"ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానము ద్వారా నెగిటివ్‌ను పాజిటివ్‌కి పరివర్తన చేసి, సంకల్పము, శ్వాస, సమయమును సఫలం చేయండి. సఫలతామూర్తులుగా అవ్వండి"
31-12-2019 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్తమూర్తి తల్లిదండ్రి అయిన బాప్‌దాదాకు అతి గారాబాల పిల్లలు, సదా పరివర్తన శక్తి ద్వారా ప్రతి నెగిటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసేవారు, బాబా సమానంగా బ్రాహ్మణ సో ఫరిశ్తా స్వరూపంలో స్థితులయ్యే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతితో పాటు నూతన సంవత్సరం, నూతన యుగ ఆగమనానికి చాలా చాలా అభినందనలను స్వీకరించండి.
తర్వాత సమాచారము - రేపు నూతన సంవత్సరం 2020 ప్రారంభం కానుంది. పిల్లలూ, నూతన సంవత్సరంలో నవీనతతో కూడిన సేవను చేయండి తద్వారా సహజంగానే బాబా ప్రత్యక్షత జరగాలి అని ప్రియమైన బాబా అంటారు. ఒక వైపు జయజయకారాలు, మరో వైపు హాహాకారాలు ... ఇప్పుడైతే ఇటువంటి సమయమే సమీపంగా కనిపిస్తుంది. అవ్యక్త మాసంలో నలువైపుల విశేషంగా తపస్సు యొక్క అల చాలా బాగా ఉంది. అన్ని వైపుల యోగ తపస్సు భట్టీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అయ్యే పురుషార్థాన్ని లక్ష్యంగా పెట్టుకుని డబల్ లైట్‌గా ఉంటూ ఎగురుతూ ఎగరే కళలో ఉన్నారు. మధుబనం నుండి విశేషంగా పురుషార్థం కోసం పంపబడ్డ పాయింట్ల అనుసారంగా అందరూ మంచి రేస్‌ను చేస్తున్నారు. పిల్లలు ప్రతి సెకండ్, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకుని సఫలతామూర్తులుగా అవ్వాలన్నది బాబా ఆశ. అకస్మాత్తు అన్న పాఠాన్ని సదా స్మృతిలో పెట్టుకుని ఎవరెడీగా ఉండండి. అన్ని ఖజానాలతో నిండుగా అయ్యి సంపర్క సంబంధాలలో వచ్చే ఆత్మలకు దానం చేస్తూ, దాని మరియు వరదానిగా అవ్వండి. సదా చిరునవ్వుతో ఉంటూ అందరికీ ఏదో ఒక బహుమతిని ఇస్తూ ఉండండి.
చెప్పండి, ఇటువంటి లక్ష్యమే పెట్టుకుని తీవ్ర పురుషార్థం చేస్తున్నారు కదా! ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక నవీనత నిండిన పురుషార్ధము మరియు సేవలను చేయవలసిందే.
ఈ సీజన్లో బాప్‌దాదా యొక్క ఈ వరదాని భూమికి వచ్చి, వారి ఆకారి మరియు నిరాకారి రూపం నుండి పాలనను చాలామంది చాలా-చాలా బాగా అనుభవం చేసుకుంటున్నారు. ఇప్పుడైతే పంజాబ్ జోన్ వారి సేవ టర్న్. దేశవిదేశాల నుండి కూడా అనేక గ్రూపులు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి మధుబనానికి చేరుకున్నారు. షుమారు 20 వేలమంది సోదరసోదరీల సంగఠన ఉంది. డబల్ విదేశీయులైతే సదా ఉండనే ఉంటారు. చూడండి, మనందరి అతి మధురమైన, మనందరికీ స్నేహ పాలనను ఇచ్చేటువంటి దాదీ జానకిగారి 104వ జన్మ దినం కూడా రేపు జనవరి 1 నాడు ఎంతో ఆడంబరంగా జరుపుకోబోతున్నాము, ఎప్పటివరకైతే సంగమయుగం ఉంటుందో అప్పటివరకు దాదీగారు మనతో సదా ఉండాలని, ఇలాగే అందరికీ సదా గుణదానము, జ్ఞాన దానము చేస్తూ అందరికీ పాలన ఇస్తుండాలని, సదా ఆరోగ్యంగా ఉండాలని మనమందరం కోరుకుందాము. ఈ సమయంలో ముఖ్యమైన మన నలుగురు దాదీలు మన ఈ పూర్తి బ్రాహ్మణ పరివారానికి అలంకారము. మన మధురమైన దాదీ గుల్జార్ గారైతే సదా దాదీ జానకి గారితో కలిసి ప్రతి బ్రాహ్మణ ఆత్మ హృదయంలో ఉన్నారు. తర్వాత మన మధురమైన దాదీ రతన్మోహిని గారు మరియు ఈషూ దాదీగారు ఎప్పటికప్పుడు అందరినీ జ్ఞాన రత్నాలతో ఒడిని అలంకరిస్తారు, తమ వరదానిమూర్తి ద్వారా అందరికీ స్నేహ సంపన్న పాలనను ఇస్తున్నారు. దాదీలందరి తరఫున, పెద్దన్నయ్యల తరఫున అందరికీ నూతన సంవత్సరానికి ఉల్లాస ఉత్సాహాలు నిండిన చాలా-చాలా అభినందనలను స్వీకరించండి. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతి... ఓం శాంతి.
31-12-19 ఓం శాంతి “అవ్యక్త బాప్ దాదా” వీడియో ద్వారా రివైజ్ 31-12-08 మధువనం
ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానము ద్వారా నెగిటివ్‌ను పాజిటివ్‌కి పరివర్తన చేసి, సంకల్పము, శ్వాస, సమయమును సఫలం చేయండి. సఫలతామూర్తులుగా అవ్వండి
ఈరోజు నూతన జీవితాన్ని ఇచ్చే బాబా తమ నలువైపుల ఉన్న నూతన జీవితాన్ని ధారణ చేసుకున్నటువంటి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ నూతన జీవితము ఉన్నదే నూతన యుగమును తయారు చేయడానికి. మనుష్యులు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. మీరందరూ నూతన జీవితంతో ఉన్న పిల్లలు. మీరు ఆత్మలందరికీ అభినందనలు తెలపడంతో పాటు నూతన యుగము రానున్నదన్న శుభవార్తను కూడా తెలుపుతారు. పిల్లలైన మీ అందరికీ బాబా వారసత్వంగా గోల్డెన్ (బంగారు) ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రపంచంలో అనేక గోల్డెన్ బహుమతులు ఉండనే ఉన్నాయి. ఈ గోల్డెన్ ప్రపంచ బహుమతి అయితే మా జన్మ సిద్ధ అధికారము అన్న నషా మీ అందరికీ ఉంది కదా! ఈనాటి ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా కానీ, పెద్ద బహుమతి అయితే కిరీటము లేక సింహాసనమే కదా. కానీ మీ గోల్డెన్ ప్రపంచ బహుమతి ముందు అది ఏమైనా పెద్దదా? మా తండ్రి మాకు అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన నూతన యుగాన్ని బహుమతిగా ఇచ్చారు అని మీకు మనసులో సంతోషం ఉంది. నిశ్చయము ఉంది మరియు ఇది నిశ్చితము. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఈ అచంచల నిశ్చయము సదా స్మృతిలో ఉంటుందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడూ తగ్గుతుందా? జన్మ సిద్ధ అధికారము అన్నప్పుడు జన్మ సిద్ధ అధికారము ఎప్పుడూ చలించదు.
ఈరోజు మీరందరూ వేరు వేరు స్థానాల నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ నూతన సంవత్సరానికి ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారు? ఈ నూతన సంవత్సరంలో విశేషంగా ఏమి చెయ్యాలి? ఈ నూతన సంవత్సర విశేషత - బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావలసిందే. ఏ పురుషార్థం చేయవలసి వచ్చినా కానీ బాబా సమానంగా కావలసిందే అన్నది నిశ్చితము. చెప్పండి, అందరి మనసులలో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా! అవునా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా కావాలి అని బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అయితే బాబాయే కానీ పిల్లలు తండ్రికన్నా ఉన్నతులు. మరి బాబా సమానంగా కావాలన్న లక్ష్యాన్ని పూర్తి చెయ్యడానికి బాబాను ఫాలో చెయ్యవలసి ఉంటుంది. ఆలోచించండి, బాబా, బ్రహ్మా బాబా ఎలా సంపూర్ణమయ్యారు? వారి విశేషత ఏమిటి? సంపూర్ణతకు విశేషంగా ఏది ఆధారంగా నిలిచింది? బ్రహ్మా బాబా తమ ప్రతి సమయాన్ని సఫలం చేసారు. శ్వాస-శ్వాస, క్షణ క్షణము సఫలం చేసారు. మరి బాబా సమానంగా కావడానికి ఈ సంవత్సరము ఏ లక్ష్యాన్ని తీసుకుంటారు? సఫలం చేయాలి మరియు సఫలతామూర్తులుగా కావలసిందే. సఫలత మన మెడలో హారము. సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వము. మరి ఈ లక్ష్యముతో పరిశీలించుకోండి - సఫలతామూర్తులుగా అయి సమయము, శ్వాస, ఖజానా, శక్తులు, గుణాలు అన్నీ సఫలం చేసామా అని ప్రతి రోజూ స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకుంటారో 21 జన్మలకు దాని ఫలితము జమ అవుతుంది. తెలుసు కదా! ముందు కూడా వినిపించి ఉన్నాము - ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్య భాగ్యము పూర్తి సమయము ప్రాప్తిస్తుంది. శ్వాస సఫలం చేసుకుంటే 21 జన్మలు స్వస్థతతో ఉంటారు. ఎప్పుడూ ఏ విధంగానూ స్వస్థతలో లోటు ఉండదు. అలాగే ఏ ఖజానాలైతే జమ చేసుకుంటారో, అన్నిటికన్నా పెద్ద ఖజానా జ్ఞానము. జ్ఞానము అనగా తెలివి. మరి జ్ఞాన ఖజానాను సఫలం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు ఎంత తెలివైనవారిగా అవుతారంటే మీకు మంత్రుల నుండి సలహా తీసుకోవలసిన అవసరం రాదు. స్వయమే రాజ్యాన్ని అఖండంగా, అచలంగా నడిపిస్తారు. మీ రాజ్యంలో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నము, అఖండము, అచలము. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవడం వలన లభించే ఫలితము ఇది. ఒక్క జన్మ సఫలం చేసుకుని అనేక జన్మలు సఫలతలోని ఫలితాన్ని తింటారు. అలాగే ప్రాప్తించిన శక్తులను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సఫలం చేస్తే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వ శక్తులు ఉంటాయి. ఎప్పుడూ శక్తి తగ్గదు. ఏ శక్తిలోనూ లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలు దానం చేస్తే మీ అంతిమ జన్మ, 84 జన్మలలో మీ జడ చిత్రాలు చేసినప్పుడు అందులో అంతిమం వరకు మీ మహిమ ఏమని గాయనం చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఒక్కొక్కదాన్ని సఫలం చేసి అనేక జన్మలు ప్రాప్తికి అధికారులుగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏమి చెయ్యాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణం కూడా అసఫలం కాకూడదు. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయము ఒక చిన్నని జన్మ మరియు ఫలితము పొందే సమయము 21 జన్మలు, మరి ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే లక్ష్యము ఉందా? అందరికీ బాబా సమానంగా కావాలన్న లక్ష్యము ఉందా? కావాలి కాదు, కావలసిందే. కావలసిందే, అండర్లైన్. అచ్ఛా.
మరి ఈ సంవత్సరానికి లక్ష్యము తీసుకున్నారు, దీనితో పాటు తండ్రిని ఫాలో(అనుసరించుట) చేసే మంత్రము - సఫలం చేసి సఫలతామూర్తులుగా కావాలి అని కూడా తీసుకున్నారు. ఇందుకోసం బాప్‌దాదా పిల్లలకు ఎక్కువ కష్టాన్ని చేసే ఇబ్బంది కూడా ఇవ్వరు, చాలా సహజమైన విధి చెబుతారు, సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా కూడా బాబాకు ఈ సంకల్పము ఉండేదా అని ముందు పరిశీలించుకోండి. మాట మాట్లాడినప్పుడు పరిశీలించుకోండి, బాబా సమానంగా అవ్వాలి కదా. మరి సంకల్పము, మాట మరియు కర్మ, సంబంధ సంపర్కములలో బాబా ఇలా ఉండేవారా అని ముందు ఆలోచించండి, పరిశీలించుకోండి. అటువంటి స్వరూపంగానే కండి. బ్రహ్మా బాబాను ఫాలో చెయ్యండి. ఫాలో ఫాదర్ అని అయితే గాయనము ఉంది కదా! కొంతమంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలను చూపిస్తారు. ఎటువంటి ఆటలను చూపిస్తారో తెలుసా? ఫాలో చేయరు కానీ ఏమంటారు? అనుకోలేదు కానీ, అయిపోయింది. ముందు ఆలోచించి, కేవలం ఆలోచించడమే కాక దాని స్వరూపంలోకి రండి. ఒకవేళ స్వరూపంగా అయితే అనుకోలేదు కానీ అయిపోయింది అని అనరు. చేసేవారు, ఆలోచించేవారు శ్రేష్ఠ ఆత్మలు, యజమానులైన మీరు. అయిపోయింది అంటే కర్మేంద్రియాలపై కంట్రోల్ (నియంత్రణ) లేదు అని అర్థం.
మరి ఈ సంవత్సరంలో ఇదే స్లోగన్‌ను గుర్తుంచుకోండి - బాబా సమానంగా చేయవలసిందే, కావలసిందే. కష్టమైతే కాదు. కదా? బాబా ఎలా చేసారో అలాగే చెయ్యండి. కాపీ చెయ్యడమైతే సహజమే కదా. ఆలోచించే అవసరము కూడా లేదు. ఎలా అయితే బాబా, బ్రహ్మా బాబా ఫరిశ్తాగా అయ్యారో, అంటే మీరు కూడా ఫరిశ్తా సో దేవతలుగా కావాలన్నది నిశ్చితము. మీరు కూడా ఫరిశ్తా సో దేవతగా కావాలసిందే. కొంతమంది పిల్లలు అంటారు. నడుస్తూ నడుస్తూ చాలా అపోజిషన్(విరుద్ధము) వస్తుంది అని, మరి అపోజిషన్‌కు కారణము పొజిషన్ నుండి కిందకు దిగడమే. కానీ గుర్తు తెచ్చుకోండి, బాబా సమానంగా కావాలంటే స్థాపన ఆదిలో బ్రహ్మా బాబా ఎన్ని అపోజిషన్లను పొజిషన్లలోకి మార్చారు? ప్రతి విషయము క్రొత్తది, ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడైతే కాలమెంతో మారిపోయింది. కానీ ఒంటరిగా బ్రహ్మా బాబా ఎంతగా స్వమానము అనే సీట్‌పై కూర్చుని పొజిషన్ ద్వారా అపోజిషన్‌ను ఎదుర్కొన్నారు! ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చెయ్యలేదు. ముందు ఏమనేవారు? ధమాల్ చేస్తున్నారు అని, మరి ఇప్పుడు ఏమని అంటున్నారు? కమాల్ చేస్తున్నారు. ఇంత తేడా వచ్చింది. కారణము ఏమిటి? బ్రహ్మా బాబా స్వయము స్వమానము అనే సీట్ మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా అపోజిషన్‌ను సమాప్తం చేసారు. మరి మీరు ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? సమానంగా కావాలి కదా, మరి సదా ఒకవేళ అపోజిషన్ ఉన్నప్పటికీ స్వమానము అనే సీట్‌పై కూర్చుండిపోండి అప్పుడు అపోజిషన్, పొజిషన్లోకి మారిపోతుంది. ధైర్యముందా? బ్రహ్మా బాబా సమానంగా కావలసిందే, ఇందులో అయితే చేతులెత్తారు, కానీ ఇంత ధైర్యముందా? ముందు స్వ పరివర్తన, తర్వాత అనేక సంబంధ సంపర్క ఆత్మలు, ఆ తర్వాత విశ్వ ఆత్మలు. వీరందరినీ తమ మనసా శుభ భావన, శుభ కామన ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చెయ్యండి.
మరి ఈ సంవత్సరంలో బాప్‌దాదా విశేషంగా ఒక శక్తి యొక్క వరదానాన్ని కూడా ఇస్తున్నారు. నా బాబా అని మనస్ఫూర్తిగా అంటే శక్తి హాజరు, ఊరికే నా బాబా అని కాదు, మనస్ఫూర్తిగా అంటే, అధికారము ఉంచితే, నా బాబా అనగానే శక్తి మీ ఎదుట హాజరు అయిపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తితో విశేషంగా నెగిటివ్‌ను పాజిటివ్‌కి మార్చండి. నెగిటివ్ సంకల్పము, నెగిటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్ లోకి మార్చండి. పాజిటివ్ చూడటం, మాట్లాడటం, చెయ్యడం కేవలం శుభ భావన, శుభ కామనల ద్వారానే సహజమవుతుంది ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. మరి అర్థమయిందా, ఈ సంవత్సరపు విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. పరివర్తన చెయ్యగలరు కదా? మీ ఛాలెంజ్ ఉంది, గుర్తుంది కదా! విశ్వ పరివర్తకులు కదా! విశ్వ పరివర్తకులు అన్న టైటిలే ఉన్నప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడము కష్టమా! మనసులో ఎటువంటి కష్టము వచ్చినా, నిజానికి కష్టము అనేది ఏదీ ఉండదు కానీ మీరు చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తిమంతులకు కష్టమా? కానీ మీరు ఒక పొరపాటు చేస్తారు, కష్టంగా చేసేసుకుంటారు. ఎలా అయితే ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారమైపోతే ఎవరైనా పొరపాటున అంధకారాన్ని పారద్రోలాలని చూస్తే అంధకారము పోతుందా? సరైన విధి ఏమిటంటే మీరు ప్రకాశమును ఇచ్చే స్విచ్ ఆన్ చేస్తే అంధకారం సెకండులో పారిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు, ఏ విషయమైతే అయిపోయిందో, దానికి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా.... ఈ క్యూ లో వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు, అప్పుడు పెద్ద విషయము కష్టంగానే అనిపిస్తుంది కదా. చిన్న విషయముగా చేసుకోండి అప్పుడు సహజమవుతుంది. ఏ శక్తినయినా కార్యంలో వినియోగించడానికి బాబా సహజమైన విధి చెప్పారు నేను మాస్టర్ సర్వశక్తిమంతుడను అన్న మీ స్వమానపు సీట్‌పై కూర్చోండి, ఒకవేళ ఈ సీట్‌పై కూర్చుంటే అప్సెట్ అవ్వరు. సీట్ లేకపోతే అప్సెట్ అవుతారు, సీట్ ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. 63 జన్మలు ఎలా ఉన్నాయి? ఒకసారి సెట్, ఒకసారి అప్సెట్. కావున సదా స్వమానము అను సీటిపై సెట్ అయి ఉండండి. ఇంకా ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? నూతన సంవత్సరంలో బహుమతినైతే అందరికీ ఇస్తారు. కదా. మరి ఏ బహుమతిని ఇస్తారు? అభినందనలతోపాటు ఏ బహుమతిని ఇస్తారు? మీ వద్ద అయితే బహుమతులు చాలానే ఉన్నాయి. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వగలరు. స్థూలమైన బహుమతులైతే అల్పకాలం వరకే ఉంటాయి, కానీ అవినాశీ బాబా సమానంగా అయ్యే మీరు అవినాశి బహుమతిని ఇవ్వండి. మనసు ద్వారా శక్తుల బహుమతిని ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానాన్ని బహుమతిగా ఇవ్వండి మరియు కర్మణ ద్వారా గుణాలను బహుమతిగా ఇవ్వండి. ఉన్నాయి కదా అందరి దగ్గర? ఉంటే తల ఊపండి. ఖజానాలు చాలా ఉన్నాయి, తక్కువైతే లేవు కదా. ఎవరితో అయినా కార్యంలోకి రండి, కార్యంలోకి రావలసి ఉంటుంది కదా. వారికి ఈ సంవత్సరం బాగా బహుమతులను ఇవ్వండి. కానీ అవినాశి బహుమతులు. వినిపించాము కదా, ఎవ్వరినీ ఖాళీగా పోనివ్వద్దు. మనసా బహుమతిని ఇవ్వండి, లేక వాణి, కర్మణ ఏదైనా కావచ్చు. ఇందుకోసం మీరు సదా ఒక అటెన్షన్‌ను పెట్టవలసి ఉంటుంది, ప్రతి సమయము మనసులో శక్తుల స్టాక్‌ను ఇమర్జ్ చేసుకుని పెట్టుకోవాలి, ఎన్ని శక్తులున్నాయి? లిస్ట్ అయితే ఉంది కదా! వాచ కారణంగా సదా మనసులో మనన శక్తి, జ్ఞానాన్ని మననం చేసే శక్తి, స్మృతిలో పెట్టుకోవలసి వస్తుంది. నడవడికలో, ముఖంలో, కర్మలో గుణ స్వరూపులుగా కావాలి. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవలసి ఉంటుంది. అంతే కానీ శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానము ఉంది కదా... అని అనకండి. కానీ స్వరూపంగా కావాలి. ప్రతి ఒక్కరినీ ఈశ్వరీయ పరివారము యొక్క దృష్టి, వృత్తితో చూడాలి. ఈ సంవత్సరం సమానంగా కావలసిందే అన్నప్పుడు అందులో అయితే చేతులెత్తారు, బాప్‌దాదా వతనంలో అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడ ఈ చిన్న టి.వి ఉండదు, చాలా పెద్దది. ఒక్క సెకండ్లో అన్ని సెంటర్ల రిజల్ట్‌ను చూడవచ్చు. మరి బాబా సమానంగా కావాలన్న మీ ఉత్సాహాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అదృష్టవంతులు, సంతోషపు ముఖాన్ని కలిగినవారు, ఎప్పుడూ ఆవేశపు ముఖాన్ని పెట్టుకోకండి. ఎవరు మిమ్మల్ని చూసినా కానీ మీ ముఖము సదా సంతోషంగా కనిపించాలి, మీరు ఎంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటును సరిదిద్దుతున్నా, అర్థం చేయిస్తున్నా కానీ ఆవేశముతో ఉన్న ముఖము, మాటలు ఉండకూడదు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తనను తీసుకురండి. బహుమతి ఇస్తాము. పూర్తి సంవత్సరంలో ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో, ఎటువంటి విషయము వచ్చినా కానీ, కొంతమంది సోదరసోదరీలు అంటారు, అందరూ ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఏమంటారంటే ఆవేశంతో చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారనే మారరు అని. మీరు ముందుగానే వీరు మారరు అన్న భావన పెట్టుకున్నప్పుడు మీ వైబ్రేషన్ ముందుగానే చేరుకుంది. కావున ఈ సంవత్సరంలో క్రోధానికి, దాని సంతానానికి వీడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశము కూడా వద్దు. బాబా ప్రశ్నిస్తున్నారు సమయ ప్రతి సమయము ఎవరైతే పని కావడానికి, బాగు చెయ్యడానికి క్రోధము చేస్తున్నారో, అక్కడ బాగవుతుందా? క్రోధం వలన ఎవరైనా మారారా? ఆ లిస్ట్ చూపించండి. మరింత విసుగు చెందుతారు, బాగుపడరు. మనసులో అపోజిషన్ చేస్తారు. ఒకవేళ పెద్దవారైతే మనసులో అపోజిషన్ జరుగుతుంది, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడుస్తారు. మరి ఈ సంవత్సరం ఏమేమి చెయ్యాలి అని అన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారా?
ఇప్పుడు చేతులెత్తండి. చేస్తారా? టి.వి. వారు ఈ ఫోటోను తియ్యండి. చేతులెత్తండి. కొంచెం ఎత్తి ఉంచండి. టి.వి. వారు తీస్తున్నారు. బాప్‌దాదా, ఏ విషయాలైతే వినిపించారో, ఈ సంవత్సరంలో చెయ్యాలి. అచ్ఛా.
చాలా పని ఇచ్చేసాము కదా కానీ బాప్‌దాదా మీకు తోడుగా ఉన్నారు, ఎక్కడ కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా బాబా, నా బాబా, నా తోడు రండి, సహాయం చేయండి అని అనండి. అప్పుడు బాబా కూడా బంధింపబడి ఉంటారు. మనసుతో అనాలి. ఎందుకంటే సమయాన్ని, స్వయాన్ని రెండింటినీ చూడాలి. సమయం ఛాలెంజ్ చేస్తుంది, మీరు మాయను ఏమి చేస్తావు అని ఛాలెంజ్ చేయండి.
మరి సమయ ప్రమాణంగా ఇప్పుడు సమయపు వేగము తీవ్రంగా ఉండటం బాప్‌దాదా చూసారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపు, భక్తుల పిలుపు, సమయపు పిలుపును పిల్లలు తక్కువగా వినడం బాప్‌దాదా చూసారు. పాపం ధైర్యహీనులు, వారికి రెక్కలను ఇస్తే కదా ఎగిరేది. ధైర్యము అనే రెక్కలు, ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలను ఇవ్వండి. అచ్ఛా.
సేవ టర్న్ పంజాబ్ జోన్ వారిది:- బాప్‌దాదాకు పంజాబ్‌పై విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని ప్రేమ ఉంది? జమ్నూ కశ్మీర్ కూడా తమదిగా చేసుకున్నారు కానీ ఇంకా కొంచెం, జమ్మూ కశ్మీర్ పేరు ప్రఖ్యాతి చెందింది, పాకిస్థాన్‌లో అయినా అమెరికాలో అయినా... అందరి దృష్టి జమ్మూ కశ్మీర్‌పై ఉంది. అక్కడ ఏదైనా జల్వా చూపించండి. అక్కడి అక్కయ్యలే చేయాలని లేదు, మీరు సహయోగం చేసి అందులో ఏదైనా అద్భుతమైన విషయం చేసి చూపించండి. కొద్దిగా అటెన్షన్ పెట్టండి పేరు ప్రఖ్యాతి వచ్చేస్తుంది. ఎక్కడ గొడవ ఉందో అక్కడ శాంతి జెండాను ఎగురవేయండి. సరేనా. సంఖ్య ఎక్కువ ఉంది. ఒకటి నిర్విఘ్నంగా అవ్వండి; రెండు, సేవలో శాంతి జెండాను ఎగురవేయండి. ఈ జెండా అందరికీ కనిపించాలి, అవును, అశాంతి స్థానంలో శాంతి జెండా ఎగురుతుందని అందరికీ కనిపించాలి. సరేనా. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ తీవ్ర పురుషార్థీలు. ఇప్పుడు డబల్ విదేశీయులు కాదు, డబల్ తీవ్ర పురుషార్థీలు. డబల్ విదేశీయుల విశేషత ఏమిటంటే వారు ఎక్కువగా చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంటారు. మరి మీరందరూ పక్కాగా బాప్‌దాదా చేతిలో చేయి వేసారు కదా, అంటే తమ సహవాసిగా చేసుకోవడము, స్నేహితుడిగా చేసుకోవడము. లవ్లీ ఫ్రెండ్. మరి ఫ్రెండ్‌గా చేసుకున్నారా? స్నేహ బంధం త్వరగా గుర్తుకు వస్తుంది, ఏ కష్టము వచ్చినా తండ్రికి చెప్పరు, స్నేహితునికి చెప్తారు. మీరు ఖుదాను తమ నేస్తంగా చేసుకున్నారు. అవును కదా, ఖుదా దోస్తు కదా. బాగుంది, బాప్‌దాదాకు విదేశీయులను చూసి సంతోషంగా ఉంటుంది ఎందుకని, కారణము ఏమిటి? బాబాకు ఉన్న ఒక పేరును వీరు ఋజువు చేసారు, విశ్వ పిత, విశ్వ కళ్యాణకారి. మొదట భారత కళ్యాణకారిగా ఉన్నారు కానీ విదేశీయులు బాబాకున్న విశ్వ కళ్యాణకారి పేరును ప్రత్యక్షం చేసారు. మొదట్లో విశ్వ సేవ కేవలం మనసు ద్వారానే చేసేవారు, ఇప్పుడు విశ్వంలోని అన్ని వైపుల సేవ చెయ్యడానికి నిమిత్తమయ్యారు. ఇంకా చూడండి, మూల మూలల నుండి తప్పిపోయిన వాహ్ వాహ్ పిల్లలు ఎంత మంది వెలువడ్డారో! మేము ప్రతి కల్పానికి సహవాసులము అని మీకు నషా ఉంది. ఉండేవారు, ఉన్నారు. మరియు ఉంటారు కూడా. అవును కదా. నషా ఉంది కదా! చూడండి, మీరు మూల మూలన ఉన్నప్పటికీ బాబా దృష్టి మిమ్మల్ని గుర్తించింది. బాబా కూడా గుర్తించారు, మీరు కూడా గుర్తించారు. ప్రజలు పాపం వస్తారు, వస్తారు, వస్తారు అని అంటుంటారు. మరి మీరేమంటారు? వచ్చేసారు. పాట పాడుతారు కదా, నా బాబా వచ్చేసారు అని. చాలా బాగుంది, అందరికీ బాబా హృదయపూర్వక ప్రేమను, ప్రియస్మృతులను, హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు.
నలువైపుల ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్‌దాదా ఇచ్చిన హోమ్‌వర్కును ప్రాక్టికల్‌లో చేసి ఋజువును ఇచ్చే సుపుత్రులుగా తమ ప్రభావాన్ని చూపిస్తారు. నలువైపుల ఉన్న పిల్లలకు చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వకంగా పదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన, శ్రేష్ఠ పిల్లలకు బాప్‌దాదా నమస్తే.
దాదీ జానకిగారు:- వండర్ఫుల్ బాబా, నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, ధన్యవాదాలు బాబా. రేపు క్రొత్త సంవత్సరం ప్రారంభం అయిపోతుంది. క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలి? పాత విషయాలు సమాప్తము. మనమంతా సదా సంతోషంగా ఉండాలి, సమృద్ధితో ఉండాలి, పాత విషయాలను మర్చిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు బాప్‌దాదా ఏదైతే ఇంత మంచి హోమ్‌వర్కును ఇచ్చారో మనమంతా ఇది చేసి చూపించాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే నూతన సంవత్సరానికి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఓం శాంతి.
*** ఓంశాంతి ***
