Search for a command to run...
13 Apr 2011
జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగ శక్తితో సంస్కారాల సంస్కారం చేయండి. మీ నడవడిక, ముఖము, దృష్టి, వృత్తి మరియు సంకల్పాలతో బాబాను ప్రత్యక్షం చేయండి
13 April 2011 · తెలుగు
ఈరోజు పిల్లలు తమ ప్రేమతో ప్రేమ సాగరుడినే తమ వద్దకు పిలుచుకున్నారు. పిల్లలకు తండ్రిపై హృదయపూర్వక ప్రేమ ఉండటం చూసి బాబాకు చాలా సంతోషంగా ఉంది. మంచిది. సదా ఈ ప్రేమ యొక్క ఆధారంతోటే బాబా సమానంగా అయిపోతారు. నిజానికి కూడా ప్రేమ సబ్జెక్టులో బాప్‌దాదా పిల్లలను ముందుంచారు. మరి ఈరోజు పిల్లలు తమ ప్రేమ అను తీగతో ప్రేమ సాగరుడిని బంధించి మధువనానికి విశేషంగా పిలిచారు. ఇటువంటి ప్రేమ సదా ఇమర్జ్ అయి ఉండాలి. హృదయాభిరాముడైన బాబా వద్దకు పిల్లల ప్రేమ సదా చేరుకుంటూనే ఉంటుంది. కానీ నంబర్‌వారీగా తప్పక ఉంటుంది. బాబా ఏమని ఆశిస్తున్నారంటే ప్రేమకు గుర్తుగా సదా ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు తోడుగా ఉండాలి, పిల్లలెవ్వరూ ఒంటరిగా అవ్వకూడదు, కంబైన్డుగా ఉండాలి. నేను సదా కంబైన్డుగా ఉంటున్నానా లేక అప్పుడప్పుడూ ఒంటరిగా కూడా అవుతూ ఉంటానా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఒంటరిగా అయితే మాయ తన అవకాశాన్ని తీసుకుంటుంది. అందుకే బాప్‌దాదా సదా చెప్తూ ఉంటారు, హృదయాభిరాముడిని సదా మీ హృదయంలో దాచుకోండి అని. దీనినే సత్యమైన మరియు నిత్యమైన ప్రేమ అని అంటారు. మరి అప్పుడప్పుడూ ఒంటరిగా అవుతూ ఉంటారా లేక సదా తోడుగా ఉంటున్నారా? మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? విశేషంగా మధువన నివాసుల నషా ఏమని ఉంటుంది, కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యం చేస్తాము. అలాగే విశేషంగా చాలా చాలా మధురమైన నిమిత్త పిల్లలు కూర్చుని ఉన్నారు, వారు బాబాతో మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞను చేసారు, మెజారిటీ పిల్లలు ప్రాక్టికల్‌గా కంబైన్డుగా ఉంటున్నారు కానీ నంబర్‌వారీగా ఉన్నారు. మహారథి, నిమిత్త పిల్లలైతే ఇతరులకు కూడా తమ ముఖము ద్వారా బాబా యొక్క సాక్షాత్కారాన్ని చేయించేవారు. వారి ముఖము మరియు నడవడిక ద్వారా బాబా యొక్క ప్రకాశమయ ముఖము మరియు బాబా యొక్క అతీతమైన మరియు ప్రియమైన నడవడిక సాక్షాత్కారమవుతూ ఉంటుంది.
బ్రహ్మా బాబాను చూసారు కదా, బ్రహ్మా బాబా అంతిమం వరకు శ్రీమతం అనుసారంగా ప్రతి మురళిలో ఎన్నిసార్లు బాబా-బాబా అనేవారు, లెక్కించండి. ప్రతి మురళిలో బాబా-బాబా అని ఎన్ని సార్లు అనేవారు! బాబావంటి గుణముతో, మూర్తితో, వచనముతో, విశేషంగా నయనాలు మరియు మస్తకంతో బాబాను ప్రత్యక్షం చేసారు. బ్రహ్మా బాబాను చూస్తే ఎలా అనిపించేదో మీకైతే అనుభవం ఉంది కదా! బాప్‌దాదా కనిపించేవారు. కేవలం బాబా అన్న మాటను అనేవారు కాదు, సదా ప్రతి ఒక్కరి నోటి నుండి బాప్‌దాదా, బాప్‌దాదా అని ఇద్దరినీ కలిపి పిలిచేవారు మరియు అనుభవం కూడా జరిగేది. ఇలా సదా ఫాలో ఫాదర్. మీ ముఖముతో, మాటతో, నడవడికతో, దృష్టితో చూసేవారికి బాబా స్మృతి స్వతహాగా కలగాలి. మేము మా ముఖము, మాట మరియు కర్మ ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలన్నది మెజారిటీ పిల్లల సంకల్పంగా ఉండటాన్ని బాబా చూసారు. అయితే ఫాలో ఫాదర్. బ్రహ్మా బాబా తమ నడవడికతో, ముఖముతో, దృష్టితో, వృత్తితో, సంకల్పంతో సదా బాబాను ఎలా ప్రత్యక్షం చేసారో మీ అందరికీ అనుభవమే కదా! బ్రహ్మా బాబాను మాత్రమే చూసేవారు కాదు, బాప్‌దాదాను చూసేవారు. కారణము? బ్రహ్మా బాబా సదా తమ నయనాలలో, మస్తకంలో బాబాను ఇముడ్చుకున్నారు. కావున, విశేషంగా బాప్‌దాదాను ఇముడ్చుకున్న మీ నయనాలు, ముఖము, నడవడిక బాప్‌దాదాను ప్రత్యక్షం చేయాలి. ప్రతి మాటలో నేర్పించేవారు అనుభవం కావాలి. వీరేదైతే మాట్లాడుతున్నారో, వీరికి నేర్పించేది, వీరిలో శక్తిని నింపేది సర్వశక్తిమంతుడైన తండ్రి, భగవంతుడు, వీరు భగవంతుని సంతానము, భగవంతుని విద్యార్థులు, భగవంతుడిని అనుసరించే అనుచరులు కాదు, వీరు ప్రతి అడుగులో పదమాలను పొందేవారు అని అనిపించాలి. ఇప్పుడు సమయం కూడా మీకు సహయోగిగా అవ్వడానికి తయారుగా ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. వద్దనుకున్నా కూడా పరిస్థితులు భగవంతుడి స్మృతిని కలిగిస్తాయి. కావున, ఒకటి సమయము, రెండు నిమిత్తమైన మీరు, రెండు గ్రూపుల విశేషత ఉంది. ఒకరు, విశేషంగా నిమిత్తమైన మధువన నివాసులు, మరొకరు, తయారై ఉన్న నిమిత్త గ్రూప్ మీటింగ్‌కు వచ్చారు.
బాప్‌దాదా ఏమి చూసారంటే, మేము బాబాను ప్రత్యక్షం చేయవలసిందే అన్న ఉల్లాస ఉత్సాహాలు ఇక్కడకు వచ్చిన మెజారిటీ పిల్లల్లో కనిపించాయి. అది ముఖము ద్వారా కావచ్చు, గుణాల ద్వారా కావచ్చు, వాణి ద్వారా కావచ్చు, సంబంధ సంపర్కంలో ఉన్నవారి ద్వారా అయినా కావచ్చు. ఈరోజుల్లో మీ మనసులో ఆత్మలపట్ల కళ్యాణ భావన ఉన్న కారణంగా ఆత్మలు మీ కనెక్షన్‌లోకి వస్తున్నాయి. ఇంకా కూడా రావాలనుకుంటున్నాయి. బాప్‌దాదా ఏదైతే మనసా సేవ కార్యాన్ని ఇచ్చారో, పిల్లలు యోగయుక్తంగా అయ్యి మనసా సేవను అభ్యాసం చేసినప్పుడు ఆ వైబ్రేషన్లు నలువైపుల ఎవరో ఒకరికి చేరుకుంటున్నాయి. మాకు ఎక్కడి నుండో ప్రకాశ కిరణాలు, సుఖశాంతుల కిరణాలు వస్తున్నాయి కానీ ఎక్కడి నుండి వస్తున్నాయో వారికి ఇంకా స్పష్టమవ్వలేదు. వస్తున్నాయి కానీ భారతదేశపు బాప్‌దాదా సంతానము నుండి వస్తున్నాయి అన్న స్పష్టత లేదు. తెలిస్తే మీ వద్దకు పరిగెడ్తారు. ఇప్పుడు మరింత శక్తిశాలి కిరణాలను ఆత్మలకు ఇవ్వండి, అప్పుడు వారికి స్పష్టమవుతుంది. చేరుకుంటున్నాయి, మొదలయ్యాయి, కానీ కొద్ది కొద్దిగా కొంతమంది ఇచ్చే కిరణాలే చేరుకుంటున్నాయి, ఇప్పుడు వీటిని మరింత శక్తిశాలిగా చేయండి. దీనిలో విఘ్నంగా అయ్యేది, వారి వరకు చేరుకోవడంలో కారణంగా నిలిచేది ఏమిటి? మీరు యోగం చేస్తారు, అమృతవేళ కూర్చుంటున్నారు కానీ జ్వాలాముఖి యోగములో లోటు ఉంది. దీని కారణంగా ఏ భక్తులకైతే, ఎవరికైతే మీరు కిరణాలను పంపుతున్నారో అవి స్పష్టంగా ఉండటం లేదు. రెండు, జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగ శక్తి లేని కారణంగా లేక లోటు ఉన్న కారణంగా మధ్యలో విఘ్నంగా మారే సంస్కారాలు సమాప్తమవ్వడం లేదు. సంస్కార పరివర్తనకు పురుషార్థం చేస్తున్నారు, అవి మరణిస్తున్నాయి కానీ కాలడంలేదు. రావణుడిని కేవలం చంపడం జరుగదు, చంపిన తర్వాత కాలుస్తారు కూడా ఎందుకంటే చంపిన తర్వాత శరీరమైతే ఉంటుంది కదా! అదే విధంగా మీరు అమృతవేళ యోగములో అయితే కూర్చుంటున్నారు కానీ యోగాగ్ని రూపంలో, జ్వాలా రూపంలో లోటు ఉంది. మిలనం చేసుకుంటారు, రూహ్రుహాన్ చేస్తారు, మీ జీవితంలోని విషయాలు కూడా చర్చిస్తారు. కానీ నిరంతరం యోగాగ్ని రూపం ఉండాలి. సంస్కారాలను తప్పకుండా చంపుతున్నారు కానీ అవి మధ్యలో లేచి కూర్చుంటున్నాయి. కాలిపోతే నామరూపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు పిల్లలందరూ, ఎంత అనుకుంటామో అంతగా ఉండలేకపోతున్నాము అని రూహ్రుహాన్లో అంటున్నారు.
మరి బాప్‌దాదా ఈరోజు సూచన ఇస్తున్నారు ఎందుకంటే స్పెషల్ మహావీర్ పిల్లలు మీటింగ్ కోసం వచ్చారు. మధువన నివాసులు అనగా ఏమిటి? మధువనంలో ఏముంది, మధువనం అనగా బాబా. మధువనం అనగానే అందరికీ ఏమి గుర్తుకు వస్తుంది? మధువన బాబా. మరి మధువనంవారు విశేషంగా ఈ విషయంలో అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. మధువనం అనగానే మధువన బాబా గుర్తుకు వస్తారు కదా! మధువనంలో ఉండేవారిని ఏ దృష్టితో చూస్తారు? మధువనంవారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. క్రిందివారు, పైనవారు అందరూ, ఈరోజు సభలో అందరికన్నా ఎక్కువ మధువన నివాసులు ఉన్నారు. ప్రతి మధువన నివాసి ముఖములో, నడవడికలో బాబా, బాబా కనిపించాలి. ఈ అద్భుతాన్ని మధువన నివాసులు తప్పకుండా చేస్తారు కనుక బాప్‌దాదాకు చాలా సంతోషంగా ఉంది. మాటలలో బాబా కనిపించాలి ఎందుకంటే మధువనంలో చేసిన యజ్ఞ సేవకు ఫలము, బలము చాలా లభిస్తాయి. తీసుకునేవారు తీసుకుంటారు, కానీ లభిస్తుంది. సంస్కారాలను చూడటంలో మరియు సంస్కారాలను కలుపుకుపోవడంలో సదా ఇంకా అటెన్షన్‌ను తప్పక ఇవ్వాలి. బాప్‌దాదాకు ప్రతి మధువన నివాసిపై విశేషమైన ప్రేమ ఉంది, ఎందుకని? బాబా స్థాపించిన యజ్ఞ సేవలో స్వయాన్ని సమర్పించుకున్నారు. మధువన నివాసులకు, ఒకటి, తమ పురుషార్థ ఫలితము లభిస్తుంది, రెండు, మధువనానికి వచ్చే బ్రాహ్మణులు కావచ్చు, క్రొత్త ఆత్మలు కావచ్చు, వారి సేవ, యజ్ఞ సేవ, సాధారణ సేవ కాదు, యజ్ఞ సేవకు ఎక్స్ట్రా పుణ్యము కూడా లభిస్తుంది. ఒకవేళ ఏ మధువన నివాసి అయినా అమృతవేళ నుండి రాత్రి వరకు బాప్‌దాదా ఇచ్చిన శ్రీమతమనుసారంగా నడుచుకుంటారో వారికి ఎక్స్ట్రా పుణ్యము లభిస్తుంది. మధువనంవారికి తెలిసినా తెలియకపోయినా, నిర్లక్ష్యంగా ఉన్నాకానీ మధువన సేవా పుణ్యము లభిస్తుంది. మధువన నివాసిగా అవ్వడము సాధారణ విషయము కాదు. ఎవరు ఎటువంటి పని చేస్తున్నాకానీ, శుభ్రపరిచే కార్యాన్ని చేయిస్తున్నారనుకోండి. ఇటువంటి సాధారణ కర్మకు కూడా పుణ్యము చాలానే ఉంటుంది. ఎందుకంటే బాబా రచించిన యజ్ఞము ఇది. ఈ యజ్ఞమునుండే, మధువనంనుండే అందరికీ పరమాత్మ ప్రేమ ప్రాపిస్తుంది. కావుననే మధువనంలో తప్ప బాబా మరెక్కడా రారు. బాబా రావడము, కలవడము, కలిపించడము వంటి పాత్ర ఈ మధువనానికి ఫిక్స్ అయిపోయింది. కావున మధువన నివాసులు ప్రతి ఒక్కరూ తమ పుణ్య ఖాతాను తెలుసుకోండి, గుర్తించండి, మరియు ఆ మహాన్ ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. ఏది ఏమైనా, పెద్దవారి వరకు చేర్చడము మీ కర్తవ్యము. చేర్చారు అంటే మనసు నుండి తీసివేసినట్లు, మీ బాధ్యత పూర్తయింది. అప్పటికీ ఏమీ సక్రమంగా జరగట్లేదు అని మీకనిపిస్తే అందులో మీకు పాపము ఏమీ ఉండదు. ఎవరు బాధ్యులో వారికి పాపము అంటుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. ఇవ్వడము మీ పని కానీ ఏమి జరిగింది, ఏమి జరగలేదు, ఇది ఎందుకు జరగలేదు, అది ఎందుకు జరగలేదు, ఇది మీకు అవసరం లేదు. ఇలా ఆలోచిస్తే మరింత వ్యర్థం వస్తుంది. మీ బాధ్యత మీరు చేయండి, చేర్చండి. కానీ చేర్చిన తర్వాత, చేర్చడం కూడా పద్ధతి ప్రమాణంగా చేయాలి. మధువన నివాసులు బ్రాహ్మణులు, ఉన్నతులు, మీ హోదాను ఎరిగి కర్తవ్యాలను చేయండి. మీరు చేసే కర్తవ్యాలను విని అందరూ నేర్చుకునే విధంగా మీ కర్తవ్యాలు ఉండాలి. మధువన నివాసులపై అందరి భావన ఉంటుంది. ఇటువంటి భావన కలిగినవారికి భావన యొక్క ఫలితాన్ని చూపించండి. మధువన నివాసులలో కూడా కొంతమంది చాలా మర్యాదాపూర్వకముగా, స్వపురుషార్థి, బాబాకు స్నేహిగా అయ్యి సహయోగాన్ని ఇచ్చే పిల్లలు కూడా ఉన్నారని బాప్‌దాదాకు తెలుసు. కానీ బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారంటే, మధువన నివాసుల నుండి బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారు? బాబా సంతానమైన ప్రతి మధువన నివాసి యజ్ఞ స్నేహి, సహయోగిగా అయ్యి తమ నడవడిక ద్వారా అందరికీ బాబా పరిచయాన్ని ఇచ్చి మధువన నివాసుల భాగ్యము ఎంత గొప్పది అని తమ భాగ్యాన్ని ప్రసిద్ధి చేయండి ఎందుకంటే యజ్ఞ నివాసులు కదా, పరమాత్మ ముందుగా ఏమి రచించారు? యజ్ఞాన్ని రచించారు. యజ్ఞ భూమికి నిమిత్తము ఈ మధువనము. మధువన మహిమ తెలుసు కదా. మధువన మహిమ గురించి తెలిసినవారు చేతులెత్తండి. బాప్‌దాదా ఇక్కడ (ఎదురుగా టి.విలో) చూస్తారు. అచ్ఛా, చాలా మంచిది.
బాప్‌దాదా చాలా చాలా శక్తిశాలి హృదయ ప్రేమను, హృదయం నుండి ఆశీర్వాదాలను ప్రతి మధువన నివాసికు ఇస్తున్నారు. మహారథులను, మీటింగ్వారిని చూసి వాహ్ పిల్లలు వాహ్! అన్న పాటను మనసులో పాడుకుంటున్నారు. కానీ ఎవరైతే మీటింగ్‌లో వచ్చారో వారు ఒక్క విషయంలో ముందుకు వెళ్ళవలసి ఉంది. ఎవరైతే, ఎంతమందైతే మీ సేవా సహచరులు ఉన్నారో, వారిని సదా తమ సంతోషము మరియు ప్రాప్తితో సంతుష్టపరచండి. ఒకవేళ శిక్షణ ఇచ్చినాకానీ శిక్షణతో పాటు స్నేహాన్ని కూడా ఇవ్వండి. మీరిచ్చే స్నేహము యొక్క ఆధారంతో వారు ముందుకు వెళ్ళగలగాలి. మీ స్నేహాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండకండి. మేము ఏమి చేసినా ఫర్వాలేదు అని మీ స్నేహం కారణంగా ఎదుటివారు భావించకూడదు. ఇటువంటి స్నేహాన్ని ఇవ్వకండి. నిమిత్తమైనవారిని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అటెన్షన్ కూడా ఇస్తూ ఉంటారు కానీ మరింత అటెన్షన్‌ను ఇస్తూ సంతుష్టపరచండి కూడా. విశ్వానికి సంతుష్టత యొక్క కిరణాలను అందేలా చేయడము కూడా నిమిత్తమైనవారు చేయాలి. ఎందుకంటే నిమిత్తమైనవారు తమ తమ హ్యాండ్స్‌ను, సంస్కార పరివర్తన చేసుకోవడంలో కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. సేవ చేయిస్తారు, ఉండటానికి, తినడానికి మెజారిటీ సెంటర్లు ఏర్పాట్లు కూడా చేస్తాయి కానీ వారిలో శక్తిని ఎంతగా నింపాలంటే బాబానుండి శక్తిని తీసుకుని మీ సేవాస్థానంలో వాయుమండలాన్ని ఎలా తయారు చెయ్యాలంటే ఎవరు మొదట వచ్చినా వారిని వాయుమండలం ఆకర్షించాలి. ఎందుకంటే రాగానే ఏదో ఒక అనుభవం అవ్వాలని ఈరోజుల్లో అందరూ ఆశిస్తున్నారు. చూడగానే అనుభవం కావాలనుకుంటున్నారు. వినడం ద్వారా అనుభవం అవుతుంది, యోగము యొక్క అనుభవం కూడా ఉంటుంది కానీ వాయుమండలం యొక్క అనుభవం కూడా జరగాలి. ఇందులో విశేష అటెన్షన్ పెట్టడము నిమిత్త ఆత్మల విశేష సేవ. స్వయం ఒకవేళ యోగయుక్తంగా అయ్యి వాయుమండలంలో చక్కగా స్థితి అయితే దాని ప్రభావం సేవాస్థానంపై ఆటోమేటిక్‌గా పడుతుంది. ఎలా అయితే బాప్‌దాదా, నిమిత్తమైన పెద్దవారి వాయుమండలం, వైబ్రేషన్ల ప్రభావం పడుతుంది కదా. బాప్‌దాదా యొక్క వాయుమండలం మారుతుంది కదా. కావున పిల్లలు ప్రతి ఒక్కరూ వాయుమండలాన్ని తయారు చేయడంలో అటెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు సెంటర్ల వాయుమండలం మారితేనే ప్రపంచ వాయుమండలం మారుతుంది. మీ సేవాస్థానమే నిమిత్తమవుతుంది. పురుషార్థము ఉంది, లక్ష్యము ఉంది కానీ ఈ లక్ష్యాన్ని మరింత పవర్‌ఫుల్‌గా చేయండి. ఎవరిని చూసినా, లోకులు ముఖాన్ని చూసి వైబ్రేషన్లను అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే వారి బుద్ధిలో అసుర శక్తి యొక్క ప్రభావం కూడా ఉంది, నాలెజ్ యొక్క ప్రభావం కూడా ఉంది. కావున మీటింగ్‌కు వచ్చినవారు ప్రతి ఒక్కరూ బాధ్యులే. లేకపోతే మీటింగ్‌లో పేరు ఎందుకు ఉంటుంది! ధైర్యముంది కదా అందుకే మీ పేరు ఇందులో ఉంది. కావున మీ కర్తవ్యాన్ని ప్రత్యక్షం చెయ్యండి. చేయాలనుకుంటారు కూడా, బాప్‌దాదాకు తెలుసు. చేయడానికి ప్రయత్నం కూడా చేస్తారు కానీ ప్రయత్నాన్ని కొద్దిగా పెంచండి. అర్థమయిందా!
ఈరోజు ప్రత్యేకంగా పిలిచారు, ప్రేమ పాఠంలో అయితే గెలిచారు. మధువనంవారి సంకల్పం ఉండచ్చు, మీరు పిలిచే ప్రాక్టికల్ శక్తి కావచ్చు. ప్రేమతో, నషాతో చెప్పారు. మధువనంవారు కూడా చెప్తూ వచ్చారు కానీ మిమ్మల్ని కలవడం ద్వారా డబల్ అయిపోయింది. అచ్ఛా. ఇప్పుడు ఇంకేమైనా చెప్పేది ఉందా, ఇప్పుడు బాప్‌దాదా అందరి రిజల్టును చూడాలనుకుంటున్నారు. మధువనంవారు కావచ్చు, మీటింగ్వారు కావచ్చు, ఇద్దరి రిజల్టును చూడాలనుకుంటున్నారు. జగదంబ యొక్క విశేష పురుషార్థమేదైతే ఉందో, బాబా చెప్పడము మరియు జగదంబ చెయ్యడము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీ దీదీ అంటూ ఉండేవారు కదా. ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలన్నది మీ దాదీ సంకల్పము. కర్మాతీతంగా అయ్యేందుకు క్లాసులు చేయించడము, కర్మాతీతంగా అయ్యేందుకు ఉత్సాహాన్ని ఇచ్చేవారు. పాండవులను విజయులు అని అంటారు. విజయి పాండవులు అన్న గాయనము ఏదైతే ఉందో, పాండవులు అనగానే ఏమి గుర్తుకు వస్తుంది? విజయము. అక్షోణి సైన్యము ఉన్నప్పటికీ పాండవులు అనగానే విజయము గుర్తుకు వస్తుంది. పంచ పాండవులే కానీ విజయులు. ఎటువంటి వాయుమండలం ఉన్నప్పటికీ, అక్షోణి సైన్య వాతావరణము ఉన్నాకానీ పాండవులు, పాండవపతి యొక్క శ్రీమతంతో విజయులుగా అయ్యారు. విజయము యొక్క పేరును ప్రసిద్ధి చేసారు. ఇప్పుడు ఆ పాండవులే విజయులుగా అయ్యి ఇతరులకు కూడా విజయాన్ని ఇచ్చేవారు. పాండవులను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ఏ విషయంలో సంతోషిస్తున్నారు? శక్తులకు తోడుగా నిలిచినందుకు. శక్తులకు సహయోగాన్ని ఇచ్చి ముందుకు నడిపించడంలో తోడుగా ఉన్నారు. ఎలా అయితే బాబా శక్తులకు శివశక్తులు అన్న మంత్రాన్ని ఇచ్చి కంబైన్డుగా చేసారో, అలాగే పాండవులు కూడా తమలోని విశేషతలతో శక్తులకు సహయోగాన్ని ఇస్తూ శక్తులను ముందుంచే మంచివారు, సదా మరింత మంచిగా అయ్యి ముందుకు వెళ్ళేవారు. అచ్ఛా.
బాప్‌దాదా ఈరోజు మీ స్నేహాన్ని చూసి మీ అందరికీ స్నేహ హారాన్ని వేస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరికీ స్నేహ సహయోగముల హారాన్ని వేయండి. బాహువుల హారము కాదు, మనసు ద్వారా సహయోగము అను హారాన్ని వేయండి. బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, పిల్లలు ప్రతి ఒక్కరి జేబులో సహయోగము అను నోట్లు ఉండాలి. పొరపాట్ల నోట్లు కాదు, సహయోగపు నోట్లతో జేబు నిండి ఉండాలి. ఎక్కడ చూసినా, సహయోగము అవసరమైనప్పుడల్లా సహయోగపు నోట్లు ఉండాలి. జేబులో ఉన్నాయా? నిండుగా ఉన్నాయా? ఖాళీగా లేదు కదా? మీరు సహయోగపు నోట్‌ను ఇవ్వండి, వారు మీకు ఆశీర్వాదాల హారాన్ని వేస్తారు.
మరి మరుసటి సీజన్లో వచ్చినప్పుడు ఏ శుభవార్తను వినిపిస్తారు? సంస్కారాల సంస్కారం (సమాప్తము) జరిగిపోయింది. రెడీ? అందరూ రెడీగా ఉన్నారా? ఈ మొదటి లైన్ చేయి ఎత్తడం లేదు. చేతులెత్తారా! అందరూ ఎత్తారా! వెనుకవారు ఎత్తారా! అయితే అడ్వాన్సుగా ఈ శుభవార్తను వినిపిస్తారు కదా! సంస్కారాలను తొలగిస్తున్నారు కానీ కాల్చడంలేదు కావున మళ్ళీ తిరిగి వస్తున్నాయి. అందుకే సంస్కారాలను సంస్కారం చేయండి అని చెప్పడం జరిగింది. అణచద్దు, సంస్కారం చేయండి (కాల్చి వేయండి). ఎందుకంటే సమయాన్ని మీరు సమీపంగా తీసుకురావలసి ఉంటుంది. అడ్వాన్సు పార్టీలోని మీ విశేష ఆత్మలు, సూక్ష్మవతనవాసి అయిన బాబా వేచి ఉన్నారు. మీకు వారి సంకల్పాలు చేరుతున్నాయా? వారు డేట్‌ను అడుగుతున్నారు. మీ పెద్ద పెద్ద దాదీలు మరియు దాదాలు డేట్ కోసం వేచి ఉన్నారు. మరి వారికి డేట్ ఇస్తారా? ఇస్తారా? మొదటి లైన్వారు చెప్పండి. డేట్ ఇస్తారా? లేక వెయిట్ అండ్ సీ అంటారా! ప్రతి ఒక్కరూ ఇందులో ఏమి చెయ్యాలి? ప్రతి ఒక్కరూ తమలో ఉండిపోయిన సంస్కారాలను సంస్కారం చెయ్యండి. అప్పుడు సమయం సమీపంగా వచ్చేస్తుంది. సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి ఇదే పద్ధతి. విఘ్నాలు వేసేది మీలో మిగిలి ఉన్న సంస్కారాలే. మరి ఇప్పుడిక వచ్చే సీజన్ ప్రారంభానికి చాలా రోజులున్నాయి. రోజూ ఏదో ఒక సంస్కారానికి సంస్కారం చెయ్యండి. ఒక్కొక్క దానినీ చేస్తూ వెళ్ళండి, ఇన్ని రోజులున్నాయి. సంస్కారాల సంస్కారంలో వచ్చే సీజన్లో మేము చేతులెత్తుతాము అని ఎవరు చెప్తారు? వారు చేతులెత్తండి. అయిపోయిందా? చేతులైతే ఎత్తుతున్నారు. బాప్‌దాదా అడ్వాన్సుగా చాలా చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
బాబా అయితే మాటను నిలబెట్టుకున్నారు. మీరు కూడా మాటను నిలబెట్టుకోవడంలో తెలివైనవారే. బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారే. మేము బాబాకు ఎక్కడ ప్రియంగా ఉంటాములే అని ఎవ్వరూ అనుకోవద్దు. మేము వెనుక ఉన్నాము, మేము ఇది కదా అని అనుకోవద్దు. వెనుక ఉన్నవారు కూడా బాబాకు అతి అతి అతి ప్రియమైనవారు ఎందుకంటే బాబాను నా బాబా అని అన్నారు కదా.
నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరికైతే తెలిసిందో, దూరంగా కూర్చున్న పిల్లలకు కూడా బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు మరియు ఇన్ అడ్వాన్స్ విజయులుగా అయ్యే శుభవార్తకు రెస్పాన్స్‌గా హృదయంలో ఇముడ్చుకుంటున్నారు. ఇప్పుడు సాకరంలో చూస్తాము. అచ్ఛా. ఈరోజు ఇంకేమీ చేసేది లేదు కదా. కలవడము మరియు సంతోషపెట్టే పాత్ర మాత్రమే ఈరోజు ఉంది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా, మధువనంలోని ముఖ్య స్థానాల పేర్లను చెప్తూ ఉండండి మరియు ఆ స్థానంవారు చేతులెత్తుతూ ఉండండి.
(పాండవ భవనము, జ్ఞాన సరోవరము, శాంతివన్ నివాసులు, హాస్పిటల్, సంగమ్ భవన్, పీస్ పార్కు, మ్యూజియమ్, ఆబూ నివాసులు, కాలనీ సహితంగా అందరినీ గ్రూపులవారీగా నిల్చోబెట్టారు) అందరికన్నా ఎక్కువ శాంతివన్వారు ఉన్నారు.
నీలూ అక్కయ్యతో:- రథాన్ని మంచిగా సంభాళిస్తున్నారు, మనస్ఫూర్తిగా సేవను చేస్తున్నారు. అందుకే బాబా సహాయము మరియు మీరు నిమిత్తంగా అవ్వడము కార్యాన్ని నడిపిస్తున్నాయి. అందరికీ ఎంత ప్రియమైనవారు? మిమ్మల్ని అందరూ ఏ దృష్టితో చూస్తారు? కలిపించేవారు.
మున్ని అక్కయ్యతో:- మీరు కూడా మంచిగా యజ్ఞాన్ని సంభాళిస్తున్నారు, ఎకానమీతో నడవడము, నడిపించే విశేషత ఉంది. ఈ విశేషతను ప్రతి సమయము బాబా చూస్తూ ఉంటారు, బాగుంది.
మోహిని అక్కయ్యతో:- మీరు యోగబలంతో మరియు బాబా స్మృతితో స్వయాన్ని మంచిగా చేసుకున్నారు మరియు మంచిగా ఉంటారు. మీ బుద్ధిలో సాధన వచ్చేసింది కావుననే బాబా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. మిమ్మల్ని మీరు పద్ధతిగా పెట్టుకుని మీ పాత్రను మంచిగా నిర్వహించారు, నిర్వహిస్తూనే ఉంటారు.
దాదీ రతన్మోహినితో:- నలు వైపుల సేవను సంభాళించడంలో, మీ పాత్రలో మీరు సక్సస్‌గా ఉన్నారు మరియు సక్సస్‌గా ఉంటారు. అచ్ఛా.
ఈషూ దాదీతో:- మీరు ప్రారంభంనుండి బాబా రహస్యాలను తెలుసుకుని సాకార బాబాకు తోడుగా ఉంటూ అర్థం చేసుకున్నారు. కానీ గుప్తంగా ఉంటారు. గుప్తంగా ఉండటం కూడా మంచిదే కానీ అప్పుడప్పుడూ ప్రత్యక్ష రూపంలోకి కూడా రండి. అచ్ఛా.
దాదీ జానకితో:- యజ్ఞాన్ని సఫలత స్వరూపంగా చూడటంలో మీది ఎంతో అభిరుచి మరియు సేవ కూడా ఉంది. ఈ సేవతో బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. ఎంత వీలైతే అంత అనేకులను తమ సమానంగా బాబాకు ప్రియంగా మరియు అతీతంగా తయారు చేస్తున్నారు. బాధ్యతగా భావించి నడుచుకుంటున్నారు, ఇందుకు బాప్‌దాదాకు గర్వంగా ఉంది. (40 సంవత్సరాల సందర్భంగా విదేశాలలో జరుపుకుంటున్నాము) సందేశము పంపుతాము.
డా. నిర్మల దీదీతో:- అసంభవాన్ని సంభవం చేసి చూపించడము మీ పని. బాప్‌దాదా ఆశిస్తున్న దాన్ని ప్రత్యక్ష రూపంలో తీసుకువచ్చి చూపించండి.
పర్దాదీతో:- మీరు అదృష్టవంతులు. ఇది మీ ముఖము ద్వారా కనిపిస్తుంది. ఈ విశేషత ఉంది.
ముగ్గురు అన్నయ్యలతో:- ఇప్పుడు ముగ్గురి అటెన్షన్ ఉన్నట్లయితే కలిసి ఏ విషయాన్ని అయినా స్పష్టం చేసి ఇతరులను, దాదీలను కూడా తోడుగా పెట్టుకునే అలవాటు చేసుకున్నారు కానీ ఈ అలవాటును పెంచుకుంటూ ఉండండి. దాదీలకు ఎంతో సమీపంగా వచ్చి మనసులో వచ్చిన ఆలోచనలను ఇస్తూ ఉండండి. సంకోచించకండి. దాదీలు కూడా సంకోచించకూడదు, మీరూ సంకోచించవద్దు. కలిసి యజ్ఞానికి నిమిత్తంగా అవ్వండి.
బృజ్‌మోహన్ అన్నయ్యతో:- మీ ప్రోగ్రామ్ మంచిగా అవుతుంది.
రమేష్ అన్నయ్యతో:- (సోమనాథ్ వద్ద సేవాస్థానాన్ని నిర్మించడానికి భూమి లభిస్తుంది, ఇందుకు బాప్‌దాదా ప్రేరణ ఏమిటి అని రమేష్ అన్నయ్య బాబాకు సందేశము పంపారు) ఇప్పుడు ఏమి చెయ్యాలంటే, ఎందుకంటే రెండు జోన్లు ఉన్నాయి, ఒకటి గుజరాత్, రెండు బాంబే. ముందుగా గుజరాత్లో మీటింగ్ చెయ్యండి. గుజరాత్ చుట్టుప్రక్కల జరుగుతున్న సేవ యొక్క రిజల్టును చూడండి. ఆ రిజల్టు ఆధారంగా ఆ మందిరంవైపు ఎవరు దగ్గరగా ఉన్నారో వారి సేవలను చూడండి, అక్కడ మార్జిన్ ఉంది. అదైతే తెలుసు, ఎక్కడ మందిరముందో అక్కడ చేస్తున్నారు కానీ అక్కడ అంత పెద్ద సేవలు జరిగే పరిస్థితులను చూడండి. బాంబే మరియు గుజరాత్‌లోని 5-6 మంది పరస్పర సలహా తీసుకోండి. ఎక్కువమందిని పిలవకండి. మీటింగ్ చేయండి. మీవద్ద ఏమి జరుగుతుందో మీరు చెప్పండి, గుజరాత్ కూడా అక్కడి రిజల్టును వినిపిస్తుంది. మందిరం చుట్టుప్రక్కల రిజల్టు ఏమిటి అన్న రిజల్టును ముందుగా ఆలోచించండి.
(బాప్‌దాదా యొక్క ప్లాటినమ్ జూబ్లీ జరిగింది, అందరూ బాప్‌దాదాను అలంకరించారు, పూల మాలలు వేసారు, కేక్ కట్ చేసారు, పాటలు పాడారు) అచ్ఛా!
ఓంశాంతి