Search for a command to run...
31 Mar 2011
దృఢ సంకల్పము ద్వారా టెన్షన్ ఫ్రీ కు ఉదాహరణగా అయ్యి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి, మనసా శక్తి ద్వారా దుఃఖంతో ఉన్న ఆత్మలకు సంతోషాన్ని వరదానంగా ఇవ్వండి
31 March 2011 · తెలుగు
ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, కోట్లలో కొద్ది మంది, కొద్దిమందిలో కూడా అతి కొద్దిమంది అయిన తమ పిల్లల భాగ్య రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం నుండి దివ్యంగా మెరుస్తున్న సితార యొక్క మెరుపు కనిపిస్తుంది. నయనాలలో స్నేహపు రేఖను చూస్తున్నాము. నోటి నుండి జ్ఞాన రేఖను చూస్తున్నాము. హృదయంలో హృదయాభిరాముడి లవలీన రేఖలు చూస్తున్నాము. చేతులలో జ్ఞాన ఖజానాల రేఖను చూస్తున్నాము. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నాము. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ రేఖలలో నంబరువారీగా సంపన్నంగా ఉన్నారు. ఇటువంటి భాగ్యము మీకు తప్ప మరెవ్వరికీ లేదు. మీ ఈ శ్రేష్ఠ భాగ్యము ప్రతి ఒక్కరి నుండి మెరుస్తూ కనిపిస్తుంది మరియు ఈ భాగ్యము అవినాశిగా అయిపోతుంది, ఎందుకని? ఎందుకంటే ఇచ్చేవారు అవినాశి తండ్రి కనుక. ఈ సంగమయుగంలోనే ఇంతటి శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తిస్తుంది, అది భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ సంగమయుగము సర్వ ప్రాప్తుల యుగము. ఎవరు ఎంతగా తమ భాగ్యాన్ని జమ చేసుకుంటారో అంతగా అనేక జన్మలు భాగ్యము యొక్క ఫలితము కలుగుతుంది. ఈ సంగమయుగ మహిమ గురించి పిల్లలైన మీకే తెలుసు. సంగమయుగ ప్రాప్తులు పూర్తి కల్పంలోనూ శ్రేష్ఠాతిశ్రేష్ఠమైనవి.
బాప్‌దాదా ఏమి చూస్తున్నారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ సంగమయుగ ప్రాప్తులతో ఎంత సంపన్నంగా ఉన్నారు? మీరందరూ కూడా సర్వ ప్రాప్తుల అనుభవంలో సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడా? అవినాశి తండ్రి అయినప్పుడు ప్రాప్తులు కూడా అవినాశిగా ఉంటాయి. బాప్‌దాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు, తెలుసు కదా! పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారిగా అవ్వాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. స్వయంపైన అనగా కర్మేంద్రియాలపైన, మనసు-బుద్ధి-సంస్కారాలపైన రాజుగా అయ్యి రాజ్యం చెయ్యాలి. భవిష్యత్తులో అయితే రాజ్యాధికారిగా అవుతారు కానీ ఇప్పుడైతే స్వరాజ్య అధికారిగా అవ్వాలి కదా. ఏ కర్మేంద్రియమైనా మీ కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే బాబా ద్వారా సర్వ శక్తుల ఖజానా ప్రాప్తించింది. కావున బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ స్వరాజ్య అధికారి రాజు రూపంలో చూడాలని ఆశిస్తున్నారు. మరి మీరందరూ స్వరాజ్య అధికారులుగా అయ్యారా? మనసు, బుద్ధిపై రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వచ్చాయా? అధీనత లేదు కదా? అధికారులు మీరు. బాప్‌దాదాను తోడుగా పెట్టుకున్నప్పుడు, ఒంటరిగా అవ్వనప్పుడు, బాబాను సదా సహచరునిగా చేసుకుని ఉన్నందువలన ఈ మనసు బుద్ధి సంస్కారాలు వేటికీ కూడా కంట్రోల్లో లేకుండా ఉండేంత శక్తి ఉండదు. అందుకే సదా తండ్రి తోడును మర్చిపోకుండా ఉండేందుకు బాప్‌దాదా శక్తులకు ఏ స్వరూపాన్ని గుర్తుంచుకోమని చెప్తారు? మేము శివశక్తులము. శివుడు మరియు శక్తి రెండూ కలిసి ఉన్నారు. ఈ స్మృతి మాయాజీత్, ప్రకృతిజీత్గా స్వతహాగా చేస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రకృతి తన పని చేసుకుంటూ ఉంటుంది అని బాప్‌దాదా వినిపించి ఉన్నారు. ప్రకృతిని కూడా మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కావున ప్రకృతి కూడా విసిగిస్తూ ఉంటుంది. ఈమధ్య కాలంలో ప్రకృతి ఎక్కడో ఒక చోట తన కార్యాన్ని చేస్తూ ఉండటాన్ని చూస్తూనే ఉన్నాము. కానీ మీరు ప్రకృతిజీతులుగా అయ్యి ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తున్నారు. లోకులైతే ప్రకృతిలోని అలజడులు చూసి రేపు ఏమవుతుందా అని భయపడుతున్నారు. కానీ అంతా ఎంతో మంచిగా జరుగనుంది అని మీకు తెలుసు ఎందుకంటే సంగమయుగము అనగా సృష్టి చక్రము యొక్క అమృతవేళ జరుగుతుంది. మరి అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయము. అంధకారము సమాప్తమై ప్రకాశము వస్తుంది. కావున ఇప్పుడిక మా రాజ్యము, సుఖమయ ప్రపంచము, సుఖమయ ప్రకృతి ఉండే రాజ్యము రానున్నదని మీకు సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది కదా! ఆ రాజ్యంలో దుఃఖము, అశాంతి నామమాత్రానికి కూడా ఉండవు ఎందుకంటే ఇప్పుడు సంగమంలో మీరు ప్రకృతిజీతులుగా అవుతున్నారు. మరి అందరికీ సంతోషంగా ఉంది కదా, ఏ విషయంలో? చెప్పండి, మా రాజ్యము రానుంది. ఈ సంతోషము ఉందా? ఎవరైతే ఈ సంతోషంలో ఉంటున్నారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. మీరైతే సంతోషంగా ఉంటున్నారు, ఇందుకు అభినందనలు. కానీ ఇటువంటి సంతోషమును దుఃఖంతో అశాంతిగా ఉన్న మీ సోదరాత్మలకు మీ తండ్రి నుండి తీసుకున్న కిరణాల ద్వారా సంతోష కిరణాలను అందజేస్తున్నారా? ఇటువంటి మనసా సేవను చేసేందుకు సమయాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఫిక్స్ చేసుకోవాలని బాప్‌దాదా చెప్పి ఉన్నారు. ఎలా అయితే ఇతర కార్యాలకు సమయము ఫిక్స్ అయి ఉన్నదో అలాగే తమ సంతోషపు ఔషధము ద్వారా బాధతో ఉన్న ఆత్మలకు మనసా శక్తి ద్వారా కొద్దిగా వరదానాలను ఇచ్చి వారిని కూడా సంతోషపరచండి. మరి ఎవరైతే మనసా సేవ కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా. ఫిక్స్ చేసుకోనివారు కూడా కొద్దిమంది ఉన్నారు. వారు కూడా ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే మన సోదరసోదరీలే కదా. దయ కలుగుతుంది కదా! లేక దయ కలగడం లేదా? కలుగుతుంది కదా! సంగమంలో విశేషమైనవి, అమూల్యమైనవి రెండు విషయాలు, ఒకటి సంకల్ప శక్తి, మరొకటి సంగమ సమయము ఎందుకంటే సంగమ సమయంలో ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. ఈ మధ్యలో బాప్‌దాదా ఏమి చూసారంటే చాలామందిలో అశుద్ధ సంకల్పాలు తక్కువగానే వస్తాయి కానీ వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఈ ఒక్క జన్మ విలువ అనుసారంగా ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు సమాప్తమైపోవాలి ఎందుకంటే సంగమ మహత్వము అనుసారంగా ఒక్క క్షణము ఎన్నో విలువైన క్షణాలకు అధికారిగా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ రెండు విషయాలను - సమయము మరియు సంకల్పము రెండింటి విలువను తెలుసుకుని సమయాన్ని మరియు సంకల్పాన్ని సఫలం చేయండి, స్థూల ఖజానాలను సఫలం చేసినట్లుగా సఫలం చేయండి. ఈ ఒక్క జన్మలో సఫలం చేయడం వలన అనేక జన్మలకు దాని ప్రాప్తి లభిస్తుందని మీకు తెలుసు. ఈ విధంగా ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంచుతూ సఫలం చేసి సఫలతామూర్తులుగా అవ్వండి.
బాప్‌దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికీ ఒక వరదానమును ఇస్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుండి స్వయాన్ని టెన్షన్ ఫ్రీ చేసుకోగలరా? ఈరోజు నుండి అటెన్షన్, నో టెన్షన్ అని దృఢ సంకల్పం చేయండి. పిల్లలు టెన్షన్లో ఉండటాన్ని చూసినప్పుడు అదే సమయంలో ఆ పిల్లల ఫోటోను తీసి వారికి పంపించాలని బాప్‌దాదాకు అనిపిస్తూ ఉంటుంది. నేనెలా అయిపొయ్యాను అని అప్పుడు పిల్లలకే అర్థమవుతుంది! బాప్‌దాదా మన్జీత్, జగత్జీత్గా చేయాలని ఆశిస్తున్నారు. టెన్షన్ ఎందులో వస్తుంది, మనసులోనే కదా వస్తుంది! మరి మీరైతే రాజులు కదా, స్వరాజ్య అధికారులు కదా! మనసు మీదా లేక మనసు యజమానిగా ఉందా? మీరేమంటారు? రోజంతా నా మనసు అని అంటారు కదా! మనసు మీకు యజమాని కాదు కదా! ఎవరు ధైర్యమును ఉంచగలరు? బాబా వరదానమైతే సహజంగానే లభిస్తుంది కానీ కేవలం కొద్దిగా అటెన్షన్ అవసరము. బాబా ఇచ్చిన వరదానపు సహకారాన్ని అనుభవం చేసి చూడండి. ఎప్పుడు చూసినాకానీ అందరి ముఖాలు ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీ, కమల పుష్ప సమానంగా మరియు వికసించిన గులాబీ పుష్పంవలె కనిపించాలి.
బాప్‌దాదా ఏమి చూసారంటే, పర్సంటేజ్ వ్రాసే పని ఏదైతే ముందు ఇచ్చి ఉన్నామో, ఆ సమాచారము అన్ని స్థానాలనుండి కొంత కొంత వచ్చింది. ఇక్కడ కూడా రిజల్టు తయారు చేసారు. అటెన్షన్ ఇచ్చినందుకు బాప్‌దాదా అభినందనలు తెలియజేస్తున్నారు కానీ సమయానుసారంగా ఇప్పుడిక వాణి ద్వారా వినేందుకు కూడా సమయము తక్కువ లభిస్తుంది కావున మనసా ద్వారా, తమ ముఖము మరియు నడవడిక ద్వారా సేవ చేయాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. ఇప్పటి అభ్యాసము రాబోయే సమయంలో ఉపయోగపడుతుంది. మరి ఈరోజు నుండి టెన్షన్ ఫ్రీ సంకల్పాన్ని తీసుకోగలరా? తీసుకోగలరా? తీసుకోగలరా? చేతులెత్తండి. టెన్షన్ ఫ్రీ. అచ్ఛా, అందరి ఫోటో తియ్యండి. చాలా మంచిది. ఎవరైతే పరిస్థితుల కారణంగా చాలా టెన్షన్లో ఉంటారో, ఈరోజుల్లో టెన్షన్ చాలా పెరిగిపోయింది. మీ టెన్షన్ ఫ్రీ అనుభవము, టెన్షన్ ఫ్రీ నడవడిక మరియు ముఖము వారి ఎదుట ఆధారమూర్తిగా అవుతాయి. ఒకవేళ ఈనాటి ప్రపంచాన్ని చుట్టి వచ్చినా లేక సమాచారము విన్నా ఏముంటుంది? అల్పకాలికంగా స్వయాన్ని సంతోషపరుచుకోవడానికి సాధనాలు తయారు చేస్తూ ఉన్నారు. కావున టెన్షన్లో ఉన్నవారికి టెన్షన్ ఫ్రీ కి ఉదాహరణగా అయ్యి చూపించండి అప్పుడు వారికి కూడా ఆధారము లభిస్తుంది. మరి సంకల్పం చేసారా, టెన్షన్ ఫ్రీ అయి ఉంటాము అని మీ మనసులో సంకల్పం చేసారా? చేసారా? దృఢంగా చేసారా లేక సాధారణంగా చేసారా? ఎక్కడ దృఢత్వము ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉన్నది. చేస్తాము కాదు, చేయాల్సిందే. ఇష్టమేనా? ఇందులో చేతులెత్తండి.
బాప్‌దాదా ఒక విషయము ఏమి చూసారంటే చేతులెత్తి చాలా సంతోషపరుస్తారు. చేతులెత్తి అయితే సంతోషపరిచారు కానీ ఇప్పుడు ఏమి చేస్తారు? దృఢ సంకల్పానికి, సాధారణ సంకల్పానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. చేస్తాము మరియు చేయవలసిందే. మరి ఈ సీజన్‌కు, ఈ సంవత్సరానికి ఈరోజు చివరి రోజు, కానీ వచ్చే సీజన్లో బాప్‌దాదా ప్రతి చిన్న పెద్ద సెంటర్లు, మధ్యలో చాలా సమయము ఉంది, వచ్చే సంవత్సరపు సీజన్లో కారణము కాక నివారణ స్వరూపులుగా మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాము. టెన్షన్ నామరూపాలు కూడా ఉండకూడదు అని బ్రాహ్మణ పరివారంలో ఇంత ధైర్యము, ఉల్లాసము ఉన్నాయా? వీలవుతుందా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి, వీలవుతుందా? ఈ శుభవార్తను బాప్‌దాదా వినాలని ఆశిస్తున్నారు.
బాప్‌దాదా ఏమి చూసారంటే చేయాలి అన్న ఆశ అందరిలోనూ ఉంది, కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మిమ్మల్ని తనదిగా చేసేసుకుంటుంది. అప్పుడు చాలా మధురమైన మాటలను వినిపిస్తారు, ఇలా జరిగిపోతుంది కదా, ఇది అవుతుంది కదా! ఇలా అయితే ఫర్వాలేదు కదా! బాప్‌దాదాకు చాలా తియ్యని మాటలను వినిపిస్తారు. అన్నింటికీ నివారణ ఒక్కటే, రాజుగా అయిపోండి, చాలు. స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఈరోజు బాప్‌దాదా ఎదురుగా కూర్చున్నవారు కానీ, దూరంగా ఉన్నా హృదయంలో ఉన్నవారైనా కానీ, మీరైతే కళ్ళ ఎదురుగా ఉన్నారు, కానీ దూరంగా కూర్చుని ఉన్నవారిని బాప్‌దాదా హృదయంలో చూస్తున్నారు.
ఈరోజు మధువనంలో కూడా చిన్న చిన్న గీతా పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయని బాప్‌దాదాకు తెలుసు. పిల్లలు వచ్చారు. కింద కూర్చున్నవారికి, ఎక్కడెక్కడో కూర్చున్నవారికి అన్నింటికన్నా ముందుగా చాలా చాలా చాలా హృదయము యొక్క ప్రేమ మరియు ప్రియస్మృతులు. (ఈరోజు శాంతివన్లో 28 వేలమందికన్నా ఎక్కువ సోదరసోదరీలు చేరుకున్నారు) పిల్లలు కొద్దిగా కష్టాన్ని ఎదుర్కోవలసి రావడాన్ని బాప్‌దాదా చూసారు కానీ ఈ కష్టాన్ని కూడా సంతోషం కారణంగా అనుభవం చేయడం లేదు. అయినప్పటికీ పడుకోవడానికి మూడు అడుగుల నేల అయితే లభించింది కదా. ఎవరైతే పట్రాణి (నేల మీద పడుకున్నవారు) అయ్యారో వారికి బాప్‌దాదా విశేషమైన ప్రియస్మృతులు తెలియజేస్తున్నారు. అచ్ఛా, ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారో లేక బాప్‌దాదాను మొదటిసారి కలుసుకోవడానికి వచ్చారో వారు లేవండి. ఈరోజు మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్‌దాదా క్రొత్త బ్రాహ్మణ పరివారంలోకి విచ్చేసినందుకు తమ తరఫున మరియు బ్రాహ్మణ పరివారము తరఫున చాలా-చాలా అభినందనలు తెలుపుతున్నారు ఎందుకంటే టూ లేట్ సమయంలో అయినా కానీ వచ్చారు కదా. బాప్‌దాదాను మరియు పరివారాన్ని అయితే చూసారు కదా. బాప్‌దాదా ఏమంటారంటే మీరు కావాలనుకుంటే ఈరోజు మొదటిసారిగా వచ్చినవారికి ఒక విశేష వరదానము, ఒకవేళ మనస్ఫూర్తిగా కావాలనుకుంటే - లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ముందుకు రాగలరు. బాప్‌దాదాకు మరియు పరివారానికి మీ అందరిపై ఎంతో ప్రేమ ఉంది. సహయోగిగా అవుతారు, స్నేహాన్ని ఇస్తారు మరియు మిమ్మల్ని ముందుకు పంపుతారు. అవకాశాన్ని ఇస్తారు. కావున ఈరోజు వచ్చిన వాళ్ళకు ముందుకు వెళ్ళే అవకాశం డ్రామా అనుసారంగా మంచిగా లభించగలదు. మీరు ఎక్కడి నుండి వచ్చినాకానీ పూర్తి పరివారము మీకు సహయోగిగా అవుతుంది. మీరు సహజయోగిగా అవ్వండి. అచ్ఛా.
సేవ టర్న్ రాజస్థాన్ మరియు భోపాల్ జోన్ వారిది:- బాప్‌దాదా ఏమి చూసారంటే ఏ జోన్ అయితే సేవ టర్న్‌లో వస్తుందో అక్కడినుండే క్రొత్త ఆత్మలు ఎక్కువగా వస్తున్నాయి. బాగుంది. రాజస్థాన్ వారైతే సగం క్లాసు ఉన్నారు. రాజస్థాన్ ధరణి బ్రహ్మా బాబాకు చాలా ఇష్టమైనది, అందుకనే రాజస్థాన్‌లోనే మధువనాన్ని తయారు చేసారు. రాజస్థాన్‌లోని ప్రతి స్థానంలో కూడా ఇప్పుడు సేవ మంచిగా వృద్ధి అవ్వడాన్ని బాప్‌దాదా చూసారు. క్రొత్త క్రొత్త ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ మంచిగా అవుతున్నాయి. కానీ బాప్‌దాదా అందరికీ ఏమని చెప్తున్నారంటే, ప్రతి సేవాకేంద్రము యజ్ఞ స్నేహి వారసులను, ఎటువంటి గ్రూపును తయారు చెయ్యాలంటే స్వయం కూడా ముందుకు వెళ్తూ ఇతరులను కూడా యజ్ఞ స్నేహిగా చెయ్యాలి. క్రితంసారి కూడా బాప్‌దాదా ఏమన్నారంటే యజ్ఞ స్నేహి, సేవ స్నేహి మరియు సఫలం చెయ్యడంలో సదా చాలా ముందుండే వారి సంఖ్య వృద్ధి అవుతుంది, మంచిది. సందేశమును ఇచ్చే కార్యంలో కూడా ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు. స్వ మరియు సేవ రెండింటిలోనూ బ్యాలెన్సు పెట్టేవారు ఇప్పుడు ప్రతి సెంటరులోనూ చాలా ముందుకు రావాలి. కేవలం సేవ కాదు, స్వ మరియు సేవ ఎందుకంటే ఇప్పుడు స్వ పరివర్తనకు ఎక్కువ సమయం లేదు. కావున ముందు స్వ, దానితోపాటు సేవ. ప్రతి సేవాకేంద్రము నిర్విఘ్నంగా, తోటివారందరూ నిర్విఘ్నంగా, కేవలం టీచర్ కాదు పూర్తి క్లాస్ నిర్విఘ్నంగా మరియు స్వ పరివర్తనపై అటెన్షన్ ఉంచేవారిగా అవ్వాలి. మరి ఈ వృద్ధిని చేయండి. ఒక్కొక్కరి విషయాలను వినండి మరియు వారికి ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలను పెట్టండి, ఇలా బాప్‌దాదాకు నిర్విఘ్న సెంటరు గురించి సమాచారము రావాలి. రాజస్థాన్ కూడా ముందుకు వెళ్తుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ముందుకు వెళ్ళేందుకు అభినందనలు తెలుపుతున్నారు.
భోపాల్ జోన్:- అచ్ఛా, ఈ జోన్ కూడా తమ పరివర్తన మరియు సేవ వృద్ధిలో మంచిగా ముందుకు వెళ్తుంది. పిల్లలు స్వ కోసం ప్లాన్ వేసుకోవడంతో పాటు ప్రాక్టికల్లోకి తీసుకురావడాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. పిల్లలు సదా ముందుకు వెళ్తూ ఉండాలన్నది బాప్‌దాదా ఆశ. ప్రతి ఒక్క జోన్లో ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలున్నాయి కావున సేవలలో తమ తమ స్థానాలలో వృద్ధిని తీసుకువస్తున్నారు. బాప్‌దాదా భవిష్యత్తు కోసం కూడా అభినందనలు తెలుపుతున్నారు, ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరసోదరీలతో:- విదేశీయులకు డబల్ విదేశీయులు అన్న పేరు ఇవ్వడం జరిగింది. విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. డబల్ విదేశీయులు అన్న టైటిల్ అనుసారంగా మెజారిటీ పిల్లలకు డబల్ నషా ఉంటుంది. డబల్ నషా ఏమిటి? మేము డబల్ ఉల్లాస ఉత్సాహాలలో ఉంటాము. ఉల్లాస ఉత్సాహాలు మంచిగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. అక్కడ ఒక్క లండన్ స్థాపన అయ్యింది, ఈరోజు డబల్ విదేశీయులు అనేక స్థానాలలో సేవ చేసి అందరినీ బాప్‌దాదా మరియు బ్రాహ్మణ పరివారానికి చెందినవారిగా చేసారు. చేయాలి అన్న లక్ష్యము కూడా చాలా మంచిగా ఉంది కావుననే ఋజువుగా ఉన్నారు. మొదట్లో తమ టర్నులో మాత్రమే వచ్చేవారు, ఇప్పుడు మెజారిటీ ప్రతి టర్నులో చేరుకుంటున్నారు. ఇందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. భారతవాసులకన్నా విదేశీయులు ముందుకు వెళ్తున్నారు అని భారతవాసులకు విదేశీ పిల్లలను చూసి ఉత్సాహము వస్తుంది. విదేశీ పిల్లలు ముందుకు వెళ్తున్నప్పుడు మనం వెనుక ఉండిపోకూడదు. భారతవాసులకు కూడా ఉత్సాహము వస్తుంది. పురుషార్థంలో కూడా చూసినట్లయితే ఇప్పుడు విదేశీయుల వద్దకు పరీక్షలైతే వస్తాయి కానీ వారిలోని విశేషత ఏమిటంటే సత్యమైన హృదయంతో చెప్పేస్తారు. లోపల పెట్టుకోరు, అంతే కాక దానికి సమాధానము కూడా సత్యమైన హృదయముతోనే చేస్తారు. సత్యమైన హృదయము ఉన్నప్పుడు హజూర్ హాజరు అవుతారు. మంచి రిజల్టును చూసి బాప్‌దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు అని వరదానము కూడా ఇస్తున్నారు. టీచర్లు కూడా మంచి కృషి చేస్తున్నారు. మధువన్ లాభాన్ని ఎక్కువగా విదేశీయులే తీసుకోవడం బాప్‌దాదాకు సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశములోని చిన్న చిన్న స్థానాలలో కూడా సందేశాన్ని వినిపించే సేవను ఆరంభించడాన్ని బాప్‌దాదా చూసారు. కావున సేవకు అభినందనలు, స్వ పరివర్తనకు అభినందనలు. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న దేశ విదేశాల పిల్లలు పురుషార్థంలో సహజంగా ముందుకు వెళ్తున్నందుకు, ముందుకు తీసుకు వెళ్తున్నందుకు బాప్‌దాదా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు రానున్న సమయము కోసం తీవ్ర పురుషార్థిగా అయ్యి సెకండులో బిందువు పెట్టడము, ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసము అతి ఆవశ్యకము. దీనిని తేలికగా తీసుకోకండి. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరుగవలసిందే కావున బాబాకు ఉన్న శుభ ఆశ ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ కలసి ఉన్నారు, కలిసి వెళ్తాము, బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యము చేస్తాము, శివబాబా సాక్షిగా అయిపోతారు. కలిసి ఉండేవారిగా అయ్యేదుంటే బాప్‌దాదా సమానంగా అవ్వవలసిందే. అచ్ఛా - పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా తరఫున ఈ సంవత్సరానికి అభినందనలు మరియు రానున్న సంవత్సరానికి కూడా సదా బాబా సమానంగా అవ్వవలసిందే అన్నందుకు అభినందనలు. అచ్ఛా.
మోహిని అక్కయ్యతో:- నేను చెయ్యవలసిందే అని అనుకున్నారు, చేసేసారు. ఇది మీలోని శక్తి. జరుగవలసిందే అని అర్థం చేసుకోండి.
దాదీ జానకితో:- (బాబా, మీరు అందరినీ ఎంతో ప్రేమ చేస్తారు, మేము మీకు ఏమి చేయగలము!) ప్రేమ ఉంది, మీ ప్రేమ చేరుకుంటుంది. (దాదీలందరితో) బాప్‌దాదా మీ అందరినీ చూసి సంతోషిస్తారు, ఎందుకని? ఎందుకని సంతోషిస్తారు? ఎందుకంటే యజ్ఞ రక్షకులుగా అయ్యి యజ్ఞాన్ని నడిపించడంలో నిమిత్తులయ్యారు. అందరూ నిమిత్తులు కదా.
(నిర్మల అక్కయ్య, రుక్మిణి దాదీతో):- అందరూ తమ ఆరోగ్యాలను సంభాళిస్తున్నారని బాప్‌దాదాకు తెలుసు. కానీ మీరు నిమిత్తులు కదా. నిమిత్తమైనవారు నడిపించవలసిందే. కావున ప్రతి ఒక్కరూ నిమిత్తంగా భావిస్తూ స్వయం నడవండి మరియు యజ్ఞాన్ని కూడా నడిపించండి. బాధ్యతాయుతమైన గ్రూపు. అర్థమయిందా. అందరూ ఒక్కొక్కరూ బాధ్యత కలిగినవారు.
పర్దాదీతో:- గదిలో కూర్చుని మీరిచ్చే సహయోగ కిరణాలు యజ్ఞంలో వ్యాపిస్తున్నాయి. సదా సంతోషంగా ఉంటారు అందుకే ముఖము సదా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు, అదృష్టవంతులు.
డా. అశోక్ మెహతాతో:- ఇప్పుడు మంచిగా ఉన్నారా! బలహీనత తగ్గుతుందా? (ఇప్పుడు ఆపరేషన్ చేయడం ప్రారంభించారు) ఎంతగా నడుస్తూ ఉంటారో అంతగా మంచిగా అవుతూ ఉంటారు. మంచి పాత్రను నిర్వహించారు కానీ ఒక విషయంపై శ్రద్ధ ఉంచండి - బుద్ధిని సదా బాబాతో ఉంచండి. బుద్ధిలో ఇతర విషయాల ప్రభావాన్ని పడనివ్వకండి. ఎందుకంటే ఇది బుద్ధియోగము యొక్క సంపాదనయే. గడిచిందేదో గడిచిపోయింది, దాని చింతన, వర్ణన వద్దు. అందులో కూడా నష్టం నుండి లాభాన్ని చూడండి ఎందుకంటే బాబాకు నిమిత్తమైన ఆత్మ కదా మీరు. మరి మీలో బాబా కనిపించాలి. వీరు బాబావలె ఉన్నారు, తండ్రి సమానంగా అని అందరూ అనాలి. ఇలా వీలవుతుందా? మీ బుద్ధిని చాలా సంతోషంగా, న్యారా మరియు ప్యారాగా (అతీతంగా మరియు ప్రియంగా) ఉంచండి అప్పుడు అద్భుతం జరుగుతుంది. పరివారంలో ఉదారహణగా అయిపోతారు. బాగుంది, ఏదైతే చేసారో అది మంచిది, ఇప్పుడు మరింత మంచి జరుగుతుంది.
ఆచార్య ప్రమోద్ క్రిష్ణమ్జీతో:- మీ పరివారాన్ని చూసారా! మీ ఇల్లు, మీ పరివారమే ఇది. మీ ఇంటికి వచ్చారు. నా సంతానము ఇంటికి చేరుకున్నందుకు తండ్రికి సంతోషంగా ఉంది.
పునీత్ ఇస్సర్తో:- (మహాభారతంలో దుర్యోధనుడి పాత్రను వేసారు) చూడండి, ఈరోజు మీ పరివారంలోకి చేరుకున్నారు. ఈ పరివారము మంచిగా అనిపిస్తుంది కదా! (అద్భుతము) మీరు కూడా ఇలా అయ్యి ఇతరులనూ తయారు చెయ్యాలి. మధువనానికి చేరుకున్నందుకు చాలా అదృష్టవంతులు. మధువనానికి చేరుకున్న వారి అదృష్టము సదా తెరుచుకుని ఉంటుంది. చాలా మంచిది. (మహాభారతంలో దుర్యోధనుడి పాత్రను వేసారు) ఇప్పుడు మారిపొయ్యారు, ఇప్పుడు దుర్యోధనుడు కాదు, ఇప్పుడు తండ్రి కార్యానికి సహయోగిగా అయిపోయారు.
బాప్‌దాదాను అనేక వి.ఐ.పిలు కలుస్తున్నారు :- (భగవతి ప్రసాద్ మినిస్టర్, ఉత్తర ప్రదేశ్, ధనంజయ్ ముండే, ఎమ్.ఎల్.ఎ. మహారాష్ట్ర మరియు పరివారము)
• మీ ఇల్లుగా అనిపిస్తుంటే మీ ఇంటికి వస్తూ ఉండండి. సదా సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి, ఇదే బాప్‌దాదా ఇచ్చే వరదానము.
• చూడండి, ఎంతగా సహయోగిగా అవుతూ ఉంటారో అంతగా యోగిగా అవుతూ ఉంటారు. సేవలో సహయోగిగా అవ్వండి అప్పుడు యోగిగా అయిపోతారు. చదువును తప్పకుండా చదువుకోండి. ఈశ్వరీయ చదువులో ఎక్యురేట్.
• ఎలా నడుస్తున్నారో అలా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండండి, మంచిగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉండండి.
• తమ ఇంటిగా భావించి సహయోగిగా అయ్యారు, సహయోగి, యోగి. మరి కర్మయోగిగా అయ్యి పాత్రను నిర్వహిస్తున్నారు, నిర్వహిస్తూనే ఉంటారు. కర్మయోగి అన్న పదాన్ని గుర్తుంచుకోండి. కర్మ ఎంత చేసినాకానీ యోగి. యోగమును వదిలిపెట్టవద్దు. వీరు కూడా కర్మయోగి.
• చూడండి, మురళిపై ప్రేమ ఉందంటే దానర్థము బాబాపై ప్రేమ ఉంది అని. వారసత్వానికి అధికారులుగా అవ్వండి. అవుతారు.
• ఇప్పుడు ఈ కార్యాన్ని అయితే అర్థం చేసుకున్నారు, ఇప్పుడు ఇందులో ఎంతగా సహయోగిగా అవుతారో అంతగా యోగము కుదురుతుంది. కష్టము అనిపించదు ఎందుకంటే సహయోగము ముందుకు తీసుకువెళ్తుంది. కావున కర్మయోగి. కేవలం కర్మ కాదు, యోగము కూడా. నేను కర్మయోగి ఆత్మను అని గుర్తుంచుకోండి.
నిర్మా గ్రూప్ కర్సన్ భాయి మరియు వారి యుగళ్తో:- డబల్ పాత్రను మంచిగా నిర్వహించడాన్ని బాప్‌దాదా చూసారు. మురళి మరియు స్మృతి వీటిని కూడా నడిపిస్తున్నారు మరియు తమ కార్యంలో కూడా ముందుకు వెళ్తున్నారు. వీరిని కర్మయోగి అని అంటారు. కర్మ కూడా మరియు యోగము కూడా మంచిగా అవుతుంది. కర్మయోగి పిల్లవాడు.
టాలీవుడ్ (హైదరాబాద్) మెగా స్టార్ - చిరంజీవి మరియు వారి యుగళ్ సురేఖతో:- ఇప్పుడు ఇక్కడ కూడా సేవ మరియు యోగంలో హీరోగా అవ్వాలి. ఇక్కడ హీరోతో పాటు జీరోగా కూడా అవ్వాలి. వీరు మీకు తోడుగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఏకమతంతో ఉన్నారు కదా. ఏకమతంతో ఉన్నప్పుడు చాలా సహజంగా అయిపోతాయి, చాలా సుఖము ఉంటుంది. కేవలం హీరో కాదు జీరో అని గుర్తుంచుకోండి. ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ‘నా బాబా’ అని మాత్రం మర్చిపోకండి. నా అన్నప్పుడు పూర్తి వారసత్వము లభిస్తుంది. మరి ఒకరి కంటే మరొకరు ముందుండాలి, మీరు మీ విధంగా, వీరు వీరి విధంగా.
ఆశీష్ గుప్తా తమ పీస్ ఆఫ్ మైండ్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నారు:- మీరు కూడా చేయించేవారిగా కాక చేసేవారిగా అవ్వండి. తోడుగా ఉన్నారు కదా. ఏ శుభ కార్యంలో అయినా సహయోగిగా అయితే అందులో ఎంతో పుణ్యము వస్తుంది. కావున కేవలం నడిపించేవారిగా కాదు, మీరు కూడా తోడుగా ఉంటూ అందరినీ ఉత్సాహంలోకి తీసుకురావాలి. ఉత్సాహాన్ని కలిగించడము మీ పని. మీరు కేవలం నిమిత్తులు. మీరు కేవలం శుభ భావనను ఉంచండి. శుభ భావన పెట్టడమైతే వచ్చు కదా. మీ శుభ భావన అనేకులలో శుభ భావనను తీసుకువస్తుంది. అచ్ఛా.
ఓంశాంతి