Search for a command to run...
31 Mar 2010
పూర్వజుడను మరియు పూజ్యుడను అన్న స్వమానంలో ఉంటూ మనసు ద్వారా సర్వుల పాలనను చేయండి, పూర్తి వృక్షానికి సకాశ్ను ఇవ్వండి
31 March 2010 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న పూర్వజ మరియు పూజ్య ఆత్మలను చూస్తున్నారు. స్వయాన్ని పూర్వజ ఆత్మగా భావిస్తున్నారు కదా. పూజ్య ఆత్మల నివాసము ఎక్కడ? మీ వృక్షాన్ని మీ ఎదుటకు తీసుకురండి. అందులో చూడండి, మీ స్థానము ఎక్కడ ఉంది? పూర్వజులైన మీ స్థానము వ్రేళ్ళ స్థానంలో ఉందని మీకు తెలుసు కదా. వృక్షంలోని వ్రేళ్ళలో మరియు కాండంలో కూడా మీ స్థానము ఉంది. వ్రేళ్ళ ద్వారానే పూర్తి వృక్షానికి పాలన లభిస్తుంది. మీరు ఈ వృక్షానికున్న కొమ్మలకు, ఆకులన్నింటికీ పాలనను ఇచ్చే పూర్వజులు. పూర్వజులు కూడా, పూజ్యులు కూడా. కాండం ద్వారా చివరి ఆకుకు కూడా సకాశ్ లభిస్తుంది. మరి స్వయాన్ని పూర్తి వృక్షానికి సకాశ్ ఇచ్చేవారిగా అనుభవం చేస్తున్నారా? పూర్వజులమైన మేము ఆత్మల రూపి సర్వ కొమ్మలు మరియు ఆకులకు సకాశ్ను ఇస్తున్నాము అన్న నషా ఉంటుందా! ఎలా అయితే బ్రహ్మా బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో అలాగే వారి పిల్లలు, సహచరులైన మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు. వృక్షంలోని అన్ని ఆత్మల ఆకర్షణ పూర్వజ ఆత్మలైన మీవైపే ఉంది. పూర్వజ ఆత్మలైన మీరు వారి పాలనను శక్తుల ద్వారా చేస్తున్నారు. ఎలా అయితే పూర్వజ ఆత్మలైన మీ అందరి పాలనను బాబా చేసారు, మరి బాబా ఎలా చేసారు? శక్తుల ద్వారా. అలాగే మీరు కూడా పూర్వజులము అన్న సంబంధంతో శక్తుల ద్వారా వారి పాలనను చేసేవారు. ఈరోజుల్లో ఆత్మలన్నీ దుఃఖంతో మొర పెట్టుకుంటున్నాయి, తమ తమ దేవీదేవతల వద్ద - రండి, మమ్మల్ని రక్షించండి. మాకు శాంతిని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి. హే క్షమా సాగరులైన పూర్వజుల్లారా, మాకు పాలనను ఇవ్వండి అని మొర పెట్టుకుంటున్నాయి. ఈ మొర పూర్వజ ఆత్మలైన మీ చెవులకు వినిపిస్తుందా? మేమే పూర్వజులము అని అనుభవం చేస్తున్నారా? పూర్తి వృక్షంలో చూడండి, ఇతర ధర్మాలకు చెందినవారు వృక్షంలో కొమ్మల స్థానంలో ఉన్న కారణంగా వారు కూడా మిమ్మల్ని ఆ దృష్టితోటే చూస్తున్నారు. వారికి కూడా పూర్వజులు మీరే. ఏ ధర్మం వారితో కలిసినా కానీ వీరు కూడా మా వృక్షానికి చెందిన కొమ్మలు అని భావిస్తున్నారా! వారు కూడా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు వారు మావారే అని భావిస్తారు! నావారు అన్న భావన వారిలో కూడా కలుగుతుంది, కలగాలి. మరి ఇంతటి నషా, ఇంతటి దయ మీ లోపలి నుండి వస్తున్నాయా? వారు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సమయానుసారంగా పూర్వజ ఆత్మలైన మీ అందరూ మనసు ద్వారా శక్తులతో పాలనను ఇవ్వవలసి ఉంది. వారికి అవసరముంది. కావున మీరు ఎంతగా మీ పూర్వజ నషాలో ఉంటారో అంతగా మీ ద్వారా పాలన జరుగుతుంది. లౌకికంలో కూడా చూస్తే పాలన పెద్దవారి ద్వారానే జరుగుతుంది. పెద్దవారే వారి జీవితానికి కావలసిన ఆహారపానీయాలు, ఆదాయానికి ఆధారమైన చదువు కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎలా అయితే బాబా పిల్లలైన మీ అందరి పాలనను భిన్న భిన్న శక్తులతో చేసారో అలాగే ఇప్పుడు మీ కర్తవ్యము - పూర్తి వృక్షం యొక్క కొమ్మలు మరియు ఆకుల పాలన చెయ్యడము. ఇంతటి ఉల్లాసము పూర్వజ ఆత్మలైన మీకు వస్తుందా? నషా ఉందా? మీరు పూజ్యులు కూడా. చూడండి, పూర్తి డ్రామాలో ఎంతగా మీకు పద్ధతి అనుసారంగా పూజ జరుగుతుందో అంతగా మరే ఇతర మహాత్ములకుగానీ, ధర్మపితలకుగానీ జరుగదు. మీ పూజ నియమానుసారంగా హారతి ఇవ్వడం, నైవేద్యం అర్పించడం ఇవన్నీ మరెవ్వరికీ జరగదు. మీ గాయనము కూడా పద్ధతి ప్రకారంగా కీర్తన జరుగుతుంది. మరెవ్వరి గాయనము ఈ విధంగా జరగదు. కావున మీరు పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీకు జరిగేటువంటి పూజ, మీకున్న మహిమ మరెవ్వరికీ లేదు.
మరి బాప్‌దాదా ఇటువంటి పూజ్య మరియు పూర్వజ ఆత్మలైన మిమ్మల్ని చూసి ఎంత సంతోషిస్తారు! బాబా హృదయం నుండి పదే-పదే ఇదే పాట వస్తుంది, వాహ్, నా పూర్తి వృక్షానికి పూర్వజులు మరియు పూజ్య ఆత్మల్లారా వాహ్! ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరినీ స్వమానంలో అనగా, తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అన్న రూపంలో చూడాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం పిల్లలు ఒక్క విషయంపై శ్రద్ధ వహించాలి. పిల్లలు పురుషార్థాన్ని మంచిగా చెయ్యడాన్ని కూడా బాప్‌దాదా చూసారు. కానీ సదా అన్న పదాన్ని ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో చేర్చాలి. అటెన్షన్ ఇవ్వాలి. బాప్‌దాదా పిల్లల్ని అడుగుతున్నారు, ఎలా అయితే బాప్‌దాదా పిల్లలందరినీ శ్రేష్ఠ స్వమానధారి ఆత్మ రూపంలో చూస్తారో అలాగే మీరు కూడా స్వయాన్ని స్వమానధారిగా భావిస్తున్నారా? ఇందుకు పిల్లలు జవాబు ఏమని ఇస్తారు అని బాప్‌దాదా చూసారు. ఉంటున్నాము, లక్ష్యమైతే ఇదే ఉంది, చేతులు కూడా ఎత్తుతారు, తర్వాత నెమ్మదిగా అంటారు అప్పుడప్పుడూ అయిపోతుంది అని. అప్పుడప్పుడు అన్న మాటను బాప్‌దాదా సమాప్తం చెయ్యాలనుకుంటున్నారు ఎందుకంటే సమయము సమాప్తి అయ్యేందుకు సమీపంగా ఉంది. సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేదెవరు? పిల్లలు బాబాను అడుగుతారు, బాబా మీరు సమయం చెప్పండి, 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎంత సమయం ఉంది అని? అలాగే బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు, సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేదెవరు? బాబా ఒక్కరే తీసుకువస్తారా? బాబా స్థాపన చేసారు, ఒంటరిగా చేసారా? యజ్ఞాన్ని రచించారు, బ్రాహ్మణులు లేకుండా యజ్ఞాన్ని రచించారా? తండ్రి పిల్లలతో ఉన్నారు. పిల్లలు కూడా బాబా, మేము కూడా మీతోటే ఉన్నాము, మీతోటే వస్తాము అని అంటారు. మరి బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు, సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే పిల్లల్లారా, మీరే డేట్‌ను ఫిక్స్ చేయండి. డేట్ ఎవరు ఫిక్స్ చేయాలి? బాబా చెయ్యాలా లేక బాబాతో పాటు మీరు మరియు బాబా చెయ్యాలా?
ఈరోజు ఈ సంవత్సరానికి ఇది చివరి మిలనము. పిల్లలు కూడా తమ రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తుండటాన్ని బాప్‌దాదా చూసారు. “ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి” (అబ్ ఘర్ జానా హై) అన్న పాటను మనసులో పాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు తిరుగు ప్రయాణమవ్వాలి. ఇందుకోసం బాప్‌దాదా ముందుగానే చెప్పి ఉన్నారు, పూర్తి సమయము స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా పెట్టుకోండి. పిల్లల్లో సేవ పట్ల అభిరుచి, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఇప్పటికీ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. మంచి సేవా సమాచారాన్ని కూడా బాబా వింటూ ఉంటారు. కానీ తీవ్ర గతితో ముందుకు వెళ్ళడానికి బాప్‌దాదా పిల్లలకు విశేషమైన అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - కేవలం ఒక్క వాచ సేవ మాత్రమే చెయ్యకండి, సేవ చేస్తున్నట్లయితే ఒకే సమయంలో మూడు సేవలనూ ఒకేసారి చేయండి - మనసు ద్వారా సకాశ్ను ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి మరియు కర్మణ ద్వారా అనగా మీ సంబంధ సంపర్కం ద్వారా, ముఖం ద్వారా ఎంతగా సేవ చేయండంటే దాని ప్రభావం కూడా సేవలో ఉంటుంది. ఒకే సమయంలో మూడు సేవలను కలిపి చేయండి ఎందుకంటే సేవలో కొంత మార్పు రావాలి, పరివర్తన రావాలి అని ఇప్పుడు ఆత్మలు భావిస్తున్నాయి. మరి ఒకే సమయంలో మూడు సేవలనూ చెయ్యగలరా? చెయ్యగలరా? పరిశీలించుకుంటున్నారా, వాచ సేవ చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనసు ద్వారా మరియు కర్మణ అనగా సంబంధ సంపర్కాల ద్వారా కూడా సేవ జరుగుతుందా! కలిపి జరుగుతున్నాయా! మేము ఒకే సమయంలో మూడు సేవలను చేస్తున్నాము అని భావించేవారు చేతులెత్తండి. మూడు సేవలనూ చేస్తున్నారా? అచ్ఛా, మొదటి లైను తక్కువగా చేయి ఎత్తుతుంది, ఎందుకని? మొదటి లైనువారు ఆలోచిస్తున్నారా? ఈ మధువనంవారు చేస్తున్నారా? మధువనంవారు చేతులెత్తండి. చేస్తున్నట్లయితే చేతులెత్తండి. ఒకే సమయంలో మూడు సేవలు. మరి ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్. అప్పుడప్పుడు కాదు. ఏమి జరుగుతుందంటే సేవ అయితే చేస్తారు కానీ సేవతో పాటు స్వయంలో మరియు తోటివారిలో సంతుష్టత ఉండాలి ఎందుకంటే సేవకు ఫలితము సంతుష్టత మరియు సంతోషము. కావున పరిశీలించుకోండి. సేవ అయితే చేసారు కానీ ముందు కూడా వినిపించాము, సేవా సంతోషము ఎప్పుడు వస్తుందంటే స్వయం, తోటివారు మరియు వాతావరణము అన్నింటిలో సంతుష్టత వైబ్రేషన్లు ఉన్నప్పుడు. సేవా సఫలత కోసం విశేషంగా మూడు విషయాలను వినిపించడం జరిగింది, గుర్తున్నాయి కదా! మొదటి నంబరు, సేవ అనగా నిమిత్త భావము. రెండు - నిర్మాణ భావన. మూడు - నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము. ఈ మూడూ కలిసి సేవలో ఉన్నట్లయితే స్వయం కూడా సంతుష్టంగా, తోటివారు కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఎవరి సేవ అయితే చేసారో వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. నిమిత్త భావమున్న వారు బాబా వైపు సంబంధాన్ని జోడిస్తారు. నిమిత్త భావం లేనట్లయితే బాబాకు అంత సమీపంగా రారు. కావున సేవ చేసినప్పుడల్లా భావము, భావన మరియు స్వభావము మంచిగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. బాప్‌దాదాకు ముఖ్యమైన విషయము, ఈరోజుల్లో బాప్‌దాదా చూసారు – ప్రతి ఒక్కరు మరియు స్వయము సేవకొరకు ఎక్కడకు వెళ్ళినాగానీ సహచరులు సంతుష్టంగా ఉన్నారా అన్నదానిని పరిశీలించుకోండి. ఎందుకంటే సేవ సఫలతగా సంతుష్టతా ఫలము లభించాలి. సంతోషము ప్రాప్తించాలి. దీనితో పాటు బాప్‌దాదా ఒక విషయంలో సూచనను ఇస్తున్నారు- నడుస్తూ, తిరుగుతూ, సంగఠనలో కూడా ఉంటారు, దానితోపాటు ఏదో ఒక సేవ కూడా జరుగుతూ ఉంటుంది, అటువంటి సమయములో ఒకరికొకరిని ఆత్మ రూపంలో చూడండి. ఆత్మ రూపంలో చూస్తారుకూడా, అభ్యాసము కూడా చేస్తారు కానీ ఎప్పుడైతే ఆత్మను చూస్తారో అప్పుడు ఆత్మ యొక్క అసలైన సంస్కారముతో చూస్తారా? లేక మిక్స్ సంస్కారమేదైతో ఉందో అది కూడా కనిపిస్తుందా? ఆత్మను చూడండి - ఇందులో పాస్ అయ్యారు, కానీ ఏ సంస్కారముతో చూస్తారు? ఆత్మ ఒరిజినల్ సంస్కారముతో కనెక్షన్‌లోకి వస్తారా? లేక వర్తమాన సంస్కారము కూడా ఎదురుగా వస్తుందా? కనుక, బాబా అంటారు, ఈరోజు నుండి ఎవరినైనా ఆత్మ రూపంలో చూడండి కానీ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారమేదైతే ఉందో ఆ రూపంలో చూడండి. అప్పుడు ఇక ఎప్పుడుకూడా పరస్పరంలో జరిగే కొన్ని కొన్ని విషయాలేవైతే ఉన్నాయో అవి జరుగవు. ఇప్పుడు ఆత్మ రూపంలో అయితే చూస్తారు కానీ దానికి తోడుగా వర్తమాన సంస్కారము కూడా వచ్చేస్తుంది. కావున పరస్పరంలో సంపూర్ణ స్థితి ఏదైతే ఉండాలో అందులో దూరమేర్పడుతుంది. కావున ఒరిజినల్ సంస్కారము కలిగిన ఆత్మను చూడండి. అప్పుడు సంగఠనలో వచ్చే అడ్డంకి ఏదైతే ఉందో ఆ అడ్డంకి అంతమైపోతుంది.
ఈ బ్రాహ్మణ పరివారము శ్రేష్ఠ పరివారము. పరివారమునకు చాలా మహిమ ఉంది. ఈ ఈశ్వరీయ పరివారము మళ్ళీ మళ్ళీ లభించదు. కల్పములో ఒకే ఒక్కసారి ఈ ఈశ్వరీయ పరివారము లభించింది, ఇంత పెద్ద పరివారము మొత్తము కల్పములో మరెన్నడూ లభించదు. పరివారము యొక్క విశేషతను తెలుసుకోవటము కూడా మరియు పరివారములో నడవడము, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ జ్ఞానమునకు పునాది నిశ్చయము అని ముందుకూడా వినిపించాము, నిశ్చయములో నాలుగు విషయాలు ఉన్నాయి, బాబాలో, దాదా తోడుగా ఉండనే ఉన్నారు మరియు జ్ఞానములో, డ్రామాలో, పరివారములో అన్నింటిలో నిశ్చయము ఉండాలి. కావున నిశ్చయబుద్ధి కలవారిగా అయినప్పుడు సహజ పురుషార్థీలుగా అయిపోతారు. బాప్దాదాపై ఏవిధంగా నిశ్చయము ఉందో అలా పరివారములో కూడా నిశ్చయము తప్పక ఉండాలి. మామూలుగా కూడా చూడండి, మీరు దేనినైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? నాలుగు వైపులా టైట్‌గా చేస్తారు కదా, ఒకవేళ ఒకవైపు టైట్ చేయకపోయినా గానీ అలజడి అయిపోతుంది. అలాగే తండ్రి, జ్ఞానము, డ్రామాలో కూడా విశేషంగా డ్రామా మరియు పరివారము. ఒకవేళ ఈ నాలుగు విషయాలలో దృఢంగా లేనట్లయితే విఘ్నాలు వస్తాయి. విఘ్నాలను దాటివేయటంలో అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది. కావున పరివారమును తెలుసుకోవటము, పరివారముతో ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవటము - ఇది చాలా అవసరము.
పూర్వజులు, పూజ్యులు, ఈ విషయాలను కూడా స్వయములో మరియు సహచరులలో తీసుకొని రావాలి. ఏమైనాగానీ, నంబరువారీగా అయితే ఉంది కదా! కానీ బ్రాహ్మణ పరివారపు విశేష కార్యము ఆశీర్వాదము ఇవ్వటము, ఆశీర్వాదము తీసుకోవటము. కొంతమంది పిల్లలంటారు, ఇతరులు క్రోధము చేసినప్పుడు వారు ఆశీర్వాదమును ఎలా తీసుకుంటారు! ఆశీర్వాదము తీసుకోరు, క్రోధము చేస్తారు. బాప్‌దాదా అంటారు-సరే, సంస్కారమునకు వశమై వారు శాపాన్ని ఇస్తున్నారు. మీరు ఆశీర్వాదమును ఇవ్వాలనుకుంటున్నారు, వారు శాపమును ఇస్తున్నారు, కానీ శాపమును తీసుకునేది ఎవరు? తీసుకునేది మీరా లేక వారా? వారు ఇచ్చేవారు, మీరు తీసుకునేవారు. మరి వారి శాపాన్ని మీరెందుకు తీసుకున్నారు? ఒకవేళ ఆత్మను ఒరిజినల్ సంస్కారముతో చూసినట్లయితే మీకు దయ కలుగుతుంది. స్వయము కూడా సురక్షితముగా ఉండండి, శాపాన్ని తీసుకోకండి. తీసుకొనే వారు మీరు, శాపాన్ని ఇవ్వకండి, తీసుకోకండి.
ఇప్పుడు బాప్‌దాదా ఇప్పటికి మరియు మరల వచ్చేటప్పటికి హోమ్‌వర్క్‌ను ఇస్తున్నారు - ఎప్పుడుకూడా ఎవరినైనాగానీ ఆత్మ రూపంలో చూడండి, వర్తమాన సంస్కారపు రూపంలో చూడకండి. ఆత్మ అని అన్నట్లయితే ఆత్మకున్న నిజమైన సంస్కారమేదైతో ఉందో ఆ నిజమైన సంస్కార రూపంలో, సంబంధములో కూడా రండి మరియు దృష్టిలో కూడా ఆ దృష్టితో చూసినట్లయితే ఈ విఘ్నాలేవైతే కలుగుతుంటాయో, వీటి కారణంగా పురుషార్థములో తీవ్రత రావడం లేదు, ఇక అప్పుడు వృత్తి మారుతుంది, దృష్టి మారుతుంది కావున విషయాలు సమాప్తమైపోతాయి. ఎవరిలో ఎటువంటి విషయాలు చూసినాగానీ, బాప్‌దాదా మొదటకూడా చెప్పారు, బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్కరి బాధ్యత శుభ భావన, శుభ కామనలను ఇవ్వటము మరియు శుభ భావన, శుభ కామనలను తీసుకోవటము. ఆ సంస్కారముతో చూడండి మరియు నడవండి. మరొక విషయాన్ని కూడా తెలుపుతాము-మొదటకూడా తెలిపాము, అక్కడక్కడ సంగఠనలో ఒక్కోసారి పరదర్శన, పరచింతన మరియు పరమతము వైపుకు ఆకర్షితమైపోతారు. ఇప్పుడు ఈ మూడు పరలను కట్ చెయ్యండి, ఒక్క పరను ఉంచండి, ఆ ఒక్క పర - పర ఉపకారము. పర ఉపకారము చెయ్యాలి, పర ఉపకారులు, బ్రాహ్మణుల స్వభావము పర ఉపకారము. పర దర్శనము కాదు, ఈ పరను కట్ చెయ్యండి. ఈ మూడూ చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కావున బ్రాహ్మణ ఆత్మనైన నా స్వమానమే పర ఉపకారి అన్న మీ స్వమానమునే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కావున రాబోయే సీజన్లో పిల్లలైన ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తనను చూడాలని బాప్‌దాదా కోరుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? వీలవుతుంది అంటే చేతులెత్తండి. చేతులెత్తడమైతే బాగా ఎత్తుతారు. మరి ఏం చెయ్యాలి? మంచిది, బాప్‌దాదా అభినందిస్తున్నారు, పరస్పరములో ఒకరికొకరికి అటెన్షన్‌ను ఇప్పిస్తూ ఉండండి. ఏం చెయ్యాలి? ప్రతిరోజూ రాత్రి పడుకొనేముందు బాప్‌దాదాకు గుడ్‌నైట్ చెప్పే ముందు మీ మొత్తము రోజంతటి లెక్కను ఇవ్వాలి. మంచి చేసానా లేక చెడు చేసానా? ఏది చేస్తే దానిని, ఆ లెక్కను ఇచ్చి మీ బుద్ధిని ఖాళీ చేసుకొని గుడ్‌నైట్ చెప్పాలి మరియు బాబా స్మృతిలోనే నిద్ర పోవాలి. మీ నిద్ర చాలా మంచిగా ఉంటుంది. మొదట స్వయాన్ని ఖాళీ చేసుకోవాలి, బుద్ధిలో ఏ విషయాన్నీ ఉంచుకోకూడదు, తండ్రి రూపంలో మొత్తము లెక్కను సత్యమైన హృదయముతో ఇచ్చేసినట్లయితే మీకు ధర్మరాజపురిలోకి వెళ్ళే అవసరము ఉండదు. సత్యమైన హృదయమును చూసి తండ్రి సంతోషపడిపోతారు. కావున హోమ్‌వర్క్ లభించింది - ఒకటి, నడుస్తూ తిరుగుతూ మీ పూర్వజ మరియు పూజ్య స్వరూప సేవను చెయ్యగలరు. ఈ జనక్ బచ్చీ ఆరోగ్యము మంచిగా లేకపోయినాగానీ, కరాచీ సేవలో విశేషంగా మనసా సకాష్ను ఇచ్చింది, నిమిత్తంగా ఎవరు ఉన్నాగానీ వీరు ప్రాక్టికల్‌గా చేసారు అన్నది తండ్రి చూసారు. అక్కడి ఆత్మలకు సకాష్ లభించింది మరియు ముందు ముందు ఉల్లాసములో ఉన్నతి చెందుతున్నారు. మరి ఈ విధంగా బాప్‌దాదా ప్రాక్టికల్ ఉదాహరణను చూసారు, మరి మీరందరు కూడా చెయ్యగలరు. దుఃఖీలకు సంతోషపు అలను చేర్చగలరు. మా దేవి మా దేవత ఎప్పుడు వచ్చి దయ చూపిస్తారు అని మీ భక్తులే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీకు వినిపించటం లేదు కానీ బాబాకు చాలా వినిపిస్తున్నాయి. ప్రతి ఇష్టదైవాన్ని పిలుస్తున్నారు. మా భక్తులు ఎవరు అన్నది మీకు తెలియదు కానీ భక్తులకైతే తెలుసు కదా. వారైతే పిలుస్తారు మరియు ప్రతి బ్రాహ్మణ ఆత్మలైన మీ భక్తులు. ఢీలాగా ఉన్నా, తెలివైన వారుగా ఉన్నా మీ భక్తులు. ఎందుకంటే వేర్లలో కూర్చొని ఉన్నారు కదా కావున మీది సకాష్ను ఇచ్చే పాత్ర. కావున ఇప్పుడు మనసా సేవను పెంచండి మరియు ఎంత బిజీగా ఉంటారో అంతగా నిర్విఘ్నంగా ఉంటారు. చెయ్యగలరు కదా! మనసా సేవను చెయ్యటం తెలుసు కదా! తెలుసా? తెలిసిన వారు చేతులెత్తండి. మంచిది, చేతులను దించండి. మీకు తెలుసు, మంచిది. ఎవరైతే మధ్యమధ్యలో చేస్తూ ఉంటారో వారు చేతులెత్తండి. చేస్తూ ఉంటారు, మంచిది. నియమపూర్వకంగా చేస్తుంటారా లేక అప్పుడప్పుడూ చేస్తుంటారా? ఒకవేళ అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే దానిని రెగ్యులర్ చెయ్యండి, ఒకవేళ కొద్దిగా చేస్తున్నట్లయితే దానిని పెంచండి. ఎందుకంటే మొత్తము కల్పమునకు ఆధారము ఇప్పటి సేవా ఫలము. పూజారిగా అయినాగానీ రాజ్య అధికారిగా అయినాగానీ రెండింటికీ ఆధారము ఇప్పటి సేవ, ఇప్పటి అవస్థ, ఇప్పటి మాట, ఇప్పటి సంబంధ-సంపర్కములు. కావున బాప్‌దాదా దీనినే కోరుకుంటున్నారు-మరల వచ్చినప్పుడు, మొదటిసారి, బాప్‌దాదా అయితే చెప్పారు కానీ ఎప్పటివరకు నడుస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు. దీని అర్థము ఏమిటంటే మీరు ఎవరెడీగా ఉండండి అని. కావున మొదటిసారిగా అందరి రిజల్టును తీసుకుంటాము. ఇప్పుడు ఎంత శాతము ఉందో దానికంటే ఎక్కువ రావాలి. మామూలుగా కూడా, చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యండి, మరెప్పుడో కాదు అని బాప్‌దాదా మొదటినుండి కూడా చెప్తుంటారు. అప్పుడు అన్న గీతాన్ని బాప్‌దాదాకు చాలా వినిపిస్తారు. దానిని చాలా మంచిగా చేసి వినిపిస్తారు కానీ బాప్‌దాదాకు ఈ అప్పుడు అన్న గీతము మంచిగా అనిపించదు. ఇప్పుడు-ఇప్పుడు అన్న గీతము మంచిగా అనిపిస్తుంది. వెంటనే చేసిన దానము మహా పుణ్యము. మరి వచ్చే సంవత్సరానికి ఏం చెయ్యాలో అర్థమైందా? మంచిది.
సేవ టర్న్ మహారాష్ట్ర జోన్ వారిది:- మంచిది, ఈ దృశ్యాన్ని అందరికీ చూపించండి. ఇప్పుడు చూడండి, మూడు వంతుల క్లాసు మహారాష్ట్ర వారే ఉన్నారు. పాతవారైనా లేక క్రొత్తవారైనాగానీ మహారాష్ట్రవారు. మంచిది, నిలబడి ఉన్నవారిలో ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్లో, సేవ చేసేవారో, సెంటరును సంభాళించేవారో వారు కూర్చోండి. అయినా కూడా చూడండి క్రొత్తవారు ఎంతమంది ఉన్నారో! అచ్చా, క్రొత్తవారు ఎవరైతే ఉన్నారో వారు నిల్చోండి, మిగిలినవారు కూర్చోండి. అచ్ఛా! క్రొత్తవారి సంఖ్య ఎక్కువగా ఉంది, టూ లేట్‌కు ముందే వచ్చారని బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కావున వచ్చిన మీకందరికీ అభినందనలు. కొద్ది సమయంలోనే ఫాస్ట్ పురుషార్థము, తీవ్ర పురుషార్థము చేసి ముందుకు వెళ్ళగలరు అని బాప్‌దాదా వచ్చినవారందరికీ వరదానమును ఇస్తున్నారు. ఒకవేళ పరివర్తన చేసుకొనేందుకు ప్రతి సమయము అటెన్షన్‌ను ఉంచినట్లయితే మరియు మొత్తము రోజంతటిలో మీ చదువు మరియు ప్రాప్తులను ప్రోగు చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు కూడా ముందుకు వెళ్ళగలరు. అవకాశము ఉంది. ఇప్పుడు టూ లేట్ కాదు, లేట్ కావున మీకు ఎంత వీలైతే అంతగా మీ నాలుగు సబ్జెక్టులలో, చదువులో అటెన్షన్‌ను ఇస్తూ ఉండాలి. చివరలో ఉన్న ఎవరెవరు ఫాస్ట్‌గా వెళ్తారు అన్నది బాబా కూడా చూస్తూ ఉంటారు. వెళ్ళరని కాదు, వెళ్తారు. పిల్లలైన ప్రతి ఒక్కరూ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి, వారి స్వరాజ్య సింహాసనము మరియు బాప్‌దాదా హృదయ సింహాసనాన్ని తీసుకోవాలి అని బాప్‌దాదాకు పిల్లలైన ప్రతిఒక్కరిపై ఇదే ఆశ ఉంది. మంచిది.
మహారాష్ట్ర అన్న పేరులోనే మహా ఉంది. మొదటగా మహా వస్తుంది కదా! కావున మహాన్ ఆత్మలుగా అయితే ఉన్నారు మరియు మహాన్ ఆత్మలలో మహాన్ ఉల్లాస-ఉత్సాహాలు, తీవ్ర పురుషార్థము, సదా తండ్రి ఆశలను ప్రాక్టికల్‌లో తీసుకొని వచ్చే లక్ష్యము మరియు లక్షణాలు కూడా ఉన్నాయి. రెండూ ఉన్నాయి కదా! లక్ష్యము కూడా ఉంది మరియు లక్షణాలు కూడా ఉన్నాయి. రెండూ సమానంగా ఉన్నాయా లేక అంతరము ఉందా? లక్ష్యము ఎంత పెద్దదో అంతగానే లక్షణము యొక్క స్పీడ్ కూడా ఉందా లేక తేడా ఉందా? లక్ష్యము ఉన్నతంగా ఉంది మరియు లక్షణాల వైపు కూడా అంతటి అటెన్షన్ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. లక్ష్యము మరియు లక్షణాలు ఉన్నాయా? కొద్దిమందే చేతులెత్తారు. ఇప్పుడు మహారాష్ట్రలోని ప్రతి ఒక్క ఆత్మ అమృతవేళ బాప్‌దాదాతో మిలనము చేసిన తరువాత ఈ అటెన్షన్‌ను ఇవ్వాలి-ఈరోజు లక్ష్యము మరియు లక్షణాన్ని ఒక్కటిగా చెయ్యాలి. దీనిని చెయ్యగలరు కదా! మరియు ఈరోజు లక్ష్యము మరియు లక్షణము సమానంగా ఉన్నాయా లేక తేడాగా ఉన్నాయా అని రాత్రి బాప్‌దాదాకు సమాచారాన్ని ఇవ్వాలి. మరుసటి రోజు ముఖ్యంగా అటెన్షన్‌ను ఉంచి ఏ లోటు అయితే ఉందో దానిని నింపాలి. మూడవరోజు ఆ లోటును సదాకాలమునకు సమాప్తము చెయ్యాలి. ఇలా మున్ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు మహారాష్ట్ర అందరిలో నంబర్‌వన్ అయిపోతుంది కదా! అన్నింటిలో. నాలుగు సబ్జెక్టులలో. జ్ఞానము, యోగము, ధారణ.... ధారణను మొదటి నంబర్‌గా ఉంచాలి. ధారణలో నంబర్‌వన్‌గా అవ్వగలరు! అవ్వగలరా? టీచర్స్ అవ్వగలరా? చేతులెత్తండి. చెయ్యాల్సి వస్తుంది అని అలా అయితే కాదు. ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి. మంచిది. ఎంత సంఖ్య ఉందో మరియు టీచర్స్ ఎవరైతే చేతులెత్తారో వారికి తండ్రి కూడా అదనపు సహాయమును ఇస్తారు అని బాప్‌దాదా వరదానము ఇస్తారు ఎందుకంటే మహారాష్ట్ర అద్భుతమును చేసి చూపించాలి. బాబా చెప్పారు మరియు అదనపు శక్తిని అనుభవము చేస్తారు. హృదయపూర్వకంగా బాబా అన్నప్పుడు అదనపు సహాయము అనుభవమవుతుంది. బాప్‌దాదాకు అటెన్షన్ ఉంటుంది. మంచిది. మీరు ప్రాక్టికల్‌గా చేసినట్లయితే అందరికీ ఉల్లాసము వచ్చేస్తుంది. ఏదైనా విషయము వచ్చినప్పుడు, మీరు చెయ్యలేనప్పుడు, ధైర్యము కొంచెము తక్కువగా ఉన్నట్లయితే, ఎక్స్ట్రాగా మీ ధైర్యాన్ని తక్కువ చేసే పని ఏదైతే ఉందో దానిని తండ్రికి అప్పగించండి, బాబా నేనిది చెయ్యలేకపోతున్నాను. మీరు తీసుకోండి. నేను దీనిని సంకల్పంలో కూడా తీసుకురాను. పూర్తిగా ఆ సంకల్పాన్ని రానివ్వకండి. ఇచ్చేయండి. తిరిగి మళ్ళీ వస్తే మనసులో పెట్టుకోకండి. మళ్ళీ తిరిగి ఇచ్చేయండి. నా పిల్లలు ఒక్కొక్కరు ఏది అనుకుంటే అది చేసి చూపించే విధంగా ఉండాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఆలోచనల్లో అయితే అందరూ మంచిగా ఉన్నారు, అలాగే చెయ్యాలి కదా! పాండవులు కూడా చేస్తారు కదా! చేస్తారా? పాండవులు చేతులెత్తండి. చేస్తారా? అచ్ఛా. మీరు చేసాక బాప్‌దాదా ఒక మంచి విషయాన్ని చెప్తారు. అచ్ఛా. ఇకపోతే సేవ అయితే మంచిగా చేస్తున్నారు. మీరు ఏ సర్టిఫికేటును ఇచ్చారు. సేవ మంచిగా జరుగుతుంది కదా. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులకు బాప్‌దాదా ఒక విషయంలో చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. ఏ విషయంలో? డబల్ విదేశీయులలో ఒక విశేషత చూసాము, తమ కల్చర్‌ను మార్చుకోవడం మొదట కష్టంగా అనిపించేది, ఇండియన్ కల్చర్ కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు ఈ సమస్య మెజారిటీ సమాప్తమైపోయింది. ఇప్పుడు చాలా ఆత్మలు విదేశీయులుగా ఉన్నరు కానీ, ఎవరైతే పురుషార్థం మంచిగా చేస్తున్నారో వారికి - మేమున్నదే బాబాకు, కేవలం సేవ కోసం విదేశాలలో ఈ జన్మను తీసుకున్నాము అని అనిపిస్తుంది. ఇది చూసి, ఈ మార్పును చూసి బాప్‌దాదాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడివారిమే, కేవలం నలు వైపుల సేవ కోసం ఇక్కడ జన్మను తీసుకున్నాము అని ఎవరికైతే అనిపిస్తుందో వారు చేతులెత్తండి. ఇక్కడి వారిమే, ఇక్కడే ఉంటాము ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది కదా, బ్రహ్మా బాబాతో పాటు, ఇప్పుడు కూడా బాప్‌దాదాతో పాటు వెళ్తాము అని, పక్కా. కలిసి వెళ్తాము, తల ఊపండి. అలాగే సత్యయుగంలో కలిసి వస్తాము. తల ఊపండి. అచ్ఛా. ద్వాపరంలో భక్తిలో కూడా కలిసి ఉంటాము. కలిసే ఉంటాము కదా! అలాంటివారు కొద్దిమందే ఉంటారు. పూర్తి కల్పము బ్రాహ్మణ పరివారంతో ఏదో ఒక సంపర్కంలో ఉంటారు. ఈ అవినాశి సంబంధము భిన్న భిన్న రూపాలలో కొద్దిగా దూరంగా లేక కొద్దిగా దగ్గరగా ఉంటుంది. డబల్ విదేశీయులలో ఇది కూడా ఒక విశేషమైన అద్భుతమే, ఒకవేళ విషయం అర్థమైతే అర్థం చేసుకునేవారు అలజడిలోకి రారు, పక్కాగా ఉంటారు. అర్థమైతే తక్కువగా అలజడి ఉంటుంది. అర్థం కానంత వరకు ప్రశ్నలు వస్తాయి, అప్పటి వరకు కొద్దిగా కదలడం ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే పక్కాగా నడుచుకుంటారు. అలజడిలోకి అస్సలే రాని కొంతమంది పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉన్నారు. వారు ఎగిరేవారు. బాప్‌దాదా సదా విదేశాలలో తిరిగి వస్తుంటారు. అమృతవేళలో కూడా వస్తారు. అప్పుడు ఏమి చూస్తారు? రిజల్టులో కొంచెం మిస్సింగ్ అవుతుంది, మరి కొంతమంది కష్టపడుతూ ఉంటారు. వదిలి పెట్టరు, కష్టపడైనా కూర్చుంటారు. కష్టంలో అప్పుడప్పుడూ సఫలత కూడా లభిస్తుంది. కానీ ఏదైతే నియమం ఉందో అందులో మెజారిటీ మంచి రిజల్టుతో ఉన్నారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మరి ఇచ్చిన హోమ్‌వర్కును ఏమి చేసారు? ఎవరైతే చేసారో వారు చేతులెత్తండి. క్రోధాన్ని వదిలి పెట్టారా? క్రోధాన్ని వదిలి పెట్టారా? చేతులెత్తండి. క్రోధం చెయ్యలేదా? మనసులో. చేతులెత్తండి. కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు ఈ హోమ్‌వర్కును కూడా చేసి పాస్ మార్కులు తెచ్చుకోండి. పిల్లల అటెన్షన్ అయితే ఉంది, బాప్‌దాదా టోటల్ రిజల్టును చూసారు, క్రోధం చేసినప్పుడు సగం తర్వాత గుర్తుకు వస్తుంది క్రోధం చేస్తున్నామని. అప్పుడు స్వయాన్ని పరిశీలించుకుని లేదు, లేదు, క్రోధం చెయ్యకూడదు అని అనుకుంటారు. కానీ కొంచెం మనసులో అయితే వస్తుంది. నోటినైతే కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ మనసులో వచ్చేస్తుంది. కానీ పక్కాగా అయితే చెయ్యాలి కదా. చెయ్యాలి కదా. పక్కా కదా! అందరి రిజల్టును అందరికీ బాప్‌దాదా వినిపించారు. ఇండియా మరియు విదేశాలు. కానీ తోడుగా రావాలంటే తండ్రి సమానంగా అవ్వాల్సిందే. పరిస్థితులైతే వస్తాయి. పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి కానీ మీరు చేసిన ప్రామిస్ మాత్రం పోకూడదు. విదేశాలలో కూడా బాగా వృద్ధి అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. ప్రోగ్రాములు కూడా బాగా జరుగుతున్నాయి. పురుషార్థంలో ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారు పురుషార్థం వైపు అటెన్షన్‌ను కూడా మంచిగా ఇప్పిస్తున్నారు. కృషి చేస్తున్నారు. అచ్ఛా.
ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు చేతులెత్తండి. సంతోషంగా ఉంటారు. సంతోషమైతే ఉంటుంది కదా! సంతోషం వెళ్ళిపోవడం లేదు కదా? సంతోషం పోకూడదు. ఎందుకంటే సంతోషము పరమాత్ముని బహుమతి. పరమాత్ముని బహుమతిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పరిస్థితులు వెళ్ళిపోతాయి, సంతోషం ఎందుకు పోవాలి? పరిస్థితి శక్తిశాలియా లేక పరమాత్ముని బహుమతి అయిన సంతోషమా? కనుక, సంతోషము పోకుండా ఉండేందుకు కూడా కృషి చేయండి. సదా ముఖము సంతోషంగా ఉండాలి. ఖుష్నుమా. సంతోషము ఉండగలదా? ఉండగలదా? తల ఊపండి. ఉండగలదు, అటెన్షన్ పెట్టినట్లయితే జరిగిపోతుంది కదా. బాప్‌దాదా అందరికీ చెప్తున్నారు - ఒక నెల తర్వాత అందరి నుండి చార్టును తెప్పించుకుంటాము - ఒక నెల సంతోషంగా ఉన్నారా? ఈరోజు తారీఖును గుర్తుంచుకోండి. ఇది అందరికీ చెప్తున్నాము, కేవలం విదేశీయులకే కాదు. ఒక నెల ట్రయల్ వేయండి. ఏ విషయం వచ్చినాకానీ మనసులో పెట్టుకోవద్దు. ఏది రైటు, ఏది రాంగు అని అర్థం చేసుకోండి కానీ మనసులో పెట్టుకోవద్దు. మనసులోకి వెళ్ళినప్పుడే సంతోషం పోతుంది. అర్థం చేసుకున్నవారు సంతోషంగా ఉంటారు, విషయాన్ని అర్థం చేసుకుని దానిని పూర్తి చేస్తారు. అయితే ఇది ఒక నెల కోసం పేపర్. సంతోషంగా ఉండండి. వీలవుతుందా? దీనికి అందరూ చేతులెత్తండి, వీలవుతుందా? అయితే బాప్‌దాదా మీకు ఒక నెల కోసం ముందుగానే అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే చెయ్యాల్సిందే. అయిపోతుందిలే అన్న పాఠము వద్దు, చెయ్యాల్సిందే. క్రొత్తవారైనా, పాతవారైనాగానీ, బ్రాహ్మణ పరివారమే కదా. మరి బ్రాహ్మణ పరివారము ప్రపంచానికి విశ్వ పరివర్తకమైనది. మరి పరివర్తకులు పరివర్తన చేయకపోతే విశ్వ పరివర్తన ఎలా జరుగుతుంది! బాధ్యతగా భావించండి. అలసత్వాన్ని విడిచిపెట్టండి. అయిపోతుందిలే, అయిపోతుందిలే అని అనవద్దు. చేయాల్సిందే. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు ఆపడం వలన సమయం ఆగి ఉంది అని బాప్‌దాదాకు తెలుసు. సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది మీరే. కనుక తీవ్ర పురుషార్థం చేయండి. దృఢ సంకల్పం చేసినట్లయితే అయిపోతుంది. రోజూ ఈ పాటను గుర్తుకు తెచ్చుకోండి - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సరేనా. అచ్ఛా.
బాప్‌దాదా నలు వైపుల ఉన్న పిల్లలను చూసి సంతోషిస్తున్నారు కూడా ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు లేనిదే ఒంటరిగా ఏమీ చేయలేరు. అందుకే ప్రతి రోజూ పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు. తీవ్ర పురుషార్థీ పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు ఇప్పుడు పదండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలను చూసి బాప్‌దాదా సమ్ముఖంలో ఉన్నవారైనా, దూరంగా కూర్చుని ఉన్నాకానీ అందరికీ తండ్రి గుర్తున్నారు. మరి బాబాకు కూడా ఎవరు గుర్తున్నారు? నలువైపుల ఉన్న పిల్లలు గుర్తున్నారు ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాల్సిందే అన్న ఆశ బాబాకు ఉంది. బాబాకు పిల్లలపై ఉన్న ఆశలతో పాటు పిల్లలు నంబరువారీగా ఉన్నారు అని తెలుసు కానీ తమ నంబరు అనుసారంగా అయితే సంపన్నంగా కావాలి కదా. ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని కూడా చూస్తూ ఉంటారు ఏమేమి చేస్తున్నారు అని, బాబాకు చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు కష్టపడుతున్నప్పుడు నా పిల్లలు కష్టం నుండి దూరమవ్వాలి, ప్రేమలో మునిగిపోవాలి అని బాబాకు పిల్లలపై మరింత ప్రేమ కలుగుతుంది. ఎంతగా ప్రేమలో మునిగి ఉంటారో అంతగా శ్రమ తక్కువ ఉంటుంది. బాప్దాదాపై ప్రేమ ఉందా అని చేతులెత్తమంటే అందరూ పెద్ద పెద్దగా చేతులను ఎత్తుతారు. బాబాపై ప్రేమ ఉంది అని బాబా కూడా ఒప్పుకుంటారు, ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు కానీ విషయాలలో పడిపోయి బాబాను మర్చిపోతారు.
మరి నలువైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా యొక్క పదమా పదమ రెట్ల ప్రేమను, హృదయపూర్వక ప్రేమను స్వీకరించండి. అందరికీ, యజమానులైన పిల్లలకు బాబా లక్షలాది అభినందనలను తెలుపుతున్నారు. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
నీలూ అక్కయ్యతో:- మనస్ఫూర్తిగా సేవను చేస్తున్నారు. సేవ చేయడమంటే హృదయంలో స్థానం సంపాదించుకోవడము. మీరు బాబా హృదయంలో ఉన్నారు. సేవ వ్యర్థంగా పోదు. పదమారెట్లు పెరిగి లాభాన్ని ఇస్తుంది. బాగుంది. బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు.
దాదీ జానకితో:- మీది డబల్ సేవ ఉంది. ఫారెన్ బాధ్యత కూడా ఉంది, ఇండియాది కూడా ఉంది. (మీరు మీ దృష్టిలో నన్ను పెట్టుకున్నారు) దృష్టిలో ఏమిటి, హృదయంలోనే పెట్టుకున్నాము. బాగుంది. అటెన్షన్ ఇవ్వవలసే ఉంటుంది.
దాదీలందరితో:- బాప్‌దాదా ఏమి చూసారంటే అన్నయ్యలుకానీ, అక్కయ్యలుకానీ నిమిత్తమైనవారు మంచిగా తమ కార్యాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ కార్యాన్ని మంచిగా చేస్తున్నప్పుడు బాప్‌దాదా సంతోషిస్తారు. పరస్పరంలో కలిసి ఒకరు చేస్తే పది మంది సహయోగాన్ని అందిస్తున్నారు. నడుస్తూ ఉంది, నడుస్తూ ఉంటుంది. యజ్ఞము సఫలము. మీరు కూడా సఫలతా స్వరూపులు. అందరూ మంచిగా ఉన్నారు. బాప్‌దాదాకు అందరూ మంచిగానే కనిపిస్తున్నారు. ఎవరెవరు దేనికి నిమిత్తమై ఉన్నారో వారు నిమిత్తంగా అయ్యి దానిని సంభాళిస్తున్నారు. బాప్‌దాదా కేవలం సంపూర్ణత గురించి మాట్లాడుతున్నారు. సేవ కార్యాలైతే మంచిగా జరుగుతున్నాయి.
మోహిని అక్కయ్యతో:- కుర్చీలో అయితే వచ్చారు కదా. అలాగే వదిలేస్తామా. నడుస్తుంది. ఇప్పుడైతే సమాప్తి చెయ్యాలి. నడుస్తుంది, నడుస్తూ ఉంటుంది.
పర్దాదీతో:- బాగుంది, మీరు ఒక మూర్తిలా అయ్యి యజ్ఞంలో ఒక మంచి దర్శనీయమూర్తిగా ఉన్నారు. మీ ముఖం చూసే అందరూ సంతోషిస్తారు.
నిర్వైర్ అన్నయ్యతో:- ఇప్పుడు పాండవులు లేక శక్తులు ఎవరైతే నిమిత్తమై సేవను చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు, మంచిగా చేసి ఇంకా మున్ముందు యజ్ఞం యొక్క మహిమ, యజ్ఞ సేవా వృద్ధి, బాబాను ప్రత్యక్షం చేయడం, వీటి గురించి కూడా ప్లాన్లు వేస్తున్నారు. తండ్రి ప్రత్యక్షత జరగాలి అని ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి. ఈ కార్యాన్ని చేసేది ఎవరు! భగవంతుడు వచ్చేసారు, మా తండ్రి వచ్చేసారు, అని అందరూ అనాలి, ఆ భాసన ఇప్పుడు రావాలి. ఇప్పుడు ఈ ప్రయత్నం చేయండి. బ్రహ్మాకుమారీల వరకు వచ్చారు. బ్రహ్మాకుమార్-కుమారీలు మంచివారు కానీ ప్రత్యక్షత జరగాలి. కావున ఇటువంటి తపస్సు ఏదైనా చేయండి, సేవా ప్లాన్‌ను తయారు చెయ్యండి అందులో ఇది రుజువు కావాలి. ఇకపోతే ఏదైతే నడిపిస్తున్నారో అది మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ తమ సేవలను మంచిగా చేస్తున్నారు. తీసుకురావలసిన పరివర్తన గురించి అందరి అటెన్షన్ ఉండాలి.
రమేష్ అన్నయ్య, ఉష అక్కయ్యతో:- బాప్‌దాదా నుండైతే ప్రతి అడుగులో వరదానముంది. బాగుంది, ఇద్దరూ తమ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు, ఇది బాగుంది. (రేపటి నుండి ఎకౌంట్స్ పరంగా క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది) బాగుంది, క్రొత్త సంవత్సరానికి అభినందనలు. అచ్ఛా!
ఓంశాంతి