Search for a command to run...
3 Nov 2015
ప్రభుప్రియుల సంగఠన కేవలం ఈ సంగమ మహా సమయంలోనే జరుగుతుంది, పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా మరియు బాబా హృదయంలో గారాల పిల్లలు ఉన్నారు
3 November 2015 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. ఎందుకంటే పిల్లలందరూ బాబాను చూసి హర్షితులవుతూ మిలనాన్ని జరుపుకుంటున్నారు. తండ్రి పిల్లల ఈ ఆత్మిక మిలనము ఎంత ప్రియంగా ఉంది! ఈ మిలనము అమరులుగా చేసే మిలనము. పిల్లలందరూ అమర భవ అనే వరదానాన్ని పొందారు. ఏమి జరిగినా కానీ పిల్లలు తండ్రి నుండి మిలనము జరుపుకోవడంలో బిజీగా ఉంటారు. అందరి నోటి నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ బాబా వాహ్! బాబా నోటి నుండి వస్తున్న మాటలు - వాహ్ నా ముద్దు పిల్లలు వాహ్! వాహ్! అందరి నోటి నుండి వాహ్! వాహ్! అన్న పాటే వినిపిస్తుంది. అందరి ముఖాలు వాహ్ వాహ్ పాటను పాడుతున్నాయి. అందుకు బాప్‌దాదా కూడా స్పందిస్తున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! అందరి హృదయాల నుండి వచ్చే ధ్వని, దూరంగా ఉన్న పిల్లలు కావచ్చు దగ్గర ఉన్నవారు కావచ్చు, అందరి హృదయపు ధ్వని స్పందిస్తుంది, బాబా అంటారు వాహ్ పిల్లలూ వాహ్, పిల్లలంటారు - వాహ్ బాబా వాహ్! వాహ్ వాహ్ అన్న ఈ పాట మ్రోగుతుంది. అందరి ముఖాల నుండి ఆటోమేటిక్‌గా వాహ్ వాహ్ అనే వెలువడుతుంది. ఈనాటి అభినందన అందరి నోటి నుండి వినిపిస్తుంది. వాహ్ బాబా వాహ్ అన్న ఒక్క సంతోషపు పాటనే అందరూ పాడుతున్నారు. బాబా నోటి నుండి వస్తున్న పాట - వాహ్ ముద్దు పిల్లలందరూ వాహ్! ఇప్పుడు పూర్తి సభ నుండి వస్తున్న హృదయపు ధ్వని - వాహ్ బాబా వాహ్! బాబా మాట - వాహ్ పిల్లలూ వాహ్! అందరూ వాహ్ వాహ్గా ఉన్నారు. పురుషార్థీలే అయి ఉండచ్చు, నంబరువారీగా కూడా ఉన్నారు కానీ అందరి హృదయపు ధ్వని ఒక్కటే - వాహ్ వాహ్! ఏమి ఆలోచిస్తున్నారు? వాహ్ వాహ్ చేస్తున్నారు. మీ అందరి హృదయపు ధ్వని వాహ్ వాహ్ కదా! వాహ్ ముద్దు పిల్లలూ వాహ్ అని బాబా అంటారు, వాహ్ బాబా వాహ్ అని పిల్లలు అంటారు. మరి అందరూ ఎవరు కూర్చున్నారు? ఎక్కడినుండైనా వచ్చి ఉండవచ్చు, కానీ ఇది ఎవరి సంగఠన? నంబరువారీగా ఉన్నా కానీ తండ్రి పిల్లలు కనుక ఎలా అయితే తండ్రి వాహ్ వాహ్ అంటున్నారో, అలాగే అందరి హృదయాలలో ఏమని మ్రోగుతుంది? వాహ్ బాబా వాహ్! బాబా హృదయంలో ఏ పాట మ్రోగుతుంది? వాహ్ పిల్లలూ వాహ్! నంబరువారీగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఏమిటి? విశ్వంలో ఒకవేళ వాహ్ వాహ్ సంగఠన చూడాలనుకుంటే ఎక్కడ కనిపిస్తుంది?
ఈరోజు కూడా, ఇక్కడ బాప్‌దాదా వాహ్ వాహ్ సంగఠనను చూస్తున్నారు. నంబరువారీగా ఉన్నప్పటికీ వాహ్ వాహ్గా ఉన్నారు. అందరూ ప్రభుప్రియులుగా ఉన్నారు. కనుక ఈ సంగఠన ప్రభుప్రియులది. ప్రతి ఒక్కరూ నంబరువారీగా ఉన్నప్పటికీ అందరి మూలాధారము ఒక్కరే. అందరి హృదయాల నుండి, నోటి నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ బాబా వాహ్! బాబా నోటి నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ ముద్దు పిల్లలూ వాహ్! కూర్చోవడంలో వెనుక ముందు కూర్చున్నా కానీ ప్రతి ఒక్కరూ బాబాకు ముద్దు పిల్లలే. బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఈ రూపంలోనే చూస్తున్నారు. అందరి హృదయాలలో ఎవరున్నారు? ఏమంటారు? వాహ్ వాహ్ బాబా. బాబా హృదయంలో ఎవరున్నారు? పిల్లలందరూ ఉన్నారు. నంబరు ఉన్నప్పటికీ అందరూ ముద్దు పిల్లలే.
ఈనాటి ఈ సంగఠనను ఏమని అందాము? ప్రతి ఒక్కరూ బాబాకు ముద్దు పిల్లలు. ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా! అందరి హృదయాలలో బాబా ఉన్నారన్న విషయం అందరి ముఖాల ద్వారా అనుభవం అవుతుంది. బాబా కూడా పిల్లలందరినీ చూసి చిరునవ్వుతో వాహ్ పిల్లలూ వాహ్! అని అంటున్నారు. ఈ మిలనము, ఈ సమయపు మిలనము ఎంతటి మహనీయమైనది! కల్పమంతటిలోకి మహాన్ సమయమంటే ఈ సమయమే, అందుకే సంగమయుగము మహాన్ యుగము అని గాయనం చేస్తారు. బాప్‌దాదా ఈ మహానత తోటే పిల్లలను కలుస్తున్నారు. పిల్లలేమో బాబా మహనీయులు అంటారు, బాబా ఏమని అంటారు? పిల్లలు ఎలాంటి వారైనా కానీ బాబాకు మాత్రం అతి ప్రియులు. నంబరువారీగా ఉన్నప్పటికీ బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారు. బాబా ప్రేమ పిల్లలందరికీ అనుభవం ఉంది. ప్రేమతో ఏమంటారు? నా బాబా. బాబా ఏమంటారు? ఒక్కొక్కరినీ, నా సంతానం, నా పిల్లలు అంటారు. అందరూ ప్రియమైనవారు.
ఈరోజు మిలనము రోజు. పిల్లలు ఎంత మంది ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కానీ బాబాకు ప్రియమైనవారు. అంతే కదా? ప్రతి ఒక్కరూ బాబాకు ప్రియమైనవారు. చేతులెత్తండి. చూడండి, అందరి చేతులను ఇక్కడకు వచ్చి చూడండి. దాదీ, ఇక్కడకు వచ్చి చూడండి, అందరికీ ఎంత ప్రేమ ఉందో! ప్రేమతో కూడిన చేతులు అందరివీ లేస్తున్నాయి. ఇక్కడి నుండి కూడా చూస్తున్నారు. ఇక్కడ కూర్చుని కూడా చూడవచ్చు. ఎక్కడ చూసినా ఎవరు కూర్చుని ఉన్నారు? రండి, వచ్చి చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. బాబాకు ప్రియమైనవారు, గారాల పిల్లలు కూర్చుని ఉన్నారు కానీ ఎంత సాధారణంగా కూర్చుని ఉన్నారు. అందరూ బాబాకు ప్రియమైనవారే కదా! చేతులెత్తండి. అందరూ ఎలా చిరునవ్వులు చిందిస్తున్నారో ఈ దృశ్యాన్ని వచ్చి చూడండి. అందరి హృదయపు స్థితి వారి ముఖంలో కనిపిస్తుంది. అందరి హృదయాలలో ఎవరున్నారు? ఏమంటారు? నా బాబా. బాబా ఏమంటారు? నా పిల్లలు. అందరూ బాబాకు ప్రియమైనవారు, గారాల పిల్లలే కదా! కదా? చేతులెత్తండి. చూడండి, బాబా చూస్తున్నారు, మీకు కనిపించదు కానీ బాబా అంటారు, ఒక్కసారి స్టేజీమీదకు వచ్చి చూడండి, ఎంతటి ప్రియమైనవారు! ఎంతటి గారాల పిల్లలు! చూసారా? రండి (బాప్‌దాదా దాదీ జానకిగారిని పిలుస్తున్నారు) రావచ్చు. లేచి నిల్చుని చూడండి. (వండర్ఫుల్ బాబా, వాహ్ బాబా వాహ్, బాబా చాలా మంచి సభ ఇది) పిల్లలు ప్రతి ఒక్కరూ గారాల పిల్లలు.
సేవ టర్న్ ఇండోర్ వారిది, 7 వేలమంది వచ్చారు, అందులో హాస్టల్ కుమారీలు 150 మంది ఉన్నారు:- అందరూ సేవకు ఎవరెడీగా ఉన్నారు. ప్రతి జోన్‌వారు సమయానికి తమ పాత్రను మంచిగా నిర్వహించడాన్ని బాబా చూసారు. మీరంతా కూడా ప్రతి జోన్ యొక్క సేవతో సంతుష్టంగా ఉన్నారు కదా? చేతులెత్తండి.
500 మంది డబల్ విదేశీయులు 55 దేశాల నుండి వచ్చారు:- డబల్ విదేశీయులు ఎక్కువ మంది వచ్చారు. డబల్ విదేశీయులందరూ చేతులెత్తండి. భారతదేశంలో కూడా మంచివారు నిమిత్తంగా ఉన్నారు. డబల్ విదేశీయులు, విదేశీయులు పురుషార్థం చెయ్యడంలో మంచిగా ఉన్నారు. పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. ఇండియావారు లేరని కాదు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇండియన్ అయినా, విదేశీయుడైనా పిల్లలంతా పురుషార్థంలో మంచిగా మునిగి ఉన్నారు. ముందు నంబరు తీసుకోవాలని పిల్లలందరి మనసులలో ఉంది. బాప్‌దాదా కూడా పిల్లల పురుషార్థం చూసి సంతోషిస్తున్నారు. విదేశీయులైనా, దేశీయులైనా, అందరికీ బాబాపై, దాదాపై అంటే బాప్దాదాపై హృదయపూర్వక ప్రేమ ఉంది. బాగుంది. బాప్‌దాదాకు కూడా దేశవిదేశాలలోని పిల్లలందరిపై హృదయపూర్వక ప్రేమ ఉంది. నంబరు ఏదైనా కానీ బాబా ప్రేమ చివరి సంతానంపై కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్మృతిలో కూర్చుంటే ఎవరి స్మృతిలో కూర్చుంటారు? బాబా స్మృతిలో కూర్చుంటారు. ఏ పిల్లలైతే ఒక్క బాబా స్మృతిలో కూర్చుంటారో, బాబా కూడా దేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు అందరికీ ప్రియులు. బాబా హృదయంలో ఎవరున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ హృదయపు ముద్దు బిడ్డలు.
బాబాకు పిల్లలందరిపై, దేశీయులైనా, విదేశీయులైనా, పిల్లలందరిపై హృదయపూర్వక ప్రేమ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరికీ కూడా బాబాపై ప్రేమ ఉండటాన్ని బాబా చూసారు, అందుకే నడుస్తున్నారు. ఒకవేళ బాబాతో కనెక్షన్ లేకపోతే శక్తి ఎక్కడి నుండి తీసుకుంటారు? బాబా నుండే శక్తి తీసుకుని నడుస్తున్నారు కదా. పిల్లలకు బాబాపై ప్రేమ బాగుంది. బాబా ప్రేమ పిల్లలందరిపై ఉంది. దేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నాకానీ పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు ప్రియమైనవారు. ఎవరైనా కానీ, బాబా ప్రేమ నడిపిస్తుంది. బాబాను అసలు గుర్తు చెయ్యకపోతే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది! ప్రతి ఒక్కరి సంబంధం బాబాతో ఉంది. మాకు బాబాపై ప్రేమ లేదు అనేవారు చేతులెత్తండి. మేము మా పురుషార్థంతో నడుస్తున్నాము అనేవారు చేతులెత్తండి. పురుషార్థం ఎంత చేసినా కానీ, మేము మా పురుషార్థంతో నడుస్తున్నాము అనే వారు చేతులెత్తండి. (ఎవ్వరూ లేరు)
మోహిని అక్కయ్య:- సదా బాబా తోడు ఉంది. పిల్లలందరికీ ఈ తోడు ఉంది. సదా బాబా తోడుగా ఉన్నారు అని అనుభవం అవుతుందా? పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా సదా తోడుగా ఉంటారు, బాబా ఒక్కరైనప్పటికీ అందరికీ తోడుగా నిలవగలరు. మీరే చూడండి, ఇంతమంది కూర్చున్నారు, అందరికీ తోడుగా ఎవరున్నారు? బాబా తోడు ఉంది కదా! కనుక బాబాను తోడుగా పెట్టుకోండి, ఒక్కొక్కరికీ బాబా తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు. బాబా అందరితోటి ఉన్నారు.
మోహిని అక్కయ్య, న్యూయార్క్:- ఏ పాత్ర అయితే వహిస్తున్నారో మంచిగా వహిస్తున్నారు (బాబా ఇక్కడి వరకు తీసుకువచ్చారు, ఇందుకు చాలా చాలా ధన్యవాదాలు). ఎక్కడున్నా కానీ పిల్లలందరి ప్రియస్మృతులు బాబాకు చేరుకుంటాయి. ఎవ్వరూ దూరంగా లేరు, హృదయంలో ఉన్నారు. అందరికన్నా దగ్గరగా ఉన్నారు. (దూరంగా ఉన్నట్లుగా అనిపించదు) దూరంగా లేరు కూడా.
అందరూ బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు. అందరూ హృదయంలో ఉన్నారు కదా? హృదయాన్ని వరించిన వారు(దిల్వర్) ఎవరు? బాప్దాదాయే దిల్వర్ కదా. పిల్లల హృదయం కూడా బాబా దగ్గరే ఉంది. బాబా తోడు లేనిదే ఎవ్వరూ లేనే లేరు. తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు. ఎప్పుడూ సదా బాబా తోడున్నారు అన్న అనుభవంలో ఉంటున్నారు కదా! చేతులెత్తండి.
(రమేష్ అన్నయ్య పూణెలోని జగదాంబ భవన మ్యాపు బాప్‌దాదాకు చూపించారు) ఎంత పెంచాలనుకుంటారో అంత పెంచండి, జగదాంబ కావచ్చు, ఏ కార్యానికి ఏ పిల్లలు నిమిత్తమైనా కానీ, ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళవచ్చు, ముందుకు వెళ్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఎంత శక్తి ఉందో అందుకు తగ్గట్లుగా పాత్రను మంచిగా నిర్వహిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఉల్లాస - ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి.
పిల్లలందరూ తమ పురుషార్థంలో మునిగి ఉన్నారు, ఉంటారు - ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. పిల్లలందరూ పురుషార్థం మంచిగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు, ఇది చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఏది ఏమైనా కానీ మీ పురుషార్థం మీతోటే ఉంటుంది, పూర్తి పరివారం కూడా మీతో ఉంది, ఒంటరిగా లేరు. తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు. అందరి హృదయాలలో ఒక్క బాబా స్మృతియే ఉంది.
(బృజ్ మోహన్ అన్నయ్య ఢిల్లీ - ఇండియా గేట్ ప్రోగ్రామును వినిపించారు, నవంబరు 8 నాడు అక్కడ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది, అక్కడకు ఇద్దరు దాదీలు వస్తున్నారు, అందులో విశేషంగా ఏమి చెయ్యమంటారు?) విశేషంగా చెయ్యడము బాబాను ప్రత్యక్షం చెయ్యడమే. బాబాను ప్రత్యక్షం చెయ్యడమంటే అన్నీ చేస్తూ కూడా సర్వ సంబంధాలు ఒక్క బాబాతో ఉంచడము. బాబాతో సంబంధాన్ని జోడించే ఆధారము చాలా బాగుంది. ప్రత్యేకంగా సంగఠిత కార్యక్రమాన్ని పెట్టండి. ఇది ఢిల్లీ ప్రోగ్రాము అని ఎవ్వరూ అనుకోకూడదు. బాబా అందరివాడు, ఇది అందరి ప్రోగ్రాము. కొందరు దగ్గరగా ఉండచ్చు, కొందరు దూరంగా ఉండచ్చు, కానీ ఇది అందరిదీ. ఈ ఉల్లాస-ఉత్సాహాలే ఉన్నాయి, దీనినే పెంచాలి. ఎక్కడ ప్రోగ్రాము జరిగినా కానీ మాది అనిపించాలి. ఒక్కటే పరివారము. అందరికీ ఒక్క బాబా. ఒక్కరు, అనేకులు కనిపిస్తున్నా కానీ అందరూ ఒక్కరి వారే. ఇదే ఇక్కడి విశేషత, ముక్కలు ముక్కలు కాదు.
(డా. బనారస్ అన్నయ్య మెడికల్ వింగ్ సేవల పుస్తకాన్ని చూపించారు) మంచిది, అందరూ తయారు చేస్తున్నారు, బాబా సంతోషిస్తున్నారు. అందరూ కలిసి నడుస్తున్నారు మరియు నడుస్తూ ఉంటారు.
భూపాల్ అన్నయ్య ఉదయపూర్ ఇంటి గురించి అడిగారు:- ఏ కార్యం జరుగుతున్నా అందులో అందరి సహకారం ఉంటుంది. ఒక్కరిది కాదు, బ్రహ్మా కుమారీలది, కుమారులు అందులోనే వచ్చేసారు. (ఉదయ్‌పూర్‌లో అందరి రాకపోకలు జరుగుతాయి) రాకపోకలైతే ఉండనే ఉంటాయి, పరివారం కదా.
ఓం ప్రకాశ్ అన్నయ్య, ఇండోర్:- ఆరోగ్యం బాగుందా! (మొదటిసారి అనారోగ్యం వచ్చింది) అందరి సహకారంతో, బాబా తోడుతో ముందుకు వెళ్తూ ఉండండి. మంచిగా నడుస్తున్నారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్యం కొంచెం ఢీలాగా ఉన్నప్పటికీ మంచిగా అయిపోతారు. మంచిది. జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండండి.
కమలేశ్ అక్కయ్య, కటక్:- బాగున్నారా! మంచిది. (మీ ఆశీర్వాదాలతో బాగున్నాను) ఆశీర్వాదాలైతే ఎప్పటికీ ఉంటాయి.
ఆరోగ్యం కొంచెం ఢీలాగా ఉన్నాకానీ, ఇది కలియుగపు సమయము, ఇందులో ఇవన్నీ ఎలాగూ వస్తాయి కానీ అన్నీ వచ్చినా కానీ బాబా స్మృతితో ఉరికంబం నుండి ముల్లులా అయిపోతుంది. పరిస్థితులు ఉరికంబం సమానమైన రూపంలో వచ్చినా కానీ బాబా స్మృతితో ముల్లులా అయిపోవాలి. అచ్ఛా.
ఓంశాంతి