"సమయపు మహాత్యమును తెలుసుకుని, కర్మల గుహ్య గతిపై అటెన్షన్ ఉంచండి, నష్టోమోహులుగా, ఎవరెడీగా కండి"
ఓం శాంతి 02-04-2019 మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, తమ దివ్య బుద్ధి అనే విమానం ద్వారా మూడు లోకాల షికారు చేసేవారు, సదా అవ్యక్త మిలనపు అనుభూతులలో ఉండేవారు, డైరెక్ట్ వరదాత బాబా నుండి దివ్య వరదానాలతో పాలింపబడే నిమిత్త టీచరు అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా యొక్క ఈ సీజన్లో ఇది చివరి టర్ను. భోపాల్ జోన్ సేవ టర్ను. ఈ టర్నులో కూడా దేశవిదేశాల నుండి షుమారుగా 16-17 వేలమంది సోదరసోదరీలు తమ ప్రియమైన మధుబన ఇంటికి చేరుకున్నారు. ఎండాకాలం మొదలైంది. ఈసారి ఈ అలౌకిక మిలన మేళాలోని 12 టర్నులలోనూ వచ్చిన సోదరసోదరీలు ఎవరైతే మధుబన ఇంటికి వచ్చారో, అందరూ చాలా చాలా చక్కగా అనుభవం చేసుకున్నారు. సాకార రూపం ద్వారా అవ్యక్త మిలనం జరగకపోయినా కానీ సైన్సు సాధనమైన వీడియో ద్వారా పరోక్షంగా, అపరోక్షంగా అందరికీ చాలా వైబ్రేషన్లు లభించాయి. బాప్ దాదా యొక్క ప్రతి అవతరణ రోజున విశేషంగా తమ అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడానికి మరియు అవ్యక్త మిలనం జరుపుకోవడానికి అందరూ మనసు మరియు నోటి మౌనాన్ని వహించారు, చాలా చక్కని వాతావరణం ఉండినది. ప్రతి గ్రూపులోనూ మహారథి అక్కయ్యలు మరియు అన్నయ్యల అనుభవయుక్త సుందర క్లాసుల ద్వారా కూడా అందరూ రిఫ్రెష్ అయ్యారు.
ఈ గ్రూపులో ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా పిల్లలైన మనలను సర్వ ఖజానాలతో సంపన్నం చేయడానికి 3 ముఖ్య విధులను చెప్పారు:- ఒకటి, స్వ పురుషార్థంతో ప్రాలబ్ధ ఖజానాను జమ చేసుకోవడము. రెండు సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరిచి పుణ్య ఖాతాను జమ చేసుకోవడము మరియు మూడవది సదా నిర్విరామంగా, నిస్వార్థంగా మరియు విశాల హృదయంతో సేవ చేసి దీవెనల ఖాతాను జమ చేసుకోవడము.
చెప్పండి, మా మధురమైన అన్నయ్యలు మరియు అక్కయ్యలు! ఈ మూడు ఖాతాలను అందరూ జమ చేసుకుంటున్నారు కదా! మధురమైన బాబా ఈ రోజు మనందరి శ్రద్ధను డ్రామాపైకి తీసుకువెళ్ళారు. ఎలా అయితే డ్రామాపై అటెన్షన్ ఉంటుందో, ఆత్మిక స్వరూపంపై, ధారణలపై అటెన్షన్ ఉంటుందో అలాగే కర్మల గుహ్య గతిపై కూడా అటెన్షన్ ఉంచడం ఆవశ్యకము. ఇప్పుడు ఏ సంకల్పం, మాట మరియు కర్మ సాధారణంగా ఉండకూడదు. ఇంత అటెన్షన్ పెట్టి పురుషార్థంలో రేస్ చేయాలి. అలజడిగా ఉన్న పరిస్థితులలో కూడా అచల-నిశ్చల స్థితి ఉండాలి. ఇప్పుడైతే విశేషంగా యోగ తపస్సు కార్యక్రమం ద్వారా స్వయాన్ని మరియు సర్వులను శక్తిశాలిగా చేసుకుని మనసా సకాశ్ ఇచ్చే సేవను చేయాలి.
బాప్‌దాదా ఇచ్చిన హోమ్‌వర్కును, ధారణలను ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి. 2019-2020లో స్వ ఉన్నతి మరియు విశ్వ సేవ కోసం భారత్ మరియు నేపాల్ సోదరసోదరీల వార్షిక మీచింగ్ ఏప్రిల్ 9న ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం స్వ ఉన్నతి మరియు సేవలకోసం ఒక కొత్త అంశం వెలువడనుంది, ఆ సమాయారం మీ వద్దకు తప్పక అందుతుంది. మీటింగ్ తర్వాత శాంతివన్లో రాజయోగ శిబిరములు మరియు యోగ భట్టీ కార్యక్రమాలు ఉన్నాయి. అచ్ఛా. అందరికీ చాలా చాలా స్మృతి... ఓం శాంతి.
02-04-19 “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 15-02-07 శాంతివనం
సమయపు మహాత్యమును తెలుసుకుని, కర్మల గుహ్య గతిపై అటెన్షన్ ఉంచండి, నష్టోమోహులుగా, ఎవరెడీగా కండి
ఈరోజు సర్వ ఖజానాల దాత, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వ గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చే బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న ఖజానాలకు బాలకులు సో యజమానులైన అధికారీ పిల్లలను చూస్తున్నారు. అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వలేదు ఎందుకంటే ఖజానా అఖండమైనది. నలువైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. ఖజానాలతో నిండుగా అయి అందరూ హర్షితంగా ఉన్నారు.
ప్రస్తుత సమయ ప్రమాణంగా అన్నింటికన్నా అమూల్యమైన శ్రేష్ఠ ఖజానా పురుషోత్తమ సంగమ యుగపు సమయము. ఎందుకంటే ఈ సంగమంలోనే పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలరు. చిన్నని ఈ యుగంలోని ప్రాప్తులు మరియు ప్రాలబ్ధము అనుసారంగా ఒక్క క్షణం యొక్క విలువ ఒక్క సంవత్సరంతో సమానము. ఇంతటి అమూల్యమైన సమయము ఇది. ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు అన్నది ఇప్పటి గాయనమే ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్ముని పాత్ర నిర్ధారించబడి ఉంది. అందుకే ఈ సమయాన్ని వజ్ర సమానమైనది అని అంటారు. సత్యయుగాన్ని గోల్డెన్ ఏజ్ (బంగారు యుగము) అని అంటారు. కానీ ఈ సమయము, సమయము కూడా వజ్ర సమానమైనది మరియు పిల్లలైన మీరందరూ కూడా వజ్రతుల్య జీవితం యొక్క అనుభవీ ఆత్మలు. ఈ సమయంలోనే బహుకాలం నుండి దూరమైన ఆత్మలు పరమాత్మ మిలనము, పరమాత్మ ప్రేమ, పరమాత్మ జ్ఞానము, పరమాత్మ ఖజానాల ప్రాప్తికి అధికారులుగా అవుతారు. పూర్తి కల్పంలో దేవాత్మలు, మహాత్మలుగా ఉన్నారు కానీ ఈ సమయంలో పరమాత్మ ఈశ్వరీయ పరివారము ఉంది. కావున వర్తమాన సమయం యొక్క మహత్యం ఎంత ఉందో, ఆ సమయపు మహత్యమును తెలుసుకుని ఎంతగా స్వయాన్ని శ్రేష్ఠంగా చేసుకోదలుచుకున్నారో అంతగా చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ మహా యుగంలోని పరమాత్మ భాగ్యమును ప్రాప్తి చేసుకునే పదమాపదమ్ అదృష్టవంతులు కదా! ఇలా తమ శ్రేష్ఠ భాగ్యము యొక్క ఆత్మిక నషా మరియు అదృష్టాన్ని తెలుసుకుని, అనుభవం చేస్తున్నారు కదా! సంతోషంగా ఉంటుంది కదా! మనసులో ఏ పాటను పాడుకుంటారు? వాహ్ నా భాగ్యము వాహ్! ఎందుకంటే ఈ సమయంలోని శ్రేష్ఠ భాగ్యము ముందు ఇతర ఏ యుగాలలోనూ ఇంతటి శ్రేష్ఠ భాగ్యము లభించదు.
మరి చెప్పండి, సదా తమ భాగ్యమును స్మృతిలో పెట్టుకుని హర్షితంగా ఉంటున్నారు కదా! ఉంటున్నారా? ఎవరైతే మేము సదా హర్షితంగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు, ఎవరైతే సదా హర్షితంగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా, సదా.... సదా అన్న పదాన్ని అండర్లైన్ చెయ్యండి. ఇప్పుడు టి.వీలో మీ ఫోటో వస్తుంది. సదా అన్నవారి ఫోటో వస్తుంది. అభినందనలు. మాతలు చేతులు ఎత్తండి, శక్తులు ఎత్తండి, డబల్ విదేశీయులు.... ఏ మాటను గుర్తు పెట్టుకుంటారు? సదా. అప్పుడప్పుడు అనేవారు వెనుక వస్తారు.
బాప్‌దాదా ముందు కూడా వినిపించారు - సమయము యొక్క వేగము చాలా తీవ్రగతిలో ముందుకు సాగుతుంది. సమయం యొక్క గతిని తెలుసుకున్నవారు స్వయాన్ని పరిశీలించుకోండి - మాస్టర్ సర్వశక్తిమంతులమైన మాది తీవ్రగతి ఉందా? పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కానీ బాప్‌దాదా ఏమి చూడాలని ఆశిస్తున్నారు? ప్రతి పిల్లవాడు తీవ్ర పురుషార్థీ. ప్రతి సబ్జెక్టులో పాస్ విత్ ఆనర్‌గా ఉన్నారా లేక కేవలం పాస్ అయి ఉన్నారా? తీవ్ర పురుషార్థి యొక్క లక్షణాలు విశేషంగా రెండు ఉంటాయి నష్టోమోహ, రెండు ఎవరెడీ. అన్నింటికన్నా ముందుగా ఈ దేహభానము, దేహ అభిమానము నుండి నష్టోమోహులుగా అయినట్లయితే ఇతర విషయాలలో నష్టోమోహులుగా కావడము ఏమీ కష్టము కాదు. దేహ భానానికి గుర్తు వ్యర్థము, వ్యర్థ సంకల్పము, వ్యర్థ సమయము, ఈ చెకింగ్ స్వయమే బాగా చేసుకోగలరు. సాధారణ సమయము కూడా నష్టోమోహగా కానివ్వదు. మరి ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ సఫలమవుతున్నాయా అని పరిశీలించుకోండి. ఎందుకంటే సంగమయుగంలో విశేషంగా తండ్రి యొక్క వరదానము - సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. మరి అధికారము సహజంగా అనుభవం చేయిస్తుంది. మరియు ఎవరెడీ, ఎవరెడీ యొక్క అర్థము - మనసా వాచా కర్మణ, సంబంధ సంపర్కాలలో సమయం యొక్క ఆజ్ఞ ‘అకస్మాత్తుగా’ అని ఉంటే ఎవరెడీగా మరియు అకస్మాత్తుగానే జరుగుతాయి. ఎలా అయితే మీ దాదీను చూసారు కదా - అకస్మాత్తు, ఎవరెడీ. ప్రతి స్వభావంలో, ప్రతి కార్యంలో ఈజీగా ఉండేవారు. సంపర్కంలో ఈజీ, స్వభావంలో ఈజీ, సేవలో ఈజీ, సంతుష్టపరచడంలో ఈజీ, సంతుష్టంగా ఉండటంలో ఈజీ. కావుననే బాప్‌దాదా సమయం యొక్క సమీపత గురించి పదే పదే సూచనను ఇస్తున్నారు. స్వ పురుషార్థానికి సమయం చాలా తక్కువగా ఉంది, కావున తమ జమా ఖాతాను పరిశీలించుకోండి. ఖజానాలను జమ చేసుకునేందుకు మూడు విధులను ముందు కూడా వినిపించి ఉన్నాము. ఆ మూడు విధులను స్వయంలో పరిశీలించుకోండి. ఒకటి - స్వ పురుషార్థంతో ప్రాలబ్ధం యొక్క ఖజానాను జమ చేసుకోవడము. ప్రాప్తుల ఖజానాను జమ చేసుకోవడము. రెండవది - సంతుష్టంగా ఉండటము, ఇందులో కూడా సదా అన్న పదాన్ని జత చేయండి మరియు సర్వులను సంతుష్టపరచడము, దీనితో పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. ఈ పుణ్య ఖాతా అనేక జన్మల ప్రాలబ్ధానికి ఆధారమవుతుంది. మూడవది - సదా సేవలో నిర్విరామంగా, నిస్వార్థంగా మరియు విశాల హృదయంతో సేవ చెయ్యడము, దీనితో ఎవరి సేవ అయితే చేస్తున్నారో వారి ద్వారా స్వతహాగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ మూడు విధులు, స్వ పురుషార్థము, పుణ్యము మరియు ఆశీర్వాదాలు. ఈ మూడు ఖాతాలు జమ అయి ఉన్నాయా? మరి పరిశీలించుకోండి ఎందుకంటే ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా పేపరు వస్తే పాస్ విత్ ఆనర్ అవ్వగలరా? ఎందుకంటే ప్రస్తుత సమయానుసారంగా ప్రకృతి అలజడుల చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు. కావున కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానముపై విశేషంగా అటెన్షన్ ఉండాలి. కర్మల గతి చాలా గుహ్యమైనది. ఎలా అయితే డ్రామాపై అటెన్షన్ ఉంటుందో, ఆత్మిక స్వరూపంపై అటెన్షన్ ఉంటుందో, ధారణలపై అటెన్షన్ ఉంటుందో, అలాగే కర్మల గుహ్య గతిపై కూడా అటెన్షన్ ఉంచడం ఆవశ్యకము. సాధారణ కర్మ, సాధారణ సమయము, సాధారణ సంకల్పము - వీటితో ప్రాలబ్ధములో తేడా వస్తుంది. ఈ సమయంలో పురుషార్థీలైన మీరందరూ శ్రేష్టమైన, విశేష ఆత్మలు, సాధారణమైన ఆత్మలు కారు. విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా, విశ్వ పరివర్తనకు నిమిత్తమై ఉన్న ఆత్మలు. కేవలం స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు కాదు, విశ్వ పరివర్తనకు బాధ్యులైనవారు. కావున తమ శ్రేష్ఠ స్వమానము యొక్క స్మృతి స్వరూపులుగా కావలసిందే.
అందరికీ బాప్దాదాపై మరియు సేవపై మంచి ప్రేమను ఉండటం బాప్‌దాదా చూసారు. సేవా వాతావరణము నలువైపుల ఏదో ఒక ప్లాన్ రూపంలో నడుస్తూనే ఉంది. దీనితో పాటు ఇప్పుడు సమయం అనుసారంగా దుఃఖంగా, అశాంతిగా ఉన్న విశ్వాత్మలను దుఃఖము, అశాంతి నుండి విడిపించడానికి తమ శక్తులతో సకాశ్ను ఇవ్వండి. ఎలా అయితే ప్రకృతిలోని సూర్యుడు తన ప్రకాశంతో అంధకారంలో ఉన్న ప్రకృతిని వెలుగులోకి తీసుకువస్తాడో, తన కిరణాల శక్తితో ఎన్నో వస్తువులను పరివర్తన చేస్తాడో అలాగే మాస్టర్ జ్ఞాన సూర్యులు తాము పొందిన సుఖశాంతులు అనే కిరణాలతో, సకాశ్తో దుఃఖము, అశాంతి నుండి విముక్తి చెయ్యండి. మనసా సేవతో, శక్తిశాలీ వృత్తితో వాతావరణాన్ని పరివర్తన చెయ్యండి. కావున ఇప్పుడు మనసా సేవ చెయ్యండి. ఇప్పుడు సకాశ్ ఇవ్వడం ఎక్కువ అవసరం. ఈ సేవలో మనసును బిజీగా పెట్టుకోండి అప్పుడు మాయాజీతులుగా, విజయి ఆత్మలుగా స్వతహాగా అయిపోతారు. ఇకపోతే చిన్న చిన్న విషయాలైతే సైడ్సీన్స్ వంటివి, సైడ్సీన్లలో కొన్ని మంచివీ వస్తాయి, కొన్ని చెడూ వస్తాయి. ఈ సైడ్సిన్లను దాటి గమ్యాన్ని చేరుకోవలసి ఉంటుంది. సైడ్సీన్లను చూడటానికి సాక్షిద్రష్ట అనే సీట్‌పై సెట్ కండి, అంతే. అప్పుడు సైడ్సీన్లు మనోరంజకంగా ఉంటాయి. మరి ఎవరెడీగా ఉన్నారా? రేపు ఏదైనా జరిగినా, ఎవరెడీగా ఉన్నారా? మొదటి లైనువారు ఎవరెడీగా ఉన్నారా? రేపు జరిగినా కానీ? టీచర్లు తయారుగా ఉన్నారా, అయితే మంచిది. ఈ వర్గాలవారు తయారుగా ఉన్నారా? ఎన్ని వర్గాలు వచ్చాయో, అన్నీ తయారుగా ఉన్నాయా? ఆలోచించండి. చూడండి దాదీలు, అందరూ చేతులు ఊపుతున్నారు. మంచిది, అభినందనలు. ఒకవేళ తయారుగా లేకపోయినా కానీ ఈరోజు రాత్రికల్లా తయారుకండి. ఎందుకంటే సమయము మీకోసం వేచి ఉంది. ముక్తి ద్వారాలు తెరవడానికి బాబా వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీవారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఏమి చెయ్యలేరు మీరు... మాస్టర్ సర్వశక్తిమంతులే కదా. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని దృఢ సంకల్పం చెయ్యండి, అంతే. చెయ్యకూడదు అని అనుకుంటే దృఢ సంకల్పంతో ‘వద్దు’ అన్నదాన్ని ‘వద్దు’ అని చేసి చూపించండి. మాస్టర్ అయితే ఉన్నారు. కదా! అచ్ఛా..
మొదటిసారిగా ఎవరు వచ్చారు? మొదటి సారిగా వచ్చినవారు చేతులు ఎత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి, ఊపండి. ఇంతమంది వచ్చారు. మంచిది. మొదటిసారి వచ్చిన వారందరికీ పదమారెట్లు అభినందనలు. కల్ప క్రితం పిల్లలు మళ్ళీ తమ పరివారానికి చేరుకున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కావున ఇప్పుడు వెనుక వచ్చినవారు అద్భుతం చేసి చూపించండి. వెనుకే ఉండిపోకండి, వెనుక వచ్చినా కానీ వెనుక ఉండిపోకండి. ముందు ముందుకు వెళ్ళండి. దీనికోసం తీవ్ర పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. ధైర్యము ఉంది కదా! ధైర్యము ఉందా? మంచిది. పిల్లల ధైర్యము, సహాయము బాప్‌దాదా మరియు పరివారముది. బాగుంది ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకారము. కావున వచ్చిన వారందరూ మధువనానికి అలంకారము. అచ్ఛా.
సేవా టర్న్ భోపాల్ జోన్ వారిది:- అచ్ఛా, చాలా మంది వచ్చారు. బంగారు అవకాశమైతే లభించింది కదా. బాగుంది. ఇందులో సేవా నిమిత్తంగా వచ్చిన వారందరూ సేవా బలాన్ని, ఫలాన్ని అనగా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని అనుభవించారా? అనుభవించారా? అచ్ఛా, ఇప్పుడు ఏదైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసారో అది అది సదా ఉంటుందా? లేదా కొద్ది సమయమే ఉంటుందా? ఎవరైతే హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తారో, ఊరికే చేతులెత్తకండి. మేము ఈ ప్రాప్తిని సదా మాతో ఉంచుకుంటాము, విఘ్న వినాశకులుగా ఉంటాము అని హృదయపూర్తిగా భావిస్తున్నారా! మీరు టి.వీలో వస్తున్నారు మరియు టి.వీ ఫోటోను పంపిస్తాము. ఇటువంటి సేవా అవకాశాన్ని పెట్టడము చాలా బాగుంది. అవకాశాన్ని సంతోషంగా తీసుకుంటున్నారు మరియు ప్రతి టర్నులో అందరూ రావడానికి అవకాశం కూడా లభిస్తుంది. అచ్ఛా, బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. బాగుంది. చూడండి ఎంతమందికి అవకాశం లభిస్తుందో! సగం క్లాసు సేవ చేసేవారు ఉన్నారు. అచ్ఛా.
ఇప్పుడు ఏదైనా నవీనతను చేసి చూపండి. ఏదైనా నవీనత చేసి చాలా కాలమయింది. వర్గీకరణ కూడా పాతదైపోయింది. ప్రదర్శనలు, మేళాలు, కాన్ఫెరెన్సులు, స్నేహ మిలనాలు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడేదైనా క్రొత్త విషయాన్ని చెయ్యండి. షార్ట్ మరియు స్వీట్, ఖర్చు తక్కువ మరియు సేవ ఎక్కువ. రాయిబహాదుర్ కదా మీరు! మరి రాయిబహాదుర్లు క్రొత్త ఆలోచనను ఆలోచించండి. ఎలా అయితే ముందు ప్రదర్శని వచ్చింది, తర్వాత మేళా వచ్చింది, తర్వాత వర్గీకరణ వచ్చింది, అలాగే ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ చెయ్యండి. ఇందుకు ఎవరు నిమిత్తమవుతారో చూద్దాము. బాగుంది, ధైర్యం ఉన్నవారు. ధైర్యము పెట్టినవారికి బాప్‌దాదా సదా ముందుగానే సహాయానికి అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా..
డబల్ విదేశీయులు:- అచ్ఛా, డబల్ విదేశీయులు అన్న పేరు ప్రసిద్ధమైపోయింది. ఇప్పుడు డబల్ పురుషార్థులు అన్న పేరు పెడదామా? డబల్ పురుషార్థులు అని పెడదామా? పక్కా డబల్ పురుషార్థం చేస్తారా? చేసేవారు. అచ్ఛా.. విదేశంలో ఎటువంటి విఘ్నమూ రానంతగా ఒక ఉదాహరణ చూపించండి. మనసా సంకల్పాలలో కానీ, వాణిలో కానీ, మాటలలో కానీ, సంబంధ - సంపర్కంలో కానీ ఎందులోనూ రాకూడదు. బాప్‌దాదా భారతదేశములోని అన్ని జోన్లకు కూడా చెబుతున్నారు, డబల్ విదేశీయులకైతే చెపుతున్నారు కానీ భారతదేశంలోని అన్ని జోన్లకు కూడా చెబుతున్నారు - డబల్ విదేశీయులు నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్వ్యర్థ సంకల్పాలతో ఉండేట్లుగా ఏదైనా ఉదాహరణ చూపించండి. రేస్ చెయ్యండి. ప్రతి ఒక్క జోన్ రేస్ చెయ్యండి, విదేశము కూడా ఒక జోన్ అయింది కదా. వారికి బాప్‌దాదా మంచి బహుమతిని ఇస్తారు. పూర్తి జోన్లో విఘ్నము యొక్క నామరూపాలే ఉండకూడదు. ఒకరికొకరు సహయోగము చేసుకుంటే అయిపోతుంది. ఎక్కడ ఏమి జరిగినా కానీ అక్కడ ఒకరికొకరు సహయోగము చేసుకుని నిర్విఘ్నంగా చెయ్యండి. ధైర్యాన్ని ఇవ్వండి. ఉమంగ-ఉత్సాహాలను ఇవ్వండి. ఇటువంటి పటాన్ని బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు.
డబల్ విదేశీయులు ఎప్పుడు మధువన సంగఠనలోకి వచ్చినా కానీ మధువన సంగఠనలో కళ వస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ సంగఠన అయిపోతుంది, లేకపోతే కేవలం భారతదేశ సంగఠన మాత్రమే ఉంటుంది. సీజన్‌లోని ప్రతి టర్నులో డబల్ విదేశీయులు ఉండటాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఈ ప్రోగ్రెస్ మంచిగా ఉంది. మరియు బాప్‌దాదా యొక్క విశేషమైన ప్రేమ ఉండనే ఉంది, ఎందుకు? భారతవాసులు త్యాగము చేస్తారు కానీ మీది డబల్ త్యాగము. మీ కల్చర్ కూడా వేరు. భారతదేశ కల్చర్ అయితే అదే ఉంది. కావున బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు మేము భారతదేశానికి చెందినవారము, భారతదేశంలో ఉండేవారము అని అనుభవం చేసుకుంటున్నారు. అచ్ఛా..
ఇప్పుడు ఒక్క క్షణంలో అందరూ అతి మధురాతి మధురమైన స్వీట్ సైలెన్స్ స్థితి యొక్క అనుభవంలో మునిగిపోండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ తీవ్ర పురుషార్థీ, సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, సదా విజయి తిలకధారి, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి, డబల్ కిరీటధారి, విశ్వ కళ్యాణకారి, సదా లక్ష్యము మరియు లక్షణాన్ని సమానంగా చేసుకుని పరమాత్మ ప్రేమలో పాలన పొందేటువంటి సర్వ శ్రేష్ఠ పిల్లలకు బాప్‌దాదాల ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే.
దాదీ జానకి:- నా బాబా చాలా బాగా వినిపించారు. బాబా చెప్పిన ఒక్కొక్క మాట నాకు హత్తుకున్నాయి. బాబా ఏదైతే చెప్పారో, ఏదైతే అవసరమో, అది మనకు అటెన్షన్‌కు తీసుకువచ్చారు. ఇప్పుడు బాబా ఏదైతే ఆశిస్తున్నారో దానినే మన ప్రాక్టికల్ లైఫ్ చేయాలి మరియు చేస్తూ ఉండాలి. థాంక్యూ బాబా.
*** ఓంశాంతి ***
