Search for a command to run...
5 Feb 2009
సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిశ్తా స్థితిలో ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసమును చేయండి
5 February 2009 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల మూడు రూపాలను చూస్తున్నారు – ఎలా అయితే తండ్రి యొక్క మూడు రూపాలు పిల్లలకు తెలుసో అలాగే పిల్లల మూడు రూపాలను బాప్‌దాదా చూస్తున్నారు. అవి ఈ సంగమయుగములోని లక్ష్యము మరియు లక్షణాలు - మొదటి స్వరూపము బ్రాహ్మణ్, రెండవది ఫరిశ్తా, మూడవది దేవతా స్వరూపము. బ్రాహ్మణ సో ఫరిశ్తా, ఫరిశ్తా సో దేవతా. వర్తమాన సమయములో ఇప్పుడు విశేషముగా ఏ లక్ష్యము ఎదురుగా ఉంది? ఎందుకంటే ఫరిశ్తాలుగా కాకుండా దేవతలుగా కాలేరు. వర్తమాన సమయానుసారము మరియు స్వపురుషార్థ అనుసారముగా లక్ష్యము ఏమిటంటే - ఫరిశ్తాగా అవ్వటము అనగా సంగమయుగ సంపన్న స్వరూపము - ఫరిశ్తా సో దేవతలుగా కావటము. ఫరిశ్తా యొక్క నిర్వచనమును కూడా తెలుసుకున్నారు. ఫరిశ్తా అనగా పాత ప్రపంచపు సంబంధము, సంస్కారము, సంకల్పముల నుండి తేలికగా అవ్వడము. పాత సంస్కారాలన్నిటి నుండి తేలికగా ఉండాలి. కేవలం మీ స్వభావ సంస్కారాలు, సంసారము నుండి తేలిక అవ్వడము కాదు, ఫరిశ్తా అంటే సర్వుల సంబంధములోకి వస్తూ, సర్వుల స్వభావ-సంస్కారములలో కూడా తేలికతనము కలిగి ఉండాలి. ఈ తేలికదనానికి గుర్తేమిటి? ఫరిశ్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఏ కొందరికో ప్రియమైనవారిగా కాకుండా సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలా అయితే బ్రహ్మా బాబాను ప్రతి ఒక్కరూ నా వారని భావిస్తారో, ‘నా బాబా’ అని అంటారో, అలాగే ఫరిశ్తా అనగా సర్వులకు ప్రియమైనవారు. బ్రహ్మా బాబా అయితే బ్రహ్మాయే కదా అని కొంతమంది పిల్లలు ఆలోచిస్తారు, కానీ మీరందరూ బ్రాహ్మణ ఆత్మలలో మీ సమానంగా ఉన్న మీ అందరి ప్రియమైన దాదీని చూసారు. వారిని అందరూ ప్రేమతో, నా దాదీ అన్న అనుభూతిని చేస్తూ వచ్చారు. అన్ని వైపుల స్వభావము, సంస్కారము మరియు ఈ పాత ప్రపంచములో ఉంటూ కూడా న్యారీ మరియు ప్యారీ (భిన్నముగా మరియు ప్రియముగా)గా ఉండినారు. అందరూ మా దాదీ అని అధికారముతో చెప్తారు. ఇందుకు కారణమేమిటి? స్వయం స్వభావ సంస్కారముల నుండి తేలికగా ఉండేవారు. సర్వులకు నా వారు అని అనుభవము చేయించారు. ఉదాహరణగా నిలిచారు. జగదాంబను కూడా చూసారు కదా, కానీ వారైతే జగదాంబ కదా అనుకున్నారు. కానీ దాదీ అయితే మీ బ్రాహ్మణ పరివారములో మీతో పాటు ఉన్నారు. ఒకవేళ పురుషార్థము గురించి వారి నుండి విన్నా లేక వారిని అడిగినా, వారి నోటి నుండి సదా ఒకే మాట వచ్చేది – ‘‘ఇప్పుడు కర్మాతీతముగా అవ్వాలి’’. కర్మాతీతముగా అవ్వాలనే తపనలో ఇతరులకు కూడా ఇదే మాటను పదే పదే గుర్తు చేయిస్తూ ఉండేవారు. కనుక బ్రాహ్మణులందరికీ ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలు విశేషంగా ఇదే ఉండాలి, ఉన్నాయి కూడా. అయితే నంబరువారీగా ఉన్నాయి. ఇదే తపన ఉండాలి - ఇప్పుడు ఫరిశ్తాగా అవ్వవలసిందే. ఫరిశ్తా అనగా ఈ దేహము, సాకార దేహము నుండి అతీతంగా, సదా ప్రకాశ దేహధారిగా ఉండటము. ఫరిశ్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు.
బాప్‌దాదా ఇంతకముందు కూడా వినిపించారు - ఈ సృష్టిచక్రమంతటిలో ఒక్క బాప్‌దాదా మాత్రమే, నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ! అని, స్వరాజ్యాధికారి అని గర్వంతో చెప్తారు. ఫరిశ్తా అనగా స్వరాజ్యాధికారి. అలాంటి స్వరాజ్యాధికారి ఆత్మ, ప్రకాశ స్వరూపధారి. ఎవరైనా ఇటువంటి ప్రకాశపు, డబల్ తేలికతనపు స్థితిలో స్థితి అయి, ఎవరితోనైనా కలిస్తే వారి మస్తకములో ఆత్మ జ్యోతి అనే భావము, నడుస్తూ - తిరుగుతూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థము యొక్క లక్ష్యము మరియు లక్షణాలను సదా ఇమర్జ్ రూపములో ఉంచుకోండి. బ్రహ్మా బాబాలో గమనించారు కదా - ఎవరైనా (బ్రహ్మా బాబాను) కలిసినప్పుడు, దృష్టి తీసుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏమి కనిపించేది? అంతిమ సమయములో బ్రహ్మా బాబా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా మధురమైన అశరీరి స్థితిలో స్థితి అవ్వడాన్ని అనుభవము చేసారు. ఎంతటి సేవా సమాచారము ఉండినప్పటికీ కూడా ఇతరులకు కూడా సెకండులో అశరీరి స్థితిని అనుభవము చేయిస్తూ వచ్చారు. అంతేకాకుండా, ఏ మురళీని గమనించినా, పదే పదే నేను అశరీరి ఆత్మను అని చెప్తూ ఆత్మ పాఠాన్ని ఒకే మురళిలో ఎన్ని సార్లు గుర్తు చేయించేవారు! ఇప్పుడు సమయానుసారంగా చిన్న చిన్న విస్తారము యొక్క విషయాలు, స్వభావ-సంస్కారాల విషయాలు అశరీరి స్థితి నుండి దూరము చేసేస్తాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన అవ్వాలి.
బాప్‌దాదా ఏమి చూసారంటే, సేవలో ఫలితము బాగుంటుంది, సేవ కొరకు మెజారిటీ పిల్లలలో ఉల్లాస – ఉత్సాహాలు ఉన్నాయి. ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. సందేశము ఇవ్వడము కూడా ఆవశ్యకమే. బాప్‌దాదా ఈరోజు కూడా భిన్న భిన్న వర్గాల, భిన్న భిన్న స్థానాల సేవలలో మంచి ఫలితమును చూసారు కానీ అశరీరి స్థితి యొక్క వాయుమండలము తక్కువ శ్రమతో అధిక ప్రభావమును కలుగజేస్తుంది. విన్నది బాగుందనిపిస్తుంది. కానీ వాయుమండలము ద్వారా, అశరీరి స్థితి యొక్క దృష్టితో అనుభవము చేసుకుంటారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. కనుక ఫరిశ్తాపన్ యొక్క సాధనను ఇప్పుడు సేవలో విశేషంగా ఎడిషన్ చేయండి. శాంతి, సంతోషము, సుఖము, ఆత్మిక ప్రేమలలో ఏదో ఒకదానిని అనుభవము చేయించండి. నడవడికలో ప్రీతి, ప్రేమ ఉండాలి. సంబంధము ద్వారా, పరివారము ద్వారా ఏ ఆతిథ్యమునైతే ఇస్తారో దాని ద్వారా అయితే వారు అనుభవము చేసి వెళ్తారు, కానీ అతీంద్రియ సుఖం యొక్క ఫీలింగ్, శాంతి యొక్క ఆత్మిక నషాను ఇప్పుడు వాయుమండలము ద్వారా, వైబ్రేషన్ల ద్వారా అనుభవము చేయించాలని విశేషంగా అటెన్షన్లో పెట్టుకోండి. విశేషంగా అనుభవము చేయించండి, ఏదో ఒక అనుభవమును చేయించండి. వచ్చినవారు ఇక్కడి వ్యవస్థను చూసి ప్రభావితులవుతారు, కుటుంబ ప్రేమను చూపించే ఇటువంటి వ్యవస్థ మరెక్కడా కనిపించదు అని అంటారు, అలాగే ఇప్పుడు ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభవమును చేసి వెళ్లాలి. ఇప్పుడు 70-72 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఇంత సమయములో ఫలితము ఏమి వచ్చింది! శ్రమ చేశారు. కానీ ఇప్పటివరకు బ్రహ్మా కుమారీలు కర్తవ్యమును చేస్తున్నారు. బ్రహ్మా కుమారీల జ్ఞానము బాగుంది అంటారే కానీ, వీరికి జ్ఞానమునిచ్చే వారెవరు! నడిపించే వారెవరు! సోర్స్ ఎవరు! అనేది రాలేదు. మీరంతా పిలిచే ‘‘బాబా’’ అనే పదాన్ని విని ‘‘వీరి బాబా” అని అంటున్నారే కానీ “వారే నా బాబా” అనేది రావటము లేదు. తండ్రి ప్రత్యక్షత ఇప్పుడు గుప్త రూపములో ఉంది. బాబా - బాబా అని అంటారు కానీ నా బాబా, నేను బాబా వాడిని, బాబా నా వారు అనే వారు కోటిలో కొందరు మాత్రమే వెలువడుతున్నారు.
మరి సంగమయుగ లక్ష్యమేమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేసారు. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది కదా! ఆ ప్రభావము ఫరిశ్తా స్థితి ద్వారానే వాయుమండలములో వ్యాపిస్తుంది. వీరి దృష్టి నుండి ప్రకాశము లభిస్తుంది, వీరి దృష్టిలో ఆత్మికత యొక్క ప్రకాశము కనిపిస్తుంది అని అందరూ అనాలి. ఇప్పుడు తీవ్ర పురుషార్థపు ఇదే లక్ష్యమును ఉంచుకోండి - నేను డబల్ లైట్ ఫరిశ్తాను. నడుస్తూ తిరుగుతూ ఫరిశ్తా స్వరూపము యొక్క అనుభూతిని పెంచుకోండి. అశరీరి స్థితి అనుభవమును ఎక్కువ చేసుకోండి. సెకండులో ఎటువంటి సంకల్పములనైనా సమాప్తి చేయడంలో, స్వభావ సంస్కారాలలో డబల్ లైట్‌గా ఉండాలి. మేమైతే తేలికగానే ఉంటాము, కానీ ఈ విషయము ఇతరులకు తెలియదు అని కొంతమంది పిల్లలు అంటారు. కానీ ఇటువంటి డబల్ లైట్ ఫరిశ్తా స్థితి యొక్క ప్రకాశము దాగి ఉండగలదా? చిన్న స్థూల లైట్ కూడా, టార్చిలైట్ అయినా, అగ్గిపుల్ల అయినాగానీ, ఎక్కడ వెలుగు ఉన్నాగానీ అది దాగదు. మరి ఇదైతే ఆత్మిక లైట్! మీ వాయుమండలము ద్వారా వారికి - వీరెవరు! అనేది అనుభవము చేయించండి. జగదాంబగానీ, దాదీగానీ, నన్ను ఇతరులు గుర్తించలేదని అనలేదు. స్వ వాయుమండలము ద్వారా సర్వులకు ప్రియముగా ఉండేవారు. అందుకే దాదీని ఉదాహరణగా ఇచ్చాము, ఎందుకంటే, బ్రహ్మా బాబా గురించి కూడా, బ్రహ్మా బాబాలో అయితే శివబాబా ఉండేవారు కదా అనుకుంటారు! ఇక శివబాబా గురించైతే వారు నిరాకారి, అతీతుడు మరియు నిరాకారుడు కదా, మేమైతే స్థూల శరీరధారులము అనుకుంటారు. ఇంత పెద్ద సంగఠనలో ఉండేవారము. ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో నివసించేవారము అని అనుకుంటారు. సంస్కారాలను కలుపుకోవటమనగా ఫరిశ్తాగా కావటము. ఇతరుల సంస్కారాలను చూసి కొందరు పిల్లలు ఉదాసీనంగా అవుతారు. బాబా చాలా మంచివారు, బ్రహ్మా బాబా చాలా మంచివారు, జ్ఞానము చాలా బాగుంది, ప్రాప్తులు మంచిగా ఉన్నాయి కానీ స్వభావ సంస్కారాలను కలుపుకోవడము అంటే సర్వులకు ప్రియంగా అవ్వడము. కొంతమందికి మాత్రమే ప్రీతి పాత్రులుగా కావడం కాదు, ఎందుకంటే కొందరి విశేషతలను చూసి కూడా ప్రీతి కలుగుతుందని కొంతమంది పిల్లలంటారు. వీరి భాషణ చాలా బాగుంటుంది, వీరిలో ఫలానా విశేషత చాలా బాగుంది, వాణి చాలా బాగుంది అని అంటారు. ఫరిశ్తాగా కావటములో ఇవన్నీ విఘ్నాలుగా అవుతాయి. మీకు ప్రియమైనవారిగా వారిని చేసుకోండి, కానీ, నేను ఆత్మను అతీతంగా ఉన్నాను, ఈ అతీత స్థితిలో ఉండి ప్రియమైనవారిగా చేసుకోండి. విశేషత ఆధారముగా ప్రియంగా కాదు. వీరిలోని ఈ విశేషత నాకు చాలా నచ్చుతుంది అని అంటారు కదా, దానిని ధారణ చేయండి. కానీ కేవలం దీని కారణముగా ప్రియంగా అవ్వడము అనేది తప్పు. ఫరిశ్తా సర్వులకు ప్రియంగా ఉంటారు. నా వారు అని ప్రతి ఒక్కరూ చెప్పాలి. నా వారు అన్న అనుభవం అవ్వాలి. ఇటువంటి ఫరిశ్తా స్థితిని పొందడంలో రెండు విషయాలు విఘ్నాలుగా అవుతాయి. ఒకటి, దేహ భాన్, ఇది సహజముగానే అందరికీ అనుభవమే. 63 జన్మల దేహభానము మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఇక రెండవది దేహాభిమానము. దేహభాన్ మరియు దేహాభిమానము. జ్ఞానములో ఎంతెంతగా ముందుకు వెళ్తారో అంతే స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానము వచ్చేస్తుంది. ఆ అభిమానము క్రింద పడవేస్తుంది. దేహాభిమానము ఎలా వస్తుంది? ఏదైనా విశేషత ఉంటుంది కదా, ఆ విశేషత కారణంగా అభిమానము ఉంటుంది. నేనేమైనా తక్కువనా, నా భాషణ అందరికీ నచ్చుతుంది. నా సేవ యొక్క ప్రభావము పడుతుంది. ఏదో ఒక కళ, నేను బాగా సంభాళన (హ్యాండ్లింగ్) చేస్తాను. నేను కోర్సు బాగా చేయిస్తాను. జ్ఞానములో ఎంతగా ముందుకు వెళ్తుంటారో, సేవలో వృద్ధి పొందుతున్నప్పుడు, ఈ అభిమానము స్వయం పట్ల కూడా వస్తుంది మరియు ఇతరుల గుణాలు లేక కళలు లేక విశేషతల పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. కానీ ఏమి గుర్తుకొస్తుంది? దేహభానమే గుర్తుకొస్తుంది కదా! ఫలానావారి బుద్ధి చాలా మంచిది, నేను బాగా సంభాళించగలను, ఈ అభిమానము సేవలో లేదా పురుషార్థములో ముందుకు వెళ్ళే వారికి అభిమానం రూపములో వస్తుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోవాలి - అభిమానము ఉన్నవారికి అభిమానము ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి సాధనము - అభిమానము ఉన్నవారిని కొద్దిగా అయినా అవమానపరచినా, వారి ఆలోచనలు, వారి సలహాలు, వారిలోని కళలు, వారి సంభాళన చేయు విధానములో అవమానము చాలా త్వరగా ఫీల్ అవుతారు. అవమానము ఫీల్ అయ్యారు అన్నదానికి సూక్ష్మ గుర్తు క్రోధము యొక్క అంశం ఉత్పన్నమవుతుంది, ఆవేశము. అది ఫరిశ్తాగా కానివ్వదు. వర్తమాన సమయానుసారముగా బాప్‌దాదా మళ్ళీ సూచన ఇస్తున్నారు - మీ సంగమయుగ చివరి స్వరూపమైన ఫరిశ్తా స్థితిని ఇప్పుడు జీవతములో ప్రత్యక్షము చేయండి. సాకారములోకి తీసుకురండి. ఫరిశ్తాగా కావటము ద్వారా అశరీరిగా కావటము చాలా సహజమవుతుంది. మీ చెకింగ్ చేసుకోండి. సూక్ష్మరూపములో కూడా లగావ్ (తగుల్పాటు) - ఏ విశేషత, స్వయం యొక్క లేదా ఇతరుల విశేషతల పట్లగానీ కొద్దిగా కూడా అభిమానము లేదు కదా? కొందరు పిల్లలలో చిన్న విషయము జరిగినా కానీ స్థితి తలక్రిందులవుతుంది. దిల్ఖుష్, సంతోషంతో కూడిన ముఖము ఉండటానికి బదులు చింతన చేసే, చింతించే ముఖము ఉంటుంది. అంతేకాకుండా నడుస్తూ-నడుస్తూ దుఃఖితులుగా, ఉదాసీనులుగా అవుతారు. దిల్‌ఖుష్‌కి బదులుగా దిల్శికస్త్ అవుతారు. అర్థమయిందా? ఇప్పుడు మీ సంగమయుగ ఆఖరి స్టేజ్ అయిన ఫరిశ్తాపన్ యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. బ్రహ్మా బాబాను చూసారు కదా, అలా ఫాలో ఫాదర్ చేయాలి కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా మంది పిల్లలకు అనుభవము ఉన్నది. సమాచారము వినిపించాలని వచ్చేవారు కానీ సమాచారానికి అతీతముగా, ధ్వనికి అతీతమైన స్థితిలో ఉండటాన్ని, అనుభవం చేయడాన్ని గమనించారు. అనేక విషయాల సమాచారాన్ని వినిపించాలని, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది అడగాలని ఇలా ఎంతో ప్లాన్ చేసుకొని వచ్చేవారు కానీ ఎదుటకు రాగానే ఏమి చెప్పాలనుకున్నారో అది మరచిపోయేవారు. ఇదే ఫరిశ్తా స్థితి. మరి ఈరోజు ఏ పాఠమును పక్కా చేసుకున్నారు? నేనెవరు? ఫరిశ్తా. ఏ విషయములతో గానీ, ఏ విశేషతల పట్లగానీ, స్వ విశేషత నుండి, దేహాభిమానము నుండి కూడా అతీతముగా డబల్ లైట్ ఫరిశ్తా, ఎందుకంటే ఫరిశ్తా కాకుండా ఉన్నతమైన దేవతా పదవి లభించదు. సత్యయుగములోకైతే వస్తారు. ఎందుకంటే పిల్లలుగా అయ్యారు. వారసత్వమైతే లభిస్తుంది కానీ శ్రేష్ఠ పదవి లభించదు. సదా కలిసి ఉంటాము, కలిసి రాజ్యము చేస్తాము అనే ప్రతిజ్ఞ చేసారు కదా. సింహాసనముపై అయితే కలిసి కూర్చోకపోయినా రాజ్యాధికారులుగా అవుతారు. అక్కడి రాజ్యసభ చూసారు కదా. రాజ్యసభకు ఎవరెవరు అధికారులో వారు తిలకము మరియు కిరీటధారులుగా ఉంటారు. రాజ్య తిలకము. రాజ్యానికి గుర్తు కిరీటము. కనుక బహు కాలము నుండి స్వరాజ్యాధికారి, మధ్య మధ్యలో కాదు. సింహాసనముపై కూర్చోకపోయినా రాయల్ ఫ్యామిలీకి అధికారులవుతారు. అచ్ఛా!
ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేవండి:- అచ్ఛా! సభలో మూడొంతులు లేచి నిల్చున్నారు. ఎవరెవరు మొదటిసారిగా వచ్చారో వారందరికీ తండ్రితో సాకారములో కలుస్తున్నందుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. వచ్చిన పిల్లలందరికీ బాప్‌దాదా ఇదే వరదానమిస్తున్నారు – టూ లేట్ సమయములో వచ్చారు. కానీ క్రొత్తగా వచ్చి ఉన్న పిల్లల పట్ల ఒక విశేష వరదానమేమిటంటే - మేము ఎలా ముందుకు వెళ్లగలము అని ఎప్పుడూ సంకల్పము కూడా చేయకండి. టూ లేట్ ఇక మీదట వచ్చేవారికి చెప్తాము. మీరు లేట్‌గా వచ్చారే కాని టూ లేట్‌లో రాలేదు. మీ అందరి పట్ల విశేషముగా బాప్‌దాదా మరియు నిమిత్తమై ఉన్న బ్రాహ్మణ పరివార సోదర సోదరీలకు విశేషముగా ఏ సహయోగ భావన ఉందనగా - మీరు ఈ కొద్ది సమయము ఒక్కొక్క సెకండును సఫలము చేసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ సమయములోనే పొందాలి. ఒక సెకండ్ కూడా వ్యర్థముగా పోగొట్టుకోరాదు. కర్మయోగులై నడుచుకోండి. కర్మ వదలరాదు. కానీ కర్మలో యోగమును జోడించుకొని కర్మ - యోగముల బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలి. బ్యాలెన్స్ ఉంచుకునేవారికి అదనముగా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదములు) లభిస్తాయి. ఎవరెవరు లేట్‌గా వచ్చారో, టూ లేట్ అన్నది ఇక మున్ముందు రానున్నది. మీకు ఛాన్స్ ఉన్నది. కొద్ది సమయములోనే చాలా పురుషార్థము చేయవచ్చు. బాప్‌దాదా వరదానమును ఇస్తున్నారు - పిల్లల ధైర్యమునకు తండ్రి సహయోగము ఉండనే ఉంటుంది (హిమ్మతే బచ్చే మదదే బాప్).
సేవ టర్న్ గుజరాత్ జోన్ వారిది:- మంచిది. గుజరాత్ వారిలో మొదటిసారి క్రొత్తగా వచ్చిన వారు లేవండి. గుజరాత్ వారిలో తండ్రితో మొదటిసారి మిలనము జరుపుకోవడానికి వచ్చిన వారు చేతులూపండి. (6వేల మంది గుజరాత్ నుండి వచ్చారు). బాగుంది. వచ్చేసారు కదా! మీ మధువనము. బాప్‌దాదా యొక్క మధువనాన్ని చూసారు. దీనికి కూడా శుభాకాంక్షలు. మంచిది. ఇప్పుడు గుజరాత్ వారందరూ లేవండి, బాప్‌దాదా ప్రారంభము నుండి గుజరాత్‌ను మధువనానికి ఒక గది (అత్యంత సమీపములో ఉండేది) అని భావిస్తారు. అందరికంటే సమీపములో ఉన్న సహయోగులు, స్నేహితులు. ఇప్పుడు వర్తమాన సమయములో బాప్‌దాదా రిజల్ట్‌లో ఏమి చూసారంటే - ప్రతి ఒక్క జోన్ వారు పరస్పరములో కలిసి జోన్‌ను నిర్విఘ్నముగా తయారుచేసే ప్రోగ్రామును తయారు చేసి నిర్విఘ్నముగా అవ్వాలి అని బాప్‌దాదా హోమ్‌వర్క్ ఇచ్చారు. అన్ని జోన్లవారు తమ తమ రూపములలో హోమ్‌వర్క్‌ను చేస్తూండవచ్చు కానీ గుజరాత్ వారు ప్రతి మాసములో తమ రికార్డ్ (ఫలితము)ను చూపారు. ప్రతి మాసము టాపిక్ మరియు సమాచారమును ఇచ్చిపుచ్చుకొన్నారు, దీని ద్వారా సంగఠనలో ఉల్లాసము వస్తుంది. వేరువేరుగా పురుషార్థము చేస్తారు కదా. దానికంటే సమూహములో, నియమ ప్రమాణముగా ప్రోగ్రామ్‌ను ఏర్పరచుకుని చేసినట్లయితే దాని వల్ల మంచిగా అటెన్షన్ ఉంటుంది. నిర్విఘ్నముగా అయ్యారా లేదా, ఈ ప్రోగ్రాములు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఏయే అంశములలో మార్పు వచ్చింది అనే ఫలితము ఇప్పుడింకా రావాల్సి ఉంది. క్లాసులు జరిగాయి, ఇందుకు అభినందనలు. టాపిక్ తయారు చేసారు, ఇందుకు కూడా అభినందనలు. కానీ ప్రాక్టికల్‌లో ఏ మార్పు వచ్చిందనే ఫలితము ఇప్పుడు రావాలి. ఇచ్చిన హోమ్‌వర్క్‌ను బుద్ధిలో పెట్టుకుని పురుషార్థము చేసినందుకు బాప్‌దాదా అభినందిస్తున్నారు. ఇలాగే చిన్న చిన్న సమూహములను ఏర్పరచండి. బాప్‌దాదా ఈ వర్గీకరణల యొక్క ఏ సమూహములనైతే తయారు చేసారో ఆ సమూహాలు వంతులవారిగా పరస్పరములో కలుస్తూంటారు. చిన్న చిన్న సమూహాలైన కారణంగా పరస్పరములో ఇచ్చిపుచ్చుకోవటం కూడా చేయవచ్చని బాప్‌దాదా గమనించారు. అయితే వర్గములవారు కూడా చాలా మంది వచ్చారు. వారికి కూడా బాప్‌దాదా ఇదే చెప్తున్నారు - ఏ విధంగా సేవా ప్రణాళిక తయారు చేస్తారో, దానిలో బాప్‌దాదా గమనించారు. 3 - 4 వర్గాలవారి ఫలితము కూడా వచ్చింది. కానీ ఏ విధంగా సేవా ప్లాను తయారు చేస్తారో, దానిని ఆచరణలోకి తీసుకుని వస్తారో, దాని ద్వారా ప్రాక్టికల్‌లో ఎవరు సహయోగులుగా అవుతారో, సహయోగులుగా తక్కువగా అయ్యారు. స్నేహితులుగా అయ్యారు అలా ఏ విధముగా రిజల్ట్ తీస్తారో అలాగే ప్రతి వర్గమువారు ధారణ కొరకు తమ వర్గమును నిర్విఘ్నముగా తయారు చేసుకొనుట కొరకు కూడా విశేష అటెన్షన్ ఇవ్వాలి. కొందరు అటెన్షన్ పెడ్తున్నారు. ధారణ కొరకు పాయింటును కూడా పెట్టుకుంటారు. కానీ ఫలితము, చేసారా చేయలేదా, వృద్ధి చెందిందా లేదా, పరివర్తన జరిగిందా లేదా అన్న ఫలితము కూడా రావాలి. పరివర్తనకు ఏదైనా ఒక ఉదాహరణను చూపాలి. సేవలో అటెన్షన్ పెట్టినందువలన సేవ వృద్ధి చెందింది కదా, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ధారణపైన మరింత అటెన్షన్ ఉంచాలి. ఎందుకంటే అంతిమములో సేవ చేయాలనుకున్నా కూడా చేయలేరు. ఇప్పుడు చేస్తేనే చేసినట్లు. ఆ సమయములో ఫరిశ్తా జీవితము, అశరీరిగా కావటం, సెకండులో బిందువు పెట్టడము అనేవే ఉపయోగపడతాయి. అంతే కాకుండా అది అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఒకవేళ ఈ అభ్యాసం తక్కువగా ఉంటే, సేవలోనే ఉన్నట్లయితే రిజల్టు ఏమి ఉంటుంది! సేవలో నిమగ్నము కావాలి కానీ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాలి. బాప్‌దాదా పదే పదే సూచన ఇస్తున్నారు - అకస్మాత్తుగా జరుగుతుంది మరియు ఇటువంటి పరిస్థితులలోనే జరుగనున్నది. అంతిమములో మీరు మాకు చెప్పలేదు అని ఎవరు కూడా తండ్రి వద్ద ఫిర్యాదు చేయరాదు. అందువల్లనే బాప్‌దాదా పదే పదే భిన్నభిన్న సూచనలనిస్తున్నారు. సేవకు ఫలితము లభిస్తుంది. సేవకు మార్కులు, ఎందుకంటే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి కదా. సేవ అనే సబ్జెక్టులో మార్కులు లభిస్తాయి కానీ మిగిలిన మూడు సబ్జెక్టులు, ఒకవేళ ఒక సబ్జెక్ట్‌లో మీరు మార్కులను పొందారు కానీ మిగిలిన మూడింటిలో తక్కువ మార్కులను పొందినట్లయితే నంబరు ఏమి లభిస్తుంది? నాలిగింటిలోనూ ఫస్ట్ నెంబర్ రావాలి – ఇది పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్‌దాదాకు ఉన్న శుభ ఆశ. మరి బాబా యొక్క ఆశా సితారలు ఎవరు? చేతులెత్తండి. తండ్రి ఆశాదీపాలైతే నాలుగు సబ్జెక్టులలో మంచి నెంబరును తీసుకోవాలి అన్నదే బాప్దాదాకున్న పెద్ద ఆశ. అలా పొందలేకపోతే పాస్ విత్ ఆనర్ లోకి రాలేరు. నాలుగు సబ్జెక్టులలో మంచి నంబర్‌ను పొందినవారినే మహారథి అంటాము. ఊరికే చెప్పటానికి మహారథి, మహారథి అంటారు, ఒకవేళ నంబర్‌ను తీసుకోలేదంటే బాప్‌దాదాకు కోరిక సితారలవుతారే కానీ ఆశా సితారలు కాలేరు. మరి ఎలా అవ్వాలి? కోరిక సితారలుగా కావాలా? కాదు. ఆశా సితారలుగా, సఫలతా సితారలుగా కావాలి. గుజరాత్ వారు మంచి లక్ష్యమునైతే ఉంచుకున్నారు. అయితే బాప్‌దాదాకు ఫలితమును పంపించండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇతరులలో కూడా ఈ సంగఠన ద్వారా ఏ లాభము కలిగింది అనే ఉల్లాసము వస్తుంది. ప్లాన్ బాగా తయారు చేశారు. అంతేకాకుండా రెగ్యులర్‌గా చేస్తూ వచ్చారు. దీనికి అభినందనలు. సరిగా ఉన్నది. అభినందనలు కూడా మరియు హోమ్‌వర్క్ కూడా, రెండూ ఉన్నాయి. మంచిది.
ఈ గ్రూప్‌లో 5 వర్గాల మీటింగ్ జరిగింది (బిజినెస్, మహిళ, సమాజ సేవ, ట్రాన్స్పోర్ట్ మరియు గ్రామ వికాసము):- అందరూ వారి వారి గుర్తులనుంచుకున్నారు. ఎవరెవరు ఏ గుర్తులను పెట్టుకున్నారో వారు ఒక్కొక్కరు ముందుకు రండి. బోర్డ్ ఉన్నా లేక సింబల్ ఉన్నా ఒకరిద్దరు వచ్చేయండి. అందరూ ముందుకు రండి. ఇది కూడా మంచిదే. ఇప్పుడు అటువైపు ముఖం పెట్టండి. మంచిది. బాగా చేశారు. ఇది కూడా అదనపు ఉల్లాస ఉత్సాహాలను నింపడానికి సాధనము. ఇప్పుడు విమానము చూడనివారు విమానమును చూసేసారా! (ట్రాన్స్పోర్ట్ వారు ఫ్లెక్సీలో విమానము తయారు చేసారు) మీ విమానములో అయితే ఎక్కుతారు కదా! ఈ విమానములో అయితే ఖర్చు అవుతుంది కానీ మీ విమానము మనస్సు, బుద్ధిల విమానము ద్వారా సెకండులో ఎక్కడి నుండి ఎక్కడికైనా ముల్లోకాలకు చేరుకోగలరు. బాగా శ్రమించారు. మంచిది.
అందరికీ సంతోషము కలుగుతుంది కదా, మంచిది. ఏయే వర్గాలున్నాయి. అచ్ఛా, బిజినెస్ వారు చేతులెత్తండి. అచ్ఛా, వీరు బిజినెస్ మరియు ట్రాన్స్‌పోర్టు వారు, ట్రాన్స్పోర్ట్ యొక్క రెండు వర్గాలవారు చేతులెత్తారు. ఇద్దరూ చేతులెత్తండి. మంచిది. మహిళలు, వీరి గుర్తే చెబుతుంది. బాబా యొక్క ఒక విషయమును ప్రాక్టికల్‌లో తీసుకు రావటము మిగిలిపోయింది. ఆ గ్రూప్‌ను ఎక్కడైనా సరే చేర్చండి. జోన్లోనైనా చేర్చండి లేదా రెండు-మూడు జోన్లు ఎవరు సమీపముగా ఉన్నారో వారిలో వి.ఐ.పి స్నేహీలు వచ్చారు, వెళ్ళారు అలా కాదు. స్నేహీలు, సంబంధములో ఉన్నవారు మరియు సంబంధము ఉంచుకున్నవారు, మురళి వినడానికి రోజూ రాకపోయినా కనీసము ఫోన్ ద్వారా వింటున్నా కానీ వరదానము, స్లోగన్ లేదా చివరిలో మురళి సారము ఉంటుంది కదా. అదైనా సరే వెళ్తూ వెళ్తూనే ఫోన్ ద్వారా అయినా విననివ్వండి. సంబంధమును ఉంచుకోవాలి. 6 నెలల తర్వాత మరలా పిలిచినప్పుడు రావటం కాదు. సంపర్కములో ఉన్నట్లయితే సంబంధము దృఢమవుతుంది. సంబంధము వారిని ఆకర్షిస్తుంది. వర్గీకరణ జరిగినప్పుడు ఒక సంవత్సరము తర్వాత వస్తారు. అటువంటి వారిని సంబంధములో ఉన్నారని అనము. సమీప సంబంధము ఉండాలి. తాము హాజరైనట్లుగా ప్రెజెంట్ మార్కునైనా వేయించుకోగలగాలి. ఫోన్లోనైనా సరే వేయించుకొని, నేను ఉన్నాను - కనీసము ఈ ప్రెజెంట్ మార్కునైనా వేయించుకోవాలి. అటువంటి వారిని ఎంత వీలైతే అంత ఒక జోన్ కానీ లేదా 2-3 జోన్లవారైనా కానీ కలిసి వచ్చి పోవటానికి వీలుగా ఉండే విధముగా సమీపములో మూడు నెలలకొకసారైనా, 6 నెలలకొకసారైనాగానీ గ్రూప్‌ను చేయండి. మొదట పరస్పరములో మీ మీ జోన్లలో చేయండి. ఎవరెవరు అనుభవము చేస్తున్నారు. ఉదాహరణకు డాక్టర్స్ అనుకోండి. ఇప్పుడు గమనించినట్లయితే పెద్ద, పెద్ద డాక్టర్లు కూడా అభ్యాసము చేస్తున్నారు మరి అటువంటప్పుడు ప్రభావము పడుతుంది కదా. ఇలాగే అన్ని వర్గాల వారికి ఒకరిని చూసి మరొకరికి ప్రభావము పడుతుంది. వీరు కూడా నడుస్తున్నారు. వీరు కూడా నడుస్తున్నారు.... అంతేకాకుండా పరస్పరములో అనుభవమును విన్నప్పుడు కూడా ప్రభావము పడుతుంది. ఇప్పుడు మీ మరొక టర్న్ వస్తే అప్పుడు ఈ ఫలితమును చెప్పండి. ఎన్ని సార్లు గ్రూపును ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ చేసారు, ఎంతమంది వచ్చారు, దాని ఫలితమును వినిపించండి. ఇది సహజమే కదా. సహజమా లేక కష్టమా? అన్ని వర్గాల వారు చేస్తారా? ఇతరులు కూడా వింటారు. అచ్ఛా!
డబల్ విదేశీ సోదర సోదరీలు 80 దేశాల నుండి వచ్చారు:- అచ్ఛా! మధుబన్‌లో అందరూ కలవాలి అని ఈ ప్రోగ్రామ్‌ను ఏదైతే తయారు చేసారో ఇది బాప్‌దాదాకు చాలా ఇష్టము. ఎందుకంటే మధుబన్కు రావడము వలన, పరివారము ఎంత పెద్దదో, సేవలు నలువైపుల ఏ విధంగా జరుగుతున్నాయో తెలుస్తుంది. విదేశీ సేవల గురించి తెలుసుకుని భారతదేశమువారు మేము కూడా ఇలా చేయాలి అని లాభము పొందుతారు, విదేశాలవారు ఇండియా వారి సమాచారమును విని తమ స్థానములో కూడా ఎక్కడ వీలయితే అక్కడ చేయాలని సమాచారము పొంది లాభము తీసుకుంటారు. ఫారెన్ వారు ఫారెన్‌లో కలవటము కష్టము, మధువనములో డబల్ లాభము ఉంటుంది. బాప్‌దాదాతో కలవటము జరుగుతుంది మరియు పరివారముతోనూ కలుస్తారు. కనుక ఇప్పుడు కొద్ది సమయము పాటు నియమానుసారముగా మధువన మీటింగులో గాని, లేక చిన్న, చిన్న గ్రూపులలోగానీ కలవటము బాప్‌దాదాకు చాలా నచ్చుతుంది. అంతేగాక ప్లాన్ కూడా మంచి మంచిగా రూపొందిస్తారు. ప్రాక్టికల్‌లో కూడా చేస్తున్నారు. దీని వృద్ధిని ప్రతి సంవత్సరము చూసి నలువైపుల ఉన్న డబల్ ఫారెనర్స్‌కు బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు, అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఎంతెంతగా అయితే సంగఠన పెరుగుతూ ఉందో, దానిలో పరస్పర అనుభవాలు వినడం ద్వారా అనేక మందికి అనుభవము ద్వారా కూడా బలము లభిస్తుంది. ఎవరైనా దుఃఖితులైతే, వారు ఇతరుల అనుభవాలు వింటారు. అప్పుడు వీరు సదా ఖుషీగా, ఆనందంగా ఉంటారు. వారి ముఖము ఎప్పుడూ వాడిపోదు. దిల్ఖుష్. ఇలా ఒకరు మరొకరి అనుభవమును వినడం వలన ఉల్లాసంలోకి వచ్చేస్తారు. ఒకరికంటే మరొకరి అనుభవము తక్కువగా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికీ డ్రామానుసారంగా ఏదో ఒక విశేషత తండ్రి ద్వారా లభించి ఉంది. కనుక ఆ అనుభవమును వినడం ద్వారా ఉల్లాసము వస్తుంది. వీరు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను! ఎప్పుడు కూడా మనసును చిన్నబుచ్చుకోకండి. పెద్ద మనసు, పెద్ద బాబా. చిన్న తండ్రియా? అత్యంత గొప్ప తండ్రి. కనుక పిల్లల హృదయము సదా విశాలముగా ఉండాలి. బాప్‌దాదా స్లోగన్ – పెద్ద హృదయము, సత్యమైన హృదయము, స్వచ్ఛమైన హృదయము ఉంటే వారి సర్వ మనోకామనలు నెరవేరుతాయి. ఏ చెత్త వచ్చినా గాని, చెత్త ప్రపంచం కదా, అప్పుడప్పుడు చెత్త వాయుమండలంలో ఎగురుకుంటూ మీ వద్దకు వస్తుంది, కానీ దానిని దగ్గర ఉంచుకోకండి. ఏవిధముగా స్థూల గదిలో పడుకుంటే, చెత్త ఉన్నట్లయితే ఏమవుతుంది? శుభ్రపరచకపోతే దోమలు వస్తాయి. తర్వాత రోగాలు వస్తాయి. ఇది కూడా ఒకవేళ మనస్సులో ఏదైనా విషయమును ఉంచుకున్నట్లయితే, తీసివేయకపోతే, అది వృద్ధి చెందుతుంది, బాబా, నా బాబా అని అంటే చాలు, హాజరవుతారు. బంధింపబడి ఉన్నారు. సంతానము, తండ్రి సంతానము, భగవంతుడి సంతానము నా బాబా అని స్మృతి చేస్తే, బాబా హాజరు కాకపోవటము ఇది అసంభవము, మీ వద్ద తండ్రిని బంధించే త్రాడు వుంది. ఏమిటది? హృదయపూర్వక ప్రేమ. అనేకమందికి తండ్రి పట్ల ప్రేమ ఉంది. లేదని చెప్పలేము. కానీ రెండు ప్రకారాల ప్రేమ ఉంది - ఒకటేమో జ్ఞానం ఆధారముతో ఉన్నది. నేను ఆత్మను. శరీరమునైతే కాను కదా, అంతేకాక ఆత్మల తండ్రి పరమాత్మయేనని మరియు పరమాత్మ జ్యోతి కాకుండా ఇంకెవరూ సర్వులకు పరమాత్మ కాజాలరు, మరి తండ్రి తండ్రియే. జ్యోతి స్వరూపము సహయోగము ఇస్తున్నారు. కానీ ప్రతి సమయము హృదయపూర్వక స్నేహముతో నా బాబా అని స్వతహాగా వెలువడాలి. సమాయానికి ఉపయోగపడతారని సహచరుడిని పెట్టుకోవడం జరుగుతుంది, కష్టకాలములో సహచరుడు పనికొస్తారు అంటారు. మరి మీ తండ్రిని మీరు కంబైండుగా ఉంచుకున్నారు. సాథీగా చేసుకున్నారు కనుక సమయానికి మీ సహచరుడిని వినియోగించుకోండి. స్నేహముతో స్మృతి చేయండి. ఒకటేమో జ్ఞానము ఆధారముగా స్నేహము. రెండవది హృదయపూర్వకమైన, ప్రేమపూర్వకమైన స్నేహము. పరిశీలించుకోండి, హృదయపూర్వక ప్రేమ ఉందా? ప్రేమను మరవటము కష్టము. సర్వ సాధారణముగా వాడే వస్తువును గమనించండి. ఉదాహరణకు షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి తినుట అనుమతించబడదు. కాని వారికి ప్రేమ తీపి పట్లనే ఉంటుంది. కనుక తియ్యదనము గుర్తొస్తుంది కదా! డాక్టర్ ఇచ్చిన మందులు కూడా వేసుకుంటారు కాని స్వీట్ తింటారు అంటే ఆ వస్తువు పట్ల ప్రేమ ఉంది కదా, చెప్పినాగాని వదలరు. మరి ఇక్కడేమో తండ్రి. సర్వ ప్రాప్తుల అనుభవమును చేయించేవారు. అందరూ వింటున్నారు కదా. నిమిత్తము విదేశీయులే అయినాగానీ అందరూ వింటున్నారు కదా. కనుక ఇప్పుడు పరిశీలించుకోండి, హృదయపూర్వక ప్రేమ ఉందా? ఖుదాను దోస్తుగా చేసుకున్నారా? దోస్తుగా ఎందుకు చేసుకుంటారు? తండ్రి కంటే కూడా స్నేహితుడితో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మరి ఖుదాను దోస్తుగా చేసుకున్నారు కదా! ఏ విషయమైనా రానీ, బాబా మీరు చూసుకోండి. చిన్న పిల్లలుగా అయిపోండి. పెద్దవారిగా కాకండి. అప్పుడు తండ్రి తీసేసుకుంటారు. ప్రేమ అనే త్రాడుతో కదలలేని విధముగా బంధించి ఉంచుకోండి. అర్థమయిందా! అందరికీ అర్థమయిందా! చాలా సార్లు చెప్తారు - బాబా! ఈ రోజు నేను బాబాను మరచిపోయాను అని. బాప్‌దాదాకు విని ఆశ్చర్యము కలుగుతుంది. మరచిపోయారా! 63 జన్మలు మరచిపోయారు. ఇప్పుడు కూడా మరచిపోయారు. ఒక్క జన్మ, అత్యంత చిన్నదైన జన్మ. 21 జన్మలు మరచిపోయారు. ఇప్పుడు కూడా మరచిపోవటమనేది ఇంకా ఉందా? అందుకే ఇప్పుడు మాయ చతురతను అర్థము చేసుకోండి. అప్పుడప్పుడు మాయను కూడా పోషిస్తారు. మేము సమయానికి తయారైపోతాము. ఇప్పుడు ఇంకొంచెం సమయము ఉంది కదా, ఇపుడింకా టూ లేట్ బోర్డ్ పడలేదు కదా, మేము తయారైపోతాము... ఇలా అంటూ ఉంటారు. మాయకు కూడా సహయోగమునిచ్చి, పోషించి, ఛాయ్, పానీ త్రాగిస్తూ దానిని మీ వద్ద ఉండేలా చేస్తారు. తండ్రిని ఫాలోఫాదర్ చేయడానికి బదులుగా మాయను ఫాలో చేసేస్తారు. పురుషార్థీలము కదా! సంపూర్ణము ఇంకా కాలేదు కదా, ఇది జరుగుతూనే ఉంటుంది కదా... ఇలా చేయడమే మాయకు ఫాలోవర్ (శిష్యులు)గా కావటము. కనుక ఇప్పుడు బాప్‌దాదా ఎప్పుడైనా పిల్లలను చూడటానికి వస్తే, సదా ముఖమును చూస్తే ఏ ముఖమును చూడాలి? అప్పుడప్పుడు ముఖము బాగుండదు. ఆలోచనలో, ఆలోచనలు చాలా చేస్తారు. ఏమి చేయాలి? ఇది చేయనా, చేయవద్దా? లాభముంటుందా? సరిగ్గా అవుతుందా? ఇలా చాలా ఆలోచిస్తారు, తండ్రిని ఫాలో చేయండి. బ్రహ్మా తండ్రి చేరుకున్నారు కదా. ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తారు? కేవలము ఫాలో చేయండి, వ్యర్థ సంకల్పాలు వస్తాయి. అల వస్తుంది. ఇది కేవలం విదేశీయులకు మాత్రమే వినిపించడం లేదు. అందరికీ వినిపిస్తున్నాము.
విదేశీ డేవిడ్ సోదరుడితో:- వీరికి చాలా ఉల్లాస-ఉత్సాహాలుండటాన్ని బాప్‌దాదా చూసారు మరియు తెలుసుకున్నారు కూడా. ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలను ప్రాక్టికల్లోకి తీసుకు రావటములో సహయోగిగా అయి సహయోగమును తీసుకుంటూ ఉంటూ, సహయోగమును ఇస్తూ ఉంటే ముందుకు వెళ్లగలరు. ఉల్లాస ఉత్సాహాలను ఎప్పుడూ ఢీలా చేసుకోవద్దు, విషయాలు వస్తాయి కాని ఉల్లాస ఉత్సాహాల రెక్కలు ఢీలాగా చేసుకోకండి. ఎగురుతూ ఉండండి. రెక్కలు ఉన్నదే ఎగురుతూ ఉండటానికి. ఉల్లాస ఉత్సాహాలు కొద్దిగా కూడా తక్కువైతే ఉన్నతంగా కాలేరు. విషయము గడిచిపోతుంది. తొలగిపోతుంది కాని ఖుషీ పోరాదు. ఉల్లాస ఉత్సాహము వెళ్ళరాదు. ఇకపోతే ఉల్లాసము బాగుండటాన్ని బాప్‌దాదా చూసారు. దానిని ఇప్పుడు సదా స్థిరముగా ఉంచుకోవాలి. జంప్ చేయగలరు.
ఫిలిప్పిన్స్‌కు చెందిన సహానీ అక్కయ్యతో:- వీరు పాతవారే. మంచివారు, సేవ చేసి తమతో తీసుకు వచ్చారు. మంచివారు. విన్నారు కదా – ఉల్లాస ఉత్సాహాలను ఎప్పుడూ వదలకండి. ఎగురుతూ ఉండండి. ఏ విషయము వచ్చినా మీరు ఎగరండి అప్పుడు ఆ విషయము క్రింద ఉండిపోతుంది. మీరు పైన ఉంటారు. అచ్ఛా!
నలువైపుల దిల్‌ఖుష్‌గా ఉండేవారు, సత్యమైన హృదయులు, స్వచ్ఛమైన హృదయులకు ప్రతి సంకల్పము, సర్వ కోరికలు నెరవేరుతాయి. దీని అర్థమేమిటంటే ఏ సంకల్పము చేసారో దాని సఫలత ప్రాప్తిస్తుంది. కావున ఇలాంటి మూడు విశేషతలు - విశాలమైన హృదయము, స్వచ్ఛమైన హృదయము మరియు సత్యమైన హృదయము గలవారు, నలువైపుల ఉన్న ఇటువంటి పిల్లలను బాప్‌దాదా చూసి పదమారెట్ల కంటే ఎక్కువగా సంతోషిస్తున్నారు మరియు ఆటోమేటిక్‌గా పాట మ్రోగుతుంది, వాహ్! వాహ్ నా పిల్లలూ వాహ్! సదా అభినందనయోగ్య పిల్లలూ వాహ్! సదా తండ్రిని సహచరుడిగా చేసుకుని నడిచేవారు, చేతిలో చేయి కలిపి, చేయి శ్రీమతమైనది, కావున సదా చేతిలో చేతిని పెట్టి ఎగిరేవారు, నడవడము సమాప్తమైనది, ఎగిరేవారు శ్రీమతమును అనగా ప్రతి అడుగులో బ్రహ్మా బాబాను ఫాలో చేయువారు, ఆలోచించకండి, చేయాలా వద్దా? సరిగా అవుతుందా, అవ్వదా? నచ్చుతుందో లేదో తెలియదు. ఫాలో చేయండి. బ్రహ్మా బాబా ఏమి చేసారు. ఏది తండ్రి చేసారో అదే సరైనది, ఆలోచించే అవసరము లేదు. ఫాలో చేయడము సహజమే కదా, ఆలోచించే అవసరమేమున్నది, ఆలోచిస్తే తల భారమైపోతుంది. తర్వాత, ఈ రోజు ఏమయిందో తెలియడం లేదు, భారముగా అయిపోయింది అని అంటారు ఎందుకంటే ఏదో ఒక విషయమును గురించి ఆలోచిస్తూ ఉండిపోతారు.
సర్వ నలువైపుల ఉన్న పిల్లలకు బాప్‌దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదములు మరియు పదమారెట్ల అభినందనలు. ఎవరైతే శివరాత్రికి ఈ సేవలో ఉంటారో, వారికి ఇప్పటి నుండే శివరాత్రి మీ జన్మదిన ఆశీర్వాదములు మరియు శుభాకాంక్షలను ఇస్తున్నాము. ఏవైతే ఉత్తరాలు, ఈ-మెయిల్స్ పంపుతారో అవి క్షణము కంటే తక్కువ వ్యవధిలో బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి మరియు బాప్దాదాపై దప్పికగా ఉన్న ఆత్మలు, బంధనములో ఉన్న వారు (బాంధేలీలు) దెబ్బలను కూడా కంఠహారముగా చేసుకునేవారు, ఇటువంటి ఆత్మలకు కూడా ప్రియస్మృతులు మరియు క్రొత్త క్రొత్త స్నేహి ఆత్మలు ఇప్పుడిప్పుడు తయారవుతున్నారు. కానీ తక్కువగా తయారవుతున్నారు. స్నేహి మరియు సహయోగి డబల్ ఉండాలి. కావున నలుదిశలలోని సర్వ యువకులు, వృద్ధులు, పిల్లలు, మాతలు, పాండవులు అందరికీ ముందుగానే, తండ్రి జన్మదిన శుభాకాంక్షలు. అచ్ఛా!
దాదీలతో:- అందరూ నంబర్‌వన్ కదా, ఎప్పుడు కూడా నంబరువారులో రాకండి. నంబర్‌వన్. బాబా పిల్లలైన తర్వాత కూడా నంబరువారీగా అయితే ఇక గొప్పతనమేముంది! నంబర్‌వన్. నంబర్‌వన్‌గా కండి, కానీ నిమిత్తము మరియు నిర్మాణులే నంబర్‌వన్. (నిర్మల శాంతదాదీగారి స్మృతిని ఇచ్చారు).
దాదీ శాంతమణి గారితో:- ధైర్వములో నంబర్‌వన్ ఉన్నారు, కనుకనే బాప్‌దాదా, ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది, తండ్రి సంతోషిస్తున్నారు.
రమేష్ అన్నయ్యతో:- (రమేష్ అన్నయ్యకు ఈ రోజు 75వ జన్మదినము). జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినమందు ఏదైనా కొంత బాప్‌దాదాకు ఇవ్వాలి. మీకేమి తోస్తే అది, మంచిది.
డబల్ విదేశీయులైన పెద్ద అక్కయ్యలతో:- చూడండి, డ్రామానుసారముగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో అందరూ భారతదేశమువారే. (జయంతి అక్కయ్యతో) వీరి జన్మ కూడా భారతదేశములోనే జరిగింది. నేరుగా బ్రహ్మా బాబా ద్వారా భారతదేశములోనే జరిగింది. మొట్టమొదట సేవాస్థానమునకు బాబాయే పంపించారు. మరి అందరూ చూడండి, ఎందుకంటే మీ పునాది పక్కాగా ఉంది. పాలన కూడా తీసుకొని ఉన్నారు కదా. ఆలస్యముగా వచ్చినా కానీ ప్రత్యక్ష పాలనను తీసుకొని ఉన్నారు. ఇది భాగ్యము. మీరు (జయంతి అక్కయ్య) మరియు రజని, రజనికి కూడా భాగ్యమున్నది. ఫోన్లో కూడా మురళిని వినేవారు. (మురళి అన్నయ్య కూడా పక్కా సోదరుడు) వారు రెండు పాత్రలను పోషించారు కానీ ఇటువైపు నడిచినప్పుడు చాలా గట్టిగా ఉన్నారు. (గాయత్రి సోదరి కూడా స్మృతిని పంపారు)
పెద్ద అక్కయ్యలు అందరితో:- బాగుంది, సంగఠనలో చూడటానికి బాగుంటుంది. మీరందరూ వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. అనేక లాభాలున్నాయి. తండ్రిని కలవడము, పరస్పరములో ఇచ్చి పుచ్చుకోవడము మరియు సర్వీస్‌లో నవీనతను తీసుకుని రావడము. ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మీ మీ సేవలు చేస్తారు కానీ పరస్పరములో అనుభవాలను వినడము వలన ఉల్లాసము వస్తుంది. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు.
సరళ దీదీతో :- బాగున్నారా! మంచి ధైర్యమునుంచారు. కష్టపడ్డారు, తప్పక ఫలము లభిస్తుంది. మంచిది.
డాక్టర్ అశోక్ మెహతా, యోగిని దీదీ మరియు రథము (గుల్జార్ దాదీగారి) యొక్క సేవను చేస్తున్న అక్కయ్యలందరితో:- మంచిది. రథమును తయారు చేసేసారు. దీనికి అభినందనలు. అందరూ మీకు హృదయపూర్వకముగా ఆశీర్వాదములను ఇస్తున్నారు. బాగుంది. ఇతర డాక్టర్ల సేవ కూడా అయిపోతుంది. వారు కూడా సమీపముగా వస్తున్నారు. చాలా బాగుంది. వీరంతా సేవ చాలా బాగా చేస్తున్నారు. అభినందనలు. మంచిది. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.
వీడ్కోలు సమయములో:- పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి అత్యంత ప్రియమైన వారు. కానీ అందరినీ విధి పూర్వకముగా స్టేజీపై కూర్చోబెట్టలేము. కానీ మీరందరు స్టేజీపైనే ఉన్నారు. స్టేజ్ కంటే సమీపముగా హృదయములో కూర్చుని ఉన్నారు. కొద్దిగా వ్యవస్థను పెట్టవలసి ఉంటుంది. కానీ ఒక్కొక్కరు తండ్రికి ప్రియమైనవారు, ఒకరి కంటే మరొకరు తండ్రికి ప్రియమైనవారు. కావున బాప్‌దాదా దృష్టి కేవలము సమీపముగా ఉన్న వారి పైన మాత్రమే కాదు, చివరి వరకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు మేము బాబా సమ్ముఖములో కూర్చుని ఉన్నామని భావించండి. బాప్‌దాదా సమ్ముఖములో ఎదురుగా కూర్చునే దృష్టినిస్తున్నారు. అచ్ఛా!
ఓంశాంతి