Search for a command to run...
14 Oct 2015
ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో వారు బాబా హృదయంలో సదా ఇమిడి ఉంటారు. మన సత్యయుగ రాజ్యం ఇప్పుడిక వచ్చేస్తుంది అన్న సంతోషం అందరి హృదయాలలో ఉంది, అందరూ ఇటువంటి యుగాన్ని తీసుకురావడంలో బిజీగా ఉన్నారు
14 October 2015 · తెలుగు
స్నేహీ పిల్లలందరి ప్రియస్మృతులు బాప్‌దాదా వరకు చేరుకుంటున్నాయి. అందరి హృదయాలు నా బాబా అని పలుకుతున్నాయి, మరి బాప్‌దాదా ఏమని అంటున్నారు? నా పిల్లలు. ఈ కలయిక చాలా సుందరమైనది. హాలు చూస్తూ ఉంటే, హాలులో ఉన్న పిల్లల అలంకారమును చూస్తుంటే బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, హృదయంలో వాహ్ పిల్లలూ వాహ్ అనే వస్తుంది. ప్రతి ఒక్కరి ముఖంలో మిలనపు సంతోష అల కనిపిస్తుంది. ఈ మిలనము ఎంత విలువైనది! ప్రతి ఒక్కరి హృదయంలో మరియు బాప్‌దాదా హృదయంలో ఇదే వస్తుంది - వాహ్ నా పిల్లలూ వాహ్! పిల్లల హృదయాలలో ఏమని వస్తుంది? వాహ్ బాబా వాహ్! ఈ మిలనము కూడా ఎంత ప్రియమైనది. అందరి హృదయాలలో నా బాబా అన్న మాటే ఇమిడి ఉంది. మరి బాబా హృదయంలో ఏముంది? నా పిల్లలు. పిల్లలు ఒక్కొక్కరు, దూరంగా కూర్చుని ఉన్నా, దగ్గరగా ఉన్నాకానీ, ఎక్కడ కూర్చుని ఉన్నారు? ఈ సీట్‌పై కూర్చున్నారా? సీట్ ఎక్కడ లభించింది! బాప్‌దాదా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు. రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఒకటి, వాహ్ బాబా వాహ్! రెండవది, బాబా మాట - వాహ్ మధురమైన పిల్లలూ వాహ్! ప్రతి ఒక్కరూ హృదయంలో ఇముడ్చుకున్న తర్వాత సమ్ముఖంగా నయనాల ద్వారా చూస్తూ ఏ పాటను పాడుతున్నారు? అందరి హృదయాల నుండి ఒకటే మాట వెలువడుతుంది - నా బాబా మరియు బాబా నోటి నుండి ఏమని వెలువడుతుంది? నా పిల్లలు! తండ్రీ పిల్లల ఈ మిలనము ఎంత అద్భుతమైనది! బాబా కూడా ఎంతగానో హర్షిస్తున్నారు. ఇది కూడా తక్కువే, లేకపోతే ఇళ్ళల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వారు మరియు ఇక్కడ స్థూలంగా హాలులో ఉన్నవారు, ఈ తండ్రి పిల్లల మిలనము ఎంతటి అతీతమైనది మరియు ప్రియమైనది! మెజారిటీ పిల్లలు బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు. బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి, లాస్టులో కూర్చుని ఉన్నవారైనా కానీ అందరూ బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు. బాబా కూడా పిల్లలను ఈ నయనాలతో చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు వాహ్ పిల్లలూ వాహ్! పిల్లలు ఒక్కొక్కరూ బాబాకు కనుపాపల వంటివారు కనుక మీరంతా పరస్పరంలో కనుపాపలు అని టైటిల్ ఇచ్చుకుంటారు. ఎక్కడ ఉన్నా కానీ స్మృతి చేసే పిల్లల నయనాలలో బాబా నిండి ఉంటారు. బాబా హృదయంలో పిల్లలందరూ నిండి ఉన్నారు, స్మృతిలో ఎవరైతే ఉన్నారో వారు ఇమిడి ఉన్నారు. స్వయాన్ని బాబా హృదయంలో ఇమిడి ఉన్నట్లుగా చూసుకుంటున్నారు కదా. ఈ దృశ్యం కూడా సంగమయుగంలో విచిత్రమైన దృశ్యం, దీనిని ఇప్పుడు బాప్‌దాదా చూస్తున్నారు. ఇక్కడ హాలులో ఈ కుర్చీలో కూర్చున్నప్పటికీ బాప్‌దాదా ఏమని అనుభవం చేసుకుంటున్నారు? అందరూ హృదయంలో ఉన్న హృదయ దీపాలు. బాప్‌దాదా కూడా ప్రతి దీపాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు. వాహ్ పిల్లలూ వాహ్! బాబా కూడా పిల్లలు లేనిదే ఉండలేరు. పిల్లలు కూడా బాబాను సమ్ముఖంలో కలుసుకుని చాలా చాలా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు కూడా అనుభవం చేసుకుంటున్నారు. అందరి హృదయాలలో ఎవరున్నారు? అందరూ ఏమంటారు? నా బాబా. మరి బాబా హృదయంలో ఎవరున్నారు? నా పిల్లలు. తండ్రి పిల్లల ఈ హృదయ మిలనము ఈ సంగమంలోనే ప్రాప్తిస్తుంది. మరి అందరి హృదయాలలో ఎవరున్నారు? నా బాబా. బాబా హృదయంలో ఎవరున్నారు? మధురమైన పిల్లలు. ప్రతి ఒక్కరూ తమ యథాశక్తితో అనుభవం చేసుకుంటున్నారు. ఇరువైపుల హృదయాలలో ఎవరున్నారు? నా బాబా. బాబా హృదయంలో ఎవరున్నారు? నా పిల్లలు. ఈ అద్భుతమైన మిలనాన్ని పిల్లలైన మీరే జరుపుకోగలరు. నా బాబా మరియు బాబా హృదయంలో ఎవరున్నారు? నా పిల్లలు, ఈ మిలనము ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. చూడండి, ఎక్కడెక్కడి నుండో వచ్చారు. అందరి హృదయాలు ఏమని పలుకుతున్నాయి! నా బాబా. మరి బాబా హృదయం ఏమంటుంది? నా పిల్లలు, ప్రియమైన పిల్లలు. ఇప్పుడు ఎలాగైతే పిల్లలైన మీ అందరి హృదయాలలో బాబా నిండి ఉన్నారో అలాగే అందరి హృదయాలలోకి బాబా రావాలి, ఈ పురుషార్థం పిల్లలు చేస్తున్నారు కూడా. పిల్లల పురుషార్థాన్ని చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ బాబా ఉంటారో అక్కడ మరే ఇతర విషయాలు రాలేవు. బాబా హృదయంలో పిల్లలు, పిల్లల హృదయంలో బాబా. ఈ అనుభవం ఉంది కదా! బాప్‌దాదా కూడా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. హృదయం నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ పిల్లలూ వాహ్! ఇప్పుడు అందరి హృదయాలలో ఎవరున్నారు? నా బాబా. బాబా హృదయంలో ఎవరున్నారు? వాహ్ పిల్లలూ వాహ్! హాల్ పూర్తి దృశ్యాన్ని చూసి బాప్‌దాదా హర్షితులవుతున్నారు.
(బాబా, మీతో మిలనమును జరుపుకోవటానికి 20 వేల మంది సోదరీసోదరులు వచ్చారు. డబుల్ విదేశీయులు 60 దేశాల నుండి 700 మంది వచ్చారు. సేవ టర్న్-రాజస్థాన్వారు 4000 మంది , పంజాబ్ వారు 10 వేలమంది వచ్చారు) ఇప్పుడు సత్యయుగాన్ని తీసుకువచ్చే ఆధారము పిల్లలైన మీ మీదే ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ సేవలోనే ఉన్నారు. ఇటువంటి యుగాన్ని తీసుకురావడంలో పిల్లలు బిజీగా ఉండటాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఆ యుగాన్ని తీసుకురావడానికి లోలోపలే ఎంతో పురుషార్థాన్ని చేస్తున్నారు. పిల్లల పురుషార్థాన్ని కూడా బాప్‌దాదా చెక్ చేస్తారు. మన యుగం చాలా త్వరగా రావాలి అన్న ధునిలోనే మెజారిటీవారు ఉన్నారు. వస్తూ ఉంది, మీ అందరి పురుషార్థాన్ని బాప్‌దాదా చూస్తున్నారు, కానీ సదా ఉండటం లేదు. కొంచెం సదాగా మారితే ఈ కళ్ళతో చూస్తారు. మీ కోసమే కదా ఈ యుగము. యుగ పరివర్తనకు మీరే పురుషార్థం చేస్తున్నారు మరియు సఫలత కూడా ఉంది. మన యుగం ఇక వచ్చేస్తుంది అన్న ఉల్లాసం అందరి హృదయాలలో ఉంది. అది మన యుగము, మన యుగాన్ని తీసుకువస్తున్నాము. జరగాల్సిందే, ఇది కూడా గ్యారంటీ. బాప్‌దాదా కూడా హోవనహార్ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఏమని పాట పాడుతున్నారు? వాహ్ పిల్లలూ వాహ్! ప్రతి ఒక్కరి ముఖంలో వారి భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది, తోడు మరియు సమయం కూడా ఉన్నాయి, ఇప్పుడు మనం మన వతనానికి వెళ్తాము. అందరి హృదయాలలో తమ వతనము మెదులుతుంది కదా! కేవలం ఎదురుగానే నిల్చుని ఉంది. మన యుగం రాబోతుంది. సంతోషంగా ఉంది కదా!
డబల్ విదేశీ సోదరీ సోదరులతో:- ఇది కూడా బాగుంది, ఇలా చేస్తే కలుసుకునే అవకాశం అందరికీ లభిస్తుంది. మరి స్పెషల్‌గా ఒక్కొక్క జోన్‌కు వేర్వేరు టర్న్‌లు లభించి ఉన్నాయి. బాప్‌దాదా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు వాహ్ నా పిల్లలూ వాహ్! విదేశీయులకు కూడా తమ ఈ దేశం ప్రియంగా అనిపిస్తుంది. ఇక్కడకు వచ్చినప్పుడు వారి అనుభవాలను వినిపిస్తుంటారు, తమ అసలైన స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటారు. బాబా కూడా ఇటువంటి పిల్లలను చూసి సంతోషిస్తారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉంటారు! ఒక అవగాహనతో తండ్రి పిల్లల మిలనము జరిగేది ఈ సమయంలోనే. పిల్లలు కూడా సంతోషిస్తున్నారు మరియు బాబా కూడా సంతోషిస్తున్నారు, వాహ్! పూర్తి స్మృతి వస్తుంది. పూర్తి చక్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడైతే ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది సత్యయుగం రావడానికి, దీనిని మన యుగం అని అంటాము, ఇప్పుడు ఇతరుల యుగంలో మిలనాన్ని జరుపుకుంటున్నాము. మన యుగం ఖచ్చితంగా వచ్చింది అని మీకు పక్కాగా గుర్తుంది. మధువనానికి వచ్చినప్పుడైతే సంతోషంగానే ఉంటారు, మధువనానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా సంతోషం ఉంటుంది. ఇక్కడే మనం రాజ్యం చెయ్యాల్సి ఉంది. ఇప్పుడు తపస్సు చేస్తున్నాము, ఇక్కడే రాజ్యం చెయ్యాల్సి ఉంది. ఇది మన రాజ్య స్థానము మరియు సేవా స్థానము కూడా అన్న భాసన వస్తుంది కదా! తమ రాజ్య స్థానమును చూసి సంతోషంగా ఉంది కదా. మన రాజ్యం ఇక్కడే ఉండింది, ఇది ఇప్పుడిక వచ్చేస్తుంది. ఇటువంటి సహజ యోగము, రాజయోగము పూర్తి కల్పములోనే ఉండదు. మీరే నిమిత్తులు, మీ అనుభవాన్ని మళ్ళీ తిరిగి అనుభవం చేసుకుంటున్నారు.
చూడండి, ఈ సమయం ఎంతో విలువైనది, మాకు రాజ్య భాగ్యం లభిస్తుంది అని గుర్తిస్తున్నారు. మేము ఒకప్పుడు ఎలా ఉన్నాము, మళ్ళీ ఎలా అవ్వనున్నాము! నషా ఉంది, సంతోషం ఉంది మరియు మనమే అవ్వబోతున్నాము. సంతోషంగా ఉంది కదా! సంతోషంగా ఉన్నట్లయితే చేతులెత్తండి. చూడండి ఎంత సంతోషం ఉందో, ఎందుకంటే మన యుగం రాబోతుంది. చూడండి, ఇక్కడంతా మాతలు కనిపిస్తున్నారు. మాతలు ఎంతో సంతోషిస్తున్నారు, వాహ్ మా యుగం వచ్చేసింది, మా యుగం వచ్చేసింది. మీరొక్కరే ఉండరు, యుగల్స్ కూడా ఉంటారు. రాజ్యం చేస్తారు కదా! మరి రాజ్యం ఒంటరిగా చేస్తారా! రాజ్యంలో అయితే ఇద్దరూ ఉంటారు కదా. మా రాజ్యం వచ్చేస్తుంది అన్న సంతోషం ఉంది. బాబా వచ్చిందే రాజ్యాన్ని ఇవ్వడానికి. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడిక మన రాజ్యం ఉంటుంది. మన రాజ్యం. నషా ఎంత ఉంది! రాజ్యపు సంతోషం ఎంత ఉంది! మన రాజ్యం వచ్చేసినట్లే. ఎంత సంతోషం! చెప్పండి. ఎలా చెప్తారు. చప్పట్లు కొట్టండి. చప్పట్ల శబ్దం ఎలా ఉందో చూడండి. వాహ్! అందరి ముఖాలు చూడండి, ఎంతటి చిరునవ్వుతో ఉన్నాయంటే, మా రాజ్యం వచ్చేస్తుంది. సంతోషంగా ఉంది కదా అందరికీ. అందుకే చప్పట్లు కొట్టారు. ఇప్పుడిక దుఃఖంలో ఉండటం, ఏడవటం చెయ్యాల్సిన అవసరం లేదు. సంతోషపు రోజులు వచ్చేస్తున్నాయి, మన రాజ్యం వచ్చేసింది, మన రాజ్యం... నషా ఎంత ఉంది! ఇతరుల రాజ్యంలో చాలా సమయం ఉన్నారు, ఇప్పుడు మన రాజ్యం, సంతోషంగా ఉంది కదా. సోదరులకు సంతోషంగా ఉందా? సోదరీలకు ఉందా? చూడండి, నలువైపుల సంతోషాన్ని చూస్తుంటే చాలా బాగుంది. ఎవ్వరి మనసులలోనూ దుఃఖపు అల లేదు, సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషానికి బాప్‌దాదా కూడా మీ అందరికీ చాలా చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు.
దాదీ జానకిగారు బాప్‌దాదాను కౌగిలించుకున్నారు:- మేము కూడా కలుసుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు. కానీ బాబా హృదయంలో అందరూ ఇమిడి ఉన్నారు. ఒక్కొక్కరూ, ఒక్కొక్కరూ బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు.
మోహిని అక్కయ్యతో:- అంతా మంచిగా ఉంది కదా! (మీ వరదానాలతో మంచిగా ఉంది) వరదానాలైతే ఉండనే ఉన్నాయి. బాప్‌దాదా ఏమి చేస్తున్నారు! వరదానాలతోటే నడిపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండలేరు కనుక వరదానాలతో నడిపిస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా! చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖం కనిపిస్తుంది. సేవలో ఆనందంగా ఉన్నారని అందరి ముఖాలలో కనిపిస్తుంది. కొద్ది సమయం సేవ కోసం లభించింది, ఎక్కువ సమయం కాదు.
(ముగ్గురు అన్నయ్యలు బాప్‌దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు):- ముగ్గురూ నిల్చోండి. మంచిగా జరుగుతుంది కదా! (అందరి ఆరోగ్యాలు సరిగా లేవు) అది కూడా సంతోషంతో సరిగా అయిపోతుంది. అయినా చూడండి, వాయుమండలం యొక్క వ్యత్యాసం ఉంటుంది కదా. అక్కడ, ఇక్కడ ఉండటంలో ఆరోగ్యంలో తేడా అయితే కనిపిస్తుంది కదా. అందరి ఆరోగ్యాలు బాగున్నాయి. అనారోగ్యంగా ఎవ్వరూ లేరు, అందరూ బాగున్నారు, ఎవ్వరూ అనారోగ్యంగా లేరు. సంతోషంగా ఉంటే అనారోగ్యంగా లేనట్లే. అందరూ సంతోషంగా ఉన్నారు కదా! చేతులెత్తండి. ఇది సంతోషమనే ఔషధము. ఇతర ఔషధాలు లభించినా లభించక పోయినా సంతోషమనే ఔషధం మంచిది. (ఇప్పుడు దాదీ జానకిగారు తమకు అనారోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు) దాదీ జానకి కూడా అనారోగ్యంగా లేరు. ఇది వీరికి ఉన్న కొద్దిపాటి లెక్కాచారాలు, అది కూడా తొందరగా తీరిపోతాయి. మంచిగా సంభాళిస్తున్నారు కూడా మరియు ఆరోగ్యం కూడా బాగుంది. సంతోషంగా ఉండండి, ఇదే మందు. ఈ మందు అనారోగ్యాన్ని రానివ్వదు. ఆయుషు ప్రకారంగా, అనారోగ్యం ప్రకారంగా అందరూ ఆలోచిస్తారు కానీ వీరు నిశ్చింతగా ఉన్నారు. (దాదీ జానకి గారి 100 సంవత్సరాల సేవలు అన్న పుస్తకాన్ని విదేశీ సోదరీ సోదరులు తయారు చేసారు, దీనిని బాప్‌దాదా విడుదల చేసారు) మీరంతా కూడా మెజారిటీ 100 సంవత్సరాల వారు అయ్యి ఉంటారు. (పుస్తకం చూసి) చాలా బాగుంది.
(ఇండోర్ ఓం ప్రకాశ్ అన్నయ్య, అమెరికా మోహిని అక్కయ్య మరియు కటక్ కమలేశ్ అక్కయ్య ముగ్గురూ అనారోగ్యంగా ఉన్నారు, మీకు ఎంతో స్మృతిని అందించారు)
అనారోగ్యంగా ఉన్నవారికి, వారితోపాటు మీ అందరికీ కూడా చాలా చాలా ప్రియస్మృతులు మరియు సదా స్మృతి ఉంటుంది. అందరి మనసులలో బాబా, బాబా అని ఉంది. బాబా హృదయంలో ఎవరున్నారు! పిల్లలు.
ఓంశాంతి