"ఇప్పుడు స్వయాన్ని ముక్తి చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తినిచ్చేందుకు నిమిత్తులుగా అవ్వండి"
ఓం శాంతి 18-01-2019 మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా లవ్లీన స్థితిలో ఉండి బుద్ధి అనే విమానంలో, మధుబన నాలుగు ధామాలు మరియు అవ్యక్త వతన షికారు చేసే డబల్ లైట్ ఫరిశ్తా స్వరూపులైన నిమిత్త టీచర్లు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - బ్రహ్మా వత్సలందరూ ప్రియమైన బ్రహ్మా బాబా యొక్క 50వ స్మృతి దివసము సో సమర్థ దివసమును ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకుంటున్నారు. నలువైపుల ఉన్న పిల్లలంతా అమృతవేళ నుండే విశేష యోగాభ్యాసములో చాలా మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేస్తూ వరదానాలతో తమ ఒడిని నింపుకుంటున్నారు. ఈరోజు మధుబన దృశ్యం చాలా అలౌకికంగా, ఆకర్షణీయంగా ఉంది. వేలాదిమంది సోదరసోదరీలు ఉదయం నుండే నాలుగు ధామాల పరిక్రమను చేస్తూ ప్రేమ సాగరంలో లవ్లీనమయ్యారు. ఈసారి బాబా మిలనానికి సేవ టర్న్ మహారాష్ట్ర - ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సోదరసోదరీలు చేరుకున్నారు. వీరితోపాటు ఇతర జోన్ల సోదరసోదరీలు కూడా విశేషంగా స్మృతి దివసము సందర్భంగా చేరుకున్నారు. డబల్ విదేశీయులు షుమారు 400 మంది వచ్చారు. ఈ విధంగా 18-19 వేలమంది బ్రాహ్మణుల పెద్ద సంగఠన ఉన్నది. అందులో 5-6 వేలమంది సోదరసోదరీలు ఉదయము నుండే తమ తమ సాధనాలతో పాండవ భవనము చేరుకున్నారు. సర్వ ప్రథమంగా ప్రియమైన బాప్‌దాదా యొక్క సాకార మరియు అవ్యక్త మధుర మహావాక్యాలను విన్నారు. తర్వాత ప్రియమైన బాప్‌దాదాకు శశి అక్కయ్య భోగు అర్పించారు. సందేశం విన్న తర్వాత ముఖ్య దాదీలు మరియు పెద్దన్నయ్యలు ఓం శాంతి భవనంలో బాబా గదిలోకి వెళ్ళి ఆ తర్వాత శాంతి స్తంభానికి చేరుకున్నారు. అక్కడ బాబా స్మృతిని కలిగించే మధురమైన గీతాలు, మధురవాణి గ్రూపు వారు పాటలను పాడి అందరినీ భావోద్వేగంలో ముంచేసారు. తర్వాత అందరూ పెద్ద లైనులో నిల్చుని నాలుగు ధామాల యాత్రను చేస్తూ ప్రియమైన బాబాకు స్నేహ పుష్పాలను అర్పించారు, బాబా సకాశ్ను మరియు వరదానాలను తమ ఒడిలో నింపుకున్నారు. ప్రతి సంవత్సరంవలె ఈ సంవత్సరం కూడా కలకత్తా బాంగూరు సేవాకేంద్రం నుండి 700 మంది సోదరసోదరీలు పూల అలంకరణ చెయ్యడానికి మధుబనానికి చేరుకున్నారు. అందరూ ఎంతో ప్రేమతో మధుబన నాలుగు ధామాలను సుందరమైన డిజైన్లతో సుగంధిత పుష్పాలతో అలంకరించారు. ఇవి కాక ఇతర దర్శనీయ స్థానాలను కూడా వీరు పూలతో అందంగా అలంకరించారు.
శాంతివనంలో కూడా అమృతవేళ నుండే సోదరులు తపస్యాధామానికి మరియు సోదరీలు బాబా గదికి నంబరువారీగా వెళ్ళారు. ఆ తర్వాత అందరూ అల్పాహారాన్ని స్వీకరించి డైమండ్ హాలుకు చేరుకున్నారు, అక్కడ యోగాభ్యాసముతో తర్వాత నిర్వైర్ అన్నయ్యగారు సాకార బాబాతో తమకున్న అనుభవాలను మరియు బాబా జీవిత చరిత్రలోని విశేషమైన ఘట్టాలను అందరితో పంచుకున్నారు. తర్వాత ప్రియమైన బాప్‌దాదాకు భోగును స్వీకరింపజేసి బ్రహ్మా వత్సలందరికీ భోజనం పెట్టారు. పాండవ భవనంలో మధ్యాహ్నం వరకు అందరూ నాలుగు ధామాల యాత్రను చేస్తూ శాంతివనానికి తిరిగి చేరుకున్నారు.
ఈరోజు స్మృతి దివసము నాడు ప్రియమైన బాప్‌దాదా మహావాక్యాలను మనమంతా వీడియో ద్వారా విన్నాము, వాటిని మీ వద్దకు పంపుతున్నాము. తమ తమ క్లాసులలో వినిపించి రిఫ్రెష్ చెయ్యగలరు.
18-01-19 “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 18-01-07
ఇప్పుడు స్వయాన్ని ముక్తి చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తినిచ్చేందుకు నిమిత్తులుగా అవ్వండి
ఈరోజు స్నేహ సాగరుడు బాప్‌దాదా నలువైపుల ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. రెండు రకాల పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఒకరు, లవ్లీన పిల్లలు, రెండు, లవ్లీ పిల్లలు. ఇద్దరి స్నేహపు అలలు బాబా వద్దకు అమృతవేళకన్నా ముందు నుండే చేరుకుంటున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరి మనసు నుండి ఆటోమేటిక్‌గా “నా బాబా” అన్న పాట వెలువడుతుంది. బాప్‌దాదా మనసు నుండి కూడా “నా పిల్లలు, ప్రియమైన పిల్లలు, బాప్‌దాదాకు శిరోధార్య పిల్లలు” అన్న పాట వెలువడుతుంది.
ఈరోజు స్మృతి దివసము కారణంగా అందరి మనసులలో స్నేహపు అలలు ఎక్కువగా ఉన్నాయి. అనేక పిల్లల స్నేహపు ముత్యాల మాలలు బాప్‌దాదా మెడలో కనిపిస్తున్నాయి. బాబా కూడా తమ స్నేహపు బాహువుల మాలను పిల్లలకు తొడిగారు. అనంతమైన బాప్‌దాదా యొక్క అనంతమైన బాహువులలో ఇమిడిపోయారు. ఈరోజు అందరూ విశేషంగా స్నేహమనే విమానంలో చేరుకున్నారు మరియు దూరదూరాల నుండి కూడా మనసు అనే విమానంలో అవ్యక్త రూపంలో, ఫరిశ్తా రూపంలో చేరుకున్నారు. పిల్లలందరికీ బాప్‌దాదా ఈరోజు స్మృతి దివసము సో సమర్థ దివసము సందర్భంగా పదమాపదమ స్మృతిని ఇస్తున్నారు. ఈ రోజు ఎన్ని స్మృతులను కలిగిస్తుంది. ప్రతి స్మృతి సెకండులో సమర్థంగా చేసేస్తుంది. స్మృతుల లిస్టు సెకండులో గుర్తుకు వస్తుంది కదా. స్మృతి ఎదురుగా రాగానే సమర్థ నషా పెరుగుతుంది. మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా! బాబాకు అయ్యాక బాబా ఏమి గుర్తు తెప్పించారు? మీరు కల్పక్రితపు భాగ్యశాలి ఆత్మలు. ఈ మొదటి స్మృతితో కలిగిన పరివర్తనను గుర్తు తెచ్చుకోండి. ఆత్మ అభిమానిగా అవ్వడం వలన పరమాత్మ తండ్రి యొక్క స్నేహపు నషా పెరిగింది. ఎందుకు నషా కలిగింది? మనసు నుండి స్నేహంతో నిండిన మొదటి పదము ఏది వెలువడింది? “నా ప్రియమైన బాబా” ఈ ఒక్క బంగారు పదంతో ఏ నషా కలిగింది? నా బాబా అని అనడంతో, తెలుసుకోవడంతో, ఒప్పుకోవడంతో సర్వ పరమాత్మ ప్రాప్తులు మీ ప్రాప్తులుగా అయిపోయాయి. అనుభవం ఉంది కదా! నా బాబా అనడంతో ఎన్ని ప్రాప్తులు మీవిగా అయ్యాయి! ఎక్కడ ప్రాప్తులు ఉంటాయో అక్కడ గుర్తు చేసుకోనవసరం లేదు, స్వతహాగానే గుర్తుంటుంది. ఎందుకంటే అవి మీవి అయినవి కదా. బాబా ఖజానాలు మీవిగా అయ్యాయి, నావి అన్నవాటిని గుర్తు చేసుకోనవసరం లేదు, స్వతహాగానే గుర్తుంటాయి. నాది అన్నదానిని మర్చిపోవడం కష్టమవుతుంది, గుర్తు చేసుకోవడం కష్టం కాదు. నా శరీరం అంటారు కదా, అనుభవం ఏమి చెప్తుంది? మర్చిపోతారా? మరిపింపజేయాలి, ఎందుకని? నాది కదా! ఎక్కడ నాది ఉంటుందో అక్కడ సహజంగా స్మృతి ఉంటుంది. మరి స్మృతి సమర్థులుగా చేసింది కదా - ఒక్క మాట “నా బాబా”. భాగ్య విధాతను, తరగని ఖజానాల దాతను మీవారిగా చేసుకున్నారు. ఇటువంటి అద్భుతం చేసే పిల్లలు కదా మీరు. పరమాత్మ పాలనకు అధికారులుగా అయ్యారు మీరు, పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి పరమాత్మ పాలన లభిస్తుంది. ఆత్మ మరియు దేవాత్మల పాలన అయితే లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఈ జన్మలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది.
మరి ఈనాటి స్మృతి సో సమర్థ దివసమునాడు పరమాత్మ పాలన యొక్క నషా మరియు సంతోషము సహజంగా గుర్తుంది కదా! ఎందుకంటే ఈరోజు వాయుమండలం సహజ స్మృతి కలిగినది. ఈరోజు సహజయోగిగా ఉన్నారా లేక ఈరోజు కూడా స్మృతి చెయ్యడానికి యుద్ధం చెయ్యవలసి వచ్చిందా? ఎందుకంటే ఈరోజును స్నేహ దివసము అంటాము కదా, మరి స్నేహము శ్రమను తగ్గిస్తుంది. స్నేహము అన్ని విషయాలను సహజం చేసేస్తుంది. మరి అందరూ ఈరోజు విశేషంగా సహజయోగిగా ఉన్నారా కష్టమయిందా? ఈరోజు కష్టమనిపించిన వారు చేతులెత్తండి? ఎవ్వరికీ కష్టమనిపించలేదా? అందరూ సహజయోగిగా ఉన్నారా? అచ్ఛా, ఎవరైతే సహజయోగిగా ఉన్నారో వారు చేతులెత్తండి (అందరూ చేతులెత్తారు) అచ్ఛా - సహజయోగిగా ఉన్నారా? ఈరోజు మాయకు సెలవు ఇచ్చేసారా? ఈరోజు మాయ రాలేదా? ఈరోజు మాయకు వీడ్కోలు చెప్పారా? అచ్ఛా, ఈరోజు వీడ్కోలు చెప్పారు, ఇందుకు అభినందనలు, ఇలాగే స్నేహంలో మునిగి ఉండండి అప్పుడు మాయకు సదా వీడ్కోలు చెప్పగలరు.
బాప్‌దాదా ఈ సంవత్సరాన్ని న్యారా(అతీతము) సంవత్సరము, సర్వులకు ప్యారా (ప్రియము) సంవత్సరము, శ్రమ నుండి ముక్తి సంవత్సరము, సమస్య ముక్తి సంవత్సరముగా జరుపుకోవాలని ఆశిస్తున్నారు. మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమేనా? ముక్తి సంవత్సరం జరుపుకుందామా? ఎందుకంటే ముక్తిధామంలోకి వెళ్ళాలి, అనేక దుఃఖి అశాంత ఆత్మలకు ముక్తిదాత బాబా నుండి ముక్తిని ఇప్పించాలి. మరి మాస్టర్ ముక్తిదాతలుగా అయి స్వయం ముక్తులైతేనే కదా ముక్తి సంవత్సరాన్ని జరుపుకోగలరు! ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం ముక్తులై అనేకులకు ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులు. ఒక్క భాష ముక్తిని ఇప్పించేందుకు బదులు బంధనంలో బంధిస్తుంది, సమస్యకు అధీనం చేస్తుంది. అది - ఇలా కాదు, అలా, అలా కాదు. ఇలా. సమస్య వచ్చినప్పుడు ఇలాగే అంటారు కదా, బాబా, ఇలా కాదు కదా, అలా కదా. ఇలా కాక ఇలా జరిగి ఉండాలి. ఇది సాకులు చెప్పే ఆట.
బాప్‌దాదా అందరి ఫైళ్ళు చూసారు, ఫైల్లో ఏమి చూసారు? మెజారిటి యొక్క ఫైళ్ళు ప్రతిజ్ఞల పేపర్లతో నిండి ఉంది. ప్రతిజ్ఞ చేసే సమయంలో ఎంతో మనస్ఫూర్తిగా చేస్తారు, ఆలోచిస్తారు కూడా కానీ ఇప్పటివరకు కూడా ఫైలు పెరుగుతుంది కానీ ఫైనల్ కావడం లేదు అన్నది చూసాము. దృఢ ప్రతిజ్ఞ కోసం ఇలా చెప్తారు - ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. మరి బాప్‌దాదా ఈరోజు అందరి ఫైళ్ళను చూసారు. ఎన్నో మంచి మంచి ప్రతిజ్ఞలను చేసారు. మనసుతో కూడా చేసారు మరియు వ్రాసి కూడా చేసారు. మరి ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఫైల్‌ను పెంచుతారా లేక చేసిన ప్రతిజ్ఞను ఫైనల్ చేస్తారా? ఏమి చేస్తారు? మొదటి లైనువారు చెప్పండి, పాండవులు వినిపించండి, టీచర్లు చెప్పండి. ఈ సంవత్సరం బాబా వద్ద పెరుగుతున్న ఫైళ్ళను ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఫైలులో పేపరును పెంచుతారా? ఏమి చేస్తారు? చెప్పండి పాండవులు, ఫైనల్ చేస్తారా? వంగాల్సి వచ్చినా, మారాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ మారవలసిందే అని భావించేవారు చేతులెత్తండి. చూడండి, టి.విలో అందరి ఫోటోని తీయండి. అందరి ఫోటోను తీయండి. రెండు, మూడు, నాలుగు టి. విలు ఉన్నాయి. అన్ని వైపుల ఫోటోను తీయండి. ఈ రికార్డును పెట్టుకోండి. బాబాకు ఈ ఫోటోను తీసి ఇవ్వండి. టి. వివారు ఎక్కడ? బాప్‌దాదా కూడా ఫైల్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా. అభినందనలు, అభినందనలు, మీకోసం మీరు చప్పట్లు కొట్టండి.
చూడండి, ఒక వైపు సైన్సు, రెండవ వైపు భ్రష్టాచారము, మూడవ వైపు పాపాచారము, అన్నీ తమ తమ కార్యాలను ఇంకా ఇంకా పెంచుతున్నాయి. ఎన్నో క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారు చేస్తున్నాయి. మీరైతే వరల్డ్ క్రియేటర్ పిల్లలు. మరి మీరు ఈ సంవత్సరము నవీనత సాధనాలను ఎంచుకుని ప్రతిజ్ఞను దృఢం చేసుకోండి ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. ఎంత ఖర్చు పెడ్తున్నారు, అనేక స్థానాలలో పెద్ద-పెద్ద ప్రోగ్రాములు చేస్తున్నారు. ప్రతి వర్గంవారు బాగా శ్రమిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఎడిషన్‌ను చెయ్యండి - ఏ సేవ చేసినా, ఉదాహరణకు నోటితో సేవను చేస్తున్నారు అనుకోండి, కేవలం నోటితో మాత్రమే సేవను చెయ్యవద్దు, మనసా వాచ మరియు స్నేహ సహయోగి రూపి కర్మ. ఒకేసారి మూడు సేవలను కలిపి చెయ్యండి. వేరు వేరుగా చెయ్యకండి. ఒక్క సేవ మాత్రమే చేసినప్పుడు బాప్‌దాదా ఆశించిన రిజల్టు రావడం లేదు. మీరు కూడా ప్రత్యక్షత కావాలని కోరుకుంటున్నారు కదా. ముందుకన్నా ఇప్పుడు రిజల్టు మంచిగా ఏముంది అంటే అందరూ బాగుంది, బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. కానీ మంచిగా అవ్వడము అంటే ప్రత్యక్షత జరగడము. కనుక ఇప్పుడు ఒకే సమయంలో మనసా, వాచ మరియు కర్మణలో స్నేహి సహయోగిగా అవ్వడము కలిపి చెయ్యండి. ప్రతి ఒక్క తోటివారిని బ్రాహ్మణ సహచరులు కావచ్చు లేక సేవకు నిమిత్తంగా ఉన్న బయటివారు అవ్వవచ్చు, కానీ అందరికీ స్నేహము మరియు సహయోగమును ఇవ్వండి - ఇదే కర్మణ సేవలో నంబరు తీసుకోవడము. వీరు ఇలా చేసారు కదా, అందుకే ఇలా చెయ్యవలసి వచ్చింది అన్న భాష అనకండి. స్నేహానికి బదులు కొద్దికొద్దిగా అనవలసి వచ్చింది, బాబా ఆ పదాలను మీకు ఇప్పుడు చెప్పడం లేదు. ఇలా చెయ్యవలసే వస్తుంది, అనవలసే వస్తుంది, చూడవలసే వస్తుంది... ఇలా కాదు. ఇన్ని సంవత్సరాలు చూసాము, బాప్‌దాదా ఏమీ అనలేదు. ఇలా కాక అలా చెయ్యాలి, కానీ ఇదంతా ఎప్పటివరకు? బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణలో మెజారిటి ఇలా చెప్తారు - బాబా తెర ఎప్పుడు తెరుచుకుంటుంది? ఎప్పటివరకు నడుస్తుంది? బాప్‌దాదా మిమ్మల్ని అడుగుతున్నారు ఈ పాత భాష, పాత నడత, సోమరితనము, చేదుతనము ఎప్పటివరకు? బాప్‌దాదా కూడా మిమ్మల్ని ఎప్పటి వరకు అని అడుగుతున్నారు. మీ జవాబు ఇవ్వండి అప్పుడు బాప్‌దాదా కూడా ఎప్పుడు వినాశనమవుతుందో జవాబు చెప్తారు. ఎందుకంటే బాప్‌దాదా అయితే వినాశన తెరను ఇప్పుడే ఒక్క సెకండులో తెరవగలరు కానీ ముందు రాజ్యం చేసేవారు తయారు కావాలి కదా. కనుక ఇప్పటి నుండి అందరూ తయారీలు చేస్తారు అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది. ఏ బలహీనతలోనూ కారణాన్ని చెప్పకండి, నివారణ చెయ్యండి. బాప్‌దాదా రోజంతా పిల్లల ఆటను చూస్తూ ఉంటారు, పిల్లలపై ప్రేమ ఉంది కదా, అందుకే పదే పదే ఆటను చూస్తూ ఉంటారు. బాప్‌దాదా దగ్గర ఉన్న టి.వి చాలా పెద్దది. ఒకేసారి పూర్తి విశ్వం కనిపిస్తుంది. నలువైపుల ఉన్న పిల్లలందరూ కనిపిస్తారు. అమెరికా కావచ్చు, గురుగ్రామం కావచ్చు అందరూ కనిపిస్తారు. బాప్‌దాదా చాలా ఆటను చూస్తారు. త్రోసిపుచ్చే భాష చాలా బాగా చెప్తారు, ఇది కదా కారణము, బాబా నా తప్పు లేదు, వీరు ఇలా చేసారు. వారు చేసారు సరే, మీరు ఏ సమాధానము చేసారు? కారణాన్ని కారణంగానే ఉండనిచ్చారా లేక కారణాన్ని నివారణ చేసారా? బాబా మీ ఆశ ఏమిటి అని అందరూ అడుగుతారు కదా? బాప్‌దాదా తమ ఆశను వినిపిస్తున్నారు. బాప్‌దాదాకు ఒకటే ఆశ ఉంది - నివారణ కనిపించాలి. కారణము సమాప్తం అవ్వాలి. సమస్య సమాప్తం అవ్వాలి. సమాధానం జరుగుతూ ఉండాలి. వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైనువారు - వీలవుతుందా? తల ఊపండి. వెనుక ఉన్నవారు వీలవుతుందా? (అందరూ చేతులెత్తారు) ఎందుకంటే కలిసి వెళ్ళాలి కదా. ఒంటరిగా బాబా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలరు కానీ బాబా వెళ్ళలేరు. కలిసి వెళ్ళాలి. బాబా మరియు పిల్లల ప్రతిజ్ఞ ఉంది కదా. ప్రతిజ్ఞను నిలుపుకోవాలి కదా. నిలుపుకోవాలి కదా!
ఇక్కడ మధుబనం వారు కూర్చున్నారు కదా! మధుబనంలో ఉన్న ఛార్జ్ హెడ్స్, ఛార్జెస్ (బాధ్యతలు) చాలా ఉన్నాయి కదా. శాంతివన్, జ్ఞాన సరోవర్, పాండవ భవనము అన్ని స్థానాలు ఉన్నాయి. మరి ఇన్ఛార్జుల పేర్ల లిస్టును బాబాకు ఇవ్వండి. వారి లెక్కను తీసుకుంటాము. ఇన్ఛార్జ్ టీచర్లు, సెంటరు ఇన్‌ఛార్జులు, జోన్ ఇన్ఛార్జులది ఒకరోజు సంగఠన పెడ్తాము, లెక్కలైతే అడగాలి కదా! ఎందుకంటే బాప్‌దాదా వద్ద చాలా దుఃఖ, అశాంత ధ్వనులు వస్తున్నాయి. కలత చెందిన ధ్వనులు చేరుకుంటున్నాయి. మీకు వినిపించడం లేదా? మీ భక్తులు కూడా ఉన్నారు కదా! మరి భక్తుల పిలుపు ఇష్టదైవాలైన మీకు వినిపించడం లేదా? టీచర్లకు భక్తుల మొర వినిపిస్తుందా? అచ్ఛా..
మహారాష్ట్ర జోన్, ముంబయి మరియు ఆంధ్రప్రదేశ్ సేవాధారులు:- అచ్ఛా, అందరూ మంచి ఛాన్సును తీసుకున్నారు. పేరే మహారాష్ట్ర, మంచి సంఖ్య వచ్చింది. మహారాష్ట్ర అంటే మహాన్ ఆత్మల రాష్ట్రము.
మంచిది, మహారాష్ట్రలో కూడా వృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర టర్న్. మరి మహారాష్ట్ర ఎందుకని నంబర్‌వన్ బాబా స్నేహానికి రిటర్న్ ఇవ్వకూడదు. బాప్‌దాదా వినిపించి ఉన్నారు – బాప్‌దాదా స్నేహానికి రిటర్న్ -స్వయం మరియు విశ్వాన్ని టర్న్ చెయ్యడము. కేవలం రిటర్న్ లోని రి తీసేస్తే టర్న్ అయిపోతుంది ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలపై చాలా చాలా, మంచి-మంచి ఆశలు ఉన్నాయి. ఆశావాదులు.. మరి మహారాష్ట్ర ఏమి చేస్తుంది? రిటర్న్ ఇస్తారా? మంచిది, మంచి మంచి మహారథులు ఉన్నారు మహారాష్ట్రలో. సంగఠిత రూపంలో మీటింగ్ చేసుకోండి, మహారాష్ట్రలో ఆశా సితారలు చాలామంది ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ఏమి అనుకుంటే అది చెయ్యగలరు. సంగఠిత రూపంలో ప్రోగ్రామును చెయ్యండి మరియు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చెయ్యండి, చెయ్యగలరు. మహారాష్ట్ర చెయ్యగలదు. చేస్తారు కదా! అరె, పేరే మహారాష్ట్ర అయితే మహాన్ కార్యాలు చెయ్యవలసిందే కదా! పాండవులు ఏమనుకుంటున్నారు? చేస్తారా? పాండవ సైన్యం చేస్తారా? శక్తి సైన్యం చేస్తారా? టీచర్లు చాలామంది ఉన్నారు. చాలా మంచిది.
డబల్ విదేశీయులు:- బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, డబల్ విదేశీయులు వచ్చినప్పుడు ఇంటికి అలంకారము జరుగుతుంది. డబల్ విదేశీయులపై అందరికీ ఎంతో ప్రేమ ఉంది. మీ గ్రూపును చూసినప్పుడల్లా అందరికీ చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే మీరు కూడా కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది. ఈరోజుల్లో విదేశి సేవ సమాచారము బాగుంటుంది. ముస్లిం ధర్మంలో కూడా బాగా సందేశాన్ని ఇస్తున్నారు. డబల్ విదేశీయుల ఒక మంచి విశేషత ఏమిటంటే ఏదైనా కార్యంలో అడుగు పెట్టారంటే అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఏ కార్యంలో ఉంటారో ఆ కార్యంలో విజయులుగా అయి చూపిస్తారు. మరి ఈ గ్రూపు విజయి గ్రూపు. విజయ తిలకము పెట్టబడి ఉంది. అచ్ఛా.
నలువైపుల ఉన్న స్నేహి పిల్లలకు లవ్లీ మరియు లవ్లీన ఇద్దరు పిల్లలకు, సదా బాబా శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే నాలెజ్ఫుల్, పవర్ఫుల్ పిల్లలకు, సదా స్నేహి కూడా మరియు స్వమానధారి కూడా, సమ్మానధారి కూడా, ఇటువంటి సదా బాబా శ్రీమతాన్ని పాటించే విజయి పిల్లలకు, సదా బాబా ప్రతి అడుగుపై అడుగు వేసే సహజయోగి పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
నిర్వైర్ అన్నయ్యగారి మాటలు:- దాదీ జానకిగారి సమక్షంలో మహారాష్ట్ర జోన్ విశేషంగా మరియు వీరితోపాటు దేశవిదేశాల సోదరసోదరీలందరికీ ఈరోజు చాలా చాలా అభినందనలు. అవ్యక్త బాప్‌దాదా మురళిని వింటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మన ప్రియమైన గుల్జార్ దాదీగారు 50 సంవత్సరాల నుండి అవ్యక్త బాప్‌దాదాకు రథంగా అయి మనందరినీ జ్ఞానము, యోగము, ధారణలతో (इतना) ఇంతగా అలంకరించారు. దాదీగారికి సహకరించే నీలూ అక్కయ్య మరియు వారి తోటి సహచరులకు, ఎవరైతే దాదీగారిని ప్రేమతో సంభాళిస్తున్నారో వారందరికీ చాలా చాలా అభినందనలు.
అలాగే, మన రుక్మిణి దాదిగారు ఇంత పెద్ద వయస్సులో పూర్తి ఢిల్లీ జోన్‌ను సంభాళించే కార్యాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. దాదీగారు 16 వ తేదీ రాత్రి 12.30 ని.లకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని, తమ 100వ పుట్టిన రోజును జరుపుకుని అవ్యక్త బాప్‌దాదా ఒడిలోకి వెళ్ళిపోయారు. వారిని సంభాళించిన దీప సోదరి మరియు వారి సహచరులకు మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞులం. దాదీగారి ద్వారా నేర్చుకున్న నియమ ధారణలతో మనం ఎల్లప్పుడూ లాభాన్వితులం అవుతూ వచ్చాము.
ఈరోజు 18 జనవరి రోజు చాలా మహత్వపూర్వకమైన రోజు. ఎందుకంటే ఈరోజు అవ్యక్త పాత్ర యొక్క గోల్డెన్ జుబిలి. దాదీ గుల్జార్ గారి ద్వారా అవ్యక్త బాప్‌దాదా పాలన యొక్క పాత్ర ఈ రోజు వరకు జరుగుతూ ఉంది. గుల్జార్ దాదీగారు ఇక్కడకు వచ్చినప్పుడు మనమంతా మంచిగా వారిని సత్కరిద్దాము, అభినందిద్దాము మరియు మనసులోని మాటలను ప్రకటిద్దాము. అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు దాదీగారికి సదా లభిస్తూ వచ్చాయి. ఈనాటి మురళి అనుసారంగా బాబా ఇచ్చిన హోమ్‌వర్కును, పూర్తి మురళి సారమును చూస్తే బాబా ఒక్క మాట చెప్పారు - మేము బాబా శ్రీమతం అనుసారంగా ఎక్యురేట్ గా నడుచుకోవాలి అని సంకల్పం చెయ్యండి, సంకల్పంలో దృఢతను తీసుకురావాలి. దృఢత లేనిదే సంకల్పం ధారణగా మారదు. ఒకసారి మనం మనసులో పక్కాగా నిశ్చయించుకుంటే, బాబాను నయనాలతో కలుసుకున్నప్పుడు బాబాతో ఈ ఆత్మిక సంభాషణను చెయ్యండి - బాబా, మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. ఈరోజు నుండి మేము 100 శాతం మీ శ్రీమతం అనుసారంగా మా జీవితాన్ని గడుపుతాము మరియు పూర్తి ధారణలపై నడుస్తాము, మీరు మా గురించి నిశ్చింతగా ఉండండి మరియు మీ దీవెనలు సదా మాకు లభిస్తూ ఉండాలి. దేశవిదేశాల సోదరసోదరీలు పరస్పరం కలుసుకుని బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ కార్యాన్ని చేస్తున్నారు. ఇందుకు అందిరి అభినందనలు.
*** ఓంశాంతి ***
