Search for a command to run...
30 Nov 2010
ప్రతి గంట 5 స్వరూపాల వ్యాయామము చేసి మనసును శక్తిశాలిగా చేసుకోండి, బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలు కూడా బాబావలె చేసుకోండి
30 November 2010 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా ఒకే దేశస్థులైన పిల్లలందరినీ కలవడానికి వచ్చారు, అది ఒరిజినల్‌గా అందరి దేశము. ఆ ఒక్క దేశము ఎంత ప్రియమైనదో మీ అందరికీ తెలుసు కదా! బాప్‌దాదా కూడా ఆ దేశం నుండే పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలకు తండ్రిని కలుసుకున్నామన్న సంతోషము, అలాగే బాబాకు కూడా పిల్లలను కలుసుకున్నానన్న సంతోషము ఉంది. ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి స్వరూపాలను, విశేషంగా 5 స్వరూపాలను చూస్తున్నారు. అందుకే పంచముఖి బ్రహ్మా యొక్క గాయనము కూడా ఉంది. మరి మీ 5 రూపాలు మీకు తెలుసు కదా! మొదటిది, మీ అందరి జ్యోతి బిందు స్వరూపము. ఆ రూపము మీ ఎదుటకు వచ్చేసిందా! మెరుస్తూ ఉన్నటువంటి ఎంతటి ప్రియమైన రూపమది. రెండవది, దేవత రూపము, ఆ రూపము కూడా ఎంత ప్రియమైనది మరియు అతీతమైనది. మూడవ రూపము, మధ్యలోని పూజ్యనీయ రూపము. నాల్గవది, బ్రాహ్మణ రూప సంగమవాసి, అది కూడా ఎంత గొప్పది. ఐదవది, ఫరిశ్తా రూపము. ఈ 5 రూపాలు ఎంత ప్రియమైనవి. బాప్‌దాదా ఈరోజు మనసు యొక్క వ్యాయామాన్ని నేర్పిస్తారు ఎందుకంటే మనసు అప్పుడప్పుడు పిల్లలను తన వైపుకు తీసుకువెళ్తుంది. కావున ఈరోజు బాప్‌దాదా మనసును ఏకరసంగా చేసుకునేందుకు ఎక్సర్‌సైజును నేర్పిస్తున్నారు. రోజంతటిలో ఈ 5 రూపాల వ్యాయామాన్ని చేయండి మరియు అనుభవం చేయండి. ఏ రూపాన్ని తలుచుకుంటారో ఆ రూపమును మనసులో అనుభవం చేసుకోండి. జ్యోతిర్బిందువు అనగానే మెరుస్తూ ఉన్న ఆ రూపము మీ ఎదుటకు వచ్చింది కదా, అలాగే 5 రూపాలను ఎదుటకు తీసుకురండి మరియు వాటిని అనుభవం చేయండి. ప్రతి గంటలో 5 సెకండులు ఈ డ్రిల్‌ను చేయండి. ఒకవేళ సెకండు కాకపోతే 5 నిమిషాలు చేయండి. ప్రతి రూపాన్ని మీ ఎదుటకు తీసుకురండి, అనుభవం చేయండి. మనసును ఈ ఆత్మిక వ్యాయామంలో బిజీ చేసినట్లయితే మనసు వ్యాయామంతో చక్కగా ఉంటుంది. ఎలా అయితే శారీరిక వ్యాయామాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయో అలాగే ఈ వ్యాయామము మనసును శక్తిశాలిగా ఉంచుతుంది. ఒక్క సెకండు కోసమైనా మనసులో ఆ రూపాన్ని తీసుకురండి. ఇది సహజమే కదా లేక కష్టమా? కష్టమనిపించదు ఎందుకంటే ఈ వ్యాయామాన్ని మీరు అనేకసార్లు చేసి ఉన్నారు. ప్రతి కల్పము చేసారు. మీ స్వరూపమునే మీ ఎదుటకు తీసుకురావడము కష్టంగా అనిపించదు. ఒక్కొక్క రూపము ఎదుటకు వస్తూ ఉంటే దాని విశేషత కూడా అనుభవం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మేము ఈ రూపాలనే అనుభవం చేసుకోవాలని అనుకుంటాము కానీ మనసు మరో వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది అని. ఎంత సమయము మనసును ఎక్కడ ఉంచాలనుకుంటారో అంత సమయము మనసు అలా ఉండటానికి బదులుగా వ్యర్థము, అయథార్థ సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనసులో నిర్లక్ష్యపు సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. కావున బాప్‌దాదా ప్రతి గంట 5 సెకండులు లేక 5 నిమిషాలు ఈ వ్యాయామముతో అనుభవం చేయించాలనుకుంటున్నారు. 5 నిమిషాలు మనసును ఈ వైపుకు నడిపించండి. నడవడం మంచిదే కదా! తర్వాత మీ పనిలో మునిగిపోండి ఎందుకంటే పనులైతే చేయాలి కదా! కార్యములు చేయకుండా ఉండటమైతే వీలు కాదు. యజ్ఞ సేవ, విశ్వ సేవ అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, చేయాల్సిందే. ఈ 5 నిమిషాల డ్రిల్ చేసిన తర్వాత మీరు మీ కార్యంలో మునిగిపోండి. 5 సెకండ్లు అయినా చేయండి, 5 నిమిషాలైనా చేయండి. ఇంత సమయం కూడా లభించని వారు ఎవరైనా ఉన్నారా! ఒకవేళ అలాంటివారు ఉన్నట్లయితే చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారా? అందరికీ లభిస్తుంది. కావున పదే పదే ఈ వ్యాయామాన్ని చేయండి అప్పుడు కార్యం చేస్తూ కూడా ఇదే నషాలో ఉండగలరు. ఎందుకంటే బాబా మహామంత్రము - మన్మనాభవ. మనసు యొక్క అనుభవంతో మాయాజీతులుగా అవ్వడానికి మనసు యంత్రమవుతుంది. ఎందుకంటే సమయము ముందుకు గడుస్తున్నకొద్దీ దాని అనుసారంగా ఒక్క సెకండులో స్టాప్ చెయ్యవలసి ఉంటుంది. ఈ వ్యాయామము చేయడం వలన మన్మనాభవ అయ్యేందుకు సహాయం లభిస్తుంది. ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే, భాషణ ఇచ్చేటప్పుడుకానీ, ఎవరికైనా సందేశం ఇచ్చేటప్పుడుకానీ ఏమని అంటారు - మేము విశ్వాన్ని పరివర్తన చేసేవారము అని అంటారు కదా. మరి విశ్వాన్ని పరివర్తన చేయాలంటే ముందుగా మీ మనసును ఎంతగా శక్తిశాలిగా చేసుకోవాలంటే ఏ సమయంలో ఏ సంకల్పము చేయాలనుకుంటే ఆ సంకల్పమునే మనసు చేయగలగాలి. సెకండులో ఆర్డర్ చేయండి. ఎలా అయితే ఈ శరీరానికి, కర్మేంద్రియాలకు ఆర్డర్ ఇస్తారు కదా, క్రిందకుపెట్టు, పైకి పెట్టు అని అంటారు కదా. అలాగే మనసు వ్యర్థము మరియు అయథార్థము నుండి రక్షింపబడాలి. మనసుకు మీరు యజమానులు. నా మనసు అని అంటారు కదా! మరి నా మనసు ఇంతగా నా ఆర్డర్లో ఉండాలి అందుకు ఈ మనసు యొక్క వ్యాయామమును చెప్పడం జరిగింది.
బాప్‌దాదా ఏమి చూసారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ మేము మనసును జయించి జగత్‌జీతులుగా అవ్వాలని ఆశిస్తున్నారు. అందుకే రాబోవు సమయంకన్నా ముందుగానే మీ మనసును ఎక్కడ కావాలంటే అక్కడ సహజంగా స్థితి చేసుకునే అభ్యాసము ఉండాలి. మరి బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారంటే పిల్లలందరూ ఎంతగా శక్తిశాలిగా అవ్వాలంటే ఏ సంకల్పము చేస్తారో అదే ఆర్డరులో మనసు, బుద్ధి, సంస్కారాలు ఉండాలి. ఎవరికైతే ఈ అభ్యాసము ఉంటుందో వారు జగత్‌జీతులుగా తప్పకుండా అవుతారు. బాప్దాదాపై, పరివారంపై అందరికీ ప్రేమ ఉంది. ఎంతగా పిల్లలకు బాబాపై ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ బాబాకు పిల్లలపై ఉంది. పిల్లలు ఎంతో చతురతను చూపారు, నా బాబా, నా బాబా అంటూ నావారిగా చేసేసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో “నా బాబా” అని అంటారు. బాబా కూడా ‘‘నా పిల్లలు’’ అని అంటారు. “నా” అన్న ఈ పదము ఎంతో అద్భుతము చేసింది. నా బాబా, ప్రియమైన బాబా అని అంటూ ఉంటే పిల్లల మనసులలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి. బాబా కూడా పదే పదే నా పిల్లలు అని అంటారు. మాయ యొక్క ఎటువంటి దాడి జరిగినా కానీ, ఎందుకంటే మాయను అర్థకల్పం మీ దానిగా చేసేసుకున్నారు కదా! కావున మాయకు కూడా మీపై ఎంతో ప్రేమ ఉంది! కనుక అది పదే పదే మీ వద్దకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా నా బాబా అన్నప్పుడు బాబా నుండి సహయోగము లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఒక్కసారి నా బాబా అని అన్నప్పుడు వేయి సార్లు శక్తిశాలి సహయోగాన్ని అందించడానికి బాబా బంధింపబడి ఉన్నారు. అనుభవం ఉంది కదా! కేవలం సమయానికి ఈ అనుభవాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి.
బాప్‌దాదా పిల్లల ఒక్క విషయాన్ని చూసి మనసులో పిల్లలను చూసి నవ్వుకుంటారు. ఏ విషయమో తెలుసా? బాబాయే మా ప్రపంచము అని అందరూ అంటారు, అందరూ అంటారు కదా! అంటారు, బాబాయే మా ప్రపంచము అని అనేవారు చేతులెత్తండి. అచ్ఛా, బాబాయే మీ ప్రపంచము. మరే ఇతర ప్రపంచము లేదు కదా! వేరే ప్రపంచము లేదు కానీ మరొకటి ఉంది, అది ఏమిటి? సంస్కారము. బాబాయే నా ప్రపంచము, మరో ప్రపంచమే లేదు. ప్రపంచము లేనప్పుడు సంస్కారము ఎలా వస్తుంది? ఈ మధ్య బాప్‌దాదా సమయానుసారంగా సంస్కారము అన్న పదాన్ని తొలగించాలనుకుంటున్నారు. తొలగించడం వీలవుతుందా? వీలవుతుందా? సంస్కారము విఘ్న రూపమవ్వదు అని భావించేవారు, దృఢ సంకల్పమును చెయ్యగలరు, దృఢ పురుషార్థము ద్వారా, సమాప్తం చేయవలసిందే అని ఈరోజు కూడా దృఢ పురుషార్థాన్ని చేయవచ్చు. చేద్దాములే, ఆలోచిద్దాములే, చూద్దాములే... ఇది వద్దు. చేయాల్సిందే. సంస్కారము పని రావడము, పిల్లలైన మీ పని సమాప్తము చేయాల్సిందే. ధైర్యముందా? ధైర్యముందా? ముందు కూడా చేతులెత్తారు కానీ చేసిన సంకల్పం జరుగుతుందా అని పరిశీలించుకోండి. లక్ష్యమును ఇవ్వడము బాబా కార్యము, పిల్లల కార్యము బాబా చెప్పినదాన్ని చేయాల్సిందే. దీనికి కూడా ఒక డేట్‌ను ఫిక్స్ చేయండి, ఎలా అయితే భక్తులు డేట్‌ను ఫిక్స్ చేసారు కదా, ఈ తారీఖున శివరాత్రి చేయాలి అని, అలాగే మీరు కూడా దీనికి డేట్‌ను ఫిక్స్ చేయండి. అందరిదీ ఒకే డేట్ కాకపోయినా కానీ ప్రతి ఒక్కరూ తమ కోసం ఒక డేట్‌ను ఫిక్స్ చేసుకోగలరు కదా. చేసుకోగలరు కదా! చేయగలము అని అనుకుంటే చేతులెత్తండి. మరి చేసారా! చేయగలము అని అన్నప్పుడు చేసారా? డబల్ విదేశీయులు డేట్ ఫిక్స్ చేసారా? చేసారా! అచ్ఛా, ముందు కూర్చున్నవారు, ఏమి ఫిక్స్ చేసారు? ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారో దానిని బాప్‌దాదాకు వ్రాసి ఇవ్వండి. బాప్‌దాదా కూడా పిల్లలు పేపరులో పాస్ అయ్యేందుకు ధైర్యాన్ని ఇస్తారు కదా. ఆ తర్వాత వాహ్ పిల్లలు వాహ్ అని పాట పాడుతారు. సెరిమనీ జరుపుతాము, ఎవరైతే సంకల్పము చేసి దాని అనుసారంగానే ప్రాక్టికల్‌గా చేస్తారో వారికి సెరిమనీ జరుపుతాము ఎందుకంటే తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది కదా! ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారో అందులో ముందుకు వెళ్ళడానికి సమీపంగా వస్తూ ఉంటారు కదా! తేడా కనిపించడం మొదలవుతుంది. కావున ఎవరైతే డేట్ అనుసారంగా సంపన్నమవుతారో వారికి బాప్‌దాదా సెరిమనీ జరుపుతారు. లోపల ఏదైతే చేస్తారో దానిని చూసేవారు కూడా పరిశీలిస్తారు ఎందుకంటే సంపర్కంలోకైతే వస్తారు కదా! ఎవరో ఒకరి ద్వారా సంస్కారాలు బయటకు వస్తాయి కదా. ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే పిల్లలు ప్రతి ఒక్కరికీ నేను మాస్టర్ సర్వశక్తిమంతుడను అన్న శుద్ధ నషా ఉంది. మాస్టర్ కదా? సర్వశక్తిమంతుడు ఉన్నప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయగలగడం కూడా శక్తియే కదా. అచ్ఛా.
ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. చూడండి, ఎంతమంది వచ్చారు! బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు. మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. టూ లేట్ బోర్డు పెట్టకముందే వచ్చారు అందుకు పూర్తి పరివారము, బాప్‌దాదా అందరికీ మీపట్ల ఉన్న శుభ ఆశ ఏమిటంటే సదా డబల్ పురుషార్థం చేసి లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్‌గా వెళ్ళగలరు. ధైర్యముందా! ఈరోజు వచ్చినవారిలో ధైర్యముందా? లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ రాగలము, ఫస్ట్ నంబరులో అన్న ధైర్యముందా! ఫస్టే కాదు, ఫస్ట్‌క్లాసులో ఫస్ట్ రావాలి, వీలవుతుందా! మేము ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ రాగలము అని భావించేవారు చేతులెత్తండి. స్వయంపై నిశ్చయముందా? అచ్ఛా. వెనుకవారు చేతులు పెద్దగా ఎత్తండి, వీలవుతుంది అని అనుకుంటే. అచ్ఛా. కొద్దిమంది ఉన్నారు. అయినప్పటికీ పూర్తి పరివారము మరియు బాప్‌దాదా మీకు పూర్తి సహయోగమును ఇచ్చి ముందుకు తీసుకు వెళ్ళాలని ఆశిస్తుంది కావున ఏ సెంటరు తరఫున వచ్చినా కానీ ఆ సెంటరులో మీరు చేసిన ప్రతిజ్ఞను పదే పదే గుర్తుకు తెచ్చుకోండి. వీలవుతుంది, అసంభవము కాదు. సంభవమే కానీ డబల్ అటెన్షన్. ఒకవేళ లాస్ట్ మరియు ఫాస్ట్ వెళ్ళి చూపించినట్లయితే సెంటరులో మీ తీవ్ర పురుషార్థము యొక్క రోజును జరుపుతాము. ఫంక్షన్ చేస్తాము. త్వరత్వరగా బాబా సమానంగా అయ్యే చూపించాలి అని అందరి మనసులలో ఉల్లాసమైతే ఉంది. అమృతవేళలో పిల్లలు బాబాతో మాట్లాడుతున్నప్పుడు బాప్‌దాదా ఎంతో సంతోషిస్తారు. వాహ్ పిల్లలు వాహ్! బాబా పిల్లలందరికీ, క్రొత్తవారైనా, పాతవారైనా అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఒక అడుగు మీది, వేయి అడుగుల తండ్రి సహాయము ఎందుకంటే ఇప్పుడు సమయము యొక్క పరివర్తన వేగంగా జరుగుతుంది. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది:- ఢిల్లీ మొదటి నుండి సేవలో క్రొత్త క్రొత్త విషయాలను చేస్తూ ఉండటాన్ని బాప్‌దాదా విన్నారు. చేసారు కదా! ఇప్పుడు సేవలో ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్‌ను ఆలోచించండి. భాషణ, ప్రోగ్రాములు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే వాటితో వృద్ధి అవుతుంది మరియు సంబంధంలోకి వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నవి చక్కగా ఉన్నాయి కానీ ఈ ప్రోగ్రాములు చాలా సమయం జరిగాయి. ఇప్పుడు ఏదైనా క్రొత్త విషయాన్ని ఆలోచించండి, దాని ద్వారా సేవ చేసే వారిలో క్రొత్త ఉల్లాస ఉత్సాహము నిండాలి. చేస్తారు కదా! బాగుంది. అందరినీ ఉత్సాహంలోకి తీసుకువచ్చి అందులో బిజీ చేయండి. ఇక్కడ జరిగే పెద్ద ప్రోగ్రాములలో కేవలం భాషణ ఇచ్చేవారు బిజీగా ఉంటారు, ఇతరులు కేవలం తోడుగా ఉంటారు. వారు కూడా తప్పకుండా కావాలి కానీ ఇప్పుడు ఎటువంటి కార్యాన్ని ఆలోచించండంటే ప్రతి ఒక్క క్వాలిటీవారు స్వయం చేసి బిజీగా ఉండాలి ఎందుకంటే ఢిల్లీయే రాజధానిగా అవ్వనున్నది. కనుక ఢిల్లీవారు ఇటువంటి ఇన్వెన్షన్ ఏదైనా ఆలోచించండి. సరేనా! అందరూ చేస్తారా? చేతులెత్తండి. మంచిది. ఎవ్వరైనా ఆలోచించవచ్చు. క్రొత్తవారైనా ఆలోచించవచ్చు. ఇంకెవరికైనా ఆలోచన వచ్చినాకానీ తమ ఆలోచనను ఇక్కడ హెడ్ ఆఫీసుకు, మధువనం ఆఫీసుకు వ్రాయవచ్చు. అందరికీ ఛాన్సు ఉంది. అచ్ఛా. ఢిల్లీవారు పురుషార్థంలో కూడా నంబరువన్ తీసుకోవాలి. బాప్‌దాదా చాలాకాలంగా ఏమి చెప్తున్నారంటే ఏ సెంటరైనా, దేశమైనా, విదేశీ సెంటరైనా, దాని కనెక్,న్ సెంటరైనా, 6 మాసాలు నిర్విఘ్నంగా ఉండాలి, ఎటువంటి విఘ్నము రాకూడదు. నిర్విఘ్నము. ఇందులో ఒకవేళ నంబరువన్‌గా అయినట్లయితే అందుకు కూడా నిర్విఘ్న భవ అన్న రోజును జరుపుతాము. ఇప్పుడు 6 మాసాలు అని చెప్తున్నాము, 6 నెలల అభ్యాసము అయినప్పుడు మున్ముందు కూడా అలవాటు అవుతుంది. కానీ బహుమతిని పొందడానికి 6 నెలల సమయాన్ని ఇస్తున్నాము. మరి ఢిల్లీ ఏ నంబరును తీసుకుంటుంది? మొదటి నంబరు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. పూర్తి పరివారానికి కూడా సంతోషంగా ఉంది. సంతుష్టత ప్రసిద్ధి కావాలి. సేవలో కానీ, తయారై ఉన్న నియమాలలో కానీ. మరి చూద్దాము. బాప్‌దాదా అయితే చెప్పి ఉన్నారు కానీ ఇప్పటి వరకూ పేర్లు రాలేదు. జోన్ కాకపోయినా పెద్ద సెంటర్ల కనెక్షన్లో ఉన్న సెంటర్లు చేసినా కూడా బాప్‌దాదా చూస్తారు. ఇప్పుడు త్వరత్వరగా అడుగులు ముందుకు వేయండి, ఎందుకు? అకస్మాత్తుగా ఏమైనా జరుగవచ్చు. తారీఖు చెప్పడం జరుగదు. అచ్ఛా, ఢిల్లీవారు కూర్చోండి.
ఆగ్రా సబ్జోన్:- ఆగ్రా ఎటువంటి కార్యమును లేక సేవను చేయాలంటే ఎలా అయితే ప్రభుత్వం లిస్టులో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉందో అలాగే ఆగ్రావారు ఆల్మైటీ ప్రభుత్వంలో కూడా ప్రసిద్ధి అయ్యే విధంగా సేవలను ఆలోచించండి. ఎలా అయితే ఆగ్రాలో కిరీటము ఉందో అలాగే చెయ్యండి. నమ్మకముందా? నమ్మకము ఉన్నందుకు అభినందనలు. ఏమి చేస్తారు? ఎంత సమయంలో చేస్తారు (మేళా చేస్తాము, మెగా ప్రోగ్రాము చేస్తాము) మెగా ప్రోగ్రామైతే అందరూ చేస్తున్నారు. ఏ జోనూ చెయ్యని విధంగా ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ ఆలోచించండి. ఎందుకంటే ఆగ్రా అందరూ చూడదగ్గ స్థానము. అది ఈనాటి ప్రభుత్వానికి మకుటంవంటిది. ఒకవేళ ప్రచారం జరిగితే అందులో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉంది. ఇటువంటి కార్యమేదైనా చేయండి. ఆలోచించండి, అమృతవేళ కూర్చోండి మరియు ఆలోచించండి అప్పుడు ఏదో ఒక టచింగ్ వస్తుంది. సరేనా, టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరి అద్భుతం చేయాలి. ఇప్పుడేదైనా నవీనత చేయండి అని బాప్‌దాదా పిల్లలందరికీ సూచనను ఇస్తున్నారు. సమయానుసారంగా ఏదైతే జరుగుతుందో అది నవీనతయే. కానీ ఇప్పుడు మరింత నవీనత, ఇన్వెన్షన్ తీసుకురండి. ఏ జోన్ అయినా చేయండి, కానీ క్రొత్తగా చేయండి. బాప్‌దాదాకు పిల్లలందరూ ప్రియమైనవారే. బాప్‌దాదాకు పిల్లల విశేషత కూడా తెలుసు. ప్రతి ఒక్కరిలో తప్పకుండా విశేషతలు ఉన్నాయి కానీ కొందరు కార్యంలో ఉపయోగిస్తున్నారు, మరి కొందరివి దాగి ఉంటున్నాయి. అందుకే బాబా అంటారు, పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు ప్రియమైనవారు, గారాల పిల్లలు. పిల్లలు ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలి అని బాప్‌దాదా ఆశిస్తున్నారు.
మీటింగ్‌కు వచ్చిన సోదరసోదరీలతో:- మీటింగ్వారు అంటే బాధ్యత, నిమిత్త ఆత్మలు. నిమిత్త ఆత్మల పట్ల అందరికీ ప్రేమ ఉంటుంది మరియు మీరు అందరికీ ఆధారము. నిమిత్తంగా అయిన వారిలో ఉండే పురుషార్థపు అలను అందరూ ఫాలో చేస్తారు. ఇప్పుడు నిమిత్తంగా ఉన్నవారి పట్ల బాప్‌దాదాకు ఒక ఆశ ఉంది. అందరూ ఆశాదీపాలు కదా. బాప్‌దాదా ఆశ ఏమిటంటే, ఇప్పుడు ముఖము మరియు నడవడిక ఎలా ఉండాలంటే అందరి ఎదుట ఒక ఉదాహరణగా నిలవాలి. అడుగుపై అడుగును వేయాలంటే బ్రహ్మా బాబా వైపుకు అందరూ చూపిస్తారు, ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు, చెప్తారు కూడా. అలాగే నిమిత్తమైన వారి వైపుకు అందరూ చూపాలి, ఒకవేళ చూడాలంటే ఈ ఆత్మను చూడండి. బాబా సమానంగా ఉదాహరణగా అవ్వాలి. వీలవుతుందా? వీలవుతుందా లేక ఇంకా సమయం కావాలా? బాప్‌దాదాకు ఈ గ్రూప్‌పై ఈ ఆశ ఉంది ఎందుకంటే బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యమును ఏదైతే పెట్టుకున్నారో, బాప్‌దాదా ఇటువంటి ఉదాహరణను చూడాలనుకుంటున్నారు. వీలవుతుందా? చేయాల్సిందే కదా! మేము ఏదైతే చేస్తామో అదే అందరూ చేస్తారు అని ఈ గ్రూపు లక్ష్యము పెట్టుకోవాలి. ఈ ఆశీర్వాదమును తీసుకోవాలి. నిమిత్తంగా అవ్వాలి.
డబల్ విదేశీ సోదర సోదరీలతో:- సదా మేము బ్రాహ్మణ పరివారము మరియు బాప్‌దాదాకు గారాల పిల్లలము అని డబల్ విదేశీయులు అనుభవం చేస్తారు. ఎందుకని! ఎంతగా దేశం అనుసారంగా దూరంగా ఉంటారో అంతగా బాప్‌దాదా హృదయానికి దగ్గరగా ఉంటారు. ఈ విశేషత ఉంది. బాబా అని అన్నప్పుడు వారి ముఖము ప్రేమలో ఎంతగా లవ్లీనమైపోతుందంటే బాబా కూడా వారిని చూసి సంతోషిస్తారు. మరో విశేషత ఏమిటంటే భారత దేశపు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడంలో ధైర్యాన్ని చూపుతారు. మొదట్లో భారత దేశ కల్చర్ అని భావించేవారు, కానీ ఇప్పుడు, మేము కూడా భారతీయులమే అని అనడం బాప్‌దాదా చూసారు. భారత దేశము రాజధాని కదా, భారత దేశపు నషా మనసులో బాగా నాటుకుంది. మేము ఇదైతే కాదు కదా అని అడుగుతూ ఉంటారు. ఎవరైతే వెళ్లిపోయారో వారిని చూసి మేము కూడా ఇలా ఉన్నామా అని అడుగుతారు. భారతదేశ తండ్రి, భారత దేశ పరివారంపై ప్రేమ ఉంది. సేవ కూడా ఇప్పటి వరకు చక్కగా చేసారు. మీ చుట్టుప్రక్కల ఎక్కడ సేవ జరగలేదో అక్కడ కూడా సేవ చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రిజల్టులో అనేక స్థానాలలో సక్సెస్ లభించింది. అంతే కదా! సేవ చేస్తున్నారు కదా? చుట్టు ప్రక్కల సేవను చేసేవారు చేతులెత్తండి, బాగుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా -
నలు వైపుల ఉన్న పిల్లలు బాబాకు మద్దు బిడ్డలు. నేను తీవ్ర పురుషార్థమును చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి అని ప్రతి ఒక్కరి స్మృతిలోకి పదే పదే రావాలి మరియు వస్తుంది. నా బాబా వచ్చేసారు అని అందరూ మనస్ఫూర్తిగా అనాలి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహపు సంకల్పాలు ఇప్పుడు బాప్‌దాదాకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీ పిల్లల మనసులలో ఉంది. ఇప్పుడు త్వర త్వరగా సందేశాన్ని అందరికీ అందించాలి, ఎవ్వరూ వంచితమవ్వకూడదు అని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఏదో ఒక వారసత్వాన్ని తీసుకోవాలి. జీవన్ముక్తి కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి ఎందుకంటే బాబా అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఎంతమందికి వారసత్వాన్ని ఇప్పిస్తారో అంతగా మీకు మీ రాజ్యంలో రాజ్యాధికారులుగా అయ్యే వారసత్వము లభిస్తుంది. అన్ని వైపుల ఉన్న పిల్లలందరూ బాప్‌దాదా నుండి చాలా-చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను స్వీకరించగలరు. అచ్ఛా.
దాదీ జానకితో:- (బాబా, సంస్కారాలు తయారు చేసుకోవాలా!) తయారై ఉన్నాయి. మీరు రెండు వైపుల చూడవలసి ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా తప్పకుండా చూసుకోవాలి, సేవ కూడా తప్పకుండా చూసుకోవాలి. మీరు సేవను ఎక్కువగా చూస్తారు, (బాబా చేయిస్తున్నారు) చేయిస్తున్నారు, కానీ మీరు మున్ముందు మరింత చేసేదుంది. (బాబా మధువనంలోనే ఉండిపోనా) ఆ సమయం కూడా వస్తుంది. రెండు వైపుల చూసుకోండి.
రమేష్ అన్నయ్యతో:- ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇప్పుడు ఎంతో సేవ చేసేదుంది. ఎంతగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటుందో అంతగా మీ పని కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది కావున ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోండి. బాబా కూడా, దాదీలు కూడా మీకు సహయోగిగా ఉన్నారు. ఏ విషయంలోనైనా అవసరమైతే సహాయం తీసుకోండి. (మీటింగ్ తక్కువ జరుగుతున్నాయి) మీటింగ్ చేసుకోండి కానీ అందరూ ఫ్రీ ఉన్నప్పుడు మీటింగు చేసుకోండి అందుకే అందరూ పరస్పరం కలుసుకుని ఈ డేట్‌ను కూడా ఫిక్స్ చేయండి. మధువనంలో గ్రూపు రాకముందు, లేక గ్రూపు వెళ్ళిపోయాక ఎప్పుడు మీటింగ్ చేయాలని ఆలోచించండి. పరస్పరంలో సలహా తీసుకుని డేట్ ఫిక్స్ చేయండి, ఏదైనా జరిగితే అప్పుడు డేట్‌ను మార్చవచ్చు.
పర్దాదీతో:- వీరు అనారోగ్యాన్ని అరిగించేసుకుంటారు. అందరికీ సంతోషంగా ఉంటుంది. చాలా బాగుంది. శరీరాన్ని కూడా సాక్షిగా అయ్యి నడిపిస్తున్నారు. బాగుంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. (రుక్మిణి అక్కయ్యతో) మంచి పాత్రను నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ విసుగు చెందరు. ఈ విశేషత ఉంది, ఇప్పుడు అందరికీ నేర్పించండి. అచ్ఛా!
ఓంశాంతి