Search for a command to run...
12 Mar 2018
"సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేసుకుంటూ, తమ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి"
12 March 2018 · తెలుగు
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా తమ దివ్య బుద్ధి అనే విమానం ద్వారా మూడు లోకాల షికారు చేసేవారు, సాకార సో అవ్యక్త సో నిరాకార అనుభూతులలో నిమగ్నమయ్యేవారు, పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన సర్వ శ్రేష్ఠ ఆత్మలు, నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీసోదరులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ఈరోజు ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా యొక్క అవతరణ రోజు. ఈస్టర్న్ జోన్‌లోని అన్ని నదులు - బంగాల్, బీహార్, ఒడిస్సా, అస్సాం మరియు నేపాల్, వీటితోపాటు తమిళనాడు జోన్ నుండి వేలాదిమంది సోదరీసోదరులు బాప్‌దాదా ఇంటికి అవ్యక్త అనుభూతులను చేసుకోవడానికి, స్వయాన్ని సర్వ శక్తులతో, వరదానాలతో నింపుకోవడానికి చేరుకున్నారు. షుమారు 25వేలమంది సోదరీసోదరులు ఉన్న సభ ఇది. అందరూ అమృతవేళ నుండే అంతర్ముఖిగా అయ్యి అవ్యక్త స్థితిని సుందరంగా అనుభవం చేసుకుంటున్నారు, చాలా శక్తిశాలి వాయుమండలం ఉంది. ఉదయం దాదీ జానకిగారు ప్రియమైన బాప్‌దాదా మురళిని క్లాసులో వినిపించి అందరినీ చాలా బాగా రిఫ్రెష్ చేసారు.
మనందరి అతి స్నేహి, ప్రియమైన అవ్యక్త బాప్‌దాదాతో సాకార మిలనం చేయించే మన మధురమైన దాదీ గుల్జార్‌గారు ఇప్పటివరకు ముంబయి ఆసుపత్రిలో ఆరోగ్య లాభాన్ని పొందుతున్నారు. అయినప్పటికీ అవ్యక్త వతనవాసి అయిన మధురమైన బాబా తమ పిల్లలను తమ అనంతమైన ఇంటి యొక్క అనేకానేక సుందర అనుభవాలతో నింపుతున్నారు. విధివత్ దినచర్య అనుసారంగా సాయంకాలం అవ్యక్త మిలనం యొక్క విభిన్న విధుల గురించిన క్లాసును విన్న తర్వాత బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపజేసారు. అదే లగ్నము మరియు ఏకాగ్రతతో వీడియో ద్వారా అవ్యక్త మహావాక్యాలను విని స్వయాన్ని దివ్య వరదానాలతో నింపుకోవడం జరిగింది. దాదీలు మరియు పెద్దన్నయ్యలు కూడా తమ మహావాక్యాలతో రిఫ్రెష్ చేసారు.
ఈసారి కాఠ్మండు రాజ్ దీదీ, కిరణ్ అక్కయ్యలు నేపాల్ సేవల యొక్క మరియు స్వయం సమర్పణ యొక్క గోల్డెన్ జూబిలీని డైమండ్ హాలులో మార్చి 10 నాడు ఎంతో ఘనంగా జరిపారు. ఎంతో సుందరమైన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరిగింది. రేపు 13వ తారీఖున కానన్ అక్కయ్యగారు కలకత్తా మ్యూజియమ్ యొక్క గోల్డెన్ జూబిలీని జరుపుతారు. బాబా యజ్ఞంలో జ్ఞానయోగాల దివ్య పాలనతోపాటు, అనేక రకాలైన శుభ కార్యాలను జరుపుకోవడం, అనంతమైన పరివారాన్ని కలుసుకుంటూ సంగమయుగ అలౌకిక ఆనందాలను అనుభం చేసుకుంటూ అందరూ ఉల్లాస ఉత్సాహాలతో నిండుగా అవుతారు. ఈ గ్రూపులో అనేక దేశాల నుండి షుమారు 1100 మంది డబల్ విదేశీయులు చేరుకున్నారు. జ్ఞాన సరోవర్, పాండవ భవనంలో వారి కోసం భిన్న భిన్న క్లాసులు, యోగ అనుభూతుల కోసం సుందర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ బాబా ఇల్లు సదా బ్రాహ్మణ పిల్లల ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ, పురుషార్థంలో నవీనతను మరియు తీవ్రతను తీసుకువస్తూ అనేక సుఖపు అనుభవాలను చేయిస్తుంది. ఈరోజు మనం విన్న ప్రియమైన బాప్‌దాదా మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు.
అచ్ఛా - అందరికీ స్మృతి..... ఓం శాంతి.
ఈ మహావాక్యాలు 12-3-18 నాడు అవ్యక్త బాప్‌దాదా అవతరణ రోజున వినిపించబడ్డాయి రివైజ్డ్ - 02-02-08
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ పరివారాన్ని చూస్తున్నారు. ఈ రాయల్టీ మరియు ఆత్మిక పర్సనాలిటీకి పునాది సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో, అందరి శిరస్సులపై ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంది. మెరుస్తున్నటువంటి కిరీటధారులు, ఆత్మిక రాయల్టీ, ఆత్మిక పర్సనాలిటీ కలిగినవారు కేవలం బ్రాహ్మణ పరివారానికి చెందిన మీరు మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను మీ సొంతం చేసుకున్నారు. బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రతా ప్రభావము ఆదికాలము నుండి ప్రసిద్ధి చెందింది. మీ అనాది మరియు ఆదికాలము గుర్తుకు వస్తుందా! గుర్తు తెచ్చుకోండి, అనాదికాలంలో కూడా పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మ రూపంలో కూడా విశేషంగా మెరుస్తున్న సితారలు, మెరుస్తూ ఉంటారు. మిగతా ఆత్మలు కూడా ఉంటాయి కానీ మీ సితారలు అందరిమధ్య ఉంటూ కూడా విశేషంగా మెరుస్తూ ఉంటాయి. ఎలా అయితే ఆకాశంలో సితారలు అనేకం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సితారలు విశేషంగా మెరుస్తూ ఉంటాయి. అందరూ తమను తాము చూసుకుంటున్నారా, తర్వాత ఆదికాలములో మీ పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంతటి గొప్పగా ఉంది! అందరూ ఆదికాలములోకి చేరుకున్నారా? చేరుకోండి. నా మెరిసే రేఖ ఎంత శాతంతో ఉంది అని పరిశీలించుకోండి. ఆదికాలము నుండి అంతిమ కాలము వరకు మీ పవిత్రత యొక్క రాయల్టీ, పర్సనాలిటీ సదా ఉంటుంది. అనాది కాలములోని మెరుస్తున్న సితార మెరుస్తున్న తండ్రితో పాటు నివసించేది. ఇప్పుడే మీ విశేషతను అనుభవం చేసుకోండి. అనాదికాలానికి అందరూ చేరుకున్నారా? ఆ తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే మీవలె సంపూర్ణ పవిత్రులుగా ఎవ్వరూ తయారు కాలేదు. పవిత్రత జన్మ సిద్ద అధికారంగా విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆదికాలములోకి రండి. అనాదికాలమును కూడా చూసారు, ఇప్పుడు ఆదికాలములో మీ పవిత్రత యొక్క రాయల్టీ స్వరూపము ఎంత గొప్పగా ఉంది! అందరూ సత్యయుగానికి చేరుకున్నారా? చేరుకున్నారా? వచ్చేసారా? ఎంతటి ప్రేమ స్వరూపమైన దేవతా రూపము. దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరే ఇతర ఆత్మకు లేదు. దేవతా రూపము యొక్క మెరుపును అనుభవం చేసుకుంటున్నారు కదా! ఇంతటి ఆత్మిక పర్సనాలిటీ, ఇదంతా పవిత్రతా ప్రాప్తి. దేవతా రూపాన్ని అనుభవం చేసుకుంటూ ఇప్పుడు మధ్యకాలానికి రండి. వచ్చారా? రావడము, అనుభవం చేయడము సహజమే కదా. మధ్యకాలములో కూడా చూడండి, మీ భక్తులు పూజ్య ఆత్మలైన మీ పూజ చేస్తున్నారు, చిత్రాలు చేస్తున్నారు. ఎంతగా రాయల్టీతో చిత్రాలు చేస్తారు మరియు ఎంత రాయల్టీతో పూజ చేస్తారు. తమ పూజ్య చిత్రము ఎదురుగా వచ్చింది కదా! ధర్మాతల చిత్రాలు కూడా తయారు చేస్తారు. ధర్మ పితల చిత్రాలను తయారు చేస్తారు, అభినేతల చిత్రాలను కూడా చేస్తారు, కానీ మీ చిత్రాలలోని ఆత్మికత మరియు విధిపూర్వక పూజలో తేడా వస్తుంది. మరి మీ పూజ్య స్వరూపము మీ ఎదురుగా వచ్చిందా! అచ్ఛా, ఇప్పుడు అంతిమ కాలమైన సంగమానికి రండి, ఈ ఆత్మిక డ్రిల్ చేస్తున్నారు కదా! తిరుగుతూ ఉండండి మరియు తమ పవిత్రతను, తమ విశేష ప్రాప్తులను అనుభవం చేసుకోండి. అంతిమ కాలమైన సంగమంలో బ్రాహ్మణ ఆత్మలైన మీకు పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యము కోట్లలో కొద్ది ఆత్మలకే లభిస్తుంది. పరమాత్ముని డైరెక్టు రచన, మొదటి రచన అయిన పవిత్ర ఆత్మలైన మీకే ప్రాప్తిస్తుంది. దీని ద్వారా బ్రాహ్మణులైన మీరే విశ్వాత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించగలరు. మరి పూర్తి చక్రంలో అనాదికాలము, ఆదికాలము, మధ్యకాలము మరియు అంతిమకాలము - పూర్తి చక్రంలో ఇంతటి శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము పవిత్రత. పూర్తి చక్రం తిరిగారు కదా, ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి, స్వయాన్ని చూసుకోండి, చూసుకునేందుకు దర్పణం ఉంది కదా! స్వయాన్ని చూసుకునేందుకు దర్పణం ఉంది కదా? ఎవరి వద్ద అయితే ఉన్నదో వారు చేతులెత్తండి. దర్పణం ఉంది కదా, స్పష్టంగా ఉందా? నా పవిత్రత ఎంత శాతం ఉంది అని దర్పణంలో చూసుకోండి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మాచారి కూడా. మనసా వాచా కర్మణ, సంబంధ-సంపర్కాలలో అన్నింటిలో ఎంత పవిత్రత ఉంది? ఎంత శాతంలో ఉంది? శాతం తెలుసుకోవడము వచ్చు కదా? టీచర్లకు వచ్చా? పాండవులకు వచ్చా? బాగా తెలివైనవారు. మాతలకు వచ్చా? వచ్చా మాతలకు? అచ్ఛా.
పవిత్రతకు పరీక్ష - వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలో పరిశీలించుకోండి, సంపూర్ణ పవిత్రతతో నిండిన వృత్తి, అది బుద్ధిలోకి వచ్చేసింది కదా. ఆలోచించండి, సంపూర్ణ పవిత్రతతో నిండిన వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన. అనుభవీలే కదా! మరి దృష్టి ఏమిటి? ప్రతి ఆత్మను ఆత్మ రూపములో చూడటము. ఆత్మిక స్మృతితో మాట్లాడటము, నడవడము. షార్ట్‌లో వినిపిస్తున్నాము. డిటైల్లో అయితే మీరు భాషణ ఇవ్వగలరు. కృతి అనగా కర్మలో సుఖమును తీసుకోవడము సుఖమును ఇవ్వడము. నా వృత్తి, దృష్టి, కృతి ఈ ప్రమాణంలో ఉన్నాయా అని పరిశీలించుకోండి. సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని తీసుకోవద్దు. ఎప్పుడైనా దుఃఖాన్ని తీసుకుంటున్నానా అని పరిశీలించుకోండి. అప్పుడప్పుడూ, కొంచెం కొంచెం? దుఃఖమిచ్చేవారు కూడా ఉంటారు కదా? వారు దుఃఖమిచ్చారనుకోండి, మీరు వారిని అనుసరించాలా? అనుసరించాలా వద్దా? ఎవరిని అనుసరించాలి? దుఃఖాన్ని ఇచ్చేవారినా లేక బాబానా? బాబా, బ్రహ్మా బాబా, నిరాకారుని విషయమైతే ఉండనే ఉంది, కానీ బ్రహ్మాబాబా పిల్లలిచ్చిన దుఃఖాన్ని తీసుకున్నారా? సుఖమును ఇచ్చారు, సుఖమును తీసుకున్నారు. ఫాలో ఫాదర్ చెయ్యాలా లేక అప్పుడప్పుడూ తీసుకోవలసి వస్తుందా? పేరే దుఃఖము అని ఉంది, దుఃఖమిచ్చినప్పుడు, అవమానించినప్పుడు, ఇది చెడ్డ విషయము అని మీకు తెలుసు కదా, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు మంచిగా భావిస్తారా? చెడుగా భావిస్తారు కదా! మరి వారు దుఃఖమును ఇచ్చినా, అవమానించినా, ఒకవేళ చెడు వస్తువును మీకు ఎవరైనా ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? కొద్ది సమయం కోసమే, ఎక్కువ సమయం కోసం కాదు, తీసుకుంటారా? చెడు వస్తువును తీసుకుంటారా? మరి దుఃఖాన్ని లేక అవమానాన్ని ఎందుకు తీసుకుంటారు? అనగా మనసులో ఫీలింగ్ రూపంలో ఎందుకు పెట్టుకుంటారు? నేను దుఃఖాన్ని తీసుకుంటున్నానా లేక దుఃఖాన్ని పరివర్తనా రూపంలో చూస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. దుఃఖాన్ని తీసుకోవడము సరైనదేనా? రైటేనా? మధువనం వారు, రైటేనా? కొద్దికొద్దిగా తీసుకోవాలా? మొదటి లైనువారు, దుఃఖాన్ని తీసుకోవాలి కదా! తీసుకోకూడదు. కానీ తీసుకుంటారు. పొరపాటున తీసుకుంటారు. ఈ దుఃఖం యొక్క ఫీలింగ్ వస్తే ఎవరు కలవరపడతారు? మనసులో చెత్తను పెట్టుకుంటే ఎవరు కలవర పడతారు? ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడే కలవరము ఉంటుంది కదా! మరి ఆ సమయంలో తమ రాయల్టీ మరియు పర్సనాలిటీని మీ ఎదురుగా తీసుకురండి మరియు స్వయాన్ని ఏ స్వరూపంలో చూడాలి? మీ టైటిల్ ఏమిటో తెలుసా? సహనశీలతా దేవి, సహనశీలతా దేవత అనేది మీ టైటిల్. మరి మీరు ఎవరు? సహనశీలతా దేవీలు, సహనశీలతా దేవతలు. అవునా? కాదా? అప్పుడప్పుడూ అవుతారా? తమ పొజిషన్‌ను గుర్తు తెచ్చుకోండి, స్వమానాన్ని గుర్తు తెచ్చుకోండి. నేను ఎవరిని! ఇది స్మృతిలోకి తెచ్చుకోండి. పూర్తి కల్పంలోని విశేష స్వరూపాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. స్మృతి అయితే వస్తుంది కదా!
బాప్‌దాదా ఏమి చూసారంటే ఎలా అయితే ‘నా’ అన్న మాటను సహజంగా స్మృతిలోకి పరివర్తన చేసారో, మరి నా అన్న విస్తారాన్ని ఇముడ్చుకోవడానికి ఏమని అంటారు? నా బాబా. ఎప్పుడు నా, నా అని వచ్చినా కానీ నా బాబాలోకి అది ఇమిడిపోతుంది. పదే పదే నా బాబా అనడం ద్వారా స్మృతి కూడా సహజంగా అయిపోతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజంతటిలో కూడా ఒకవేళ ఏ విధమైన సమస్య లేక పరిస్థితి వచ్చినా కానీ, అందుకు ఈ రెండు మాటలు విశేషమైనవి - నేను మరియు నాది. ఎలా అయితే బాబా అన్న మాట అనగానే నాది అన్న మాట పక్కాగా గుర్తుకు వస్తుందో, గుర్తుకు వస్తుంది కదా? ఇప్పుడు అందరూ బాబా, బాబా అని అనరు, నా బాబా అని అంటారు. అలాగే నేను అన్న మాటను పరివర్తన చెయ్యండి. నేను అని ఎప్పుడు అంటే అప్పుడు మీ స్వమానాల లిస్టును ఎదురుగా తీసుకురండి. నేను ఎవరిని? ఎందుకంటే నేను అన్న మాట దిగజార్చేందుకు కూడా నిమిత్తమవుతుంది మరియు నేను అన్న మాట స్వమానాల స్మృతితో ఉన్నతంలోకి కూడా ఎత్తుతుంది. కావున ఎలా అయితే నా బాబా అని అభ్యాసం అయిందో అలాగే నేను అన్న మాటను దేహాభిమానపు స్మృతికి బదులుగా తమ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తీసుకురండి. నేను శ్రేష్ఠ ఆత్మను, సింహాసనాధికారి ఆత్మను, విశ్వ కళ్యాణి ఆత్మను, ఇలా ఏదో స్వమానంతో నేను అన్న పదాన్ని జోడించండి. అప్పుడు నేను అనే మాట ఉన్నతికి సాధనము అవుతుంది. ఎలా అయితే ఇప్పుడు మెజారిటీ నా అన్న పదము నా బాబా అని స్మృతి తెప్పిస్తుందో ఎందుకంటే సమయము ప్రకృతి ద్వారా ఛాలెంజ్ చేస్తుంది.
సమయము యొక్క సమీపతను సాధారణంగా భావించకండి. అకస్మాత్తు మరియు ఎవరెడీ అన్న మాటలను తమ కర్మయోగి జీవితంలో ప్రతి సమయము స్మృతిలో పెట్టుకోండి. శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలలో ప్రయోగించండి. ఎలా అయితే సైన్సు క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది కదా. ఎంతగా స్వయం కోసం ప్రయోగించే అభ్యాసం ఉంటుందో అంతగా ఇతరుల కోసం కూడా శాంతి శక్తి ప్రయోగించబడుతూ ఉంటుంది.
ఇప్పుడు విశేషంగా తమ శక్తుల ప్రకాశాన్ని నలువైపుల వ్యాపింపజేయండి. మీ ప్రకృతి సూర్య శక్తి, సూర్య కిరణాలు తమ కార్యాన్ని ఎన్ని రూపాలలో చేస్తున్నాయి, నీటిని కురిపిస్తుంది కూడా మరియు నీటిని ఆవిరి కూడా చేస్తుంది. పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా చేసి చూపిస్తుంది. మరి మీరు మీ శక్తుల ప్రకాశాన్ని వాతావరణంలో వ్యాపింపచేయలేరా? తమలోని శక్తుల ప్రకాశంతో ఆత్మలను దుఃఖము, అశాంతి నుండి విడిపించలేరా! జ్ఞాన సూర్య స్వరూపాన్ని మర్జ్ చేసుకోండి. కిరణాలను వ్యాపింపజేయండి, ప్రకాశాన్ని వ్యాపింపజేయండి. ఎలా అయితే స్థాపన ఆదికాలములో బాప్‌దాదా తరఫు నుండి అనేక ఆత్మలకు సుఖ శాంతుల ప్రకాశము ఇంట్లో కూర్చునే లభించడం అనుభవం అయింది కదా. వెళ్ళండి అని సంకల్పం లభించింది. అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య పిల్లల ద్వారా సుఖ శాంతుల అల వ్యాపింపజేసే అనుభూతి జరగాలి. కానీ అది ఎప్పుడు అవుతుందంటే, ఇందుకు సాధనము మానసిక ఏకాగ్రత. స్మృతిలో ఏకాగ్రత. ఏకాగ్రత శక్తిని స్వయంలో పెంచుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎప్పటి వరకు కావాలంటే అప్పటివరకు మనసును ఏకాగ్రం చేసుకోగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను, ప్రకాశాన్ని వ్యాపింపజేయండి. అచ్ఛా - ఇప్పుడు ఎవరి టర్ను?
తమిళనాడు, ఈస్టర్న్ మరియు నేపాల్ వారి టర్న్:- ఈస్టర్న్‌లో చాలా నదులు ఉన్నాయి. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, నేపాల్, తమిళనాడు, సగం సభ ఉంది. ఇంతగా యోగ్యులుగా చేసారు, ఇందుకు చాలా చాలా అభినందనలు. చూడండి, టి.వీలో చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా మంచి మంచివారు ఉన్నారు. చేయి ఊపండి. చాలా బాగుంది. యజ్ఞ సేవ పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత మంది చేరుకున్నారు అని చూసి బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు 5 నదులు కలిసి ఏదైనా కొత్త ప్లానును తయారు చెయ్యండి. సందేశము వ్యాపించేవి అయితే చేసారు, ఇప్పుడు మరింకేదైనా చెయ్యండి. 5 వైపుల నుండి సంఖ్య మంచిగా వచ్చింది, ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారో, ఇంతటి వృద్ధిని పొందారు. ఇందుకు పూర్తి పరివారానికి కూడా చాలా సంతోషంగా ఉంది. బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు స్వ పరివర్తన మరియు సేవలో నవీనత - ఇందులో బహుమతిని తీసుకోవాలి. నంబరు తీసుకుంటారు కదా. ఐదుగురు ఉన్నారు, పెద్ద పెద్దవారు, చిన్నవారు కాదు. అద్భుతం చేసి చూపించాలి.
డబల్ విదేశీయులు కూడా వచ్చి ఉన్నారు:- డబల్ విదేశీయులు అనగా డబల్ పురుషార్థీలు. బాప్‌దాదా ఇప్పుడు డబల్ పురుషార్థీలు అని పేరు పెట్టారు. అవునా? డబల్ పురుషార్థీలేనా? వర్తమాన సమయము డబల్ పురుషార్ధము యొక్క లక్ష్యము ఉంది మరియు చేస్తున్నాము కూడా అని అనేవారు చేతులెత్తండి. డబల్ పురుషార్థము. డబల్. చాలా మంచిది. డబల్ అయినందుకు చప్పట్లు కొట్టండి. బాగుంది. మిమ్మల్ని చూసి అందరూ సంతోషంగా ముందుకు సాగాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకుంటారు. విదేశీయుల యొక్క ముఖ్య లక్షణము, సర్వీసబుల్, నాలెడ్జ్‌ఫుల్, సక్సెస్ఫుల్ అటువంటి డబల్ విదేశీయులు చేరుకోవడము ఈరోజు చూస్తున్నాము. మీటింగ్ కూడా మంచిగా చేస్తున్నారు. మీటింగ్ సమాచారము కూడా బాప్‌దాదా విన్నారు - అందరూ ఇంటర్నేషనల్ ప్రతి దేశంలోని విశేష ఆత్మలు కలుసుకుని ఏదైతే తయారుచేసారో అది చాలా బాగుంది మరియు సహజమైన ఏకమతంతో సహజంగా పాస్ అయ్యారు. మరి నిమిత్తమైన విశేష ఆత్మలకు బాప్‌దాదా పదమా పదమారెట్లు అభినందనలు ఇస్తున్నారు. పాత పాత పునాది ఆత్మలు వచ్చారు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు కూడా ఒకరికంటే మరొకరు ముందున్నారు మరియు శక్తులు కూడా ఒకరికంటే మరొకరు ముందున్నారు. అచ్ఛా!