"ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీలుగా కండి, లక్ష్యము మరియు లక్షణమును సమానంగా తయారు చేసుకోండి"
18-03-2019 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్తమూర్తి తల్లిదండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా హోలీ హ్యాపీ (పవిత్రంగా సంతోషంగా) మూడ్‌లో ఉంటూ, సంతోషాల ఊయలలో ఊగుతూ ఉండే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని బాబా కంటి రత్నాలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము – మీరందరూ శివ బాబా స్మృతిచిహ్న రోజును చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు, అనేక చోట్ల శివ బాబా జెండాలను ఎగురవేసారు, ప్రదర్శనలు చేసారు, చాలా మంచి వార్తల ఫోటోలు మొదలైనవి వస్తున్నాయి. ఇప్పుడు పవిత్ర పండుగ హోలీ రానున్నది. నిన్న మనమందరం హోలియెస్ట్ (పవిత్రమైన) తండ్రి నుండి అనేక మంచి రహస్యాలతో నిండిన అవ్యక్త మహావాక్యాలను విన్నాము. పిల్లలు హోలీని జరుపుకోవటం అంటే అపవిత్రతను లేదా చెడును భస్మం చేయటం లేదా కాల్చడమని బాబా చెప్పారు. అపవిత్రతను పూర్తిగా అంతం చేసినప్పుడు, పవిత్రత యొక్క రంగు అంటుకుంటుంది. ఇది రంగుల పండుగ. అనేక రకాల భావస్వభావాలను మర్చిపోయి, ఒకే కుటుంబంలా ఒకరితో ఒకరు ఆడుకుంటూ, సంతోషంగా జరుపుకుంటారు. బాబా ఎల్లప్పుడూ దాని అందమైన ఆధ్యాత్మిక అర్థాన్ని పిల్లలైన మనకు వివరిస్తారు. పిల్లలూ, మీ దివ్య బుద్ధి అనే పిచికారీలో అవినాశీ రంగు నిండి ఉండాలి. ఈ రంగుతో మీ బుద్ధి అనే పిచికారీతో ఎటువంటి ఆత్మనైనా దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, నోటి ద్వారా రంగరింపజేయండి. కేవలం హోలీని జరుపుకోవడమే కాదు కానీ హోలీగా (పవిత్రంగా) అవ్వండి. మీ హోలీ మూడ్‌తో సదా తేలికగా, సదా నిశ్చింతగా, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. సదా సంతోషంగా ఉండండి, సదా తేలికగా ఉండండి. ఎప్పుడూ మూడ్ ఆఫ్ చేసుకోకూడదు. ఇటువంటి అమూల్యమైన మహా వాక్యాలు మీరందరూ కూడా చదివి లేదా వినే ఉంటారు. మధురమైన బాబా అయితే మనందరి మూడ్‌ను సదా హోలీ, హ్యాపీగా చేసేసారు. మరి అందరికీ ఇటువంటి పావన పండుగకు హృదయపూర్వకమైన చాలా చాలా హార్దిక అభినందనలు.
బాప్‌దాదా యొక్క అనంతమైన ఇంటి శోభను అనుభవం చేసుకున్నారు. ఎలా అవ్యక్త వతన వాసి అయిన బాబా సాకారంలోకి రానప్పటికీ తమ దేశ విదేశాలలోని పిల్లలను మధుబన్కు పిలిచి వారికి చాలా మంచి అనుభూతులను కలిగిస్తారు. ఈ టర్న్‌లో కూడా దేశ విదేశాల నుండి దాదాపు 18 వేల సోదరసోదరీమణులు చేరుకున్నారు. ఇది పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లోని సోదరసోదరీమణుల సేవ టర్న్. అలాగే, అనేక ఇతర జోన్లకు చెందిన సోదరసోదరీమణులు మరియు 5-6 వందల మంది విదేశీ సోదరసోదరీమణులు బాబా ఇంటికి వచ్చి చాలా మంచి అనుభవాలను చేసుకుంటున్నారు.
ఈరోజు, బాప్‌దాదా అవతరణ సమయంలో మనమందరం వీడియో ద్వారా విన్న మహావాక్యాలను మీకు పంపుతున్నాము. మీ క్లాస్‌ను రిఫ్రెష్ చేయండి. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతులు... ఓం శాంతి.
18-03-19 “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 02-04-08 మధువనం
ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీలుగా కండి, లక్ష్యము మరియు లక్షణమును సమానంగా తయారు చేసుకోండి
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపుల సంతుష్టంగా ఉండే సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖముపై సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది. సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియంగా ఉంటారు, బాబాకు కూడా ప్రియులు మరియు పరివారానికి కూడా ప్రియులు ఎందుకంటే సంతుష్టత గొప్ప శక్తి. సర్వ ప్రాప్తులు ప్రాప్తించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది. ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉన్నట్లయితే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత నిండిన వాతావరణము ఇతరులకు కూడా సంతుష్టత యొక్క వైబ్రేషన్లను ఇస్తుంది. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారి గుర్తు సదా ప్రసన్నంగా ఉండటము. సదా ముఖము హర్షితముఖంగా స్వతహాగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితి సంతుష్ట ఆత్మ యొక్క స్వ స్థితిని కదిలించలేదు. ఎంతటి పెద్ద పరిస్థితి అయినా కానీ సంతుష్ట ఆత్మకు అది కార్టూన్ షోలా మనోరంజకంగా కనిపిస్తుంది. అందుకే వారు పరిస్థితిలో కలవరపడరు మరియు పరిస్థితి వారిపై దాడి చెయ్యలేదు, ఓడిపోతుంది. అందుకే అతీంద్రియ సుఖమయ జీవితాన్ని అనుభవం చేస్తారు. శ్రమ చెయ్యవలసిన అవసరం లేదు. మనోరంజకంగా అనుభవం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోండి. పరిశీలించుకోవడమైతే వచ్చు కదా! వచ్చు కదా? ఎవరికైతే పరిశీలించుకోవడము వచ్చో స్వయాన్ని, ఇతరులను కాదు, స్వయాన్ని పరిశీలించుకోవడము వచ్చు అని భావిస్తే వారు చేతులెత్తండి. పరిశీలించుకోవడం వచ్చా? అచ్ఛా. అభినందనలు.
పిల్లలు ప్రతి ఒక్కరికీ రోజూ అమృతవేళ బాప్‌దాదా వరదానము కూడా భిన్న భిన్న రూపాలలో ఇదే లభిస్తుంది - సంతోషంగా ఉండండి, వర్ధిల్లండి. రోజూ వరదానము అందరికీ లభిస్తుంది. బాప్‌దాదా అందరికీ ఒకే విధంగా, ఒకేసారి వరదానాన్ని ఇస్తారు. కానీ తేడా ఏమిటి? నంబరువారీగా ఎందుకు అవుతున్నారు? దాత ఒక్కరే, ఇచ్చేది కూడా ఒక్కటే, ఒకరికి కొద్దిగా, మరొకరికి ఎక్కువ ఇవ్వడం లేదు, విశాల హృదయంతో ఇస్తారు కానీ తేడా ఎక్కడ వస్తుంది? ఈ అనుభవం కూడా అందరికీ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు బాప్‌దాదా వద్దకు ఒక మాట చేరుకుంటూనే ఉంది. అది ఏమిటో తెలుసు కదా? అప్పుడప్పుడు, కొంచెం కొంచెం - ఇప్పటికీ ఈ మాటలు వస్తున్నాయి - బ్రాహ్మణ ఆత్మల జీవితము అనే డిక్షనరీలో ఈ రెండు మాటలు తొలగిపోవాలి అని బాప్‌దాదా చెప్పారు. అవినాశీ తండ్రి, అవినాశీ ఖజానాలు, మీరందరూ కూడా అవినాశీ శ్రేష్ఠ ఆత్మలు. మరి ఏ మాట ఉండాలి? అప్పుడప్పుడా లేక సదా? ప్రతి ఖజానా ముందు పరిశీలించుకోండి - సర్వ శక్తులు సదా ఉన్నాయా? సర్వ గుణాలు సదా ఉన్నాయా? మీ భక్తులందరూ మీ గుణ గానాన్ని చేసేటప్పుడు ఏమని పాడుతారు? అప్పుడప్పుడూ గుణదాతలు అని అంటారా? బాప్‌దాదా ప్రతి వరదానంలో సదా అన్న మాటను చెప్తారు. సదా సర్వశక్తిమంతులు, ఒకసారి శక్తిమంతులు, మరోసారి సర్వశక్తిమంతులు అని చెప్పలేదు. ప్రతి సమయము రెండు మాటలు మీరు కూడా చెప్తారు, బాబా కూడా చెప్తారు, సమానంగా కండి. కొంచెం కొంచెం సమానంగా కండి అని చెప్పరు. సంపన్నము మరియు సంపూర్ణము, మరి పిల్లలు అప్పుడప్పుడు ఏమి చేస్తుంటారు? బాప్‌దాదా కూడా ఆటను చూస్తుంటారు కదా! పిల్లల ఆటనైతే చూస్తూనే ఉంటారు. పిల్లలు ఏమి చేస్తారు, కొందరు, అందరూ కాదు. ఏ వరదానమైతే లభించిందో ఆ వరదానం గురించి ఆలోచించి, వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసుకుని, స్మృతి కూడా చేసుకుంటారు కానీ వరదానము రూపి బీజమును ఫలప్రదం చేసుకోరు. బీజము నుండి ఫలమును పొందలేరు. కేవలం వర్ణన చేస్తూ మంచి వరదానము అని అనుకుని సంతోషపడిపోతూ ఉంటారు. వరదానము బీజము వంటిది కానీ ఎవరు ఎంతగా ఫలప్రదం చేసుకుంటారో అంతగా వారు వృద్ధిని పొందుతారు. ఫలప్రదం కావడానికి రహస్యము ఏమిటి? సమయానికి కార్యంలో తీసుకురావడము. కార్యములోకి తీసుకురావడము మర్చిపోతారు, కేవలం పుస్తకంలో చూసి, చాలా బాగుంది, చాలా బాగుంది అని వర్ణిస్తూ ఉంటారు. బాబా చాలా మంచి వరదానము ఇచ్చారు. కానీ ఎందుకోసం ఇచ్చారు? దానిని ఫలప్రదం చేసుకోవడానికి ఇచ్చారు. బీజములో ఫలము యొక్క విస్తారము ఉంటుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు, కానీ వరదానీ స్వరూపులుగా కావడంలో నంబరువారీగా అయిపోతారు. బాప్‌దాదా ప్రతి ఒక్కరి భాగ్యమును చూసి హర్షితమవుతున్నారు కానీ బాప్‌దాదా యొక్క మనో ఆశ ముందు కూడా వినిపించి ఉన్నారు. అందరూ చేతులు కూడా ఎత్తారు, గుర్తుందా, మేము కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపులుగా అవుతాము అని. హోమ్‌వర్కు గుర్తుందా? కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ ద్వారా లేక ఉత్తరాలు, ఈ-మెయిల్స్ ద్వారా రిజల్టును వ్రాసారు కూడా. మంచిది, అటెన్షన్ అయితే పెట్టారు కానీ బాప్‌దాదాకు నచ్చే మాట - సదా. అది ఉందా?
బాప్దాదాపై ప్రేమ ఎవరికి ఉంది, ఎంత ఉంది అని బాప్‌దాదా అడిగినప్పుడు బాప్‌దాదా చిరునవ్వు నవ్వుతారు. అప్పుడు ఏమని జవాబు చెప్తారు? బాబా, ఎంత ఉందంటే జవాబు చెప్పలేము అని అంటారు. జవాబు చాలా బాగా ఇస్తారు. బాప్‌దాదా కూడా సంతోషపడిపోతారు. కానీ ప్రేమకు ఋజువు ఏమిటి? ఎవరిపై అయితే ప్రేమ ఉంటుందో, ఈరోజుల్లో ప్రపంచంవారికి దేహాభిమానపు ప్రేమ ఉన్న కారణంగా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు. మరి పరమాత్మ ప్రేమ, బాబా చెప్పిన తర్వాత పిల్లలకు చెయ్యడంలో కష్టమెందుకు వస్తుంది? పాటలు చాలా మంచి మంచివి పాడుతారు. బాబా, మేము బలిహారమయ్యే దీపపు పురుగులము, దీపంపై బలిహారమయ్యేవారము. మరి కారణము అన్న మాటను స్వాహా చెయ్యలేరా?
మీ టైటిల్ ఏమిటి? మీ కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం కోసం బ్రాహ్మణులుగా అయ్యారు? విశ్వ పరివర్తకులు అన్నది మీ టైటిల్. విశ్వ పరివర్తన మీ కార్యము. మీకు తోడుగా ఉన్నది ఎవరు? బాప్‌దాదాతో పాటు ఈ కార్యంలో నిమిత్తులుగా అయ్యారు. మరి ఏమి చెయ్యాలి? ఇప్పుడు కూడా చేస్తారా అని చేతులెత్తిస్తే అందరూ ఎత్తేస్తారు. లక్ష్యమునైతే ఉంచారు, బాప్‌దాదా చూసారు, పూర్తిగా ఈ సంవత్సరం సీజన్లో అందరూ సంకల్పం అయితే చేసారు కానీ సఫలతకు తాళం చెవి - చెయ్యాల్సిందే, ఇందుకు బదులు అప్పుడప్పుడు చేస్తున్నాము, నడుస్తున్నాము, చేయాల్సిందేలే. ఈ సంకల్పము దృఢత్వాన్ని సాధారణంగా చేసేస్తుంది. దృఢత్వములో కారణము అన్న మాటే రాదు. నివారణ వచ్చేస్తుంది. కారణాలు వస్తాయి కూడా కానీ చెకింగ్ ఉన్న కారణంగా, కారణము నివారణలోకి పరివర్తన అయిపోతుంది.
బాప్‌దాదా రిజల్టును పరిశీలించినప్పుడు ఏమి చూసారు? జ్ఞాని, యోగి, ధారణ స్వరూపము, సేవాధారి - నాలుగు సబ్జెక్టులలో ప్రతి ఒక్కరూ యథా శక్తి జ్ఞాని కూడా, యోగి కూడా, ధారణ కూడా చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు. కానీ నాలుగు సబ్జెక్టులలో అనుభవీ స్వరూపము, అనుభవము యొక్క అథారిటీ - ఇందులో లోటు కనిపిస్తుంది. అనుభవీ స్వరూపము, జ్ఞాన స్వరూపములో కూడా అనుభవీ స్వరూపము ఉండాలి, అనగా జ్ఞానాన్ని నాలెజ్ అని అనడం జరుగుతుంది. కావున అనుభవీమూర్త ఆత్మలో నాలెజ్ అనగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న జ్ఞానము ఉంటుంది. నాలెజ్ యొక్క లైట్ మరియు మైట్. కావున అనుభవీ స్వరూపులు అనగా జ్ఞానీ ఆత్మ చేసే ప్రతి కర్మలో లైట్ మరియు మైట్ నేచురల్‌గా ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానాన్ని, నాలెజ్ను తెలుసుకోవడము, వర్ణన చేయడము, దీనితో పాటు ప్రతి కర్మలో లైట్-మైట్‌గా ఉండాలి. అనుభవీ స్వరూపుల ప్రతి కర్మ నేచురల్‌గా, శ్రేష్ఠంగా సఫలమవుతాయి. శ్రమ చెయ్యవలసిన అవసరం లేదు ఎందుకంటే జ్ఞానము యొక్క అనుభవీమూర్తులు కనుక. అనుభవం యొక్క అథారిటీ అన్ని అథారిటీలలోకి శ్రేష్ఠమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవడములోనూ మరియు జ్ఞానము యొక్క అనుభవీ స్వరూపులై అథారిటీతో ప్రతి కర్మను చెయ్యడంలోనూ తేడా ఉంది. మరి అనుభవీ స్వరూపులేనా? పరిశీలించుకోండి. నాలుగు సబ్జెక్టులలో, ఆత్మను నేను కానీ అనుభవీ స్వరూపులై ప్రతి కర్మను చేస్తున్నారా? అనుభవం యొక్క అథారిటీ అనే సీట్‌పై సెట్ అయినట్లయితే అథారిటీ ఎదురుగా శ్రేష్ఠ కర్మ, సఫలత స్వరూప కర్మ నేచురల్ నేచర్‌గా కనిపిస్తాయి. ఆలోచిస్తారు కానీ అనుభవీ స్వరూపులుగా కావడము, యోగయుక్తమైన రహస్యయుక్తమైన నేచర్ కావాలి, నేచురల్ కావాలి. ధారణలో కూడా సర్వ గుణాలు స్వతహాగానే ప్రతి కర్మలో కనిపించాలి. ఇటువంటి అనుభవీ స్వరూపంలో ఎప్పుడూ ఉండటము, అనుభవము అనే సీట్‌పై సెట్ కావడము - ఇప్పుడు ఈ ఆవశ్యకతపై అటెన్షన్ కావాలి, ఇది అవసరము. అనుభవం యొక్క అథారిటీ చాలా గొప్పది. అనుభవీని మాయ కూడా నాశనము చెయ్యలేదు ఎందుకంటే మాయ యొక్క అథారిటీకన్నా అనుభవం యొక్క అథారిటీ పదమారెట్లు ఉన్నతమైనది. ఆలోచించడము వేరు, మననము చెయ్యడము వేరు, స్వరూపంగా అనుభవీ స్వరూపంగా అయి నడుచుకోవడము, ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది.
మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఒక సబ్జెక్టులో మెజారిటీ పాస్ కావడము బాప్‌దాదా చూసారు. ఏ సబ్జెక్టు? సేవ సబ్జెక్టు. నలువైపుల నుండి బాప్‌దాదా వద్దకు సేవ రికార్డులు చాలా మంచి మంచిగా వచ్చాయి. సేవా ఉల్లాస ఉత్సాహము ఈ సంవత్సరపు సేవా సమాచారాల ప్రకారం మంచిగా కనిపించింది. ప్రతి వర్గంవారు, ప్రతి జోన్‌వారు భిన్న భిన్న రూపాలతో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. ఇందుకు బాప్‌దాదా ప్రతి జోన్, ప్రతి వర్గానికి పదమాపదమరెట్లు అభినందనలు ఇస్తున్నారు. అభినందనలు. ప్లాన్లు కూడా మంచి మంచిగా తయారు చేసారు. కానీ ఇప్పుడు సమయ ప్రమాణంగా అకస్మాత్తుగా జరిగే సీజన్ ఇది. ఈ సంవత్సరం ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా వెళ్ళిపోయారో మీరు విని ఉంటారు, చూసి ఉంటారు. కావున అకస్మాత్తు అనే గంట ఇప్పుడు మరింత తీవ్రం అవుతుంది. ఆ అనుసారంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపునిగా ఎంత అయ్యాను అని పరిశీలించుకోండి. ఎందుకంటే నాలుగు సబ్జెక్టులలో మంచి మార్కులు కావాలి, ఒకవేళ ఒక్క సబ్జెక్టులోనైనా పాస్ మార్కులకన్నా తక్కువ వచ్చినట్లయితే పాస్ విత్ హానర్‌గా, మాలలో పూసగా, బాప్‌దాదా మెడలో హారంగా ఎలా అవుతారు? ఏ రూపంలోనైనా ఓటమి పొందేవారు బాబా మెడలో హారంగా కాలేరు. మరి ఇక్కడ చేతులు ఎత్తమని చెప్తే అందరూ ఏమని అంటారు? లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అంటారు. సరే, లక్ష్మీనారాయణులు లేక లక్ష్మీనారాయణుల పరివారంలోని వారిగా కావడము కూడా శ్రేష్ఠ పదవియే. కావున బాప్‌దాదా కేవలం ఒక్క మాట చెప్తున్నారు, ఇప్పుడు తీవ్రగతితో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి మరియు తమ ఎగిరే కళ యొక్క వైబ్రేషన్ల ద్వారా వాతావరణంలో సహయోగ వాతావరణాన్ని వ్యాపింపజేయండి. ప్రకృతిని కూడా మేము పరివర్తన చేసి చూపిస్తాము అని మీరందరూ ఛాలెంజ్ చేసారు కదా? ప్రతిజ్ఞ చేసారు కదా? ప్రతిజ్ఞ చేసారు. తల ఊపండి, చేతులు కాదు. మరి మీ తోటి మనుష్యాత్మలను దుఃఖము మరియు అశాంతి నుండి పరివర్తన చేయలేరా? ఒకటి, మీరు ఛాలెంజ్ చేసారు, రెండు, మేమందరమూ ఇప్పుడు కూడా మీ కార్యంలో తోడుగా ఉన్నాము, పరంధామంలో కూడా తోడుగా ఉంటాము మరియు రాజ్యంలో కూడా బ్రహ్మా బాబా తోడుగా ఉంటాము అని బాప్‌దాదాకు కూడా ప్రతిజ్ఞ చేసారు కదా? ఈ ప్రతిజ్ఞ చేసారు కదా! కావున తోడుగా నడుస్తాము, తోడుగా ఉంటాము మరియు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాము. మరి బాబా ఇచ్చే సూచనను సమయానుసారంగా ప్రాక్టికల్‌లో చూస్తూనే ఉన్నారు - అకస్మాత్తు, ఎవరెడీ. దాదీ వెళ్ళిపోతారు అని ఆనుకున్నారా? అకస్మాత్తుగా జరిగే ఆటను చూసారు కదా.
కావున ఈ సంవత్సరం ఎవరెడీ. బాబా మనో ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలుగా తయారు కావలసిందే. బాబా ఆశలైతే తెలుసు కదా. తయారు అవుతారా? లేక అవుతాములే, చూద్దాములే... తయారు కావలసిందే అని భావించేవారు చేతులెత్తండి. చూడండి, కెమెరాలో వస్తుంది. బాప్‌దాదాను అయితే చాలా బాగా సంతోషపెడ్తారు. బాప్‌దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు. చూడండి, బ్రహ్మా బాబా కూడా ముక్తి ద్వారాలను తెరవడానికి పిల్లలైన మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురు చూస్తుంది. మీరు ఏర్పాట్లు చేసేవారు. మీరు ఎదురు చూసేవారు కాదు, ఏర్పాట్లు చేసేవారు. మరి ఈ సంవత్సరం లక్ష్యాన్ని పెట్టుకోండి కానీ లక్ష్యమును మరియు లక్షణమును సమానంగా పెట్టుకోండి. లక్ష్యము చాలా ఉన్నతంగా మరియు లక్షణములో బలహీనత ఉండకూడదు. లక్ష్యము మరియు లక్షణము సమానంగా ఉండాలి. మీ లక్ష్యము మరియు లక్షణము సమానంగా ఉన్నప్పుడే సమానంగా కావాలి అన్న మీ మనో ఆశ పూర్తవుతుంది. లక్ష్యము మరియు లక్షణములో ఇప్పుడు కొంచెం కొంచెం తేడా ఉంటుంది. ప్లాన్ చాలా బాగా తయారు చేస్తారు. పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగా చేస్తారు, ఒకరికొకరు అటెన్షన్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. దృఢత్వము మా జన్మ సిద్ధ అధికారము - ఇప్పుడు ఈ సంకల్పాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకురండి. పరిశీలించుకోండి - ఏదైతే చెప్తున్నామో దాన్ని అనుభవం కూడా చేస్తున్నామా? మొదటి మాట నేను ఆత్మను, దీనినే పరిశీలించుకోండి. ఈ ఆత్మ స్వరూపము అనుభవాల అథారిటీ కలది, ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ నంబర్‌వన్.
అచ్ఛా. ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా స్వ స్థితిలో స్థితి కాగలరా? మనసు యొక్క ఏకాగ్రత (డ్రిల్) అచ్ఛా. మూడు బిందువుల స్మృతి స్వరూపులుగా కాగలరా? కేవలం ఫుల్స్టాప్. అచ్ఛా.
సేవ టర్న్ పంజాబ్వారిది, (హిమాచల్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాంచల్):- అచ్ఛా, పంజాబ్ పులి అని ఎవరినైతే పిలిచామో వారు కూడా సంఖ్యను బాగా తీసుకువచ్చారు. అందరికీ తెలిసిపోయింది, పంజాబ్ పులివంటిది, కావున అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. పంజాబ్‌కు ఎంత పెద్ద పుణ్యము తయారయింది. ఒక్క బ్రాహ్మణునికి సేవ చేస్తారు అక్కడ, అది కూడా ఎటువంటి బ్రాహ్మణుడు! మరి మీరెంతమందికి, సత్యమైన బ్రాహ్మణులకు సేవ చేసారు. రోజూ తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. పుణ్య ఖాతా సహజంగా వృద్ధి అయ్యేందుకు డ్రామాలో ఇది కూడా ఒక సాధనము. ఎవరైతే ఈ ఉల్లాస ఉత్సాహాలతో వస్తారో వారు కొద్ది రోజులలోనే ఎంతో పుణ్య ఖాతాను జమ చేసుకోగలరు. ఇప్పుడు సంగమయుగపు పుణ్య ఖాతా చాలా సమయం వరకు పనికి వస్తుంది. పంజాబ్ సేవ రిపోర్టును చూసాము. బాప్‌దాదా ముందుగానే అభినందనలు తెలిపి ఉన్నారు. సేవాకేంద్రాలు కూడా ఉన్నాయి, గీతా పాఠశాలలు కూడా ఉన్నాయి, వృద్ధి కూడా అవుతుంది. అందరి మనసులలో ఈసారి శివరాత్రికి చేసిన సేవా ఉత్సాహపు అల ఉంది. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మీడియా ద్వారా కావచ్చు, ఫంక్షన్ల ద్వారా కావచ్చు, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహము మంచిగా చూపించారు. ఇప్పుడు ఏమి చేయాలి? బాబాను ప్రత్యక్షం చేయాల్సిందే అని ప్రతి ఒక్కరూ ఏదైతే సంకల్పం తీసుకున్నారో దాని డేట్‌ను మీ పరివర్తన అనే కలముతో సెట్ చెయ్యండి. పెన్సిల్‌తో సెట్ కాదు, ఇది మీ పరివర్తన అనే తీవ్ర పురుషార్థము యొక్క కలముతో ప్రత్యక్షత డేట్ సహజంగానే ఫిక్స్ అయిపోతుంది.
అచ్ఛా, డబల్ విదేశీయులు, బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు కానీ ఒక విషయంలో సంతోషంగా ఉన్నారు, మరో విషయంలో సంతోషాన్ని తీసుకురావలసి ఉంది. ఎప్పుడు కూడా స్వయాన్ని కంబైండ్ రూపం నుండి ఒంటరిగా భావించవద్దు. ఒంటరిగా చేసుకోవడము అంటే మాయను వెల్కమ్ చేసినట్లు. కావున కంబైండ్ సర్వశక్తిమంతుని నుండి లాభాన్ని పొందండి. సమయానికే మాయ ఒంటరిగా చేస్తుంది, ఇందులో అటెన్షన్ ఉంచండి. సదా కంబైండ్. డబల్ విదేశీయులకు కంపెనీ (సహవాసము) మంచిగా అనిపిస్తుంది. కంపేనియన్ (సహచరుడు) మంచిగా అనిపిస్తాడు. కావున ఎప్పుడూ ఒంటరిగా కావద్దు. నేను తోడు ఇవ్వడానికి సదా తోడుగా నిలుస్తాను అని తండ్రి స్వయంగా ఆఫర్ చేస్తున్నారు. రిజల్టు మంచిగా ఉంది. రిజల్టు మంచిగా ఉంది కానీ ఇంకా మంచి రిజల్టును చూపించాలి. ప్రతి టర్నులో రావడము, ఇది చాలా మంచి సిస్టమ్‌ను తయారు చేసారు. ఇప్పుడు విదేశము ఎలా అయిపోయిందంటే ఇండియా అయినా ఇంకా దూరంగా అనిపిస్తుంది కానీ విదేశము సమీపంగా అనిపిస్తుంది. అచ్ఛా.
మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి:- మొదటిసారి వచ్చిన గారాల పిల్లలకు మొదటి సారికి అభినందనలు. అందరికీ బాప్‌దాదా విశేషంగా వరదానాన్ని ఇస్తున్నారు, వరదానము ఏమిటంటే ఎలా అయితే పురుషార్థము చేసి వచ్చేందుకు పాత్రులు అయ్యారో, ఈ భాగ్యమును తీసుకున్నారో అలాగే అమర భవగా ఉండండి. మాయ వచ్చినా కానీ మాయ ద్వారాన్ని మూసివేయండి. మాయ ద్వారము ఏమిటో తెలుసా? దేహాభిమానపు నేను మరియు నాది. ఈ ద్వారాన్ని మూసివేసినట్లయితే అమరులుగా ఉంటారు. మరి అమరులే కదా. అమరులుగా ఉన్నారా? మాయ వస్తే ఏమి చేస్తారు? తీవ్ర పురుషార్థం చేస్తారా? అమరులుగా ఉండండి మరియు ఇతరులను కూడా అమరులుగా చేయండి. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క సెకండులో తమ శ్రేష్ఠ స్వమానము బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిని, ఈ ఆత్మిక నషాలో స్థితి కండి. సింహాసనాధికారి ఆత్మను, ఈ అనుభవంలో లవ్లీన్ కండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న అతి లవ్లీ, సదా తండ్రి ప్రేమలో లీనమయ్యేవారు, సదా స్వమానధారి, స్వరాజ్యాధికారి విశేష ఆత్మలకు, నలు వైపుల ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేవారికి, తమ మనసు యొక్క వైబ్రేషన్లతో వాతావరణాన్ని శాంతిగా, శ్రేష్ఠంగా తయారుచేసే వారందరికీ, బాబా సందేశాన్ని ఇచ్చి దుఃఖము నుండి విడిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పించేవారికి, సదా దృఢత్వం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారికి, నలువైపుల హృదయానికి సమీపంగా ఉండేవారికి మరియు సమ్ముఖంలోకి వచ్చే పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ, హృదయపూర్వక దీవెనలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ జానకి గారి వరదానీ మాటలు:- అద్భుతమైన బాబా, అద్భుతమైన మన దాదీ, చూడండి, మన ఈ సోదరసోదరీలందరూ హాజరయ్యారు. బాబా ఎంతగా దృష్టితో సంతృప్తిపరిచారు. ఇక్కడే కూర్చొని ఉండిపోవాలని అనిపిస్తుంది. బాబా మురళి ఎంత ఆద్బుతంగా ఉంది. పరివర్తన ఆవ్వాలంటే మనమవ్వాలి. ఇప్పుడు పరివర్తన ఆవ్వాలి. మనం పరివర్తన అయినప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు. మధురమైన బాబా, ప్రియమైన బాబా, అద్భుతమైన బాబా. ఇక్కడ కూర్చొని బాబా, ఎలా మమ్మల్ని సుఖము, శాంతి, ఆనందం, ప్రేమతో కూర్చోబెట్టారు. నా బాబా మన నుండి ఏమీ కోరుకోరు. కేవలం ఇదే చెప్తారు, పిల్లలూ, సదా సంతోషంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. పాత విషయాలన్నీ మర్చిపోయి, అందరితో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడండి. అచ్ఛా. ఓ.కే.
*** ఓంశాంతి ***
