Search for a command to run...
31 Dec 2018
“నూతన సంవత్సర నవీనత - దృఢత మరియు పరివర్తన శక్తితో కారణము మరియు సమస్య అను పదాలకు వీడ్కోలు చెప్పి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి”
31 December 2018 · తెలుగు
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా క్రొత్త ఉల్లాస ఉత్సాహంలో ఉండే విశ్వ పరివర్తక నిమిత్తులు, కారణము మరియు సమస్య అనే పదాలకు సదా కోసం వీడ్కోలు ఇచ్చి సమాధాన స్వరూపులుగా అయ్యే నిమిత్త అనంత సేవాధారులైన టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతితో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నూతన ఉల్లాస ఉత్సాహాలను తీసుకు వచ్చింది. అందరూ ఎంతో ప్రేమతో నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుకుంటున్నారు. ప్రియమైన బాప్‌దాదా అందరికీ నూతన సంవత్సరం మరియు నూతన యుగానికి అభినందనలు తెలిపారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతో పాటు పాత సంస్కారాలకు సదా కోసం వీడ్కోలు ఇచ్చి స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన మహా కార్యానికి నిమిత్తులుగా పిల్లలు అవ్వాలన్నది ప్రియమైన బాప్‌దాదా శుభ ఆశ. మేము బాబా సమానంగా అవ్వాలన్నది అందరి లక్ష్యము, మరి ఈ సంవత్సరము అందరం కలిసి నవీనత సంపన్నమైన తీవ్ర పురుషార్థం చేసి సంపన్నత మరియు సంపూర్ణత గమ్యాన్ని ప్రాప్తి చేసుకుందాము.
చూడండి, ప్రియమైన బాప్‌దాదా తమ భాసనను ఇచ్చి తన పిల్లలకు అలౌకిక పాలనను ఇస్తున్నారు. ఈసారి సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది. షుమారు 20 వేలమంది సోదరసోదరీలు ఈ గ్రూపులో వచ్చారు. డబల్ విదేశీయులు షుమారు 450 మంది ఉన్నారు. చిన్న పిల్లలు మరియు యువకుల రిట్రీట్ చాలా బాగా జరిగింది, అందరూ సభలో కూర్చుని ఉన్నారు. అందరూ బాప్‌దాదాతో కలిసి ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు.
బాప్‌దాదా అందరికీ ఈ హోమ్‌వర్క్‌ను ఇస్తున్నారు, పిల్లలు ఇప్పుడు దృఢత మరియు పరివర్తన శక్తితో కారణము మరియు సమస్య అను పదాలను సదా కోసం సమాప్తం చేసి సమాధాన స్వరూపులుగా అవ్వాలి. బాప్‌దాదా యొక్క ఈ మధుర మహావాక్యాలను వీడియో ద్వారా మనందరం విన్నాము. ఈ మురళిని మీరు కూడా మీ క్లాసులో వినిపించి అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు. -
బాప్‌దాదా మధుర మహావాక్యాలను విన్న తర్వాత దాదీ జానకిగారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఆ తర్వాత పెద్దన్నయ్యలు మరియు పెద్దక్కయ్యలు కలిసి క్రొవ్వొత్తులను వెలిగించి కేక్‌ను కట్ చేసారు. అందరి నోటిని తీపి చేసారు. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతి. ఓం శాంతి.
31-12-18 అవ్యక్త మహావాక్యాలు రివైజ్ వీడియో 31-12-06 మధువనం
“నూతన సంవత్సర నవీనత - దృఢత మరియు పరివర్తన శక్తితో కారణము మరియు సమస్య అను పదాలకు వీడ్కోలు చెప్పి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి”
ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న పిల్లలకు నూతన సంవత్సరం మరియు నవయుగం రెండింటికీ అభినందనలు తెలుపుతున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు కూడా అభినందనలు తెలపడానికి చేరుకున్నారు. కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలపడానికి వచ్చారా లేక నవయుగ శుభాకాంక్షలు కూడా ఇవ్వడానికి వచ్చారా? నూతన సంవత్సరం సంతోషంగా ఉంటారు మరియు సంతోషాలను పంచుతారు. బ్రాహ్మణ ఆత్మలైన మీకు నవ యుగం కూడా అంతే గుర్తుకు ఉందా? నవ యుగము నయనాల ఎదురుగా వచ్చిందా? నూతన సంవత్సరం ఇక వచ్చేసింది అని అనిపించినట్లుగా నవయుగం కూడా వచ్చేసింది అని అనుభవం అవుతుందా? ఆ నవయుగ స్మృతి అంత సమీపంగా కనిపిస్తుందా? అక్కడ మీకు ఉండే శరీరమనే వస్త్రం మెరుస్తూ కనిపిస్తుందా? బాప్‌దాదా డబల్ అభినందనలు తెలుపుతున్నారు. పిల్లల మనసులో, నయనాలలో నవయుగ దృశ్యాలు ఇమర్జ్ అయి ఉన్నాయి. నవయుగంలో మీ తనువు-మనసు-ధనము-జనము ఎంతో శ్రేష్ఠంగా ఉంటాయి, సర్వ ప్రాప్తుల భాండాగారము. ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నాము కానీ ఇక ఇప్పుడే కొత్త రాజ్యంలో ఉంటాము అన్న సంతోషము ఉంది. మీ రాజ్యము గుర్తుందా? ఈరోజు డబల్ కార్యం కోసం వచ్చారు కదా, పాత ప్రపంచానికి వీడ్కోలు మరియు నూతన సంవత్సరానికి అభినందనలు చెప్పడానికి వచ్చారు. మరి కేవలం పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారా లేక పాత ప్రపంచపు పాత సంస్కారాలు, పాత స్వభావాలు, పాత నడవడికకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారా? పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడం సహజమే కానీ పాత సంస్కారాలకు వీడ్కోలు చెప్పడం కూడా అంతే సహజమనిపిస్తుందా? ఏమంటారు? మాయకు కూడా వీడ్కోలు చెప్పడానికి వచ్చారా లేక సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారా? వీడ్కోలు చెప్పాలి కదా! లేక మాయ మీద కొంచెం ప్రేమ ఉందా? కొంచెం కొంచెం పెట్టుకోవాలనుకుంటున్నారా?
బాప్‌దాదా ఈరోజు నలువైపుల ఉన్న పిల్లల నుండి పాత సంస్కార స్వభావాలకు వీడ్కోలు పలకడాన్ని కోరుకుంటున్నారు. ఇవ్వగలరా? ధైర్యముందా లేక వీడ్కోలు ఇవ్వాలనే అనుకుంటున్నాము కానీ మళ్ళీ మాయ వచ్చేస్తుంది అంటారా! ఈరోజు దృఢ సంకల్ప శక్తితో పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి నవ యుగపు సంస్కారాలకు, జీవితానికి అభినందనలు చెప్పే ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? వీలవుతుంది అని అనుకునేవారు చేతులెత్తండి. వీలవుతుందా? అవ్వవలసిందే. ధైర్యం ఉంది అనేవారు చేతులెత్తండి. ధైర్యం ఉందా? అచ్ఛా, ఎవరైతే చేతులెత్తలేదో వారు ఆలోచిస్తున్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తారు. ఎవరిలో ధైర్యం ఉందో వారు మాత్రమే చేతులెత్తండి, అందరూ కాదు. అచ్ఛా, డబల్ విదేశీయులు తెలివైనవారు. డబల్ నషా ఉంది, అందుకని. చూడండి, బాప్‌దాదా ప్రతి నెల రిజల్టును చూస్తారు. పిల్లలు ధైర్యవంతులు అని బాప్‌దాదా సంతోషిస్తున్నారు. తెలివిగా జవాబు చెప్పే పిల్లలు. ఎందుకు? ఎందుకంటే ధైర్యంతో ఒక అడుగు మేము వేస్తే వేయి అడుగుల సహయోగాన్ని బాబా అందిస్తారని తెలుసు. అధికారులు మీరు. వేయి అడుగుల సహాయానికి అధికారులు. మీ ధైర్యాన్ని కదిలించే ప్రయత్నం మాయ చేస్తుంది. పిల్లలు ధైర్యం బాగా ఉంచుతారు, అందుకు బాబా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు కానీ ధైర్యం ఉంచినప్పటికీ లోపల వ్యర్థ సంకల్పాలను కూడా ఉత్పన్నం చేస్తారు - చేయడమైతే చేస్తున్నాము, అవ్వాలి కానీ, ఏమో తెలీదు... తెలీదు అన్న సంకల్పం వచ్చింది అంటే ఇది ధైర్యాన్ని బలహీనపరుస్తుంది. తే, తే వస్తే, చేయడమైతే చేస్తున్నాము, ఎగరడమైతే ఉండాలి... ఇది ధైర్యాన్ని కదిలిస్తుంది. తే అని ఆలోచించకండి. చెయ్యవలసిందే. ఎందుకు అవ్వదు! బాబా తోడుగా ఉన్నప్పుడు, బాబా తోడులో తే, తే అని రాదు.
మరి ఈ నూతన సంవత్సరంలో ఏ నవీనతను తీసుకువస్తారు? ధైర్యం అనే పాదాన్ని గట్టిగా పెట్టుకోండి. ధైర్యం అనే పాదాన్ని ఎంత గట్టిగా పెట్టుకోవాలంటే మాయ కదలాలి కానీ మీ పాదం కాదు. నూతన సంవత్సరంలో ఏ నవీనతను తెస్తారు? లేక ఒకసారి గట్టిగా ఒకసారి కదులుతూ ఉంటారా? మీ అందరి కర్తవ్యం ఏమిటి? స్వయాన్ని ఏమంటారు? గుర్తు తెచ్చుకోండి. విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తకులు - ఇదే మీ కర్తవ్యం కదా! బాప్‌దాదాకు అప్పుడప్పుడు మధురమైన చిరునవ్వు వస్తుంది. విశ్వ పరివర్తకులు అన్న టైటిల్ అయితే ఉంది కదా. విశ్వ పరివర్తకులు కదా? లేక లండన్ పరివర్తకులు, ఇండియా పరివర్తకులా? విశ్వ పరివర్తకులు కదా, అందరూ? గ్రామంలో ఉంటున్నా, లండన్, అమెరికాలో ఉంటున్నా కానీ విశ్వ పరివర్తకులే కదా? అవును అయితే తల ఊపండి. పక్కా కదా. లేక 75% ఉన్నారా? 75% విశ్వ కళ్యాణి మిగతా 25% ఏమీ లేదా? అలానా? మీ ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము అని ప్రకృతిని ఛాలెంజ్ చేసారు కదా. మీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇలా చేసుండకూడదు కానీ జరిగిపోయింది అని మీ గురించి అనుకుంటుంటారు కదా. మరి విశ్వ పరివర్తకులు, ప్రకృతి పరివర్తకులు, స్వ పరివర్తకులుగా అవ్వలేరా? శక్తి సైన్యం ఏమి ఆలోచిస్తుంది? ఈ సంవత్సరంలో విశ్వ పరివర్తకులు అన్న మీ కర్తవ్యాన్ని గుర్తు పెట్టుకోండి. స్వ మరియు బ్రాహ్మణ పరివారం పట్ల కూడా పరివర్తకులుగా అవ్వాలి ఎందుకంటే ఛారిటి బిగిన్స్ ఎట్ హోమ్. ధర్మం ముందు ఇంటి నుండి ప్రారంభమవుతుంది. మరి కర్తవ్యం యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తారు కదా! స్వయం మరియు బాబా కోరుకునే స్వ పరివర్తన, తెలుసు కదా! పిల్లలైన మీ అందరి లక్ష్యం ఏమిటి అని బాప్‌దాదా అడుగుతున్నారు. మెజారిటీ పిల్లలు బాబా సమానంగా అవ్వడము అని జవాబు చెప్తారు. అంతే కదా. బాబా సమానంగా అవ్వవలసిందే లేక చూస్తాము, ఆలోచిస్తాము అంటారా? ఈ నూతన సంవత్సరంలో ఏదైనా అద్భుతం చేసి చూపించండి. అందరూ సేవ ఉత్సాహంలో ఎన్నో భిన్న భిన్న ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు, సఫలం కూడా అవుతాయి, బాప్‌దాదా సంతోషిస్తారు కూడా. కష్టపడ్డందుకు సఫలత లభించింది. వృధాగా పోదు. కానీ సేవ ఎందుకు చేస్తున్నారు? ఏమని జవాబు చెప్తారు? బాబాను ప్రత్యక్షం చేయడానికి అంటారు. మరి బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు, బాబాను ప్రత్యక్షం చెయ్యవలసిందే, చేస్తారు కదా. కానీ బాబాను ప్రత్యక్షం చేయడానికి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. చెప్పండి, శివ శక్తులు ఈ నూతన సంవత్సరంలో శివ శక్తి రూపంలో స్వయాన్ని ప్రత్యక్షం చేసుకుంటారా? చేస్తారా? జనక్, మీరు చెప్పండి. చేస్తారా? (చెయ్యవలసిందే). ఈ సంవత్సరం చేసి చూపిస్తాము అని అనుకునే మొదటి లైను మరియు రెండవ లైనులో కూర్చున్న టీచర్లు చేతులెత్తండి. అచ్ఛా - అందరూ టీచర్లు చేతులెత్తారా లేదా? అచ్ఛా.
మధువనం వారు. చేయవలసిందే. చేయవలసిందే ఎందుకంటే మధువనం అయితే సమీపంగా ఉంది. తారీఖు నోట్ చేసి పెట్టుకోండి. 31 తారీఖు. సమయం కూడా నోట్ చేసుకోండి. పాండవ సైన్యం, పాండవులు ఏమి చూపిస్తారు? విజయి పాండవులు. అప్పుడప్పుడు విజయులు కాదు, ఉన్నదే విజయి పాండవులు. మరి ఈ సంవత్సరం ఇలా అయ్యి చూపిస్తారా లేక ఏమి చెయ్యాలి, మాయ వచ్చేసింది, అనుకోలేదు కానీ వచ్చేసింది అంటారా? బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు - మాయ తన చివరి సమయం వరకు రావడం మానదు. కానీ మాయ పని రావడము, మీ పని ఏమిటి? విజయులుగా అవ్వడము.
బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు ఈ సంవత్సరం ఒక్క పదానికి సదా వీడ్కోలు చెప్పండి. అది ఏమిటి? చెప్పమంటారా? ఇవ్వవలసి ఉంటుంది. ఈ సంవత్సరం బాప్‌దాదా కారణము అన్న పదానికి వీడ్కోలు ఇప్పించాలని ఆశిస్తున్నారు. నివారణ ఉండాలి, కారణము సమాప్తము. సమస్య సమాప్తము. సమాధాన స్వరూపము. స్వయం కారణం కావచ్చు, తోటివారు కారణం కావచ్చు, సంగఠన కారణం కావచ్చు, ఇతర పరిస్థితులు కారణం కావచ్చు, బ్రాహ్మణుల డిక్షనరిలో కారణము, సమస్య అన్న పదాలు పరివర్తన అవ్వాలి. సమాధానము మరియు నివారణ అవ్వాలి ఎందుకంటే చాలామంది ఈరోజు అమృతవేళ బాప్‌దాదాతో చేసిన ఆత్మిక సంభాషణలో ఇదే చెప్పారు, నూతన సంవత్సరంలో నవీనత తీసుకురావాలని ఉంది అన్నారు. ఈ రెండు పదాలు సమాప్తమైపోయేలా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని బాప్‌దాదా ఆశిస్తున్నారు. పర ఉపకారులుగా అవ్వండి. స్వయం కారణం అయినా ఇతరులు కారణంగా అయినా కానీ పర ఉపకారి ఆత్మగా అయ్యి, దయా హృదయులుగా అయ్యి, శుభ భావన, శుభ కామన కలిగిన మనసుతో సహయోగమును ఇవ్వండి, స్నేహాన్ని పొందండి. నూతన సంవత్సరంలో నవీనతను చెయ్యవలసిందే - స్వయం, సహయోగులు మరియు విశ్వమును పరివర్తన చెయ్యాలి. వెనుక ఉన్నవారు వింటున్నారా? మరి చెయ్యవలసిందే కదా, ముందు పెద్దవారు చేయాలి, మేమైతే చిన్నవారిమి అని అనుకోకండి. చిన్నవారు తండ్రితో సమానము. పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబాపై అధికారము ఉంది. సర్వ ప్రాప్తులకు కూడా పిల్లలు అధికారులు. టీచర్లు పరస్పరంలో ప్రోగ్రాములు తయారు చెయ్యండి, విదేశీయులు కూడా చెయ్యండి, భారతదేశం వారు కూడా కలిసి చేయండి.
సరేనా, అచ్ఛా - బాప్‌దాదా చూస్తారు, ప్రతి వారము, ప్రతి జోన్ వారు తమ రిజల్ట్‌ను ఓ.కె లేక ఓ.కె మధ్య గీత పెట్టి పంపండి. ఒకవేళ ఓ.కె లేకపోతే, మరేమీ వ్రాయకండి. ఉత్తరాలు ఎవ్వరూ చదవరు. పెద్ద ఉత్తరాలు వ్రాస్తే చదివే తీరిక ఉండదు అందుకని కేవలం ఓ.కె లేక ఓ.కె కాదు అని మాత్రమే వ్రాయండి. ఓ.కె కాకపోతే మధ్యలో గీత పెట్టండి, అంతే. దానితో ఇప్పుడింకా మార్జిన్ ఉంది అని అర్థమైపోతుంది. జోన్ కాకపోతే ప్రతి సెంటరు వ్రాసి పంపండి. సేవలో భక్తులకు, దుఃఖితులకు, బ్రాహ్మణులకు, ముగ్గురి సేవ ఓ.కె లేక గీత అని వ్రాయండి. పరివర్తన శక్తి, దృఢత శక్తిని బాగా ఉపయోగించండి. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ, ఆగ్రా వారిది:- మంచిది, చూడండి స్థాపన కార్యంలో ముందుగా ఢిల్లీ నిమిత్తమయింది, బాంబే కూడా కొంత అయింది. కానీ ఢిల్లీ స్థాపన కార్యంలో నిమిత్తంగా అయింది. మరి స్థాపన వారు గోల్డెన్ కప్ తీసుకోవడంలో కూడా నిమిత్తమవుతారా? అవుతారా? ఈసారి బాప్‌దాదా గోల్డెన్ కప్ తయారు చేయిస్తున్నారు. ఎంతమంది తీసుకుంటారో చూస్తాము. కానీ ఢిల్లీ నంబరువన్ వెళ్ళవలసిందే, అంతే కదా! వెళ్తాము కాదు, వెళ్ళవలసిందే. సరిగ్గా చెప్పినట్లయితే చేతులెత్తండి. వెళ్ళవలసిందే, చూస్తాములే, ఆలోచిస్తాములే, ఈ లే, లే అనేవాళ్ళు కాదు కదా? సాహసవంతులు. ఢిల్లీవారిలో ధైర్యం ఉంది కానీ సంగఠన రూపంలో ధైర్యాన్ని ప్రత్యక్షం చేసి చూపించండి. అందరి దృష్టి ఢిల్లీ వైపు వెళ్తుంది. మంచిది. సేవపై అభిరుచి ఉంది, ఇందుకు అభినందనలు. తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- విదేశీయులు వృద్ధి కూడా అవుతున్నారు మరియు మిగిలిన దేశాలలో కూడా ఉల్లాస ఉత్సాహాలతో పెరుగుతున్నారు. ప్రాక్టికల్‌గా దయాహృదయులుగా అయ్యి ఆత్మలపై దయ చూపిస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. సేవ ఉల్లాసము ఉంది మరియు సేవ యొక్క ప్రత్యక్ష రూపాన్ని కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు డబల్ తీవ్ర పురుషార్థం చేసి గోల్డెన్ కప్ విదేశీయులు తీసుకోండి. తీసుకోగలరు. అందరి నుండి ఓ.కె, ఓ.కె అని ఈ-మెయిల్ వస్తుంది, ఎక్కువ రాదు. చదవాల్సి వస్తుంది కదా మీకు. (దాదీ జానకి గారితో) కేవలం ఓ.కె. ఓ.కె వారికి బాబా కూడా గుప్తంగా ఎంతో స్నేహపు దీవెనల వర్షాన్ని కురిపిస్తారు. వాహ్! పిల్లలు వాహ్! అన్న పాటను పాడుతాము. అచ్ఛా.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయాన్ని మనసుకు యజమానులుగా అనుభవం చేసుకుని ఒక్క సెకండులో ఏకాగ్రం అవ్వగలరా? ఆర్డర్ చెయ్యగలరా? ఒక్క సెకండులో తమ స్వీట్ హోమ్‌లోకి చేరుకోండి. ఒక్క సెకండులో తమ రాజ్యానికి స్వర్గానికి చేరుకోండి. మనసు మీ ఆర్డర్‌ను పాటిస్తుందా లేక అలజడి చేస్తుందా? యజమాని యోగ్యంగా ఉంటే, శక్తివంతంగా ఉంటే, మనసు మాట వినకపోవడము అంటూ ఉండదు. ఒక్క సెకండులో అందరూ తమ స్వీట్ హోమ్‌లోకి చేరుకునే అభ్యాసాన్ని ఇప్పుడు చేయండి.
ఈ అభ్యాసము రోజంతా మధ్యమధ్యలో చేసేలా అటెన్షన్ ఉంచండి. మనసు ఏకాగ్రత స్వయాన్ని కూడా మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా చేస్తుంది. అచ్ఛా.
నలువైపుల ఉన్న అతి సర్వ స్నేహులు, సర్వులకు సహయోగి శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపుల ఉన్న విజయి పిల్లలకు, నలువైపుల ఉన్న పరివర్తన శక్తిశాలి పిల్లలకు, నలువైపుల ఉన్న సదా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకుని బాబాను కూడా ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా సమాధాన స్వరూపులైన విశ్వ పరివర్తక పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక దీవెనలను స్వీకరించండి. దానితోపాటు బాబాకు శిరోధార్యమైన పిల్లలందరికీ బాప్‌దాదా నమస్తే.
దాదీ జానకిగారు:- ఓం శాంతి. మీరు ఎంతో చక్కగా శాంతిగా బాబా ముందు కూర్చున్నారు. బాబా చెప్పిన ఒక్కొక్క మాటలో ఎంత శక్తి నిండి ఉంది! వండర్ఫుల్. ఒక్క నిమిషం శాంతిగా ఉన్నా దానివలన కలిగే లాభం ఎంతో ఉంటుంది. రోజంతటిలో కొద్ది సమయం శాంతిగా ఉండి స్వరూపం అవ్వడం మాకు నచ్చుతుంది. లోపల శాంతి, బయట వాతావరణంలో శాంతి నలువైపుల వ్యాపిస్తుంది. ఇంతమంది సోదరసోదరీలు ఇక్కడ క్లాసులో హాజరు అయి ఉన్నారు, మాకు బాగా అనిపిస్తుంది. ఈ బిడ్డ భావన ఏమిటి అన్నది బాబాకు తెలుసు. ఒక వైపు బాబా మరో వైపు భాగ్యము. బాబా నాతో ఉన్నారు, ఇదే తపన సదా ఉంటుంది. బాబాకు ఈ స్నేహితులందరూ చాలా మంచిగా అనిపిస్తారు. బాబా మావారు, మేము వారి స్నేహితులము అనగా వారి శ్రీమతము మనకు శిరోధార్యము కావున శిరస్సు ఎప్పుడూ భారీగా అవ్వదు, ఇదే భాగ్యము. బాబా ఎంతటి ప్రియమైనవారు, మధురమైనవారు.
క్రొత్త సంవత్సరం ఈరోజు రాత్రి నుండి ప్రారంభమవుతుంది కానీ ముందుగానే బాబా శక్తిని నింపారు. సాక్షిగా అయి ఉండేలా బాబా మాకు మంచి తోడు నిలిచారు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భాగ్యశాలివి అని బాబా చెప్పారు. సాక్షిగా అయి ఈ వండర్ఫుల్ పాత్రనంతా చూస్తున్నాము. బాబాకు మాపై ప్రత్యేకమైన దృష్టి ఉంది, ఇది కూడా మేము గర్వంగా భావిస్తాము. బాబా మా గురించి ఏమనుకుంటారోగానీ మాకు మంచి భాసనను ఇస్తుంటారు. బాబా ఎలా ఉన్నారో అలా మనల్ని తయారు చెయ్యడానికి సదా హాజరై ఉంటారు. బాబా మీవారిగా అవ్వడంలో ఇలాహీ ఉంది అన్న పాట ఉంది కదా. ఇలాహీ అంటే రెండు అర్థాలు - ఒకటి అల్లాహ్, రెండు కొలవలేనంత ఉంది అని అర్థం. లభిస్తూనే ఉంటుంది. సమయంపై ఇంత విలువ ఉంది. సత్యయుగంలోకి వచ్చేందుకు చేసే తయారీలు వేరు. ఇక్కడి నుండి వెళ్ళేందుకు ముందు తయారీలు చేసుకోవాలి. శాంతిధామం, పరంధామం, నిర్వాణధామానికి ముందు వెళ్ళాలి తర్వాత సత్యయుగంలోకి రావాలి, తర్వాత అక్కడ ఎలా ఉండాలి, ఎన్ని జన్మలు ఉంటాయి!
పిల్లలు నలువైపుల సత్యత మరియు ప్రేమలో ఆనందంగా ఉండటాన్ని బాబా చూస్తున్నారు. ఎటువంటి శబ్దము లేదు, చప్పుడు లేదు. చప్పట్లు కూడా కొట్టే అవసరం లేదు. చప్పట్లు కొడుతున్నారు, కొట్టండి. హ్యాపీ న్యూ ఇయర్, ఈ మాటలలోకి రావడం కూడా మాకు ఇష్టం లేదు. మాటలకు దూరంగా బాబా ఎక్కడకు లాగితే అక్కడకు వెళ్ళి హాజరై ఉంటాము బాబా ఎదురుగా. నవ యుగము, నవ సంవత్సరమునకు అభినందనలు ఈ మాట కూడా అందరి మనసుల నుండి స్వతహాగా వెలువడుతుంది. రేపు ఏమి జరుగుతుంది, నూతన సంవత్సరం వస్తుంది. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, బాబా మరియు పరివారం నన్ను ప్రేమిస్తారు, ఈ భావన వస్తుంది. కేవలం భావన కాదు భాసన కూడా లభిస్తుంది. అందరూ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. అచ్ఛా - ఓం శాంతి.