Search for a command to run...
30 Nov 2013
ముంబయిలో దాదీ గుల్జార్ గారు బాప్దాదాకు భోగ్ను స్వీకరింపజేసారు, వీడియో కాన్ఫెరెన్సు ద్వారా అందరూ పూర్తి దృశ్యాన్ని చూసారు, తర్వాత అందరికీ దాదీ గుల్జార్ గారు బాప్దాదా యొక్క సందేశాన్ని వినిపించారు
30 November 2013 · తెలుగు
ఓం శాంతి. మీ అందరి ప్రియస్మృతులను తీసుకుని నేను బాబా వద్దకు వతనానికి చేరుకున్నాను. బాబా తమ గదిలో గద్దెపై కూర్చుని ఉన్నారు, నేను బాబా ఎదుటకు వెళ్ళినప్పుడు బాప్దాదా చాలా మధురంగా చిరునవ్వుతో మిలనం జరిపారు, తర్వాత ఇలా అన్నారు – ఓ నా హృదయ హారమా, రండి! ఈరోజు ఎవరి స్మృతిని తీసుకువచ్చావు? నేనన్నాను, బాబా, ఈరోజు మీకు ప్రియమైన యు.పి పిల్లలు మీతో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. బాప్దాదా అక్కడ కూర్చుని ఉన్నాగానీ అక్కడ లేరనిపించింది. బాబా పిల్లలందరికీ చాలా-చాలా మధురమైన దృష్టిని ఇస్తూ మిలనం జరుపుతున్నారా అన్నట్లుగా ఉంది. పిల్లలందరూ అక్కడ కూర్చునే చాలా-చాలా ప్రేమతో మిలనం చేసుకుంటున్నారు. తర్వాత బాబా అన్నారు, పిల్లలందరూ బాప్దాదా యొక్క హృదయ హారములు. బాబా పిల్లలకు దృష్టినిస్తున్నప్పుడు ఎలా అనిపించిందంటే, బాబా ఒక్కొక్కరికీ, ఎవరిని చూస్తున్నాగానీ వారితో మాట్లాడుతున్నారా అన్నట్లుగా అనిపించింది. అదేమిటో నేను వినలేకపోయాను కానీ బాబా యొక్క ముఖము మరియు మూర్తి ఎలా ఉందంటే ఒక్కొక్కరినీ కౌగిలించుకుని తమలో ఇముడ్చుకుంటున్నారా అన్నట్లుగా అనిపించింది. ముందు ఈ దృశ్యాన్ని చూసాను. తర్వాత బాబా అన్నారు, పిల్లలకు బాబాపై ఉన్న ప్రేమ మరియు బాబాకు పిల్లలపై ఉన్న ప్రేమ సంగమయుగంలో ఒక విశేషమైన భాగ్యము. బాబా పిల్లలందరినీ చూస్తూ, చివరి వారైనా, ఫస్ట్ వారైనా కావచ్చు, బాప్దాదా పిల్లలందరినీ ఎలా చూస్తున్నారంటే, ఏదైనా మన వస్తువు అయితే దానిని ఎంతో ప్రేమగా చూస్తాము, చేతితో ప్రేమ చేస్తాము కదా, అలాగే బాబా కూడా ఒక్కొక్కరికీ దృష్టి ద్వారానే ఇంతటి ప్రేమను అందిస్తున్నారు, ముఖాముఖిగా ప్రేమ చేస్తున్నారు మరియు అందరికీ కూడా బాబా మమ్మల్ని సమ్ముఖంలో కలుస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అందరి నయనాలలో అశ్రువులు నిండి ఉన్నాయి, అయితే అవి క్రింద పడటం లేదు, కంటిలోనే ఇమిడి ఉన్నాయి. బాబా ఎలా ఒక్కొక్కరితో మిలనం చేస్తున్నారు అన్న దృశ్యాన్ని నేను కూడా చూసాను. ఆ తర్వాత బాబా అన్నారు, చూడండి పిల్లలు, సంగమయుగంలో బాబా పాత్ర జరుగుతుంది, కానీ తెలుసుకున్నది ప్రియమైన పిల్లలైన మీరు. ఒక్కొక్కరికీ బాబా ఎంతో ప్రేమగా తియ్యని దృష్టిని ఇస్తూ వారితో మాట్లాడుతున్నారా అన్నట్లుగా దృష్టిని ఇచ్చారు. అప్పుడు నేను బాబాతో చెప్పాను, బాబా మీరైతే మాట్లాడుతున్నారు, కానీ నాకు వినపడటం లేదు. అప్పుడు బాబా అన్నారు, ఇక్కడకు వచ్చిన పిల్లల మనసు మాట, హృదయ ఆశలు బాబాకే తెలుసు. పిల్లలు ఒక్కొక్కరినీ చూడండి, బాబాను ఎలా చూస్తున్నారో గమనించండి. దప్పికతో ఉన్నవారిలా ఉన్నారు. చూడు, డ్రామాలో ఇది కూడా నిశ్చితమై ఉంది కానీ పిల్లలందరి మనసులోని సమాచారము బాబాకు తెలుసు, మరెవ్వరూ తెలుసుకోలేరు. ఇప్పుడు పిల్లల హృదయంలో ఏమి జరుగుతుంది అన్నది బాబాకే తెలుసు! పిల్లలందరికీ బాబాపై ఎంత గాఢమైన ప్రేమ ఉన్నదో చూసి బాబా సంతోషిస్తున్నారు. బాబాకైతే పిల్లలపై ప్రేమ ఉండనే ఉంది. బాబాకు పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది కనుక పిల్లలను ఎక్కడెక్కడి నుండి వెతికి పట్టుకున్నారు, కొందరు విదేశాల నుండి వచ్చారు, కొందరు ఇండియాలోని భిన్న భిన్న స్థానాల నుండి వచ్చారు. అందరినీ బాబా వెతికారు. నా పిల్లలు తప్పిపోయారు, వారిని వెతికి తమ వద్దకు తీసుకువచ్చేంత ప్రేమ బాబాకు పిల్లలపై ఉంది. ఇలా చెబుతూ బాబా దృష్టి ఇస్తూ ఉన్నారు, అందరూ వింటూ బాబా ప్రేమలో మునిగిపోయారు. తర్వాత బాబా అన్నారు, వచ్చిన ఈ గ్రూపు వారికి, ఒక్కొక్కరికీ నేను దృష్టిని కూడా ఇచ్చాను మరియు యోగ్యులైన పిల్లలు అని చెప్పి ప్రియస్మృతులు కూడా ఇచ్చాను. బాబా విడిచిపెట్టరు, ఎలా అయితే పిల్లలు తమ తండ్రిని విడిచిపెట్టరో అలాగే బాబా కూడా పిల్లల ప్రేమను విడిచిపెట్టరు. ఇక్కడకు వచ్చిన పిల్లల మనసులో డబల్ విషయాలు నడుస్తున్నాయని బాబా చూసారు. ఒకటైతే బాబా కలిసారు, బాబా కలిసారు అన్న ప్రేమ కనిపిస్తుంది ఎందుకంటే దృశ్యాన్ని చూస్తున్నారు. రెండవ విషయము, నేను వచ్చాను, బాబా ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను అని కూడా అర్థం చేసుకున్నారు, కానీ ఒక్కొక్కరి ప్రేమ హృదయంలో ఇమిడిపోయింది. ఇలా బాబా చెప్పారు, తర్వాత నాతో అన్నారు, బచ్చీ, సమయం అయిపోయింది కావున వెళ్ళవలసి ఉంటుంది.
చూడండి, బాబా తమ ఒక్కొక్క అతి ప్రియమైన సంతానంతో అన్నారు, వీరు భట్టీలో వచ్చారు కదా, మరి బాబా ఒక్కొక్కరికీ బాబా భట్టీ తిలకాన్ని పెడ్తారు. బాబా తిలకం తీసుకుని నిల్చుని ఒక్కొక్కరి మస్తకంపై తిలకాన్ని పెట్టారు. మీ భట్టీ ఉద్ఘాటన జరిగిపోయింది అని బాబా అన్నారు. క్రొత్తగా వచ్చినవారికి కూడా బాప్దాదా విశేషమైన ప్రేమను అందించారు. ఈరోజు ఎవరు క్రొత్తగా వచ్చారు! (క్రొత్తగా వచ్చిన సోదరసోదరీలను నిల్చోమన్నారు) క్రొత్త పిల్లలు బాబాకు చాలా గారాల పిల్లలు. బాబా వారిని సికీలధా, సికీలధా అంటారు. బాబా మీ అందరికీ ఎంతో మధురమైన దృష్టినిచ్చి, ప్రియస్మతులను తెలిపి ఇలా అన్నారు, పిల్లలు ఒక్కొక్కరికీ నా తరఫున ఇలా (కౌగిలించుకుని) ప్రియస్మృతులను ఇవ్వండి. అందరినీ బాబా తరఫున కౌగిలించుకుంటున్నాము ఎందుకంటే నేను అక్కడ చూసాను, నేను ఇక్కడ చేయగలను. కావున అందరికీ బాబా తరఫున మధురాతి మధురమైన కౌగిలి.
అందరూ ప్రేమను అందిస్తున్నారు, అది బాబా చూస్తున్నారు. బాబాతో పాటు మీరు కూడా గుర్తుంటారు. మోహిని అక్కయ్య, మీరు చాలా మంచిగా మిమ్మల్ని మీరు మంచిగా చేసుకుని కూర్చున్నారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండటాన్ని చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. జీవించి ఉండండి, వర్ధిల్లండి.
ఓంశాంతి