‘‘ఇప్పుడు పరిస్థితులను చూడకుండా తీవ్ర పురుషార్థము చేసి బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. నిర్విఘ్నంగా మరియు ఎవరెడీగా అయ్యి 108 మాలను తయారు చెయ్యండి’’
ఓం శాంతి 05-12-20 మధుబన్
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా సర్వ శక్తుల ఖజానాతో సంపన్నులు, తీవ్ర పురుషార్థంలో రేస్ చేసేవారు, బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయి విజయ మాలలో త్రిప్పబడేటటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - మీరంతా దూరంగా కూర్చుని ఉన్నా కానీ అవ్యక్త బాప్‌దాదా నుండి దివ్య పాలనను అనుభవం చేసుకుంటూ ఉండవచ్చు! వర్తమాన సమయంలో నలువైపుల బాబా పిల్లలలో పురుషార్థపు అల చాలా బాగా జరుగుతుంది. బాప్‌దాదా పిల్లల తీవ్ర పురుషార్థపు రేస్‌ను చూసి సంతోషిస్తూ, సదా సఫలతా మూర్త భవ అనే వరదానాన్ని ఇస్తారు. బాబా అంటారు పిల్లలూ, ఇప్పుడు మీ స్వ యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకుంటూ విజయ మాలలోని పూసగా అవ్వండి. ఏ దృశ్యాన్ని చూసినా కానీ సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసాన్ని చేయండి. వ్యర్థం కొంచెం కూడా నామరూపాలు ఉండకూడదు. చెప్పండి, ఈ అటెన్షన్‌ను సదా పెట్టుకుని సంపన్నతకు సమీపతను అనుభవం చేసుకుంటున్నారు కదా!
చూడండి, ఈరోజు గుజరాత్ సోదరసోదరీలు తమ ప్రియమైన మధుబన్/శాంతివన్ ఇంటికి చేరుకున్నారు. అందరిలో ఎంతో ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నా, అందరికీ జ్ఞాన యోగాల చక్కని పాలన లభిస్తుంది. అలాగే అవ్యక్త బాప్‌దాదా కూడా పిల్లలను సర్వ ఖజానాలతో అలంకరిస్తున్నారు. మీరంతా వీడియో ద్వారా కూడా ఆ అవ్యక్త పాలనను మరియు భాసనను అనుభవం చేసుకొని ఉండవచ్చు. ప్రపంచపు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, బాబా పిల్లలైతే సదా సర్వశక్తిమంతుని తోడు పెట్టుకుని నిశ్చింత చక్రవర్తి యొక్క అనుభవం చేసుకుంటున్నారు. అచ్ఛా - అందరికీ స్మృతి ... ఓం శాంతి.
05-12-20 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” రివైజ్ వీడియో 15-11-11 మధుబన్
ఇప్పుడు పరిస్థితులను చూడకుండా తీవ్ర పురుషార్థము చేసి బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. నిర్విఘ్నంగా మరియు ఎవరెడీగా అయ్యి 108 మాలను తయారు చెయ్యండి
ఈరోజు సర్వశక్తిమంతుడైన బాబా, మాస్టర్ సర్వశక్తిమంతులైన తమ పిల్లలకు సర్వ శక్తుల ఖజానాను ఇవ్వడానికి వచ్చారు. సర్వ శక్తుల ఖజానా ఎంతో సహజంగా ప్రాప్తిస్తుంది. ఒక్క క్షణంలో నా బాబాను తెలుసుకున్నారు. బాబా వెంటనే నా పిల్లలు అని అన్నారు. ఇంతలోనే ఖజానాలకు యజమానులుగా అయిపోయారు. మరి పిల్లలందరి వద్ద సర్వ ఖజానాలు సదా తోడుగా ఉన్నాయి కదా! బాబా ఖజానాయే నా ఖజానా కూడా అన్న నషా ఉందా! ఇప్పుడు పరిశీలించుకోండి. బాబా అయితే పిల్లలందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు. ఒక్కటి కూడా తక్కువ చెయ్యలేదు కానీ ఆ సర్వ ఖజానాలు ప్రతి ఒక్కరి వద్ద సదా తోడుగా ఉంటున్నాయా లేక కొన్ని ఖజానాలు ఉండి, మరికొన్ని ఖజానాలు తక్కువగా ఉంటున్నాయా? బాప్‌దాదా అయితే ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కరి వద్ద సర్వ ఖజానాలు సదా తోడుగా ఉన్నాయా? సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగిస్తూ ఉన్నారా? యజమానిగా అయ్యి ఆర్డర్ చేసినప్పుడు ఆ సమయానికి ఆ ఖజానా అనుభవమవుతుందా? బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల సేవా ఉత్సాహాన్ని చూసారు కూడా, విన్నారు కూడా. ఇప్పుడిక పరివర్తన జరిగిపోయినట్లే అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. బాప్‌దాదా పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు మరియు ఏమని పాట పాడుతారు? వాహ్ పిల్లలు వాహ్! అంతేకాక బాప్‌దాదా ఇంకా ఏమి చూసారంటే ఎంతో ఉల్లాన ఉత్సాహాలతో ఛాలెంజ్ చెయ్యడంతోపాటు పిల్లల యొక్క స్వయంలోని సర్వ ధారణల సఫలత స్వరూపాన్ని కూడా చూసారు. మీ అందరికీ కూడా మీ సంపన్న మరియు సఫలత స్వరూపాలు తెలుసు ఎందుకంటే నిమిత్తమైన పిల్లలందరూ సదా సంపన్నంగా మరియు సఫలతామూర్తులుగా అయిపోయారా లేక ఇంకా తయారవ్వాలా? ఎందుకంటే సుఖమయ ప్రపంచానికి ఆధార స్వరూపము పిల్లలైన మీరే. బాప్‌దాదా పిల్లల రిజల్ట్‌ను చూసారు. ఆధారమూర్తులైన మీరు, కేవలం కొద్దిమంది పిల్లలు కాదు, పిల్లలందరూ సుఖమయ ప్రపంచానికి మేము నిమిత్తులము అని ఛాలెంజ్ చేసారు.
మరి బాప్‌దాదా పిల్లలందరినీ ప్రశ్నిస్తున్నారు - సుఖమయ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు నిమిత్తులైన పిల్లలు సంపూర్ణంగా, సంపన్నంగా, ఆధారమూర్తులుగా అయ్యారా? పిల్లలు ప్రతి ఒక్కరూ సఫలత మూర్తులుగా అవ్వాలని బాప్‌దాదాకు ఆశ ఉంది ఎందుకంటే మీరు బాబాను తోడుగా పెట్టుకుని సంకల్పం చేసారు, ఎంతో సంతోషంగా ఛాలెంజ్ కూడా చేసారు - ఇక పరివర్తన జరిగిపోయినట్లే అని. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, విశ్వ పరివర్తనకు నిమిత్తమైన పిల్లలు స్వ సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఎంత అయ్యారు? ఎందుకంటే రాజ్యం స్థాపన కావాలంటే ముందుగా రాజ్యానికి నిమిత్తంగా అయిన ఆత్మలు నిమిత్తమైతే ఆ తర్వాతే ఇతరులు నిమిత్తమవ్వగలరు. కానీ సంపూర్ణం అవ్వడంలో ఇంకా కొద్ది మార్జిన్ ఉండటాన్ని బాప్‌దాదా గమనించారు. సేవ అయితే చేస్తున్నారు కానీ సేవ రిజల్ట్‌లో మీ తోటివారిగా ఎంతమంది తయారయ్యారు? విన్నవారిలో ఎంతమంది సమీపంగా వస్తున్నారు అని లెక్క వేయండి. బాప్‌దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు సేవ రిజల్ట్‌లో మరింత తీవ్రతను తీసుకురావలసి ఉంది. ప్రతి సమయము ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకురావాలి. చాలా సంతోషిస్తారు. ఇప్పుడు బ్రహ్మా కుమారీల కర్తవ్యాన్ని గుర్తించడంలో చాలా సమీపంగా వచ్చారు కానీ బాప్‌దాదా ముందు కూడా ఒక విషయాన్ని చెప్పి ఉన్నారు - ఆత్మలకు వారసత్వము బాబా ద్వారానే లభించనుంది. కావున బాబాను తెలుసుకోవాలి, సమయాన్ని తెలుసుకోవాలి, స్వమానాన్ని తెలుసుకోవాలి అప్పుడు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు అని బుద్ధిలో వచ్చినప్పుడు వారసత్వాన్ని తీసుకుని రాజ్యాధికారులుగా అవుతారు.
మా బాబా వచ్చేసారు అన్న పాట ఏదైతే మీరు పాడుతున్నారో అది ఇప్పుడు నలువైపుల వ్యాపించాలి. ఇప్పుడు బాప్‌దాదా ఈ రిజల్ట్‌ను చూడాలనుకుంటున్నారు. పరివర్తన జరిగింది, సేవ వలన లాభం జరిగింది. కృషికి ఫలితం లభించింది కానీ ఇప్పుడింకా బాబా వద్దకు చేరుకోలేదు. దీనికోసం ఏదైనా ప్లాన్ వెయ్యండి. బాబా ప్రత్యక్షత ఎలా చెయ్యాలి? రాజధానిలో రాజ్యం చేసేవారు కూడా నిర్విఘ్నంగా అయ్యారా? ఇప్పుడు పరివర్తన అన్న బటన్‌ను డ్రామా ప్రెస్ చెయ్యవచ్చా (నొక్కవచ్చా), ఎవరెడీ? ఎవరెడీగా ఉన్నారా? బటన్ నొక్కవచ్చా? ఏమంటారు, బటన్ నొక్కచ్చా? ఎవరెడీగా ఉన్నారా? ఎందుకంటే అందరూ తయారుగా ఉండాలి. రాజ్యాధికారులు కూడా, రాయల్ ఫ్యామిలీ కూడా, రాయల్ ప్రజలు కూడా, సాధారణ ప్రజలైతే పెద్ద విషయమేమీ కాదు. మరి బాప్‌దాదా పిల్లలను ఈరోజు రిజల్ట్‌ను అడుగుతున్నారు. ఏమని భావిస్తున్నారు? బటన్ నొక్కడానికి బాప్‌దాదాకు ఎక్కువ సమయమేమీ పట్టదు. మరి మొదటి లైన్ వారు ఏమంటారు? శక్తులు ఏమంటారు? పాండవులు ఏమంటారు? జవాబు చెప్పండి. పాండవులు, జవాబు చెప్పండి. బటన్ నొక్కమంటారా? ఎవరెడీ? (బాబా మీరు యజమానులు, నొక్కాలి అని మీకు సంకల్పం వస్తే నొక్కండి). బాప్‌దాదా పిల్లల్ని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే బాబాకైతే రాజ్యంలోకి వచ్చేది లేదు కదా. బ్రహ్మా బాబా వస్తారు. (ఇక్కడ బాప్‌దాదాను కలుస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది) ఇది మంచిదే కానీ బాబా సమానంగా అయ్యి బాబా తోడులో జీవితాన్ని అనుభవం చెయ్యడం కూడా కావాలి కదా, అది ఉందా? తయారుగా ఉన్నారా? కేవలం మీరు కాదు, రాజధాని. మీరు ఎవరిపై రాజ్యం చేస్తారు? రాజధాని అయితే కావాలి కదా! (తోటివారు ఉన్నారు.) అందరూ తయారుగా ఉన్నారా? (పూర్తిగా తయారుగా ఉన్నారు) సంపన్నంగా అవ్వడంలో తయారుగా ఉన్నారా? అచ్ఛా, అందరూ ఆలోచిస్తున్నారు. ఏమీ ఫర్వాలేదు.
బాప్‌దాదాకు తెలుసు ఇప్పుడు రెడీగా ఉన్నారు, ఎవరెడీగా అవ్వవలసి ఉంది. బాప్‌దాదా రెండు విషయాలను చెప్పి ఉన్నారు కదా – సెకండ్లో ఫుల్స్టాప్ పెట్టగలిగే పిల్లలు కావాలి మరియు వ్యర్థ సంకల్పాల నామరూపాలు ఉండకూడదు. ఎవరికి సందేశమిచ్చినా వారు సందేశాన్ని విని పరివర్తన అవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాంలోకి రావాలి. ఇప్పుడు బాబా ఈ రిజల్ట్‌ను ఆశిస్తున్నారు. ఇందుకోసం బాప్‌దాదా పిల్లలకు సలహా ఇస్తున్నారు. ఆజ్ఞ కూడా చేస్తున్నారు - సేవ అయితే చేస్తున్నారు కానీ ఎవరి సేవ అయితే చేస్తున్నారో, ఒకే సమయంలో మూడు రూపాలలో మరియు మూడు రీతులతో సేవను చెయ్యండి. మూడు రూపాలు – నాలెజ్ఫుల్, పవర్ఫుల్ మరియు లవ్‌ఫుల్. ఈ మూడు రూపాలతో సేవను చెయ్యండి మరియు మూడు రీతులతో కూడా సేవను చెయ్యండి. ఆ మూడు రీతులు - మనసా-వాచా-కర్శణ ఒకే సమయంలో జరగాలి. కేవలం వాణి ద్వారా మాత్రమే కాదు, వాణితోపాటు మనసా సేవ కూడా జరగాలి. పవర్ఫుల్ మనసు కావాలి. ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది. ఒకే సమయంలో మనసా పావర్ఫుల్గా ఉండాలి, దానిద్వారా ఆత్మల మనసు కూడా పరివర్తన అవ్వాలి. వాణి ద్వారా పూర్తి జ్ఞానమంతా స్పష్టమవ్వాలి మరియు కర్మణ ద్వారా, కర్మ ద్వారా చేసిన సేవ వలన నేను నిజంగా నా పరివారానికి చేరుకున్నాను అని ఆ ఆత్మకు అనుభవం అవ్వాలి. పరివారము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సమీప సభ్యులుగా అవుతారు. మరి బాప్‌దాదా ఇప్పుడు ఒకే సమయంలో మూడు రూపాల సేవలు జరగాలని ఆశిస్తున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? చేతులెత్తండి, వీలవుతుందా? ఇప్పుడు బాప్‌దాదా రిజల్ట్‌లో ఏమి చూసారంటే వాణి ద్వారా నాలెజ్ఫుల్గా అవుతున్నారు కానీ పరివారంతో కలిసి ఉండటంలో ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు సమయం యొక్క ఛాలెంజ్‌తో పాటుగా సేవలో ఒకే సమయంలో మూడు సేవల ద్వారా ప్రాప్తిని అనుభవం చేసుకునే ఛాలెంజ్‌ను చెయ్యండి.
మరి అందరూ కలవడానికి ఉల్లాస-ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్‌దాదా పిల్లల ఉత్సాహాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వడంపై అటెన్షన్ ఉంచండి ఎందుకంటే కనీసం 108 మాలను అయితే తయారు చేయగలగాలి కదా, వీలవుతుందా? 108 మాల తయారుగా ఉందా? తయారుగా ఉందా? ఎందుకంటే రాజధానిలో రాజ్యాధికారులుగా అయ్యేది వారే కదా. 108 రత్నాల లిస్ట్‌ను ఇప్పుడు తయారు చెయ్యగలరా? తయారు చెయ్యగలరా? వీలవుతుందా? వీలవుతుంది అని అనడం లేదే? 108మంది రాజ్యాధికారులు, తర్వాత 16108మంది, రాజ్యాధికారులకు తోడుగా ఉండేవారు. ఆ తర్వాత నంబర్‌వారీగా ఉంటారు. బాప్‌దాదా ఇప్పుడు సమయానుసారంగా, సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే పిల్లలనుండి ఇదే ఆశిస్తున్నారు. 108మాల ఎవరెడీగా ఉండాలి, బాబా సమానంగా ఉండాలి. అంతమంది ఉన్నారుకదా తయారుగా? మొదటి లైన్ వారు 108మంది లిస్ట్‌ను తయారు చెయ్యగలరు కదా? వీలవుతుందో లేదో చెప్పండి!
బాప్‌దాదా చెప్పదల్చుకున్న సారమేమిటంటే ప్రతి ఒక్కరూ స్వ కోసం తీవ్ర పురుషార్ధం చేసి నేను బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న దృఢ సంకల్పాన్ని చెయ్యాలి ఎందుకంటే పరివర్తన అకస్మాత్తుగా జరుగనుంది అని బాప్‌దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. అంతకు ముందే కనీసం నిమిత్తమైన వారు, జోన్ హెడ్స్, సెంటర్ ఇన్‌ఛార్జులు, వారితోపాటు ఉన్న సమీప పాండవులు, సెంటర్ హెడ్ అవ్వకపోయినాకానీ ఏదో ఒక విశేష కార్యానికి నిమిత్తమై విశేష ఆత్మలుగా చూడబడుతున్నారో, అటువంటి పాండవులు కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్ధం చేసి స్వ పరివర్తన దృశ్యాన్ని బాహ్య స్టేజ్ మీదకు తీసుకురావాలి. ఇందుకు ఎవరెడీగా ఉన్నారా? ఈ కార్యమైతే చెయ్యవలసిందే, స్వయాన్ని బాబా సమానంగా, బ్రహ్మా బాబా సమానంగా ఫాలో ఫాదర్ చెయ్యవలసిందే, చెయ్యవలసిందే కదా? అలా భావించేవారు చేతులెత్తండి. చేతులైతే ఎంతగా ఎత్తుతారంటే సంతోషపరిచేస్తారు. మంచిగా చేస్తారు. కానీ చేతితో పాటు దృఢ సంకల్పాన్ని కూడా చెయ్యండి. దృఢత్వము అనే శక్తి ఎంతో సహయోగాన్ని ఇస్తుంది. అచ్ఛా.
బాప్‌దాదా సంతోషిస్తున్నారు, చేతులెత్తడంలో అందరూ తెలివైనవారే కానీ ఇప్పుడు దృఢత్వాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురండి. పిల్లలు తెలివైనవారు కదా, దృఢత్వంతో ఉంటారు కూడా కానీ ఆ దృఢత్వము భిన్న భిన్న రూపాలలోకి మారిపోతూ ఉంటుంది. ఇలా అయింది. ఇలా జరిగింది. ఇలా అయ్యుండకపోతే అలా జరిగేది కాదు. ఇటువంటి సాకులలో చాలా తెలివైనవారు. మరి ఇప్పుడు బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి. మనసా వాచ కర్మణ, సంబంధ సంపర్కంలో మిమ్మల్ని ఎవ్వరు చూసినాకానీ, ఎవరు కలిసినా కానీ వాహ్ పరివర్తన వాహ్! అని అనాలి. నిమిత్తమైన పిల్లలను చూసి బాప్‌దాదాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది మరియు మిలనంలో కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది.
మరి ఈరోజు ఏ సంకల్పం చేసారు? అవ్వాల్సిందే. బ్రహ్మా బాబా సమానంగా అవ్వాల్సిందే. అవ్వాలి కాదు, అవ్వాల్సిందే. ఎటువంటి విషయాలు వచ్చినా కానీ, విషయాలను కాక బాబాను ముందు పెట్టుకోండి. దూరంగా కూర్చున్న పిల్లలు, దగ్గరగా కూర్చున్న పిల్లలు అందరిని చూసి బాప్‌దాదా ఎంతో సంతోషిస్తున్నారు. పిల్లలందరూ ప్లాన్లు చాలా బాగా తయారు చేస్తారు, అమృతవేళ చాలా మధురమైన మాటలు మాట్లాడుతారు అందరూ. మెజారిటీ అందరూ ఎంత తియ్యగా మాట్లాడుతారంటే బాబా కూడా ఆ మాటలకు బలిహారమైపోతారు. కానీ తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా? కర్మ క్షేత్రంలోకి వచ్చినప్పుడు, సంబంధాలలోకి వచ్చినప్పుడు, సేవలో వచ్చినప్పుడు వచ్చే విషయాలను చూసి కొద్దికొద్దిగా మారిపోతారు. అమృతవేళలో ఉన్న ఉల్లాస ఉత్సాహాలు కర్మ చేస్తున్నప్పుడు, సంబంధంలోకి వస్తున్నప్పుడు కొద్దికొద్దిగా మారిపోతాయి.
ఇప్పుడు బాప్‌దాదా ఒక కార్యాన్ని ఇస్తారు. చేయడానికి తయారుగా ఉన్నారా! తల ఊపండి. చేతులెత్తండి. బాప్‌దాదా సంకల్పమేమిటంటే, ఒక్క నెల స్వయాన్ని దృఢ సంకల్పం ఆధారంతో బాబా సమాన స్థితిలో స్థితి చేసుకోగలరా? ఒక్క నెల, వీలవుతుందా? లేక ఎక్కువ సమయమా? ఒక్క నెల దృఢత్వంతో, దృఢత్వాన్ని తోడుగా పెట్టుకుని బాబాను సదా ముందు పెట్టుకోవాలి, బ్రహ్మా బాబాను నయనాలలో ఇముడ్చుకోవాలి మరియు బ్రహ్మా బాబా ఏమి చేసారో మనసా వాచ కర్మణ అదే చెయ్యాలి. ప్రాక్టికల్‌గా బ్రహ్మాను చూడకపోయినా కానీ నాలెజ్ అయితే ఉంది కదా. ఏ కర్మ అయినా చేసేముందు ఇలా పరిశీలించుకోండి, బ్రహ్మా బాబాకు ఇటువంటి సంకల్పం ఉన్నదా, ఇటువంటి మాటలు ఉన్నాయా, ఇటువంటి కర్మలు ఉన్నాయా, ఇటువంటి సంబంధాలు ఉన్నాయా, ఇటువంటి సంపర్కం ఉన్నదా? ముందు ఆలోచించండి తర్వాత చెయ్యండి. వీలవుతుందా? ఇందులో చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. మాతలు చేతులను పెద్దగా ఎత్తండి. మాతలు ఇక్కడ వ్యాయామం చేస్తారు కదా, చేతులు పెద్దగా ఎత్తండి. ముందున్న వారు కూడా ఎత్తుతారు కదా? మధువనం వారందరూ ఇందులో నంబర్‌వన్ రావాలి. ముందు మధువనంవారు కూర్చుని ఉన్నారు కదా. మధువనం అంటే కేవలం శాంతివన్ కాదు. ఒక నెల నిర్విఘ్నము, ప్రతి సెంటర్ కూడా నిర్విఘ్నము. గుజరాత్ టీచర్లు చేతులెత్తండి. గుజరాత్ టీచర్లు ఇది వీలవుతుందని భావిస్తున్నారా, చేతులు పెద్దగా ఎత్తండి. ఇలా ఇలా అనకండి, చేతులు పెద్దగా ఎత్తండి. వీలవుతుందా? అచ్ఛా.
పిల్లలకు బాబాపై, మధువనంపై మనస్పూర్తిగా ప్రేమ ఉన్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది, ఇప్పుడు గుజరాత్ అద్భుతాన్ని చేసి చూపించండి. ఈ ఒక్క నెల రిజల్ట్‌లో నంబర్‌వన్ వచ్చి చూపించండి. అసలైతే అందరూ నంబర్ వన్ రావాలి. మధువనంవారు నంబర్‌వన్ వస్తారు కదా, చేతులెత్తండి. ఏమి జరిగినాకానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినాకానీ, పరిస్థితులు వస్తాయి, మాయ వింటుంది కదా, కనుక మాయ తన రూపాన్ని చూపిస్తుంది కానీ మాయ పని రావడము మరియు మీ పని విజయాన్ని పొందడము. ఇలా జరిగిపోయింది, అలా జరిగింది, ఇలా చెయ్యకూడదు అని అనకండి. వస్తాయి, జరుగుతాయి, ఇదైతే బాప్‌దాదా ముందుగానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే మాయ వింటుంది కదా, అది చాలా తెలివైనది, కానీ మీరు? మాయ ఎంత తెలివైనదైనా కానీ మీరైతే సర్వశక్తిమంతుని సహవాసులు, మాయ ఏమి చెయ్యగలుగుతుంది? అందరూ నంబర్‌వన్ తెచ్చుకోవాలి. ఎవ్వరూ రెండవ నంబర్ అవ్వకూడదు, వన్ నంబర్. అచ్ఛా.
సేవ టర్న్ గుజరాత్ వారిది:- గుజరాత్ వారు చాలా సమీపంగా ఉన్నారు కదా, అందరికన్నా సమీపంగా ఎవరున్నారు? గుజరాత్యే సమీపంగా ఉంది. పురుషార్థ లక్ష్యాన్ని ఇదే పెట్టుకోండి - మేము రాజ్యానికి అధికారులుగా, పరివారానికి సమీపంగా రావలసిందే. పురుషార్ధము ఏమిటి? బాబాను ఫాలో చెయ్యడము. దృఢత్వాన్ని మర్చిపోవద్దు. ఎక్కడ దృఢత్వము ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది. గుజరాత్ అంటే బాప్‌దాదాకు కూడా ప్రియమే. ఒక విశేషత కారణంగా బాప్‌దాదాకు ఇష్టము, ఎప్పుడు ఏ సమయంలో పిలిచినాకానీ, ఆవశ్యకత ఉన్నప్పుడు గుజరాత్ హాజరు అవుతుంది. సమీపంగా ఉన్నందుకు లాభాన్ని పొందుతున్నారు. అలాగే సదా బాబాను ఫాలో చేసేవారిగా సమీపంగా ఉండండి. బాబా చేసింది మీరూ చేస్తూ ఉండండి. ఫాలో ఫాదర్. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరసోదరీలు వచ్చారు:- చాలా మంచిది. బాప్‌దాదా ఏమి చూసారంటే ఇప్పుడు విదేశాలలో, మీ చుట్టుప్రక్కల ఉన్న ఏ చిన్న స్థానము కూడా మిగలకూడదు అని బాప్‌దాదా ఏదైతే చెప్పారో, ఇందుకు రిజల్ట్‌గా ఇప్పుడు చిన్న చిన్న స్థానాలలో కూడా చుట్టు ప్రక్కల వృద్ధి జరుగుతుంది. అందుకే బాప్‌దాదా సేవకు అభినందనలు తెలుపుతున్నారు. నిర్విఘ్నంగా అయ్యేందుకు పరస్పరంలో ఏదైతే ఆత్మిక సంభాషణ చేసుకున్నారో అది కూడా బాగుంది. ఇప్పుడు జయంతి బిడ్డ పని ఏమిటంటే ప్రతి నెల ప్రతి సెంటర్ రిజల్ట్‌ను అడుగుతూ ఉండాలి, మధువనంలో ఏ రిఫ్రెష్మెంట్ పొందారో అది స్థిరంగా ఉన్నదా లేక ఏదైనా పరీక్ష వచ్చిందా? ఇందుకు మీరు ఎవరి తోడునైనా తీసుకోండి. చేస్తూ ఉండండి. ఒక్కొక్క సెంటర్‌ను అడగండి. ఎక్కడైనా ఏమైనా జరిగితే అక్కడే అడగడం కాదు, ఏమీ జరగని చోట్ల కూడా అడగండి ఎందుకంటే దూరంగా ఉంటారు కదా, అటెన్షన్ ఉంది. అటెన్షన్ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు కానీ ఇంకొంచెం పెంచండి. ఇప్పుడు నాజూకైన సమయం రానున్నది, అందుకని ఇంకా కొంచం అటెన్షన్ పెట్టాలి. అచ్ఛా. విదేశీయులకు బాప్‌దాదా హృదయపూర్వక అభినందనలు మరియు పురుషార్థంలో ఎక్కే కళలో ఉన్నందుకు అభినందనలు. అచ్ఛా.
బాప్‌దాదా పిల్లలందరికీ ఒకే ఒక్క శ్రేష్ఠ సంకల్పాన్ని వినిపించాలనుకుంటున్నారు. ఇప్పుడు స్వయం కూడా నిర్విఘ్నంగా అయ్యి తమ తోటివారిని, మీ సంబంధంలోకి వచ్చేవారిని కూడా నిర్విఘ్నులుగా చెయ్యండి. సమయాన్ని సమీపంగా తీసుకురండి. పిల్లల దుఃఖము, అశాంతిని బాప్‌దాదా చూడలేరు. ఇప్పుడు మీ రాజ్యాన్ని త్వరత్వరగా ఈ ధరణిపైకి తీసుకురండి. బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారే, లాస్ట్ నంబర్లో ఉండే పిల్లవాడు కూడా ప్రియమే ఎందుకంటే బలహీనంగా ఉన్నాడు కదా, బలహీనంగా ఉన్నవారిపై ఎక్కువ దయ కలుగుతుంది. మీరందరూ ఎటువంటి స్థితి వారైనా, ఎటువంటి స్వభావం ఉన్నవారైనా కానీ నా వారే. బాబా నా వారు, పరివారము నాది అని అన్నప్పుడు వారిలోని స్వభావ సంస్కారాలను చూడకుండా వారికి ఇంకా సహకారాన్ని అందించండి, సద్భావన ఉంచండి, శుభ భావన ఇవ్వండి. అచ్ఛా, ఎదురుగా ఉన్న పిల్లలకు, దూరంగా కూర్చుని చూస్తున్న పిల్లలకు బాప్‌దాదా పిల్లలు ఒక్కొక్కరినీ తమ ఎదురుగా చూస్తూ దృష్టి కూడా ఇస్తున్నారు మరియు అభినందనలు కూడా తెలుపుతున్నారు. అచ్ఛా.
*** ఓంశాంతి ***
