Search for a command to run...
12 Feb 2016
సైన్సు సాధనాలు మిలనానికి దారిని సహజం చేసేసాయి కానీ, హృదయంతో చేసేదే అన్నిటికన్నా మంచి స్మృతి, హృదయంలో బాబా, బాబా గుర్తుండాలి, బాబాయే హృదయంలో నిండి ఉండాలి
12 February 2016 · తెలుగు
ఓం శాంతి. బాప్‌దాదాకు గారాల పిల్లలైన వారందరినీ చూసి బాప్‌దాదా కూడా చాలా హర్షిస్తున్నారు ఎందుకంటే పిల్లలందరూ బాబాకు ఎంతో ప్రియమైనవారు. ప్రతి ఒక్కరి ముఖం చూసి, బాప్‌దాదా తమ మనసులో పిల్లలు ఒక్కొక్కరి ముఖంలో బాబా మూర్తిని చూసి బాబాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో బాబాను చూసి బాబా హర్షితమవుతున్నట్లుగా, భారతదేశము మరియు విదేశము రెండు వైపుల ఉన్న పిల్లలను సాకారంలో చూసి బాబా ఎంతో సంతోషిస్తారు! వాహ్ పిల్లలు ప్రతి ఒక్కరూ వాహ్! అందరి నయనాలు అతి అతీతమైనవిగా మరియు ప్రియమైనవిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయం వాహ్ బాబా వాహ్ అనే అంటుంది. సాకార రూపంలో బాబా మరియు పిల్లల ఈ మిలనము ఎంత ప్రియంగా అనిపిస్తుంది! ఎంతో సమయం తర్వాత సాకారంలో బాప్‌దాదా పిల్లలను చూసి మరియు పిల్లలు కూడా బాబాను చూసి ఎంతగానో హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలలో వాహ్ బాబా వాహ్! అన్న పాటే మ్రోగుతుంది, మరియు బాబా హృదయంలో కూడా వాహ్ పిల్లలు వాహ్! అన్న పాటే మ్రోగుతుంది. బాబా హృదయంలో వాహ్ పిల్లలు వాహ్! కొద్ది సమయపు ఈ మిలనము ఎంత ప్రియమైనది. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయాలలో బాబా నిండి ఉన్నారు. ప్రేమ స్వరూపులైన పిల్లలందరిలో, ఇద్దరి హృదయాలలో నా బాబా అని ఉంది, అలాగే బాబా హృదయంలో నా పిల్లలు అని ఉంది. ఈ క్షణంలో మెజారిటీ పిల్లలందరూ బాబాను సమ్ముఖంలో చూసి హృదయంలో, మాటలో నా బాబా అన్న పాటను వినిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలలో నా బాబా, నంబరువారీగా ఉండచ్చు కానీ హృదయంలో ఇముడ్చుకున్నదేమిటి? నా బాబా. అలాగే బాబా హృదయంలో ఎవరున్నారు? నా పిల్లలు. ఇంత సమ్ముఖంలో మిలనం జరుపుకోవడాన్ని చూసి అందరి హృదయాలు హర్షిస్తున్నాయి. బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరి హృదయపు స్మృతి యొక్క ఫోటోను చూసి హర్షిస్తున్నారు, వాహ్ పిల్లలు వాహ్! ఈ మిలనం, సమ్ముఖ మిలనం, ఎవరి ద్వారానో జరుగుతుండవచ్చు కానీ ఈ మిలనం, ఈ మిలనపు అనుభవం సాధారణమైనది కాదు. బాబా హృదయంలో ఇంతమంది పిల్లలు ఇమిడి ఉన్నారు. పిల్లల హృదయాల నుండి వాహ్ బాబా వాహ్, బాబా హృదయం నుండి వాహ్ పిల్లలు వాహ్! ప్రతి ఒక్కరి హృదయంలో, పిల్లల హృదయంలో బాబా, బాబా హృదయంలో పిల్లలు. ఈ హృదయపు మిలనము చిత్రం రూపంలో చూస్తే ప్రేమలో లీనమైన చిత్రం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయం ఏమని చెప్తుంది? నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా. బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి ప్రేమను హృదయంలో ఇముడ్చుకుని ఉన్నారు. ఇటువంటి ప్రభు మిలనము మా భాగ్యంలో ఉంటుందని భక్తిలో అనుకోలేదు కదా, కానీ డ్రామా అనండి లేక అదృష్టం అనండి, పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి బాబాకు ఎంతగానో సంతోషం కలుగుతుంది. వాహ్ పిల్లలు వాహ్! ఎటువంటి మిలనం అంటే సమ్ముఖ మిలనంలా ఉంది. ఇటువంటి మిలనపు అవకాశం డ్రామాలో లభించింది అని అంటాము. చాలా బాగా మనసు ఆనందంలోకి వస్తుంది. రూపం వేరైనా కానీ మిలనమే కదా! ఏమనిపిస్తుంది? బాబా కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలు కలవడానికి వచ్చారు. ఇటువంటి భాగ్యము సాకార రూపంలో ఇలా లభించడం, ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇది చూసి ఎంత సంతోషిస్తున్నారు!
ఇప్పుడు బాబాకు పిల్లల పట్ల ఒకే ఒక్క కోరిక ఉంది, ప్రతి ఒక్కరి హృదయం కూడా ఇదే అంటుంది, పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా హృదయంలోనే ఉండాలి, అలా ఉంటూ ఉంటూ ఎంత సంతోషాన్ని అనుభవం చేస్తారంటే, ఎంత చేస్తున్నా కానీ మనసు తృప్తిగా అనిపించదు. ఇటువంటి బాబా, కలియుగంలో ఇటువంటివారు లభించడం ఎంతటి భాగ్యపు విషయం అని హృదయంలో ప్రతి సమయము అనిపిస్తూ ఉంటుంది. సైన్సు వారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మిలనం కోసం ఎటువంటి దారులు తయారు చేసారంటే సమ్ముఖంలో లేకపోయినా కానీ సమ్ముఖపు అనుభవాన్ని కలిగిస్తున్నారు. కొంతమంది పిల్లల అనుభవాలను విని, చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు. తండ్రి మరియు పిల్లలు ఇరువురూ సంతోషంగా కలుసుకుంటే ఏమవుతుందో మీరు అనుభవీలే కదా. ఈ సైన్సు వారిని, తయారు చెయ్యడానికి నిమిత్తంగా అయినవారిని చూసి, బాప్‌దాదా మనసులోనే వారి గురించి వాహ్! అన్న పాటను పాడుతున్నారు. తండ్రి మరియు పిల్లల ఈ మిలనము సదా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది కానీ డ్రామాలో ఇంతే ఉంది. అయినప్పటికీ సైన్సు మిలనానికి దారులను చాలా సహజం చేసేసింది. ఎదురుగా కనిపిస్తుంది కూడా మరియు వినిపిస్తుంది కూడా. బాప్‌దాదా కూడా పిల్లలను చూసినప్పుడు ఎంత సంతోషిస్తారు! కలియుగంలో సాధనాలను చాలా బాగా తయారు చేసారు. అయినా ఎదురుగా భాసన అయితే ఇస్తారు కదా. ఏది ఏమైనా, సమీపత యొక్క భావన అయితే ఉండదు కదా, అయినా కానీ బాబా ముఖము, నయనాలు, శాంతి, మిలనమునైతే చూస్తారు కదా, ఇది కూడా సంగమపు అద్భుతము. మరి పిల్లలంతా చూసి, మాట్లాడి, కలిసి సంతోషిస్తారు కదా, అందరూ మధువనానికి రావడానికి ప్రయత్నిస్తారు. బాబా కూడా పిల్లలందరినీ చూసి ఎంత సంతోషిస్తుండవచ్చు! పూర్తి డ్రామాలో ఈ మిలనము కూడా విచిత్రమైనది. ఎప్పుడు ఇటువంటి రోజు వచ్చినా పిల్లలంతా ఇక్కడకు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కలియుగం కదా, కలియుగంలో అన్ని సుఖాలు పూర్తి అవ్వవు. అవుతాయి కానీ మనిషి కోరుకున్నవన్నీ పూర్తవ్వవు. ఇటువంటి మిలనము కూడా వీలవుతుంది అని బాప్‌దాదా విన్నప్పుడు ఎంత సంతోషమేసి ఉండవచ్చు! పిల్లలకైతే సంతోషం ఉండనే ఉంటుంది, బాబాకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయాలలో బాబా స్మృతి సదా ఉంటుందా లేక కష్టమా? బాబా స్మృతిని మర్చిపోవడం కష్టము అని భావించేవారు చేతులెత్తండి. మర్చిపోవడం కష్టమా? మరి మీరేమి చేస్తారు? మనసులోనే ఇముడ్చేసుకుంటారు! కొంతమంది పిల్లలైతే వారి హృదయంలో ఎంతగా స్మృతి నిండి ఉంటుందంటే ఒంటరిగా, మౌనంగా కూర్చుని ఉంటారు కానీ ఎదురుగా మాట్లాడుతున్నారు అనే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మిలనపు రోజు చాలా విలువైనదని అందరికీ తెలుసు. అయినా కానీ సైన్సు వారికైతే థ్యాంక్స్ చెప్పాలి కదా. ఏదో ఒక సాధనము ద్వారా బాబా ఎదురుగా వచ్చారు, మాట వినిపిస్తుంది, ఎంత సంతోషం కలుగుతుంది. ఈ సాధనము ద్వారా వినవచ్చు మరియు కలవవచ్చు కూడా అని బాప్‌దాదా విన్నప్పుడు బాబా నోటి నుండి ఏమి వెలువడుతుంది? వాహ్ సైన్సు పిల్లలు వాహ్! ఎటువంటి సాధనాలు తయారు చేసారంటే బాబాను చూడాలని ఎప్పుడు అనిపించినా, వినాలనిపించినా చూడచ్చు, వినవచ్చు. మన ఎదురుగానే కూర్చున్నట్లుగా ఉంటుంది, ఇటువంటి సాధనాలు కూడా తయారు చేసారు కదా. కానీ మొదటి విషయము, మన హృదయంలోనే ఇమర్జ్ అవ్వాలి, మిలనం జరగగలదు, ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. కనుక బాబా సైన్సువారిని చాలా చాలా గుర్తు చేస్తున్నారు. ఇంకా కూడా ఏదైనా తయారుచేసి మరింత సమీపతను తీసుకురండి, దీనితో పిల్లలు కూడా సంతోషడతారు మరియు బాబా కూడా సంతోషిస్తారు. ఇలా చెప్తే పిల్లలు సైన్సు వారివెనక పడి, యోగం చేసి ఆవిష్కరణలు తీసుకువస్తారు. బాప్‌దాదా కూడా పిల్లల హృదయపు స్మృతిని చూసి ఊరికే కూర్చోలేరు. ఏదో ఒక సాధనము వెలువడుతూనే ఉంటుంది దీనితో పేదవారు కూడా చూడవచ్చు, షాహుకారులు కూడా చూడవచ్చు. అన్నిటికన్నా సహజ మిలనము - హృదయపు మిలనము.
ఈరోజు ఉదయంనుండి లేచి ఉన్నారు, బాబాను కలుసుకునేవరకు మీ దర్పణంలో ఏమేమి వచ్చాయి? ఇప్పుడు వెళ్ళాలి, బాబా వచ్చి ఉంటారు, బాబా మురళి నడిపిస్తారు అని పదే పదే అనుకున్నారు కదా. సైన్సు వారికి కూడా అభినందనలు. ఎటువంటి ఆవిష్కరణ వచ్చినా కానీ పిల్లలు ఇక్కడికి చేరుకున్నారు తద్వారా మీరు బాబా ఎదురుగా ఉన్నారు, బాబా మీ ఎదురుగా వచ్చేసారు. అయినా కానీ ఇంతైతే జరిగింది కదా. చిన్నని మిలనమే కానీ, మిలనమే కదా. బాబా కూడా గుర్తు చేస్తారు, పిల్లలు కూడా గుర్తు చేస్తారు కానీ స్మృతికి రెస్పాన్స్ లభిస్తే అందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. స్మృతి అయితే అందరూ చేస్తారు, ఎవ్వరైనా కానీ, ఏమీ తెలియనివారైనా కానీ, చిన్నపిల్లవాడు కూడా, ఈనాటి ఫోటో ఇవ్వండి బాబా ఎలా మురళి చెప్తారో చూస్తాము అని అంటారు కదా. ఇదే హృదయపు ఆకర్షణ. కేవలం బాబా అన్న మాట. మాట్లాడుతున్నా, వింటున్నా, చూస్తున్నా బాబా బాబా బాబా. బాబా పిల్లలలో, పిల్లలు బాబాలో ఇమిడిపోతారు. పిల్లలు ప్రయత్నం చేసి ఎక్కడెక్కడి నుండి, ఎలా-ఎలా చేరుకుంటారో చూడండి. తండ్రి మరియు పిల్లల ఈ మిలనము లేక ఆత్మ పరమాత్మల మిలనము ఎంతటి అమూల్యమైనది! ఈ అమూల్యమైన మిలనపు సమయాన్ని సంగమయుగము అని అంటాము. ఈ యుగం గురించి మహిమ చేస్తుంటే కళ్ళు ఎంత చెమ్మగిల్లుతాయి. మరి బాబా పరీక్ష పెడ్తారు. రోజంతా ఎంత సమయం బాబాను గుర్తు చేసారు అని అకస్మాత్తుగా పరీక్ష పెడ్తాము. ఎందుకంటే బాబా చాలా ప్రియమైనవారు అని అందరూ అంటారు. ఇది చేస్తాము, ఇది చేద్దాము అంటున్నారు, ఇది బాగానే ఉంది. హృదయంలో ప్రేమ అయితే అందరికీ ఉంది కానీ ఎంత సమయాన్ని కేటాయించి స్మృతిలో కూర్చుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఈ చరిత్ర అయితే ప్రతి ఒక్కరికీ తమది తమకు తెలుసు మరియు బాబాకు తెలుసు. పిల్లలంతా బాగున్నారా? ఆరోగ్యం వగైరాలు అన్నీ బాగుంటే చేతులెత్తండి. అందరి చేతులను చూస్తే కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. హాల్ నిండిపోతే ఆ దృశ్యం ఎంతో బాగుంటుంది. ముందుగా, అన్నిటికన్నా మంచిది హృదయపు స్మృతి. హృదయంలో బాబా, బాబాయే గుర్తుండాలి. నడుస్తూ తిరుగుతూ ఏమి చేస్తున్నా కానీ బాబాయే మనసులో ఉండాలి. అందుకే బాబా కూడా మనసు ఉండబట్టలేరు, పిల్లల మనసు కూడా ఉండబట్టలేదు, అందుకే డ్రామాలో మిలనపు సాధనం కూడా చాలా బాగుంది. సైన్సు ఈ సమయంలో మిలనానికి దారిని చాలా బాగా చేసింది. చిన్న క్యాసెట్లు పెడితే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాటలు వినవచ్చు. సైన్సు కూడా అద్భుతం చేసిందని బాబా అంటున్నారు - వినడంలోనూ మరియు చూడటంలోనూ. కానీ బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇవన్నీ అల్పకాలికమైన సాధనాలు, మీతో సదా ఉండేది మీ హృదయము. హృదయంతో బాబాను గుర్తు చెయ్యండి మరియు ఇమర్జ్ రూపంలో ఉండాలి, ఈ అభ్యాసం తప్పనిసరి. అచ్ఛా. ఇప్పుడు ఈరోజు ఏ వైపు వారు వచ్చారు?
సేవ టర్న్ ఈస్టర్న్ జోన్‌ది. అస్సాం, బంగాల్, బీహార్, ఒరిస్సా, నేపాల్ మరియు తమిళనాడు జోన్ నుండి 18,000 మంది వచ్చారు. మొత్తం 23 వేల మంది వచ్చారు:- మంచిది. సైన్సు వారు కూడా తమ మీద ఉన్న ఫిర్యాదులను తొలగించుకుంటున్నారు. ఇవ్వగలిగినవారు ఇస్తున్నారు. కానీ అన్నిటికన్నా సహజంగా స్మృతి చేసే విధానము - ఎటువంటి సాధనాలు లేకుండానే స్మృతి మనసులోకి వచ్చేయాలి, స్మృతిని తొలగించాలనుకున్నా కానీ తొలగించలేనంతగా ఉండాలి. సాధనాలు ఇన్ని ఉన్నాయంటే ఇది సైన్సు చేసిన అద్భుతం. సమయానికి సైన్సు సాధనాలు వచ్చిన కారణంగా పిల్లలు ఎక్కడున్నా, విదేశాలలో ఉన్నా లేక ఇక్కడున్నా, అందరూ సాధనాలతో మిలనాన్ని జరుపుకోవచ్చు. కనుక సంగమంలో కేవలం బాబా తోడు మాత్రమే కాదు, ఇటువంటి సాధనాల సహాయం కూడా లభిస్తుంది. మిలనం కోసం ఎన్ని సైన్సు సాధనాలు ఉన్నాయి. సంగమంలో తండ్రి మరియు పిల్లల మిలనానికి అవసరమయ్యే సాధనాలు కూడా తక్కువైనవేమీ కాదు కనుక మన మిలనానికి సైన్సు కూడా నిమిత్తమైంది అని సైన్సును చెప్పవచ్చు. అందుకు డబ్బులు ఖర్చయినా కానీ దూరంగా కూర్చుని కూడా మిలనం జరుగుతుంది కదా. ఏది చేసైనా డబ్బులను ఇందుకు ప్రోగు చేస్తారు.
డబల్ విదేశీయులు 60 దేశాల నుండి 700 మంది సోదరీసోదరులు వచ్చారు:- ఇక్కడివారు, అక్కడివారు అంతా బాగున్నారు. చేరుకున్నారు, మంచిది. పిల్లలు ఎలాగైనా డబ్బును ప్రోగు చేసి మిలనానికి వస్తారు. ఇదైతే వారి అద్భుతం చాలా బాగుంటుంది. డబ్బును ఎలా ప్రోగు చేస్తారో బాబా వింటూ ఉంటారు. రెండవ విషయం, మనసులో ఎంత తపన ఉంది. తపనతో పాటు సాధనాలను ఎలా ప్రోగు చేస్తారు, అద్భుతమంటే వారిది ఎందుకంటే ముందు టికెట్ కావాలి కదా. కానీ బాబా చూసారు, పిల్లల హృదయంలో బాబా, బాబా హృదయంలో పిల్లలు. ఎప్పుడు మిలనపు రోజు వస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలకు బాబాపై మరియు బాబాకు కూడా పిల్లలపై ఎంతగానో హృదయపు ప్రేమ ఉంది. ఎప్పుడు మొదలవుతుందా అని ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి అందరూ బాగున్నారా? అందరి ఆరోగ్యం బాగుందా? బాబాకు కూడా పిల్లలను చూసి చాలా సంతోషంగా ఉంటుంది, ఎంతగా పిల్లలు ఎక్కువ ఉంటారో అంతగా బాబాకు సంతోషంగా ఉంటుంది. అందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా ప్రియస్మృతులైతే ఉండనే ఉన్నాయి. ఎందుకంటే మనసులో ఇమిడి ఉన్నది ఎవరు? ముఖ్యంగా ఇక్కడ మురళి ప్రారంభమైనప్పుడు, అందరూ తమ ఇళ్ళల్లో కూడా మురళి సమయానికి, సీజన్ ప్రారంభమయింది అని ఏదైనా చేసి అటెన్షన్ పెట్టి సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలకు మురళిపై ఎంత మనసు ఉంది అని చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. మురళి ఖజానా కదా. కనుక ఎటువంటి పరిస్థితి ఉన్నాకానీ మురళిని వినడానికైతే చేరుకుంటారు. ఇక్కడ కూడా ఎవరైతే మనస్ఫూర్తిగా చేరుకున్నారో వారందరికీ సమ్ముఖ మిలనమైతే జరిగింది కానీ ఇప్పుడు ఈ మిలనాన్ని పెంచుతూ ఉండండి. ఎంత వీలైతే అంత పెంచండి. ఈ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ హాల్ కూడా నిండిపోయింది. బాబా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ఎవరెవరైతే వచ్చారో అందరికీ బాబా మనస్ఫూర్తిగా ప్రియస్మృతులకు రిటర్న్ ప్రియస్మృతులను ఇస్తున్నారు.
దాదీ జానకి గారితో:- కృషి బాగా చేసారు. ప్రకృతితో కూడా కృషి బాగా చేసారు. అందరూ మిమ్మల్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు. విదేశాలు తిరిగి వచ్చినప్పటికీ ఆరోగ్యం బాగుండటం మంచి విషయం. వయస్సు ప్రకారం చూసుకున్నా కూడా మంచి విషయమే. (బహ్రెయిన్ యొక్క ఇబ్రహీమ్ సోదరుని స్మృతిని బాప్‌దాదాకు అందించారు) మంచిది. ఒకరికొకరు సహయోగిగా అవ్వడం మంచిదే. అంటే పూర్తిగా ఇప్పుడు ఏదైతే సేవ జరుగుతుందో, ఇప్పుడు సరైన అటెన్షన్ ఉంది. విదేశాల ప్రభావం దేశంపై పడుతుంది, దేశం ప్రభావం విదేశంలో ఉంది. ఒకరికొకరు సహయోగులు కూడా.
మోహిని అక్కయ్య:- ఆరోగ్యం కొంచెం ఢీలాగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. (మీ ఒడిలో ఉన్నాను) అక్కడైతే విశ్రాంతే ఉంది కదా. వీరు సదా బాగా అవుతూ బాగున్నారు. మంచిది.
ఈషూ దాదీతో:- (ఆరోగ్యం బాగాలేదు) గాభరా పడవద్దు, గాభరా పడితే ఇంకా పెరుగుతుంది. దేని గురించి ఆలోచిస్తారో అది పెరుగుతుంది. అందుకే చికిత్స జరిగిపోయిందనే భావించండి. బాబాను గుర్తు చేయండి, మందు బిళ్ళను ఒకసారి తీసుకోండి, అంతే. తీసుకోవాల్సిన మందును ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోండి, కానీ ఈ మందు నాకు ఉపయోగపడుతుంది అనుకుంటూ తీసుకోండి. నెమ్మది నెమ్మదిగా పని చేసినా కానీ మీకు తేడా కనిపిస్తుంది, అంతే. అందరికీ మీ ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే అందరి ఆలోచన మీ గురించే ఉంటుంది కదా.
ముగ్గురు అన్నయ్యలతో:- అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ తింటూ, త్రాగుతూ ఉన్నారు కదా. ఇదైతే తింటూ ఉండాలి. తినండి, త్రాగండి, టోలీ తినకూడదు అనేమీ లేదు. ఆరోగ్యం బాగాలేదనుకోండి, భోగ్ అయితే అందరికీ ఆటోమేటిక్‌గా లభిస్తుంది కదా. భోగ్ అయితే అందరికీ అనారోగ్య సమయంలో కూడా లభిస్తుంది. అలా అని మరీ నిశ్చింతగా అయిపోకండి. జాగ్రత్త పడటం మంచిది కానీ మరీ ఎక్కువ కాదు. మధ్యమార్గంలో, ఎలా ఉండాలో అలా ఉండండి. ఎందుకంటే ఇక్కడైతే చాలా మంది ఉన్నారు కదా. ఒకరిని చూసి మరొకరికి అనిపిస్తుంది. (ఇప్పుడు ఇంకా సంఖ్య పెరుగుతుంది) సాధనాలు తీసుకోండి, వస్తే ఇక్కడే వృద్ధి జరుగుతుంది. ఎక్కడికి వస్తారు? ఇక్కడికే వస్తారు కదా. (ఉండటానికైతే సాధనాలు పెంచాల్సి ఉంటుంది) ఇప్పుడు జరుగుతుంది కదా. (చాలామంది పిల్లలు బయట కూర్చుని ఉన్నారు) దానివల్ల నష్టమేమీ లేదు కదా.
(రమేష్ అన్నయ్య అన్నారు, మీరు వచ్చే టర్న్‌లు ఇంకా పెంచాలి) అదైతే చూద్దాము. ముందు ఇక్కడి సాధనాలను సరి చెయ్యండి. పిల్లలు పెరిగితే సాధనాలు కూడా తప్పకుండా పెరుగుతాయి కదా. భాషణ వినేందుకు వీలుగా ఉండాలి కదా. ఒకవేళ సరైన ఏర్పాట్లు లేకపోతే మురళి ఏమి వింటారు! (వర్షం నుండి రక్షణ కోసం హాల్ పైన మరో కప్పు వేయడం జరిగింది) మంచిది, సాధనాలైతే కావాలి కదా లేకపోతే మురళి సమయంలో వర్షపు నీటిని లెక్కించుకుంటూ ఉంటారు కనుక అన్నిటిలో లిమిట్ (పరిమితి) ఉండాలి. సాధనాలు కావాలి కానీ సాధనాలకు వశీభూతమై కాదు. ఇక్కడైతే సాధనాలు లేకుండా నడవడం కష్టం ఎందుకంటే వర్షం అలాగే పడుతుంది. జ్ఞానరీతిలో చూస్తే టూమచ్(అతి) లోకి వెళ్ళవద్దు. సాధనాలను తప్పకుండా ఉపయోగించండి కానీ హద్దు.
విదేశాల పెద్దక్కయ్యలతో: - మీరు మీ శరీరాల అనుసారంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా. అంతేకానీ శరీరముదేముంది, అనుభవించాల్సింది అనుభవించాల్సిందే కదా అని అనుకోకండి. ముందు నుండే జాగ్రత్త పడండి. అనారోగ్యం వచ్చేందుకు ఇవి లక్షణాలు అని ముందు నుండే తెలిసినప్పుడు, దాని మందు తెలిసినప్పుడు ముందు నుండే ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పుడైతే అందరూ చిన్న-పెద్ద డాక్టర్లయ్యారు. కనుక శరీరాన్ని కూడా సంభాళించుకోండి. (బాబా ద్వారా క్రొత్త వెబ్సైట్ యొక్క ఉద్ఘాటనను చేయించారు) ఇక అంతా మంచిగా జరుగుతుంది కదా. మంచిది. (న్యూయార్క్ మోహిని అక్కయ్య అందరి స్మృతిని అందించారు)
స్మృతిని తప్పక ఇవ్వండి. వారు కూడా సంతోషిస్తారు కదా. మంచిది (దాదీ జానకి కోసం) వీరిని కూడా జాగ్రత్తగా చూసుకోండి.
(బాబా, మీరు వచ్చే సీజన్లో మళ్ళీ రావాలి)
(నీలూ అక్కయ్య ఇలా అన్నారు, బాబా, ముందు రథాన్ని మంచిగా ఉంచండి, తర్వాత వచ్చే ప్రోగ్రామును ఇవ్వండి)
డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది, అందుకని మీరంతా మీ ఆలోచనలను ఇవ్వండి కానీ అలాగే జరగాలని మాత్రం అనకండి. ఇందులో కూడా, ఏ టర్న్‌లో బాబా వస్తారో వారు సంతోషిస్తారు, ఒకవేళ ఏ టర్న్లోనైనా బాబా రాకపోతే వారికి సంకల్పాలు నడుస్తాయి, అందుకే అలా అవ్వకూడదని అనుకుంటున్నారు. ఇందులో కేవలం ఒక్క విషయం కాదు, చాలా విషయాలు ఉన్నాయి. బాబా చూసి దాని అనుసారంగా వారే చేస్తారు. ఎందుకంటే ఒకరిని తృప్తిపరిస్తే మరొకరు నేను కూడా ఉన్నాను కదా అనుకుంటారు. అలా అయితే అందరూ ప్రత్యేకమైనవారే కదా. ప్రతి టర్న్‌లో 23-24 వేల మంది ఉంటున్నారు. (టి.వి ద్వారా లక్షలమంది చూస్తున్నారు, జోన్ ప్రకారంగా ఇక్కడకు రావడం చాలా బాగుంది). వారు రావచ్చు, ఇందుకు అవకాశం ఉండనే ఉంది కదా. (బాబా, వార్షిక మీటింగ్ కోసం ఏదైనా ప్రేరణ ఇవ్వండి, మిగిలి ఉన్న సేవ ఏదైనా ఉంటే చేస్తాము) మీరు కూడా ఆలోచించండి (ఈ సంవత్సరానికి థీమ్) ఏమి పెట్టమంటారు?) మీరు పరస్పరంలో మీటింగ్ చేసుకోండి, ముందు ఆ మీటింగ్‌లో ఆలోచించండి తర్వాత బాబా పాస్ చేస్తారు. అచ్ఛా!
ఓంశాంతి