"మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవరెడీగా అవ్వండి"
17-02-2019 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్తమూర్తి తల్లిదండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా ఉన్నతమైన స్వమానంలో స్థితి అయ్యి ఏకాగ్రత శక్తిని పెంచుకునే, ఫరిశ్తా నుండి దేవతగా తయారయ్యే పురుషార్థంలో తత్పరులై ఉన్న నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము – అవ్యక్త మిలనం యొక్క ఈ ఆహ్లాదకరమైన క్షణాలు అందరి మనసులను ఆకర్షిస్తున్నాయి. మధుబన్ ఇంటికి బాబా పిల్లలు ఎవరు వచ్చినా, బాబా వారిని చాలా నిండుగా చేస్తారు. ఇప్పుడు సేవ యొక్క టర్న్ రాజస్తాన్ వారిది. వారితో పాటు, కొన్ని ఇతర జోన్ల నుండి సోదరసోదరీమణులు మరియు డబల్ విదేశీ సోదరసోదరీమణులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. విదేశాలలోని ప్రధాన సోదరసోదరీమణుల వేరు వేరు మీటింగ్‌లు కూడా జరుగుతున్నాయి. దీనిలో దేశంలో మరియు విదేశాలలో విశేషంగా స్వ ఉన్నతి, యజ్ఞ విస్తరణ మరియు సేవల తీవ్రత కోసం చాలా మంచి ఆలోచనలు వెలువడుతున్నాయి. ప్రియమైన బాప్‌దాదా, ఒక వైపు, సేవల గురించి విశేషమైన సూచనలను ఇస్తారు. అలాగే ఏకాగ్రత శక్తిని పెంచడానికి మరియు ప్రకృతితో సహా ప్రపంచంలోని దుఃఖము, అశాంతిగా ఉన్న ఆత్మలందరికీ సమయానుసారంగా శక్తివంతమైన మనసు ద్వారా సకాశ్ను ఇచ్చే ప్రేరణ కలిగిస్తారు. శివవంశీ బ్రహ్మా కుమారులు, కుమారీలైన మనందరికీ అతి పెద్ద పండుగ త్రిమూర్తి శివజయంతి సమీపిస్తోంది. ప్రతి చోట శివబాబా జెండాను ఎంతో ప్రేమతో ఎగురవేస్తారు. ప్రభాత ఫేరి, ప్రదర్శన, మేళాలు మరియు కాన్ఫరెన్సుల ద్వారా బాప్‌దాదా అవతరణ యొక్క దివ్య సందేశాన్ని కూడా అందిస్తారు.
ఈసారి మన శాంతివన్ విశాల ప్రాంగణంలో కాన్ఫరెన్స్ హాల్ ఎదురుగా చాలా అందమైన ఆధ్యాత్మిక మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ప్రచారం కోసం, ఆబూ చుట్టుప్రక్కల 200 గ్రామాలలో ఇప్పటికే 4 ప్రచారాలు ప్రారంభించబడ్డాయి.
1) స్వచ్ఛ భారత్ ఉద్యమం
2) నీటి నిర్వహణ ఉద్యమం
3)గ్రామ జాగృత ఉద్యమం
4) వ్యసనముక్తి ఉద్యమం
ఈ నాలుగు ప్రచారాలు ఆబూ యొక్క నాలుగు దిశలలో ప్రయాణిస్తూ ఈశ్వరీయ సందేశాన్ని ఇస్తున్నాయి.
ఈసారి ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో కుంభమేళ వద్ద విశేషంగా బ్రహ్మా కుమారీస్ రెండు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు, ప్రతి సంవత్సరం వలె చాలా అందమైన ఆకర్షణీయమైన ‘సత్యం శివం సుందరం ఆధ్యాత్మిక మేళా’, దీనిలో దేవీల ఝాంకీలు, సాగర మథనం మరియు అనేక కదిలే మోడల్స్ మొదలైనవి విశేషంగా ఆకర్షించాయి. ఈ ఒక్క నెల మేళాలో, కొన్ని వర్గాల కార్యక్రమాలు కూడా జరిగాయి, లక్షలాది మంది మేళాలో దివ్య సందేశాన్ని తీసుకున్నారు. రెండవది, ప్రభుత్వం 15 రోజుల పాటు “కుంభ్-విరాట్ కిసాన్ మేళా”ను నిర్వహించింది, ఇందులో మనం “స్వర్ణిమ భారత్‌కు ఆధారమైన యొగంతో వ్యవసాయం” అనే చాలా అందమైన స్టాల్‌ను ఏర్పాటు చేసాము. దీని ద్వారా కూడా అనేక ప్రభుత్వ అధికారులకు, రైతులకు కూడా చాలా బాగా సేవ జరిగింది. ముగింపు వేడుకలో అక్కడి ప్రధాన అధికారుల నుండి మన స్టాల్‌కు మొదటి బహుమతి లభించింది. ఈ విధంగా, బాప్‌దాదా చాలా సేవ చేస్తున్నారు. సేవలతో పాటు, ఎప్పటికప్పుడు అన్ని వైపుల యోగ భట్టీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతులు... ఓం శాంతి.
17-02-19 ఓం శాంతి “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 16-11-06 మధువనం
మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవరెడీగా అవ్వండి
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులైన, స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు. సీట్ పైనైతే పిల్లలందరూ సెట్ అయ్యి ఉన్నారు, కానీ కొందరు పిల్లలు ఏకాగ్ర స్థితిలో సెట్ అయ్యి ఉన్నారు మరియు కొందరు పిల్లలు సంకల్పాలలో కొంచెం-కొంచెం అప్సెట్ అయ్యి ఉన్నారు (మానసిక అలజడిలో ఉన్నారు). బాప్‌దాదా వర్తమాన సమయమనుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఏకాగ్రత రూపములో, స్వమానధారి స్వరూపములో సదా చూడాలనుకుంటున్నారు. పిల్లలందరూ కూడా ఏకాగ్రతా స్థితిలో స్థితులవ్వాలనే కోరుకుంటున్నారు. మీకున్న భిన్న-భిన్న స్వమానాల గురించి తెలుసు కూడా, ఆలోచిస్తారు కూడా, కానీ ఏకాగ్రతను అలజడిలోకి తీసుకువస్తారు. సదా ఏకరస స్థితి అనేది తక్కువగా ఉంటుంది. అనుభవమవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా, కానీ ఈ స్థితి అప్పుడప్పుడు మాత్రమే అన్నట్లు ఎందుకు ఉంటుంది, కారణమేమిటి! సదా అటెన్షన్ పెట్టడములో లోపము. ఒకవేళ స్వమానాల లిస్ట్ తయారు చేసినట్లయితే అది ఎంత పెద్దదిగా ఉంటుంది. అన్నింటికంటే మొదటి స్వమానము ఏమిటంటే - ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారో, వారికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు, నంబర్‌వన్ సంతానముగా ఉన్నారు. బాప్‌దాదా కోట్లలో కొద్దిమంది అయిన పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎంచుకుని తమవారిగా చేసుకున్నారు. ఐదు ఖండాల నుండీ డైరెక్టుగా బాబా పిల్లలను తమవారిగా చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద స్వమానము. సృష్టి రచయిత యొక్క మొదటి రచన మీరు. ఈ స్వమానము గురించి తెలుసు కదా! బాప్‌దాదా తనతోపాటుగా పిల్లలైన మిమ్మల్ని కూడా మొత్తము విశ్వములోని ఆత్మలకు పూర్వజులుగా తయారుచేసారు. మీరు విశ్వానికి పూర్వజులు, పూజ్యులు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విశ్వానికి ఆధారమూర్తులుగా, ఉదాహరణమూర్తులుగా తయారుచేసారు. ఆ నషా ఉందా? అప్పుడప్పుడు ఆ నషా కొంచెం తక్కువైపోతూ ఉంటుంది. ఆలోచించండి, అన్నిటికంటే అమూల్యమైన సింహాసనాన్ని, మొత్తము కల్పములో మరెవరికీ ఇటువంటి అమూల్యమైన సింహాసనము లభించదు, అటువంటి పరమాత్మ సింహాసనాన్ని, ప్రకాశ కిరీటాన్ని, స్మృతి తిలకాన్ని ఇచ్చారు. నేను ఎవరిని - అన్న స్మృతి వస్తూ ఉంది కదా! నా స్వమానము ఏమిటి! నషా ఎక్కుతూ ఉంది కదా! మొత్తము కల్పములో సత్యయుగ సింహాసనము ఎంత అమూల్యమైనది, అయినా కానీ పరమాత్మ హృదయ సింహాసనమనేది పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది.
బాప్‌దాదా సదా చివరి నంబర్లోని బిడ్డను కూడా ఫరిశ్తా నుండి దేవతగా అయ్యే స్వరూపములోనే చూస్తారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాగా, ఫరిశ్తా నుండి దేవతగా అవ్వాల్సిందే. మీ స్వమానము తెలుసా? ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు - స్వమానాన్ని మర్చిపోయిన కారణముగానే దేహభానము, దేహ-అభిమానము వస్తుంది, అలజడి చెందుతారు, వ్యాకులపడతారు కూడా. దేహ-అభిమానము లేక దేహభానము వచ్చినప్పుడు ఎంత అలజడి చెందుతారో, వ్యాకులపడతారో బాప్‌దాదా చూస్తారు. అందరూ అనుభవీలే కదా! స్వమాన నషాలో ఉండటము మరియు ఈ నషా నుండి దూరమై అలజడిలో, వ్యాకులతలో ఉండటము, ఈ రెండింటి గురించి మీకు తెలుసు. బాప్‌దాదా చూస్తున్నారు, పిల్లలందరూ మెజారిటీ నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే చాలా బాగా అయ్యారు, కానీ పవర్లో ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా లేరు. పర్సంటేజ్ లో ఉన్నారు.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు బాలకులు సో యజమానులుగా తయారుచేసారు. అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు, ఎక్కువ-తక్కువ ఇవ్వలేదు ఎందుకంటే లెక్కలేనంత ఖజానా ఉంది, అనంతమైన ఖజానా ఉంది, అందుకే పిల్లలు ప్రతి ఒక్కరినీ అనంతమైన బాలకులు సో యజమానులుగా తయారుచేసారు. తండ్రి అనంతమైనవారు, ఖజానా అనంతమైనది, కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - మీ వద్ద కూడా అనంతమైన ఖజానా ఉందా? సదాకాలము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఏదైనా దొంగలించబడుతుందా? మాయమైపోతుందా? బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు? అలజడి చెందవద్దు, వ్యాకుల పడవద్దు, స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండండి, అప్సెట్ అవ్వద్దు. 63 జన్మలైతే మానసిక అలజడిని అనుభవము చేసారు కదా! ఇప్పుడు ఇంకా అనుభవము చేద్దామని అనుకుంటున్నారా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానములో ఉండండి అనగా మీ ఉన్నతోన్నతమైన గౌరవములో ఉండండి. ఎందుకని? ఎంత సమయము గడిచిపోయింది. 70వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా!
కనుక స్వయాన్ని గురించిన అవగాహన అనగా స్వమానము గురించిన అవగాహన, స్వమానములో స్థితులవ్వడము. సమయమనుసారముగా ఇప్పుడు ‘సదా’ అన్న పదాన్ని ప్రాక్టికల్ జీవితములోకి తీసుకురండి, పదాన్ని అండర్లైన్ చెయ్యడం కాదు, దానిని ప్రాక్టికల్ జీవితములో అండర్లైన్ చెయ్యండి. అలా ఉండాలి, ఉంటాము, చెయ్యడమైతే చేస్తున్నాము, చేసేస్తాము... ఇవి అనంతమైన బాలకులు సో యజమానులుగా అయ్యేవారి మాటలు కావు. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయము నుండి - ‘పొందాల్సినదేదో పొందేసాము’ అన్న అనంతమైన నాదము వెలువడాలి. పొందుతూ ఉన్నాము... అన్న మాటను అనంతమైన ఖజానా కల అనంతమైన తండ్రి యొక్క పిల్లలు అనలేరు. పొందేసాము అని అనాలి, బాప్‌దాదాను పొందారు, నా బాబా అని అన్నారు, స్వీకరించారు, వారిని తెలుసుకున్నారు కూడా మరియు స్వీకరించారు కూడా, కనుక ‘పొందేసాము’ అన్న ఈ అనంతమైన నాదము వెలువడుతూ ఉండాలి, ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు, పిల్లలు స్వమానములో అప్పుడప్పుడు ఉంటున్న కారణముగా సమయము యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటారు. ఒకటేమో స్వయము యొక్క స్వమానము, మరొకటి సమయము యొక్క మహత్వము. మీరు సాధారణమైనవారు కారు, మీరు పూర్వజులు. మీలోని ఒక్కొక్కరూ విశ్వములోని ఆత్మలకు ఆధారము. కావున ఆలోచించండి, ఒకవేళ మీరే అలజడిలోకి వచ్చినట్లయితే విశ్వములోని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది! మహారథులుగా పిలవబడే వారిపైనే విశ్వము ఆధారపడి ఉంది అని అనుకోకండి. కొత్త-కొత్తవారు అయినా సరే, ఎందుకంటే ఈ రోజు కొత్తవారు కూడా చాలామంది వచ్చి ఉంటారు (మొదటిసారి వచ్చినవారు చేతులెత్తారు) కొత్తవారు, వీరు హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారు. స్వీకరించారా? కొత్త-కొత్తగా ఎవరైతే వచ్చారో, వారు స్వీకరించారా? తెలుసుకోవటము కాదు, ‘‘నా బాబా’’ అని ఎవరైతే స్వీకరించారో వారు చేతులెత్తండి. చేతిని బాగా పైకి ఎత్తండి. కొత్త-కొత్తవారు చేతులెత్తుతున్నారు. పాతవారైతే పక్కాగానే ఉన్నారు కదా, ఎవరైతే హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారో మరియు బాబా కూడా ఎవరినైతే ‘‘నా పిల్లలు’’ అని స్వీకరించారో, వారందరూ బాధ్యులే. ఎందుకని? ఎప్పటినుండైతే మీరు - నేను బ్రహ్మాకుమారుడను, నేను బ్రహ్మాకుమారిని అని అంటూ వచ్చారో, మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలా లేక శివకుమారులు, శివకుమారీలా, లేక ఇద్దరూనా? అలా అయితే మరి బంధింపబడిపోయారు. బాధ్యతా కిరీటము తలపైకి వచ్చేసింది. వచ్చేసింది కదా? పాండవులూ, చెప్పండి, బాధ్యతా కిరీటము వచ్చేసిందా? బరువుగా అయితే అనిపించడం లేదు కదా? తేలికగా ఉంది కదా! అది ఉన్నదే లైట్ కిరీటము, లైట్ ఎంత తేలికగా ఉంటుంది. అలాగే సమయము యొక్క మహత్వాన్ని కూడా అటెన్షన్లో పెట్టుకోండి. సమయమనేది చెప్పి రాదు. కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు - సమయము గురించి కొంచెం షుమారుగా అయినా తెలియాలి కదా, 20 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, కాస్త తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ బాప్‌దాదా అంటారు, సమయము గురించి, అంతిమ వినాశనము గురించి వదిలేయండి, ముందు మీకు మీ శరీర వినాశనము గురించి తెలుసా? నేను ఫలానా తారీఖున శరీరము వదిలేస్తాను అని తెలిసినవారు ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా తెలుసా? అంతేకాక ఈ రోజుల్లోనైతే బ్రాహ్మణులు శరీరం విడిచినందుకు పెట్టే భోగ్లు ఎక్కువయ్యాయి. శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు, అందుకే సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ఈ చిన్నని యుగము వయసులో చిన్నది కానీ ఇది అత్యంత పెద్ద ప్రాప్తులను ఇచ్చే యుగము, ఎందుకంటే అత్యంత పెద్ద తండ్రి ఈ చిన్నని యుగములోనే వస్తారు, ఇతర పెద్ద యుగాలలో రారు. ఈ చిన్నని యుగములోనే మొత్తము కల్పము యొక్క ప్రాప్తికి బీజాన్ని నాటే సమయము ఉంటుంది. కావాలంటే విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోండి, కావాలంటే పూజ్యులుగా అవ్వండి, మొత్తము కల్పములో బీజాన్ని వేసే సమయము ఇదే మరియు డబల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయము ఇదే. భక్తి ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు ప్రత్యక్షఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేయగానే ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. మొత్తము కల్పములో చూడండి, ఇటువంటి యుగము మరేదైనా ఉందా? ఎందుకంటే ఈ సమయములోనే తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో అత్యంత పెద్ద కానుకను ఇచ్చారు, మీ కానుక గుర్తుందా? స్వర్గము యొక్క రాజ్య భాగ్యము. కొత్త ప్రపంచమైన స్వర్గము అనే కానుక పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో ఇచ్చారు. ఇంత పెద్ద కానుకను మరెవ్వరూ ఇవ్వరు మరియు ఎప్పుడూ ఇవ్వలేరు. అది ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తిమంతులుగా అవుతారు, మరే ఇతర యుగములోనూ మాస్టర్ సర్వశక్తిమంతులు అన్న పదవి లభించదు. కనుక స్వయము యొక్క స్వమానములో కూడా ఏకాగ్రముగా ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి. స్వయము మరియు సమయము - స్వయము యొక్క స్వమానము, సమయము యొక్క మహత్వము. నిర్లక్ష్యులుగా అవ్వకండి.
ఇప్పుడు కూడా ఒకవేళ నిర్లక్ష్యులుగా అయినట్లయితే మీ ప్రాప్తిని చాలా తగ్గించేసుకుంటారు, ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగానే ఒక రకమైన నిర్లక్ష్యము వస్తుంది. చాలా బాగున్నాము, చాలా బాగా నడుస్తున్నాము, చేరుకుంటాములే, వెనకేమీ ఉండిపోము, కావాలంటే చూడండి, అయిపోతుందిలే... ఇలా నిర్లక్ష్యము వస్తుంది, రెండవది రాయల్ రూపములోని సోమరితనము వస్తుంది. నిర్లక్ష్యము మరియు సోమరితనము. ‘ఎప్పుడో’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే సోమరితనము, ‘ఇప్పుడు’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే త్వరిత దానము మహాపుణ్యము అవుతుంది.
కనుక బాప్‌దాదా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ సీజన్లో స్వమానము నుండి దిగిపోకూడదు, అలాగే సమయము యొక్క మహత్వాన్ని మర్చిపోకూడదు. అలెర్టుగా, తెలివైనవారిగా, జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనవారు కదా! ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, వారిలోని ఏ కొంచెము బలహీనతనైనా, లోపాన్ని అయినా చూడలేరు. బాప్‌దాదాకు చివరి బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డపై కూడా అత్యంత ప్రేమ ఉంటుందని వినిపించాము కదా. బిడ్డ కదా. ఇప్పుడు ఈ జరుగుతూ ఉన్న సీజన్లో, సీజన్ ఇండియావారిదైనా కానీ డబల్ విదేశీయులు కూడా తక్కువేమీ లేరు, బాప్‌దాదా చూసారు, డబల్ విదేశీయులు లేని టర్న్ అంటూ ఏదీ ఉండదు. ఇది వారి అద్భుతము. డబల్ విదేశీయులు ఇప్పుడు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో చూడండి! స్పెషల్ సీజన్ అయిపోయింది, అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో! అభినందనలు. మంచిది రండి, చాలా చాలా అభినందనలు.
మరి ఇప్పుడు ఏం చెయ్యాలో విన్నారా? ఈ సీజన్లో ఏమేమి చేయాలి అన్నదాని గురించి హోమ్‌వర్క్‌ను ఇచ్చేసాము. స్వయాన్ని రియలైజ్ అవ్వండి, స్వయాన్నే రియలైజ్ అవ్వండి, ఇతరులను కాదు, నిజమైన బంగారంగా అవ్వండి ఎందుకంటే బాప్‌దాదా భావిస్తారు - ఎవరైతే ‘‘నా బాబా’’ అని అన్నారో, వారు తోడుగా వెళ్తారు. ఊరేగింపులో కలిసిపోయి వెళ్ళటము కాదు. బాప్దాదాతోపాటు శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి మరియు తరువాత బ్రహ్మాబాబాతో కలిసి మొదట రాజ్యములోకి రావాలి. కొత్త ఇంటిలో ఉన్నప్పుడే మజా వస్తుంది కదా. ఒక్క నెల గడిచిపోయినా సరే దానిని ఒక నెల పాతది అని అంటారు. కొత్త ఇల్లు, కొత్త ప్రపంచము, కొత్త పద్ధతులు, కొత్త ఆచార-వ్యవహారాలు మరియు బ్రహ్మాబాబాతోపాటు రాజ్యములోకి రావాలి. బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా. మరి ప్రేమ ఉంది అన్నదానికి గుర్తు ఏమిటి? తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, తోడుగా రావాలి. ఇదే ప్రేమ ఉంది అన్నదానికి ఋజువు. ఇష్టమేనా? తోడుగా ఉండడము, తోడుగా వెళ్ళడము, తోడుగా రావడము, ఇష్టమేనా? ఇష్టమేనా? మరి ఇష్టమైనదానిని ఎవరైనా వదిలేస్తారా! అందుకే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రీతి యొక్క రీతి ఏమిటంటే - పిల్లలు తోడుగా వెళ్ళాలి, అంతేకానీ వెనుక-వెనుక కాదు. ఒకవేళ ఏదైనా ఖాతా మిగిలిపోయి ఉంటే ధర్మరాజపురిలో శిక్షలు తినటం కోసం ఆగవలసి వస్తుంది. చేతిలో చెయ్యి ఉండదు, వెనుక-వెనుక వస్తారు. మజా ఎందులో ఉంది? తోడుగా ఉండటములోనే ఉంది కదా! కనుక తోడుగానే వెళ్ళాలి అన్నది పక్కా ప్రతిజ్ఞయే కదా? లేక వెనుక-వెనుక రావాలా? చూడండి, చేతులనైతే చాలా బాగా ఎత్తుతారు. ఎత్తిన ఆ చేతులను చూసి బాప్‌దాదా అయితే సంతోషిస్తారు కానీ శ్రీమతమనే చేతిని ఎత్తండి. శివబాబాకు అయితే చెయ్యి ఉండదు, బ్రహ్మాబాబా ఆత్మకు కూడా చెయ్యి ఉండదు, అలాగే మీకు కూడా ఈ స్థూల చెయ్యి ఉండదు, శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి. తోడుగా వెళ్తారు కదా! తల అయితే ఊపండి. అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు. అందరూ కలిసి కలిసి వెళ్ళాలి. ఎవరెడీగా ఉండవలసి ఉంటుంది. అచ్ఛా!
ఇప్పుడు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టర్‌ను చూస్తూ ఉంటారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానిని నిలబెట్టుకున్నారు అంటే లాభము పొందినట్లు. కేవలము ప్రతిజ్ఞ చెయ్యటమే కాదు, దాని నుండి లాభము పొందాలి. అచ్ఛా. ఇప్పుడు అందరూ దృఢ సంకల్పము చేస్తారా! దృఢ సంకల్పము యొక్క స్థితిలో స్థితులై కూర్చోండి - చెయ్యాల్సిందే, వెళ్ళాల్సిందే. తోడుగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ దృఢ సంకల్పాన్ని మీకు మీరు చేయండి. ఈ స్థితిలో కూర్చుండిపోండి. చేస్తాములే... చేస్తాములే... అని అనవద్దు, చెయ్యాల్సిందే. అచ్ఛా!
సేవ టర్న్ రాజస్థాన్ వారిది:- అచ్ఛా, ఎవరైతే సేవ కోసం వచ్చారో వారంతా లేవండి. బాగుంది, సగం క్లాసు సహయోగులే ఉన్నారు. సహయోగం ఇవ్వడం, ఇవ్వడం కాదు చాలా-చాలా ఆశీర్వాదాలు తీసుకోవడము. ఎందుకంటే ఎవరి సేవ అయితే చేస్తారో, వారు సంతోషిస్తారు. ఎవరైతే సంతోషిస్తారో, వారి నుండి ఆటోమేటిక్‌గా ఆశీర్వాదాలు వెలువడతాయి, మరి ఎన్ని ఆశీర్వాదాలు జమ చేసుకున్నారు! పుణ్యం జమ చేసుకోవడానికే సేవ యొక్క ఈ గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. బాగుంది, బాప్‌దాదా రాజస్థాన్‌లోనే వచ్చారు అని రాజస్థాన్ వారికి సహజంగానే నషా ఉంటుంది. బాప్‌దాదాకు రాజస్థాన్ నచ్చింది కదా!
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులకు డబల్ పురుషార్థము జరుగుతుంది, ఒకటి సేవ, రెండు స్వ సేవ. కావున డబల్ విదేశీయులు అన్న టైటిల్ బాగుంది. మంచిది, అందరిదీ డబల్ సేవ జరుగుతుంది, ఇండివిడ్యువల్. డబల్ సేవ. ఒక సమయంలో ఒకటి, మరో సమయంలో మరొకటి జరుగుతున్నాయా లేక రెండూ కలిసి జరుగుతున్నాయా! రెండు సేవలు అనగా స్వయం మరియు విశ్వాత్మల సేవ రెండూ కలిసి జరుగుతున్నాయి అనేవారు చేతులు ఎత్తండి. మెజారిటీ పాస్ అయ్యారు. సరైన వేగంతోనే జరుగుతుంది, మరియు ముందుకు తీసుకువెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసారంగా ఒకేసారి డబల్ సేవ జరగాలి – విశ్వ సేవ మరియు స్వ సేవ కూడా. పూర్తి విశ్వంలో సుఖశాంతుల కిరణాలను ఇవ్వాలి. అచ్ఛా.
అన్ని వైపులా ఉన్న డబల్ సేవాధారీ పిల్లలకు, సదా ఏకాగ్రముగా స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండే నలువైపులా ఉన్న బాప్‌దాదా యొక్క మస్తకమణులకు, సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని తీవ్ర పురుషార్థము యొక్క ఋజువును ఇచ్చే నలువైపులా ఉన్న సుపుత్రులైన పిల్లలకు, ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేసే నలువైపుల ఉన్న డబల్ లైట్ ఫరిశ్తా పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ జానకి గారు:- ఓం శాంతి. చూడండి, ఎగిరే కళ అయిపోయింది కదా. మధురమైన బాబా ఎన్ని మధురమైన విషయాలను వినిపించారు. ఇప్పుడు సమయమనుసారంగా ఏమి చేయాలి, ఎలా ఉండాలి అని బాబా చెప్పారు. బాబా దృష్టిని ఇచ్చి సంతృప్తిపరిచారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బాబా మీ దృష్టి అద్భుతం చేసింది. బాబా, నేను ఏమి చెప్పను, ఎలా చెప్పను. మన ఇంత పెద్ద సభ ఉంది. అందరూ బాబా స్మృతిలో కూర్చున్నారు. స్మృతి తప్ప మరేమీ లేదు. స్మృతి బలం మరియు యోగ ఫలం వెంటనే లభిస్తుంది. మనందరి ఎదురుగా ఒక్క బాబానే కూర్చున్నారు ఇక ఎవరూ గుర్తుకు రానే రారు. గుల్జార్ దాదీ కూడా ముంబైలో చూసే ఉంటారు కదా. బాబా మనందిరినీ ఎలా రిఫ్రెష్ చేసారు. ధ్యాంక్యూ దాదీ. బాబా మీ రధం ద్వారా మంచి సేవను ఆందించారు. బాబాను మిస్ అవుతున్నామనే అనుభవాన్ని మీరు కలగనివ్వలేదు. అటువంటి మన దాదీ తక్కువేమీ కాదు. అచ్ఛా.
*** ఓంశాంతి ***
