Search for a command to run...
15 Dec 2012
నాది అన్నదానిని నీది లోకి పరివర్తన చేసి ద్వికిరీటధారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి
15 December 2012 · తెలుగు
ఈరోజు సభ అంతా నిశ్చింత చక్రవర్తులదిగా కనిపిస్తుంది ఎందుకంటే చింత బాబాకు ఇచ్చేసి నషాను తీసేసుకున్నారు. మీరందరు కూడా ఉదయం నుండి రాత్రి వరకు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటున్నారు ఎందుకంటే స్వరాజ్యము లభించింది. మరి పరిశీలించుకుంటున్నారా! ఎందుకంటే నిశ్చింత చక్రవర్తుల గుర్తు - వారి మస్తకము ప్రకాశముతో మెరుస్తూ ఉంటుంది మరియు నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నట్లయితే ద్వికిరీటధారులుగా ఉన్నట్లు అర్థము. ద్వికిరీటధారులే నిశ్చింత చక్రవర్తులు. మరి మీరందరూ స్వయాన్ని నిశ్చింతులుగా మరియు చక్రవర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ ద్వికిరీటధారులుగా లేకపోతే అంటే నిశ్చింతగా లేకపోతే శిరస్సు పైకి ఏమి వస్తుంది? చెత్త బుట్ట. మరి ఏది మంచిగా లభిస్తుంది? బాప్‌దాదా ఈ రోజు పిల్లలందరినీ ద్వికిరీటధారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా చూసి ఆనందిస్తున్నారు. మీరందరూ, భగవంతుని సహచరులు, స్వయాన్ని అలాగే అనుభవం చేసుకుంటున్నారా లేక ఒకసారి చేసుకుంటూ, మరోసారి చేసుకోవడం లేదా? ఈ ద్వికిరీటము పూర్తి కల్పములో కేవలం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. రాజులుగా అయితే చాలామందే అవుతారు, ద్వాపరం నుండి రాజులుగా అయితే అవుతారు కానీ ద్వికిరీటము మాత్రం కేవలం మీకే లభిస్తుంది.
బాప్‌దాదా ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను కలవడానికి వచ్చారు. చింత ఇచ్చేసారు కదా లేక ఇంకా కొంచెం ఉందా? చింతను ఇచ్చేయండి, బాబాకు చింత ఇవ్వడం వచ్చు కదా! నిశ్చింతగా అయ్యే విధి చాలా సహజమైనది, నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చెయ్యండి. ఎంత సహజము - నాది మరియు నీది. నా-నీ, ఇది తేడా. మరి అందరూ ఇచ్చేసారా, నాది అన్నదానిని నీది లోకి పరివర్తన చేసేసారా? ఎవరైతే స్వయాన్ని నిశ్చింత చక్రవర్తులుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. ఎత్తండి, చేతులెత్తండి, బాప్‌దాదా చూస్తారు. ఇంకెప్పుడూ మళ్ళీ నీది అన్నదాన్ని నాదిలోకి మార్చరు కదా? ఒకవేళ ఇప్పటికీ ఇంకా ఏదైనా మీ వద్ద మిగిలి ఉంటే ఆ చింతలన్నీ ఇచ్చేసి నషాను తీసేసుకోండి ఎందుకంటే రోజు రోజుకూ విశ్వంలో భయము పెరగనుంది కానీ బాబా పిల్లలైన మీరందరూ నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఇతరులను కూడా చింతల నుండి దూరం చేస్తారు. ఇందుకు సహజ సాధనము - అమృతవేళ నుండి రాత్రి వరకు ఫాలో బ్రహ్మా బాబా ఎందుకంటే బ్రహ్మా బాబా కూడా సాకార తనువులో ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. కొంతమంది పిల్లలు బ్రహ్మా బాబాను సాకరంలో చూడకపోయినా కానీ వారి చరిత్రనైతే విన్నారు కదా, మీరు సాకారంలో ఉన్నట్లుగానే వారూ ఉన్నారు కానీ వారికి ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ ప్రాక్టికల్ జీవితంలో నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. అంతిమము వరకు కూడా వారి ముఖములో నిశ్చింతత చిహ్నాలే కనిపించాయి. అంతిమము వరకు కూడా ఎటువంటి ఆధారము లేకుండానే చివరి క్లాస్ చేయించారు. ఇటువంటి హెల్దీ (ఆరోగ్యవంతులు) మరియు నషాలో వెల్దీ (సంపన్నులు). మరి మీరందరూ కూడా నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు కదా! శారీరక లెక్కాచారాలు ఉన్నప్పటికీ స్థితి సదా నిశ్చింత చక్రవర్తి.
బాప్‌దాదా ఈ రోజు పిల్లలందరినీ ఇలా బ్రహ్మా సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. కావున పరిశీలించుకోండి, శరీరం ఎలా ఉన్నా కానీ మనసు సదా నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. నోట్ చేసుకోండి, ఉదయం లేవగానే పరిశీలించుకోండి, సబ్కాన్షస్లో కూడా ఎటువంటి చింత ఉండకూడదు. మధ్య మధ్యలో పరిశీలించుకుంటూ ఉండండి. మరి నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చేస్తారు కదా ఎందుకంటే పూర్తి కల్పంలో పిల్లలైన మీరు తప్ప ద్వికిరీటధారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా మరెవ్వరూ అవ్వలేదు. మీ చిత్రాలలో సదా ద్వికిరీటాలు ఉంటాయి. ద్వాపరంలో అనేకమంది రాజులుగా అయ్యారు కానీ ద్వికిరీటధారులుగా మరియు స్వరాజ్యము పొందిన రాజులుగా మరెవ్వరూ అవ్వలేదు. ఈనాటి మీ టైటిల్ ‘నిశ్చింత చక్రవర్తి’, సదా గుర్తుంచుకోండి.
ఈరోజు కూడా చాలామంది వచ్చారు. పిల్లలందరినీ విశేషంగా బాప్‌దాదా కలవడానికి వచ్చారు. ఇక ఇప్పుడు ఫిర్యాదు అయితే చెయ్యరు కదా ఎందుకంటే పిల్లలంటే తండ్రికి ఎంత ప్రేమంటే పిల్లలు లేకుండా బాబా ఉండలేరు. మరి నేను ఎవరిని అని మీ టైటిల్‌ను అమృతవేళ నుండి రాత్రి వరకు గుర్తుంచుకోండి - నిశ్చింత చక్రవర్తి. అచ్ఛా.
వచ్చిన పిల్లలందరితో మిలనము జరిపాము, బాబా కూడా సంతోషిస్తున్నారు మరియు పిల్లలు కూడా సంతోషిస్తున్నారు. కానీ మీ ఈ వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఎలా ఉన్నా కానీ, శరీర లెక్కాచారాలు శరీరానికి తెలుసు, కానీ మనసు సదా నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. ఎటువంటి పేపర్(పరీక్ష) అయినా కానీ పేపర్ మరింత అనుభవిగా చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళేది, భయపడద్దు. ఎప్పుడూ పేపర్‌ను చూసి భయపడద్దు. అచ్ఛా.
ఈరోజు గుజరాత్ టర్న్ జరుగుతుంది. గుజరాత్ వారు కూడా బాప్‌దాదాకు ఇష్టమైనవారు. అన్ని జోన్ల వారూ ఇష్టమే, కానీ టర్న్ గుజరాత్‌ది. గుజరాత్ వారు లేవండి, చేయి ఇలా అనండి. చాలా మంచిది. ఏమేమి పురుషార్థము చేస్తున్నారన్నది బాబా సమాచారమంతా విన్నారు, పిల్లలు కూడా మంచిగా లెక్క చూపించారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా బ్రహ్మా బాబా సమానంగా మాస్టర్ బ్రహ్మాగా అవ్వాలన్నదే బాప్‌దాదా ఆశిస్తున్నారు. ప్రతి జోన్ వారు నిండు మనసుతో వస్తారు. బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు, ఇటువంటి పిల్లలు పూర్తి కల్పంలో ఇప్పుడు సంగమంలోనే లభిస్తారు. సత్యయుగంలో కలిసి ఉన్నాకానీ ఇప్పుడు ఏ గుర్తింపుతో ఉన్నారో అక్కడ అది మారిపోతుంది.
నలువైపుల ఉన్న పిల్లలకు, నిమిత్తంగా గుజరాత్ ఉంది కానీ బాప్‌దాదా ఎదురుగా ఫారెన్ వారు కూడా ఉన్నారు, చిన్న చిన్న గ్రామాల నుండి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఒక్కొక్కరికీ బాప్‌దాదా, ఇద్దరు తండ్రులు వరదానం ఇస్తున్నారు, సదా ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకువెళ్తూ ఉండండి, తమ రాజ్యాన్ని సమీపంగా తీసుకురండి, నలు వైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. సాకారంలో మీరు ఉన్నారు కానీ హృదయంలో నలువైపుల దేశవిదేశాలు, గ్రామాలలో ఉన్నవారు అందరూ బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు. అచ్ఛా.
రెండు వింగ్స్ వచ్చాయి, మెడికల్ వింగ్ మరియు సెక్యూరిటీ వింగ్:- మెడికల్ వారు ఇప్పుడు ఎటువంటి తయారీలు చేయించండి మరియు చేయండి అంటే అందరూ, బాప్‌దాదా చెప్పినట్లుగా నిశ్చింత చక్రవర్తులుగా కావాలి, చింత లేకపోతే అనారోగ్యం లేదు. కావున ఇటువంటి ప్లాన్‌ను ఆలోచించండి. ఇక్కడ కూర్చుని కూడా అందరూ సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఎటువంటి మందును కనుగొనండి అంటే కొంచెం తనువుతోగానీ, మనసుతోగానీ సంతోషంగా లేకపోతే ఆ మందును తల్చుకోగానే సంతోషం కలగాలి. ఆ మందు ఏమిటి? ‘నా బాబా’. కావున అందరి మనసులలో ‘నా బాబా’ అన్నది కూర్చోపెట్టండి అప్పుడు ఇది మందుగా అవుతుంది. అచ్ఛా. చాలా మంచిది. సేవ చేస్తున్నారు, చేస్తూ ఉండండి, విజయము మీకు తోడుగా ఉండనే ఉంది.
సెక్యూరిటీ వింగ్:- సెక్యూరిటీ వారు పురుషార్థం చేసి, కృషి అయితే చేస్తున్నారు, కానీ పురుషార్థం చేసి సహజంగా సఫలతను ఇచ్చే మందును అనగా మంత్రాన్ని కనుక్కోండి. రోజురోజుకూ దుఃఖమైతే పెరగనుంది, అలజడి అయితే జరగనుంది కానీ అలజడిలో కూడా స్వయాన్ని నిశ్చలంగా చేసుకోగలగాలి, అటువంటి సహజమైన విషయాన్ని కనుగొనండి. ఆ విషయము ఎదురుగా రాగానే మనసుకు సంతోషం కలగాలి అప్పుడు తనువు యొక్క అనారోగ్యం కూడా ఫీల్ అవ్వదు. ఇటువంటి సెక్యూరిటీతో కూడిన వైద్యాన్ని షార్ట్‌లో కనుగొనండి, బ్రాహ్మణులు వరదానాలు చదివి సంతోషించినట్లుగా ఇది ఆలోచించండి. ఎటువంటి వారైనా అధ్యయనం చెయ్యగానే పరివర్తన అయ్యేలా సాల్వేషన్ ఆలోచించండి. సెక్యూరిటీ కోసం చిన్న చిన్న సాధనాలు తయారు చెయ్యండి ఎందుకంటే సమయము ఇప్పుడు సున్నితంగా మారుతూ ఉంది, అటువంటి సమయంలో ఇటువంటివి ఉపయోగవడాలి.
మీరైతే ఎవరెడీగా ఉన్నారు కదా? ఎటువంటి సమయం వచ్చినా, ఎలాంటి సమయము వచ్చినా కానీ ఎవరెడీగా ఉండండి. బ్రహ్మా కుమారులు మరియు బ్రహ్మా కుమారీలు ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలోనూ సదా సంతోషంగా ఉండాలి. బ్రహ్మా కుమారులు మరియు బ్రహ్మా కుమారీల సంతోషం మాయం కాకూడదు, ఇలా వీలవుతుందా? వీలవుతుంది అని అంటే చేతులెత్తండి. అచ్ఛా. బాప్‌దాదా అందరి చేతులు చూసారు, మీరు చేతులెత్తండి. సమయమైతే వస్తూ ఉంటుంది, బాప్‌దాదా రిజల్టును చూస్తారు, అందరూ చేతులెత్తారు కావున సమయం వచ్చినప్పుడు కూడా ఎవరెడీగా ఉండి నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. నిశ్చింతగా కూడా మరియు చక్రవర్తిగా కూడా ఉండాలి. చిన్న విషయాలు, పెద్ద విషయాలు వచ్చేదే ఉంది, కానీ బ్రహ్మా కుమారులు మరియు బ్రహ్మా కుమారీలకు ఏదీ పెద్ద విషయము కాదు, కల్పకల్పము చూసి ఉన్నారు. కల్పకల్పము పాస్ అయ్యారు. ఇటువంటి అనుభవిగా అయ్యి ఇప్పుడు కూడా ఒక ఆటలా పాస్ అయిపోతారు. ఇంతటి ధైర్యము ఉంది కదా! ధైర్యము ఉంది కదా! రెండు రెండు చేతులెత్తండి. వెనుకవారు ఎత్తుతున్నారు.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులకు తమ టైటిల్ గుర్తుంది కదా? మీరు ఎవరు? డబల్ పురుషార్థి. మంచి ధైర్యాన్ని ఉంచడాన్ని బాప్‌దాదా చూసారు. మెజారిటీమంది సమయానికి పాస్ కూడా అవుతున్నారు. బాప్‌దాదా వద్దకు సమాచారము కూడా వస్తుంది మరియు మీకు నిమిత్తమైన దాదీ కూడా వినిపిస్తూ ఉంటారు. అందరిలో శక్తిని నింపుతూ ఉంటారు. అచ్ఛా. మీరు సదా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - మేము విజయులుగా అవ్వవలసిందే. ఎటువంటి పరిస్థితులైనా కానీ మా పేరు విజయి. విజయము మా జీవితానికి ఆధారము. విజయము లభించే ఉంది. అచ్ఛా. బాప్‌దాదా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది, విదేశీయుల రిజల్టు కూడా మంచిగా ఉంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా.
ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలతో మిలనము జరుపుకుంటున్నాము. అందరి మనసులలో బాబా, బాబా మరియు బాబా, ఈ అనుభవము బాబాకు కూడా కలుగుతుంది. కానీ శరీరము లెక్క శరీరానికి తెలుసు. ఇకపోతే మీ అందరూ మరియు బాప్‌దాదా ఏమి చూసారంటే బాప్‌దాదా స్మృతి మరింతగా వస్తూ ఉంది, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు... ఇందులో మరుపు తక్కువగా ఉంది. కానీ సంగమ సమయము కలుసుకునే సమయము కాబట్టి కలుసుకుంటూ ఉంటాము.
నలువైపుల ఉన్న పిల్లల ప్రియ స్మృతులు చేరుకుంటూ ఉంటాయి, ఎంతగా పిల్లలు గుర్తు చేసుకుంటూ ఉంటారో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా బాబా కూడా పిల్లలను గుర్తు చేస్తారు. ఎలా అయితే పిల్లలు సదా వాహ్ బాబా, వాహ్ బాబా అంటూ ఉంటారో అలాగే బాబా కూడా అన్ని వైపుల ఉన్న పిల్లలను వాహ్ పిల్లలు! వాహ్ పిల్లలు! అని అంటూ ఉంటారు మరియు సంకల్పంలో ప్రియస్మృతులను ఇస్తూ ఉంటారు. అచ్ఛా. ఇక మీదట డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది.
మోహిని అక్కయ్య చాలా చాలా స్మృతులను పంపారు:- మంచి స్మృతి మరియు లెక్కాచారాల సమాప్తము రెండూ చేసుకుంటున్నారు. బాప్‌దాదా కూడా శక్తి ఇస్తూ ఉంటారు. బాబా వద్దకు స్మృతి చేరుకుంటుంది.
దాదీ జానకితో: - (కౌగిలించుకున్నారు) ఒక్కరిని తీసుకుంటే అందరినీ దగ్గరకు తీసుకున్నట్లే. బాప్‌దాదా అయితే కలుస్తూ ఉంటారు. సంగమయుగము ఉన్నదే తండ్రి మరియు పిల్లలు కలుసుకోవడానికి, యుగమే ఇదైనప్పుడు కలుసుకుంటూ ఉంటాము.
(నిర్వైర్ అన్నయ్య కొంతమంది సోదరుల స్మృతులను అందించారు) ఎవరైతే స్మృతిని పంపారో వారికి పదమారెట్ల ప్రియస్మృతులు.
రుక్మిణి దాదీ కూడా స్మృతిని పంపారు, వారికి కూడా పదమారెట్ల ప్రియస్మృతులను తెలపండి.
(3-4 రోజులలో కొంతమంది సోదర సోదరీలకు ఆక్సిడెంట్లు జరిగాయి)
అందరికీ, ఎవరెవరికైతే కొంచెం ఇబ్బంది కలిగిందో వారికి స్మృతి అందించండి కానీ ఇక ముందు కోసం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారికి విడిగా అర్థం చేయించండి. కొంచెం తొందరపడ్డారు, తొందరపడకూడదు. ముందుగా చేరుకోవాలి అని అనుకుంటారు, ముందే చేరుకుంటారు కానీ రిజల్టు ఏమిటి? కావున ముఖ్యంగా ఇప్పుడు డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనను ఇవ్వండి. మంచిది.
గీతా భగవంతుడి గురించి:- అహింస గురించి చేసింది బాగుంది, ఇందులో కొంతమంది కలుస్తారు, కొంతమంది హింసను ఒప్పుకోరు కూడా, అటువంటి వారిని దగ్గరకు తీసుకురండి అప్పుడు గీతా భగవంతుడు సహజంగానే నిరూపింపబడతాడు. అచ్ఛా!
ఓంశాంతి