Search for a command to run...
30 Nov 2018
“పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తులు - హోలియెస్ట్, హైయెస్ట్ మరియు రిచెస్ట్”
30 November 2018 · తెలుగు
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, సదా సర్వ అవినాశి ఖజానాలతో సంపన్నులు, రిచెస్ట్ ఇన్ ది కల్పము, హోలియెస్ట్ మరియు హైయెస్ట్ సర్వ నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన బాప్‌దాదా నుండి సూక్ష్మ శక్తులను మరియు వరదానాలను డైరెక్టుగా అనుభవం చేసుకుంటూ మీరందరూ అవ్యక్త అవతరణ దివసము నాడు అదే లగనము మరియు ఉల్లాస-ఉత్సాహాలతో అలౌకిక మంగళ మిలనపు అనుభూతులను చేసుకుని ఉండవచ్చు. ఈసారి సేవ టర్న్ కర్ణాటక వారిది. సుమారు 17-18 వేలమంది సోదరసోదరీలు శాంతివనానికి చేరుకున్నారు. అందరికీ చక్కని జ్ఞానయోగాల పాలన లభించింది. దాదీ జానకిగారు కూడా బాగా రిఫ్రెష్ చేసారు. నలువైపుల ఉల్లాస-ఉత్సాహాల వాతావరణం నెలకొని ఉంది. ఈరోజు అమృతవేళ నుండే సోదరసోదరీలందరూ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త అనుభూతులను చేసుకుంటున్నారు. నలువైపుల శాంత, అవ్యక్త వాతావరణం ఉంది. సాయంకాల సమయంలో విధి అనుసారంగా డైమండ్ హాల్, కాన్ఫరెన్సు హాల్, తోటలో వీడియో ద్వారా మురళిని వింటూ అందరూ ప్రభు ప్రేమలో లీనమైపోయారు. పిల్లల భావన అనుసారంగా వారికి భాసన ఇవ్వడం బాబా చేసే అద్భుతం. నా బాబాతో సమ్ముఖంలో మిలనం జరగడం లేదు అన్న భావన ఎవ్వరికీ బాబా కలగనివ్వడం లేదు. కొత్త పాత బాబా పిల్లలందరూ రివైజ్డ్ మురళి ద్వారా కూడా స్వయాన్ని నింపుకున్నారు. ఇక మన మధురమైన దాదీ గుల్జార్గారి కోసం వేచి ఉన్నాము. బాబా తమ రథాన్ని ఎప్పుడు మధుబనానికి చేరుస్తారా అని అందరమూ ఎంతగానో ఎదురు చూస్తున్నాము. అవ్యక్త బాప్‌దాదా పాత్రకు ఇప్పుడు గోల్డెన్ జుబిలి సమీపిస్తుంది. 2019లో మనమందరం బాబా అవ్యక్త మిలనానికి 50వ సంవత్సరాన్ని జరుపుకుంటాము. ఈ సందర్భంగా అందరూ నలువైపుల యోగ తపస్సుల విశేష కార్యక్రమాలను పెట్టి అందరూ బ్రహ్మాబాబా సమానంగా సంపన్న, సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకోగలరు. జనవరి నెల కోసం డైరెక్షన్లు మీ అందరి వద్దకు త్వరలోనే వస్తాయి. మీరంతా నూతన సంవత్సరాన్ని నూతన ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకునేందుకు ప్లాన్ చేస్తుండవచ్చు. అచ్ఛా - ఈరోజు మనం విన్న అవ్యక్త మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము, అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు. అందరికీ స్మృతి... ఓం శాంతి.
30-11-18 అవ్యక్త మహావాక్యాలు రివైజ్ వీడియో 02-02-07 మధువనం
“పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తులు - హోలియెస్ట్, హైయెస్ట్ మరియు రిచెస్ట్”
ఈరోజు విశ్వ పరివర్తకుడైన బాప్‌దాదా తమకు తోడుగా ఉన్న పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు పరమాత్మ విశేష ప్రాప్తులు కనిపిస్తున్నాయి. 1 - హోలియెస్ట్ (పవిత్రత), 2 - హైయెస్ట్ (ఉన్నతము) మరియు 3 - రిచెస్ట్ (ధనవంతులు). ఈ జ్ఞానము యొక్క పునాదియే హోలి అనగా పవిత్రులుగా అవ్వడము. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియెస్ట్, పవిత్రత కేవలం బ్రహ్మచర్యము మాత్రమే కాదు, మనసు-వాచ-కర్మ, సంబంధ సంపర్కాలలో పవిత్రత. మీరు చూడండి, పరమాత్ముని బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆది-మధ్య అంతం మూడు కాలాలలోనూ హోలియెస్ట్గా ఉంటారు. మొదట్లో ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు అక్కడ హోలియెస్ట్గా ఉంటుంది తర్వాత ఆదిలోకి వచ్చినప్పుడు ఆదికాలంలో దేవత రూపంలో హోలియెస్ట్ ఆత్మగా ఉంటుంది. హోలియెస్ట్ అనగా పవిత్ర ఆత్మ విశేషత - ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండటము. ఇతరులు కూడా పవిత్రంగా ఉంటారు కానీ పవిత్రతకు గుర్తు - స్వప్నమాత్రంలో కూడా అపవిత్రత మనసు-బుద్ధిని టచ్ చెయ్యకూడదు. సత్యయుగంలో ఆత్మ కూడా పవిత్రంగా ఉంటే మీ శరీరం కూడా పవిత్రంగా అవుతుంది. ఆత్మ మరియు శరీరము రెండింటి పవిత్రతతో దేవాత్మ రూపంలో ఉంటారు, అదే శ్రేష్ఠ పవిత్రత. హోలియెస్ట్ అయినట్లుగా అంతే హైయెస్ట్ కూడా అవుతారు మీరు. ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు మీరు మరియు ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు మీరు. ఆదిలో అనగా పరంధామంలో కూడా హైయెస్ట్ అనగా బాబాతో కలిసి ఉంటారు. మధ్య సమయంలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎంతటి సుందరమైన మందిరాలు నిర్మితమవుతాయి మరియు ఎంతటి విధిపూర్వక పూజ జరుగుతుంది! విధిపూర్వక పూజలు దేవతలైన మీ మందిరాలలోనే జరుగుతాయి, ఇతరుల మందిరాలలో పూజలు జరుగుతాయి కానీ విధిపూర్వక పూజలు దేవతా రూపంలో ఉన్న మీకే జరుగుతాయి. కనుక హోలియెస్ట్ మరియు హైయెస్ట్ కూడా మీరు. అలాగే రిచెస్ట్ కూడా ఉన్నారు మీరు. ప్రపంచంలో రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచంలోకెల్లా ధనవంతులు) అని అంటారు, కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ కల్పము. పూర్తి కల్పము రిచెస్ట్‌గా ఉంటారు. మీ ఖజానాలు గుర్తుకు వస్తున్నాయా, ఎన్ని ఖజానాలకు యజమానులు మీరు! ఈ ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకున్న అవినాశి ఖజానాలు అనేక జన్మల వరకు వస్తాయి. ఇంకెవ్వరి ఖజానాలు అనేక జన్మలు ఉండవు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయపు ఖజానా, ఈ సర్వ ఖజానాలు జన్మజన్మల వరకు ఉంటాయి. ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకున్న ఖజానాలు మీకు తోడుగా ఉంటాయి ఎందుకంటే సర్వ ఖజానాల దాత పరమాత్మ ద్వారా ప్రాప్తి అయ్యాయి. మా ఖజానాలు అవినాశి అన్న నషా ఉందా?
ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకోవడానికి సహజయోగిగా అయ్యారు. స్మృతి శక్తితో ఖజానాలు జమ చేసుకుంటున్నారు. ఈ సమయంలో కూడా ఈ సర్వ ఖజానాలతో సంపన్నమైన నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు, ఏ చింత అయినా ఉందా? చింత ఉందా? ఎందుకంటే ఈ ఖజానాలను దొంగలు దొంగిలించలేరు, రాజు తినలేడు, నీరు ముంచలేదు, అందుకే నిశ్చింత చక్రవర్తులు. మరి ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా! స్మృతి కూడా ఎందుకు సహజమైనది? ఎందుకంటే స్మృతికి ఆధారము సంబంధము మరియు ప్రాప్తి. ఎంత ప్రియమైన సంబంధమో అంతగా స్మృతి స్వతహాగా ఉంటుంది ఎందుకంటే సంబంధంలో స్నేహము ఉంటుంది. ఎక్కడ స్నేహము ఉంటుందో స్నేహితుడిని గుర్తు చేయడము కష్టమనిపించదు, మర్చిపోవడము కష్టమవుతుంది. బాబా సర్వ సంబంధాల ఆధారమును ఇచ్చారు. అందరూ స్వయాన్ని సహజయోగిగా అనుభవం చేసుకుంటున్నారా? లేక కష్ట యోగులా? సహజయోగులే కదా? లేక ఒక్కోసారి సహజము మరోసారి కష్టమా? బాబాను ఎప్పుడైతే సంబంధంతో మరియు స్నేహముతో స్మృతి చేస్తారో అప్పుడు స్మృతి కష్టమనిపించదు, అలాగే ప్రాప్తులను కూడా గుర్తు చేయండి. సర్వ ప్రాప్తుల దాత మనకు సర్వ ప్రాప్తులను ఇచ్చేసారు. మరి స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలను జమ చేసుకునేందుకు సహజమైన విధిని కూడా బాప్‌దాదా వినిపించి ఉన్నారు - ఏవైతే అవినాశి ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలు అన్నింటినీ ప్రాప్తి చేసుకునేందుకు విధి - బిందువు. ఎలా అయితే వినాశి ఖజానాలలో కూడా బిందువు పెడుతూ ఉంటే పెరుగుతూ ఉంటుందో అలాగే అవినాశి ఖజానాలను జమ చేసుకునేందుకు విధి కూడా బిందువును పెట్టడము. మూడు బిందువులు - ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామాలో ఏదైతే గడిచిపోయిందో దానికి ఫుల్స్టాప్ అనగా బిందువు. మరి బిందువును పెట్టడము వస్తుందా? అన్నిటికన్నా సహజంగా వ్రాయగలిగినది ఏమిటి? బిందువు పెట్టడము కదా! నేను ఆత్మను బిందువును, నా తండ్రి బిందువు, ఈ స్మృతితో స్వతహాగా ఖజానాలను జమ చేసుకోవచ్చు. మరి బిందువును సెకండులో గుర్తు చేసుకోవడం వలన ఎంతో సంతోషము ఉంటుంది. ఈ సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితానికి అధికారము ఎందుకంటే పిల్లలుగా అవ్వడము అంటే అధికారులుగా అవ్వడము. విశేషంగా మూడు సంబంధాల అధికారము ప్రాప్తిస్తుంది - పరమాత్మను తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకుడిగా కూడా చేసుకున్నారు మరియు సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ మూడు సంబంధాలతో పాలన, చదువుతో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ (సంపాదనకు మూలం) మరియు సద్గురువు ద్వారా వరదానాలు లభించాయి. ఎంత సహజంగా వరదానాలు లభించాయి? ఎందుకంటే తండ్రి నుండి వరదానాలను పొందడము పిల్లల జన్మసిద్ధ అధికారము.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జమ ఖాతాను చెక్ చేస్తున్నారు. మీరు కూడా ప్రతి సమయపు జమ ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయిందా లేదా, అందుకు విధి - ఏ కర్మ చేసినా ఆ కర్మలో స్వయం సంతుష్టంగా ఉండాలి మరియు ఎవరితో కలిసి కర్మ చేసారో వారు కూడా సంతుష్టంగా ఉండాలి. ఇద్దరూ సంతుష్టంగా ఉంటే కర్మల ఖాతా జమ అయిందని భావించండి. ఒకవేళ స్వయంలో కానీ లేక ఇతరులలో కానీ సంతుష్టత లేదు అంటే జమ అవ్వదు.
బాప్‌దాదా పిల్లలందరికీ సమయపు సూచనను కూడా ఇస్తున్నారు. ఈ వర్తమాన సంగమ సమయము పూర్తి కల్పంలోకల్లా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన సమయము ఎందుకంటే ఈ సంగమ సమయమే శ్రేష్ఠ కర్మలకు బీజము వేసే సమయము. ప్రత్యక్ష ఫలమును పొందే సమయము. ఈ సంగమ సమయంలోని ఒక్కొక్క సెకండు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది. అందరూ ఒక్క సెకండులో అశరీరి స్థితిలో స్థితి అవ్వగలరా? బాప్‌దాదా సహజమైన విధిని వినిపించారు, నిరంతర స్మృతి కోసం ఒక విధిని తయారు చేసుకోండి - రోజంతటిలో రెండు మాటలు అందరూ పలుకుతారు, అనేకసార్లు పలుకుతారు. ఆ రెండు పదాలు - “నేను” మరియు “నాది”. నేను అన్నప్పుడల్లా నేను ఆత్మను అన్న పరిచయాన్ని బాబా ఇచ్చారు అని గుర్తు తెచ్చుకోండి. కేవలం నేను అన్న పదాన్ని గుర్తు చేసుకోకండి, నేను ఆత్మను అని ఆలోచించండి. నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉన్న ఆత్మను అని గుర్తు చేసుకోండి. నాది అన్న మాట పలికేటప్పుడు ఏమి గుర్తుకు రావాలి? నాది ఏమిటి? నా బాబా అనగా తండ్రి పరమాత్మ. నేను, నాది అన్న మాటలు పలికేటప్పుడు నేను ఆత్మను, నా బాబా అన్నది జత చేయండి. ఎంతగా బాబా పట్ల నావారు అన్నది తీసుకువస్తారో అంతగా స్మృతి సహజమవుతుంది ఎందుకంటే నాది అన్నదానిని ఎప్పటికీ మర్చిపోము. రోజంతా గమనించండి, నాది అన్నదే గుర్తుకు వస్తూ ఉంటుంది. కావున ఈ విధితో సహజంగా నిరంతర యోగిగా అవ్వగలరు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ స్వమానము అనే సీట్‌పై కూర్చోపెట్టారు. స్వమానాల లిస్ట్ గుర్తు చేసుకుంటే అది ఎంత పెద్దది! ఎందుకంటే స్వమానంలో స్థితి అయితే దేహ అభిమానము రాలేదు. అయితే దేహ అభిమానము ఉంటుంది లేకపోతే స్వమానము ఉంటుంది. స్వమానము యొక్క అర్థము - స్వ అనగా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్మృతి స్థానము. మరి అందరూ తమ స్వమానంలో స్థితి అయి ఉన్నారా? ఎంతగా స్వమానంలో స్థితి అయి ఉంటారో అంతగా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడము స్వతహాగా జరిగిపోతుంది. స్వమానంలో స్థితి అవ్వడం ఎంత సహజమో చూడండి!
మరి అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతారు. బాప్‌దాదా సదా అంటారు - రోజంతటిలో సంతోషాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకండి. ఎందుకని? సంతోషం ఎటువంటిదంటే ఆ ఒక్క సంతోషంలోనే హెల్త్ (ఆరోగ్యం), వెల్త్ (సంపద) మరియు హ్యాపీ (సంతోషం) కూడా ఉన్నాయి. సంతోషము లేకపోతే జీవితం నీరసంగా ఉంటుంది. సంతోషాన్ని మించిన ఖజానా లేదు అని సంతోషం గురించి అంటారు. ఎన్ని ఖజానాలు ఉన్నాకానీ సంతోషం లేకపోతే ఖజానాలతో ప్రాప్తి అనుభవం అవ్వదు. సంతోషం వంటి ఔషధము లేదు అని కూడా అంటారు. కనుక సంతోషము సంపద కూడా అలాగే ఆరోగ్యం కూడా. పేరే సంతోషము అయినప్పుడు హ్యాపీ ఉండనే ఉంటుంది. సంతోషంలో మూడూ ఉన్నాయి. బాబా అవినాశి సంతోషపు ఖజానాను ఇచ్చారు, బాబా ఇచ్చిన ఖజానాను పోగొట్టుకోకండి. మరి సదా సంతోషంగా ఉంటున్నారా?
బాప్‌దాదా హోమ్‌వర్క్ ఇచ్చారు - సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి. ఎందుకంటే సంతోషము ఎటువంటిదంటే ఎంత పంచుతారో అంతగా అది పెరుగుతుంది. అనుభవం చేసి చూసారు కదా! అనుభవం ఉంది కదా? ఒకవేళ సంతోషాన్ని పంచితే పంచేకన్నా ముందు అది మీ వద్ద పెరుగుతుంది. సంతోషపెట్టే వారికన్నా ముందు స్వయం సంతోషంగా ఉంటారు. మరి అందరూ హోమ్‌వర్క్ చేసారా? చేసారా? చేసినవారు చేతులెత్తండి. ఎవరైతే చేసారో - సంతోషంగా ఉండాలి, కారణం కాదు నివారణ చెయ్యాలి, సమాధాన స్వరూపులుగా అవ్వాలి, వారు చేతులు ఎత్తండి. ఇప్పుడైతే ఇలా అనరు కదా - ఇది జరిగిపోయింది! బాప్‌దాదా వద్ద కొంతమంది పిల్లలు తమ రిజల్టును వ్రాయించారు - ఎంత శాతం ఓ.కె ఉన్నారు అని. లక్ష్యము పెట్టుకుంటే లక్ష్యంతో లక్షణాలు స్వతహాగానే వస్తాయి. అచ్ఛా.
సేవ టర్న్ కర్ణాటక వారిది:- కర్ణాటక వారు లేవండి. కర్ణాటక వారు సేవ అవకాశాన్ని తీసుకున్నారు. మంచిది. ఎందుకంటే ఇప్పుడు సంగమయుగంలో ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. జమ కూడా అవుతుంది, ప్రత్యక్ష ఫలితం కూడా లభిస్తుంది. అదే సమయంలో సంతోషము ప్రాప్తిస్తుంది. ఎన్ని రోజులు సేవ చేసారో అంతగా ప్రత్యక్షఫలమైన సంతోషాన్ని అనుభవం చేసుకున్నారా? సంతోషం లభించిందా? చేతులు ఎత్తండి. మాయ వచ్చిందా? రాలేదా? ఎవరికైతే మాయ రాలేదో వారు చేతులెత్తండి. పాండవులకు మాయ వచ్చిందా? కొద్దికొద్దిగా వచ్చిందా? మంచిది, ఇక్కడి వాతావరణం చాలా సహయోగం ఇస్తుంది. ఎలా అయితే సైన్సువారు సైన్సు శక్తితో వాయుమండలాన్ని పరివర్తన చేస్తారో, వేడిని చలిలోకి మార్చేస్తారు! చలిలో వేడి వాతావరణాన్ని తయారు చేసేస్తారు, అలాగే సైలెన్సు శక్తి ఆధ్యాత్మిక స్మృతి వాయుమండలాన్ని తయారు చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సేవ చేస్తూ ఏ వృత్తిలో ఉంటారు? యజ్ఞ సేవ, యజ్ఞ పుణ్యము చాలా పెద్దది. ఈ అవినాశి యజ్ఞంలో సేవ చేయడం వలన వృత్తి శ్రేష్ఠంగా అవుతుంది అలాగే వాయుమండలం కూడా శ్రేష్ఠంగా అవుతుంది. ఇప్పుడు కర్ణాటక వారు ఏ విశేషత చూపిస్తారు? ఏదైనా కొత్త కార్యాన్ని చేసి చూపించండి. చూడండి, కర్ణాటకలో సంఖ్య ఎక్కువగా ఉంది మరియు ఏరియా కూడా ఎక్కువ ఉంది. సేవ చేసే ఏరియా చాలా ఎక్కువ ఉంది. కర్ణాటక వారు చేయగలిగిన అతి పెద్ద సేవ - కర్ణాటకలోని చిన్న పెద్ద ఏ స్థానమును విడిచిపెట్టవద్దు. మా తండ్రి వచ్చారు కానీ మాకు సూచన ఇవ్వలేదు, సందేశము ఇవ్వలేదు అని ఎవ్వరూ వచ్చి ఫిర్యాదు చెయ్యకూడదు. ఈ ఫిర్యాదు రాకూడదు.
మొదటిసారి వచ్చినవారు లేవండి:- మీ అందరికీ బ్రాహ్మణ జన్మకు అభినందనలు. అచ్ఛా, మిఠాయి అయితే లభిస్తుంది కానీ బాప్‌దాదా దిల్ఖుష్ మిఠాయిని తినిపిస్తున్నారు. మొదటిసారి మధుబనానికి వచ్చిన సందర్భంగా లభించిన దిల్ఖుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఆ మిఠాయి అయితే నోటిలో వేసుకోగానే అయిపోతుంది కానీ దిల్ఖుష్ మిఠాయి సదా మీతోనే ఉంటుంది.
బాప్‌దాదా చెప్పిన ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా! ఇప్పుడు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి కొత్తవారైనా, పాతవారైనా, పెద్దవారైనా, చిన్నవారైనా అందరూ బాబా సమానంగా త్వరగా అవ్వవచ్చు. ఇప్పుడు సెకండులో ఎక్కడ మనసును ఉంచాలనుకుంటారో అక్కడ మీ మనసును ఏకాగ్రం చేయండి. ఈ ఏకాగ్రత డ్రిల్ సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క సెకండులో మనసుకు యజమానిగా అయి నేను మరియు నా బాబాయే ప్రపంచం, ఇతరులెవ్వరూ లేరు, ఈ ఏకాగ్ర స్మృతిలో స్థితులవ్వండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే కళను అనుభవం చేసుకునే అనుభవిమూర్త పిల్లలకు, సదా తమ స్వమానమనే సీట్‌పై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయాహృదయులై విశ్వ ఆత్మలకు మనసా శక్తి ద్వారా సుఖశాంతులను దానమిచ్చే దయాళు, కృపాళు పిల్లలకు, సదా బాబా స్నేహంలో ఇమిడిపోయే హృదయ సింహాసనాధికారి పిల్లలకు, బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ జానకి:- మన బాబా వండర్ఫుల్, దాదీ గుల్జార్గారి పాత్ర కూడా వండర్ఫుల్. దాదీ గుల్జార్‌గారు, బాబా నా గురించి ఇచ్చిన సందేశాన్ని ఈరోజు చూసాము. సాకార బాబా పిల్లలమైన మనకు చక్కని పాలనను ఇచ్చారు. తర్వాత అవ్యక్త రూపంలో దాదీ గుల్జార్గారి ద్వారా బాప్‌దాదా చాలా మంచి పాలనను ఇచ్చారు. అందరికీ ప్రియస్మృతులు లభించాయి. ప్రత్యేకంగా కర్ణాటక వారిని కూడా బాబా గుర్తు చేసారు. బాబా చెప్పేది నేను చదువుతున్నాను. ఈ సాధనాలు వండర్ఫుల్. డ్రామా అనుసారంగా ఈ సైన్సు కూడా అద్భుతం చేస్తుంది. సైలెన్సులో ఉండే బాబా పిల్లలైన మనము ఏమి చేస్తున్నాము? బాబా మనకు ఆజ్ఞాపించేవి ఆటోమేటిక్‌గా జీవితంలోకి వచ్చేస్తాయి. ఓ.కే. అచ్ఛా!