"నాలుగు సబ్జెక్ట్‌లలోనూ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క ఆథారిటీని కార్యంలోకి తీసుకురండి"
15-12-2019 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా శ్రేష్ఠ స్వమానంలో స్థితి అయ్యి అనుభవీ స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకువచ్చే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము ఈసారి బాప్‌దాదా టర్న్ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మరియు ఈస్టర్న్ జోన్ నుండి సోదరసోదరీమణులు ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు. సేవ యొక్క పాత్ర రాజస్థాన్ సోదరసోదరీలకు లభించింది. బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని మహిమ చేస్తారు. పిల్లలు, బ్రాహ్మణులైన మీరు పూర్తి విశ్వంలోనే విశేష ఆత్మలు, మీరు గుప్త రూపంలో వచ్చిన భగవంతుడిని గుర్తించారు, వారి దివ్య శక్తులను అనుభవం చేసుకుంటున్నారు అని బాబా అంటారు. డ్రామా అనుసారంగా బాప్‌దాదా యొక్క ఈ అలౌకిక, అతీతమైన మరియు ప్రియమైన మిలనము కూడా అందరినీ చాలా ఆకర్షితం చేస్తుంది. కొత్తవారు, పాతవారు అందరూ వేల సంఖ్యలో తమ మధుబన ఇంటికి చేరుకున్నారు. దాదీ జానకిగారు రోజూ సాయంకాలం విశేషంగా యోగం మరియు క్లాస్ చేయిస్తూ అందరినీ కలుస్తున్నారు. పెద్దన్నయ్యలు మరియు పెద్దక్కయ్యల లోతైన ధారణాయుక్త క్లాసులు కూడా అందరికీ లభించాయి. అందరూ ఎంతో బాగా రిఫ్రెష్ అయ్యి వెళ్తున్నారు. బాప్‌దాదా అవతరణ దివసము నాడు మధుబన వాయుమండలం కూడా విశేష ఆకర్షణ కలిగినదిగా ఉంటుంది. అందరూ అమృతవేళ నుండే ప్రియమైన బాప్‌దాదాను ఆహ్వానిస్తూ, అవ్యక్త వతనపు షికారును చేస్తుంటారు. మేమైతే అవ్యక్త బాప్‌దాదాతో మిలనం జరుపుకోవలసిందే అన్న లగ్నము అందరిలో ఉంటుంది. బాప్‌దాదా పిల్లల ప్రతి ఆశను పూర్తి చేస్తారు. అందరికీ ఎంతో సుందరమైన అనుభవాలు కూడా అవుతున్నాయి. ఇంత పెద్ద సంగఠనలో కూడా ఏకాగ్రతతో ఉండి ప్రతి ఒక్కరూ కొత్త కొత్త అనుభూతులను చేసుకుంటున్నారు. ఎంతో శాంతిపూర్వక, సంతోషమయ వాతావరణం ఉంటుంది. మీరందరూ కూడా మీ మీ గ్రూప్‌లో వచ్చి బాగా రిఫ్రెష్ అవుతారు. కూడా. అచ్ఛా - అందరికీ చాలా చాలా స్మృతి... ఓం శాంతి.
15-12-19 వీడియో ద్వారా రివైజ్ 30-01-10 మధువనం
నాలుగు సబ్జెక్ట్‌లలోనూ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క ఆథారిటీని కార్యంలోకి తీసుకురండి
ఈరోజు బ్రాహ్మణ ప్రపంచానికి రచయిత అయిన బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచంలోనే విశేషమైన ఆత్మలు. కోట్లలో కొద్దిమంది, ఎందుకంటే సాధారణ తనువులో వచ్చిన తండ్రిని గుర్తించారు. బాప్‌దాదా కూడా హృదయంలో ఇమిడిపోయే పిల్లలకు హృదయపూర్వకంగా హృదయ ప్రేమను ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము తండ్రికి ప్రియులుగా, హృదయంలో తండ్రిని నింపుకున్నవారిగా అనుభవం చేసుకుంటున్నారు కదా! బాబాకైతే పిల్లలందరూ ఎంతో ప్రియమైనవారు, సర్వులకు ప్రియులు. మేము యోగి జీవితాన్ని గడుపుతున్నాము అని పిల్లలైన మీరందరూ సర్వాత్మల ముందు ఛాలెంజ్ చేసారు. కేవలం యోగం చేసేవారు కాదు, యోగి జీవితాన్ని గడుపుతున్నవారు. జీవితమంటే రెండు నాలుగు గంటలకు మాత్రమే ఉండేది కాదు. జీవితమంటే అది సదాకాలం ఉండేది. కనుక నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ యోగి జీవితాన్ని గడిపే నిరంతర యోగులు. యోగంలో కూర్చున్నా. కర్మను చేస్తున్నాకానీ కర్మయోగులు. జీవిత లక్ష్యమే సదా యోగి. మరి ఈ విధమైన యోగి జీవితాన్ని, నేచురల్ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏమి చూసారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానధారి, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడ స్వమానము ఉంటుందో అక్కడ దేహ భానము రాలేదు. ఆది నుండి అంతిమం వరకు, ఇప్పటి వరకు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ భిన్న భిన్న స్వమానాలను ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడైనా స్వమానాలను గుర్తు తెచ్చుకుని ఒక్కొక్క స్వమాన మాలను త్రిప్పినట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయి స్వమానంలో లవ్లీనమైపోతారు. కానీ బాప్‌దాదాకు పిల్లల్లోని ఒక్క విషయం ఇప్పటికీ నచ్చడం లేదు. అది ఏమిటో తెలుసా? స్వమానంలో స్థితి కావడం అప్పుడప్పుడు మాకు కష్టమవుతుంది, స్థితి అవ్వాలని ఉంటుంది కానీ కష్టమవుతుంది అని పిల్లలు అంటారు. సర్వశక్తిమంతుడైన తండ్రి పిల్లల కష్టాన్ని చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ఎక్కడ కష్టముంటుందో అక్కడ ప్రేమలో లోపం ఉందని అర్థం.
ఈరోజు అమృతవేళ బాప్‌దాదా నలువైపుల ఉన్న బ్రాహ్మణుల వద్దకు, దేశము మరియు విదేశాలలో చుట్టి వచ్చారు, అక్కడ ఏమి చూసారు? కొంత మంది పిల్లలు స్వమానంలో కూర్చుని ఉన్నారు. నేను బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిని అని ఆలోచిస్తూ ఉన్నారు, స్వమానంలో స్థితులవ్వడానికి పురుషార్థం కూడా చేస్తున్నారు కానీ ఏ లోపము చూసాము? స్వమానం గుర్తుంది, దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ స్వమాన స్వరూపులుగా అయి, అనుభవీమూర్తులుగా అయి అనుభవం యొక్క అథారిటీగా అవ్వడంలోనే లోపం కనపించింది ఎందుకంటే అథారిటీలు అనేకమున్నాయి కానీ అన్నిటికన్నా పెద్ద అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. ఈ స్వమానాల అనుభూతిని ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. అయితే కష్టపడుతున్నారు కానీ అనుభవీ స్వరూపులుగా అవ్వడంలేదు. మరి బాప్‌దాదా ఏమి చూసారంటే కూర్చుంటారు, ఆలోచిస్తున్నారు కూడా కానీ కొద్దిమంది మాత్రమే అనుభవీ స్వరూపులుగా అవుతున్నారు. అనుభవంలో ఏ విధమైన దేహాభిమానము కొంచం కూడా తనవైపుకు ఆకర్షితం చెయ్యలేదు. కనుక, అనుభవీ స్వరూపులుగా అవ్వడం, కర్మ చేస్తూ కూడా కర్మయోగి యొక్క అనుభవీ స్వరూపంలో మునిగిపోవడం, ఇందులో ఇప్పుడు మరింత ఆవశ్యకత ఉంది. స్వరూపంలోకి వచ్చేయాలి. ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్ట్‌లో అనుభవీ స్వరూపులుగా కావాలి. జ్ఞానం, యోగం, ధారణ, సేవ, నాలుగు సబ్జెక్ట్‌లలోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. అనుభవీని మాయ కూడా కదిలించలేదు అందుకే బాప్‌దాదా ఈరోజు పిల్లలందరినీ అనుభవీ స్వరూపులుగా చూడాలని ఆశిస్తున్నారు. వినడం మరియు ఆలోచించడంలో తేడా ఉంది. అనుభవీ స్వరూపులుగా కావాలి, ఏదైతే అనుకుంటారో, ఏ స్వమానంలో స్థితి అవ్వాలనుకుంటారో ఆ అనుభవ స్వరూపంలో స్థితులవ్వగలగాలి. అనుభవాన్ని ఎవ్వరూ కదిలించలేరు ఎందుకంటే స్వమానము మరియు దేహభానము. ఎక్కడ స్వమాన స్వరూపము ఉంటుందో, స్వమాన అనుభవంలో స్థితులై ఉంటారో అక్కడ దేహ భానము రాలేదు. ఎలాగంటే చూడండి, అంధకారం ఉందనుకోండి, లైట్ యొక్క స్విచ్‌ను మీరు ఆన్ చెయ్యగానే అంధకారం ఆటోమేటిక్‌గా మాయమైపోతుంది. అంధకారాన్ని తొలగించడానికి, అంధకారాన్ని పారద్రోలడానికి శ్రమించనవసరం లేదు. అలాగే స్వమానమనే సీట్‌పై అనుభవం అనే స్విచ్ ఆన్ అయి ఉన్నట్లయితే ఏ విధమైన దేహ భానము రాదు. భిన్న భిన్న ప్రకారాల దేహ భానాలు ఉన్నాయి మరియు భిన్న భిన్న ప్రకారాల స్వమానాలను బాబా ఇచ్చి ఉన్నారు. స్వమానాలు తెలుసు, పురుషార్థం కూడా చేస్తున్నారు కానీ అనుభవం కోసం పురుషార్థం చెయ్యడంలో మరియు అనుభవీ స్వరూపులుగా అవ్వడంలో తేడా ఉంది అందుకే కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సమయానుసారంగా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని సంపన్నం చేసే సమయంలో పిల్లలు కష్టపడటం బాబాకు నచ్చడంలేదు. నేను కర్మయోగి జీవితం ఉన్నవాడినా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. జీవతమనేది నేచురల్, సదాకాలం కోసం ఉండేది, అప్పుడప్పుడు ఉండేది కాదు. ఇటువంటి అనుభవీ స్వరూపులుగా అవ్వండి. యోగి జీవితం, అనుభవీమూర్తులుగా అవ్వాలన్న లక్ష్యం సంపన్నమవుతుందా? మస్తకంపై మెరుస్తున్న ప్రకాశం సదా స్వయానికీ అనుభవం కావాలి. స్వయం ఆ స్వరూపంలో స్థితులవ్వాలి, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి చేసేవారిగా కాదు, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేదా అన్నదానికి ప్రమాణము - ఎక్కడ స్మృతి యొక్క అనుభవీ స్వరూపము ఉంటుందో అక్కడ ప్రతి కార్యాన్ని చేస్తూ స్వయంలో సమర్థత అనుభవం అవుతుంది. భిన్న భిన్న కార్యాలు ఉండవచ్చు కానీ అనుభవ స్వరూపము యొక్క స్థితి భిన్న భిన్నంగా ఉండదు.
ఎందుకు కష్టవడుతున్నారు అని ఈ రోజు బాప్‌దాదా చూసారు. అనుభవీ స్వరూపంగా అయ్యేందులో నంబరువారీ పురుషార్థనుసారంగా ఉండటాన్ని చూసాము. బాప్‌దాదాకు పిల్లలందరిపై గాఢమైన ప్రేమ ఉంది. ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు కష్టపడటాన్ని చూడలేము. ఏ సబ్జెక్ట్‌లోనైనా కష్టపడాల్సి వస్తుందంటే, అప్పుడప్పుడు అన్న పదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అంటే అందుకు కారణం - అనుభవీ స్వరూపులుగా అవ్వడంలో లోటు. పురుషార్థీలే కానీ స్వరూపులుగా అవ్వలేదు. దేహాభిమానం దగ్గరకు రానంతగా ఒక్క క్షణంలో నాలుగు సబ్జెక్ట్‌లలోనూ తమ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. ప్రకాశం ముందు చీకటి నిలువనట్లుగా, అంధకారాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. అంధకారం ఉన్నచోట ప్రకాశం తక్కువగా అయినా ఉండి ఉండాలి లేక అసలు లేకైనా ఉండాలి, ఇది నేచురల్. కావున అన్నిటికన్నా అతి పెద్ద అథారిటీ అనుభవము అని గాయనం ఉంది. అనుభవాన్ని వేలాది మంది మార్చాలనుకున్నా మార్చలేరు. జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ, ఈ నాలుగింటిలో ఏ ఒక్క దానిలోనైనా కష్టంగా అనిపిస్తుందంటే తప్పకుండా అది అనుభవంలో లోపమే. సేవలో సఫలత, ధారణలో స్వభావ సంస్కారాల పరివర్తన, యోగంలో కూడా అచలంగా ఉండటము, యోగి జీవితాన్ని అనుభవం చెయ్యడంలో ఎక్కడ కష్టం ఉంటుందో లేక ఎక్కడ అప్పుడప్పుడు అని అంటారో, అంటే ఆ ఫలానా సబ్జెక్ట్‌లో మీరు అనుభవీమూర్తులుగా అవ్వలేదు అని అర్థము. అనుభవం అప్పుడప్పుడు ఉండదు, అది నేచురల్ నేచర్‌గా ఉంటుంది. కష్టపడటానికి కారణమేమిటో ఇప్పుడు విన్నారా? అనుభూతి అను సీట్‌పై సెట్ అయి ఏదో ఒక వరదాన స్వరూపంలో అనుభవీగా అయి అనుభవం చేసుకున్నప్పుడు కష్టమనిపిస్తుందా? నేచురల్‌గా అనుభవం అవుతుంది. అందుకే ఇప్పుడు సమయానుసారంగా అన్నీ అకస్మాత్తుగా జరుగనున్నాయి. ఏదీ చెప్పి జరగదు. గుంపులు గుంపులుగా ఒకే సమయంలో అనేకుల టికెట్ కట్ అవుతుంది. ఇటువంటి సమయంలో మీరు ఎవరెడీగా ఉన్నారా? పురుషార్థం చేస్తున్నాను అప్పుడు చెప్పరు కదా? ఎవరెడీ అంటే ఏ వరదానమునైనా, స్వమానాన్ని అయినా సంకల్పం చెయ్యగానే ఆ స్వరూపంలోకి వచ్చేయాలి. అందుకే బాప్‌దాదా ఈరోజు ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ వరదానమునైనా ఫలప్రదం చేసి వరదానం లేక స్వమాన స్వరూపం యొక్క అనుభవీగా అవ్వగలరా? అవ్వాల్సిందే. ప్రయత్నిస్తున్నాను, ఒకవేళ ప్రయత్నించాలనుకున్నా అది ఇప్పటినుండే చెయ్యండి ఎందుకంటే బహుకాలపు అభ్యాసము సమయానికి సహాయం చేస్తుంది. పురుషార్థీలు కాదు, అనుభవీలు ఎందుకంటే మీ అందరికీ అనుభవం యొక్క అథారిటీని ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. దేహభానం యొక్క అథారిటీ ఉంది కదా, ఫలానాను అని దేహ భానాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందా! మరి దేహ భానము ఇంతగా పక్కాగా అయిపోయింది. ఇలాగే దేహి అభిమాని, స్వమానధారి, స్వరాజ్య అధికారి- ఇవి కూడా ఇంత పక్కా అయిపోవాలి. మీరంటారు కదా, మా జీవితం పరివర్తన చెందింది అని, ఏ పరివర్తన తీసుకువచ్చారు? దేహ భానము నుండి స్వమానము, స్వరాజ్య అధికారులుగా అయ్యారు. మరి జ్ఞాన స్వరూపుడిగా అయ్యానా అని పరిశీలించుకోండి. లేక జ్ఞానం వింటూ వినిపించేవాడిగా అయ్యానా? జ్ఞానము అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ స్వరూపము. నాలెడ్జ్ ఈజ్ లైట్ (జ్ఞానము ప్రకాశమువంటిది), నాలెడ్జ్ ఈజ్ మైట్ (జ్ఞానము శక్తివంటిది) అని నాలెడ్జ్ గురించి అంటారు. కనుక జ్ఞాన స్వరూపులుగా అవ్వడమంటే ఏ కర్మ చేసినా వారు లైట్ మరియు మైట్తో ఉంటారు. ఉండటము. యథార్థంగా ఉంటారు. జ్ఞాన స్వరూపులుగా అవ్వడమంటే అర్థం ఇదే. జ్ఞానాన్ని వినిపించేవారిగా కాదు, జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి. యోగ స్వరూపము అనగా కర్మేంద్రియజీతులుగా అవ్వడము. ప్రతి కర్మేంద్రియంపై స్వరాజ్యాధికారము. దీనినే యోగము అనగా యుక్తియుక్త జీవితము అని అంటారు. ఈ విధంగా జ్ఞానయోగాల స్వరూపులుగా ఉన్నట్లయితే ప్రతి గుణ ధారణ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఎక్కడ జ్ఞానము, యోగము, యోగయుక్తము ఉంటాయో అక్కడ గుణాల ధారణ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సేవ ప్రతి సమయము ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సమయానుసారంగా మనసా సేవను చేసినా, వాచా, కర్మణ, స్నేహ సంబంధాలలో సేవ చేసినా కానీ సేవ అఖండంగా జరుగుతూనే ఉంటుంది. సంబంధ సంపర్కాలలో కూడా సేవ జరుగుతుంది. ఉదాహరణకు, మీ బ్రాహ్మణ పరివారంలో మీ సోదరి లేక సోదరుడు నిరాశతో ఉన్నారనుకోండి, పురుషార్థంలో కాస్త డల్‌గా ఉన్నారనుకోండి, ఏదైనా సంస్కారానికి వశమై ఉన్నారనుకోండి, ఇటువంటి సంపర్కంలో ఉన్న ఆత్మకు మీరు ఉల్లాస ఉత్సాహాన్ని ఇచ్చారు. సహయోగాన్ని అందించారు. స్నేహమును ఇచ్చారనుకోండి, సేవ యొక్క పుణ్యం మీకు జమ అవుతుంది. పడిపోయిన వారిని లేపడాన్ని పుణ్యమని అంటారు. కనుక, సంబంధ సంపర్కాలలో కూడా సేవ చెయ్యడమే సత్యమైన సేవాధారుల కర్తవ్యము. సేవ లభించినప్పుడు లేక సేవ ఇవ్వడం జరిగినప్పుడు అదే సేవ అని అనుకోకండి. స్వయం మనసా, వాచా, కర్మణ, సంబంధ సంపర్కాలలో సేవ ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండాలి. బాప్‌దాదా ఏమి చూసారంటే కొన్నిసార్లు సంపర్కంలో ఉన్నవారి స్వభావ సంస్కారము కొంచం ఉండాల్సిన విధంగా లేనప్పుడు, వీరింతే, వీరు మారరు, వీరి సేవ చెయ్యడం టైమ్ వేస్ట్ అని సంకల్పం చెయ్యడం - ఇది యథార్థమా? మేము ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేసేవారము అని మీరు స్వయం గురించి భావిస్తున్నప్పుడు, వీరైతే మనుష్యాత్మలు, బ్రాహ్మణుడు అని అనబడుతున్నారు, కానీ సంస్కారానికి వశమై ఉన్నారు. ప్రకృతి యొక్క సంస్కారాన్ని మారుస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు వీరైతే ప్రకృతితో చూస్తే పురుషుడు, ఆత్మ. మీ సంబంధంలో ఉన్నవారు. సత్యమైన సేవాధారి తమ సేవా పుణ్యాన్ని జమ చేసుకోవడానికి శుభ భావనను తప్పకుండా ఉంచుకుంటాడు. వీరింతే, వీరింక మారరు - దీనిని శుభ భావన అని అనరు, ఇది సూక్ష్మ ద్వేష భావము. ఎంతైనా మన సోదరి సోదరులు. నా బాబా అనైతే అంటున్నారు కదా! సత్యమైన సేవాధారులు శుభ భావనలు ఇచ్చే సేవలో కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. పడిపోయిన వారిని మరింత పడవేయకండి, లేపండి. సహయోగాన్ని ఇచ్చేవారినే సత్యమైన సేవాధారి, పుణ్యాత్మ అని అంటాము. ఇంతటి సేవా ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోండి. వీరినే అనుభవం యొక్క అథారిటీ ఉన్నవారు అనంటారు. ఇప్పుడు బాప్‌దాదా ఇదే ఆశిస్తున్నారు, అనుభవీమూర్తులుగా అవ్వండి, అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకురండి.
ఎవరైతే నాలుగు సబ్జెక్ట్‌లలోనూ స్వయాన్ని అనుభవీ స్వరూపులుగా చేసుకుని అనుభవం యొక్క అథారిటీని కార్యంలోకి తీసుకువస్తాము, ఉన్న లోపాలను సంపన్నం చేస్తాము, ఇంతగా స్వయంపై అటెన్షన్ పెడ్తాము అన్నవారు చేతులెత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా! శరీర చేతిని కాదు, మనసు యొక్క చేతిని ఎత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తండి ఎందుకంటే బాప్‌దాదా శివరాత్రికి రిజల్ట్‌ను చూస్తారు. ఎవ్వరి సంస్కార లోపము మీ మనసులోని శుభ భావనను తగ్గించకూడదు. వారి సంస్కారం ఢీలాగా ఉంది కానీ మీలోని శుభ భావనను తగ్గించేంత పవర్ఫుల్ అయితే వారున్నారు కదా. బ్రహ్మా బాబా ఏమేమి చూడలేదు, ఏమేమి చెయ్యలేదు, బాధ్యత ఉన్నప్పటికీ అంతిమంలో శుభ భావన, శుభ కామనలు మూడు మాటల శిక్షణను అందరికీ ఇచ్చి వెళ్ళారు. గుర్తుంది కదా! మూడు మాటలు గుర్తున్నాయి కదా! స్వయం కూడా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, ఈ స్థితిలోనే అవ్యక్తమయ్యారు, ఎవ్వరికీ కర్మభోగం యొక్క ఫీలింగ్‌ను తెప్పించలేదు, వారి కర్మభోగం సమాప్తమవుతుంది అని ఎవరికైనా అనిపించిందా! ఏమయింది! అవ్యక్తమైపోయారు. ఇటువంటి బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తా భవ అను వరదానమేదైతే బాబా చేసి చూపించారో, ఫాలో బ్రహ్మా తండ్రి. బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది, ఇప్పుడు కూడా సాకారంలో వారిని చూడకపోయినా కానీ అవ్యక్త బాబా రూపంలో కూడా అందరికీ స్నేహం ఇచ్చారు. బాప్‌దాదా ఇద్దరిపై ప్రేమ ఉండటాన్ని చూసాము. స్నేహం సబ్జెక్ట్‌లో మెజారిటీ అందరూ పాస్ అవ్వడాన్ని చూసాము. స్నేహము నడిపిస్తుంది. ధారణ చేయకపోయినా, ఏదైనా సబ్జెక్ట్‌లో లోపం ఉన్నా కాని స్నేహమనే సబ్జెక్ట్‌లో మెజారిటీ అందరూ పాస్ అయ్యారు. స్నేహము నడిపిస్తుంది. మీరందరూ ఎందుకు వచ్చారు? ఏ విమానంలో వచ్చారు? స్నేహ విమానంలో చేరుకున్నారు. బాప్‌దాదాకు తన చివరి పిల్లవాడిపై కూడా ప్రేమ ఉంది. ఎలాంటివారైనా కానీ ప్రేమలో పాస్ అయ్యారు ఎందుకంటే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై హృదయపూర్వక ప్రేమ ఉంది. ఎలా ఉన్నాకానీ నా వారు. నా బాబా అని మీరంటారు కదా, మరి బాబా ఏమంటారు? నా పిల్లలు. ఇటువంటి శుభ భావన పరివారంలో పరస్పరంలో ఉండటం అవసరము. స్వభావాన్ని చూడకండి. భావ స్వభావాలు ఉన్నాయని బాబాకు తెలుసు, కానీ భావ స్వభావాలు ప్రేమను సమాప్తం చెయ్యకూడదు. సంబంధాలను సమాప్తం చెయ్యకూడదు. కార్యాన్ని తక్కువ సఫలం చెయ్యడం సరైనది కాదు. ఇది పరివారము. ఏ పరివారము? ప్రభు పరివారము, పరమాత్మ పరివారము. ఏ కారణం చేతనైనా ఇందులో ప్రేమ తగ్గకూడదు. ఇలా ఉందా? ప్రేమలో లోటు ఉందా? ప్రేమ అనగా శుభ భావన తప్పక ఉండాలి. ఎలాంటి వారైనా కానీ, ఇది పరమాత్ముని పరివారము. నేను ప్రభు పరివారానికి చెందినవాడను అని భావించినప్పుడు, పరివారము అనగా ప్రేమ. ఒకవేళ పరివారంలో ప్రేమ లేకపోతే పరివారమే లేనట్లు. కనుక, ఈరోజు ఏ పాఠాన్ని చదువుకున్నారు? పక్కా చేసుకున్నారా? ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ భావము. ఈ పరమాత్మ పరివారము ఒక్క సమయంలోనే ఉంటుంది, ఇంత పెద్ద పరివారము పరమాత్మునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కావున పరిశీలించుకోండి ఎందుకంటే ఇది కూడా పురుషార్థంలో విఘ్నంగా అవుతుంది. విఘ్నముక్తులుగా అయినప్పుడే అనుభవీగా అయ్యి అనుభవం యొక్క అథారిటీ ద్వారా అందరినీ అనుభవీలుగా చేస్తారు. అచ్ఛా.
సేవ టర్న్ - రాజస్థాన్ వారిది:- అందరూ ఈ సేవా అవకాశాన్ని ఎంతో ఉల్లాస – ఉత్సాహాలతో తీసుకుంటారు, ప్రేమతో సేవ చేయడం మరియు చేయించడాన్ని బాప్‌దాదా చూసారు. ఈ 10-15 రోజుల సేవా పాత్ర భిన్న భిన్న సంపాదనలకు సాధనము. ఒక లాభమేమిటంటే సేవ యొక్క మేవగా ప్రతి ఒక్కరికీ పుణ్యం జమ అవుతుంది. మరో లాభము, ఇక్కడ మధువన జ్ఞాన వాతావరణము, పెద్ద పరివారం యొక్క స్నేహ వాతావరణము, ఇవి పురుషార్థంలో బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే వాతావరణం, వైబ్రేషన్లు మరియు జ్ఞాన స్నానము - వారు ఒక్కసారి తీర్థ స్థానాలకు వెళ్ళి స్నానాలు చేస్తేనే ఎంతో పుణ్యం జమ అయిందనుకుంటారు. మరి ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు జ్ఞాన స్నానము, జ్ఞాన వాక్యాలు చెవులలో పడుతూ ఉంటాయి. యోగి ఆత్మలు, ప్రభు ప్రేమ కలిగిన ఆత్మలకు ఆ వైబ్రేషన్లు కూడా ఆటోమేటిక్‌గా అందుతూ ఉంటాయి. ఏకాంత వాతావరణ నుండి లాభం చేకూరుతుంది. ఎవరైతే తమ పనులలో, చదువులో, తమ లాభాలలో స్వయాన్ని బిజీగా పెట్టుకుంటారో వారికి కొద్ది రోజుల్లోనే తమ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకునే అవకాశం లభిస్తుంది. అందుకే యజ్ఞ కార్యం కూడా జరుగుతుంది మరియు వచ్చేవారికి కూడా పుణ్యం జమ అవుతూ ఉంటుంది. బాప్‌దాదా ఏమి చూసారంటే ఈనాటి వాతావరణంలో సేవా ఉత్సాహము మెజారిటీ అన్ని జోన్లలోనూ ఉంది. రాజస్తాన్ కూడా అలాగే ముందుకు వెళ్తుంది. అచ్ఛా.
బాప్‌దాదా పిల్లలందరిలోని విశేషతలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సబ్జెక్ట్‌లో విశేషత దాగి ఉంది అందుకే బాప్‌దాదా ఇన్డివిడ్యువల్గా ఒక్కొక్కరిని కాబోయే విజయీ స్వరూపంలో చూస్తున్నారు ఎందుకంటే అందరినీ తోడుగా చేసుకుని నడవాల్సి ఉంటుంది. తోడుగా ఉన్నారు. తోడుగా నడుస్తారు. బ్రహ్మా బాబాతో పాటు రాజ్యం చేస్తారు. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలను చూసి బాప్‌దాదా సంతోషంతో వాహ్ పిల్లలు వాహ్! అన్న పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా ఉన్నారు మరియు బాబా హృదయంలో పిల్లలందరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని, మధువన నివాసులను చూసి వాహ్ మధువనం వాహ్! అన్న సంతోషం కూడా కలుగుతుంది. అందరి ఆశ్రయ స్థానం మధువనమే అందుకే మధువనానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు బాబా ఆశను త్వరత్వరగా పూర్తి చెయ్యాలి. నాలుగు సబ్జెక్ట్‌లలోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వాల్సిందే. బాప్‌దాదా దేశ విదేశాలలోని నలువైపుల ఉన్న పిల్లలు ఇక్కడ కూర్చున్నట్లుగా చూస్తున్నారు. అందరూ చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సాధనాలు, ఈ సైన్స్ ఈ సమయంలో ఉన్నతిలోకి వెళ్తున్నాయి, క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లు ప్రపంచంలో చేస్తున్నారు కానీ మీ లాభం కోసం అనేక మంచి మంచి సాధనాలను తయారు చేస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. కనుక ఈ సాధనాలను తయారు చేసినందుకు సైన్స్‌వారికి కూడా అభినందనలు. అచ్ఛా. పిల్లలందరికీ, దేశ విదేశాలలోని పిల్లలందరూ చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు స్మృతిని స్వీకరించండి మరియు విశేషంగా ఇటువంటి విశేషమైన పిల్లలకు నమస్తే.
దాదీ జానకి గారు:- ఓం శాంతి. చాలా బాగా జరిగింది. మనందరికీ దాదీ గుల్జార్ గారి ద్వారా బాబా యొక్క భాసన చక్కగా మనకు లభించింది. మనమందరమూ దాదీకి, మధురమైన బాబాకు ప్రేమతో ధన్యవాదాలు తెలుపుదాము. చాలా చాలా ఎక్యురేట్గా మన మనసుకు కావలసిన మాటలు, అవసరమైన మాటలు బాబా మనకు వినిపించారు. డ్రామా అనుసారంగా ఈ డ్రామా కూడా చాలా బాగా ఉంది అని మేము భావిస్తున్నాము. థాంక్యూ బాబా. ఈరోజు మనందరి మనసులలో ఈనాటి స్మృతులు ముద్ర వేసుకుపోయాయి.
ఇకపోతే, బాబా పిల్లలైన మనకు ఇచ్చిన వరదానాలు, మనందరికీ పరస్పరం ఇతరుల పట్ల శుభ భావన చాలా బాగుంది. మనమందరం భగవంతుని పిల్లలం భాగ్యశాలురం. మనమందరం సదా సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, మంచి మంచి మధురమైన మాటలను మనసులో పెట్టుకుని తమ దృష్టి వృత్తిని అలా చేసుకోవాలి. అచ్ఛా. ఓం శాంతి.
*** ఓంశాంతి ***
