Search for a command to run...
22 Feb 2009
జన్మదినం రోజున ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్‌లోకి వచ్చే బహుమతిని తీసుకోవడానికి ప్రతి శ్వాస, సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయము విశాలంగా మరియు సత్యంగా ఉన్నప్పుడు ప్రతి అవసరం తీరుతుంది
22 February 2009 · తెలుగు
ఈరోజు జీరో తండ్రి తమ హీరో పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ఈరోజు మీరందరూ బాబా జన్మదినము మరియు మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు. బాప్‌దాదా పిల్లలందరికీ, సమ్ముఖంలో ఉన్నవారికి, దూరంగా కూర్చున్నవారికి కూడా హృదయానికి సమీపంగా ఉన్నవారికి, నలువైపుల ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలను అందిస్తున్నారు. అందులోనూ విశేషంగా మూడు అభినందనలు - తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు రూపాలలో పాలన, చదువు మరియు వరదానాలతో నలువైపుల ఉన్న పిల్లలకు మూడు అభినందనలు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఈరోజు ఈ విశేష జన్మను భక్తులు కూడా జరుపుకుంటున్నారు. కానీ ఈ జన్మదినం తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహానికి జన్మ దినము అని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు, దీనితోపాటు విశ్వ పరివర్తనా కార్యంలో కూడా బాబా పిల్లలతో ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల స్నేహము చాలా చాలా ఉంది. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి వెళితే అక్కడ కూడా కలిసి ఉంటాము. పిల్లలు లేకుండా బాబా వెళ్ళలేరు మరియు బాబా లేకుండా పిల్లలు వెళ్ళలేరు ఎందుకంటే హృదయపూర్వక స్నేహము తోడుగా ఉంది. ఇంటి తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యం చేస్తారు. అన్ని జన్మలలోకి ఈ జన్మ ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలలో లేదు. ఇటువంటి స్నేహపూర్వకమైన మరియు కలిసి ఉండే విశేషమైన వజ్ర సమాన జన్మ ఇది. మరి మీరందరూ మీ జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక బాబాది జరపడానికి వచ్చారా! లేక తండ్రి పిల్లలది మరియు పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరపడానికి వచ్చారా? నలువైపుల భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రిని జరుపుకుంటారు, ఎంతో ప్రేమతో జరుపుకుంటారు. బాప్‌దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తికి ఫలితాన్ని ఇస్తారు. కానీ మీరు జరుపుకునేందులో మరియు భక్తులు జరుపుకునేందులో తేడా ఉంది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృతవేళ జరుపుకుంటారు. అమృతవేళ శ్రేష్ఠమైన వేళ. అమృతవేళలోనే బాప్‌దాదా పిల్లలందరి జోలెను వరదానాలతో నింపుతారు. అందరి జోలె వరదానాలతో నిండి ఉంది కదా! ప్రతిరోజూ వరదాత అయిత తండ్రి నుండి వరదానము లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కరికీ బాప్‌దాదా ద్వారా ఎన్నెన్ని వరదానాలు లభించాయి, ఆ వరదానాలతో జోలె నిండి ఉంది కదా. అందరూ ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో చేరుకున్నారు. బాప్‌దాదా కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు మరియు వాహ్ పిల్లలూ వాహ్! అంటూ పాట పాడుతున్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్! అని అంటారు మరియు బాబా వాహ్ పిల్లలూ వాహ్! అని అంటారు. ఎందుకంటే బాబా పిల్లలుగా అయినవారందరూ కోట్లలో కొద్ది మంది ఆత్మలు. విశ్వంలో ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి, అందులో పిల్లలైన మిమ్మల్ని బాబా లక్కీ మరియు లవ్లీ పిల్లలు అంటారు, ఆ కోట్లాదిమందిలో మీరు కొద్ది పిల్లలు. ప్రతి కల్పములో కోట్లలో కొద్ది మంది ఆత్మలము మేము అన్న నషా ఉందా! వర్తమాన సమయంలో పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు ఎంతమంది ఉన్నాగానీ తండ్రిని గుర్తించి, తండ్రి జన్మ దినాన్ని జరుపుకునేవారు నలువైపులలో కోట్లలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మేము ఆ కోట్లలో కొద్దిమందిమి అన్న సంతోషము ఉందా! నషా ఉందా! చేతులెత్తండి. అవినాశి నషా ఉంది కదా! అప్పుడప్పుడూ ఉండటం కాదు కదా? సదా మరియు సదా ఉంటుంది. మాయ పేపరైతే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్ముని పిల్లలంటే చాలా ఇష్టము. కానీ పరమాత్ముని పిల్లలతో మాయకు ఆది నుండి సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు. మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇద్దరికీ పరస్పరంలో సంబంధం ఉంది. మాయ పని రావడము, పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరంనుండే పారద్రోలడము. రానివ్వకూడదా లేక రానిస్తూ ఉంటారా? లేదు. దూరం నుండే పారద్రోలండి. మీరు రానిస్తే రావడం దానికి అలవాటైపోతుంది. రానిస్తున్నారు కదా, వెళ్దాము అని అది కూడా అనుకుంటుంది. కానీ బాబా ఏమి చూసారంటే కొంతమంది పిల్లలు మాయను రానిస్తారు, అంతేకాక దానికి ఆతిథ్యం కూడా ఇస్తారు. టీ, నీళ్ళు ఇస్తారు, ఎటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారో తెలుసా? మాయా ప్రభావంలోకి వచ్చి ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడైతే ఇంకా టూ లేట్ బోర్డ్ రాలేదు కదా, ఇప్పుడింకా సమయము ఉంది, పురుషార్థం చేస్తున్నాము, చేరుకుంటాము అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ కూడా నన్ను రానివ్వడమే కాక నాకు సహాయం చేస్తున్నారు, ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, కానీ కొంతమంది మాయను గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తుంటారు. అది మాయ మతమా లేక బాబా మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తుంటారు. కానీ బాప్‌దాదా తమ లక్కీ, మహావీర మరియు విజయి పిల్లలకు చెప్తున్నారు - రానివ్వకండి, ఇప్పుడు వస్తే దానిని పారద్రోలండి. ఇందులో సమయాన్ని కేటాయించకండి. ఎందుకంటే సమయము తక్కువగా ఉంది. విశ్వ పరివర్తకులుగా అయి, విశ్వ సేవకులుగా అయి విశ్వాత్మలకు బాబా పరిచయాన్ని ఇచ్చి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అన్న మీ ప్రతిజ్ఞ, ఆ కార్యము ఇంకా పూర్తి కాలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చెయ్యడానికి సమయాన్ని కేటాయించండి. ఒకవేళ మాయను పారద్రోలడంలోనే సమయాన్ని కేటాయిస్తే విశ్వ పరివర్తకులము అన్న ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేస్తారు! తండ్రికి సహవాసులు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము....అని జన్మించగానే ప్రతిజ్ఞ చేసారు. కావున ఇప్పుడు బాబా నుండి ఏ శక్తులైతే లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుండే పారద్రోలండి. ఇందులో సమయము ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, 70 సంవత్సరాలు పురుషార్థం చేస్తూ వచ్చారు. మాయ రావడం, దాని పారద్రోలడం – ఇప్పుడు ఇందుకు సమయము కాదు. ఎందుకంటే మీకు తెలుసు, నాలెడ్జ్‌ఫుల్ కదా మీరు. పూర్తి డ్రామా జ్ఞానం ఉంది. కావుననే నాలెడ్జ్‌ఫుల్ పిల్లలూ, ఇప్పుడు సమయాన్ని ఎందులో వెచ్చించాలి? రెండు ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. ఏ రెండు ఖజానాలు? ఒకటి సంకల్పము, రెండు సమయము. రెండు ఖజానాలూ గొప్పవే. మీ అందరికీ తెలుసు కూడా ఎందుకంటే నాలెడ్జ్‌ఫుల్ తండ్రికి నాలెడ్జ్‌ఫుల్ పిల్లలు మీరు. మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్ కదా! ఫుల్, బుల్ కాదు. కొందరు నాలెడ్జ్బుల్(జ్ఞాని) గా ఉన్నారు, కొందరు నాలెడ్జ్‌ఫుల్‌గా(జ్ఞాన సంపన్నులు) లేరు. మీరు ఎవరు? నాలెడ్జ్‌ఫుల్ కదా. చేతులెత్తండి. నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారా లేక నాలెడ్జ్బుల్గా ఉన్నారా? అందరూ నాలెడ్జ్ఫుల్యే కదా? చేతులెత్తారా, మంచిది. వాహ్! ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది కదా. మాయను పారద్రోలే జ్ఞానం ఉందా? వెనుక కూర్చున్న వారికి ఉందా? అచ్ఛా. జెండాలు ఊపుతున్నారు. మాతలకు ఉందా? మాతలు నాలెడ్జ్ఫుల్యేనా? డబల్ విదేశీయులు, డబల్ విదేశీయులు కూడా జెండాలు ఊపుతున్నారు. అచ్ఛా, చూడండి ఎంత మంచి దృశ్యం కనిపిస్తుందో! జెండాలు మంచిగా ఉన్నాయి. మరి నాలెడ్జ్‌ఫుల్ అంటే మాయను దూరం నుండే పారద్రోలేవారు. మరి అలా ఉన్నారు కదా? ఎందుకంటే బాప్‌దాదా ముందుగానే చెప్పి ఉన్నారు - ఖజానాలను జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఈ సమయంలో, సంగమయుగంలోనే ఉంది, తర్వాత పూర్తి కల్పమంతటిలో జమ చేసుకునేందుకు బ్యాంక్ లభించదు. ఇప్పుడు జమ చేసుకున్నదే కార్యంలో ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడు సంగమయుగంలో తెరుచుకుంటుంది. అందుకే మీరేమంటారు, అందరికీ సందేశంలో ఏమని వినిపిస్తారు, ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు. మరి మీ అందరికీ గుర్తుంది కదా! ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు, ఇది సదా గుర్తుంటుందా? ఎందుకంటే సంగమయుగ జీవితము చాలా చిన్నది కానీ అమూల్యమైన జన్మ. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పం వరకు వస్తుంది. మరి మా జమ ఖాతా ఎంత ఉందని పరిశీలించుకున్నారా? ఎంత అనుకుంటున్నారో అంత జమ అవుతుందా? ఎందుకంటే బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు - ఇప్పుడు నడిచే సమయము సమాప్తం అయ్యింది, ఎగిరే సమయము అని. పురుషార్థం చేసే సమయం పూర్తయింది కానీ ఇప్పుడు తీవ్ర పురుషార్థం యొక్క సమయము. అది కూడా కొద్దిమందే ఉన్నారు. అందుకే బాప్‌దాదా డబల్ విదేశీయులకు డబల్ తీవ్ర పురుషార్థీలు అన్న టైటిల్‌ను ఇవ్వడం జరిగింది. చెప్పండి, డబల్ తీవ్ర పురుషార్థీలేనా! చేతులెత్తండి. డబల్ తీవ్ర పురుషార్థీలు, పక్కా? అచ్ఛా. బాప్‌దాదా అయితే జన్మ దిన శుభాకాంక్షలతో పాటు మీకు అభినందనలు అందిస్తున్నారు. పదమా పదమ రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.
బాప్‌దాదా ఓ.కే గురించి ఇచ్చిన హోమ్‌వర్క్‌పై కొంతమంది పిల్లలు అటెన్షన్ పెట్టారు. కానీ 100 మార్కులు చాలా కొద్దిమందికి మాత్రమే వచ్చాయి. 50 శాతం వారు ఎక్కువగా ఉన్నారు. కానీ బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే, ఏమి కోరుకుంటున్నారో వినిపించమంటారా? ఆశా దీపాలపై, ఆశలను తీర్చే సంపన్న మహావీర ఆత్మలపై బాబాకున్న ఆశ ఏమిటంటే సమయం అనుసారంగా ఒకవేళ ఇప్పటి నుండి తీవ్ర పురుషార్థం యొక్క బహుకాలపు చార్ట్‌ను జమ చేసుకోకపోతే మరింకెప్పుడు చేసుకుంటారు! మూడు మాటలు బాప్‌దాదా ఎప్పటికప్పుడు గుర్తు తెప్పిస్తున్నారు - ఒకటి అకస్మాత్తు, రెండు ఎవరెడీ మరియు మూడు బహుకాలంగా ఖాతా జమ చేసుకోవడం. ఎందుకంటే పిల్లలు తమ రాజ్యములో మొదటి జన్మ నుండి 21వ జన్మ చివరి వరకు పూర్తి రాజ్య భాగ్యానికి అధికారులుగా అవ్వాలన్నది బాప్‌దాదా కోరిక. ఇప్పుడిక మీ రాజ్యం వచ్చేస్తుంది అన్న సంతోషం ఉంది కదా. ఇప్పుడు బాబా వచ్చారు అన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా తమ దైవీ రాజ్యము, సుఖశాంతిమయ రాజ్యము వచ్చేసినట్లే అన్న శుభవార్తను కూడా వినిపిస్తారు కదా. మరి అందరికీ ఈ సందేశాన్ని ఇస్తున్నప్పుడు మీ పురుషార్థం కూడా తీవ్రంగా, బహు కాలం జమ చేసేదిగా ఉండాలి. ఈ లెక్కను ఎంతోకాలం స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే క్రొత్త ఇంట్లోనే మజా వస్తుంది. ఒకవేళ రెండు మూడు జన్మల తర్వాత వస్తే, రెండు మూడు నెలల ఇంటిని ఏమనంటారు, క్రొత్తదా లేక 3 నెలలది అని అంటారా? మరి బాప్‌దాదా ఏమని ఆశిస్తున్నారంటే బాప్‌దాదా యొక్క ఒక్కొక్క గారాల పిల్లలు వాహ్ వాహ్ పిల్లలూ, హృదయ సింహాసనాధికారి పిల్లలు, మొదటి జన్మలో బ్రహ్మా బాబాకు సహవాసిగా అయి రావాలి. ఇష్టమేనా! ఇష్టమేనా? ఇష్టమేనా? అచ్ఛా. మరి ఏమి చెయ్యవలసి ఉంటుంది? చెయ్యవలసి ఉంటుంది కదా. ఇష్టమే కదా, బాబాకు ఇష్టమే కానీ ఏమి చెయ్యవలసి ఉంటుంది? ఇప్పటి నుండి, సరే, గడిచిందేదో గడిచిపోయింది, బాప్‌దాదా క్షమించేస్తున్నారు, గడిచిపోయింది. ఇప్పటి నుండి జన్మదిన బహుమతిగా తండ్రికి ఏమి ఇస్తారు? బాబాకు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి కదా. బాబా జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారు, మరి బాబాకు ఏ బహుమతిని ఇస్తారు? పిల్లలందరిపై బాబాకు ఆశ ఉన్నది, లాస్ట్‌లో ఫాస్ట్ వెళ్ళవచ్చు. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా.
బాప్‌దాదా లాస్ట్ వచ్చిన పిల్లలందరికీ, మొదటిసారి వచ్చినందుకు పదమారెట్ల అభినందనలు ఇస్తున్నారు. కానీ ఒక భాగ్యం గురించి చెప్తున్నాము, భాగ్యాన్ని చేసుకోవడానికి మార్జిన్ ఉంది ఎందుకంటే టూ లేట్ బోర్డ్ ఇంకా పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వచ్చిన వ్యక్తి పురుషార్థం చేస్తే లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్‌లోకి రాగలరు. ఫస్ట్ నంబర్ కాదు, వారైతే ప్రసిద్ధమైపోయారు, కానీ ఫస్ట్ డివిజన్‌లోకి వెళ్ళగలరు. ఇష్టమేనా? క్రొత్తగా వచ్చినవారికి ఇష్టమేనా? అవకాశం ఉంది, బాప్‌దాదా సీట్‌ను ఇచ్చేస్తారు కానీ కొంత చెయ్యవలసి ఉంటుంది కూడా. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సంకల్పము, అటెన్షన్, ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. వ్యర్థం ఉండకూడదు ఎందుకంటే మీ అందరూ ముందు వచ్చినవారైనా, తర్వాత వచ్చినవారైనా, టైటిల్ ఏమిటి? సమర్థులైన పిల్లలు మీరు, బలహీన పిల్లలు కాదు. బాప్‌దాదా ప్రియస్మృతులలో ఏమని అంటారు? రోజూ ఉండే ప్రియస్మృతులు - గారాల పిల్లలు, ముద్దు పిల్లలు, హృదయ సింహాసనాధికారి పిల్లలు అంటారు. అందుకే బాబా ఈ గోల్డెన్ అవకాశాన్ని ఇస్తున్నారు కానీ తీసుకోదల్చుకున్నవారు తీసుకోవచ్చు. బాబా ఇస్తారు, బంధింపబడి ఉన్నారు. తీవ్ర పురుషార్థీలు కొందరు ఉన్నారు. అవకాశం ఉంది. టూ లేట్ బోర్డ్ పడితే ఇంక సమాప్తమే. కానీ బాప్‌దాదాకు జన్మదినం సందర్భంగా ఎటువంటి బహుమతిని ఇస్తారు? జన్మ ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా! బాప్‌దాదా అయితే పిల్లలైన మీ జన్మదినం సందర్భంగా మీ అందరికీ విశేషమైన బహుమతి ఏమిచ్చారంటే 90 శాతం మీ తీవ్ర పురుషార్థం ఈ రోజు నుండి అంతిమం వరకు ఉన్నట్లయితే 10శాతం బాప్‌దాదా పెంచేస్తారు. సరేనా! ఇప్పుడు వ్యర్థము సమాప్తము. ఎలా అయితే చూడండి, సత్యయుగ దేవతలు వస్తారు కదా, వారికి ఇక్కడ ఏ భాషలో మాట్లాడుకుంటారో తెలియదు. పురుషార్థం మాట వినగానే పురుషార్థం ఏమిటి అని అంటారు ఎందుకంటే ప్రాలబ్ధము ఉన్నవారు కదా. ఇటువంటి తీవ్ర పురుషార్థీలైన మీకు స్వప్నంలో మరియు సంకల్పంలో, లేక ప్రాక్టికల్ కర్మలో వ్యర్థం ఏమిటి అన్నంతగా దానిని సమాప్తం చెయ్యండి. ధైర్యముందా? 10 శాతం మార్కులు బాబా గ్రేస్‌లో ఇస్తారు. సరేనా! చేతులెత్తండి. ఎంత శాతం పక్కాగా ఉన్నారు? 100 శాతం కాదు, 101 శాతం, ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు లేనిదే నచ్చదు. నా బాబా అని అన్నప్పుడు బాబా కూడా నా పిల్లలూ అని అంటారు మరి బాబా సమానంగా కావలసిందే కదా. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది. మీరు ఒక పుస్తకాన్ని ముద్రించారు కదా. దృఢ సంకల్పం సఫలతకు తాళంచెవి వంటిది. కావున సంకల్పాన్ని సాధారణంగా చెయ్యద్దు. మీరు ఎవరు? ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంట్ సాధారణ నడవడిక నడుచుకుంటే బాగుంటుందా, మరి మీరెవరు? మీరైతే మూడు సింహాసనాల నివాసులు. అన్నిటికన్నా పెద్దది బాప్‌దాదా హృదయ సింహాసనము. మరి హృదయ సింహాసనంపై ఉన్నవారు మొదటి జన్మలో సహవాసులుగా అయితే అవుతారు కదా! సింహాసనంపై ఒక్కరే కూర్చున్నప్పటికీ రాయల్ ఫ్యామిలీ మరియు రాజ్య అధికారిగా అయితే అవ్వవచ్చు. మరి తోడుగా నిలిచేవారు, ఇంటి వరకైతే తోడుగా ఉంటారు కదా. బాప్‌దాదా ఎలా అయినా తీసుకువెళ్తారు, వయా తీసుకువచ్చినా లేక డైరెక్టు తీసుకువెళ్ళినా కానీ తీసుకుని వెళ్తారు. మరి అప్పుడు ఇంట్లో కూర్చుండిపోతారా, బ్రహ్మా బాబా వెళ్ళిపోయి మీరు ఉండిపోతే బాగుంటుందా? రాజయోగులు కదా! స్వయానికి ఏ టైటిల్‌ను ఇచ్చుకుంటారు? ఇతరులకు ఏమి నేర్పిస్తారు? రాజయోగమా లేక ప్రజాయోగమా? రాయల్ ప్రజలైనా కానీ ప్రజాయోగులైతే కాదు కదా! రాజయోగులు. మరి బాబా పిల్లలందరికీ ఇచ్చిన బహుమతి గుర్తుంది కదా! ఎప్పటి వరకు? అంతిమం వరకు. పురుషార్థం చాలానే చేస్తూ ఉండటం, పిల్లలు కష్టపడటం బాబా చూసారు. పిల్లల కష్టం చూస్తే తండ్రికి నచ్చదు. కావున ప్రేమలో ఉన్నట్లయితే కష్టం సమాప్తమైపోతుంది. నా బాబా, కానీ నేను మరియు నాది సమాప్తము. నా బాబా అన్నప్పుడు అనేక నావి అన్నవి అందులో కలిసిపోతాయి కదా. ఒక బొమ్మ తెస్తారు కదా, ఒక దాని లోపల మరొకటి, అందులో మరో బొమ్మ ఉంటుంది. ఒక్కదానిలో 10-12 ఉంటాయి. బొమ్మ చూపించేటప్పుడు ఒక్క నా బాబా, నా బాబా అని అనేవారే కదా మీరు. నా బాబా కదా! మహారథుల బాబా కాదు కదా. నా బాబా. నా బాబా అన్నప్పుడు హద్దు యొక్క ‘‘నాది’’ అన్నవన్నీ ‘‘ నీది’’ లోకి పరివర్తన చెయ్యండి. నాది బదులుగా నీది తీసుకురండి. ఎంత తేడా ఉంది. నాది మరియు నీది అనుదానిలో ఎంత తేడా ఉంది. నా మరియు నీ. ఒక్క మాటలో తేడా వచ్చింది. మరి నా బాబా అన్నది పక్కాగా ఉంది కదా. పక్కాగా ఉందా? ఎంత శాతం? 100 శాతం. 100 మరియు ఒకటి. ఇలా ఒక్క వేలిని చూపించండి. 101 శాతం అనేవారు చేతులెత్తండి. బాప్‌దాదా చూస్తున్నారు, టి.విలో కూడా చూస్తున్నారు.
మరి ఇప్పుడు శివరాత్రి, శివ జయంతిని జరుపుకుంటున్నారు. అందులో విశేషంగా మూడు విషయాలను జరుపుకుంటాము. బాప్‌దాదా అద్భుతము చూడండి, ఈ విధులు, ఉత్సవం జరుపుకునేవారు ఎవరైతే కాపీ చేసారో వారికి కూడా అభినందనలు ఇస్తున్నాము. విశేషంగా 3 విషయాలను జరుపుకుంటున్నారు - మొదటిది వ్రతాన్ని పాటించడం. వారు మిమ్మల్ని కాపీ చేసారు, కానీ అల్పకాలికమైనదే. మీరు కూడా బాబా పిల్లలుగా అయినప్పటి నుండి రెండు వ్రతాలు ధారణ చేసారు. ఒకటి పవిత్రత, కేవలం బ్రహ్మచర్యము కాదు, బ్రహ్మాచారీ. కొంతమంది పిల్లలు ఏమి చేస్తారు? ముఖ్యమైన పెద్ద పెద్ద వికారాల వ్రతమైతే పెడ్తారు కానీ చిన్న చిన్నవాటిని వదిలేస్తుంటారు. చిన్నవే మహా బలిగా అయిపోతాయి. చిన్నవి తక్కువేమీ కాదు. సమయానికి మోసం చేసేది చిన్నవే. ఎలా అయితే ఎలుక ఉంది కదా, అది చిన్నదే అయినా కానీ కొరకడంలో మాత్రం నంబర్‌వన్. గాలి ఊదుతుంది అలాగే కొరుకుతుంది అయినా ఏమీ తెలియదు. కావున చిన్న చిన్న వికారాలు, కొంతమంది పిల్లలు క్రోధము గురించి అనుకుంటారు ఇదైతే జరుగుతూనే ఉంటుంది, చెయ్యాల్సి వస్తుంది అని. మరి వారిని సంపూర్ణ ఆత్మ అనచ్చా? పిల్లాజల్లతో సహా చిన్న పెద్దవాటి సహితంగా వ్రతాన్ని తీసుకుని మేము సదా పవిత్రంగా ఉంటాము అన్నారు. ప్రతిజ్ఞ చేసారు కదా? లేక కేవలం ఒక్క బ్రహ్మచర్య వ్రతాన్ని మాత్రమే తీసుకున్నారా? మీ టైటిల్ ఏమిటి? సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తములు, ఇదే కదా మీ టైటిల్? లేక కొద్ది కొద్దిగా మర్యాద తక్కువ ఉంది అని అంటారా? నా బాబా అని అన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో, నా బాబా అన్నారా అని అడిగినప్పుడు అందరూ చేతులెత్తారు, నా బాబా అన్నప్పుడు బాబా సమానంగా అయితే కావాలి కదా. కేవలం ఒక్క అక్షరం మార్చాలి - ఎక్కడ నాది అని వస్తుందో అక్కడ నీది అని గుర్తు చేసుకోండి. ఈ ఒక్క మాటను గుర్తుంచుక్నుట్లయితే మూడు సింహాసనాల నివాసులుగా అవుతారు. మరి మొదటి వ్రతము సదా కోసం పవిత్రత. మర్యాద పురుషోత్తములు అయితే మీరు సదా కోసం ధారణ చేసారు. వారు ఒక్క రోజు చేస్తారు. కాపీ అయితే చేసారు, పిండిలో ఉప్పంత చేసారు. అయినప్పటికీ చేసారు కదా. తెలివైనవారే కదా! రెండవ వ్రతము ఆహార విషయము. మరి మీరందరూ శుద్ధమైన భోజనము యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. కాపీ అయితే చేసారు కదా. మీరు పూర్తిగా చేసారా లేక ఎప్పుడైనా అలసిపోయి తినేద్దాములే అని అనుకుంటున్నారా? ఇలా అయితే లేరు కదా? అలసిపోయినా, విసుగెత్తిపోయినా, యూత్ ఏమి చేస్తారు? కుమారులు చేతులెత్తండి. అచ్ఛా. చాలా మంచిది. కుమారీలు చేతులెత్తండి. విదేశీయులలో కుమారీలు, లైట్ పెట్టుకున్న కుమారీలు, (తలపైన చిన్నని బల్బును పెట్టుకున్నారు) కుమారులు పూర్తి వ్రతాన్ని పాటిస్తున్నారా లేక ఎప్పుడైనా అలసిపోతున్నారా? కుమారులు ఇప్పటి నుండైనా ఎవరైతే విధిపూర్వకమైన ఆహారపానీయాల వ్రతాన్ని పాటిస్తారో వారు చేతులెత్తండి. పాస్ అయ్యారు, అచ్ఛా, అభినందనలు. మీకు పదమారెట్ల అభినందనలు. కొంచెం కష్టపడవలసి వస్తుంది కానీ బాబా ప్రేమలో ఇది కష్టం కాదు, ప్రేమ. మరి చూడండి, కాపీ చేసారు కదా. ఒక్క రోజు వ్రతాన్ని తీసుకుంటారు. మరి మీరు వ్రతాన్ని పూర్తి జీవితానికి తీసుకుంటారు. జీవితం యొక్క వ్రతము సదా దానంతట అదే జరుగుతుంది. తర్వాత కష్టపడవలసి ఉండదు. ఈ చిన్నని జన్మలో కష్టం తప్పకుండా ఉంటుంది, త్యాగము. త్యాగానికి భాగ్యము తయారవుతుంది. దీనితో పాటు ఇంకేమి చేస్తారు? జాగరణ. మీరు ఏ జాగరణ చేసారు? వారు నిద్రను త్యాగం చేస్తారు, మీరు కూడా అజ్ఞాన నిద్రను త్యాగం చేసారు. సమయము యొక్క నిద్రకు సంబంధం లేకుండా అజ్ఞాన నిద్రను రానివ్వము అని త్యాగం చేసారు. తూగము అన్నారు. ఇలా ఇలా కాదు (తూగుతున్నవారి యాక్షన్) ఇలా. ఈ వ్రతాన్ని కూడా తీసుకున్నారు కదా. కొందరికి ఇలా ఇలా చేసే అలవాటు ఉంటుంది. బాప్‌దాదా అంటారు త్యాగం చేసారు, దృఢ సంకల్పం చేసారు మరి దృఢ సంకల్పాన్ని ఢీలా ఎందుకు చేస్తారు? స్క్రూ టైట్ చెయ్యడం రాదా? దీనిని టైట్ చేసేందుకు స్క్రూ డ్రైవర్ - ప్రతిజ్ఞ. ఇప్పుడు ఏ కార్యమైతే మిగిలి ఉందో, ఏది మిగిలి ఉందో చెప్పండి? చెప్పండి. ప్రత్యక్షత. దీని కోసమే పురుషార్థం చేస్తున్నారు కదా. నా బాబా వచ్చేసారు, ఈ జెండాను ఎందుకు ఎగురవేస్తారు? ఏ కార్యం చేసినా జెండాను ఎగురవేస్తారు. ఈరోజు కూడా జెండాను ఎగురవేస్తాము కదా. ఎవరి జెండాను ఎగురవేస్తాము? బాప్‌దాదా, సేవ మరియు జన్మ దిన జెండాను ఎగురవేస్తాము. జెండాను ఎగురవేసినప్పుడు అది పూర్తిగా తెరుచుకునే వరకు తెరుస్తూ ఉంటారు. జెండా సమాప్తి పూలు కురవడంతో పూర్తవుతుంది. మరి మీరు కూడా ఏ ప్రత్యక్షతను ఆశిస్తున్నారు? బాబా ప్రత్యక్షత జరగాలి. మరి ఎంతగా జాగరణ చేసారో, వ్రతాన్ని తీసుకున్నారో, ప్రతిజ్ఞ పక్కా చేసుకున్నప్పుడు ప్రత్యక్షత ఎంతో త్వరగా అయిపోతుంది. మరి ప్రత్యక్షతను కోరుకుంటున్నారు కదా! సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది ఎవరు? మీరందరూ కదా! సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే సత్యమైన సేవాధారి పిల్లలు మీరు. విశ్వ పరివర్తక పిల్లలు. మరి జన్మ దిన బహుమతిని ఒప్పుకున్నట్లేనా. ఇవ్వాలి కూడా, తీసుకోవాలి కూడా. రెండూ చెప్పాము. కేవలం ఇవ్వడమే కాదు, తీసుకోవాలి కూడా. రెండూ చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా. చాలా మంచిది. అచ్ఛా. మీ చిత్రం ఇందులో (టి.విలో) వస్తుంది. ఎక్కడైనా కొంచెం ఫెయిల్ అయితే వారికి ఈ చిత్రాన్ని పంపిద్దాము. మళ్ళీ చేతులెత్తండి. ఇక్కడ వస్తుంది. బాగుంది, అభినందనలు, అభినందనలు, అభినందనలు.
బాప్‌దాదా వద్దకు నలువైపుల నుండి పదమా పదమరెట్ల అభినందనలు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో లేక ఉత్తరము లేక ఈ-మెయిల్ చేస్తూ మా అభినందన మొదటగా ఉండాలి అని భావిస్తారు. బాప్‌దాదా అందరి అభినందనలను ముందుగా స్వీకరించేసారు. నంబర్ పెట్టలేదు, అందరి హృదయపూర్వక అభినందనలను స్వీకరించారు. చూడండి, దూరంగా కూర్చుని ఉన్నవారు కూడా చప్పట్లు కొడ్తున్నారు. నలువైపుల అభినందనలు, అభినందనలు అన్న పాట హృదయాలలో మ్రోగుతూ ఉంది. ఇది పాట కాదు హృదయపు పాటలు కష్టం లేకుండా సంతోషంగా మొదలవుతాయి. సంతోషము హృదయ గీతాలకు తాళంచెవి. వాహ్ బాబా, మధురమైన బాబా - ఇదే తాళంచెవి. ఈ తాళంచెవి ఉంది కదా? అప్పుడప్పుడూ తాళంచెవి కాదు. సదా సంతోషము. పిల్లల ముఖము, మాట మరియు కర్మ కొంచెం కూడా చింతనతో, చింతతో, వ్యర్థ సంకల్పంతో, సందిగ్ధతతో ఉంటే బాప్‌దాదాకు మంచిగా అనిపించదు. భగవంతుని పిల్లలు ఒకవేళ సదా సంతోషంగా లేకపోతే మరింకెవరు ఉంటారు! మీరే కదా! ముఖము ఎప్పుడూ చింతతో ఉండకూడదు, శుభ చింతన. ఏ విధమైన చింత వచ్చినా కానీ అప్పుడు నా బాబా కంబైన్డ్‌గా ఉన్నారు అని అనుకోండి. చింత బాబాకు ఇచ్చేయండి, మీరు శుభ చింతకులుగా కండి. ఎందుకంటే బాప్‌దాదా సదా హర్షితంగా ఉంటారు కదా మరి పిల్లలు వాడిపోయినట్లు ఉంటే ఎలా! ఎవరి పిల్లలు? భగవంతుని పిల్లలు. ముఖము ఎప్పుడూ కూడా వాడిపోకూడదు. పర్వతం వంటిది వచ్చినా కానీ ఆ పర్వతాన్ని దూది పింజలా మార్చగలరు. బాబాతో మిమ్మల్ని మీరు జోడించుకున్నట్లయితే ఏమి జరుగుతుంది? పర్వతం దూదిపింజ అయిపోతుంది ఎందుకంటే సర్వశక్తిమంతుడిని తోడుగా పెట్టుకున్నారు కదా. మీరు బలహీనంగా ఉన్నా కానీ సర్వశక్తిమంతుడు మీతో కంబైన్డ్‌గా ఉన్నారు కావున సమయానికి కార్యంలో వినియోగించండి. చెప్పడం వరకే కాక కార్యంలోకి తీసుకురండి. అప్పుడు సదా సంతోషకర ముఖము మరియు హృదయము సదా అదృష్టంతో ఉంటుంది. ఒకవేళ సంతోషము మరియు అదృష్టవంతుల ముఖాన్ని చూడాలంటే భగవంతుడి సెంటర్లలో చూడండి అని ఛాలెంజ్ చెయ్యమంటారా? చెయ్యమంటారా ఛాలెంజ్? ఎప్పుడూ వాడిపోకూడదు. ఎందుకు వాడిపోతారు? ఏదైనా బలహీనత ఉంటే వాడిపోతారు. ఏ బలహీనత? సంతోషము అను ఔషధము సదా మీతో ఉంది. ఉదాహరణకు మీకు ఆరోగ్యంలో కానీ, ధనంలో కానీ లోటు ఉన్నట్లయితే, సంతోషము గురించి ఏమని చెప్తారు? సంతోషము వంటి ఖజానా మరొకటి లేదు. మరి అది సంపదే కదా. మీ వద్ద సంపద ఉంది. సంతోషము ఉందా? చేతులెత్తండి. సంతోషం ఉంది కదా! మరి సంపద ఉంది! అలాగే సంతోషము వంటి భోజనము లేదు, సంతోషము వంటి ఔషధము లేదు. 36 ప్రకారాల భోజనం ఉన్నా కానీ సంతోషము లేకపోతే ఎండిపోయినట్లే. సంతోషం ఉంటే ఎండిపోయిన రొట్టె కూడా 36 ప్రకారాల భోజన సుఖాన్ని ఇస్తుంది. బాబా ప్రతిజ్ఞ కూడా ఉంది - సత్యమైన హృదయము, స్వచ్ఛమైన మనసు, విశాలమైన మనసు. ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి. ఇవి గుర్తున్నట్లయితే ఏ సమయంలోనైనా, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మూడు విషయాలు గుర్తుంటే మీ అందరికీ రొట్టె, సాంబారును బాబా తినిపిస్తారు. రెండు నాలుగు కూరలు తినిపించరు. దాల్ రోటీ తినిపిస్తారు. దాల్ రోటీ తినండి ప్రభు గుణాలు గానం చెయ్యండి. అనుభవం చేసారు కదా! పాతవారు మొదట్లో వచ్చినవారు అనుభవం చేసేసారు. ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? ఇంకా బెల్లాన్ని బోర్న్‌వీటా చేసి బాప్‌దాదా తన చేతులతో తినిపించేవారు. బాప్‌దాదా చేతుల మీదుగా తిన్నప్పుడు అందరి ఆకలి తీరిపోయేది. బోర్న్‌వీటా చెయ్యడం వస్తుందా, రాదా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఈ బెల్లము, కూరగాయలు, దాల్ ఏదీ లేకపోయినా ఈ బోర్న్‌వీటా ఎంతో సుఖాన్ని ఇస్తుంది. చెయ్యడం నేర్చుకోండి. అందరూ ఇక్కడ నేర్చుకుని వెళ్ళండి. అవసరమైనప్పుడు ఈ బోర్న్‌వీటా చాలా పనికొస్తుంది. కానీ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి, అందులో ఒక్కటి తక్కువైనా వెతకాల్సి వస్తుంది, సహజంగా లభించదు. కావున పరిశీలించుకోండి, నాలుగు విషయాలు ఉన్నాయా - సత్యత - తనువు, మనసు, ధనము, సంబంధ సంపర్కాలు, హృదయము, విశాలమైన మనసు. మనసు పెద్దది చేసుకుంటే ఏది కోరుకున్నా, ఏ అవసరం ఉన్నా అది పూర్తయిపోతుంది. చేసి చూడండి. ఎక్కడ మనసు పెద్దగా ఉంటుందో అక్కడ అన్ని కోరికలు పూర్తవుతాయి. మనసు చిన్నబుచ్చుకుంటే క్రియేషన్ అంతా చిన్నదైపోతుంది. బాబా తృప్తిగా ఉంటే మరింకే లోటు ఉంది? మరి పురుషార్థం చెయ్యండి. అలాగే అభినందనల చప్పట్లు కొట్టండి.
సేవ టర్న్ కర్ణాటక వారిది, 8 వేల మంది కర్ణాటక నుండి వచ్చారు:- అచ్ఛా, టీచర్లు కూడా చాలామందే ఉన్నారు. టీచర్లందరికీ బాప్‌దాదా విశేషంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకు విశేషంగా ఇస్తున్నారు? ఎందుకంటే ఎంతటి యోగ్యులుగా చేస్తున్నారంటే యజ్ఞ సేవకు యోగ్యులుగా చేస్తున్నారు ఎందుకంటే యజ్ఞ సేవ 10 రోజులు ఉండచ్చు లేక 11 రోజులు ఉండవచ్చు కానీ యజ్ఞ సేవను విధిపూర్వకంగా, విధానపూర్వకంగా చేసినట్లయితే 11 రోజుల యజ్ఞ సేవ 11 జన్మలకు ప్రాప్తిస్తుంది. కావున యజ్ఞసేవ యొక్క పుణ్యము వర్తమాన సమయంలో ఇప్పుడు ఎలా అయితే మీకు సంతోషంగా ఉందో, ఉంది కదా సంతోషము ఎక్స్ట్రా సంతోషము. మధువనానికి చేరుకోవడము అంటే ఎక్స్ట్రా సంతోష ఖజానా లభించడమే. మరి ఇంతటి యోగ్యులుగా చేసుకు వచ్చారు, పురుషార్థం చేయించారు కావున టీచర్లకు అభినందనలు. మరియు మాతలు, మాతలు చేతులెత్తండి, జోన్‌వారు, మాతలు చాలామంది ఉన్నారు. మాతలకు కూడా అభినందనలు, ఎందుకు? ఎందుకంటే మాతలు మధువనాన్ని అయితే సంభాళిస్తున్నారు కానీ సెంటర్లను కూడా సంభాళిస్తారు. బాప్‌దాదా ఆది నుండి చెప్తూ ఉన్నారు, ఎక్కడ మాతలు ఉంటారో అక్కడ భండారా మరియు భండారీ సదా నిండుగా ఉంటాయి అని. అచ్ఛా, వారికి విశేషంగా అభినందనలు. మరియు పాండవులు, అధర్కుమారులు లేచి నిల్చోండి. అధర్కుమారులు, చూడండి, మీ విశేషత కూడా ఒకటి ఉంది. ఎలా అయితే మాతల విశేషత ఉందో అలాగే అధర్కుమారుల విశేషత కూడా ఉంది. ఎందుకు? ఏ విశేషత? ఎవరైతే ఇద్దరూ వస్తారో, ఒకరికొకరు తోడుగా నిలుస్తారు, ఎటువంటి విఘ్నము ఉండదు, ఏకమతము ఉంటుంది. లేకపోతే రెండు మతాలలో గొడవ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇద్దరూ ఒకే మతంలోకి వచ్చేస్తారో అప్పుడు అధర్కుమారులు సేవలో ఎంతో ముందుకు వెళ్ళగలరు. సమయాన్ని కేటాయించగలరు. యూత్ కూడా సమయాన్ని కేటాయిస్తారు కానీ అధర్కుమారులు డబల్ పని చేస్తారు. డబల్ పని ఏమిటి? ఒకటి - విశ్వ సేవలో సమయం ఎక్కువ ఇవ్వగలరు. రెండవది తమ ధనాన్ని కూడా ఎంత కావాలంటే అంత సఫలం చేసుకోవచ్చు ఎందుకంటే ఇద్దరూ రాజీ అయి ఉన్నారు కాబట్టి. కావున అధర్కుమార్ ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే, ఎంతగా సఫలం చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. కారణము ఏమిటి? ఏ విఘ్నమూ లేదు. మనసు యొక్క విఘ్నము మరో విషయము కానీ సంబంధాల విఘ్నము ఉండదు. అందుకే యజ్ఞంలో మీ అందరిదీ కూడా విశేషమైన పాత్ర ఉంది. అధర్కుమార్ కుమారీలను చూసి వృద్ధి ఎంతో త్వరగా అవుతుంది. అన్ని వర్గాలవారు రావడము, పరివారంలో కూడా ఉండటము, అన్నీ చేస్తూ కూడా తమ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఇల్లువాకిళ్ళ నుండి దూరం చేసేస్తారు అని ముందు ఉన్న వాతావరణం, భయము ఇప్పుడు లేదు. అంతేకాక డబల్ పని చెయ్యవచ్చు మరియు సహాయము లభిస్తుంది. అర్థమయిందా. అచ్ఛా.
80 దేశాల నుండి 1200మంది డబల్ విదేశీయులు వచ్చారు:- డబల్ విదేశీయులు అని అనకండి, డబల్ తీవ్ర పురుషార్థీ. టైటిల్ నచ్చింది కదా. డబల్ విదేశీయులు అన్నది సాధారణము. అలా అయితే చాలా మంది డబల్ విదేశీయులు ఉన్నారు. బాప్‌దాదాకు విదేశీయుల గురించి సంతోషము కలుగుతుంది ఎందుకంటే వీరు మధువనానికి అలంకారంగా అవుతారు కాబట్టి. చూడండి, ఇండియాలో భిన్న భిన్న దేశాల నుండి వస్తూ ఉంటే విదేశీయులు తక్కువ ఎందుకు ఉండాలి, ఇందులో మంచి రేస్‌ను చేసారు. 80 దేశాల నుండి వచ్చారు. బాప్‌దాదా ఒక్క విషయం మెజారిటీలో చూసి సంతోషిస్తున్నారు - ఎవరు వచ్చినా కానీ వారందరూ ఇప్పుడు ఒకే కల్చర్ వారిగా అయిపోయారు. అందరూ ఒక్క బ్రాహ్మణ కల్చర్ వారిగా అయిపోయారు. అవును కదా! చేతులెత్తండి. ఇప్పుడు విదేశీ కల్చర్ వారు కాదు, అందరూ బ్రాహ్మణ కల్చర్ వారే, కదా! వచ్చినప్పుడు భిన్న భిన్న కల్చర్ల నుండి వచ్చారు, కానీ కల్చర్‌ను కూడా దాటివేసారు, ఇదే పెద్ద గోడ కానీ ఈ పెద్ద గోడను క్రాస్ చేసేసారు, ఇప్పుడు వీరేదో వేరు అని అనిపించదు. ఒకసారి లేచి టి.విలో బ్రాహ్మణ కల్చర్ వారందరినీ చూడండి. ఒకే కల్చర్ వారిని చూస్తే బాగుంది కదా. ఎలా అయితే ఆదిలో పిల్లలు వచ్చారు, వృక్షము యొక్క భిన్న భిన్న కొమ్మలు వచ్చాయి, తమ తమ ఇళ్ళ నుండి తమ వాళ్ళతో కలిసి వచ్చారు అనిపించేది. కానీ బాప్‌దాదా ఆరంభంలో చెప్పి ఉన్నారు - మీరు భిన్న భిన్న వృక్షం యొక్క కొమ్మలు కావచ్చు, కానీ ఇక్కడ చందన వృక్షంలో కలిసిపోతారు, ఒకే చందన వృక్షం తయారవుతుంది. ఆదిలో వచ్చిన ఆదిరత్నాలు ఒక చందన వృక్షంలా తయారయ్యారు, అప్పుడే కదా చందన సువాసన వ్యాపించింది. విదేశంవరకు కూడా చేరుకుంది కదా. అప్పుడే వచ్చారు కదా. విదేశీయులు కూడా భిన్న భిన్న కల్చర్ల నుండి వచ్చారు కానీ ఇప్పుడు ఒకే కల్చర్. ఇష్టమే కదా! ఇష్టమైతే చేతులెత్తండి. ఎప్పుడూ కష్టంగా అనిపించడం లేదు కదా? పనిలో రంగు వస్త్రాలు ధరించడానికి అనుమతి ఉంది. బాప్‌దాదాకు విదేశీయుల మరో విషయము ఎంతో బాగా నచ్చుతుంది. ఎవరైతే సేవకు నిమిత్తంగా ఉంటారో, సెంటర్‌ను సంభాళించేవారి విశేషత, తమ భోజనాన్ని కూడా తయారుచేసుకుంటారు, క్లాస్ కూడా చేయిస్తారు, జిజ్ఞాసువులను కూడా చూసుకుంటారు మరియు బయట ఉద్యోగం కూడా చేస్తారు. భారతదేశంవారు మొదట్లో వెళ్ళినప్పుడు ఏమి చూసారు? విశేషత చూసారు, అక్కడ క్లాస్ పూర్తవగానే 7 రోజులకు పిండి తడిపి పెట్టుకుంటారు, బ్రెడ్ తయారు చేసి పెట్టుకుంటారు, క్లాస్ పూర్తి కాగానే పాలల్లో వేసుకోవడానికి లభించే మంచి మంచి వస్తువులను వేసుకుని, అవి తిని ఇక పరిగెడ్తారు. మరి అన్ని కార్యాలు ఎంతో చురుకుగా చేసారు మరియు వృద్ధి చేసారు. మొదట్లో ఒక్క లండన్ మాత్రమే ఉండేది, లండన్ వారు చేతులెత్తండి. లండన్ వారు, ఒకరి నుండి అనేకులయ్యారు. అందుకే బాప్‌దాదా డబల్ పురుషార్థీలు అన్న టైటిల్‌ను ఇచ్చారు. విదేశీ సేవ ఇతర ధర్మాలవారిని కూడా తయారు చేసింది. క్రిస్టియన్లు ఉండనే ఉన్నారు కానీ ముస్లిం దేశాలలో కూడా ఎంతమంది దాగి ఉన్న బాబా పిల్లలు బయటకు వచ్చారు! మరింత ముందుకు సాగుతున్నారు మరియు పద్ధతిగా చేస్తున్నారు. బాప్‌దాదా ఆ బిడ్డను గుర్తు చేసుకున్నారు. ఏ పేరు? సెంటర్ తెరుస్తున్నారు - (వజీహా అక్కయ్య) నైరోబీవారు కూడా మంచిగా చేస్తున్నారు. వారు కూడా తయారు చేస్తున్నారు. మరి టైటిల్ నచ్చింది కదా? డబల్ పురుషార్థీ. అవునా? డబల్ పురుషార్థము ఉందా? అచ్ఛా. నిమిత్తమై ఉన్న టీచర్లు బాగా శ్రమ చేస్తున్నారు. అందుకే బాప్‌దాదా నిమిత్త టీచర్లందరికీ కూడా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడైతే శ్రమ యొక్క ఫలితాన్ని తీసుకుంటున్నారు. బాప్‌దాదాకు విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్ విదేశి సేవ ద్వారా సిద్ధించింది. మరి విశేషంగా వేర్వేరు దేశాల నుండి వచ్చినటువంటి పిల్లలకు తమ దేశ వాసులతో సహా, బ్రాహ్మణ పరివారం సహితంగా పదమా పదమ రెట్ల అభినందనలు జన్మ దినమునకు. విశేషంగా బాప్‌దాదాకు అందరూ కలిసి మీటింగ్ చేసుకుని, ఆర్.సి.ఓలు, యన్.సి.ఓలు, ఎవరైతే ఉన్నారో, అందరూ కలిసి పూర్తి సంవత్సరానికి ప్లాన్ వేసుకుని తీసుకువెళ్తున్నారు. అంతేకాక మధువన వాతావరణంలో బాప్‌దాదా మరియు విశేషంగా నిమిత్త బ్రాహ్మణుల శుభ భావన, శుభ కామనలను తీసుకువెళ్తున్నారు. దీని రిజల్ట్ చాలా బాగుంది. బాప్‌దాదా ఏదైతే ఆశించారో, ఒకప్పుడు కోరుకున్నారు, ఆ రిజల్ట్ ఇప్పుడు ముందుకు వస్తుంది. ఇందుకు కూడా అభినందనలు. మరి బాప్‌దాదా వాహ్ పిల్లలు వాహ్! లవ్లీ పిల్లలు వాహ్! లక్కీ పిల్లలు వాహ్! వాహ్ వాహ్ పాటను పాడుతూ అందరికీ అభినందన తెలుపుతున్నారు.
వర్గం వారు వచ్చారు, వారు తమ మీటింగులను చేసుకుంటున్నారు. వచ్చిన వర్గంవారు మీటింగ్ చేసుకోండి, మీటింగ్ చేసుకోవాలి ఎందుకంటే బాప్‌దాదా ఏదైతే చెప్పారో అది ఇంకా చెయ్యలేదు. అందుకే మీటింగ్ పెట్టాలి. ఎలా అయితే బాప్‌దాదా చెప్పారో ఏదైనా స్థానంలో సమావేశం కండి. వర్గీకరణ సంబంధంలో ఉన్న స్నేహి, సహయోగి పిల్లలు ఎంతమంది వెలువడ్డారు, ఎటువంటివారు వెలువడ్డారు అని తెలియాలి కదా. అంతా బాగా జరుగుతుంది, నడిపిస్తున్నారు. నడిపిస్తూ ఉండండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలకు, నలువైపుల ఉన్న బాప్‌దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే పిల్లలకు, ఏ పిల్లలైతే బాప్‌దాదాకు బహుమతిని ఇచ్చారో, సంకల్పంతో, ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటువంటి దృఢ పురుషార్థీలకు, ప్రతిజ్ఞ చేసి ప్రత్యక్షతను తీసుకువచ్చే పిల్లలందరికీ బాప్‌దాదా చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వక ప్రియస్మృతులను అందిస్తున్నారు. పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.
దాదీలతో:- అందరూ పరస్పరంలో కూర్చున్నారు, అందరూ తమ తమ ఆలోచనలను తెలిపారు, ఆలోచనలైతే వేర్వేరుగా ఉంటాయి, కానీ ఆలోచనలను అర్థం చేసుకుని, గౌరవాన్ని ఇవ్వండి, పరస్పరంలో స్పష్టం చేసుకోండి. స్పష్టం చేసుకోకుండా లోపల పెట్టుకోవద్దు. లోపల పెట్టుకుంటే చెత్త తయారవుతుంది. ఏ వస్తువునైనా లోపల ఉంచి శుభ్రపరచకపోతే ఏమవుతుంది? మరి నిమిత్తంగా ఉన్న పిల్లలైన మీరు, వారికి బాప్‌దాదా చెప్తున్నారు మురబ్బీ పిల్లలు, పాండవులు కూడా ఉన్నారు కానీ నిమిత్తమైన వారు మురబ్బీ పిల్లలు, మురబ్బీ పిల్లల సంగఠన చాలా త్వరగా అందరినీ ఉల్లాస ఉత్సాహాలలో తీసుకువస్తుంది. బాప్‌దాదా చూసారు, మేము అందరినీ నాట్యం చేయించాలి అని అందరూ మంచి సంకల్పాన్ని తీసుకున్నారు. బాప్‌దాదా చెప్పిన నాలుగు విషయాలను ఒక్కొక్కరిలో తీసుకురావాలి. ఒకవేళ నాలుగు విషయాలు మెజారిటీ వచ్చేస్తే సమయము వచ్చేసినట్లే. మరి నిమిత్తం మీరు, మీరు 10-12 మంది కాదు, ఒక్కరు అని అందరూ అనుకోవాలి. అందరి మనసులలో ఈ సంకల్పం ఉంది, లేదు అని కాదు, ఈ విషయం బాప్‌దాదా చూసారు. కానీ ఈ సంకల్పాన్నే పెంచుతూ వెళ్ళండి. అందరూ మీకు తోడుగా ఉన్నారు. అచ్ఛా (మోహిని అక్కయ్య, మున్నీ అక్కయ్య ఇండోర్ జోన్ వెళ్ళి వచ్చారు) ఎక్కడైనా ఏ మహారథి అయినా వెళ్ళి వస్తే రిఫ్రెష్ అయితే అవుతారు, ఇంకా కూడా అవుతారు, అచ్ఛా.
(జానకి దాదీ శిరస్సుపై బాప్‌దాదా చేయి పెట్టారు) బాప్‌దాదా చేయి అందరి శిరస్సులపైకి వస్తుంది. వీరు విశేషంగా నిమిత్తంగా ఉన్నారు, ఈ గ్రూపు నిమిత్తంగా ఉంది, అందుకని విశేషము. శిరస్సు ఎప్పుడూ భారీగా కానేకాదు. బాబా కంబైన్డ్ ఉన్నారు కదా. (భగీరథుని మస్తకంపై మేము గంగలము ఉన్నాము) ఈ పాండవులు కూడా గంగలే, అందుకే సేవ చేస్తున్నారు. అచ్ఛా.
ఎల్ అండ్ టి ప్రెజిడెంట్ - ముఖీజా అన్నయ్య మరియు సినిమా అభినేత్రి పూనమ్ ధిల్లోతో:- బాప్‌దాదా ఏమి చూసారంటే సంకల్పాన్ని పూర్తి చేసే ధైర్యమును మంచిగా ఉంచారు. ధైర్యము ఉన్నవారికి బాబా నుండి ఎక్స్ట్రా సహాయము లభిస్తుంది. విన్నారా, ధైర్యము ఉంచారు కదా. అయిపోయింది. ఇప్పుడు ప్రతి విషయములో ధైర్యము కోల్పోవద్దు. ఏమి చెయ్యాలి, కాదు. చేయాల్సిందే. ఏమి చెయ్యాలి అని అంటే మరింత విఘ్నాలు వస్తాయి, చెయ్యాల్సిందే అన్నప్పుడు తొలగిపోతాయి. ఎలా అయితే దోమలు వస్తే ధూపము వెలిగిస్తే దోమలు పారిపోతాయో అలాగే మాయా విషయాలు వస్తూ ఉంటాయి కానీ మీరు ధైర్యము అనే ధూపాన్ని వెలిగించితే దోమలు ఏమి చేస్తాయి? పారిపోతాయి. నేను ధైర్యవంతుడను, సహయోగానికి పాత్రులుగా అయ్యారు. మీ సహాయము వారి ధైర్యము. పురుషార్థంలో ముందుకు వెళ్ళాలని బాప్‌దాదా భావిస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు సహాయాన్ని అందించుకునేవారే. ఈ విశేషతయే ఇక్కడ వరకు చేర్చింది. బాగున్నారు. అచ్ఛా.
మున్నీ అక్కయ్య గారి అన్నయ్య వదినలతో:- మున్నీ అక్కయ్య అన్న వదినలు, సరే కానీ బాప్‌దాదా అంటారు లక్కీ, లవ్లీ కూడా. తమ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. చూడండి, (పిల్లవాడిని చూస్తూ) ఇతనిది ఎంత చక్కని ముఖము ఉంది, ఫోటో తీసారు, ఇది ఇలాగే ఉంచండి. మంచిగా చేసారు. వీరికి సహయోగులుగా కావడము అంటే బాబా కార్యంలో సహయోగులుగా కావడము. యజ్ఞసేవ ఎంత పుణ్యము. ఎందరికో పుణ్యం కలుగుతుంది. చాలా లక్కీ ఉన్నారు. చాలా మంచిది.
యోగిని అక్కయ్య మరియు డాక్టర్ అశోక్ మెహతాతో:- బాప్‌దాదా హాస్పిటల్లో కూడా తిరుగుతారు, నిమిత్తంగా ఉన్న మీ ధైర్యం మంచిగా ఉంది. అందుకే మీకు ఆఫర్ వస్తుంది. ధైర్యంతో ఉండేవారికి సహకారం స్వతహాగా లభిస్తుంది. మీకు ఆఫర్ రావడము ఇది ధైర్యానికి గుర్తు. బాగుంది. (యుగళ్ షిరీన్ అక్కయ్య, కూతురు సోనల్ అక్కయ్య) మీ గుండె ధైర్యం వీరిని నడిపించింది. నిమిత్తమయ్యారు. పరివారాన్ని నడిపించింది. ఇంకెప్పుడూ పురుషార్థంలో విఘ్నం రాదు. విఘ్నాన్ని పారద్రోలేవారు మీరు, వీరు చాలా ధైర్యమున్నవారు. కొద్దిమందిలోని ధైర్యం కారణంగా ఆఫర్ వస్తుంది, ఇది బాప్‌దాదాకు చాలా బాగా నచ్చింది. స్వయంగా దానంతటదే ఆఫర్ రావడము ఇది ధైర్యానికి ఫలితము. మీరు సహవాసులు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. వీరు ఇందులో సహవాసులు. పరివారమే లక్కీ.
(దాదీ గుల్జార్ సేవలో నిమిత్తంగా ఉన్న అక్కయ్యలను బాప్‌దాదా స్టేజ్ మీదకు పిలిచారు) ఎవరైతే రాత్రి మేలుకుని సేవ చేసారో, వారందరికీ అభినందనలు. రథాన్ని తయారు చేసారు. చాలా మంచిది. గుప్తంగా ఉన్నారు, కొంచెం ప్రత్యక్షం కండి. తోడుగా ఉండండి.
బాప్‌దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు:-
ఈనాటి జన్మదిన శుభాకాంక్షలైతే బాప్‌దాదా ఇచ్చేసారు, ఈ జెండా సదా ఉన్నతంగా ఉండాలి, అందరి హృదయాలలో ఎగురుతూ ఉండాలి. ఇదే మీ అందరి మనసులోని మాట. ఇప్పుడు బాబా వచ్చారు, వారసత్వాన్ని తీసుకోవడానికి రండి అన్న సందేశాన్ని అన్ని వైపుల అందించండి. ఈ సందేశాన్ని ఇస్తూ ఇస్తూ ఆఖరకు ఏ రోజు వస్తుందంటే అందరూ మా బాబా వచ్చారు, వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని అంటారు. మీరు అందరికీ మీ ధైర్య దృష్టితో ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించినట్లయితే మీరు అందరి హృదయాలలో జెండా ఎగిరేలా చేస్తారు, ఇప్పుడు ఆ రోజు కూడా రానే వచ్చింది. ఓం శాంతి.
డబల్ విదేశీ పెద్ద అక్కయ్యలతో:- బాప్‌దాదా మీ సంగఠన చూసి సంతోషిస్తున్నారు. (డా.నిర్మల దీదీను జ్ఞాన సరోవరంలో మనోహర్ దాదీ స్థానంలో స్థాయి రూపంలో నియమించడం జరిగింది) వీరు బాధ్యతా కిరీటాన్ని ధరించారు, ధైర్యాన్ని ఉంచారు ఇందుకు విశేష అభినందనలు. (బాప్‌దాదా శిరస్సుపై చేతిని పెట్టారు) చాలా బాగా ధైర్యాన్ని ఉంచారు.
మీ అందరూ కలుసుకునే రీతి బాప్‌దాదాకు బాగా నచ్చుతుంది. మీ సంగఠన చూసి, గాయత్రి మరియు మరొక జోడి ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాప్‌దాదా గుర్తు చేసారు. గాయత్రి మంచి ధైర్యాన్ని చూపించారు. లౌకిక పరివారానికి మరియు చుట్టుప్రక్కల ఎవరైతే ఉంటారో వారికి ఉదాహరణగా అయి చూపించారు. సమయానికి మీరు ఎలా సహయోగులుగా కావచ్చు, వీరు (అంకుల్) కూడా చాలా యోగయుక్తంగా ఉండేవారు, వీరికి విశేషమైన విశేషమైన బాప్‌దాదా శక్తులు నిండిన కిరణాలు ఇస్తూ ప్రియస్మృతులు అందిస్తున్నారు. పరివారమంతటికీ ప్రియస్మృతులు. (మొదటిసారి శివ జయంతికి లేరు) అందుకే బాప్‌దాదా వారికి స్మృతిని అందించారు.
మీటింగ్ రూపం మారుతూ వస్తుంది, ఎంతో బాగా అవుతుంది. ఇండియా వారు కూడా మిక్స్ అవుతున్నారు. ఇది చాలా మంచిది. మీరు ధైర్యమును ఉంచుతున్నారు కాబట్టి సహయోగులుగా అవుతున్నారు మరియు అవుతూ ఉంటారు కావున నడిపిస్తూ ఉండండి. బాప్‌దాదా ముఖ్యంగా ఎవరైతే నిమిత్తమయ్యారో వారికి అభినందనలు తెలుపుతున్నారు. ముందుకు సాగుతూ ఉండండి, సాగుతూ ఉండండి.
(లండన్ మహేశ్ అన్నయ్య హైదరాబాద్ శాంతి సరోవర్కు బాగా సహాయం చేస్తున్నారు, వారు ప్రత్యేకమైన స్మృతిని ఇచ్చారు) సమయానికి డైరెక్షన్ అనుసారంగా ఎవరైతే సఫలం చేస్తారో వారికి సఫలత లభిస్తుంది. నిశ్చయబుద్ధిగల మంచి పరివారము, సదా ముందుకు సాగుతూ ఉంటారు. పాలన కూడా ఎంత బాగుంది, మరి పాలనకు రిటర్న్ ఇస్తున్నారు. టోలి పంపించండి. అచ్ఛా!
ఓంశాంతి