Search for a command to run...
18 Jan 2016
అభిరుచితో చదువును చదువుకునే విద్యార్థులు ఎప్పుడూ ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ అవ్వలేరు, ఫెయిల్ అవ్వడము అంటే ఫీల్ అవ్వడము
18 January 2016 · తెలుగు
ఓం శాంతి. అందరూ బాప్‌దాదా నుండి ముందుగా దృష్టిని పొందారు. మీరు చూసింది ఈ స్థూల నేత్రాలతోనే కావచ్చు కానీ ఈ నేత్రాలలో కూడా బాబా దృష్టి పడగానే ఈ దృష్టి కూడా పరివర్తన అవుతుంది. అందరికీ ఈ పూర్తి సభలో ఎవరు కనిపిస్తున్నారు? అందరూ నంబరువారీ బ్రాహ్మణులు కనిపిస్తున్నారు. కొద్దిగా మధ్యమధ్యలో మిక్స్ అవుతుంది కానీ అందరి బుద్ధిలో బాప్దాదాయే ఉన్నారు. మా బాబా వచ్చారు అని అందరూ అనుకుంటారు. అందరి బుద్దిలో నా బాబా, నా బాబా వచ్చారు అని ఉంది. నా బాబా వచ్చారు అన్న సంతోషపు దృశ్యమే అందరి నయనాలలో ఇమిడి ఉంది. అందరి నయనాలలో ఎవరు ఉన్నారు? నా బాబా. నయనాలలో కూడా బాబా కనిపిస్తున్నారు, బుద్ధిలో కూడా బాబా కనిపిస్తున్నారు అందుకే మీ అందరి నయనాలలో ప్రియమైన బాబా, మధురమైన బాబా, నా బాబా ఇమిడి ఉన్నారు. బాబా కూడా పిల్లలను నా పిల్లలు అన్న రూపంలోనే చూస్తున్నారు. పిల్లలు కూడా నా బాబా అన్న రూపంలో చూస్తున్నారు. అందరి హృదయాలలో ఏమి కనిపిస్తుంది? నా బాబా వచ్చేసారు. నా బాబా, నా అని అనడంలో ఎంత సంతోషం ఉంటుంది! నా బాబా, వీరు లండన్ వారు, వీరు ఇండియావారు అని ఎంత చెప్పినా కానీ ముందుగా ఏమి వస్తుంది? నా బాబా వచ్చేసారు. తండ్రి మరియు పిల్లల మిలనము జరుగుతుంది. ఈ మిలనము కూడా విచిత్రమైన మిలనము. స్థూలపరంగా చూస్తే ఒకరి వయసు ఒకటైతే మరొకరిది మరో వయస్సు. కానీ వీరు ఎవరు అని షార్ట్‌లో చెప్పాలంటే తండ్రి మరియు పిల్లలు అని అంటాము. 100 సంవత్సరాల వయసు వారు కావచ్చు, 150 సంవత్సరాలవారు కావచ్చు, అయినా ఏమంటాము? అందరూ బాబా పిల్లలు కూర్చున్నారు అని అంటాము. ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు ఏమని పరిచయం ఇస్తారు? ఏ రూపంలో వచ్చినాకానీ ఇక్కడకు రాగానే ఏ రూపంలో కూర్చుంటారు? విద్యార్థి రూపంలో. తండ్రి ఎదుట విద్యార్థి రూపంలో కూర్చున్నారు. బాబా పిల్లలు పూర్తి ప్రపంచంలోని నలువైపుల నుండి వచ్చి ఉన్నారు. ఒకరు ఒక దేశంనుండి, ఇంకొకరు ఇంకో దేశంనుండి వచ్చి ఉండవచ్చు, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమని భావిస్తారు? మేము గాడ్లీ(భగవంతుని) విద్యార్థులము, మరి టీచర్ ఎవరు? స్వయంగా భగవంతుడు మన కోసం విశేషంగా మనల్ని కలవడానికి వచ్చారు. భగవంతుడు మనల్ని కలుసుకోవడానికి వచ్చారా లేక మనం భగవంతుడ్ని కలవడానికి వచ్చామా? గుర్తించినప్పుడు, ఇక్కడకు వచ్చిన వారందరూ ఏమని అంటారు? బాబా దగ్గరకు వెళ్తున్నాము, బాబా దగ్గరకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరి ముఖాలలో కలుసుకునే భావన ఎంతగా కనిపిస్తుంది! అందరి ముఖాలలో తండ్రి మరియు పిల్లల భావన నిండి ఉంది. అందరి ముఖాలలో ఎంత ప్రేమ ఉంది, వాహ్ బాబా వాహ్! అందరి హృదయాలు ఈ పాటనే పాడుతున్నాయి. ఎంత ప్రేమ, తండ్రి మరియు పిల్లల రూపంలో ఈ మిలనము, ఈనాటి సభలో చూస్తే తండ్రి మరియు పిల్లల సంబంధం తప్ప మరే ఇతర సంబంధం కనిపించడం లేదు. వృద్ధులు కావచ్చు లేక మరే ఇతర సంబంధమైనా కావచ్చు కానీ అందరూ విద్యార్థి రూపంలో ఉన్నారు. అందరి బుద్ధిలో విద్యార్థినన్న భావన ఇమిడి ఉంది. అందరి బుద్ధిలో లక్ష్యం ఇదే ఉంది. అనేక దేశాలు, అనేక ఆత్మలు, కానీ ఈ బ్రాహ్మణ జీవితంలో అందరూ విద్యార్థి రూపంలో ఉన్నారు. వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వారైతే ఎలాగూ పిల్లలే కానీ అందరూ చదువుకునే విద్యార్థులు ఉన్నారు.
ఈరోజు బాబా ఇది చెప్పారు, ఈరోజు బాబా ఇది చెప్పారు, ఈరోజు బాబా అశరీరిగా అయ్యే విషయం వినిపించారు, బాబా ఎంత మంచి మాటలు వినిపిస్తున్నారు. అందరి మనసులలో ఇప్పుడు తమను తాము ఏ రూపంలో, ఏ విధంగా చూసుకుంటున్నారు? విద్యార్థి. వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, చేసే పని చదువుకోవడం, ఈ చదువులో ఎంత శక్తి నిండి ఉంది. ఎంత సాధారణంగా ఉన్నారు కానీ ఈ చదువు ద్వారా ఎలా అవుతున్నారు? ఈరోజు ఏమి చదువుకోవడానికి వచ్చారు అని ఎవరిని అడిగినా ఏమని చెప్తారు? మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము అని అందరూ అంటారు. ఎంతో ప్రేమగా చదువును చదువుకుంటున్నారు. అందరూ ఎంతో అభిరుచితో చదువుతున్నారు, కానీ మధ్యలో మరింకేదైనా విషయం వస్తే జరుగుతున్న ముఖ్య విషయమైతే మిస్ అయిపోతుంది కదా. కానీ మెజారిటీ అందరిలో మిక్స్ అవ్వడాన్ని చూడటం జరిగింది కానీ అందరూ విద్యార్థి రూపంలో చదువుకోవడానికి వచ్చారు. అందరూ చదువుకునే రూపంలో ఉంటే, వీరు చదువులో బిజీగా ఉన్నారు అని వారి ముఖం ద్వారానే తెలిసిపోతుంది. వీరిని చదివించేది ఎవరు? ఈ విషయం గుర్తున్నట్లయితే నావ తీరానికి చేరిపోతుంది. చదివించేది పరమాత్మ, పరమాత్మ చదివిస్తారు కూడా అని ఎప్పుడైనా విన్నారా కానీ ఈ చదువులో మెజారిటీ అందరూ పాస్ అయిపోతారు, ఎందుకని? ఇక్కడి టీచరు, ఎటువంటి విధితో చదివిస్తారంటే వినగానే అది ముద్ర పడిపోతూ ఉంటుంది. మర్చిపోరు. అందరూ ఎంతో సంతోషంగా చదువుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నాము కదా, చాలా కొద్దిమంది ఏదో ఒక పరిస్థితి అనుసారంగా, వచ్చింది చదువుకోవడానికే అయినా కానీ చదువు కాకుండా మరో సబ్జెక్టులో ఎక్కువ అటెన్షన్ పెడ్తున్నారు. ఇప్పుడు కూడా అదే గుర్తు చేసుకుంటున్నారు. చదువుపై ప్రేమ ఉంది, చివరి సమయం వరకు చదువుపై అటెన్షన్ ఉంటుంది. అటువంటి విద్యార్థులు ఈ హాలులో మూడొంతుల పైనే ఉన్నారు. ఈ క్లాసులో కూర్చున్న విద్యార్థుల విశేషత మరియు అద్భుతం ఏమిటంటే చదువుపై అటెన్షన్ పెట్టేవారు అని బాప్‌దాదా చూస్తున్నారు. మరి మీరు ఎవరు? ఇదైతే ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ చూస్తే, ఇప్పుడు ఏ పిల్లలైతే హాజరు అయి ఉన్నారో, వారిలో మెజారిటీ మందిలో చదువుపై అసక్తి ఉన్నవారే. ఇది చూసి బాప్‌దాదాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చదువుపై అటెన్షన్ బాగుంది. ఈ రిజల్టు బాగుంది. ఇప్పుడు దీనిని ముందుకు తీసుకువెళ్ళాలి. చదువుపై ఆసక్తి పెంచుకోవాలి. చదువుపై అటెన్షన్‌ను ఇచ్చేవారు చాలామందే ఉన్నారు. మరి ఈనాటి రిజల్టులో చదివేవారు చాలామంది ఉన్నారు మరియు తమ చదువును ఆసక్తితో చదువుతున్నారు. సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. చదువును చదివేవారు ఆసక్తితో చదివేవారైతే చదివించేవారు కూడా చదివించడంలో ఆసక్తి ఉన్నవారు. విద్యార్థులు ఏ కారణంతోనూ ఫెయిల్ అవ్వకూడదు, తక్కువ మార్కులు తీసుకోకూడదు అని వారు భావిస్తారు. ఇక్కడైతే అందరూ తమ చదువుకు ఫలాన్ని తీసేసుకున్నారు. అందరూ చదువు యొక్క ఫలితాన్ని పొందేవారే కనుకనే ఇప్పటివరకు కూర్చున్నారు లేకపోతే ఈ సమయానికి సగం క్లాసు వెళ్ళిపోయి ఉండేది. అభిరుచి ఉంటుంది, చదువుపై అభిరుచి ఉంటే చదువును వదిలిపెట్టడం మంచిగా అనిపించదు. కానీ రిజల్టులో ఈ క్లాసు, రిజల్టు అనుసారంగా చదువుపై అభిరుచి ఉంది. చప్పట్లు కొట్టండి. (అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు) అచ్ఛా, చదువుపై అటెన్షన్ ఉంది, ఇందుకు అభినందనలు, మీరు ఉన్నారే విద్యార్థులు. విద్యార్థులై ఉండి చదువుపై అభిరుచి లేకపోతే ఇది శోభించదు, అందుకే విద్యార్థులందరూ చదువుపై అభిరుచి ఉన్నవారే అని చెప్పడం జరిగింది. కనుక, ఎంతమంది ఉన్నారో దాని అనుసారంగా రిజల్టు బాగుంది, అందుకే ఈ క్లాసు పాస్ అని చెప్పవచ్చు. అందరి ముఖాలు చూడండి, అందరూ చిరునవ్వుతో ఉన్నారు. ఎప్పుడు ఏది చేసినా కానీ దానికి సమయాన్ని కేటాయిస్తారు కదా, గంట కావచ్చు, అరగంట కావచ్చు, సమయాన్ని కేటాయిస్తారు కదా. అంటే సమయానికి విలువ ఉన్నట్లే కదా. అందుకే తమ నేచర్ ఇలా చేసుకోండి - ఏ పని చేసినా కానీ దానిని పూర్తిగా చేసేవరకు విడిచిపెట్టకూడదు. మరి ఈనాటి ఈ క్లాసు మంచి రిజల్టును ఇచ్చేది. టీచరుకు కూడా ఎటువంటి విద్యార్థులు నచ్చుతారు? మీలాంటివారు. ఈరోజే మేము రెగ్యులర్ అయ్యాము అని మీరు అనవచ్చు, కానీ అయ్యారు కదా. ఒక్క రోజు వచ్చినా కానీ రెగ్యులర్ లిస్టులో అయితే వచ్చారు కదా. అయితే ఒక్కరోజైనా ఫర్వాలేదులే అని నేర్చుకోవద్దు. అందరూ సంతోషిస్తారు. మేము కూడా పాస్‌లోకి వచ్చేసాము అని ఎక్కువమంది రిజల్టును చూసి సంతోషిస్తారు. దీనితో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అటెన్షన్ ఇవ్వడం మా కర్తవ్యం ఎందుకంటే చూడండి, టీచరు కూడా శ్రమ పడ్డారు కదా, టీచర్లు మరియు విద్యార్థులు ఎక్కువ మార్కులతో పాస్ అయినందుకు అభినందనలు, అభినందనలు. ఇప్పుడిక ఏ పరీక్ష వచ్చినా కానీ అందులో ఫెయిల్ అవ్వకండి. ఇప్పుడు మీకు నేర్పించిన పాఠము ఏమిటంటే, ఈరోజు మీరంతా పాస్ అయ్యారు అంటే మీ ముఖాలు ఎలా ఉన్నాయి, అదే ఫెయిల్ అయ్యారు అని అంటే తల దించుకున్న పరిస్థితి ఉండేది. ఎంత వద్దనుకున్నా తల దించుకుంటారు. కనుక, పరీక్ష వ్రాసే ప్రతిసారీ ఈరోజును గుర్తు పెట్టుకోండి - పాస్ అవ్వవలసిందే. టోటల్ రిజల్టును కూడా చూడటం జరిగింది. ఆ లెక్క ప్రకారం కూడా మంచి రిజల్టు ఉంది. ఎప్పుడైనా పరీక్ష వ్రాసే ముందు, నేను ఫెయిల్ అవ్వకూడదు అని జాగ్రత్త వహించండి. ఫెయిల్ అవ్వడము అంటే ఫీల్ అయ్యేవారు. సంవత్సరమంతా నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను అని గుర్తుంటుంది. నియమానుసారంగా క్లాసు మారుతారు కానీ ఏది జరిగితే అదే మంచిది, ఒకసారి ఫెయిల్, ఒకసారి పాస్ అవుతూనే ఉంటాము కదా, ఎప్పటికీ పాస్ అవ్వలేము కదా అని అనుకోకండి. పాస్ అవ్వవలసిందే అన్న శిక్షణ కూడా అందరికీ లభించింది. ఇందులో కూడా ఎవరైతే పాస్ అయ్యారో, ఇందులో వారు ఎంతమంది, వచ్చినవారు ఎంతమంది పాస్ అయ్యారో చేతులెత్తండి. చేతులెత్తినవారు తక్కువగా ఉన్నారు. సభ లెక్క ప్రకారం తక్కువగా ఉన్నారు. ఎప్పుడైనా చదువును చదువుతున్నప్పుడు, అందులో నేను పాస్ అయ్యి చూపించాల్సిందే అన్న లక్ష్యం ఉండాలి. ఇప్పటివరకు మీరు చదువుకున్న చదువు, మొదటి నుండి ఇప్పటివరకు ఎన్ని క్లాసులు ఉన్నాయో అందులో, ఉదాహరణకు 8వ క్లాసు జరుగుతుంది అనుకోండి, మరి మీరు ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది పాస్ కావాలి? సరే, ఫుల్ పాస్ కాకపోయినా, ఒకట్రెండు మార్కులు తగ్గినా ఫర్వాలేదు కానీ ఎక్కువ మార్కుల తేడాతో ఫెయిల్ అయితే మంచిది కాదు, కనుక ఇప్పుడు లక్ష్యం ఏమి పెట్టుకుంటారు? ఫెయిల్ అయినా ఏమీ తేడా లేదు అంటారా? ఒకట్రెండు మార్కులతో పాస్ అవ్వడం రైటు, ఇలా ఉన్నా ఫర్వాలేదు... అని మీలో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఒక్క క్లాసు కూడా మిస్ కాకూడదు అని లక్ష్యం పెట్టుకోండి ఎందుకంటే నేను పాస్ కావాలి అన్న లక్ష్యమే విద్యార్థి లక్ష్యంగా ఉంటుంది. ప్రయత్నిస్తాను కాదు, అవ్వాలి.
మరి ఈరోజు అందరూ శ్రమ పడ్డారు. ఎంత శాతం మంది చేతులెత్తారు? చేతులైతే ఎత్తారు కానీ ఏ నంబరు వరకు పాస్ అయ్యారు? అది కూడా చూడాలి కదా. పాస్ అయితే అయ్యారు, కానీ ఏ నంబరుతో పాస్ అయ్యారు అని కూడా చూడాలి. ఒకట్రెండు నంబర్ల తేడాతో పాస్ అయితే దానిని జస్ట్ పాస్ అవ్వడము అంటారు కదా, అలా అయితే మంచిదా? ఏ విషయంలోనైనా పాస్ అంటే పాస్ అవ్వాల్సిందే అన్న విషయం మనసులో పెట్టుకోండి. ఫెయిల్ నంబరు రావడం మంచిది కాదు. తప్పకుండా మీరు బిజీగా ఉండే ఏదో ఒక సంస్కారం ఉండి ఉండాలి. అయినప్పటికీ ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు, పాస్ అయినవారు చేతులెత్తండి. మంచిది, లేక పాస్ వారు ముందు ముందే కూర్చున్నారా? మంచిది, పాస్ అయ్యాము అని చేతులెత్తినప్పుడు నషా చాలా పెరుగుతుంది.
సేవ టర్న్ మహారాష్ట్ర జోన్ వారిది. మహారాష్ట్ర, ఆంధ్ర, ముంబయి నుండి 15 వేల మంది వచ్చారు, అందరూ కలిపి 22వేల మంది ఉన్నారు:- మహారాష్ట్రకైతే బాప్‌దాదా కూడా అభినందనలు తెలుపుతారు ఎందుకని? పరీక్ష ఇక్కడ ఇచ్చారు. ఇక్కడి పాస్ వారు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే పాస్ అయ్యారో వారికి అభినందనలు. కృషి చేసారా లేక అదృష్టం బాగుండి పాస్ అయ్యారా? కృషి చేసారా? కృషి చేసాము అన్నవారు చేతులెత్తండి. కృషి చేసినవారు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ ఇంతమంది ఉన్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. సగం పైగా ఉన్నారు. మంచిది.
డబల్ విదేశీయులు 50 దేశాల నుండి 550 మంది సోదరీ సోదరులు వచ్చారు:- మంచిది, ఇంతమందైనా వెలువడ్డారు. పురుషార్థమైతే చేసారు, మంచిది. అచ్ఛా, పాస్ అయిన వీరికి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే రిజల్టు లభించాక ఈ విద్యార్థి ఎటువంటివారు అన్న ప్రభావం ఉంటుంది. చదువుపై అభిరుచి ఉందా లేక ఇతర దేనిపైనైనా కూడా అభిరుచి ఉందా? అయినా మంచిది (లండన్‌కు చెందిన రతన్ దాదా, రత్నా అక్కయ్యతో) ఒక్క ఇంట్లో ఇద్దరూ పాస్ అయ్యారా! ఇద్దరూ పాస్ అయ్యారు, ఇది చాలా మంచిది. అచ్ఛా, మీ అందరి తరఫున బాబాయే వీరికి అభినందనలు తెలుపుతున్నారు. ఇంతమందైతే చెప్పలేరు, అందుకే సభలోనే చెప్తున్నాము. రిజల్టు లభించడం ద్వారా ఉత్సాహం లభిస్తుంది. ఇంత రిజల్టు తక్కువెందుకు ఉంది? నేను కూడా చదువుకుని ఉంటే నంబరు తీసుకోవడంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉండేవాడిని అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇంకా చేసి ఉండవచ్చు, కానీ నిర్లక్ష్యంతో ఉన్నాను అని అనుకుంటారు. అవుతుందిలే, అవుతుందిలే అని కాదు. అవ్వాల్సిందే.
(మూడు స్థానాలలో పూల అలంకారాన్ని కలకత్తా వారు చేసారు) మంచిది, కలకత్తావారు చాలామంది వచ్చారు. మేము కూడా ఇలా లైనులో కూర్చోవాలని నేర్చుకోండి. ఇలాగే నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైతే చేతులెత్తారో వారి తరఫున వీరికి 100 రెట్లు ఎక్కువ అభినందనలు. మంచిది. అందరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు, అప్పుడు రెండోసారి ఇంకా మంచి నంబరుతో పాస్ అవుతారు. ఒకసారి చేసారు కదా, ఇప్పుడు చెయ్యగలరు అని మీకు ఉల్లాసం వచ్చింది కనుక రెండోసారి కూడా గెలుస్తారు. కనుక ప్రయత్నం చేసి ముందు నంబరు తీసుకోండి.
మొదటిసారి వచ్చినవారు చాలామంది ఉన్నారు:- సగం క్లాసు ఉంది. ఇంత పెద్ద సభలో ఇంత మందే చేతులెత్తారు. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకెంత బాగుండేది. చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలని మేము చెప్తాము. ఈ నంబరు తీసుకోవడమేమీ ఆచారంతో కూడిన విషయం కాదు. పేరైతే వచ్చింది కదా. పూర్తి క్లాసు, వారి మిత్రసంబంధీకులు ఎంత సంతోషిస్తారు. వారిని కూడా ఒకవేళ లెక్కిస్తే ఎంతమంది ఉంటారు. వారి తల్లిదండ్రులు, అత్తమామలు ఎంత సంతోషిస్తారు. కానీ మంచిది, మీరైతే నంబరు తీసుకున్నారు. నంబరులోకైతే వచ్చారు కదా. ఇది కూడా మంచిది. అస్సలు నంబరు లేకపోవడం కన్నా ఇది మంచిది కదా. అచ్ఛా, ఎవరైతే మొదటి నంబరులో వచ్చారో వారందరికీ, ఈ పూర్తి సభకు అభినందనలు.
దాదీ జానకిగారితో:- మిమ్మల్ని చూసి అందరికీ ఉల్లాసం వస్తుంది, వీరు చేసినప్పుడు మేము చెయ్యలేమా అని అనుకుంటారు. (మోహిని అక్కయ్య, న్యూయార్క్ స్మృతిని పంపారు, జయంతి అక్కయ్య కూడా చాలా స్మృతులను పంపారు) స్మృతిని పంపారు కానీ రాలేకపోయారా! (అక్కడ కూడా 18 జనవరి అందరూ ఎంతో ప్రేమతో జరుపుకుంటారు)
కలకత్తా వారు బాప్‌దాదాకు పూలమాల వేసారు:- (మున్నీ అక్కయ్యను చూసి) మీరు కూడా కలకత్తా నుండి వెలువడ్డారు కదా.
మోహిని అక్కయ్య:- (బాబా, మీ వరదానాలతో మంచిగా ఉన్నాను) ఇక మీదట కూడా మంచిగా ఉంటారు. బాబా అందరికీ వరదానాలను ఇస్తూ సరే సరే అంటూ ఉంటారు. కేవలం గుర్తుంచుకోవాలి.
(మధు అక్కయ్య గత 20 సంవత్సరాల నుండి 18 జనవరి నాడు మూడు స్థానాలను పూలతో అలంకరిస్తున్నారు):- వీరు నంబరువన్ లోకి రావడానికి కృషి చేసారు. ఈ ప్రయత్నంలో ఇప్పుడు కొద్దిగా నంబరు వచ్చింది, తర్వాత వేరేవారు వచ్చేస్తారు. ఏమీ ఫర్వాలేదు. మేము ఇంకొంచెం వెనుక ఉన్నాము, ముందుకు వెళ్ళాలి అని ఉత్సాహం వస్తుంది.
నారాయణ్ దాదాతో:- ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి చూపించండి. ఎలా అయితే ఇప్పుడు దగ్గరకు వచ్చారో అలాగే ఇందులో కూడా ముందు నంబరు తీసుకుని చూపించండి. చెయ్యగలరు. ఇప్పుడు మీరేమీ వృద్ధులు కాదు, యువకులే. మీరు చెయ్యాలనుకుంటే చెయ్యగలరు. తీసుకోగలరు, కేవలం మీలో కొంచెం ఉత్సాహాన్ని నింపుకోవాలి. (అందరి సపోర్ట్ ఉంది) మీ సపోర్ట్ కావాలి, ముందు మీ సపోర్ట్ ఉందా? ముందు మీ సపోర్ట్ అందరికీ కావాలి. అచ్ఛా.
ఓంశాంతి