"కారణము అన్న మాట నుండి ముక్తులై ముఖము మరియు నడవడిక ద్వారా ముక్తిని ఇచ్చే ముక్తిదాతలుగా అవ్వండి, సేవ పట్ల ఉల్లాస - ఉత్సాహాలతో ఉండటంతోపాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండండి"
ఓం శాంతి 02-02-2019 మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా తమ శ్రేష్ఠ అవ్యక్త స్థితి ద్వారా సాకార వతనాన్ని అవ్యక్త వతనంగా మార్చేవారు, పరమాత్మ స్నేహీలు అయిన నిమిత్త టీచర్లు మరియు దేశ విదేశాలలోని స్వరాజ్య అధికారులైన సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - మీరందరూ అవ్యక్త మాసంలో చాలా మంచిగా తపస్సును చేసారు, చాలా స్థానాలలో అఖండ యోగ భట్టీలు జరిగాయి. ఈరోజు బాప్‌దాదాతో మంగళ మిలనమును జరుపుకోవడానికి, అవ్యక్త అనుభూతులను చేసుకోవడానికి శాంతివన విశాల ప్రాంగణంలో ఈస్టర్న్ (అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా) తమిళనాడు మరియు నేపాల్ సోదరసోదరీలు 19 వేలకన్నా ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు. అందరూ అమృతవేళ నుండే తమ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త వతనపు షికారును చేస్తున్నారు. చాలా చక్కని సైలెన్స్ వాతావరణం ఉంది. ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా వతనం నుండి తమ పిల్లల అవ్యక్త పాలనను భిన్న భిన్న స్వరూపాలతో చేస్తున్నారు. అందరూ మధుబన్ అనంతమైన ఇంటికి వచ్చి బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు. ఇప్పుడైతే ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా నుండి 50 సంవత్సరాల నుండి లభించిన అవ్యక్త పాలనకు రిటర్న్ ఇవ్వాలన్న ఉల్లాసము అందరి పిల్లలలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కారణము అనే మాట నుండి ముక్తులై తమ నడవడిక మరియు ముఖము ద్వారా అందరికీ ముక్తినిచ్చే ముక్తిదాతలుగా కావాలన్నది బాప్‌దాదా ఆశ. సేవలపై ఉండే ఉల్లాస-ఉత్సాహాలతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి కూడా ఉండాలి. ఈ వైరాగ్య వృత్తియే స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తనకు ఆధారమవుతుంది.
మన మధురమైన దాదీ గుల్జార్ గారు కూడా ఇప్పుడు ముంబయి గామ్దేవి సేవాకేంద్రంలో ఉన్నారు. ఆరోగ్యం కుదుట పడుతూ ఉంది. చలికాలం పూర్తవ్వగానే వారు తమ మధుబన్ ఇంటికి వస్తారని ఆశిస్తున్నాము. ఇంతమంది బ్రాహ్మణ పిల్లల శుభ సంకల్పాలు, శ్రేష్ఠ భావనల శక్తి దాదీగారిని ఎగిరించి మధుబన్ ఇంటికి తెచ్చేస్తాయి.
ఇకపోతే పూర్తి విశ్వం నుండి డబల్ విదేశీ సోదరసోదరీలు వచ్చే జల్లు ప్రారంభమయింది. రిట్రీట్లు, మీటింగ్‌లు మొదలైన వాటి కోసం నలువైపుల నుండి బాబా పిల్లలు చేరుకుంటున్నారు. మధుబన ఇల్లు సదా పిల్లలను స్వాగతిస్తుంది.
చూడండి, ఒక వైపు తపస్సు యొక్క అల ఉంటే మరోవైపు భారతదేశంలో విశేషంగా త్రివేణి సంగమంలో విశాలమైన కుంభ మేళా జరుగుతుంది. అక్కడ కూడా బాప్‌దాదా భిన్న భిన్న రూపాలలో తమ సేవలను చేయించుకుంటూ ఉంటారు. మేళాలో విశేషంగా రెండు స్థానాల్లో వేరు వేరుగా చాలా ఆకర్షణీయమైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు మన ఆధ్యాత్మిక మేళా చాలా చక్కని మోడల్స్ మరియు చైతన్య దేవతల ప్రదర్శనలతో అలంకరించబడి ఉంది, అక్కడకు వేలాదిమంది భక్త ఆత్మలు ఈశ్వరీయ సందేశాన్ని తీసుకుని వెళ్తుంటే మరోవైపు ప్రభుత్వం వారి తరఫున విశాలమైన రైతు మేళా ఏర్పాటు చేయడం జరిగింది, అందులో స్వర్ణిమ భారత దేశానికి ఆధారమైన శాశ్వత యోగిక వ్యవసాయం అంశంపై కూడా మన స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, దీనితో అక్కడి అనేక అధికార గణాలు, మంత్రులు మరియు నలువైపుల ఉన్న రైతు సోదరులు లాభాన్ని పొందుతున్నారు. ప్రియమైన బాప్‌దాదా సేవకు భిన్న భిన్న సాధనాలను ఇచ్చారు. అచ్ఛా.
ఈస్టర్న్ జోన్లో వీడియో ద్వారా ఏ మహావాక్యాలను అయితే మనమందరం విన్నామో వాటిని మీకు కూడా పంపుతున్నాము. అందరినీ రిఫ్రెష్ చేయగలరు. అచ్ఛా - అందరికీ స్మృతి... ఓం శాంతి
02-02-19 ఓం శాంతి “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 07-04-09 మధువనం
కారణము అన్న మాట నుండి ముక్తులై ముఖము మరియు నడవడిక ద్వారా ముక్తిని ఇచ్చే ముక్తిదాతలుగా అవ్వండి, సేవ పట్ల ఉల్లాస - ఉత్సాహాలతో ఉండటంతోపాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండండి
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లలను, ఎవరైతే డబల్ యజమానులుగా ఉన్నారో వారందరినీ చూస్తున్నారు. ఒకటి, బాబా ఖజానాలన్నిటికీ యజమానులు మరియు రెండు, స్వరాజ్యానికి కూడా యజమానులు. రెండు యాజమాన్యాలు పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా ద్వారా లభించి ఉన్నాయి. బాలకులు కూడా మరియు యజమానులు కూడా. నా బాబా అన్నారు. మరియు బాబా కూడా నా పిల్లలు అన్నారు. మరి బాలకులు మరియు యజమానులు, రెండింటి అనుభవం ఉంది.
ఈరోజు బాప్‌దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని పరిశీలించారు. మరి ఏమి చూసి ఉంటారో చెప్పండి? నా పురుషార్థము ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి సంతోషపడ్డారు కానీ బాబాకు ఒక్క ఆశ ఉంది, అది ఏమిటో చెప్పమంటారా! బాబా ఆశను పూర్తి చేస్తారు కదా! ఒక్కటే ఆశ ఉంది, చెప్పమంటారా! ఆశను పూర్తి చేస్తాము అన్నవారు చేతులెత్తండి. చాలా మంచిది. చిన్నని ఆశ, అదేమిటంటే ఈరోజు నుండి ఒక్క మాటను మార్చండి, ఏ మాట? మాటిమాటికీ క్రిందకు తీసుకువచ్చే మాట “కారణము”. ఈ కారణము అన్న మాటను పరివర్తన చేసి నివారణ అన్న మాటను సదా ధారణ చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీ సేవ కూడా ఏమిటి? విశ్వంలోని ఆత్మలందరి సమస్యల కారణాన్ని నివారణ చేసి, నివారణ చేయగానే నిర్వాణధామంలోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు. మరి ఇతరులకు కూడా ముక్తిని ఇచ్చేవారు కాబట్టి స్వయం కూడా కారణాన్ని నివారణ చేస్తేనే ఇతరులకు ముక్తిని ఇవ్వగలరు. నిర్వాణంలోకి పంపగలరు. మరి ఈ ఒక్క మాటలో మార్పును తీసుకురావడము కష్టమా లేక సహజమా? ఆలోచించండి.
ఈరోజు ఇక్కడకు వచ్చినవారినుండి, తమ తమ స్థానాలలో ఉండి చూస్తున్నవారినుండి, వింటున్నవారినుండి, వారందరి నుండి ఒక్క మాటలో పరివర్తనను కోరుకుంటున్నారు ఎందుకంటే కారణము క్రిందకు తీసుకు వస్తుంది. కారణంలోనే అర్థకల్పం ఉన్నారు, ఇప్పుడు నివారణ చేసే సమయము. నివారణ మరియు నిర్వాణము, ముక్తి. మరి ఈ రోజు బాబాకు ఇది ఇవ్వడానికి ధైర్యము ఉందా? అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో వచ్చారు, బాప్‌దాదా ఒక్కొక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు. పడుకోవడానికి, భోజనానికి కష్టంగా ఉన్నప్పటికీ అందరూ స్నేహంతో, స్నేహము అను విమానము మీ అందరినీ మధువనానికి చేర్చింది. బాప్‌దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి, ప్రతి ఒక్కరికీ పదమారెట్లు హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ స్నేహంలో మీరు ఏమి చేస్తారు? ఎవరితో అయితే స్నేహము ఉంటుందో, వారికి స్నేహంతో బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు బాప్‌దాదా బహుమతి రూపంలో ఈ కారణము అన్న మాటను తీసుకోవాలని ఆశిస్తున్నారు. బాప్‌దాదాకు ఉన్న ఈ ఆశను పూర్తి చెయ్యాలి కదా! అయితే చేతులెత్తండి, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ గేట్ నుండి బయటకు వెళ్తే కారణము అన్న మాట సమాప్తమై ఉండాలి. పొరపాటున మీ వద్దకు మళ్ళీ వచ్చేసినా బాబాకు ఇచ్చిన వస్తువు ఇక తాకట్టు అవుతుంది. మరి తాకట్టు పెడితే ఏమి చేస్తారు? తిరిగి తీసుకుంటారా? మరి అందరూ దృఢ సంకల్పం చేసారా? చేసారా? మళ్ళీ చేతులెత్తండి. వెనుక ఉన్నవారు చేతులు ఊపండి. అచ్ఛా. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీ వద్దకు క్యూ రానున్నది. ఎందుకని క్యూ వస్తుంది? ఓ ముక్తిదాతా, ముక్తిని ఇవ్వండి. మరి ఇచ్చేవారు, ముక్తిదాతలు ముందుగా మీరు ఈ మాటనుండి ముక్తులుగా అవ్వండి అప్పుడే ముక్తుని ఇవ్వగలరు.
బాప్‌దాదా కోరుకుంటున్నది ఏమిటంటే ఇప్పుడు ఈ సంవత్సరం హోమ్‌వర్కు ఇదే ఉండాలి, నేను ముక్తి అయి ముక్తిని ఇప్పించాలి ఎందుకంటే సమస్యలు రోజు రోజుకూ పెరగనున్నాయి. కావున సమస్య సమాధాన రూపంలో మారిపోవాలి. సమస్యను తొలగించడంలో కష్టము, సమయము పట్టకూడదు. మీకు మీ భక్తులు మరియు సమయపు పిలుపు వినిపించడం లేదా! ఇప్పుడు సమయానుసారంగా దేనిని పరివర్తన చేయడం అవసరము? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవీమూర్తులుగా అయి ఏదో ఒక అనుభూతిని చేయించాల్సిన అవసరము ఉంది. కావున ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే, వీరు ముక్తిదాత పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అని మీ అందరి ముఖము, నడవడికలో స్పష్టంగా కనిపించాలి. మీ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రం అనుభవం కావాలి. కేవలం వినిపించడం ద్వారా కాదు, ముఖము ద్వారానే అనుభవం కావాలి ఎందుకంటే అనుభవం దగ్గరకు తీసుకువస్తుంది. ఈ అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చూపించండి. చూడండి, ఎలా అయితే సైన్స్ సాధనాలు అనుభవం చేయిస్తాయి కదా, ఇప్పుడు వేసవి కాలం అయితే వేడి మరియు చల్లదనాన్ని అనుభవం చేయిస్తున్నాయి కదా. సైన్స్ సాధనాలు అనుభవీగా చేస్తున్నప్పుడు సైలెన్స్ పవర్ శక్తిని అనుభవం చేయించలేదా! కావున ఇప్పుడు బాప్‌దాదా ప్లిలల నుండి ఏమి కోరుకుంటున్నారంటే అనుభవం అనే స్థితిలో స్థితులై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్న విషయము, విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ సమస్య వచ్చినప్పుడు మర్చిపోతారు. కానీ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు.
బాప్‌దాదా ఒక కారణాన్ని చూసారు. రిజల్టును కూడా చూసారు, ఒక రిజల్టును చూసి చాలా చాలా అభినందనలు ఇచ్చారు. ఆ రిజల్ట్ ఏమిటి? ఈరోజు వరకు సేవలో ఉల్లాస-ఉత్సాహము బాగుంది ఇందుకు బాప్‌దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు, సేవను పెంచుతున్నారు కూడా, ప్లాన్లు కూడా మంచిగా చేస్తున్నారు. రిజల్ట్ కూడా యథా శక్తి లభిస్తుంది కానీ అనుభవం చేయించడానికి ఒక్కవిషయంలో స్వయంపై అటెన్షన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. ఎలా అయితే మీ సేవ ఇప్పుడు ప్రసిద్ధి అవుతూ ఉంటుందో, సంతోషంగా కూడా ఉంటారు. ఈ రోజుల్లో ఇంటరెస్ట్ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడిక అనుభవం చేయించడానికి విధి ఏమిటి? అది, ఉల్లాస-ఉత్సాహాలతో పాటు, ఎంత ఉల్లాసమో అంతగా సమయానుసారంగా ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి కూడా కావాలి. పురుషార్థంలో ఏదైనా సమస్యా రూపంగా అవుతుందంటే అందుకు కారణము అనంతమైన వైరాగ్య వృత్తిలో లోపము. ఇప్పుడు అనంతమైన వైరాగ్యము కావాలి. అనంతమైన వైరాగ్యము సదాకాలం ఉంటుంది. ఒకవేళ సమయానికి ఉంటే అప్పుడు సమయము నంబర్‌వన్ అయిపోతుంది, మీరు నంబర్ టూ అవుతారు. సమయము మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది. అనంతమైన వైరాగ్యము సదాకాలం ఉంటుంది. ఒకవైపు ఉల్లాస - ఉత్సాహము, సంతోషము మరియు మరో వైపు అనంతమైన వైరాగ్యము. అనంతమైన వైరాగ్యము సదా ఉండకపోవడానికి కారణము ఏమిటి? అందుకు కారణము దేహ అభిమానము అని బాప్‌దాదా చూసారు. దేహము అన్న మాట అన్నింటిలోనూ వస్తుంది - దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు - దేహము అన్న మాట అన్నింటిలో వస్తుంది. దేహ అభిమానము విశేషంగా ఎందులో వస్తుంది? దేహీ అభిమానము నుండి దేహ అభిమానములోకి తీసుకు వచ్చే ముఖ్య కారణము, పాత సంస్కారము ఇప్పటి వరకు క్రిందకు తీసుకు రావడము అని బాప్‌దాదా పరిశీలించారు. సంస్కారాలను తొలగించుకున్నారు కానీ ఏదో ఒక సంస్కారము నేచర్ రూపంలో ఇప్పటికీ పని చేస్తుంది. ఎలా అయితే దేహ అభిమానము అన్న నేచర్ (స్వభావము) నేచురల్‌గా (సహజంగా) అయిపోయిందో అలా దేహీ అభిమానము అన్న నేచర్ నేచురల్ కాలేదు. మేము సమాప్తం చేసాము అని అంటారు కానీ పూర్తిగా బీజాన్ని భస్మం చెయ్యలేదు. అందుకే సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ దేహభాన సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. కావున ఇప్పుడు దేహ భానము అన్న నేచర్ పవర్ఫుల్ దేహీ అభిమాని యొక్క శక్తితో వంశంతో సహా నాశనం చెయ్యాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము అనుకోలేదు కానీ అప్పుడప్పుడు వచ్చేస్తుంది అని పిల్లలు అంటారు. ఎందుకు వస్తుంది? అంశము ఉంటేనే వంశమై బయటకు వస్తుంది. కావున ఇప్పుడు శక్తి స్వరూపులుగా కావలసిన అవసరము ఉంది. ఇందుకు ఆధారము - ఏ స్వరూపంలోనైనా అంశమాత్రంగానైనా పాత దేహభాన సంస్కారము ఉండిపోలేదు కదా అని పరిశీలించుకోవడము. అది అనంతమైన వైరాగ్య వృత్తితోటే సమాప్తం అవుతుంది. సేవలను చూసి, విని బాప్‌దాదా సంతోషిస్తున్నారు కానీ ఎలాగైతే సేవా దృశ్యము, స్థితి లోకులకు కనిపిస్తుందో, సేవ అనుభవమవుతుందో, అలాగే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం ఉండాలి అని బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా మీ ప్రశంస పెరుగుతుంది. ప్రకృతి మీకు దాసి అవుతుంది. అనుభవం చేసుకుంటారు, సాధనాలు పెరుగుతాయి కానీ అనంతమైన వైరాగ్య వృత్తితో సాధనాలు మరియు సాధన మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. ఎలా అయితే మీరు ప్రవృత్తిలో ఉండేవారికి ఉదాహరణ ఇస్తారు కదా, అన్నీ చేస్తూ కూడా కర్మయోగిలా, కమల పుష్ప సమానంగా ఉండండి అని, అలాగే మీరందరూ కూడా సేవ చేస్తూ, సాధనాలు లభిస్తున్నప్పటికీ, సాధనాలు మరియు సాధనలో బ్యాలెన్సును ఉంచాలి. కావున ఇప్పుడు సేవతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ఆవశ్యకతను ఎడిషన్ చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేష ఆత్మలు అని అనుభవం చేసుకోవాలి. కేవలం యోగంలో కూర్చున్నప్పుడే కాదు, భాషణ చేసే సమయంలోనే కాదు నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకం ద్వారా శాంతి, శక్తి, సంతోషాల అనుభూతి జరగాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు సమయం మారుతూ ఉంటుంది.
మరి బాప్‌దాదా అయితే సమయానుసారంగా సూచనను అయితే ఇచ్చారు కానీ ఈరోజు విశేషంగా బాప్‌దాదా ఒకటి, అనంతమైన వైరాగ్య వృత్తి వైపు సూచనను ఇస్తున్నారు. ఇందుకోసం దేహీ అభిమానానికి విఘ్నంగా ఉన్న దేహ అభిమానమును పరిశీలించుకోండి. అనేక రకాల దేహ అభిమానాల అనుభవం ఉంది. వీటిని పరివర్తన చెయ్యండి. రెండవ విషయము, బహుకాలం కోసం స్వయం గురించి ఆలోచించండి. బహుకాలపు అభ్యాసము కావాలి. బహుకాలపు పురుషార్థము, బహుకాలపు ప్రాలబ్ధము. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అటెన్షన్‌ను తక్కువగా ఇస్తే అంతిమ కాలంలో బహుకాలము జమ చేసుకోలేము. టూలేట్ బోర్డ్ వచ్చేస్తుంది. కావున బాప్‌దాదా ఈరోజు వచ్చే సంవత్సరానికి హోమ్‌వర్క్‌ను ఇస్తున్నారు. ఈ దేహ అభిమానము అన్ని సమస్యలకు కారణం అవుతుంది. పిల్లలు రమణీకమైనవారు కదా, సమయానికి తయారైపోతాము బాబా అని పిల్లలు బాబాకే ధైర్యం చెప్తారు. సమయము మీ టీచరా అని బాప్‌దాదా అడుగుతున్నారు. సమయానికి సరిగ్గా అయిపోతాము అంటే అప్పుడు మీ టీచర్ ఎవరైనట్లు? మీ క్రియేషన్ అయిన సమయము మీకు టీచర్ అయితే బాగుంటుందా? కావున సమయాన్ని మీరు సమీపంగా తీసుకురావాలి. మీరు సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చేవారు. సమయానికి ఉండేవారు కాదు. సమయాన్ని టీచర్‌గా చేసుకోవద్దు.
మరి బాప్‌దాదా ఈరోజు పదే పదే ఈ సూచననే ఇస్తున్నారు స్వయాన్ని పరిశీలించుకోండి, పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి మరియు పరివర్తన తీసుకురండి. బహుకాలపు పరివర్తన, బహుకాలపు ప్రాలబ్దానికి అధికారిగా చేస్తుంది. ఇప్పటివరకు ఢీలా ఢీలా పురుషార్ధీలే అయినా కానీ లాస్ట్ నంబర్ పిల్లలపై కూడా బాబాకు స్నేహము ఉంది. స్నేహము ఉంది కనుకనే బాబా పిల్లలుగా అయ్యారు, బాబాను గుర్తించారు. నా బాబా అని అయితే అంటారు అందుకే సమయానికి విడిచిపెట్టకండి. సమయము రాదు, సంపూర్ణత యొక్క సమయాన్ని మనము తీసుకురావాలి. బాప్‌దాదా యొక్క విశ్వ పరివర్తనా కార్యంలో మీరందరూ సహచరులు. ఒంటరిగా బాబా ఈ కార్యాన్ని చెయ్యలేరు. పిల్లల తోడు కావాలి. ముందుగా పిల్లలు, ముందు పిల్లలు అని బాబా అంటారు. మరి వచ్చే సంవత్సరంలో రావాలంటే ఈ హోమ్‌వర్క్ చేసి పెట్టండి! చేస్తారా? చేతులెత్తండి. అచ్ఛా. వెనుకవారు కూడా చేతులెత్తుతున్నారు.
మొదటిసారి బాప్‌దాదాను కలుసుకోవడానికి వచ్చినవారు లేవండి. చూడండి, సగం క్లాసు మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. వెనుకవారు చేతులెత్తండి. మొదటిసారి బాప్‌దాదాను కలుసుకోవడానికి వచ్చినవారు లేవండి. చూడండి, సగం క్లాసు మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. నిల్చోని చూడండి. మొదటిసారి వచ్చిన వారందరికీ బాప్‌దాదా క్రొత్త జన్మకు, జన్మ దిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. లక్షరెట్లు అభినందనలు అని లోకులు అంటారు కానీ బాబా పదమాపదమ రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు వచ్చేవారికి బాప్‌దాదా సదా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ అవకాశము ఏమిటంటే ఇప్పుడు వచ్చేవారు కూడా ఒకవేళ తీవ్ర పురుషార్థం చేస్తే బాప్‌దాదా మరియు డ్రామా వారికి లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ ఇస్తారు. వీరు కూడా ముందు నంబర్‌ను తీసుకోవచ్చు. అవకాశం ఉంది. ఛాన్సలర్ అవ్వండి. కేవలం అటెన్షన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. అచ్ఛా.
అన్ని వైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు మరియు భవిష్యత్తులో రాజ్య సింహాసనాధికారులు, బాప్‌దాదాకు ఇటువంటి అతి గారాల, పదమాపదమ రెట్ల భాగ్యశాలీ పిల్లలకు, సదా తమ నయనాల ద్వారా ఆత్మికతను అనుభవం చేయించేవారికి, ముఖము ద్వారా అదృష్టవంతులు, మనసు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వీరికున్న సంతోషం ఇంకెక్కడా ఉండదు అని అందరూ అనుభవం చెయ్యాలి మరియు అందరూ పాఠం నేర్చుకుని వెళ్ళాలి. ఇలా బాబా ప్రతి సంతానము తమ ద్వారా బాబాను, నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తారు కానీ నయనాలు మరియు ముఖము ద్వారా తండ్రిని సాక్షాత్కారం చేయించేవారు, ఇటువంటి నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరైతే ఉత్తరాలు పంపారో, ఈ-మెయిల్ చేసారో, అందరివీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. మీరు చేసిన ఆ సమయమే అవి బాబా వద్దకు చేరుకున్నాయి. ఎదురుగా కూర్చున్నవారందరితో మీరెవరైతే పంపారో, ఆ సమయమే చేరుకున్నాయి. అందుకే చాలా చాలా అభినందనలు. దేశ విదేశాలలోని పిల్లలందరికీ బాబా హృదయ స్నేహానికి రెస్పాండ్ అవుతున్నారు. నలువైపుల ఉన్న పిల్లలకు బాప్‌దాదా పదమారెట్లు హృదయపూర్వక అనురాగము, హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు, మరియు అందరికీ నమస్తే చేస్తున్నారు. అచ్ఛా - ఈసారి ఎవరి టర్న్?
ఈస్టర్న్ జోన్(బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం), నేపాల్, తమిళనాడు జోన్ టర్న్:- అచ్ఛా - ఈ జోన్లో ఇతర జోన్లు కూడా కలిసి ఉన్నాయి. అయితే నేపాల్ వారు చేతులెత్తండి. చెన్నైవారు, తమిళనాడు వారు చేతులెత్తండి. అచ్ఛా. అన్నిటినీ కలిపి ఈస్టర్న్ జోన్ అని అంటారు.
అచ్ఛా, జోనుకు అభినందనలు. అందరినీ చూడండి, ఎంతమందికి యజ్ఞ సేవకు ఛాన్సును ఇచ్చారు. మంచిగా అనిపించింది కదా. మంచిగా ఉందా? యజ్ఞ సేవకు వేయి రెట్లు ఎక్కువగా పుణ్యం తయారవుతుంది. ఎవరైతే సత్యమైన హృదయము, పెద్ద మనసుతో సేవ చేసేవారిగా ఉన్నారో వారికి వేయి రెట్లు ఎక్కువగా పుణ్య ఖాతా జమ అయింది. బాగుంది, సంఖ్య కూడా బాగుంది. ఇకపోతే ఏదైనా క్రొత్త పనిని చేసి చూపించండి. అచ్ఛా అందరికీ, జోనులో వచ్చిన ఒక్కొక్క భాగ్యశాలీ ఆత్మకు బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా..
డబల్ విదేశీయులు:- మీరు విదేశీయులా? కానీ అందరికంటే పెద్ద విదేశీయుడు ఎవరు? బాప్‌దాదా అయితే మీకన్నా పెద్ద విదేశీయుడు. ఎంత దూరం నుండి వస్తారు! మీ ఏరియానైతే కొలవవచ్చు కానీ బాబా ఏరియాను లెక్కగట్టగలమా? మీకు విదేశం నుండి దేశంలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? బాప్‌దాదా రావడానికి ఎంత సమయము పడుతుంది? విదేశాలలో కూడా సేవ మరియు స్వ పరివర్తన అల నడుస్తుంది. అచ్ఛా.
దాదీ జానకిగారు:- వండర్ఫుల్ మన బాబా, వండర్ఫుల్ బాబా పిల్లలు. మనం బాబాను సదా తోడు పెట్టుకుని సాక్షిగా అయ్యి సమయాన్ని గుర్తించి, విశ్వం నా బాబాను గుర్తించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. పిల్లలు ఈ భావనను బాబా పూర్తి చేస్తారు. స్వ పరివర్తనతో విశ్వ పరివర్తనను తీసుకురావడానికి బాబా ఎంతగానో మనకు ఉల్లాస ఉత్సాహాలను ఇస్తారు. ఉల్లాస ఉత్సాహము, సంతోషమే మనందరికీ భోజనము. సంతోషంగా ఉండండి, సమృద్ధిగా ఉండండి, పాత విషయాలను గుర్తు చేసుకోకండి. అదృష్టాన్ని ఎలా మేలుకొలిపి ఉంచుకోవాలంటే ఈ బీజము పడుతూ ఉండాలి. ఈరోజు మధురమైన బాబా ఉచ్ఛరించిన మహావాక్యాలను విన్నాము. బాబా చాలాసార్లు అందరికీ అభినందనలను తెలిపారు. పిల్లలు అని బాబా అంటారు, పిల్లలేమో నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, ధన్యవాదాలు బాబా అని అంటారు. ఈరోజు ఈస్టర్న్ జోన్‌కు మేము కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో, సేవలో హాజరైనందుకు, అందరికీ అభినందనలను ఇస్తున్నాము.
నిర్వైర్ అన్నయ్యగారు:- దాదీ జానకిగారిని మన మధ్యలో చూస్తుంటే, బాప్‌దాదాతో పాటు వారిని కూడా చూస్తుంటే హృదయం ఉప్పొంగిపోతుంది. దాదీగారి ధైర్యం, ఉల్లాస ఉత్సాహాలు వారికి అతి పెద్ద ఇంధనం వంటివి, అవే వారిని ఎగిరిస్తూ ఉంటాయి. దాదీ ఎల్లప్పుడూ ఎగిరే కళలో ఉంటూ, హంసా అక్కయ్యను తీసుకుని ఒకసారి ఒక చోటకు, మరోసారి మరోచోటకు... ఈమధ్యనే హాంగ్ కాంగ్ వెళ్ళి వచ్చారు. అలాగే దాదీ గుల్జార్ గారికి కూడా మనందరం ఋణపడి ఉన్నాము, వారి ద్వారా బాప్‌దాదా సర్వాత్మలను, దేశవిదేశాల పిల్లలను, క్రొత్త పాత పిల్లలను అందరినీ స్వమానంలో స్థితి చేయించి, మహాన్ అయ్యే దారిని అందరికీ చెప్పారు. ఈరోజు మురళి వింటూ ఉంటే బాబా ఈరోజే మురళి చెప్పినట్లుగా నషా వచ్చింది. దాదీ గుల్జార్ గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము, అలాగే నీలూ అక్కయ్యకు, గామ్దేవీ సెంటర్ సోదరసోదరీలకు అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు చలికాలం పూర్తి కావస్తుంది, దాదీ మీరు మధుబనానికి వచ్చేయండి. మేమందరం మీ కోసం వేచి ఉన్నాము.
ఈరోజు బాబా ఏదైతే చెప్పారో, మీ నయనాలతో, ముఖం మరియు నడవడికతో బాబా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయమన్నారు. అందుకు ఆధారమేమిటో కూడా బాబా చెప్పారు, మేము బాబా శ్రీమతంపై 100% నడవాలి అని మనసులో దృఢ సంకల్పం చేసుకోమన్నారు. మరి అందరూ అలా నడుచుకుంటారు కదా. అఛ్ఛా.
*** ఓంశాంతి ***
