Search for a command to run...
10 Apr 2015
ముంబయి విల్లేపార్లే సేవాకేంద్రంలో దాదీ గుల్జార్గారు బాబాకు భోగ్ను స్వీకరింపజేసారు, అప్పుడు అవ్యక్త బాప్దాదా దాదీ శరీరంలోకి ప్రవేశించి మధురమైన మహావాక్యాలను ఉచ్ఛరించారు
10 April 2015 · తెలుగు
తమ స్వ స్వరూపం, భవిష్య స్వరూపం మరియు సంగమ మహా స్వరూపం, మూడు రూపాల గురించి తెలుసు కదా? సదా మూడు స్వరూపాలు ఒక్క సెకండులో మీ ముందుకు వస్తున్నాయా? ఈ సమయంలో బాప్దాదా పిల్లల వర్తమాన బ్రాహ్మణ స్వరూప మహిమను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మహిమ గొప్పది ఎందుకంటే పూర్తి కల్పంలో అందరికన్నా భాగ్యశాలి స్వరూపం ఇప్పుడు ఈ సంగమయుగ సమయానిది. సంగమయుగ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకుంటున్నారు. వాహ్ సంగమయుగ వరదానీ సమయము వాహ్! సరేనా. బాప్దాదా అయితే చూస్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ భవిష్య స్వరూపాన్ని తెలుసుకుని సంతోషిస్తున్నారు. మంచిది.
దాదీ జానకిగారు గుల్జార్ దాదీగారికి మరియు పార్లే నివాసులకు చాలా చాలా ప్రియస్మృతులను మరియు అభినందనలను అందించారు.
డ్రామాలో ఏది జరుగుతుందో అది మంచిది. అందరూ సంతోషంగా బాబాను కలిసారు. ఏమీ మిస్ అవ్వలేదు కదా! ఎందుకంటే బాబా మరియు పిల్లలైన మనమందరమూ కలిసి కూర్చున్నాము. అందరూ బాబా నుండి దృష్టి తీసుకున్నారు. దాదీ ఎల్లప్పుడూ మమ్మల్ని తమతోపాటు సభలోకి తీసుకువచ్చేవారు. ఈ రోజు మిస్ అవుతున్నాము. ఈరోజు దాదీ పార్లాలో ఉన్నారు, మనందరినీ బాప్దాదాతో కలిపించారు, అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. డ్రామా అన్నది ఎటువంటి జ్ఞానమంటే అది మనల్ని శాంతపరుస్తుంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా. అందరికీ బాబా భాసన వచ్చింది కదా. భాసన మరియు భావన, మనకు బాబా మిలనము యొక్క భాసన కావాలి, ఆ మిలనపు భాసన మిస్ అవ్వలేదు. మనం బాబా పిల్లలం, బాబా మనందరినీ ఎక్కడ కూర్చోబెట్టారు! బాబా సూక్ష్మంగా మనకు ఎంతో సకాశ్ను ఇచ్చారు. బాబా సకాశ్ మనందరికీ లభిస్తుంది. బాబాకు మనపై ఎంత ప్రేమ ఉంది!
పార్లాలో నిర్వైర్ అన్నయ్య బాప్దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు:- (బాప్దాదా నిర్వైర్ అన్నయ్య తలపై చేయి పెట్టారు)
బాప్దాదా ఎంతో స్నేహంతో అందరికీ పండును చూపిస్తూ, ఈ పండు మీ నోటిలోకి వస్తుందని అనుభవం చెయ్యమని చెప్పారు. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారు. ముందు నంబరులో సోదరీలు లేక సోదరులు అని ఏమీ లేదు. ఎవరి హృదయంలో అయితే బాబా ఉన్నారో వారి హృదయంలో బాబా ఉన్నారు, బాబా హృదయంలో వారు ఉన్నారు.
నిర్వైర్ అన్నయ్య అందరికీ స్మృతిని అందిస్తూ ఇలా అన్నారు - ఈరోజు విశేషంగా బాప్దాదా మిలన దివసము. దేశ విదేశాల సోదర సోదరీలైన మనమంతా ప్రత్యేకంగా సమ్ముఖానికి వచ్చి ఉన్నాము. బాప్దాదా మనందరి ఆశను పూర్తి చేస్తారు, మనందరినీ కలుసుకోవడానికి సమ్ముఖానికి చేరుకున్నారు. ఇందుకు మీ అందరికీ అభినందనలు, అభినందనలు. బాప్దాదా రాక ద్వారా బ్రాహ్మణ పిల్లల నిశ్చయం మరింత పరిపక్వమవుతుంది. బాప్దాదా ఈ సంగమయుగంలో తమ రథం ద్వారా మనకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. మనం జ్ఞాన రత్నాలతో మరియు ధారణలతో మన ఒడిని నింపుకుని, విశ్వ మహారాజు, మహారాణి యొక్క భవిష్య కిరీటాన్ని ధరిద్దాం, బాప్దాదాయే స్వయంగా మనందరికీ ఈ కిరీటాన్ని తొడుగుతారు.
యోగిని అక్కయ్య:- డ్రామానుసారంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. పార్లాలో కూర్చున్నప్పటికీ డైమండ్ హాలులో ఉన్నట్లుగానే మాకు అనిపిస్తుంది. మనతోపాటు దేశవిదేశాల నుండి విచ్చేసిన సోదరసోదరీలు, టీచర్ అక్కయ్యలు ఉన్నారు. ఈ రోజు బాప్దాదా అందరికీ ప్రేమతో నిండిన దృష్టిని ఇచ్చి వరదానాలతో అందరి ఒడిని నింపారు.
మన నీలూ అక్కయ్య కూడా బాప్దాదా రథానికి ఎంతో ప్రేమగా సేవ చేస్తున్నారు మరియు మన నిర్వైర్ అన్నయ్యగారు కూడా మనతో ఉన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, నిర్వైర్ అన్నయ్యగారి ఆరోగ్యం మెరుగవుతూ ఉంది.
ఓంశాంతి