‘‘ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీలుగా అవ్వండి, జ్వాలాముఖి యోగం ద్వారా అందరికీ లైట్ మైట్ కిరణాల సహయోగాన్ని ఇవ్వండి’’
ఓం శాంతి 19-12-20 మధుబన్
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా తమ స్వమానంలో స్థితులై అనుభవం యొక్క అథారిటీగా అయ్యేటువంటి స్వరాజ్య అధికారి సో విశ్వ రాజ్య అధికారులైన నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - మధురమైన, ప్రియమైన బాబా సమయ ప్రమాణంగా తమ పిల్లలను సర్వ శక్తులతో సంపన్నులుగా చేసి సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు ప్రేరణలను ఇస్తున్నారు. ఇప్పుడిక క్రొత్త సంవత్సరం సమీపిస్తుంది. తప్పకుండా ఇప్పటినుండే బాబా పిల్లలందరూ జ్వాలాముఖి యోగంపై అటెన్షన్ ఇవ్వగలరు. శక్తిశాలి యోగమే సంస్కారాలతో పాటు ఈ పాత ప్రపంచాన్ని కూడా పరివర్తన చేస్తుంది. ఇప్పుడు వ్యర్థాన్ని నామరూపాలతో సహా సమాప్తం చేయాలని, ప్రతి స్థానం లైట్ హౌస్‌గా అవ్వాలని, పిల్లలు ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తిమంతుని స్వమానంలో ఉంటూ, సమయానికి శక్తులను ఉపయోగిస్తూ విజయి భవ యొక్క వరదానీలుగా అవ్వాలని బాబా కోరుకుంటున్నారు.
మరి తప్పకుండా మీరంతా ఈ నూతన సంవత్సరం ఉల్లాస ఉత్సాహాలతో కూడిన తీవ్ర పురుషార్థం కోసం ప్లాన్ తయారు చేస్తుండవచ్చు. ఈసారి విశేషంగా పంజాబ్ వారి టర్న్, అందరూ ఎంతో చక్కగా జ్ఞానయోగాలతో శక్తిశాలి తపస్సును చేస్తున్నారు. ఇక్కడి ఏకాంతము, శాంతి, పవిత్ర వాతావరణము అందరినీ విశేషంగా సర్వ శక్తి సంపన్నులుగా చేస్తుంది. క్రొత్త సంవత్సరం కోసం మధుబన్ నుండి విశేషంగా బ్రహ్మా బాబా యొక్క 18 అడుగులు ఏదైతే హోమ్‌వర్క్ రూపంలో పంపించడం జరిగిందో, అది మీ అందరికీ ఈమెయిల్ ద్వారా తప్పక అంది ఉండవచ్చు. రాబోయే 21వ సంవత్సరంలో అన్ని స్థానాలలో పూర్తి సంవత్సరం విశేషంగా తపస్సు యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ అంతర్ముఖి, అవ్యక్త మరియు అలౌకిక స్థితిలో ఉండే అటెన్షన్‌ను విశేషంగా ఉంచి తీవ్ర పురుషార్థం చేయగలరు. అచ్ఛా - అందరికీ స్మృతి... ఓం శాంతి.
19-12-20 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” రివైజ్ వీడియో 02-02-12 మధుబన్
ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీలుగా అవ్వండి, జ్వాలాముఖి యోగం ద్వారా అందరికీ లైట్ మైట్ కిరణాల సహయోగాన్ని ఇవ్వండి
ఈరోజు బాప్‌దాదా తమ ఎదురుగా ఉన్న మరియు నలు వైపుల ఉన్న తమ చిన్నని ప్రపంచాన్ని చూసి హర్షితులవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచం చిన్నదే అయినాకానీ చాలా ప్రియమైనది ఎందుకంటే ఈ ప్రపంచంలోని ఒక్కొక్క ఆత్మ శ్రేష్ఠ ఆత్మ. కోట్లలో కొద్దిమందిగా ఉన్న ఆత్మలు. బాబా వారసత్వానికి అధికారి ఆత్మలు. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కరూ రాజా పిల్లలు. బాప్‌దాదా పిల్లలందరినీ స్వరాజ్యాధికారులుగా మరియు విశ్వ రాజ్యాధికారులుగా చేసారు. ఈ సమయంలో అందరూ స్వరాజ్య అధికారులుగా ఉన్నారు. అనగా మనసు, బుద్ధి, సంస్కారాలు, కర్మేంద్రియాలకు రాజు. కర్మేంద్రియాలకు వశం కాదు. మనసుకు కూడా యజమానులు. మరి మీరు స్వయాన్ని ఈ విధంగా మనసుకు యజమానులుగా, సంస్కారాలకు కూడా యజమానులుగా భావిస్తున్నారా? ఒకసారి మనసు యజమానిగా, మరోసారి మీరు మనసుకు యజమానిగా అయితే లేరు కదా? ఎందుకంటే చెప్పడం కూడా ‘నా మనసు’ అనే అంటారు కానీ ‘నేను మనసును’ అని అనరు కదా! మరి ‘నాది’ అన్నదానికి మీరే యజమానులు. ఒక్కోసారి మనసు యజమానిగా అయిపోవడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో బాప్‌దాదా పిల్లలందరినీ స్వరాజ్య అధికారి అనే సీట్‌పై కూర్చోబెట్టారు. వర్తమానంలో స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో రాజ్యం అయితే మీదే. డబల్ రాజ్య అధికారులు. పిల్లలు స్వరాజ్య అధికారులుగా ఉండటంతో పాటుగా స్వమానధారులుగా కూడా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ‘నేను స్వమానధారి ఆత్మను’ అన్న స్మృతిలో కూర్చుంటే స్వమానాల లిస్ట్ ఎంత పెద్దది మీ ముందుకు వస్తుందో చూడండి. అనేక స్వమానాల మాల మీ ముందుకు వస్తుంది కదా!
బాప్‌దాదా పిల్లలందరి మెడలో స్వమానాల మాలను వేసారు. స్వమానము అని వినగానే మీ ఎదురుగా మీకున్న స్వమానాలు గుర్తుకు వచ్చాయి కదా! గుర్తు తెచ్చుకోండి, అనాది స్వరూపంలో మీ స్వమానము ఎంత పెద్దది! అనాది స్వరూపంలోకి వెళ్ళిపోయారా? ప్రతి ఒక్కరి స్వమానము - ఒకటి, బాబాతోపాటు నేను మెరుస్తూ ఉన్న ఆత్మను. రెండు, బాబాతో ఉన్న కారణంగా విశేషంగా మెరుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తున్నాను! చూస్తున్నారా? ఇక్కడ ఆకాశంలో కూడా ఎలా అయితే కొన్ని కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయో అలాగే అక్కడ బాబాతో ఉన్న కారణంగా విశేషంగా మెరుస్తూ ఉన్నారు. మీ అనాది స్వరూపం గుర్తుకు వచ్చిందా? సెకెండులో మీ అనాది స్వరూపంలో స్థితి అవ్వగలరా? ఇప్పుడు ఒక్క క్షణంలో ఆ అనాది స్వరూపంలో స్ధితులవ్వండి. ఎంత నషా పెరుగుతుంది! ముందుకు పదండి! ఈ సృష్టి చక్ర ఆది సమయంలోకి వచ్చేసారా! ఈ డ్రిల్ చెయ్యండి, సత్యయుగ ఆది సమయంలోని తమ స్వరూపాన్ని చూసుకోండి. ఎంతటి శ్రేష్ఠమైన, సుఖ స్వరూపము! ఎంతటి సర్వ ప్రాప్తి స్వరూపము! దుఃఖము నామమాత్రానికి కూడా లేదు. ప్రకృతి ఎంత సుందరంగా సతోగుణిగా ఉంది! మీ దేవతా స్వరూపాన్ని అనుభవం చెయ్యండి. మీ స్వరూపాన్ని చూసుకుంటున్నారా? ఏ రాజులనైనా, మహాత్నులనైనా, నేతలనైనా ఇంతటి సర్వ ప్రాప్తి స్వరూపులుగా చూసారా? ఇప్పుడు ఒక్క సెకండ్ మీ దేవతా స్వరూపంలో స్థితులవ్వండి. మీ స్వమానంలో ఉంటే మజా వస్తుంది కదా! హమ్ సో దేవతా... బాప్‌దాదా ఈ డ్రిల్‌ను చేయిస్తున్నారు. ఇప్పుడు క్రిందకు రండి, ఏ యుగము వచ్చింది? ద్వాపరంలో కూడా మీ స్వమానము పూజ్యనీయమైనది. పూజ్య స్వరూపము. మీ పూజ్య స్వరూపాన్ని చూసుకుంటున్నారా? అందరూ ఎంత భావనతో నియమానుసారంగా పూజలు చేస్తున్నారు! ఇంతటి నియమబద్దమైన పూజ మరెవ్వరికీ జరుగదు. ధర్మ పితలు కావచ్చు, గురువులు కావచ్చు, నేతలు కావచ్చు, అభినేతలు కావచ్చు, ఎవరికి కూడా మీకు జరిగిన విధంగా నియమపూర్వకంగా పూజ జరగదు. మరి ఇప్పుడు మీ స్వమానాన్ని చూసుకున్నారా, అనుభవం చేసుకున్నారా? ఇప్పుడు సంగమంలోకి రండి. అందరూ చక్రంలో తిరుగుతున్నారా? వెనుక ఉన్నవారు తిరుగుతున్నారా? చేతులెత్తండి. మీ స్వమానాన్ని చూసుకోండి, ఎందుకంటే స్వరాజ్య అధికారులు కదా. సంగమ యుగంలో స్వయంగా భగవంతుడు, యజమాని అయిన భగవంతుడు పిల్లలైన మీలో పవిత్రతా విశేషతను నింపారు. ఈ పవిత్రత సర్వ అవినాశీ సుఖాలకు గని. మరి అలా తయారు చేసేది ఎవరు? స్వయంగా భగవంతుడు. ఇప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణంగా పవిత్రత అనే ఆస్తి మీకు వారసత్వంగా లభించింది. ఇప్పుడు పరిశీలించుకోండి - పవిత్రత సర్వ ప్రాప్తులకు ఆధారము, పవిత్రతతో మీరందరూ మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యారు. సర్వ శక్తులు ప్రాప్తి అయ్యాయా అని పరిశీలించుకోండి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే బాబా అయితే సర్వ శక్తులూ ఇచ్చారు. కానీ ఒక్కోసారి ఏ శక్తి యొక్క అవసరముంటుందో అది కొంత ఆలస్యంగా వస్తుంది, ఆ విషయము పూర్తయ్యిపోయాక శక్తి వస్తుంది అని అంటారు. దీనికి కారణం ఏమిటి? వరదానంగా బాబా అయితే ఇచ్చారు. కానీ అది సమయానికి రావడం లేదు అంటే అందుకు కారణం ఏమిటి? మాస్టర్ సర్వశక్తిమాన్ అన్న మీ సీట్ పై సెట్ అయ్యి ఉండరు. ఎవరైనా ఎవరి ఆర్డర్‌ను వింటారు, సీట్‌పై ఉన్నవారి ఆర్డర్‌ను వింటారు. ఎప్పుడైనా మీరు ఏదైనా శక్తిని ఆర్డర్ చేసినప్పుడు ముందుగా, ‘నేను స్మృతి సీట్ పై ఉన్నానా’ అని చూసుకోండి. స్వమానము అనే సీట్‌పై ఉన్నారా? స్మృతి అనే సీట్‌పై సెట్ అయినట్లయితే సర్వ శక్తులు మీ వద్ద సమయానికి రావడానికి బంధింపబడి ఉంటాయి ఎందుకంటే సర్వశక్తిమంతుడైన బాబా మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తిమంతులుగా చేసారు. మరి ఇంతటి పవర్ఫుల్ స్వమానధారులుగా అయ్యి నడుచుకుంటున్నారా? మీ స్వమానాలను చూసుకున్నారా? సంగమం తర్వాత ఎక్కడకు వెళ్తారు? రిటర్న్ జర్నీ(తిరుగు ప్రయాణం) చెయ్యాలి కదా! అందుకే, ప్రతి ఒక్కరూ రోజంతటిలో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలని బాప్‌దాదా కోరుకుంటున్నారు. సమయాన్ని కేటాయించండి. పదే పదే ఈ స్వమానాల మాలను వేసుకున్నప్పుడు, బాప్‌దాదా మనకు ఇచ్చిన స్వరాజ్య అధికారాన్ని అనుభవం చేసినప్పుడు స్వమానాలు మీ ఆర్డర్ అనుసారంగా నడుచుకోకపోవడమన్నది జరగని విషయము. కేవలం సీట్‌పై సెట్ అయ్యి ఉండండి.
బాప్‌దాదా ఏమి చూసారంటే అందరూ అటెన్షన్ అయితే పెడ్తున్నారు. కానీ నియమిత రూపంలో మీ దినచర్యను సెట్ చేసుకోండి. మధ్య మధ్యలో ఈ స్వమానాల స్మృతి స్వరూపంలో స్తితులవ్వండి. ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారో అలాగే, ఆది కాలం నుండి రిటర్న్ జర్నీ వరకు ఉన్న స్వమానాలను స్మృతి చేసుకోవడానికి సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కూడా ఇది చేయవచ్చు. ఎందుకంటే మనసును సీటిపై కూర్చోపెట్టాలి. బాప్‌దాదా చూసారు, ముందుకూడా చెప్పి ఉన్నారు, యోగము అందరూ చేస్తున్నారు కానీ ఇప్పుడు దేని అవసరముంది? సమయపు పరిస్థితులను చూస్తూ ఇప్పుడు జ్వాలాముఖి యోగము అవసరమని ముందు కూడా చెప్పి ఉన్నాము. దీనితో డబల్ పనులు జరుగుతాయి. ఒకటి, మీలోని పాత సంస్కారాల సంస్కారము జరుగుతుంది. ఇప్పుడు సంస్కారాలను చంపుతున్నారు కానీ కాల్చేయడం లేదు. చంపేసిన తర్వాత కూడా అవి అప్పుడప్పుడూ లేస్తున్నాయి. ఎలా అయితే రావణుడిని కేవలం చంపడం కాక కల్చి వేస్తారో అలాగే మీరు కూడా మీ పాత సంస్కారాలను, మీ తీవ్ర పురుషార్థంలో మధ్య మధ్యలో లోటును తీసుకువచ్చే ఈ పాత సంస్కారాలను కాల్చి వేయడానికి జ్వాలాముఖి యోగము అవసరము. ఒకటి, స్వయంకోసం మరియు రెండు, జ్వాలాముఖి యోగం ద్వారా ఇతరులకు కూడా లైట్ మైట్‌గా మీరున్న కారణంగా వారికి కూడా మీ కిరణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వగలరు. మరి ఇప్పుడు అందరూ యోగాన్ని జ్వాలాముఖి యోగంలోకి పరివర్తన చేసారా? సమయానుసారంగా ఇప్పుడు ఆత్మలకు మీ సహయోగము చాలా అవసరము. బాప్‌దాదా అయితే అమృతవేళలో పిల్లలందరికీ స్నేహాన్ని ఇస్తూనే ఉంటారు.
బాప్‌దాదా ఏమి చూసారంటే, లక్ష్యమును చాలా బాగా పెట్టుకుంటున్నారు, ధైర్యమును కూడా పెడ్తున్నారు కానీ రోజంతా అమృతవేళలో ఉన్నట్లుగా స్థితి ఉండటానికి ఏ అటెన్షన్ అయితే అవసరమో అది తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి? కర్మల్లో పడ్డాక, కర్మయోగిగా అయ్యి కార్యాలను చెయ్యడంలో తేడా కనిపిస్తుంది. మీరు కేవలం యోగం చేసేవారు కాదు, యోగీ జీవితాన్ని గడిపేవారు. జీవితమన్నది సదా ఉంటుంది, అప్పుడప్పుడూ కాదు. మరి ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు? ప్రేమలో అయితే చాలామంది పాస్ అయ్యారు. ప్రేమ యొక్క సబ్జెక్ట్‌లో మెజారిటీమంది బాబాతో ‘నా బాబా, నా బాబా’ అని అనడంలో ప్రేమను అనుభవం చేస్తున్నారు. ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ఇప్పుడు ఎందులో పాస్ అవ్వాలి? బాబా సమానంగా అవ్వడంలో. అందరూ ఏమి కోరుకుంటున్నారు? బాబా సమానంగా అవ్వాలా లేక బాబా, బాబాగానే, మీరు పిల్లలుగానే ఉంటారా! బాబా సమానంగా అయితే అవ్వాలి కదా? ప్రేమ అంటే ఏమిటి? ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు చెప్పింది చెయ్యాల్సిందే. మరి అందరూ బాబాకు ప్రియులు, బాబాకు మీపై ఉందా? ఇందులో చేతులెత్తండి. ప్రేమ ఉన్నదా? అయితే బాప్‌దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారంటే ప్రేమ ఉన్నట్లుగానే, “ఇప్పుడు నేను బాబా సమానంగా అవ్వాల్సిందే” అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి, ఇందులో చేతులెత్తండి. నిశ్చయముంది, చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్‌దాదా చూస్తున్నారు.
బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే పిల్లలందరూ తమ ముఖము మరియు నడవడికతో సంతోష వదనం కలిగిన వారిగా, అదృష్టవంతులుగా కనిపించాలి ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీ ముఖము ఎంతో సేవ చేస్తుంది. ఆ అవసరము వస్తుంది. ఇందుకు ఇప్పటి నుండే లక్ష్యాన్ని పెట్టుకోమని బాప్‌దాదా చెప్తున్నారు. ముఖంతో సేవ చేయాలన్న ఉల్లాసం ఉండాలి ఎందుకంటే రోజు రోజుకూ పరిస్థితులు నాజూకుగా రానున్నాయి. ఇటువంటి సమయంలో మీ ముఖము ఆత్మలలో చిరునవ్వును తెస్తుంది.
బాప్‌దాదా ఈరోజు అమృతవేళ అంతటా తిరిగారు. మరి ఏమి చూసారు? అందరూ తమ స్వ శ్రద్ధతోటే కూర్చుంటారు కానీ అన్నిటికన్నా పెద్ద అథారిటీ అనుభవము. కూర్చోవడాన్ని చూస్తున్నాము కానీ అనుభవం యొక్క అథారిటీగా అయ్యి కూర్చోండి. స్మృతిలో కూర్చుంటున్నారు. కానీ స్మృతి స్వరూపం అనుభవం అవ్వాలి. అనుభవం యొక్క అథారిటీలోని ఆనందము ఆ కొద్ది సమయంలోనే ఉంటుంది. ‘నేను బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిని’ అని ఆలోచిస్తూ ఉంటారు కానీ స్మృతి స్వరూపంలో, అనుభవీ మూర్తిగా అయ్యి అనుభవంలో మునిగిపోవడంలో ఇంకా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నిటికన్నా పెద్దది. స్మృతి స్వరూపంలో ఉండటాన్ని అనుభవం అని అంటారు. అనుభవంలో మునిగిపోవడం, స్వరూప స్మృతిలో ఉండటం, ఆ స్వరూప అనుభూతిలో ఉండటం ఇప్పుడు అవసరము ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు.
మెజారిటీ మందికి మురళిపై ప్రేమ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. బాబా చెప్పింది చెయ్యవలసిందే అన్నది జగదాంబ ప్రత్యక్షంగా తమ జీవితంలో చేసి చూపించారు. లక్ష్యం పెట్టుకున్నారు మరియు పురుషార్థం వైపు అటెన్షన్ కూడా ఇచ్చారు. మీ దీదీ, దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలో ఉన్నారో వారు కూడా అటెన్షన్ ఉంచారు. ఇప్పుడు మీకోసం వేచి ఉన్నారు. వారెప్పుడు సమాప్తి ద్వారాలు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీవారు అడుగుతున్నారు. ఒకరిద్దరు తెరవలేరు కదా! ఇప్పుడు సమయాన్ని, ద్వారాలను తెరిచే సమయాన్ని సమీపంగా తీసుకురండి. సంపన్నంగా అవ్వడము అంటే సమీపంగా తీసుకురావడము.
అచ్ఛా. నలువైపుల ఉన్న పిల్లలందరికీ బాప్‌దాదా హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నాము. బాప్‌దాదా ఇచ్చిన కార్యమును కూడా గుర్తు చేయిస్తున్నారు, ఎందుకని? చాలావరకు ఈ వ్యర్థ సంకల్పాలే పురుషార్థాన్ని తీవ్రంగా కాక సాధారణంగా చేసేస్తున్నాయి. అందుకే నలువైపుల ఉన్న పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులను ఇవ్వడమే కాక సంగమ సమయము ఎంత శ్రేష్ఠమైనది, సుందరమైనదో గుర్తుకు తెప్పిస్తున్నారు. ఈ సంగమ సమయంలోనే సర్వ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తి అవుతున్నాయి. సంగమంలోని ఒక్కొక్క క్షణము ఎంతో గొప్పది అందుకే సంగమ సమయ విలువను సదా మీ బుద్ధిలో పెట్టుకోండి. సంగమంలోని ఒక్క క్షణం ఎంత ప్రాప్తిని చేయిస్తుంది? మీకు ఏమి లభించింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ‘బ్రాహ్మణులైన మా మనసులలో అప్రాప్తి అనేదే లేదు. పొందాల్సినదంతా పొందేసాము.’ ఇప్పుడు దీనిని కార్యంలో పెడుతూ తీవ్ర పురుషార్టీలుగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురండి. అచ్ఛా. అందరికీ ఉల్లాసం రావడం బాప్‌దాదా చూసారు. ఈ ఉల్లాసాన్ని సదా పెంచుతూ ఉండండి. అచ్ఛా.
సేవ టర్న్ పంజాబ్ వారిది:- ఇప్పుడు లభించిన ఈ అవకాశంతో శక్తి కూడా నిండుతుంది. ఒక్కటే జోన్ ఆల్‌రౌండ్ సేవ చెయ్యడానికి నిమిత్తమయినందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అవకాశమూ లభిస్తుంది మరియు భాగ్యము కూడా తయారవుతుంది. ఇప్పటివరకు ఏ జోన్లు అయితే చేసాయో, మెజారిటీ అందరూ సంతుష్టం చేసే వెళ్ళారు. రిపోర్ట్ సక్రమంగా ఉంది కదా! అచ్ఛా. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీ ముఖ్య సోదరసోదరీలు వచ్చారు:- డబల్ విదేశీయులకు మధుబన అలంకరణ అని పేరు ఇవ్వడం జరిగింది. మధుబనంలో ఎంతో శోభను తెస్తారు. బాప్‌దాదా పిల్లల పురుషార్థము మరియు పరివర్తనను చూసి సంతోషిస్తున్నారు. మొదట్లో వై, వై (ఎందుకు, ఎందుకు) అని అనేవారు. ఇప్పుడు వాహ్! వాహ్! అని అంటున్నారు. మంచి ఛేంజ్ వచ్చింది. ఇప్పుడు ఏ విషయంలోనూ కష్టం అనిపించదు. ఏ విషయమైనా, నియమమైనా, బాప్‌దాదా మురళిలో ఇచ్చే డైరెక్షన్లను పాటించడంలోనైనా ఎవరెడీగా ఉంటారు మరియు సహయోగం కూడా మంచిగా ఉంది. స్నేహము ఉంది కానీ దానితోపాటు సహయోగము కూడా మంచిగా ఉంది.
ఇప్పుడు బాప్‌దాదా కోరుకుంటున్న జ్వాలాముఖి యోగంలో, ఇందులో విదేశీయులు నంబర్‌వన్ తీసుకోండి ఎందుకంటే విదేశీయుల సంస్కారమేమిటంటే పెట్టుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. రెండు విషయాలలో నంబర్ తీసుకోండి - ఒకటి, వ్యర్ధము సమాప్తము మరియు రెండు, సేవలో నిర్విఘము. ప్రేమ అయితే పరివారంలోని అందరికీ ఉంది. కేవలం బాప్‌దాదా ప్రేమయే కాదు, డబల్ విదేశీయుల పట్ల పూర్తి పరివారం యొక్క ప్రేమ ఉంది. ఇప్పుడు ఈ రెండు విషయాలలోనూ విదేశీయులు ముందుండి చూపించండి.
మంచిది. ఒక్కొక్క రత్నానికి బాప్‌దాదా విశేషంగా హృదయపూర్వక ప్రేమతో పాటు ఉల్లాస ఉత్సాహాల అల ఇస్తున్నారు. అచ్ఛా, అందరూ స్వయానికి ప్రియస్మృతులను తీసుకున్నారా లేక ఇది కేవలం వింగ్స్ వారికి మరియు డబల్ విదేశీయులకే అనుకుంటున్నారా? అందరినీ బాప్‌దాదా చూస్తున్నారు. అందరిపై దృష్టిని సారిస్తున్నారు మరియు దృష్టితో ప్రియస్మృతులను తెలుపుతున్నారు. అచ్ఛా.
*** ఓంశాంతి ***
