Search for a command to run...
28 Feb 2010
దేహ భానం యొక్క ‘నేను-నేను’ అన్న హోలీని కాల్చివేసి పరమాత్ముని సాంగత్యపు రంగుల హోలీని జరుపుకోండి
28 February 2010 · తెలుగు
ఈరోజు హోలియస్ట్ బాబా తమ హోలీ పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. నలువైపుల ఉన్న పిల్లలు దూరదూరాల నుండి స్నేహంగా హృదయంలో ఇమిడిపోతున్నారు. బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఇంత గొప్ప భాగ్యము పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. ఈ సంగమయుగ ప్రాప్తుల ఆధారంతో పిల్లలైన మీరే ఇంతటి శ్రేష్ఠమైనవారిగా, పవిత్రులుగా అవుతారు. దీని ద్వారా మీరు భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా అవుతారు. ఆత్మ కూడా పవిత్రము మరియు శరీరము కూడా పవిత్రము. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబల్ పవిత్రంగా అవ్వలేదు. పిల్లలైన మీరు డబల్ పవిత్రులుగా అవుతారు మరియు డబల్ పవిత్రతకు గుర్తు - డబల్ కిరీటధారిగా అవ్వడము.
ఈరోజు అందరూ హోలీని జరుపుకుంటారు కానీ ఈ సమయంలో మీరు డబల్ హోలీగా (అనగా పవిత్రంగా) అయినందుకు స్మృతిచిహ్నంగానే ఉత్సవ రూపంలో హోలీని జరుపుకుంటున్నారు. మీ యొక్క అడుగు-అడుగు, జీవిత మహత్వాన్నే ఉత్సవం రూపంలో జరుపుకుంటున్నారు. మీరు ఈ సంగమంలో ప్రతి రోజు, ప్రతి అడుగు ఉల్లాసము మరియు ఉత్సాహములో ఉంటారు కనుక మీ ఉల్లాస ఉత్సాహాలకు గుర్తుగానే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉల్లాస ఉత్సాహాలు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే మీరు పరమాత్ముని సాంగత్యపు రంగుల హోలీని జరుపుకుంటారు కాబట్టి. అనగా మీ ప్రతి అడుగును ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. హోలీలో ముందుగా కాలుస్తారు. తర్వాత జరుపుకుంటారు. మీరు కూడా సంగమంలో ఇప్పుడు తమ పాత సంస్కార స్వభావాలను యోగాగ్నిలో కాల్చివేస్తున్నారు ఎందుకంటే మీలోని పాత సంస్కారాలను కాల్చనంత వరకు పరమాత్ముని సాంగత్యపు రంగు మీకు అంటుకోదు, పరమాత్మ మిలనము జరుగదు. అంటే మీరు యోగాగ్నిలో సంస్కారాలను కాల్చివేసారు, తర్వాత పరమాత్ముని సాంగత్యపు రంగులో మునిగారు. ఈరోజుల్లో కాలుస్తున్నారు మరియు రంగులు కూడా వేసుకుంటున్నారు. మీ ఆధ్యాత్మిక రూపానికి వారు స్థూల రూపాన్ని ఇచ్చారు. వారు స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడున్నది దేహాభిమాన వృత్తి కనుక. మీరు హోలీగా అవుతారు, వారు హోలీని జరుపుకుంటారు. పూర్తి కల్పంలో మరెవ్వరూ ఆధ్యాత్మిక హోలీని జరుపుకుని డబల్ హోలీగా అవ్వలేదు. మరి మీరందరూ, ఎక్కడినుండి వచ్చినా కానీ పరమాత్ముని సాంగత్యపు హోలీకి వచ్చారు. పరమాత్ముని సాంగత్యపు హోలీని జరుపుకోవడానికి వచ్చారు. హోలీ గురించి మీరిలా అంటారు కదా- హోలీ అంటే ఏదైతే గడిచిపోయిందో అది హోలీ (గడిచిపోయింది). మరి డ్రామా అనుసారంగా ఏదైతే గడిచిపోయిందో దానిని హో లీ అని అంటాము, గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఏ విధమైన వ్యర్థ విషయాన్నీ చిత్తములోకి తీసుకోరు, గడిచిపోయింది, ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీ అనగా పవిత్రంగా అయ్యే పూర్తి పురుషార్థం చేసి పవిత్రతను ధారణ చేసారు అందుకే భవిష్యత్తులో మీకు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటాన్ని చూపిస్తారు.
ఈ రోజు పిల్లలైన మీరందరూ దేనిని కాల్చి వెళ్తారు? జన్మదినం రోజున బాప్‌దాదా ఏదైతే హోమ్‌వర్కు ఇచ్చారో - క్రోధాన్ని జన్మదినం రోజున జన్మదిన బహుమతిగా ఇచ్చేయండి - దాని రిజల్టు ఈ రోజు కొంతమంది పిల్లల నుండి బాప్‌దాదాకు చేరుకుంది. అక్కడక్కడ పిల్లలు అటెన్షన్ పెట్టడం బాప్‌దాదా చూసారు. మీరందరూ కూడా మీ మీ రిజల్టును చూసుకుని ఉంటారు. ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో వారు తమ రిజల్టును చూసుకున్నారా! ఎవరైతే తమ రిజల్టులో కంట్రోల్ చేసుకుని సఫలతను పొందాము అని అంటారో వారు చేతులెత్తండి. సఫలతను పొందారా! చేతులు పెద్దగా ఎత్తండి. టీచర్లు చేతులు ఎత్తండి, విదేశీయులు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా. అభినందనలు. దీని వలన మీరందరూ స్వయంపై ధైర్యాన్ని ఉంచారు మరియు ధైర్యానికి ఫలితం ప్రాప్తించగలదు, ఇది అనుభవం చేసారు. మరి ఈ అనుభవాన్ని ఇక ముందు కూడా లక్ష్యంగా తీసుకుని పదే పదే చెకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం సంభవమని భావిస్తున్నారా? సంభవమా? భవిష్యత్తులో ఇలా వీలవుతుందా? వారు చేతులెత్తండి. అచ్ఛా, వీలవుతుందా? టీచర్లు వీలవుతుందా? పాండవులకు వీలవుతుందా? అచ్ఛా. సంభవమవ్వగలదు అని అనకండి, అవ్వాల్సిందే, ఇందుకు చప్పట్లు కొట్టండి. అచ్ఛా. ఇప్పుడైతే ఎక్కువ రోజులు అవ్వలేదు కానీ ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఈ రోజు నుండి మూడు నెలలు అటెన్షన్ పెట్టి క్రోధం యొక్క టెన్షన్‌ను సమాప్తం చెయ్యగలరా? చెయ్యగలరా? వారు చేతులెత్తండి. అచ్ఛా. ఇదైతే చాలా మంచి శుభవార్త, ఎందుకని? క్రోధానికి కారణం ఏమిటి? క్రోధానికి బీజము ఎమిటి? మీరు సదా మీ భవిష్య స్వరూపాన్ని మీ ముందు ఉంచుకోండి, మీ భవిష్య స్వరూపం ఎంతగా అలంకరింపబడిన హర్షిత ముఖము! బాప్‌దాదాను చూడండి, అందులోనూ బ్రహ్మా బాబాను మీ ఎదుటకు తీసుకురండి, ఎందుకని? శివబాబా అయితే ఎలాగూ నిరాకారుడు కానీ బ్రహ్మా బాబా మాత్రం మీలా సాకార రూపధారి, మీలా బాధ్యతా కిరీటాన్ని ధరించినవారు అయినప్పటికీ సదా చిరునవ్వుతో కూడిన సంతోషకర ముఖము ఉండేది ఎందుకంటే ఈ వికారాలపై విజయాన్ని పొంది మీ ఎదురుగా శరీరంతో కార్యం చేస్తూ ఉదాహరణగా నిలిచారు. బ్రహ్మా బాబాకన్నా ఎక్కువగా మీకు బాధ్యతలు ఉన్నాయా? బ్రహ్మా బాబాకు ఉన్న బాధ్యతల ముందు మీకున్న బాధ్యతలు ఏమీ లేనట్లే. చివరి వరకు కర్మాతీత వైబ్రేషన్లలో ఉంటూ అవ్యక్త ఫరిశ్తాగా అయ్యారు. మరి ఇప్పుడు బాప్‌దాదాకు ఇచ్చేసిన బహుమతిని తిరిగి తీసుకోరు కదా! సేవా కార్యక్రమాలలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అని బాప్‌దాదా అర్థం చేసుకోగలరు. అప్పుడప్పుడూ పెద్ద గొంతు అవుతుంది అని కొందరు రిజల్టులో వ్రాసారు, మూడ్‌లో ఆవేశం వస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి విషయాలు ఎదురుగా వచ్చినప్పుడే విజయులుగా అయి చూపించడానికి అవకాశం వస్తుంది. పరిస్థితుల పని రావడము కానీ మీకున్న జ్ఞానము పరిస్థితులను దాటుకుని విజయులుగా కావడము. మరి ఇష్టమేనా? క్రోధానికి సదా కోసం వీడ్కోలు చేప్తారా లేక కేవలం మూడు నెలల కోసమేనా? ఎంత సమయం కోసం ధైర్యముంది? సదా కోసం క్రోధముక్తులుగా కావడం కష్టంకాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. అచ్ఛా. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ఎందుకని? మీ చివరి జన్మలో కూడా మీ మహిమ ఏమని చేస్తారు? మీ దేవతా రూపం ఎదుట మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీ పాడుతారు. మీరు ఇలా అయ్యే పాత్ర సంగమయుగానిదే గాయనము ఉంది. బాప్‌దాదా మనసులో ఒక విశేషమైన ఆశ ఉంది, చెప్పమంటారా? తల ఊపండి, చెప్పమంటారా? బాప్‌దాదా ఇప్పటి నుండి, ఇప్పటి నుండి పిల్లలు ప్రతి ఒక్కరినీ వికసించిన గులాబి పుష్పాలుగా చూడాలని ఆశిస్తున్నారు. అదృష్టవంతులు, సంతోషకర ముఖము. పరిస్థితుల పని రావడము, ఇది కూడా అర్థం చేసుకోండి. పరిస్థితులు వస్తాయి కానీ మీ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావాలి. గాబరా పడకూడదు. బ్రహ్మా కుమారీలు పవిత్రతా పాఠాన్ని చాలా నేర్పిస్తారు అని ఎలా అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారో అలాగే బ్రహ్మా కుమారీలు క్రోధముక్తులుగా చేస్తారు అని కూడా ప్రసిద్ధికెక్కాలి. ఎందుకంటే క్రోధం నుండి ముక్తులవ్వాలని అందరూ కోరుకుంటారు. ఒత్తిడి ఉంటుంది కదా! ఒత్తిడి కలుగుతుంది కనుక అందరూ దాని నుండి ముక్తిని కోరుకుంటారు కానీ వారికి విధి తెలియదు. పవిత్రంగా ఉండటం అసంభవం అని భావించేవారు ఇప్పుడు మిమ్మల్ని చూసి, మీ అనుభవం ఆధారంతో ఇది వీలవుతుంది అని ఎలా అయితే అనుకున్నారో అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధజీతులుగా అవ్వడం సంభవమే, కష్టం కాదు అన్న అలను వ్యాప్తి చెయ్యండి. ఇటువంటి ఉదాహరణ యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్‌గా స్టేజిపైకి తీసుకురండి. చాలామంది పిల్లలు కార్యాలన్నీ చేస్తూ క్రోధజీతులుగా అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. ఇటువంటి ఉదాహరణలు మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యాయి. మరి ఈ సంవత్సరం ఏమి చేస్తారు? హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! హోలీలో ఏమి చేస్తారు? కాలుస్తారు కదా! మరి ఈనాటి హోలీలో మీరు ఏమి కాలుస్తారు? క్రోధమైతే చేసేసారు, దీనిని పక్కా చేస్తారు! కానీ బాప్‌దాదా ఏమి చూసారంటే ఒత్తిడిలోకి రావడానికి కారణం దేహాభిమానపు ‘నేను’ అన్న పదము. దేహభానపు ‘నేను’ - ఒకటి నేను ఆత్మను, ఈ నేను అన్నది ఉంది. మరొకటి దేహభానపు నేను అన్న పదము అభిమానంతో కూడినది కూడా ఉంటుంది, అవమానంతో కూడినది కూడా ఉంటుంది మరియు నిరాశతో కూడిన నేను-నేను కూడా క్రింద పడవేస్తుంది. మరి ఈ రోజు క్రోధజీత్లో ముందుకు వెళ్ళడంలో దేహాభిమానపు నేను అన్న పదాన్ని యోగాగ్నిలో కాల్చివేయండి. అనేక రకాల నేను-నేను అన్నవాటిని కాల్చివేయండి మరియు నేను ఆత్మను, ఇటువంటి ‘నేను’ అన్న ఒక్క పదాన్ని పక్కా చేసుకోండి. మిగతా అన్ని ‘నేను’ అన్నవాటిని ఈరోజు యోగాగ్నిలో కాల్చేసి వెళ్ళండి. అనేక రకాల నేను ఉన్నాయి కదా. కనుక ఈ రోజు కాల్చివేసే హోలీని జరుపుకోండి. ఎందుకంటే క్రోధానికి కారణం ఎక్కువ ఒత్తిడి. కనుక ఇటువంటి ‘నేను’ అన్నదాన్ని సమాప్తం చెయ్యడానికి ఈరోజు మీలోపల సంకల్పం తీసుకోండి. కాల్చివేయాలి ఎందుకంటే ఇది కూడా భారమే కదా. ట్రైన్లో వెళ్ళండి, విమానంలో వెళ్ళండి కానీ ఈ భారాన్ని ఇక్కడే కాల్చేసి వెళ్ళండి. కాల్చగలరా? పిల్లల ధైర్యము, తండ్రి సహాయము తోడుగా ఉండనే ఉన్నది అని ఎవరైతే భావిస్తున్నారో, విజయము కూడా తోడుగానే ఉంటుంది. నేను విజయిగా అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే, అచ్ఛా. ఈ రోజు ఇక్కడకు వచ్చిన వి.ఐ.పిలు కూడా చేతులెత్తుతున్నారు. ఇక్కడకు వచ్చిన వి.ఐ.పిలు లేచి నిల్చోండి. చేతులెత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి. విజయులుగా అవుతారా? చూడండి. ఎవరైతే విజయులుగా అవుతారో వారికి ఒక్కొక్కరికీ మాలను వేస్తున్నాము. అభినందనలు, అభినందనలు. అచ్ఛా. ఇప్పుడు వచ్చిన వి.ఐ.పీలందరూ ధైర్యమున్నవారు అందుకే బాప్‌దాదా వరదానమును ఇస్తున్నారు. ఈ సమయంలో మీరందరూ వి.ఐ.పీలుగా ఏ కారణం చేతనైనా అయి ఉండవచ్చు ఈ జన్మలో, కానీ బాప్‌దాదా ధైర్యమును కలిగిన పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు వి.ఐ.పి అని అనరు, పిల్లలు అని అంటారు. బాప్‌దాదా ఈ వరదానాన్ని, గ్యారంటీని ఇస్తున్నారు - మీరందరూ 21 జన్మలు వి.ఐ.పిలు అవుతారు. ఇక్కడలా ఎలక్షన్లు, సెలక్షన్లు జరగవు. అందరూ కేవలం ఒక్క విషయాన్ని మాత్రం వదలకండి. ఇప్పుడు ఎలా అయితే సంబంధ సంపర్కంలోకి వచ్చారో అలా ఈ బ్రాహ్మణ పరివారం యొక్క కనెక్షన్‌ను విడిచిపెట్టకండి. ఎంతగా కనెక్షన్‌ను పెట్టుకుంటామో అంతగా రిలేషన్ పక్కాగా ఉంటుంది మరియు బాబా వరదానమును పొందేస్తారు. మరి సమ్మతమేనా? కనెక్షన్ పెట్టుకోవడం సమ్మతమేనా? చేతులెత్తండి. అచ్ఛా. (బాప్‌దాదా పూలమాలను తీసుకుని ముందుకు వేసారు) ఈ మాలను మీరందరూ వేసుకోండి.
పిల్లలైన మీరందరూ క్రొత్తవారు, రియల్ గోల్డ్ పిల్లలు సదా బాబాకు ఆజ్ఞాకారులు కదా! కనుక ఈరోజు ఇటువంటి నేను అన్న పదాన్ని కాల్చేసే వెళ్ళండి. మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్ఛా. మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్‌దాదా మొదటిసారి వచ్చినందుకు పదమారెట్ల అభినందనలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడెలా అయితే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబరు, మొదటి డివిజన్‌లోకి రావాలి. మొదటి నంబరు అయితే ఫిక్స్ అయిపోయింది. మొదటి డివిజన్‌లోకి వస్తారు, ఈ ధైర్యముంది. ధైర్యమున్నవారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. అచ్ఛా. మేము లాస్ట్ వచ్చాము కానీ ఫాస్ట్‌గా వెళ్తాము అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. ఇప్పుడు ఏదైతే చెయ్యాలనుకుంటారో దానిని తీవ్ర పురుషార్థీలుగా అయ్యి చెయ్యండి ఎందుకంటే బహుకాలపు పురుషార్థాన్ని మీరందరూ కొద్ది సమయంలోనే పూర్తి చెయ్యవలసి ఉంటుంది. మరి ధైర్యముందా? ధైర్యముందా? చేతులెత్తండి. చూడండి, మీ ఫోటోను తియ్యడం జరుగుతుంది. ఇటువంటి ధైర్యవంతులకు బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు - ధైర్యము మీది సహాయం ఇచ్చేది బాబా. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. తమ అదృష్ట సితారను సదా మెరిసేలా ఉంచండి ఎందుకంటే ఈ జన్మలో చేసిన తీవ్ర పురుషార్థం, పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది అందుకే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. పరిస్థితులు వస్తాయి కానీ పరిస్థితి మహావీర్ కాదు, మీరు సర్వశక్తిమంతుని పిల్లలు, మీ ముందు పరిస్థితి ఎంత! పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాని వెనుక మీరు మీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు. అచ్ఛా, కూర్చోండి. బాప్‌దాదా అందరికీ స్నేహము నిండిన అభినందనలు తెలుపుతున్నారు, ఏ విషయానికి? ధైర్యాన్ని ఉంచారు. పిల్లలందరూ తీసుకున్న ధైర్యముతో కూడిన సంకల్పానికి బాబా సంతోషిస్తున్నారు. మరి హోలీని జరుపుకున్నారా? కాల్చివేసే హోలీనైతే జరుపుకున్నారు మరియు పరమాత్ముని సాంగత్యపు రంగుల హోలీని జరుపుకోండి. కాల్చేసారు కూడా, జరుపుకున్నారు కూడా.
ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరికీ ఒక డ్రిల్‌ను చేయించాలనుకుంటున్నారు. ఎందుకంటే నలువైపుల పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో పరిస్థితి. నలువైపుల ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్యలో మీరు ఒక్క సెకండులో ఏకాగ్రులు కాగలరా? ఇటువంటి అభ్యాసాన్ని స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? లేక ఒకవేళ మీకు కొన్ని కారణాల వలన ఏ విషయం గురించైనా వ్యర్థ సంకల్పాల తుఫాను వచ్చినట్లయితే, అటువంటి సమయంలో మీరు మీ మనసు, బుద్ధిని ఏకాగ్రం చెయ్యగలరా? ఈ ఏకాగ్రతా శక్తి యొక్క డ్రిల్‌ను అవసరమైనప్పుడు చేసి చూసారా? ఒకవేళ ఇటువంటి సమయంలో ఒక్క సెకండులో ఏకాగ్రతా శక్తిని కార్యంలోకి తీసుకురాకపోతే మున్ముందు ఇటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ వస్తుంది. మరి ఈరోజు బాప్‌దాదా సెకండులో ఫుల్స్టాప్ అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్‌ను ఇప్పించాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రకృతి తన భిన్న భిన్న రంగులను చూపించడం ప్రారంభించింది. నలువైపుల ఏమేమి జరుగుతున్నాయి అన్నది మీకు బాగా తెలుసు. మనసు బుద్ధిని భ్రమింపజేసే విషయాలు రావలసిందే, మరి ఇప్పుడు మీ మనసును, బుద్ధిని ఒక్క క్షణంలో పరంధామంలో స్థితి చెయ్యగలరా? ఇప్పుడు ఫరిశ్తా రూపంలో స్థితులవ్వండి. నేను బ్రాహ్మణుడిని, మాస్టర్ సర్వశక్తిమంతుని స్థితిలో ఉన్నాను, ఈ విధంగా మాస్టర్ సర్వశక్తిమంతుని స్థితిలో స్థితులవ్వండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) ఇటువంటి అభ్యాసాన్ని రోజంతా సమయం లభించినప్పుడు పదే పదే మనసును ఏకాగ్రం చేసి చూడండి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, మనసును ఏకాగ్రం చేసుకోండి. పురుషార్థం ఒక్క నిమిషం పట్టినా, ఒక్క సెకండులో ఫుల్స్టాప్ ఎందుకంటే అలజడుల సమయం ఇప్పుడు తయారవుతుంది కనుక మైండ్ కంట్రోల్ - మనసు నాది, నేను మనసును కాదు, నా మనసు - మరి నా అన్నవాటిపై నాకు కంట్రోల్ ఉందా? ఈ డ్రిల్ చాలా అవసరము.
ఎవరెవరైతే వచ్చారో బాప్‌దాదాకు అందరూ ప్రియమైనవారే. ఎందుకని? ఎలా ఉన్నాకానీ బాప్‌దాదా పిల్లలందరినీ కోట్లలో కొద్దిమందిగా చూస్తారు. పురుషార్థంలో బలహీనంగా ఉన్నాకానీ బాబాకు ప్రియమైనవారు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు అందుకే బాబాకు కూడా అతి ప్రియమైనవారు. బాప్‌దాదా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుకు తెప్పిస్తున్నారు - మీ ముఖము సదా సంతోషంగా, సంతోషంతో మెరుస్తూ ఉండాలి. పరిస్థితులను వెళ్ళనివ్వండి కానీ సంతోషాన్ని వెళ్ళనివ్వద్దు. సంగమయుగ సంతోషం పరమాత్ముని బహుమతి. కావున హోలీ అనగా ఇలాంటి విషయాలు ఏవైనా వచ్చినా కానీ హోలీని జరుపుకొని వచ్చాము, పరిస్థితి హో లీ అయిపోయింది కానీ సంతోషం పోకూడదు అని గుర్తుంచుకోండి. పరమాత్ముడు ఇచ్చే బహుమతి, ఖజానా సంతోషము.
సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి అన్న స్లోగన్‌ను సదా గుర్తుంచుకోండి అని బాప్‌దాదా అంటున్నారు. ఎంతగా పంచుతారో అది అంతగా పెరుగుతుంది, అంతేకాక సంతోషకర ముఖము నడుస్తూ తిరుగుతూ కూడా ఆటోమేటిక్‌గా సేవ చేస్తూ ఉంటుంది. వీరికి ఏమి లభించింది అని చూసిన వారందరూ ఆలోచిస్తారు. మరి ఈ రోజు హోలీ సందర్భంగా సంతోషమనే దిల్ఖుష్ మిఠాయిని స్వీకరించండి. అందరూ తిన్నారా? సదా తింటూ ఉండండి. దీనితో ఎటువంటి అనారోగ్యము రాదు. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రావారిది:- ఢిల్లీ వారు చాలా పెద్ద మనసున్న వారు ఎందుకంటే ఢిల్లీ రాజధాని, ఇప్పుడు కూడా రాజధానియే, భవిష్యత్తులో కూడా రాజధానియే. ఢిల్లీలో బాప్‌దాదా హృదయ ఆశలు కూడా ఉన్నాయి మరియు ఆశలను పూర్తి కూడా చేసారు. సేవా ప్రకారంగా ఢిల్లీలో కూడా సేవలు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో పిల్లలు చిన్న పెద్ద పట్టణాలలో ఉల్లాసంతో సేవను చేసారు, దాని రిజల్టుతో బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఢిల్లీవారి పట్ల కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ వారు ఒక అద్భుతాన్ని చేసి చూపించండి, చెప్పమంటారా? ఏమిటది? మొదటి నుండి ఒక విషయం మిగిలి ఉంది, ఢిల్లీ వారైనా మరెవరైనా - ఇప్పుడు ఢిల్లీ వారున్నారు - గీతా భగవంతుడు ఎవరు? ఈ విషయాన్ని ఏదైనా విధితో ఒక గ్రూపును తయారుచేయండి. అప్పుడు వారే స్వయంగా గీతా భగవంతుడు పరమాత్మ అని అంటారు. ఇలా ముందుగా ఒక చిన్న గ్రూపును తయారు చేసి చూపించండి. అనౌన్సు చెయ్యనవసరం లేదు, కానీ చిన్న గ్రూపు, కనెక్షన్ ఉన్నవారు చాలామంది ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, కొందరు పెద్ద పెద్ద కనెక్షన్లలో వస్తారు, వారికి అర్థం చేయించి వారిని తయారు చేయండి. నిజంగా భగవంతుడు ఎవరు? ఇది వీలవుతుందా? వీలవుతుందా? క్రొత్త విషయాన్ని చేసి చూపించండి. ముందు గ్రూపును తయారు చెయ్యండి అందులో అన్ని పొజిషన్లవారు ఉండాలి, భిన్న భిన్న పొజిషన్లవారు ఉండాలి, ధార్మికపరమైన వారు కూడా ఉండాలి, జడ్జీలు ఉండాలి, వకీళ్ళు ఉండాలి, సాధారణ పొజిషన్ వారు కూడా ఉండాలి, ఇటువంటి గ్రూపును తయారు చెయ్యండి ఎందుకంటే ఈ విషయం ప్రసిద్ధి కావాలి కదా! గీతా భగవంతుడు ఎవరు అని ప్రత్యక్షం కావలసిందే. ఢిల్లీలో అన్ని ప్రకారాల వారు ఉన్నారు. ధర్మ స్థానాలు ఉన్న చోట కూడా ఒకవేళ ఈ విధంగా ఎవరినైనా తయారు చెయ్యగలిగితే వారు కూడా చెయ్యవచ్చు. ఒక గ్రూపును తయారు చెయ్యండి.
బాప్‌దాదా పిల్లల పురుషార్థాన్ని, ధైర్యాన్ని చూసారు. బాబా చెప్పిన వెంటనే పిల్లలు సేవను ఎంతో ఉత్సాహంతో చేసారు. ఇందుకోసం బాప్‌దాదా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు - పిల్లల్లో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, ఇక ముందు కూడా పెరుగుతూ ఉంటాయి. బాప్‌దాదా సేవా సమాచారాన్ని కూడా విన్నారు. ఇప్పుడు ఢిల్లీలో భిన్న భిన్న ప్రోగ్రాములు జరుగుతున్నాయి. బాబా ద్వారా పిల్లలకు లభించిన బహుమతి, స్థానం లభించింది, (ఓ.ఆర్.సి) దానిని కార్యంలోకి తెస్తున్నారు. ఇందుకు విశేషమైన అభినందనలు. పిల్లల్లో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, కేవలం కొద్ది సమయాన్ని వెచ్చిస్తారు.
ఢిల్లీలో బాబా మరియు జగదాంబ ఇద్దరూ సేవ చేసారు. బ్రహ్మా బాబా కూడా సేవ చేసారు, జగదాంబ కూడా సేవ చేసారు. జమున నదీ తీరమైతే ఢిల్లీలోనే ఉంది. మీ రాజధాని కూడా జమున నదీ తీరాన ఉంటుంది. మరి ఢిల్లీ వారు అందరికీ స్థానమును ఇవ్వవలసి ఉంటుంది. పెద్ద మనసు కలిగి ఉన్నారు కదా! బాప్‌దాదా ప్రతి స్థానంలో ఉన్న పిల్లల మహిమను చేస్తారు వాహ్ నా పిల్లలు వాహ్! మరి ఢిల్లీ పిల్లల టర్న్ ఇది, మీ టర్న్ కనుక బాప్‌దాదా విశేషంగా సేవా సహయోగానికి, స్నేహిగా చేసుకునేందుకు అభినందనలు ఇస్తున్నారు, అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఇది చేసి చూపించండి. ఇటువంటి గ్రూపు, ఏ జోన్ ధైర్యమును ఉంచినా కానీ వారు ఆ గ్రూపును తీసుకురావచ్చు. సందేశాన్ని వ్యాపింపజేసేందుకు నిమిత్తమైనవారు, ఇప్పుడు మిగిలిపోయిన పాయింట్లను చేసి చూపించండి. బాగుంది. బాప్‌దాదా పిల్లల సేవను కూడా చూస్తూ ఉంటారు. సేవ కూడా జరుగుతూ ఉంటుంది, సేవతో పాటు స్వ స్థితిలో ముందుకు వెళ్ళాలన్న ఉల్లాసము కూడా మంచిగా ఉంది.
డబల్ విదేశీయులు:- 90 దేశాలనుండి వచ్చారని బాప్‌దాదా విన్నారు. వాహ్ డబల్ విదేశీయులు వాహ్! అని బాప్‌దాదా అంటున్నారు. అందరూ సంతోషంలో ఎగురుతూ ఉన్నారు కదా! సేవా ఉల్లాసము మరియు తీవ్ర పురుషార్థం యొక్క ఉల్లాసము, ఈ రెండూ ఒకదానికొకటి సహయోగిగా అయ్యి ఇస్తూ ఉంటాయి. బాప్‌దాదాకు మధువనంలో వచ్చే ప్రతి గ్రూపును రిఫ్రెష్ చెయ్యడం, ధైర్యాన్ని పెంచడం చాలా మంచిగా అనిపిస్తాయి. ఈ మధ్యలో స్పెషల్ భట్టీ చెయ్యాలి, ఏకాంతవాసులుగా అవ్వాలి అన్న అల చాలా బాగుంది. జనరల్ ప్రోగ్రాములైతే జరుగుతూనే ఉంటాయి. కానీ చిన్న చిన్న గ్రూపులను తయారుచేసి స్వ ఉన్నతి కోసం ప్రోగ్రాములు తయారు చేసుకోవడం - ఈ ఉన్నతి సాధనము చాలా బాగుంది. టీచర్లు కూడా చేసారు. బాగుంది. పాండవులు కూడా చేసారు ఎందుకంటే దీని ద్వారా స్వయంపై స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. రిఫ్రెష్మెంట్ కోసం మధువనానికి ఉల్లాసంగా రావడం బాప్‌దాదాకు చాలా బాగా నచ్చుతుంది. సమయాన్ని తీసుకుని సమయం యొక్క లాభాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఒకటి జనరల్ ప్రోగ్రాము వలన లాభము, బాప్‌దాదాను కలుసుకునే లాభము, మరియు విశేషంగా తమ స్వ ఉన్నతిలో లాభము. అలాగే బాప్‌దాదా అన్ని వైపుల ఉన్న వారికి సలహా ఇస్తున్నారు - మీ మీ చోట్ల కూడా చిన్న చిన్న గ్రూపులకు స్వ ఉన్నతి యొక్క అవకాశాన్ని ఇచ్చి అనుభవాన్ని పెంచండి. 5 మంది గ్రూపు చెయ్యండి, చిన్న సెంటరైతే. ఈరోజుల్లో విశేషమైన అటెన్షన్ ఫస్ట్ స్వ ఉన్నతి. కంట్రోలింగ్ పవర్. ఏకాగ్రత శక్తి పైన, ఏ డ్రిల్ అయితే చెప్పామో దానిపై అటెన్షన్ పెట్టండి. దేశంవారు, విదేశంవారు ఇద్దరిలో సేవ మరియు స్వ ఉన్నతిలో అటెన్షన్ ఉంది, కానీ ఇంకా పెంచుతూ ఉండండి ఎందుకంటే బాప్‌దాదా రెండు విషయాలను పదే పదే అటెన్షన్లోకి తీసుకువచ్చారు. ఒకటి అకస్మాత్తుగా, మరొకటి బహుకాలపు పురుషార్థం జమ అయి ఉండాలి. అవుతుంది అని కాదు, అవుతూ ఉంది అని కూడా కాదు. తీవ్రంగా ఉందా? ఇప్పుడు ఏదైనా ధారణ విషయంలో పరివర్తన అవుతున్నాను అని అనవద్దు. తీవ్రం చేయండి, ఇప్పుడే చేయాలి. అవుతుందిలే అనకండి. అప్పుడు కాదు, ఇప్పుడు. ఇకపోతే డబల్ విదేశీయుల వృద్ధిని చూసి కూడా బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. విదేశాలలో మిగిలి ఉన్న ఏరియాలను కూడా పూర్తి చేయండి. విదేశాలలో కూడా ఫిర్యాదు రాకూడదు. జరుగుతున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు కానీ ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే కూడా అటెన్షన్ ఇచ్చి ఆ ఫిర్యాదును కూడా సమాప్తం చెయ్యండి. ఎప్పుడు అన్న మాట వద్దు, ఇప్పుడు. బాప్‌దాదా పిల్లలందరిపై సంతోషంగా ఉన్నారు. బాప్‌దాదా అమృతవేళ విదేశాన్ని కూడా చుట్టి వస్తారు. కేవలం మధువనం లేక భారతదేశాన్నే చుట్టి వస్తారని కాదు. బాప్‌దాదాకు విదేశాలలో తిరిగి రావడానికి ఎంత సమయం పడ్తుంది? పిల్లలందరి చార్టును బాప్‌దాదా ఇలా తిరుగుతూ చూస్తారు. ప్రేమ కూడా ఉంది కదా! ప్రేమ పిల్లలది, బాబాకు కూడా ప్రేమ ఉంది. మరి ఏమి చేస్తున్నారు? అన్ని వైపులకు వెళ్తారు. కేవలం లండన్, అమెరికాయే కాదు, అన్ని చోట్లకు వస్తాము. బాప్‌దాదా యొక్క ప్రతి సీజన్లో (ప్రతి గ్రూపులో) విదేశీయులు మిస్ అవ్వరు - ఈ రీతి ఏదైతే తయారు చేసారో బాగా చేసారు. అందం ఉంది. మధువనానికి అందం పిల్లలు. డబల్ విదేశీయుల రాకతో మధువన అందం పెరుగుతుంది. చప్పట్లు కొట్టండి. మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. డబల్ విదేశీయులు ప్రతి టర్న్‌లో వస్తారు, ధైర్యాన్ని ఉంచుతారు. ఈరోజు 90 దేశాల నుండి వచ్చారు. బాప్‌దాదా పిల్లల ప్రేమను చూసి, ఇప్పుడు ఇక ఏమి జరిగినా పరిస్థితులను చూడవద్దు, స్నేహాన్ని చూడండి. మరి ఈ 90 దేశాల నుండి దేనిలో వచ్చారు? స్నేహము. మరి ఈ రోజు బాప్‌దాదా విశేషంగా డబల్ విదేశీయులు చెప్పినట్లుగా వంద రెట్లు అభినందనలు మరియు దీవెనలు ఇస్తున్నారు. అచ్ఛా, కూర్చోండి.
ఐ.టి. గ్రూప్:- బాగుంది, ఐ.టి. గ్రూప్ ద్వారా పిల్లలకు కూడా లాభం చేకూరింది, దూరంగా ఉన్నవారిని కూడా ఎదురుగా చూస్తున్నారు. సేవలో కూడా టి.వి ద్వారా మంచి సందేశాలు చేరుతున్నాయి. ఈ డిపార్టుమెంటు కేవలం, ప్రతి దేశంలోని టి.వి గ్రూప్‌ను ఎంతటి ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకురావాలంటే దేశదేశాలలో సేవ జరగాలి. ఎలా అయితే ఇప్పుడు ఒక్క స్టూడియో ద్వారా అక్కడక్కడ సేవలు జరుగుతున్నాయో, అలాగే ప్రతి జోన్లో ప్రతి పెద్ద స్థానంలో ఎక్కడ సందేశం చేరగలదో, అక్కడ కూడా ఈ లాభాన్ని తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ ప్రోగ్రాములు జరుగుతున్నాయో అవి కూడా చూపించవచ్చు, తమ ఏరియాలో. మంచి విషయాలను వ్యాప్తి చేయడానికి తమ ఏరియాలోని సాధనాలు, అది కూడా ప్రతి దేశం చేస్తుందా లేదా అని చెకింగ్ జరగాలి. సాధనాలు మంచిగా ఉన్నాయి. చేస్తున్నారు కూడా, కానీ పెంచుతూ వెళ్ళండి. ఇటువంటి ఆకర్షణీయమైన ప్రోగ్రాములు చేస్తూ ఉండండి మరియు నలువైపుల పంపుతూ ఉండండి అప్పుడు నలువైపుల వ్యాప్తి అవుతుంది. రోజురోజుకూ ఈ డిపార్టుమెంటును కూడా పద్ధతిలోకి తీసుకువస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, ఇక ముందు కూడా పెరుగుతూ ఉంటుంది. బాప్‌దాదాకు ఇందుకు సంతోషంగా ఉంది. బాగుంది. పరస్పరం మీటింగ్ చేసుకున్నారు, ఉల్లాస ఉత్సాహాలు పెంచారు, ఇలాగే ఉల్లాస ఉత్సాహాలను, సమాచారాలను ఇచ్చి పుచ్చుకోవడాన్ని పెంచండి. బాగుంది, అభినందనలు. అచ్ఛా.
బాప్‌దాదా మళ్ళీ సూచనను ఇస్తున్నారు - స్వ పురుషార్థము. స్వ పురుషార్థంతో స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండింటిపై అటెన్షన్ ఇస్తూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి, సదా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
నలువైపుల బాప్‌దాదా స్నేహంలో ఇమిడిపోయి స్మృతి మరియు సేవలో మున్ముందుకు వెళ్ళేవారు మరియు తీసుకు వెళ్ళేవారు, అమృతవేళను ఎంతో మంచిగా శక్తిశాలిగా తయారు చేసుకునేవారు, మనసా సేవ ద్వారా దయా హృదయులుగా, దయాళువుగా, కృపాలువుగా అయి ఆత్మలకు ఏదో ఒక అంచలిని ఇచ్చేవారు, ఈ విధిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉండటాన్ని బాప్‌దాదా చూసారు, కానీ ఇప్పుడు దేనిని జోడించాలి? సదా అన్న పదాన్ని జోడించాలి. అప్పుడప్పుడూ అన్న పదాన్ని డిక్షనరీ నుండి తీసెయ్యండి. మరి నలువైపుల ఉన్న పిల్లలు హోలీ కూడా జరుపుకున్నారు, కాల్చేసారు కూడా మరియు సాంగత్యపు రంగు కూడా పడ్డది, గడిచిందేదో గడిచిపోయింది అన్న హోలీని కూడా జరుపుకున్నారు, అందుకే బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలను సమ్ముఖంలో హృదయంలో చూస్తున్నారు. బాప్‌దాదా యొక్క పదమా పదమరెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- బాబా మరియు డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. ఒకరికొకరు సలహాలు తీసుకుంటూ హా జీ, హా జీ అంటూ స్వయం కూడా ఎగురుతూ ఉండండి మరియు అందరినీ ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
మోహిని అక్కయ్యతో:- ప్రేమతో ముందుకు వెళ్తూ ఉంటారు (మధ్య మధ్యలో ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది). అది పొరపాటులతో జరుగుతుంది. మీ సమయం కొంచెం కింద మీద అవుతున్న కారణంగా ఇలా జరుగుతుంది. బాప్‌దాదా అయితే సహయోగిగా ఉండనే ఉన్నారు. ఏదైతే జరిగిపోయిందో దానిని చక్కబెట్టడంలో కొంత సమయం పడుతుంది, పాత శరీరం కదా. అయిపోతుంది. కేవలం దినచర్యను మరియు మందులను సమయానికి వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు కొంత సమయం మీరు మందుల ఆధారాన్ని తీసుకోవలసి వస్తుంది, అయిపోతుంది. (బాప్‌దాదా తలపై చేయి పెట్టారు) అందరి తలపై చేయి ఉంది, ఇదైతే ఒక్కరిపైనే ఉంచాము, కానీ మీ అందరి తలపై కూడా బాబా చేయి ఉంది.
పర్దాదీతో:- సదా హర్షితంగా ఉండటము వీరికి బ్రాహ్మణ జీవితంలో లభించిన బహుమతి. ఏమి జరిగినా కానీ హర్షితంగా ఉంటారు. ఎగురుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. పేషంటు కాదు, ఎగిరే కళలో ఉండేవారు.
నిర్వైర్ అన్నయ్యతో:- (హోలీ శుభాకాంక్షలు) మీకు కూడా సదా కోసం, ప్రతి ఘడియ కోసం అభినందనలు.
బృజ్ మోహన్ అన్నయ్యతో:- సేవలో బిజీగా ఉంటున్నారు, మంచిది.
రమేష్ అన్నయ్యతో:- బాగుంది, ప్రభుత్వ నియమాలైతే మారుతూ ఉంటాయి కానీ మీరు బ్రాహ్మణ పరివారంలో ఎంత సహజంగా వీలైతే అంత, సహజంగా, సహజంగా చేసి నడుస్తూ ఉండండి, నడిపిస్తూ ఉండండి. మీ డిపార్టుమెంటును సహజంగా చేస్తూ వెళ్ళండి. అప్పుడు అందరూ సంతోషంగా సహయోగిగా అవుతూ ఉంటారు ఎందుకంటే యజ్ఞ కార్యము మీ డిపార్టుమెంటుపై ఆధారపడి ఉంది. కనుక, ఇలా సహజంగా చెయ్యండి. కష్టంగా ఉండవచ్చు, ప్రభుత్వమైతే కష్టంగా చేస్తుంది, కానీ కష్టానికి కూడా సహజమైన విధానాన్ని వెతికి సహజంగా నడిపిస్తూ ఉండండి. ప్రభుత్వమైతే తన పని చేసుకుపోతుంది, మీరు మీ పని చెయ్యండి. బాగుంది. (క్రొత్త బజెట్ గురించి బాప్‌దాదాకు వినిపించారు) అదైతే వస్తుంది. వారి పనిని వారు చేస్తారు కదా. మనం మన పని చెయ్యాలి. వారి కార్యంలో వారు రైట్, వారికి కూడా వారి ప్రాబ్లమ్ ఉంటుంది. పాండవ ప్రభుత్వం యొక్క సమస్య కాదు. సంతోషంగా చేస్తూ వెళ్ళండి.
భూపాల్ అన్నయ్యతో:- కార్య వ్యవహారాలు సరిగ్గా ఉన్నాయా? (నీటి సమస్య ఉంది) ఈ నీటి ట్రక్కులను కొంచెం పెంచండి కదా. అదైతే ఇప్పుడు కూడా సీజన్ ఉంది. స్టాక్ పెట్టుకోండి, స్టాక్ పెంచండి. స్థానాన్ని, ట్రక్కులను పెంచితే సహజమవుతుంది. కావున స్థానాన్ని కూడా పెంచండి, ట్రక్కులు కూడా పెంచండి, స్టాక్ కూడా పెంచండి.
విదేశీ పెద్దక్కయ్యలతో:- చాలా బాగుంది. గ్రూపును తయారు చేసి పురుషార్థంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. బాప్దాదాకైతే ఈ మధువన సీజన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్క సంవత్సరం కోసం డోస్ లభించేస్తుంది. ఈ భట్టీ అనుభవం చాలా బాగుంది. పరస్పరంలో గ్రూప్ చేసుకున్నారు కదా, ఇది బాగుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి క్రొత్తగా చేయండి. (బాహరీన్లో సేవ బాగా జరుగుతుంది) సైలెన్సు వైపు ఎంతగా అటెన్షన్ తీసుకురాగలరో అంత మంచిది. బాగుంది (జయంతి అక్కయ్య బాహరీన్ వెళ్ళి వచ్చారు) (జయంతి అక్కయ్యతో) మంచిగా చేసి వచ్చారు, అభినందనలు.
హైదరాబాద్ శాంతి సరోవర్‌లో క్రొత్త హాల్ తయారైంది, దాని ప్రారంభోత్సవమును బాప్‌దాదా బటన్ ప్రెస్ చేసి చేసారు:- ఈ స్థానంతో సేవ పెరుగుతుంది, ఎంతోమందికి సందేశం లభిస్తుంది. కేవలం పరస్పరం త్వరత్వరగా మీటింగులు చేసుకుంటూ ఉండండి, ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ప్లాన్లు వేసుకుంటూ ఉండండి, వాటిని ప్రాక్టికల్లోకి తీసుకురండి. పాండవులు మరియు శక్తులు ఇద్దరూ కలిసి ఇక ముందు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని ప్లాను తయారు చేయండి. ఒకటి పూర్తవగానే మరొకటి చేయండి అప్పుడు ఈ స్థానం ఎంతో ఉపయోగపడుతుంది. అచ్ఛా!
ఓంశాంతి