Search for a command to run...
15 Dec 2018
“సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిశ్తా స్థితిలో ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యండి”
15 December 2018 · తెలుగు
ప్రాణపద్రమైన అవ్యక్తమూర్తి తల్లితండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునేవారు, సంబంధం, సంస్కారం, సంకల్పం అన్నింటిలో తేలికగా ఉంటూ తమ కర్మాతీత స్థితిని సమీపంగా అనుభవం చేసుకునేవారు, ఈ అలౌకిక పాలనకు రిటర్న్ ఇచ్చే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన బాప్‌దాదా అవతరణలోని ఈ 5వ గ్రూపు గుజరాత్ జోన్ వారిది. గుజరాత్ అయితే మధుబనానికి మరో గదివంటిది అని బాప్‌దాదా అంటారు. యజ్ఞంలోని ప్రతి సేవకు హా జీ అంటూ, తనువు-మనసు-ధనముతో సదా సహయోగిగా ఉంటారు. సమయ ప్రమాణంగా మధురమైన బాప్‌దాదా మన ప్రియమైన దాదీ ప్రకాశమణిగారి ఉదాహరణను ఇస్తూ అందరూ డబల్ లైట్‌గా ఉండాలని ప్రేరణను ఇస్తున్నారు.
ఇప్పుడు జనవరి నెల సమీపిస్తుంది. 2019 అవ్యక్త పాలనకు గోల్డెన్ జుబిలి సంవత్సరము. జనవరి నెలలో బాబాకు స్నేహి పిల్లలందరూ అంతర్ముఖత గుహలో కూర్చుని విశేషమైన తపస్సు చేస్తుంటారు. నలువైపుల ఎంతో చక్కని వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరం అందరూ 50 రోజుల కోసం యోగ తపస్సు కార్యక్రమాన్ని తమ తమ స్థానాలలో పెట్టండి.
ఇప్పుడు త్వరత్వరగా విశ్వంలో బాప్‌దాదా ప్రత్యక్షత జరగాలన్నదే మనందరి శుభ సంకల్పం. ఎందుకంటే పరమాత్మ ప్రత్యక్షతయే విశ్వ పరివర్తనకు ఆధారము. ఇందుకోసం వాచ సేవతో పాటు ఇప్పుడు పవర్ఫుల్ మనసా సేవ యొక్క ఆవశ్యకత ఉంది. ఎంతగా మనసు శుద్ధంగా, శక్తిశాలిగా, శుభ భావనలతో సంపన్నంగా ఉంటుందో అంతగా ప్రకృతి సహితంగా సర్వాత్మల వరకు సకాశ్ చేరుకుంటుంది. మరి తప్పకుండా మీరందరూ నూతన సంవత్సరంలో నవీనతతో కూడిన యోగ తపస్సు కార్యక్రమాన్ని తయారు చెయ్యగలరు. కనీసం ప్రతి సేవాకేంద్రంలో 50 రోజులు అఖండ యోగ తపస్సు కార్యక్రమం జరగాలి దీనివలన పురుషార్థంలో విఘ్నరూపంగా ఉండే చిన్న చిన్న విషయాలు సమాప్తమైపోతాయి. ఇందుకోసం మనసులో శుద్ధత, బుద్ధిలో ఏకాగ్రత, వాణిలో మధురత ఉండే విశేషమైన చార్టును పెట్టండి మరియు ప్రతిరోజూ కనీసం 4 గంటలు పవర్ఫుల్ యోగం చేస్తూ విశ్వానికి సకాశ్ను ఇచ్చే సేవను చెయ్యండి. అప్పుడు బాప్‌దాదాకు మిగిలి ఉన్న అన్ని ఆశలు తీరిపోతాయి.
ప్రియమైన బాప్దాదాపై అందరికీ ఎంతో ప్రేమ ఉంది అందుకే అవ్యక్త అనుభూతులు చేసుకోవడానికి అందరూ తమ తమ టర్న్ అనుసారంగా మధుబనానికి చేరుకుంటున్నారు. బాప్‌దాదా కూడా వతనం నుండి పిల్లలకు అన్ని రకాల సకాశ్ను, పాలనను అనుభూతి చేయిస్తున్నారు. మధుబనానికి వస్తున్న సోదరసోదరీలందరూ మంచి అనుభూతులను చేసుకుంటున్నారు.
ఈ టర్న్‌లో మనందరం వీడియో ద్వారా విన్న అవ్యక్త మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు. ఓం శాంతి.
15-12-18 అవ్యక్త మహావాక్యాలు రివైజ్ వీడియో 05-02-09 మధువనం
“సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిశ్తా స్థితిలో ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యండి”
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల మూడు రూపాలను చూస్తున్నారు - ఎలా అయితే మీరు తండ్రిలో మూడు రూపాలు చూస్తారో అలాగే తండ్రి కూడా పిల్లలలో మూడు రూపాలను చూస్తున్నారు. అవి ఈ సంగమయుగానికి లక్ష్యము మరియు లక్షణాలు. మొదటి స్వరూపము - బ్రాహ్మణులు, రెండు - ఫరిశ్తా, మూడు - దేవత. బ్రాహ్మణ్ సో ఫరిశ్తా, ఫరిశ్తా సో దేవత. వర్తమాన సమయంలో విశేషంగా ఏ లక్ష్యము ఎదురుగా ఉంటుంది? ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. కనుక వర్తమాన సమయ ప్రమాణంగా మరియు స్వ పురుషార్థ ప్రమాణంగా ఇప్పుడు ఫరిశ్తాగా అవ్వడమే లక్ష్యము. సంగమయుగ సంపన్న స్వరూపమైన ఫరిశ్తా సో దేవతగా అవ్వాలి. ఫరిశ్తా యొక్క పరిభాష తెలుసు. ఫరిశ్తా అనగా పాత ప్రపంచ సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాలతో తేలికగా ఉండటము. పాత సంస్కారాలలో కూడా తేలికగా ఉండాలి. కేవలం తమ సంస్కార స్వభావాలు, స్వ ప్రపంచంలోనే తేలికగా ఉండటము కాదు, ఫరిశ్తా అనగా సర్వులతో కలుస్తూ సర్వుల స్వభావ సంస్కారాలలో తేలికతనము. ఈ తేలికతనానికి గుర్తు ఏమిటి? ఈ ఫరిశ్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. కొందరికి ప్రియంగా కాదు, సర్వులకు ప్రియంగా ఉంటారు. బ్రహ్మాబాబాను ప్రతి ఒక్కరూ నా బాబా అనుకుంటారు. నా బాబా అంటారు. అలాగే ఫరిశ్తా అంటే సర్వులకు ప్రియులు. బ్రహ్మాబాబా అయితే బ్రహ్మాబాబాయే కదా అని కొంతమంది పిల్లలు అనుకుంటారు కానీ మీ సమానమైన బ్రాహ్మణ ఆత్మలలోని మీ ప్రియమైన దాదీని చూసారు కదా. వారిని అందరూ ప్రేమతో మా దాదీ అని భావించేవారు. అన్ని వైపుల నుండి స్వభావ సంస్కారాలు, ఈ పాత ప్రపంచంలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు, అందరూ హక్కుతో మా దాదీ అంటారు. ఇందుకు కారణము ఏమిటి? స్వయం స్వభావ సంస్కారాల నుండి తేలికగా ఉండటము. అందరికీ నావారు అని అనుభవం చేయించారు. ఉదాహరణగా నిలిచారు. జగదాంబను కూడా చూసారు కదా, కానీ వారైతే జగదాంబ కదా అని కొందరు అంటారు. కానీ దాదీ అయితే బ్రాహ్మణ పరివారంలో మీతోటి వారే కదా. వారి నోటి నుండి పురుషార్థం గురించి విన్నా లేక అడిగినా వారిది ఒక్కటే మాట ఉంటుంది – ‘‘ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి.” కర్మాతీతంగా అవ్వాలన్న లగనములో ఇతరులకు కూడా పదే పదే ఈ మాటనే గుర్తు చేయించేవారు. కనుక ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క లక్ష్యము మరియు లక్షణము ఇదే ఉండాలి, ఉంది కానీ నంబరువారీగా ఉంది. ఇప్పుడు ఫరిశ్తాగా అవ్వవలసిందే అన్న లగనము ఉండాలి. ఫరిశ్తా అనగా దేహము, సాకార దేహం నుండి అతీతంగా, సదా లైట్ దేహధారులు. ఫరిశ్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు.
పూర్తి సృష్టి చక్రంలో ఒక్క బాప్‌దాదా మాత్రమే నా ఒక్కొక్క పిల్లలు రాజా పిల్లలు, స్వరాజ్య అధికారులు అని గర్వంగా చెప్పుకోగలరు అని బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. ఫరిశ్తా అనగా స్వరాజ్య అధికారులు. ఇటువంటి స్వరాజ్య అధికారి ఆత్మలు, లైట్ స్వరూపధారులు. ఎవరైనా ఇటువంటి లైట్ యొక్క డబల్ తేలిక స్థితిలో స్థితి అయి ఎవరినైనా కలిస్తే వారి మస్తకంలో ఆత్మ జ్యోతి యొక్క భావన నడుస్తూ తిరుగుతూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి తీవ్ర పురుషార్థపు లక్ష్యాన్ని మరియు లక్షణాన్ని సదా ఇమర్జ్ చేసుకోండి. బ్రహ్మాబాబాను ఎవరైనా కలిసినా, దృష్టి తీసుకుంటున్నా, మాట్లాడుతున్నా కానీ వారికి ఏమి కనిపించేది? చివరలో బ్రహ్మాబాబా మాట్లాడుతూ మాట్లాడుతూ మధురమైన అశరీరి స్థితిలో స్థితులైపోయేవారు. ఎంతటి సేవా సమాచారమైనా కానీ, ఇతరులకు కూడా సెకండులో అశరీరి స్థితిని అనుభవం చేయించేవారు. ఏ మురళిని పరిశీలించినా కానీ, పదే పదే నేను అశరీరి ఆత్మను, ఆత్మ పాఠాన్ని ఒక్క మురళిలో ఎన్ని సార్లు గుర్తు చేయించేవారు. కనుక ఇప్పుడు సమాయనుసారంగా చిన్నచిన్న విస్తారపు మాటలు, స్వభావ సంస్కారపు మాటలు అశరీరి స్థితి నుండి దూరం చేస్తాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన కావాలి.
సేవలో మంచి ఫలితం రావడాన్ని బాప్‌దాదా చూసారు. సేవలో మెజారిటీ ఉల్లాస ఉత్సాహాలను చూపిస్తారు, ప్లాను కూడా తయారు చేస్తూ ఉంటారు, సందేశం ఇవ్వడం అవసరము. ఈరోజు కూడా భిన్న భిన్న వర్గాల, భిన్న భిన్న స్థానాల సేవ యొక్క మంచి ఫలితాన్ని బాప్‌దాదా చూసారు. కానీ సేవతో పాటు అశరీరి స్థితి యొక్క వాతావరణం తక్కువ శ్రమను మరియు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. విన్నది మంచిగానే అనిపిస్తుంది కానీ వాయుమండలంతో, అశరీరి దృష్టితో అనుభవం చేసుకుంటే, అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ఫరిశ్తా స్థితిని సేవలో జత చేయండి. శాంతి, సంతోషం, సుఖం, ఆత్మిక ప్రేమ ఏదో ఒకటి అనుభవం చేయించండి. నడవడికలో ప్రేమ ఉండాలి. పరివార భావనతో చేసే ఆతిథ్యంతో బాగుంది అని అనుభవం చేసుకుంటున్నారు కానీ అతీంద్రియ సుఖపు ఫీలింగ్, శాంతి యొక్క ఆత్మిక నషా ఇప్పుడు వాయుమండలంలో మరియు వైబ్రేషన్ల ద్వారా అనుభవం కావాలి అన్న విశేష అటెన్షన్ పెట్టుకోండి. విశేషమైన అనుభవం చేయించండి, ఏదో ఒక అనుభవాన్ని చేయించండి. ఎలా అయితే ఇక్కడి వ్యవస్థ చూసి ప్రభావితమవుతారో, అలాగే ఇటువంటి పరివార ప్రేమ మరెక్కడా లభించదు అనిపించాలి. ఇలా ఇప్పుడు ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రాప్తిని అనుభవం చేసి వెళ్ళాలి.
ఇప్పటి వరకు బ్రహ్మాకుమారీలు పని చేస్తున్నారు, బ్రహ్మాకుమారీల జ్ఞానం బాగుంది అంటున్నారు. ఇచ్చేవారు ఎవరు! నడిపించేది ఎవరు! సోర్స్ (మూలం) ఎవరు! మీ అందరూ అంటూ ఉంటే బాబా అన్న పదాన్ని అయితే విన్నారు కానీ ఈ బాబా ఎవరు, వారు నా బాబాయే అని అనాలి. బాబా ప్రత్యక్షత ఇప్పుడు గుప్త రూపంలో ఉంది. బాబా, బాబా అంటున్నారు, నా బాబా, నేను బాబాకు, ఇది కోట్లలో కొద్దిమంది నోటి నుండే వెలువడుతుంది.
సంగమయుగం లక్ష్యం ఏమిటి? మనందరి ఆత్మల తండ్రి వచ్చేసారు, వారసత్వమైతే తండ్రి ద్వారానే లభిస్తుంది కదా! ఆ ప్రభావము ఫరిశ్తా స్థితి ద్వారా వాయుమండలంలో వ్యాపిస్తుంది. వీరి దృష్టి నుండి లైట్ లభిస్తుంది, వీరి దృష్టి నుండి ఆత్మికత అనే ప్రకాశము కనిపిస్తుంది. ఇప్పుడు తీవ్ర పురుషార్థానికి ఇదే లక్ష్యం పెట్టుకోండి - నేను డబల్ లైట్ ఫరిశ్తాను, నడుస్తూ తిరుగుతూ ఫరిశ్తా స్వరూప అనుభూతిని పెంచండి. అశరీరి స్థితి అనుభవాన్ని పెంచండి. సెకండులో ఏ సంకల్పమునైనా సమాప్తం చెయ్యడంలో, సంస్కార స్వభావంలో డబల్ లైట్. కొంతమంది పిల్లలు అంటారు మేము తేలికగానే ఉన్నాము కానీ ఇతరులు మమ్మల్ని గుర్తించడం లేదు అని. కానీ ఇటువంటి డబల్ లైట్ ఫరిశ్తా, డబల్ లైట్ యొక్క ప్రకాశము దాగగలదా? చిన్న లైట్ కావచ్చు, అగ్గిపుల్ల వెలుతురు కావచ్చు, ఎటువంటి లైట్ వెలిగినా కానీ అది దాగదు, ఇదైతే ఆత్మిక లైట్. తమ వాయుమండలంతో వీరు ఎవరు అని అనుభవం చేయించండి! జగదాంబ కానీ దాదీ కానీ వీరికి నేను తెలీదు అనలేదు. తమ వాయుమండలంతో సర్వులకు ప్రియంగా అయ్యారు. అందుకే దాదీ ఉదాహరణ ఇవ్వడం జరిగింది ఎందుకంటే బ్రహ్మాబాబా గురించి అనుకుంటారు, బ్రహ్మాబాబాలో అయితే శివబాబా ఉన్నారు కదా, శివబాబా గురించి కూడా అనుకుంటారు వీరైతే నిరాకారుడు, మేమైతే స్థూల శరీరధారులము కదా. ఇంత పెద్ద సంగఠనలో ఉంటాము, ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్య ఉంటాము, సంస్కారాలను కలుపుకోవడము అంటే ఫరిశ్తాగా అవ్వడము. సంస్కారాలను చూసి కొంతమంది నిరాశ చెందుతారు. బాబా చాలామంచివారు, బ్రహ్మాబాబా చాలా మంచివారు, జ్ఞానం చాలా మంచిది, ప్రాప్తులు చాలా బాగున్నాయి, కానీ సంస్కార స్వభావాలను కలుపుకోవడము అంటే సర్వులకు ప్రియంగా అవ్వడము. కొందరికి ప్రియంగా కాదు, ఎందుకంటే కొంతమంది పిల్లలు అంటారు కొందరి ప్రేమ వారిలోని విశేషతలను చూసి కూడా జరుగుతుంది అని. వీరి ప్రసంగం చాలా బాగుంటుంది, వీరిలో ఫలానా విశేషత బాగుంది, వాణి బాగుంది, ఫరిశ్తాగా అవ్వడంలో ఇవి విఘ్నంగా అవుతాయి. ప్రియంగా అవ్వండి, కానీ నేను అతీతమైన ఆత్మను, అతీతమైన స్థితితో ప్రియంగా అవ్వండి. విశేషతలతో ప్రియంగా అవ్వకండి. వీరిలోని ఈ గుణం నాకు చాలా బాగా నచ్చుతుంది, అవి మీలో ధారణ చేసుకోండి కానీ కేవలం వీటి కారణంగా ప్రియంగా అవ్వడం తప్పు. ఫరిశ్తా అందరికీ ప్రియంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ నావారు అనాలి, నావారు అన్న అనుభవం కలగాలి. ఇటువంటి ఫరిశ్తా స్థితిలో రెండు విఘ్నంగా నిలుస్తాయి. దేహభానము, అదైతే నేచురల్‌గా అనుభవమే. 63 జన్మల దేహ భానము మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. రెండవది దేహ అభిమానము, దేహ భానము మరియు దేహ అభిమానము. జ్ఞానంలో ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో, స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహ అభిమానము వస్తూ ఉంటుంది, ఆ అభిమానము కింద పడవేస్తుంది, ఎటువంటి దేహ అభిమానము వస్తుంది? ఏదైనా విశేషత ఉంటే, ఆ విశేషత కారణంగా అభిమానము వస్తుంది, నేనేమీ తక్కువ కాదు, నా ప్రసంగం అందరికీ నచ్చుతుంది. నేను చేసే సేవ యొక్క ప్రభావం బాగుంటుంది, ఏదైనా కళ, నా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, నేను చాలా బాగా కోర్సు చేయిస్తాను. జ్ఞానంలో ముందుకు వెళ్ళడంలో, సేవలో ముందుకు వెళ్ళడంలో ఈ అభిమానము స్వ పట్ల మరియు ఇతరుల పట్ల కూడా వస్తుంది. ఇతరులలోని గుణం, కళ, విశేషత పట్ల ప్రేమ కలుగుతుంది. కానీ ఎవరు గుర్తుకు వస్తారు? దేహభానమే గుర్తుకు వస్తుంది కదా, ఫలానా వారి బుద్ధి చాలా మంచిది, నా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, ఈ అభిమానము సేవ లేక పురుషార్థంలో ముందుకు వెళ్ళేవారిలో అభిమానం రూపంలో వస్తుంది. ఇది కూడా చెక్ చేసుకోవాలి. అభిమానం ఉన్నవారికి అభిమానం ఉన్నదా లేదా చెక్ చేసుకోవడానికి సాధనము, అభిమానము ఉన్నవారిని ఎవరైనా కొంచమైనా అవమానిస్తే, వారి ఆలోచనలకు, వారి సలహాలకు, వారి కళలకు, వారి హ్యాండ్లింగ్‌ను అవమానిస్తే వారికి అవమానపు ఫీలింగ్ చాలా త్వరగా వస్తుంది. అవమానము కలిగితే, దాని సూక్ష్మ గుర్తు క్రోధము యొక్క అంశము కలుగుతుంది, ఆవేశము. అది ఫరిశ్తాగా అవ్వనివ్వదు. వర్తమాన సమయానుసారంగా బాప్‌దాదా మళ్ళీ సూచనను ఇస్తున్నారు, మీ సంగమయుగపు చివరి స్వరూపమైన ఫరిశ్తా స్థితిని జీవితంలో ప్రత్యక్షం చేసుకోండి, సాకారంలోకి తీసుకురండి. ఫరిశ్తా అయితే అశరీరిగా అవ్వడం చాలా సహజమవుతుంది. మీలోని విశేషత లేక ఇతరులలోని విశేషత సూక్ష్మ రూపంలోనైనా ఏదైనా ఆకర్షణను లేక అభిమానమును తెస్తుందా అని చెకింగ్ చేసుకోండి. ఏదైనా చిన్న విషయము జరిగితే తొందరగా అలజడిలోకి వచ్చేస్తారు కొంతమంది పిల్లలు. దిల్ఖుష్, మనసు ఖుష్... దీనికి బదులు చింతతో ఉన్న ముఖము లేక చింతనతో ఉన్న ముఖము ఉంటుంది మరియు నడుస్తూ నడుస్తూ నిరాశ (దిల్శికస్త్) కూడా అవుతారు. దిల్ఖుష్ బదులు దిల్ శికస్త్. మరి అర్థమయిందా, ఇప్పుడు మీ సంగమయుగపు చివరి స్టేజ్ అయిన ఫరిశ్తా సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. బ్రహ్మాబాబాను చూసారు కదా, ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా. బాబా తమ చివరి సమయంలో, పిల్లలు మాట్లాడుతూ ఉంటే, సమాచారము వినిపించడానికి పిల్లలు వస్తే బాబా మాత్రం సమాచారం నుండి అతీతంగా, ధ్వని నుండి అతీతమైన స్థితి యొక్క అనుభవంలో ఉండటాన్ని చూసారు. అనేక విషయాల సమాచారాన్ని వినిపించాలని, సేవా ప్లాన్లను వినిపించాలని వచ్చేవారు, ఇది చెప్తాను, ఇది అడుగుతాను... కానీ ఎదురుగా రాగానే ఏమి చెప్పాలని అనుకున్నారో అది మర్చిపోయేవారు. ఇది ఫరిశ్తా స్థితి. మరి ఈ రోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? నేను ఎవరిని? ఫరిశ్తా. విషయాలనుండి, విశేషతల నుండి, స్వయంలోని విశేషతల నుండి, దేహ అభిమానము నుండి అతీతంగా డబల్ లైట్ ఫరిశ్తా ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వనిదే దేవతా ఉన్నత పదవి లభించదు. సత్యయుగంలోకైతే వస్తారు, ఎందుకంటే పిల్లలుగా అయ్యారు కదా, వారసత్వం అయితే లభిస్తుంది కానీ శ్రేష్ఠ పదవి కాదు. సదా తోడుగా ఉంటాము, కలిసి రాజ్యం చేస్తాము, సింహాసనంపై కూర్చోకపోయినా కానీ రాజ్య అధికారులుగా అయితే అవుతారు, అక్కడి రాజ్య సభ ఎలా ఉంటుందో చూసారు కదా. రాజ్య సభకు అధికారులైన అందరూ తిలకము మరియు కిరీటధారులుగా అవుతారు. రాజ్య తిలకము, రాజ్యానికి గుర్తు కిరీటము. బహుకాలము నుండి స్వరాజ్యాధికారులుగా ఉండాలి, మధ్యమధ్యలో కాదు. బహుకాలపు రాజ్యాధికారులు సింహాసనంపై కూర్చోకపోయినా కానీ రాయల్ ఫామిలీకి అధికారులుగా అవుతారు. అచ్ఛా.
అచ్ఛా, ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్ఛా, మూడువంతుల సభ లేచారు. మొదటి సారి వచ్చినవారందరికీ బాబాతో సాకారంలో కలిసినందుకు, మొదటిసారి జన్మకు అభినందనలు.
సేవ టర్న్ గుజరాత్ వారిది:- అచ్ఛా, గుజరాత్ నుండి మొదటిసారి వచ్చినవారు లేవండి. గుజరాత్ నుండి బాబాను మొదటిసారి కలుసుకోవడానికి వచ్చినవారు చేతులు ఊపండి. మంచిది, వచ్చేసారు. మన మధుబనము, బాప్‌దాదా మధుబనమును చూసారు. ఇందుకు అభినందనలు. అచ్ఛా. ఇప్పుడు గుజరాత్ వారందరూ లేవండి. బాప్‌దాదా ప్రారంభం నుండి గుజరాత్‌ను మధుబనానికి మరో గదిలా భావిస్తారు.
ఎలా అయితే సేవపై అటెన్షన్ పెడితే సేవ వృద్ధిని పొందుతుంది కదా, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు ధారణపై మరింత అటెన్షన్ అవసరము. ఎందుకంటే అంతిమ సమయంలో సేవ చేయాలనుకున్నా చేయలేరు. ఇప్పుడు చేసిందే ఉంటుంది. ఆ సమయంలో ఫరిశ్తా జీవితం, అశరీరిగా అవ్వడము, సెకండులో బిందువు పెట్టడము, ఇవే ఉపయోగపడతాయి. అది కూడా అకస్మాత్తుగా జరుగనుంది. ఈ అభ్యాసం ఒకవేళ తక్కువగా ఉంటే, సేవలోనే ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది! సేవలో కూడా ఉండాలి ఎందుకంటే రెండింటి బ్యాలెన్స్ ఉండాలి.
బాప్‌దాదా పదే పదే సూచనను ఇస్తున్నారు - అకస్మాత్తుగా జరుగనుంది మరియు అటువంటి పరిస్థితులలో అవ్వనుంది అందుకని మీరు చెప్పలేదు అని బాబాకు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యకూడదు. పదే పదే భిన్న భిన్న సూచనలను ఇస్తూనే ఉన్నాము. సేవకు ఫలితం లభిస్తుంది, సేవకు మార్కులు లభిస్తాయి, ఎందుకంటే నాలుగు సబ్జెక్టులు కదా, కనుక సేవ సబ్జెక్టుకు మార్కులు లభిస్తాయి కానీ మిగతా మూడు సబ్జెక్టులు! ఒకవేళ ఒక సబ్జెక్టులో మీరు మంచి మార్కులు తీసుకున్నారు కానీ మిగతా మూడింటిలో తక్కువ మార్కులు వస్తే ఏ నంబరు లభిస్తుంది? నాలుగింటిలోనూ ఫస్ట్ నంబరు రావాలి. ఇదే పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్దాదాకున్న శుభ ఆశ. అచ్ఛా.
నలువైపుల ఉన్న దిల్ఖుష్, సత్యమైన దిల్, స్వచ్ఛమైన దిల్ ఉన్నవారి ప్రతి సంకల్పం సిద్ధిస్తుంది. దీని అర్థము ఏ సంకల్పం చేసినా అందులో సఫలత లభిస్తుంది. ఇలా మూడు విశేషతలను, పెద్ద మనసు, స్వచ్ఛ మనసు మరియు సత్యమైన మనసు ఉన్నవారు. నలువైపుల ఉన్న ఇటువంటి పిల్లలను బాప్‌దాదా చూసి పదమారెట్ల కన్నా ఎక్కువ సంతోషిస్తున్నారు మరియు ఆటోమేటిక్ పాట పాడుతున్నారు, వాహ్! వాహ్ నా పిల్లలూ వాహ్! సదా అభినందనలకు పాత్రులైన పిల్లలూ వాహ్!
దాదీ జానకిగారు:- ఓం శాంతి. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో ఆ లక్ష్యం అనుసారంగా లక్షణాలు కూడా రావాలి. వచ్చేసాయి కదా, చెప్పండి, బాబా అద్భుతం కదా. ఈరోజు తయారైన సహజయోగి, రాజయోగి, నడుస్తూ తిరుగుతూ, తింటూ తినిపిస్తూ ఉన్న ఫరిశ్తా జీవితం ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతుంది. సంగమయుగ రోజులు ఎంత ప్రియమైనవి, బాబా మనతో ఉన్నారు, తోడు ఉన్నారు సహవాసిగా అవ్వడానికి, బాబా మీది అద్భుతం. బాబా మందు కూడా ఇస్తున్నారు, దీవెనలు కూడా ఇస్తున్నారు. ఈరోజు ఎంత వండర్ఫుల్. మురళి అయితే బాగుంది, వింటూ ఉండండి, మీ మనసులో పెట్టుకుంటూ ఉండండి. దిలారామ్ బాబా ఎంత వండర్ఫుల్. మనం ఇప్పుడు ఫరిశ్తాగా అవ్వాలి అని మేమంటాము, దేవతగా తర్వాత అవుతాము. ఫరిశ్తాగా ఇప్పుడు అవుతారా లేక అయిపోయారా? మేము మా తోటి సోదరీలను, సోదరులను అడుగుతున్నాము. శాంతి మరియు శక్తి, ప్రేమ మరియు సంతోషము ఈ నాలుగు విషయాల వాతావరణం ఉంది. ఏమని పలకను బాబా. మేము సంతోషంగా ఉన్నాము, తృప్తిగా ఉన్నాము, ఖుష్రాజీగా వాతావరణం ఉంది. ఖుష్ రాజీ (సంతోషంగా, తృప్తిగా) ఉన్నారు అందరూ, నారాజ్ (కోపం)గా ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఉండరు. బాబా, ఇలా మీరు మమ్మల్ని సంభాళించారు. 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు వచ్చాయా నాకు, అచ్ఛా. చెప్పండి, నా బాబా. మధురమైన బాబా. ప్రియమైన బాబా, ధన్యవాదాలు బాబా. నా బిడ్డ అని బాబా అంటారు. నేను ఎవరిని, నాకు ఎవరు ఇది తప్ప మరేదీ ఆలోచించవద్దు. నేను ఎవరిని - ఆత్మలో మనసు బుద్ధి సంస్కారాలు ఉన్నాయి, మనసు శాంతిగా ఉంది. బుద్ది అంటుంది నలువైపుల శాంతి వాతావరణాన్ని తయారు చేయడానికి దృష్టి వృత్తి స్మృతి మూడింటితో ఒకటేసారి సేవ చెయ్యండి. ఓం శాంతి.
నీలు అక్కయ్య ముంబయి నుండి ఫోన్లో మాట్లాడారు:- దాదీ గుల్జార్‌గారు అందరికీ చాలా చాలా ప్రేమతో ఓం శాంతి చెప్తున్నారు. దాదీగారు సభను చూసి చాలా సంతోషిస్తున్నారు. ఓంశాంతి