Search for a command to run...
31 Dec 2015
డ్రామాలో ఈ సంగమ మిలనము చాలా చాలా అమూల్యమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. భాగ్యశాలి పిల్లలకు మాత్రమే అకస్మాత్తుగా లభించే లాటరీ ఇది
31 December 2015 · తెలుగు
ఈరోజు ప్రేమికులైన పిల్లలందరూ తమ ప్రియుడైన బాబాతో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. బాప్‌దాదా కూడా నలువైపుల ఉన్న పిల్లలందరినీ చూసి వాహ్ అంటూ సంతోషిస్తున్నారు, నా నయనాలలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది, ఆ విశేషత వలనే పిల్లలు మరియు తండ్రి మిలనం జరుగుతుంది. ఎక్కడి నుండి వచ్చినాకానీ అందరూ తండ్రికి గారాల పిల్లలే. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమగా వాహ్ బాబా వాహ్ అంటూ మిలనం జరుపుకుంటున్నారు. పిల్లలందరూ, ముందు కూర్చున్నా లేక వెనుక కూర్చున్నా కానీ, ప్రత్యేకంగా వెనుక కూర్చున్నవారు చేతులెత్తండి. తండ్రి మరియు పిల్లల మిలనపు సంతోషం ప్రతి ఒక్కరి ముఖంలో ఎంతగానో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మనసు నుండి వాహ్ బాబా వాహ్ అనే వెలువడుతుంది. మీరు ఈ మిలనమును, సాకారంలో సమ్ముఖంలో ఎదురుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు, పిల్లలందరూ సమ్ముఖంలో కలుసుకునే సువర్ణావకాశాన్ని తీసుకుంటున్నారు. బాబా కూడా పిల్లలను కలుసుకునే అవకాశాన్ని చూసి ఎంతో హర్షిస్తున్నారు. ఇంత పెద్ద సభను చూసి బాబా కూడా పదే పదే వాహ్ పిల్లలూ వాహ్ అంటున్నారు. ఈ మిలనము ఎంత మహనీయమైనది. ఎక్కడెక్కడినుండో పిల్లలు మిలనమును జరుపుకోవడానికి వచ్చారు. తండ్రి మరియు పిల్లల ఈ మిలనము ఎంత ప్రియమైనది మరియు అతీతమైనది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలలో తండ్రి మరియు పిల్లల మిలనపు ఆనందం ఇమిడి ఉంది. ఈ పూర్తి సభలోని పిల్లలందరూ వాహ్ బాబా వాహ్ అంటూ పాటను పాడుతున్నారు. బాబా కూడా వాహ్ నా పిల్లలూ వాహ్ అన్న పాటనే పాడుతున్నారు! తండ్రి మరియు పిల్లల ఈ మిలనము డ్రామాలో ఎంత ప్రియమైనది. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి వాహ్ బాబా వాహ్, వాహ్ మీ ప్రేమ, వాహ్ మీ నయనాల మిలనము అన్న పాట వెలువడుతుంది. ఈ మిలనము సదా హృదయంలో ముద్రపడిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దృశ్యాన్ని ఇమర్జ్ చేసుకుంటే ఎంత సుఖం ఫీల్ అవుతుంది! వాహ్ బాబా మీ ఆత్మిక దృష్టి అని మనసు నుండి పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ చూసి ఎంతో హర్షిస్తున్నారు. ఇటువంటి మిలనాన్ని బాబా ఎదురుగా ఉండి వాహ్ పిల్లలూ వాహ్ అంటూ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నయనాలు ఈ మిలనంలో ఎంత సంతోషంగా ఉన్నాయంటే ఈ సాకార ప్రపంచంలో సాకార రూపంలో తండ్రి మరియు పిల్లల ఈ మిలనము అద్భుతమైనదని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయం వాహ్ బాబా వాహ్ అంటుంది. ఈ విధంగా బాబా మిలనం అవుతుందని మేము అస్సలు అనుకోలేదు, ఈ మిలనమైతే చాలా చాలా చాలా ప్రియమైనది. ఇటువంటి మిలనము సాధ్యపడుతుందని కలలో కూడా అనుకోలేదు. తండ్రి మరియు పిల్లల ఈ మిలనములో, పిల్లలు తండ్రిని చూసి ప్రసన్నమయ్యారు, వాహ్ బాబా వాహ్! అలాగే బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు, వాహ్!వాహ్! వాహ్! అన్న పాటే బాబా పాడుతున్నారు. ప్రతి ఒక్కరి సంతోషపు అల వారి ముఖంలో ప్రకాశిస్తుంది. అందరి నోటి నుండి వాహ్ బాబా వాహ్ అన్న మాటే వస్తుంది. ఈరోజు మీరు మిలనపు స్వరూపాన్ని అనుభవం చేయించారు. ప్రతి ఒక్కరి హృదయం నుండి, పూర్తి హాల్ నుండి వాహ్ మధురమైన బాబా వాహ్ అని వెలువడుతుంది. ఇటువంటి మిలనాన్ని చూస్తుంటే అందరూ ఈ మిలనపు నషాలో మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. అందరినుండి ఒకే మాట వాహ్ బాబా వాహ్! అందరి మనసులు ఒకే మాటను అంటున్నాయి, పూర్తి సభలోని వారి హృదయాల నుండి వచ్చే పాట చాలా మధురంగా ఉంది. ఈ పాట ఎంత ప్రియంగా ఉంది. సాకార రూపంలో ఈ మిలనము చాలా అమూల్యమైనది. డ్రామాలో సంగమయుగపు ఈ మిలనము ఎంతటి ప్రియమైనది మరియు అతీతమైనది! ప్రతి ఒక్కరి హృదయాలలో నా బాబా, నా బాబా, నా బాబా మాత్రమే ఉంది. ఇక్కడకు, ముందుకు వచ్చి చూస్తే అందరి మస్తకాలు మెరుస్తున్నాయి. లైట్ పడుతుంది. ఎందుకంటే బాబా మరియు పిల్లల మిలనము సాకారంలో ఇంత సమీపంగా ఉండటాన్ని చూసి అందరూ తమను తాము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. పిల్లలు తండ్రితో ఉన్నప్పటికీ తమ తోటివారిని కలుసుకునే అవకాశం చూసి అకస్మాత్తుగా లభించిన లాటరీలా భావిస్తున్నారు. సంగమయుగంలో తండ్రి మరియు పిల్లల మిలనానికి ఈ మిలనము ఉదాహరణ, అది కూడా సాకార రూపంలో మిలనము, ఇదైతే ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు, కానీ ఇప్పుడు అందరి మనసులలో ఈ మిలనము ఎల్లప్పటికీ ఇమిడి ఉంటుంది. అందరి హృదయాలలో ఏముంది! ఇది డైరెక్టుగా తండ్రి మరియు పిల్లల మిలనము, ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. అందరూ ఈరోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా సాకార రూపంలో మిలనము అన్నది చాలా పెద్ద అమూల్యమైన మిలనము. కనుక ఈ మిలనాన్ని ఎలా జరుపుకోవాలంటే తర్వాత ఈ మిలనపు స్వరూపం నుండి హృదయంలో పదే పదే బాబా కనిపించాలి, ఇప్పుడు కూడా మిలనం చేసుకుంటున్నామన్న అనుభవం కలగాలి. తండ్రి మరియు పిల్లల మిలనము ఎంతటి ప్రియమైనది మరియు ఎంత సంతోషాన్ని ఇస్తుంది! బాబా నా వారు, నన్ను కలిసారు.
మరి ఈరోజు అందరి మనసులలో తండ్రి మరియు పిల్లల అవ్యక్త మిలనము ఎలా ఉంటుంది, ఆ అనుభవం పిల్లలందరికీ బాప్‌దాదా అనుభవం చేయిస్తున్నారు. అందరూ ఈ మిలనమును జరుపుకున్నారా! సాధారణ విషయం కాదు. ఈ మిలనపు భాగ్యాన్ని తీసుకోవడం, ఇది అందరికీ లభిస్తుంది. కానీ లభించిన భాగ్యాన్ని అనుభవంలోకి తీసుకురావడం, ఈ అనుభవాలు చాలా ఉన్నా కానీ రియల్‌గా అనుభవం చేసుకోవడం ఇది భాగ్యపు విషయము. ఈరోజు బాప్‌దాదా ఇటువంటి పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు. పిల్లలు ఏ విధంగా మనసుతో మిలనాన్ని జరుపుకుంటున్నారో చూస్తున్నారు. ఒకప్పుడు పాటలు పాడుతూ గుర్తు చేసుకునేవారు, ఇప్పుడు పాటలేమిటి, మిలనమే చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రతి ఒక్కరి భాగ్యము, ఇక్కడ సాకారంలో ప్రాప్తి చేసుకునే భాగ్యాన్ని పొందడం కూడా భాగ్యమే. ఇటువంటి భాగ్యాన్ని భాగ్యశాలురే పొందగలరు.
పిల్లలు సాకారంలో మిలనాన్ని జరుపుకునే అనుభవం చేసుకుంటున్నారు కనుక బాప్‌దాదా ఈనాటి మిలనాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. అందరి హృదయాలలో ఎవరు నిండి ఉన్నారు? బాబా. నా బాబా, ప్రియమైన బాబా. బాబా హృదయంలో అయితే రాత్రి పగలు పిల్లలే పిల్లలుంటారు ఎందుకంటే అందరి హృదయాలు స్మృతి చేసేది బాబానే. మిలనము కూడా బాబాదే. బాబా ఎంత భోలా భండారీ కదా, స్మృతి చేయగానే ప్రాప్తి ఇచ్చేస్తారు. అంతే కదా! బాబాతో మిలనం జరుగుతుంది అని భావించేవారు చేతులెత్తండి. బాబా అయితే పిల్లల ముఖాన్ని చూసి సంతోషిస్తున్నారు. విడిపోయి ఎంత కాలమయింది! మరి ఇప్పుడు మిలనం జరుగుతుంటే ఈ మిలనపు తపనలో ఎంతగా నిమగ్నమైపోయి ఉంటారు! బాప్‌దాదా కూడా పిల్లల మిలనాన్ని చూసి సంతోషిస్తున్నారు. తప్పిపోయినవారు తిరిగి కలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, ఇక్కడ కూడా బహుకాలం నుండి విడిపోయి ఉన్నారు, ఇప్పుడు మిలనం కూడా జరిగింది. జరిగింది కదా! చేతులెత్తండి. వాహ్! ఈ దృశ్యం బాబాకు చాలా నచ్చుతుంది. వెనుక ఉన్నవారు కూడా చేతులెత్తుతున్నారు. ప్రతి ఒక్కరి మనసులోని ఆనందం వారి వారి ముఖాలలో కనిపిస్తుంది.
సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా వారిది:- (14వేల మంది ఢిల్లీ మరియు ఆగ్రా నుండి వచ్చారు, మొత్తం సభలో 24 వేల మంది సోదరీసోదరులు ఉన్నారు) మంచిది, చూసాము. వారిలో కూడా మాతలు ఎక్కువమంది ఉన్నారు. బాబా యొక్క ఈ శక్తి సైన్యం ఎంత శక్తివంతమైనది! ఇది బాబా చూస్తున్నారు. పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు అందరికీ ఉల్లాస ఉత్సాహాలనిచ్చి ముందుకు నడిపించేవారు. ఒకవేళ మాతల భర్త జ్ఞానంలోకి రాకపోతే పాపం మాతలు ఉండిపోవలసి వస్తుంది. కొంతమంది ఎంత బంధనమున్నా కానీ వారి యుక్తులను చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. ఈ ఫలానా మాత ఇంత బంధనమున్నా కానీ ఎలా వచ్చింది అని కథ వింటే బాప్‌దాదా కూడా ఆ కథలను విని వాహ్ మాతలు వాహ్ అంటారు. ఇంకెవ్వరి ఆలోచనకు రానంత విధంగా ఉపాయాలను ఆలోచిస్తారు. అందుకే సంగమయుగంలో మాతలు ఎంత ధైర్యవంతులు వచ్చారంటే ఏమవుతుందోనన్న భయమే లేదు..., దెబ్బలు కూడా తింటారు కానీ బాబా లభించారు అంటే అన్నీ లభించినట్లే. మంచిది, చూడండి, షుమారుగా మాతలు ఎంతమంది ఉంటారు? సభలో చూస్తే మూడొంతులు మాతలే ఉన్నారు. వారు చాలా దప్పికతో ఉండేవారు, దప్పికతో ఉన్నవారికి మంచినీరు లభిస్తే అది వారికెలా అనిపిస్తుంది? అమృతం. బాప్‌దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఇటువంటి కథే కొంతమంది అన్నయ్యలకు కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఏమిటి అని వారికి తెలియదు కదా! బాప్‌దాదా ఇటువంటి పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు, వాహ్ నా ధైర్యవంతులైన పిల్లలూ వాహ్!
డబల్ విదేశీయులు 50 దేశాల నుండి 500 మంది వచ్చారు:- బాగుంది, అందరూ ధైర్యాన్ని ఉంచారు. ధైర్యానికి బాబా తప్పకుండా సహాయం చేస్తారు. ఈ గ్రూపులో వచ్చిన డబల్ విదేశీయులు లేచి నిల్చోండి. మంచిది. ఎంత సంతోషంగా ఉన్నారు! నిల్చుని ఉన్నారు, అలసిపోయి కూడా ఉన్నారు కానీ సంతోషంగా ఉన్నారు. అచ్ఛా.
అందరికీ ప్రియస్మృతులైతే లభిస్తాయి కానీ విదేశీయులకు ప్రత్యేకంగా ఈరోజు ప్రియస్మృతులను ఇస్తున్నాము. ఇండియాలోని వారి బంధనాలు కూడా ఎలా ఉంటాయంటే అటువంటివి విదేశీయులకు ఉండవు. బాబా వారి చతురతను చూసి, ఏ విధంగా బంధనాన్ని తొలగించుకున్నారు, ఏ విధంగా లాభాన్ని పొందారు, ఈ కథలు విని బాబా కూడా ఆనందిస్తారు. మరి అందరూ సంతోషంగా ఉన్నారా! అందరూ రెండ్రెండు చేతులెత్తండి. చూడండి దాదీ, (దాదీ జానకిగారిని) ఎంత బాగుందో! ఇక్కడ స్టేజి మీద నుండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మరి అందరూ జ్ఞాన సంబంధంతో సంతోషంగా ఉన్నారా, ప్రేమ సంబంధంతో కాదు, జ్ఞాన సంబంధంతో అందరూ సంతోషంగా ఉన్నారా? అచ్ఛా.
దాదీ జానకిగారు బాప్‌దాదాను కలుస్తున్నారు:- భాగ్యంలో ఇంతటి ఆయుషు ఉన్నప్పటికీ యువకులే. (దాదీగారి వయసు 100 పూర్తయింది) (దాదీగారు ఇలా అన్నారు, శరీరం బలహీనంగా ఉంది కానీ శక్తి బాబాది, బాబా నడిపిస్తున్నారు, ఇప్పుడు బాబాకు ప్రాక్టికల్ ఋజువును ఇవ్వాలి, వచ్చారు. ఇది కూడా చాలా సంతోషం) బాబా అర్థం చేసుకుంటారు కదా! బాబా మీ ద్వారా చేయిస్తున్నారు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మీరు నిమిత్తులు. (ఎల్లుండి హంస లండన్‌కు తీసుకువెళ్తుంది)
మోహిని అక్కయ్యతో:- సదా సంతోషంగా ఉంటారు కదా. ఈ సంతోషం వీరికి సేవ చేస్తుంది. ఎంత జరిగినా కానీ ముఖంపై కనిపించదు. సంతోషంగా నడిపిస్తూ ఉంటారు. అందరూ నడిపిస్తున్నారు, అందరి వయస్సు ఇప్పుడెంత ఉంది? (మోహిని అక్కయ్యగారి 75వ జన్మదినం) ఇక్కడున్న అక్కయ్యలందరూ, అన్నయ్యలు కూడా ఉన్నారు, ఇప్పుడు అక్కయ్యల ప్రస్తావన జరుగుతుంది కదా. అన్నయ్యలు గుప్తంగా ఉన్నారు. సేవ కారణంగా అక్కయ్యల పేరు తీసుకోవడం జరుగుతుంది, అన్నయ్యలైతే ఉండనే ఉన్నారు, అన్నయ్యలు లేకుండా ఏ పనీ జరగదు. చూడండి, సోదరులు కూడా తక్కువేమీ కాదు, సోదరీలు కూడా తక్కువేమీ కాదు. బ్రాహ్మణ పరివారంలో మాతలు, అన్నయ్యలు అందరూ ఎంతో యోగ్యులే.
(మోహిని అక్కయ్యకు బాప్‌దాదా పుట్టినరోజు బహుమతిని ఇచ్చారు) సరేనా. మిమ్మల్ని మీరు నడిపిస్తున్నారు.
త్రిమూర్తి అన్నయ్యలు:- అన్నయ్యలు కూడా వచ్చారు వాహ్! బాగా పని చేసే మంచి మంచి మాతలు కూడా ఉన్నారు. బయటి పని కాదు, బ్రాహ్మణుల సేవలో చాలా మంచిగా చేస్తారు. (ఇండియా గేట్ మరియు ఎర్రకోటలో జరిగిన ప్రోగ్రాము యొక్క ఆల్బమ్‌ను బాప్‌దాదాకు చూపించారు)
(నూతన సంవత్సరం 2016 ఆగమన సంతోషంలో క్రొవ్వొత్తులు వెలిగించారు, కేక్ కట్ చేసారు, బాప్‌దాదా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు)
జానకి దాదీ ఇలా అన్నారు - నేను ఏ విధమైన సంకల్పాన్నీ నడిపించను. బాబా నడిపిస్తున్నారు. శరీరం ఎలా ఉన్నాకానీ అద్భుతమేమిటంటే అడుగు అడుగులో మనసు నుండి నా బాబా అనే వస్తుంది. ఎలా అయితే ఈరోజు శక్తి వచ్చింది, మురళి వినిపించాను. ఈరోజు బాబా వచ్చారు, సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత సమయం కూర్చున్నానంటే ఇదంతా బాబా చేసిన అద్భుతమే. రేపు కూడా మురళి చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఇదంతా బాబా ప్రతి అడుగులో ఇస్తున్న సహాయమే. నన్ను ప్రయాణం చేయించడానికి ఈ హంస నిమిత్తము. బాబా వస్తే చాలా సంతోషమేసింది. ఇప్పుడైతే కొత్త సంవత్సరంలో నిమిత్తమై ఉన్న బాబా పిల్లలందరూ ప్రతి ఒక్కరూ తమ తమ కార్యాలను ఎంతో మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను.
(బాబా, వెళ్ళడానికి ఒప్పుకున్నట్లేనా) ఒప్పుకున్నాము. అడిగే తయారు చేసుకుని ఉంటారు, టికెట్ కూడా వచ్చేసింది. అవసరం అయినప్పుడల్లా వెళ్ళవచ్చు. ఇప్పుడు వీరే హెడ్ కదా, ఏమి చెయ్యాలి అని వీరే నిర్ణయిస్తారు.
నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు: - బాబా ఆజ్ఞ అనుసారంగా వెళ్తున్నారు, ముందుకు, ఇంకా ముందుకు వెళ్తారు. విజయమైతే నిశ్చితమై ఉంది. విజయదాత మన తోడుగా ఉన్నారు, అలాంటప్పుడు విజయం ఇంకెక్కడికి వెళ్తుంది!
అందరికీ బాబా స్మృతి అయితే అడుగు అడుగులో ఉండనే ఉంటుంది. బాబా మనకిచ్చిన నిమిత్తమైన వారు ఎవరు? అది కూడా అందరికీ తెలుసు. బాబా ఎవర్ని అయితే నిమిత్తం చేసారో, అందరూ వారికి తోడుగా నిలుస్తారు, మరి అడుగు అడుగులో అందరూ తోడును ఇవ్వాలి. ఈరోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరం మొదలవుతుంది అంటే అందులో నవీనతను తేవాలన్న ఆలోచన తప్పక ఉంటుంది. ప్రారంభమయ్యే ఈ క్రొత్త సంవత్సరంలో ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. ఇందుకోసం ఎవరికైనా ఏమైనా ఆలోచనలు ఉంటే, కొత్తగా ఉండాలి అనుకుంటే వ్రాసి పంపించండి. చెప్పాల్సిన అవసరం లేదు. నవీనత గురించి ఏమైనా ఆలోచనలు ఉంటే వ్రాసి పంపండి అప్పుడు సమయం వృధా అవ్వదు. మీ సంకల్పం ఉపయోగబడితే మంచిదే కదా అందుకే మీ సంకల్పాన్ని సారంలో, చిన్నగా వ్రాసి పంపించండి. అచ్ఛా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఓంశాంతి