట్లు కొట్టండి. ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చారు, వచ్చారు కదా, మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇతరులను కూడా నిమిత్తం చెయ్యండి ఎందుకంటే బాప్‌దాదా సింధ్‌లో వచ్చారు, మరి సింధ్వారు ముందుండాలి.
అచ్ఛా, ఈరోజు 12 వరకు జరగాలి కదా. మీరందరూ కూడా 12 గురించి ఎదురు చూస్తున్నారు. తండ్రితో ప్లిలలు కలవడం, జరుపుకోవడం ఎంత బాగుంది కదా. అచ్ఛా.
మొదటిసారి వచ్చినవారు లేచి నిల్చోండి. మొదటిసారి వచ్చినవారికి తమ జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ఎలా అయితే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబరును తీసుకోండి. బాప్‌దాదా ప్రతిజ్ఞ ఏమిటంటే లాస్టులో వచ్చినా కానీ ఇప్పుడు లేట్ అన్న బోర్డు పడ్డది, టూ లేట్ ఇంకా రాలేదు. ఎవరైనా లాస్ట్ ఈజ్ ఫాస్ట్ మరియు ఫాస్ట్ ఈజ్ ఫస్ట్ తీసుకోవచ్చు. మేము ఆలస్యంగా వచ్చాము అని అనుకోకండి. ఇప్పుడైనా డబల్ తీవ్ర పురుషార్థానికి లక్ష్యము, లక్షణాలు సమానంగా చేసుకుంటే చేరుకోగలరు. లక్ష్యము ఉన్నతంగా మరియు లక్షణము తక్కువగా ఉంటే ఫస్ట్లోకి వెళ్ళలేరు. కానీ లక్ష్యము మరియు లక్షణమును సమానంగా చేసుకుని నడిస్తే మీరు లాస్ట్ మరియు ఫస్ట్‌కు ఉదాహరణగా అవుతారు. కావున పురుషార్థానికి లక్ష్యాన్ని పెట్టుకోండి. తర్వాత టూ లేట్ బోర్డు పడిపోతే ఫస్ట్ నంబరులోకి రాలేరు. ధైర్యాన్ని ఉంచి ఉల్లాస ఉత్సాహాలతో సమ్ముఖానికి చేరుకున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సదా మర్యాదపూర్వకంగా నడుచుకోండి మరియు బాబా హృదయానికి సమీపంగా ఉండండి అప్పుడు అతి కొద్ది సమయంలోనే అనుభవం చెయ్యగలరు. ఇప్పుడు బంగారు అవకాశము, ఎవ్వరైనా చెయ్యవచ్చు. భారతదేశంలో కావచ్చు, విదేశాలలో కావచ్చు. మరి అర్థమయిందా, డబల్, ట్రిపల్ పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. సదా బాబాతో పాటు కంబైన్డుగా ఉండాలి. ఏ కష్టము వచ్చినా, భారము వచ్చినా బాబాకు ఇవ్వడమైతే వచ్చు కదా, అప్పుడు నిశ్చింత చక్రవర్తిగా అయి ఎగురుతూ ఉంటారు. మనసులో భారాన్ని పెట్టుకోకండి. కొంతమంది పిల్లలు అంటారు నెల అయిపోయింది, 15 రోజులు అయిపోయాయి, భారము నడుస్తూనే ఉంది అని. ఆ 15 రోజులలోనే ఒకవేళ కాలుడు వస్తే? అందుకే అదే సమయంలో భారాన్ని బాబాకు ఇచ్చేయండి. ఇవ్వడం వచ్చా? ఇవ్వడం తప్పకుండా నేర్చుకోండి. మరి ఏమి చేస్తారు? ఇవ్వడం నేర్చుకున్నారా? బాప్‌దాదా వచ్చిందే ఎందుకు? పిల్లల భారాన్ని తీసుకోవడానికి. ఇంతటి ధైర్యాన్ని ఉంచేవారు చేతులెత్తండి. శారీరిక చేతిని ఎత్తుతున్నారా లేక మనసా చేతిని ఎత్తుతున్నారా? మనసా చేతిని ఎత్తండి. అచ్ఛా. బాప్‌దాదా ఇటువంటి పిల్లలకు పదమా పదమారెట్ల అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా.
ఈ సంవత్సరానికి హోమ్‌వర్కు అయితే బాప్‌దాదా ఇచ్చేసారు. ఈ సంవత్సరాన్ని ఈ విధితో జరుపుకోండి. బాప్‌దాదా ఈ తారీఖు వరకు ఇచ్చిన హోమ్‌వర్కును కూడా చూసారు, విన్నారు. కేవలం చేసిన సంకల్పంలో దృఢత్వాన్ని తీసుకురండి. నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యపు మాటలు ఎలా ఉంటాయి అని బాప్‌దాదా వినిపించి ఉన్నారు. ఒకటి లే, లే, రెండు తే, తే....ఈ రెండు మాటలు నిర్లక్ష్యానివి. ఏ సంకల్పమైతే చేసారో, ఇప్పుడైతే సంతకం చేసారు కానీ దానికి ఎవ్వరూ చెరపలేని దృఢ సంకల్పము అనే ప్రభుత్వ స్టాంపు వేయించుకోండి. ఈ జన్మకు దృఢత్వము అన్నిటికన్నా పెద్ద బహుమతిగా భావించండి. అచ్ఛా.
సదా సఫలతకు తాళంచెవి అయిన దృఢత్వాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఈ తాళంచెవి మాయకు కూడా చాలా ప్రియమైనది. కావున హృదయము అనే డబ్బాలో దీనిని భద్రంగా పెట్టుకోండి. దృఢత్వమే సఫలతకు తాళంచెవి. సఫలత బాబా సమానంగా కావడానికి సహజ సాధనము. సదా నిశ్చయము మరియు నిశ్చితమైన విధి. స్వరాజ్య అధికారి మరియు విశ్వ రాజ్యాధికారి ఈ రెండూ నిశ్చితమై ఉన్నాయి. ఇటువంటి నషాలో సదా గర్వంగా ఎగురుతూ ఉండండి. ఇప్పుడు ఎలా అయితే వీడ్కోలు మరియు అభినందనలు తెలుపుతామో అలాగే ఈ సంవత్సరంలో రోజూ తమ లోపల ఉన్న బలహీనతలకు వీడ్కోలు చెప్పండి మరియు బాప్‌దాదా నుండి విశేషమైన అభినందనలు తీసుకోండి. ఈ సంగమయుగము వీడ్కోలు మరియు అభినందనల సమయము. సంగమయుగములోని ప్రతి రోజూ అభినందనలకు పాత్రులుగా అవుతూ ఉండండి. బాప్‌దాదాకు ప్రతి పిల్లవాడు అతి ప్రియమైనవారు. నంబరువారీగా ఉన్నా, నంబరువన్‌గా ఉన్నా కూడా నంబరువారీగా ఉన్నాకూడా వారు బాప్‌దాదాకు ప్రతి కల్పము అతి గారాల పిల్లలు. కావున గారాబంగా అయిన మీ భాగ్యాన్ని సదా గుర్తుంచుకోండి. చిన్న విషయము, ఏ కష్టము వచ్చినా మనస్ఫూర్తిగా నా బాబా అని ఆర్డరు చెయ్యండి, బాబా తప్పక బంధింపబడి ఉన్నారు. కానీ మనసులో మరేదీ పెట్టుకోవద్దు. నా బాబా అని అంటూ మనసులో బలహీనత కూడా పెట్టుకుంటే బాబా సహయోగమును ఇవ్వరు. హృదయము స్వచ్ఛంగా ఉంటే కోరిక నెరవేరుతుంది. చెత్తతో ఉన్న హృదయంలోకి బాబా రారు. స్నేహంతో గుర్తు చెయ్యండి. కేవలం జ్ఞానం ఆధారంతో కాదు, జ్ఞానము బీజము మరియు స్నేహము నీరు వంటిది అని వినిపించి ఉన్నాము. కేవలం జ్ఞానంతో వెళ్ళడము కానీ హృదయపూర్వక ప్రేమను అనుభవం చెయ్యలేదు, ప్రేమతో బాబాను గుర్తుచెయ్యలేకపోతే ప్రాక్టికల్‌లో ఫలితాన్ని అనుభవం చెయ్యలేరు. అనుభవీ స్వరూపమే ఫలితము. నీరు లేకపోతే ఎండిన చెరుకు గెడలా అవుతుంది. కోర్సులు చేయించండి, భాషణ చేసి రండి, బహుమతిని కూడా తీసుకురండి, రోజుకు నాలుగు నాలుగు భాషణలు చెయ్యండి కానీ హృదయపూర్వక ప్రేమ లేకపోతే జరగదు. బాబాపై హృదయపూర్వక స్నేహానికి గుర్తు బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్కరితో స్నేహము. స్నేహము లేకపోతే మాయ విఘ్నాలు చాలా వస్తాయి ఎందుకంటే నీరే వెయ్యకపోతే ఫలము ఎలా వస్తుంది! జ్ఞానమైతే అర్థమైంది, బాబాతో సర్వ సంబంధాలు కూడా ఉన్నాయి కానీ అనుభవం జరగడం లేదు అని కొంతమంది పిల్లలంటారు. అనుభవము ఫలము, ఎండిన జ్ఞానిగా కావద్దు. స్నేహి, బాబాకు స్నేహిగా ఉన్నవారు పరివారానికి స్నేహిగా స్వతహాగా అవుతారు ఎందుకంటే బాబా సమానము కదా. బాబాకు లాస్ట్ సంతానముపై కూడా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరినీ స్నేహ వృత్తితో చూస్తారు. కావున కేవలం జ్ఞానిగా మాత్రమే కావద్దు, భాషణ ఇచ్చేవారిగా కావద్దు, భావన స్వరూపులుగా కండి. బాబాతో హృదయపూర్వక ప్రేమ ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. లేక ఎప్పుడు అవసరముంటుందో అప్పుడు మాత్రమే ప్రేమ వస్తుందా! అటువంటివారు జ్ఞానీభక్తులు. మరి ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? స్నేహ వాతావరణము - ఎవ్వరిని చూసినా, బలహీనమైనవారిని చూసినా కూడా. ఎందుకంటే వారు కూడా పురుషార్థీలే కదా. పరివారంవారే కదా. పడిపోయిన వారిని పడవేయకండి. ఉల్లాస ఉత్సాహాలను పెంచండి. స్నేహ వాతావరణాన్ని తయారు చేయండి. అచ్ఛా.
ప్రియస్మృతులైతే నలువైపుల ఉన్నవారికి బాప్‌దాదా ఇచ్చేసారు. నలువైపుల ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్‌దాదా ఇచ్చిన హోమ్‌వర్కును ప్రాక్టికల్‌లో చేసి ఋజువును ఇచ్చే సుపుత్రులుగా తమ ప్రభావాన్ని చూపిస్తారు. నలువైపుల ఉన్న పిల్లలకు చాలా-చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వకంగా పదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన, శ్రేష్ఠ పిల్లలకు బాప్‌దాదా నమస్తే.
దాదీలతో :- ఎంతో ప్రేమ కూడా ఉంది మరియు ఆశలు కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది చెయ్యగలరు. ఎలా అయితే మీ అందరి దాదీ నిమిత్తమయ్యారు కదా. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాలనకు నిమిత్తమయ్యారు కాబట్టి ఆటోమేటిక్‌గా గుర్తుకు వస్తారు. బాప్‌దాదా విషయమైతే వదిలిపెట్టండి. దాదీ అయితే మీవలె ఉండేవారు కదా. కానీ చేసి చూపించారు. బ్రహ్మాబాబా అవ్యక్తమవుతున్న సమయంలో దాదీ అన్నిటికన్నా పెద్ద పేపరును ఇచ్చారు. అటువంటి వాతావరణం అకస్మాత్తుగా రావడము, దాదీ ధైర్యము ఉంచడము మరియు అందరికీ సహయోగిగా కావడము, ఇదైతే కమాల్ కదా. అందరూ ఆ సమయంలో తోడు నిలిచారు కానీ నిమిత్తమైతే దాదీ అయ్యారు కదా. దాదీ విశేషత ఏమిటి? స్వచ్ఛమైన హృదయము, కోరిక నెరవేరడము. ఎవరి విషయమును మనసులో పెట్టుకోలేదు. నిర్లక్ష్యంగా ఉన్నవారిని చూడగానే వారికి ఉల్లాసాన్ని ఇచ్చేవారు. నిర్లక్ష్యంగా ఉన్నారు, వదిలేద్దాము అని అనుకోలేదు. ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే అందరి మనసుల నుండి మా దాదీ అని వస్తుంది. మా దాదీ అని అందరూ మనస్ఫూర్తిగా చెప్తారు కదా. అందుకే మీరు గ్రూపు తయారు చేయండి, బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యమునైతే పెట్టుకున్నారు కానీ కనీసం దాదీ సమానమైన భావననైతే ఇవ్వాలి. ఇటువంటి గ్రూపు కావాలి. ఒకరు కాదు. ఒకరికొకరు తోడుగా నిలిచి ఇటువంటి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించండి. అప్పుడు బాప్‌దాదా ఆ గ్రూపుకు విశేషమైన బహుమతిని ఇస్తారు. ఏమి ఇస్తారు అని చెప్పము. కానీ ఇస్తాము. తీసుకోవలసిందే. ఇటువంటి ఆత్మిక సంభాషణను చేయండి. మీటింగ్ చేస్తారు, అదికూడా అవసరమే కానీ ఇటువంటి ఉల్లాస ఉత్సాహాల ఆత్మిక సంభాషణను కూడా చేయండి అప్పుడే సరైనదిగా ఉంటుంది. గ్రూపు చేయవలసిందే. ఎలా అయితే చూడండి, ఈ 6-7మంది సమయాన్ని కేటాయించి అంతర్ముఖి అయ్యారు కదా, (సోదరీలు భట్టీ చేసారు) సమయము లభించింది కదా, ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. మరి ఏది వీలవ్వదు! దాని ప్రభావము కూడా ఉంది, ప్రాక్టికల్‌గా ఋజువు కూడా ఉంది. ఇది తప్పనిసరి. మీరైతే (దాదీ జానకితో) ఆత్మిక సంభాషణ చేయడంలో తెలివైనవారు. ఇతరులకు సహయోగిగా అయితే ఉండనే ఉన్నారు. అంటే ఏదైనా నవీనతను చూపించండి, ఎలా నడుస్తుందో అలాగే నడవనివ్వకండి. దీనివలన సమయము సమీపంగా వస్తుంది. ఇప్పుడు చూడండి భయంతో కూడా మొర పెట్టుకుంటున్నారు, సాగదీస్తున్నారు, ఏది కావాలంటే అది చేసెయ్యండి అని కాదు, ఏదో ఒక కారణంతో చల్లబడిపోతుంది. అందుకే ఇది చెయ్యాలి, ఈ సంవత్సరం ప్రారంభమయితే ప్లాను తయారు చెయ్యండి.
దాదీ జానకి బాప్‌దాదాకు అంకుల్, ఆంటీల స్మృతిని అందించారు:- బాప్‌దాదా ఈరోజు చెప్పినట్లుగా వి.ఐ.పిగా ఉండాలి, మైకుగా ఉండాలి మరియు వారసులుగా ఉండాలి - ఇందుకు ప్రాక్టికల్‌లో వీరు నిమిత్తమయ్యారు మరియు పరివారానికి కూడా కళ్యాణం చేసారు. అటువంటి రత్నాలనే తయారు చేసారు.
పెద్ద అన్నయ్యలతో:- ఒక్క బ్రహ్మా బాబానే అద్భుతం చేసి చూపించారు కదా. మరి మీరు ఎంతమంది. అయిపోతుంది, అయి ఉంది, కేవలం నిమిత్తం చేస్తున్నారు. నిమిత్తమైన వారికే విశేషమైన ప్రాప్తి లభిస్తుంది. సాధారణంగా అయితే అందరికీ లభిస్తుంది కానీ ఎవరైతే నిమిత్తమవుతారో వారికి విశేషమైన ప్రాప్తి ఉంటుంది. మరి వీరికి (దాదీలకు) పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోమని చెప్పాము. మీటింగ్ చేసుకోండి, కానీ ఆత్మిక సంభాషణ కూడా చేయండి. సమయము కేటాయించవలసి ఉంటుంది, అదైతే జరుగుతూనే ఉంటుంది. తమ టైమును సెట్ చేసుకోవలసి ఉంటుంది.
2008కి వీడ్కోలు, 2009కు అభినందనలు - రాత్రి 12 గంటల తర్వాత బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఇచ్చారు :-
అందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. ఈ సంవత్సరంలోని ప్రతి రోజూ స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన రూపంలో జరుపుకోండి. ప్రతి రోజూ క్రొత్త పరివర్తన. ప్రతి రోజూ క్రొత్త సేవ, ప్రతి రోజూ సదా ఉల్లాస ఉత్సాహాలు. ఒక్క రోజు కూడా చింత, చింతనతో ఉండకూడదు. ఎల్లప్పుడూ ఉల్లాస ఉత్సాహాలతో రాత్రింబగళ్లు గడవాలి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి రోజూ ఏదో ఒక క్రొత్తది స్వయం పట్ల, సేవ పట్ల చేయవలసిందే. ఈ దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపానికి తీసుకువస్తూ సంపూర్ణ తండ్రి సమానంగా అయి ఎగరండి మరియు ఎగిరించండి. గుడ్ నైట్. అచ్ఛా!
ఓంశాంతి