Search for a command to run...
15 Nov 2010
స్వ పరివర్తన యొక్క గతిని తీవ్రం చేసి స్వభావ-సంస్కారాల సమాప్తి సమారోహమును జరుపుకోండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో బ్రహ్మా బాబాను కాపీ చేయండి
15 November 2010 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా అందరి మస్తకంలో మెరుస్తున్న మూడు భాగ్య బిందువులను చూస్తున్నారు. ఒకటి, బాబా ద్వారా పాలన యొక్క భాగ్యము; రెండు, శిక్షకుని రూపంలో శిక్షణ యొక్క భాగ్యము; మూడు, సద్గురువు ద్వారా వరదానాల భాగ్యము. ప్రతి ఒక్కరి మస్తకము మూడు భాగ్యములతో మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యము మరెవ్వరి మస్తకంలోనూ మెరుస్తూ కనిపించదు. కానీ మీ అందరి మస్తకం మాత్రం భాగ్యంతో మెరుస్తూ ఉంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూసుకుంటున్నారు కదా! బాప్‌దాదా ఏమి చూసారంటే భాగ్యమైతే అందరికీ లభించింది కానీ భాగ్యపు మెరుపు అందరిదీ ఒకే విధంగా లేదు. కొందరి మెరుపు చాలా ఎక్కువగా ఉంది, మరి కొందరి మెరుపు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. నిజానికి బాప్‌దాదా అయితే అందరికీ ఒకే సారి, ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. అందరికీ ఒకే చదువును చదివిస్తున్నారు. ఒకే విధమైన పాలనను ఇస్తున్నారు మరియు వరదానాలు కూడా ఒకే విధంగా ఇస్తున్నారు. ఆదిరత్నాలకు మరియు చివరి సమయంలో వచ్చే వారికి అందరికీ ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది. వరదానం కూడా అందరికీ ఒక్కటే లభిస్తుంది. ఆది రత్నాలకు మురళి వేరుగా ఉండదు, అందరికీ ఒకటే ఉంటుంది. కానీ భాగ్యపు మెరుపు మాత్రం నంబరువారీగా ఉంటుంది. బాబా యొక్క ప్రేమపూర్వక పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. అందరి నోటి నుండి ‘‘నా బాబా’’ అనే వస్తుంది. ముందు వచ్చినవారు కానీ, వెనక వచ్చినవారు కానీ అందరూ తమ అధికారంతో నా బాబా అని అంటారు. బాబా నుండి ప్రేమ లభించిందా అని ఎవరినైనా ప్రశ్నించండి? నాకైతే బాబా ప్రేమ అందరికన్నా ఎక్కువ లభించింది అని గర్వంగా చెబుతారు. నా బాబా అని మనస్ఫూర్తిగా చెప్పేవారు నా ప్రేమ అందరికన్నా ఎక్కువగా ఉంది అని గర్వంగా చెప్పగలుగుతున్నారా? బాబా ప్రేమ ముందుగా నాపై ఉంది అని అంటారు ఎందుకంటే ప్రేమయే బాబా ఇచ్చే పాలన. నా బాబా అని స్వీకరించిన కారణంగా మీరు బాబాకు చెందివారిగా అయ్యారు మరియు బాబా మీ వారయ్యారు.
ఈరోజు మీరందరూ వచ్చారంటే ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు కదా. ప్రేమ ఆకర్షించి మీ అందరినీ ఇక్కడకు తీసుకు వచ్చింది. అందరూ ప్రేమతో, చక్కగా చేరుకున్నారు. ఈ పరమాత్ముని ప్రేమ కేవలం సంగమంలోనే ప్రాప్తిస్తుంది. దేవాత్మల ప్రేమ లభిస్తుంది కానీ పరమాత్మ ప్రేమ ఈ జన్మలో మాత్రమే లభిస్తుంది. బాప్‌దాదా కూడా ఇటువంటి పాత్రులైన ఆత్మలను చూసి ఏమని అంటారు? వాహ్ పిల్లలు వాహ్! మీరు మాత్రమే కోట్లలో కొద్దిమందిగా పాత్రులయ్యారు. ప్రతి కల్పము మీరే పాత్రులుగా అవుతారు. ఇంతటి నషా నడుస్తూ-తిరుగుతూ ఉంటుంది కదా! మీ హృదయం కూడా వాహ్ నా భాగ్యము! అన్న పాటనే పాడుతూ ఉంటుంది కదా. ఈ పాటను పాడుతూ ఉంటారు కదా! ఈ పిల్లలందరూ అధికారి పిల్లలు అని బాబాకు కూడా సంతోషంగా ఉంది. పరమాత్మ ప్రేమలో స్వయాన్ని ఎవ్వరూ తక్కువగా భావించడం లేదు. ప్రేమలో అందరూ పాస్ అయ్యారు. అందరికన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని బాప్‌దాదా అడుగుతున్నారు? అప్పుడు ఎవరిదని అంటారు? అందరూ నా ప్రేమ తక్కువైనది కాదు అని అంటారు. బాబా కూడా ప్రేమ సబ్జెక్టులో అందరూ పాస్ అని అంటున్నారు అందుకే నా బాబా అని అనగలుగుతున్నారు. ఎంత ప్రేమ ఉంది అని ప్రతి ఒక్కరికీ తెలుసు. కావున బాప్‌దాదా ఏమి చూసారంటే ప్రేమలో అందరూ పాస్ అయ్యారు కానీ ఇప్పుడు సమయానుసారంగా స్వ పరివర్తన కూడా అవసరము. కేవలం స్వ పరివర్తన. ఈ సమయంలో స్వ పరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తన అవసరము అని బాప్‌దాదా విశేషంగా వినిపించి ఉన్నారు.
ఇప్పుడు నూతన సంవత్సరం ప్రారంభమయింది. కావున స్వపరివర్తన యొక్క గతి తీవ్రంగా ఉండాలి. చేస్తున్నారు కూడా, అటెన్షన్ కూడా ఉంది కానీ గతి ఇప్పుడు తీవ్రంగా ఉండాలి. దీని ముందు కూడా నూతన సంవత్సరంలో స్వ పరివర్తన, సంస్కార పరివర్తన చేయవలసిందే అని బాబాకు ప్రతిజ్ఞ చేయడం బాప్‌దాదాకు గుర్తుంది. కానీ బాప్‌దాదా ఏమి చూసారంటే సంస్కార పరివర్తనలో ఎంత ఫాస్ట్ పురుషార్థముండాలో, దాని గతి మరింత తీవ్రంగా ఉండాలి. మీరందరూ ఏమని భావిస్తున్నారు? సమయానుసారంగా ఎంతటి తీవ్ర గతి ఉండాలో దాని అనుసారంగా ప్రతి ఒక్కరి తీవ్ర పురుషార్థం ఉన్నదా లేక ఇంకా పెంచాలా? ఎందుకంటే, సమయానుసారంగా, సమయంలో పరివర్తన ఫాస్ట్‌గా జరుగుతుంది. మీలో కూడా సంకల్పం చేసిన వెంటనే జరిగిపోయే విధంగా తీవ్ర పరివర్తన రావాలి. కాగితంపై బిందువును పెట్టినంత సహజంగా అయథార్థ సంకల్పాలు సమాప్తమైపోవాలి. కాగితంపై బిందువును ఎంత సేపటిలో పెడ్తారు? అయథార్థము అనగా అనవసర సంకల్పాలు, ఇంత వేగంగా పరివర్తన జరగాలి. బాప్‌దాదా ఆశిస్తున్న ఇంతటి వేగమును తీసుకురాగలరా? ధైర్యముందా? ఇప్పటినుండి ఇంతటి వేగంతో బిందువును పెట్టగలము అని భావించేవారు చేతులెత్తండి. పిల్లల ధైర్యము, తండ్రి సహాయము. పిల్లల దృఢ సంకల్పమును చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు, అభినందనలు ఇస్తున్నారు. చేయవలసిందే అన్న సంకల్పమే దృఢ సంకల్పము అని బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. మరి ఈరోజు ఈ సభలో అందరూ ఈ దృఢ సంకల్పమును చేసారు కదూ! మీరు చూసారా, దాదీలు చూసారా, మెజారిటీ అందరూ చేతులెత్తారు. చూసారా! మరి రేపటి నుండి స్వభావ సంస్కారాల సమాప్తి సెరిమనీ (వేడుక) జరుపుకోవాలి. జరుపుకుందామా? ఎవరైతే చేతులెత్తారో వారు మళ్ళీ చేతులెత్తండి. సెరిమనీ జరుపుకుందామా? ఈ సెరిమనీ అయితే ఎంతో గొప్పగా జరగాలి. ధైర్యముతో కూడిన లక్ష్యాన్ని తీసుకున్నట్లుగా లక్షణాలు కూడా ధైర్యముతో కూడినవి ఉంటే ఇదేమీ పెద్ద విషయము కాదు. బాబా సమానంగా అయ్యే లక్ష్యము ఉంది కనుక ఇప్పుడు లక్ష్యమును, లక్షణాలను సమానంగా చేయండి. బ్రహ్మా బాబాను అనుసరించండి. ఏ సంకల్పము, మాట, కర్మ చేయాలన్నా ముందుగా దానిని బ్రహ్మా బాబాతో పోల్చి చూడండి. కాపీ చేయండి. బయట ప్రపంచంలో కాపీ చేయకూడదు, కానీ బాప్‌దాదా బ్రహ్మా బాబాను కాపీ చేయమంటారు. నిరాకార బాబా గురించి అంటారు, వారికైతే దేహమే లేదు, ఇక దేహభానమెక్కడిది అని! కానీ బ్రహ్మా బాబా దేహధారియే కదా! నిజానికి చూస్తే, మీరెవరైతే సమర్పణ అయ్యారో, సమర్పణ అయ్యేవారు చేతులెత్తండి. సమర్పణవారు చేతులెత్తండి. సమర్పణ అయినప్పుడు ఏ సంకల్పం తీసుకున్నారు? తనువు, మనసు, ధనము అన్నీ మీవే బాబా అని ప్రతిజ్ఞ చేసారు కదా! చేసారా? ఇందులో చేతులెత్తండి. మరి ఇప్పుడు సమర్పణ చేసారు, నాది అంటూ ఏదీ లేదు, తనువు కూడా నాది కాదు, ధనము కూడా నాది కాదు. బ్రహ్మా బాబా సేవ కోసం తమ శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరము నాది కాదు, ఇది సేవ కోసమే ఉంది అని బ్రహ్మా బాబాకు తెలుసు. మీరు మీ తనువు, మనసు, ధనము మూడూ అర్పించినప్పుడు మీ శరీరము బాబా సేవ కోసం నిమిత్తమైనది. బ్రహ్మా బాబా శరీరము సేవ కోసం ఉన్నట్లుగా మీ శరీరము కూడా మీది కాదు, సేవ కోసమే ఉంది. అటువంటప్పుడు దేహ అభిమానము లేక దేహ భానము యొక్క సంస్కారాలు ఉండవచ్చా? ఈ శరీరము విశ్వ సేవ కోసం ఉన్నది, నాది కాదు, సేవ కోసం మీకు బాబా ఇచ్చారు అని గుర్తుంచుకోండి. దేహ అభిమానము ఎక్కువగా నష్టాన్ని తీసుకువస్తుంది, దేహ భానము దానికన్నా కొద్దిగా తక్కువ. కానీ రెండిటినీ ఇచ్చేసారు కదా. ఫారమ్ నింపేటప్పుడు ఏమని వ్రాస్తారు? టీచర్లు ఫారమ్‌ను నింపిస్తారు కదా. నా జీవితము ఇక సేవ కోసమే. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారందరూ మా తనువు, మనసు, ధనము అంతా నీదే, మాది కాదు అని అన్నారు కదా, బాబాతో వాగ్దానం చేసారు. కావున ఈ సంస్కారాలేవైతే ఉన్నాయో అవి దేహ భానము లేక దేహ అభిమానము కారణంగా వస్తున్నాయి. అందుకే, సంస్కార సమాప్తి అని ఈరోజు కూడా ప్రతిజ్ఞ చేసారు కదా. ఎందుకంటే బాబా ప్రత్యక్షతలో విఘ్నాలు వేసేవి ఇవే. బాబాను ప్రత్యక్షం చేయాలి అని అందరూ ఎంతో ఉత్సాహంగా అనడం బాప్‌దాదా విన్నారు. ఇప్పటి వరకు బ్రహ్మా కుమారీలు, బ్రహ్మా కుమారులు ప్రత్యక్షమయ్యారు. భగవంతుడు, తండ్రి వచ్చారు అన్న తండ్రి ప్రత్యక్షత ఇంకా మిగిలి ఉంది. పురుషార్థం చేస్తున్నారు కానీ మా తండ్రి వచ్చారు, ఇది భగవంతుడి ఉవాచ కానీ బ్రహ్మా కుమారీల ఉవాచ కాదు అన్న ప్రత్యక్షత ఇప్పుడు జరగాలి. ఈ ప్రత్యక్షత జరిగేదే ఉంది. స్వభావ సంస్కారాల పరివర్తన జరగాలి. మీ అందరి ముఖము మరియు నడవడికతో ప్రత్యక్షత జరగాలి. బాబాను ప్రత్యక్షం చేయాలి, చేస్తున్నారు, కానీ భగవంతుడు వచ్చారు, తండ్రి వచ్చారు అన్న మాట అందరి చెవులలో మారుమ్రోగాలి. ఇది జరగవలసిందే కదా! జరగవలసిందే అన్నవారు చేతులెత్తండి. జరగాలా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అందరి మనసులలో ఉన్న తపన చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇది జరగవలసిందే. దీని కోసం, రేపటి నుండి సంస్కార స్వభావాలను పరివర్తన చేసుకోవాలి అలాగే అందుకు సాధనము, ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ, ప్రతి ఒక్కరూ తమ చార్టులో శుభ భావన, శుభ కామనలపై విశేషంగా అటెన్షన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. బయటివారికి శుభ భావనలు, కామనలు పెట్టే హోమ్‌వర్కును ఇచ్చి మీరు పెట్టగలరు అని చెప్పారు కదా. వారు పెట్టగలిగినప్పుడు మీరు తప్పకుండా పెట్టగలరు. ఏ ఆత్మ పట్ల అయినా శుభ భావన, శుభ కామన లేనట్లయితే అప్పుడే స్వభావ సంస్కారాలు ఎదుటకు వస్తాయి. ఒకవేళ మీరు కూడా అమృతవేళ నుండి నేను ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన ఉంచాల్సిందే అని సంకల్పం చేసినప్పుడు పరివర్తన యొక్క సంకల్పము పూర్తి అవుతుంది. పరిస్థితులు వస్తాయి, వాటి పని రావడము, మాయ కదా! మీ పని విజయాన్ని పొందడము. కావున రేపు, నిమిత్తమైనవారు పరస్పరంలో గ్రూపుగా అయ్యి, రూహ్రిహాన్ చేసుకుని చేసిన సంకల్పమును భవిష్యత్తులో ఎలా ప్రాక్టికల్లోకి తీసుకురావాలి అని ఆలోచించండి. ఫినిష్, బిందువును పెట్టేయండి. చేతులెత్తారు కదా! ముందువారు చేతులెత్తారా! మీరు నిమిత్తం కావలసి ఉంటుంది. బ్రహ్మా బాబా ఎదుటకు ఎన్నో సంస్కారాలవారు వచ్చారు, ఆదిలో సంస్కారాల ఆటను బ్రహ్మా బాబా ఎంతో చూసారు. కానీ బాబా సహకారంతో ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు నడిపించారు. దాని ప్రతిఫలమే ఈరోజు ఇంతటి సంఖ్య. కదిలించే విషయాలు వచ్చినప్పటికీ అచలంగా ఉన్నారు. దాని పరిణామంగా ఎన్ని సెంటర్లు తెరుచుకున్నాయి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి!
ఈమధ్య ఎన్ని కార్యక్రమాలు అవుతున్నాయి! అవుతున్నాయి కదా! ఈ పూర్తి రిజల్టుకు కారణం బ్రహ్మా బాబా ధైర్యము. మొదట్లో బ్రహ్మా బాబా ఒంటరిగానే ఉన్నారు, మీరు తర్వాత వచ్చారు. కానీ ఒక్కరిగానే ఉంటూ ధైర్యాన్ని ఉంచి ముందుకు నడిచారు. రిజల్టులో ప్రాక్టికల్ ప్రమాణంగా మీరందరూ సహచరులు వచ్చారు. మరి ధైర్యముంది కదా! బ్రహ్మా బాబా ఒక్కరిగానే ధైర్యమును ఉంచారు, మీరైతే చాలామంది సహచరులు ఉన్నారు. కావున ఫాలో ఫాదర్. అందరూ స్వయాన్ని బ్రహ్మా బాబా పిల్లలుగా, సహచరులుగా భావిస్తున్నారు కదా! తోడుగా ఉన్నారు, తోడుగా నడుస్తారు మరియు బ్రహ్మా బాబాతో పాటు రాజ్యంలోకి వస్తారు. ఇప్పుడింకా సమయముంది. ఎలా అయితే బ్రహ్మా బాబా ధైర్యమును ఉంచారో, దాని రిజల్టు కూడా చూస్తున్నారు. ఇంతటి సంగఠనలో ధైర్యము అను అడుగును మీరు వేస్తే ఏదైనా జరగవచ్చు! కల్ప కల్పము జరిగింది, జరగవలసిందే.
మరి ఇప్పుడు బాబా ఏమి కోరుకుంటున్నారో వినిపించారు. మీరందరూ కేవలం ఒక్క విషయాన్ని చేయండి, సాధారణ పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థంగా చేయండి. బాప్‌దాదా ఏమి చూసారంటే, అక్కడక్కడ నిర్లక్ష్యము, ఎలాగూ అవుతుందిలే, విజయము మన జన్మ సిద్ధ అధికారము, ఈ మాటలు జ్ఞానము ఆధారంగా నిశ్చితమే కానీ నిర్లక్ష్యంతో కూడా ఇవే మాటలు అంటారు, మా విజయము జరిగే ఉంది, ఏ పనీ ఆగదు, జరగవలసిందే. ఒకటి, పురుషార్థంతో ఈ మాటలను అనడము, రెండు, నిర్లక్ష్యంతో అనడము. ఏ పనీ ఆగదు, జరగవలసిందే... ఇది నిర్లక్ష్యము. ఈ సంస్కారాన్ని కూడా పరిశీలించుకోండి. నిర్లక్ష్యానికి గుర్తు వారు తమ జీవితంలో చిన్న చిన్న విషయాలకు అలసిపోతారు. ముఖంలో సంతోషపు ఛాయలు కనిపించవు. సేవతో పుణ్యం జమ అవుతుంటే ముఖంలో సంతోషం కనిపించాలి కదా. ఏదో ఒక విధమైన అలసట ఉంటున్న కారణంగా ఏదో ఒక విషయంలో నిర్లక్ష్యము ఉంటుంది. చేయాల్సిందే అన్నప్పుడు సంతోషంగా చేయండి. మీ ముఖము సేవ చేయాలి, మీ నడవడిక సేవ చేయాలి. ఈరోజు మెజారిటీ పిల్లలు సంస్కార సమాప్తిలో చేతులెత్తినందుకు బాప్‌దాదా పదే పదే అభినందనలు తెలియజేస్తున్నారు.
అచ్ఛా, ఈ గ్రూపులో మొదటిసారి వచ్చినవారు లేవండి. ఎంతమంది ఉన్నారో చూసారా? చాలామంది ఉన్నారు. చేయి ఊపండి. మొదటిసారి వచ్చినవారికి, మీ బాబాను కలుసుకుంటున్నందుకు అభినందనలు. విశేషంగా సమయానుసారంగా ఇప్పుడు మీరు తీవ్ర పురుషార్థాన్ని చేయవలసి ఉంటుంది. ఎవరైతే తీవ్ర పురుషార్థం చేస్తారో, ఢీలా ఢాలా కాదు, వారు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అవుతారు అని బాప్‌దాదా చెబుతున్నారు. ఇటువంటి అద్భుతాన్ని చేయండి. అవకాశము ఉంది. మేము ఆలస్యంగా వచ్చాము కదా అని ఆలోచించకండి. కాదు, ఫాస్ట్‌గా వెళ్ళగలరు. కానీ ప్రతి సమయము తీవ్ర పురుషార్థాన్ని చేయవలసి ఉంటుంది. మారవలసిందే! దేఖేంగే(చూద్దాములే), సోచేంగే (ఆలోచిద్దాములే) అని గే, గే... అనవద్దు. బాగుంది, మీ ఇల్లు, దాత ఇల్లు మంచిగా ఉంది కదా. సోదరసోదరీలందరూ మీకు స్వాగతాన్ని పలుకుతున్నారు.
ఇప్పుడు నలువైపుల ఉన్న బ్రాహ్మణ పిల్లలు బాప్‌దాదా యొక్క స్నేహపూర్వక ప్రియస్మృతులను స్వీకరించండి. దూరంగా కూర్చున్నప్పటికీ కొంతమంది పిల్లలు చూస్తున్నారు, మిలనాన్ని జరుపుకుంటున్నారు. నలువైపుల ఉన్న ఆ పిల్లలకు బాప్‌దాదా ఈ విధంగా చెబుతున్నారు, ఎలా అయితే ఇప్పుడు అందరూ మెజారిటీ చేతులెత్తారో సంస్కార సమాప్తములో, ఇప్పుడు మీరందరూ కలిసి ఒకే సంకల్ప రూపి చేతిని ఎత్తుతున్నారు - మేమంతా కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి ఈ సంకల్పం చేస్తున్నాము మరియు నలువైపుల సంపూర్ణ సమయము వచ్చినప్పుడు బ్రహ్మా బాబా శివ తండ్రి ఇద్దరి ప్రత్యక్షతను చేస్తాము, మా తండ్రి వచ్చారు. అందరి నోటిలో తండ్రి ప్రత్యక్షత గురించే ఉంటుంది. ఈ సంవత్సరం బాబాను ప్రత్యక్షం చేయవలసిందే అని దృఢ సంకల్పమును తీసుకోండి. సగం పనైతే జరిగింది, పిల్లలను బాబా విశ్వం ఎదుట ప్రత్యక్షం చేసారు. ఇప్పుడు పిల్లలు ‘‘భగవంతుడు వచ్చారు’’ అన్న శబ్దాన్ని విశ్వంలోని ప్రతి ఒక్కరి దగ్గరకు చేర్చాలి. ప్రతి ఒక్కరినీ బాప్‌దాదా చూసి వారికి హృదయపూర్వక స్నేహమును, హృదయ ప్రేమను, మనసులోని ఉత్సాహ ఉల్లాసాల సహితంగా ప్రియస్మృతులను అందిస్తున్నారు. అచ్ఛా.
సేవ టర్న్ కర్ణాటక జోన్ వారిది:- సేవ అవకాశాన్ని తీసుకోవడము అనగా బాబా సమీపంగా వచ్చే అవకాశాన్ని తీసుకోవడము. చూడండి, సేవ కారణంగా ఎంతమందికి వచ్చే అవకాశము లభించింది. ఆశీర్వాదాలన్నీ నిమిత్తమైన టీచర్లకు లభిస్తాయి ఎందుకంటే సేవలో ధైర్యమును ఉంచారు, ఇంతమందికి అవకాశము లభించింది. క్రొత్త క్రొత్తవారు కూడా చాలామంది రావడాన్ని బాప్‌దాదా చూసారు. కర్ణాటక నుండి మొదటిసారి వచ్చినవారు పెద్దగా చేతులెత్తండి. మొదటిసారి వచ్చినవారు కూడా చాలామంది ఉన్నారు. మంచిది. కర్ణాటక వృద్ధి మంచిగా ఉంది. ఇప్పుడు ఎలా అయితే వృద్ధి అయ్యిందో అలాగే తీవ్ర పురుషార్థం యొక్క విధి యొక్క అలను కూడా నలువైపుల వ్యాప్తి చేయండి. నంబర్ తీసుకోండి. సంస్కార సమాప్తికి నంబరును తీసుకోండి. తీసుకోగలరా? మేము మొదటి నంబరును తీసుకోగలము అని భావించేవారు చేతులెత్తండి. బాగుంది. ఇలా పరస్పరం సంగఠనలా అయ్యి కార్యక్రమాలను చేయండి. అందరూ ఒక్కటే. భిన్న భిన్న స్థానాలు కానీ అందరూ ఒక్కటే. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. ధైర్యముంది కదా? ధైర్యముందా? బాప్‌దాదా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది. మధువనానికి ప్రతి మాసము తమ పరివర్తన యొక్క సమాచారాన్ని వ్రాయండి. వ్రాస్తారు కదూ! ప్రతి నెలది. గడిచిందేదో గడిచిపోయింది. ఇప్పుడు నంబరువన్‌గా అయ్యి చూపించండి. బాగుంది. బాప్‌దాదా ఏమి చూసారంటే సేవ బాగుంది, ఇప్పుడు సంగఠన కావాలి. ఉదాహరణగా అవ్వండి. రెడీగా ఉన్నారా? రెడీ? చేతులెత్తండి. మీరు చూడండి, ఒక్క నెలలో రిజల్టు వస్తుంది. అచ్ఛా, చాలా-చాలా విశేషమైన ప్రియస్మృతులు.
క్యాడ్ గ్రూప్:- మీ పేరే దిల్వాలే, దిల్వాలే అయితే సదా హృదయంలో ఉంటారు. మంచిగా చేసారు, ఇతరుల ముందు హృదయానికి సంబంధించి మీరు ఉదాహరణగా నిలిచారు. ఎంతో ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు నిమిత్తులవుతున్నారు. దిల్వాలే ఇతరుల సేవను కూడా మంచిగా చేస్తున్నారు, ఇది బాప్‌దాదాకు నచ్చింది. ఎవరైతే నిమిత్తమయ్యారో, తమ సమాచారాన్ని వినిపిస్తూ ఇతరులను కూడా బాబా పిల్లలుగా చేయడంలో నిమిత్తంగా అయ్యేందుకు ఛాన్సును తీసుకునేవారికి బాప్‌దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. సదా ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు నడిపించండి - ఇందుకు అందరికీ అభినందనలు. బాప్‌దాదాకు ఈ సేవ నచ్చింది. కేవలం అనారోగ్యం విషయంలోనే కాదు, పరమాత్మ హృదయంలో ఇమిడిపోయే అవకాశం కూడా లభిస్తుంది. అయితే ముందుకు వెళ్తూ ఉండండి, అందర్నీ ముందుకు నడిపిస్తూ ఉండండి.
డబల్ విదేశీయులు:- ప్రతి గ్రూపులో విదేశీయులు రావడము బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఎలా అయితే విదేశీయులకు డబల్ విదేశీయులు అన్న టైటిల్ లభించిందో అలాగే వారిది డబల్ ప్రేమ. బాబా అనగానే సంతోషంతో నాట్యం చేస్తారు. సేవ కూడా చేస్తారు, డబల్ సేవను కూడా చేస్తారు. ఆ గవర్నమెంటు మరియు ఆల్మైటీ గవర్నమెంటుది చేస్తారు. అలాగే బాబాపై ప్రేమ కూడా చాలా ఉంది. మంచి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ పరమాత్మ కల్చర్ వారయ్యారు. ఫారెన్ కల్చర్ వారు కాదు, పరమాత్మ కల్చర్. సహజమైపోయింది. ఈ కల్చర్‌ను ఎలా మార్చుకోవాలి అని మొదట్లో ఆలోచించేవారు, కానీ ఇప్పుడు బాప్‌దాదా ఏమి చూసారంటే మాది ముందు ఈ కల్చరే ఉంది, ఇప్పుడు ఆ కల్చరులోకే వస్తున్నాము అని భావిస్తున్నారు. సహజము, ఎందుకు కష్టంగా అనిపించడం లేదు? ఎందుకంటే ప్రతి కల్పము మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు. కల్ప క్రితపు మీ హక్కును తీసుకుంటున్నారు. చాలా బాగుంది. పురుషార్థంలో కూడా ముందుకు వెళ్తున్నారు, ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. మీరు కూడా డబల్ సంతోషంలో ఉంటున్నారా? డబల్ సంతోషం ఉన్నదా? చేతులెత్తండి. మంచిగా అనిపిస్తుంది, అనంతమైన తండ్రి, అనంతమైన సంగఠన అయిపోతుంది. అనేక చోట్ల నుండి తమ అనంతమైన ఇంటికి చేరుకున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. మంచి రిజల్టు ఉంది. ఇక ముందు కూడా మంచి రిజల్టు ఉండాలి. నిశ్చితమై ఉంది. అందుకే వచ్చినందుకు అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
మోహిని అక్కయ్యతో:- లెక్కాచారాలు సమాప్తం చేసుకుంటున్నారు, అయిపోతుంది.
ఈశూ దాదీతో:- వీరు మంచిగా ఉన్నారు. సంతోషంతో ఎగురుతూ ఉన్నారు.
దాదీ జానకి:- మీకు దయ చాలా ఎక్కువ. (త్వర త్వరగా అయిపోవాలి). అయిపోతుంది, మీ సంకల్పం వ్యాపిస్తుంది. ఇప్పుడు మధువనం విదేశాలలో గుర్తుకు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా సేవ ఎక్కువ చేసారు. అయిపోతుంది. దాదీ కూడా చూస్తూ ఉంటారు, అందరితోపాటు అనుభవం చేస్తూ ఉంటారు. బాగుంది.
జయంతి అక్కయ్యతో:- (జయంతి అక్కయ్య విదేశాల సమాచారాన్ని వినిపించారు) బాగుంది, ఈ బాగం కూడా మిగిలి ఉంది. మీరు చెప్పినదాన్ని వినడం ద్వారా లభించిన సంతోషపు అల ఒకరి నుండి అనేకులకు వెళ్తుంది. మంచి పాత్ర లభించింది. తిరుగుతూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి. ఈసారి విదేశీయులు ఇండియాలో కూడా సేవను బాగా చేసారు. అవకాశాన్ని తీసుకున్నారు. మంచిగా చేసారు.
రమేష్ అన్నయ్యతో:- ఆరోగ్యం బాగుందా! అందరికీ స్మృతి యొక్క రిటర్నుగా లక్షరెట్ల ప్రియ స్మృతులను ఇవ్వండి.
ముగ్గురు అన్నయ్యలతో:- అచ్ఛా, మీరందరూ కూడా కలిసి యజ్ఞం కోసం భవిష్యత్తులో ఏమేమి చేయాలి, ఎలా పెంచాలి అని ఆలోచించండి, ఆ ప్లాన్‌ను తయారు చేయండి. కేవలం డిపార్టుమెంటు గురించి కాదు, పూర్తి యజ్ఞం మరియు నలు వైపుల ఎక్కడ వృద్ధి జరగాలి, అందరూ నిర్విఘ్నంగా మరియు నిర్వికల్పంగా ఎలా అవ్వాలి అని పరస్పరంలో ప్లానును ఆలోచించండి. భవిష్యత్తులో ఏమి చేయాలి! ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో దానిని నడవనివ్వండి, కానీ ఇక ముందు ఏమి చెయ్యాలి అని మీటింగ్ పెట్టండి. అచ్ఛా.
పర్దాదీతో:- మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు. ఎందుకని? (బాబా కూతుర్ని కదా) బాగుంది, ఆరోగ్యం ఎలా ఉన్నాకానీ సంతోషంగా ఉంటారు. ఈ సంతోషాన్ని చూసి సంతోషమేస్తుంది. అచ్ఛా!
ఓంశాంతి