‘‘మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను చేస్తూ, బహుకాలము నుండి తీవ్ర పురుషార్థము చేసి ఎవరెడీగా ఉండండి అప్పుడు మాలలో పూసగా అయిపోతారు’’
ఓం శాంతి 18-10-20 మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్తమూర్తి తల్లి-తండ్రి అయిన బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, సదా పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - డ్రామాలో ఈ క్రొత్త విధమైన “అవ్యక్త మిలనము” పిల్లలందరిలో నూతన ఉల్లాస-ఉత్సాహాలను నింపుతుంది. చూడండి, నలువైపుల ఉన్న బాబా పిల్లలు ఆన్లైన్ వీడియో ద్వారా అవ్యక్త మిలనాన్ని జరుపుకుంటూ ఎంతో హర్షిస్తున్నారు. అందరూ తమ సూక్ష్మ రూపముతో తమ తమ బుద్ధి విమానం ద్వారా మధుబన్ ఇంటికి చేరుకున్నారు. ఈ మొదటి టర్న్ యు.పితో ప్రారంభమయింది. అక్కడి ముఖ్యమైన టీచర్లు మరియు కొంతమంది సోదరులు శాంతివనంలో 3 రోజుల భట్టీని చేసుకుంటున్నారు. అందరూ తమ మరియు పరివారం యొక్క సురక్షణను దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్‌ను కూడా వేసుకుంటున్నారు. డ్రామాలోని ఈ క్రొత్త దృశ్యాన్ని అందరూ సాక్షిద్రష్టలుగా అయి చూస్తూ, వాహ్ బాబా వాహ్! వాహ్ డ్రామా వాహ్! అనే పాటను సంతోషంగా పాడుతున్నారు. అన్ని వైపుల సైన్స్ సాధనాల ద్వారా చాలా చక్కని అనుభూతులను చేసుకుంటున్నారు. ఈరోజు మధురమైన బాబా విశ్వ సేవక పిల్లలకు వాచ సేవతో పాటు మనసా సేవపై కూడా చేయమని విశేషంగా చెప్పారు. సోదర సోదరీలందరూ ఈ అభ్యాసమునైతే చేస్తుండవచ్చు. పిల్లలు, ఇప్పుడు మాయాజీతులుగా, మన్జీతులుగా, జగత్‌జీతులుగా అయ్యి సదా ఎవరెడీగా అవ్వండి అని బాబా అంటారు. బాబా మీ టీచర్ అయినప్పుడు సమయాన్ని మీ టీచర్‌గా చేసుకోకండి, ముందునుండే తీవ్ర పురుషార్థం చేసి పాస్ విత్ ఆనర్‌గా అవ్వండి. ఇటువంటి మధురమైన ప్రేరణాదాయకమైన మహావాక్యాలను విని, అందరం ఈ విధమైన హోమ్వర్కునే విశేష పురుషార్థంగా చేద్దాం.
అచ్ఛా - అందరికీ చాలా - చాలా స్మృతులు .... ఓం శాంతి
18-10-20 ఓం శాంతి “అవ్యక్త బాప్‌దాదా” రివైజ్ వీడియో 17-02-11 మధువనం
మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను చేస్తూ, బహుకాలము నుండి తీవ్ర పురుషార్థము చేసి ఎవరెడీగా ఉండండి అప్పుడు మాలలో పూసగా అయిపోతారు
ఈరోజు స్నేహ సాగరుడు తమ స్నేహి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. నా బాబా, రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. బాబా కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహములో ఎంతటి ఆకర్షణ ఉందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాను తమవారిగా చేసుకున్నారు, అలాగే బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరినీ నా పిల్లలూ అంటూ తమలో ఇముడ్చుకున్నారు. అద్భుతంగా ఉంది, పిల్లలు నా బాబా అన్నప్పుడు నా అన్న పదంలో ఎంత స్నేహము నిండి ఉందంటే బాబా కూడా నా పిల్లలు అని అంటున్నారు, స్నేహము ఎలాంటివారిని ఎలా చేస్తుంది కదా! పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈరోజు స్నేహపు అలలు కనిపిస్తున్నాయి. ఇది చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. స్నేహమే హృదయమును సొంతం చేసుకునేందుకు సాధనము. పిల్లలందరిలో ఈరోజు స్నేహపు అలలను చూసి బాప్‌దాదా ఎంతగానో సంతోషిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కొరకు బాప్‌దాదా అందరితో ఒక డ్రిల్‌ను చేయిస్తున్నారు. తమ మనసా శక్తితో, సృష్టిలో ఉన్న మీ భక్తులు లేక అనేక దుఃఖి, అశాంత ఆత్మలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఓ మా పూర్వజులారా! కొద్ది సమయం కోసమైనా మాకు శాంతిని ఇవ్వండి, కొద్దిగా సుఖము యొక్క అంచలిని ఇవ్వండి, కాపాడండి - ఇటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చునే ఇమర్జ్ చేసుకోండి, వారి మొర వినిపిస్తుందా! కాపాడండి, కాపాడండి.... మరి అటువంటి ఆత్మలకు మీ మనసా శక్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను అందించండి. ఈ మనసా సేవను రోజంతటిలో పదే పదే చేస్తూ ఉండండి ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వ సేవకులు. ఎలా అయితే వాణి ద్వారా రోజంతటి సేవలకు నిమిత్తమవుతారో అలాగే మధ్య మధ్యలో మనసా సేవను కూడా అభ్యాసం చేస్తూ ఉండండి. ఇందులో మీకు కూడా లాభము ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మీ మనసు సదా సేవలో బిజీగా ఉన్నట్లయితే మధ్య మధ్యలో మీ వద్దకు మాయ అనవసరమైన లేక వ్యర్థ సంకల్పాలను తీసుకురావడము నుండి రక్షింపబడతారు. శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు బాప్‌దాదా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు! మరి ఏమని జవాబు ఇస్తారు? పురుషార్ధం జరుగుతుంది కానీ అప్పుడప్పుడూ....! సదా పురుషార్థం జరగడం లేదు. అప్పుడప్పుడూ అన్న పదము సమాప్తమైపోవాలి - బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరి దగ్గర ఈ రికార్డ్‌ను చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడూ అన్న పదము సమాప్తమైపోవాలి, ఇది వీలవుతుందా? సమయానికి తయారైపోతారా? అవుతున్నాము, అయిపోతాములే... వీటికి బదులుగా ఇప్పుడు ఎవరెడీగా అవ్వగలరా? ఎందుకని? ఎవరెడీగా ఉండే అభ్యాసము మాయాజీత్, మన్జీత్ జగత్జీత్ - ఈ సంస్కారము కూడా చాలా సమయము నుండి తయారు చేసుకుంటేనే అంతిమ సమయంలో కూడా ఈ బహుకాలపు అభ్యాసము విజయిగా తయారుచేసి మిమ్మల్ని విశేషంగా మాలలో పూసగా చేస్తుంది. పాస్ విత్ ఆనర్‌గా అవుతారు. పాస్ కాదు, పాస్ విత్ ఆనర్. మరి చెప్పండి, ఈ ధైర్యము ఉంది కదా! పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలి కదా? ఎవరైతే ద్వాపరం నుండి ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారో అనగా మాలలో పూసగా అవుతారో, మరి వారు మాలలో పూసగా అయ్యే శుద్ధ సంకల్పాన్ని తీసుకున్నారు కదా!
బాప్‌దాదా కూడా రోజూ అమృతవేళ తమ మాలలోని పూసలను చూసి వారితో విశేష మిలనము జరుపుతారు. మరి మీరందరూ స్వయాన్ని మాలలోని పూసలుగా భావిస్తున్నారు కదా! 16 వేల మాల కూడా ఉంది, కానీ అది రెండవ నంబర్ మాల అవుతుంది కదా! విశేషంగా ఏ మాల అయితే గాయనము మరియు పూజ్యనీయ యోగ్యంగా అవుతుందో అది మొదటి మాల. ఈరోజు బాప్‌దాదా ఆ పూసలను చూస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మా బాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారికి తోడుగా వారే ఉంటారు. కావున ఈరోజు బ్రహ్మా బాబా తమ ఇప్పటి తీవ్ర పురుషార్ధి మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. సింహాసనంపై అయితే ఇద్దరే కూర్చుంటారు కానీ రాజుకు తోడుగా ఉండేవారిది మొదటి మాల అవుతుంది. మరి స్వయాన్ని పరిశీలించుకోండి. బాప్‌దాదాతో పాటు అయితే వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు మీ అందరిదీ రిటర్న్ జర్నీ, వెళ్ళవలసే ఉన్నప్పుడు, బాబాతో పాటు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళేది లేదు అన్నప్పుడు, మరి తోడుగా వెళ్ళే సమీప పూసలు ఎవరవుతారు? ఎవరైతే బహుకాలము నుండి తీవ్ర పురుషార్ధం చేస్తున్నారో వారే అవుతారు. పురుషార్థం కాదు, అప్పుడప్పుడూ కాదు. బహుకాలపు తండ్రి సమానులే రాజ్యాధికారులుగా అవుతారు. మరి ఏమని భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థం ఉన్నదా? నేను తీవ్ర పురుషార్ధి లైన్లో ఉన్నాను అని స్వయం గురించి భావించేవారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థి, పెద్దగా చేతులెత్తండి, చిన్నగా కాదు. అచ్ఛా, చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళి పెద్దగా చేతులను ఎత్తండి, ఇలా (చిన్నగా) కాదు. అచ్ఛా
బాప్‌దాదా అయితే రోజూ పిల్లల చార్టును చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థిగా కూడా ఉన్నారు. కానీ అప్పుడప్పుడూ అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అని బాబా ఎందుకు చెప్తున్నారు? అటెన్షన్ ప్లీజ్, సూక్ష్మ సంకల్పాలలో కూడా అలజడి రాకూడదు. అచంచల, నిశ్చల, శుద్ధ సంకల్పధారులుగా బహుకాలము నుండి అవ్వవలసిందే. కొంతమంది పిల్లలు చాలా మధురంగా ఆత్మిక సంభాషణను చేస్తుంటారు. ఏమంటారంటే, బాబా, మేము తయారైపోతాము. సమయం ఎంత సమీపిస్తూ ఉంటుందో అంతగా పరిస్థితులు అలజడిలోకి వస్తూ ఉంటాయి అప్పుడు వైరాగ్యమైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కానీ అప్పుడు మీకు టీచర్ ఎవరు అయినట్లు? సమయమా లేక బాబానా? సమయమైతే మీ రచన. బహుకాలపు తీవ్ర పురుషార్థము అంతిమంలో పాస్ విత్ ఆనర్‌గా చేస్తుంది అని ఇప్పుడు బాప్‌దాదా సూచనను ఇస్తున్నారు. పాస్ అయితే అందరూ అవుతారు. కానీ పాస్ విత్ ఆనర్‌గా అవ్వడానికి బహుకాలము నుండి నిరంతర తీవ్ర పురుషార్థము చేయడం అవసరము. కావున ఈరోజు తారీఖును నోట్ చేసుకోండి, ఒకవేళ ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ, సమ్ థింగ్ అనగా ఏదో ఒకటి అవుతాము, చేద్దాములే అన్న పదాలు ఇంకా వస్తూ ఉంటే... ఇక ఈ మాటలు ఇకమీదట ఉండకూడదు. బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి పూసపై కూడా బాబాకు ప్రేమ ఉంది. ఎందుకని? మనస్ఫూర్తిగా నా బాబా అని అయితే అన్నారు కదా. ఈనాటి పెద్ద పెద్ద ఆత్మలు కూడా నా బాబా అని అనడం లేదు, కానీ చివరి పూసగా ఉన్నవారు నా బాబా అని నమ్ముతున్నారు కావున బాబా ప్రేమ వారిపై కూడా ఉంటుంది. పిల్లలపై ప్రేమ అయితే సదా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది, చివరి పూసపై కూడా ఉంటుంది. స్నేహమే మిమ్మల్ని బాబావారిగా చేసింది. మెజారిటీ పిల్లలకు స్నేహము ఉంది, ఉంటుంది అని బాప్‌దాదా చెప్తున్నారు కానీ కేవలం స్నేహము కాదు, శక్తి కూడా కావాలి. తీవ్ర పురుషార్థం కూడా కావాలి. అచ్ఛా.
బాప్‌దాదాకు పిల్లలపై నమ్మకం ఉంది. ఇప్పటి నుండే అటువంటి పిల్లలకు పదమా పదమరెట్లు అభినందనలనుఇస్తున్నాము. వాహ్ పిల్లలు వాహ్! ధైర్యశాలి పిల్లలు! మీ ధైర్యము మరియు తండ్రి సహాయము ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క విషయము చేయండి. మీ మనసును బిజీగా పెట్టుకోవడానికి, ఎలా అయితే బాబా ముందు కూడా చెప్పి ఉన్నారు కదా, నేను బిందువును, బిందువును పెట్టాలి మరియు అందరినీ బిందువు రూపంలో చూడాలి. బిందువునే చూసినప్పుడు ఇతర ఏ సంకల్పాలు రావు. మనసా సేవపై అటెన్షన్ ఉంచండి. దుఃఖి ఆత్మలు మొర పెట్టుకుంటున్నాయి, వారికి కిరణాలను ఇచ్చే సేవలో కూడా మనసును అదనంగా ఉపయోగించవలసి ఉంటుంది. మనసా సేవ చాలా శ్రేష్ఠమైన సేవ. దీనివలన దుఃఖంలో ఉన్నవారికి కూడా లాభము, స్వయానికి కూడా లాభము జరుగుతుంది. డబల్ లాభము. ఎలా అయితే వాచతో సేవ చేస్తారో, సేవ కూడా పెరుగుతూ ఉంది, మనసుతో చేస్తున్నారు. సంఖ్య కూడా పెరుగుతుంది, సెంటర్లు కూడా పెరుగుతూ ఉన్నాయి, మెజారిటీ పిల్లల వాచ సేవ మంచిగా ఉంది. అందరిదీ కాదు, మెజారిటీ. అలాగే ఇప్పుడు మనసుతో విశేషంగా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను కూడా చేస్తూ ఉండండి. మనసును ఫ్రీగా వదలకండి. ఏదో ఒక సేవలో, మనసుతో శక్తులను ఇవ్వడము, నోటితో వాచ సేవ, కర్మలతో గుణాల సేవ, సంబంధ సంపర్కములో సంతోషాన్ని ఇచ్చే సేవ, ఇలా భిన్న భిన్న సేవలలో మనసును బిజీగా ఉంచండి ఎందుకంటే పూర్తి విశ్వంలో రిచెస్ట్ (ధనవంతులు) ఆత్మలు ఎవరు? మీరే కదా! ఎన్ని ఖజానాలు లభించాయి? మరి ప్రతి ఖజానాతో సేవను చేయండి. ఖజానాలను ఎంతగా సేవలో వినియోగిస్తారో అంతగా ఆ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి కావున ఇప్పుడు ఎలా అయితే స్వ సేవపై అటెన్షన్ ఉంచుతున్నారో, అలాగే దుఃఖి ఆత్మలకు, తమ భక్తులకు మనసు ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్‌తో రోజంతా చేయండి. చాలా మొర పెట్టుకుంటున్నారు. మీకు వినిపించడం లేదు. మెజారిటీ ప్రతి ఇంట్లో ఏదో ఒక దుఃఖ కారణము ఉంటుంది. ఇలా దుఃఖంతో ఉన్నవారికి సుఖాన్ని ఇచ్చేది ఎవరు? చెప్పండి, ఎవరు? మీరే కదా. మరి ఈ మనసా సేవను రోజంతటిలో ఎంత సమయం చేసాను అని పరిశీలించుకోండి. స్వయం కోసం సమయాన్ని ఇచ్చినట్లుగా మనసా సేవ కోసం ఎంత సమయాన్ని ఇచ్చాను? దయా హృదయులు కదా. కావున దుఃఖంతో ఉన్నవారిపై దయ చూపండి. మీ పాట కూడా ఉంది కదా, ఓ తల్లిదండ్రుల్లారా, దుఃఖంతో ఉన్నవారిపై దయ చూపండి. బాప్‌దాదా ఎంతగానో వారి మొరను వింటూ ఉంటారు. మీకు తక్కువగా వినిపిస్తుంది కానీ ఇప్పుడు వినండి. వారు ఎక్కడికి వెళ్తారు? మీ సోదరసోదరీలే కదా. కావున స్వయానికి కూడా లాభాన్ని పొందండి, మనసును బిజీగా ఉంచండి మరియు దుఃఖంతో ఉన్నవారి దుఃఖాన్ని హరించండి. మొర పెట్టుకుంటున్నారు, మనసు విలవిలలాడుతుంది. బాప్‌దాదా అయితే వింటున్నారు. అప్పుడు పిల్లలను గుర్తు చేసుకుంటారు, ఓ నా గారాల పిల్లలూ! ప్రియమైన పిల్లలూ! ఇప్పుడు దయా హృదయ రూపాన్ని ధారణ చేయండి. బ్రాహ్మణులలో కూడా పరస్పరం సహయోగులుగా అవ్వండి. ఎవరు ఎటువంటి సంస్కారంతో ఉన్నాకానీ మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ జరపడమా లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి రక్షించడమా? దుఃఖహర్త సుఖకర్త అన్నది మీ టైటిల్ కూడా కదా! బాబాతో పాటు ఉన్నారు కదా. బాబాతో పాటుగా ఉండేవారు ఏ సంకల్పాన్ని తీసుకున్నారు? ఈ విశ్వాన్ని దుఃఖము, అశాంతి నుండి మార్చి సుఖశాంతులను స్థాపన చేయవలసిందే. చేయవలసిందే కదా! చేతులెత్తండి. చేయాలా? లేక కేవలం చూడటమేనా? జరుగుతుంది కానీ ఇప్పుడు మారాలి. బ్రాహ్మణ ఆత్మ అయినాకానీ చూస్తూ ఉండకండి, ఇది చేస్తున్నారు కానీ వారిని కూడా వాణి మరియు మనసా సంకల్పం ద్వారా పరివర్తన చేయండి, చేయాలి అని అనవద్దు. బాప్‌దాదా వింటూ ఉంటారు. బాప్‌దాదాకు విషయాన్ని ఇచ్చేసారు, బాప్‌దాదాకు ఇచ్చేసినప్పుడు స్వయం ఇక బాబా ఆజ్ఞలపై నడవండి. బాధ్యులు బాప్‌దాదా, వారితో ఉన్న ప్రియమైన పిల్లలు, నిమిత్తమైన పిల్లలు. మరి సదా మీ మనసును వ్యర్థ సంకల్పాలకు బదులుగా ఇప్పుడు దుఃఖి ఆత్మలకు, వారు బ్రాహ్మణులే కావచ్చు మరెవరైనా కావచ్చు, డిస్టర్బ్ అయి ఉన్న వారికి సహయోగాన్ని ఇవ్వండి. సహయోగిగా అవ్వండి. అచ్ఛా.
సేవ టర్న్ యు.పి, బనారస్, పశ్చిమ నేపాల్ వారిది:- మంచిది, యు.పి.కి నలువైపుల నుండి భక్తులు చాలామంది వస్తారు. యు.పి. వారు వీలైనంతగా భక్తులకు సందేశమును ఇవ్వాలి. సందేశాన్ని ఇవ్వడము మీ పని. భాగ్యము తయారు చేసుకోవడము, ఎంత భాగ్యము చేసుకుంటారు అన్నది వారి చేతుల్లో ఉంది. కానీ, మా తండ్రి వచ్చారు, మా తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని మీరు సందేశాన్ని ఇవ్వలేదు, మేము కొంతైనా వారసత్వాన్ని తీసుకునే వారము అని మీకు ఫిర్యాదు ఇవ్వకూడదు. సేవ అయితే మీరు చేస్తున్నారు. బాబా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది. అయినప్పటికీ, ఎంత వీలైతే అంత సందేశమునిచ్చే పాఠము మీకు సహజమైనది. యు.పి పట్ల బ్రహ్మా బాబాకు, జగదాంబకు చాలా ప్రేమ ఉంది. ఎంతగా బ్రహ్మా బాబా యు.పికి వచ్చారో అంతగా ముంబయికి కూడా వచ్చారు, కానీ యు.పికి వచ్చారు. మరి ఎక్కడైతే బ్రహ్మా బాబా అడుగు పడిందో ఆ స్థానము ఎంత భాగ్యము కలిగింది. లక్నో మరియు కాన్పూర్ రెండూ ఈ భాగ్యానికి అధికారిగా ఉన్నాయి. ముంబయి కూడా అధికారిగా అయ్యింది కానీ ఇప్పుడు యు.పి టర్న్ కదా. డైరెక్ట్‌గా తల్లి మరియు తండ్రి యొక్క శిక్షణల బిందువులు అక్కడ పడ్డాయి. ఇప్పుడు యు.పి. ఇక ఏమి చేస్తుంది? వాణి ద్వారా మేళాలలో సేవ అయితే చేస్తున్నారు కానీ ఇప్పుడు సమయానుసారంగా బాప్‌దాదా ఏదైతే ముందు నుండి చెప్తూ వస్తున్నారో, పేరుగాంచిన మైక్ మరియు వారసులు, ప్రఖ్యాతి పొంది ఉండటము అంటే వారి మాటల ప్రభావం వినేవారిపై పడాలి, అటువంటి మైక్‌లను తయారు చేయండి. టీచర్లు చేతులెత్తండి. అచ్ఛా.
టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. మరి అంతమందిని తయారు చేయండి. చిన్న సెంటరైనా, పెద్ద సెంటరైనా కానీ ప్రతి సెంటర్, సెంటర్ లిస్ట్‌లో ఉండేవారు ఋజువును చూపించండి. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకం లేదు. ఎప్పుడైనా, ఏమైనా జరుగవచ్చు. కావున బాప్‌దాదా ఏ జోన్ వారైతే వచ్చారో, ఇక్కడ రానివారైనాకానీ, అన్ని జోన్లవారికి ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ముందుకు సాగండి. క్లాసులైతే జరుగుతూనే ఉంటాయి, సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నిమిత్తంగా అయ్యేవారిని తయారు చేయండి. అలా తయారు చేయడానికి బాప్‌దాదా ఏమి చూసారంటే ప్రతి జోన్లో అలా నిమిత్తంగా అవ్వగలిగిన వారు ఉన్నారు. చేస్తున్నారు కూడా కానీ కొంచెం ఇంకా వేగంగా చేయండి. అచ్ఛా.
అందరి మిలనమైతే జరిగింది. ఎంతో తయారీ చేసుకుని వస్తారు. ప్రతి వర్గంవారు చాలా తయారీలు చేసుకుని వస్తారు, బాప్‌దాదాకు తెలుసు. కానీ సమయాన్ని కూడా చూడవలసి ఉంటుంది. మరి అందరూ ఇప్పుడు తీవ్ర పురుషార్ధీగా అవుతున్నందుకు అడ్వాన్స్‌గా చాలా చాలా పదమారెట్లు అభినందనలు ముందుగానే తెలుపుతున్నాము. ఇప్పుడు వచ్చినవారిలో మురళిని రెగ్యులర్‌గా వినేవారున్నారు. కొందరు మురళిని వినని వారున్నారు. వారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. అచ్ఛా, మురళిని చదవనివారు లేక విననివారు లేవండి. కొద్దిమంది ఉన్నారు. ఫర్వాలేదు కానీ ఇప్పుడు లభించిన సమయములో బాబా మహావాక్యాలను రోజూ వినండి లేక చదవండి. బాబా పరంధామం నుండి వస్తారు, సూక్ష్మ వతనం నుండి బ్రహ్మా బాబా వస్తారు. వచ్చి మహావాక్యాలను ఉచ్చరిస్తారు కావున మురళి ఎప్పుడూ, ఒక్క రోజు కూడా మిస్ చేయకండి. మిస్ అయితే మీ బాప్‌దాదా హృదయ సింహాసనం దూరమవుతుంది. కావున ఎవరైతే మురళి మిస్ చేస్తారో వారు మేము మూడు సింహాసనాలకు అధికారులము కాదు అని భావించండి. రెండు సింహాసనాలకు అధికారిగా కూడా యథాశక్తి అవుతారు. కావున మురళి, మురళి, మురళి. ఎందుకంటే మురళిలో రోజంతటి కోసం డైరెక్షన్లు ఉంటాయి. నాలుగు సబ్జెక్ట్‌ల గురించి డైరెక్షన్లు ఉంటాయి. కావున రోజూ డైరెక్షన్లను పొందాలి. ఒకవేళ కొన్ని కారణాల వల్ల మిస్ అయితే ఎలా ఆ మురళిని వినాలి అని ప్రోగ్రామ్ తయారు చేసుకోండి. ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించండి. ఈరోజుల్లో సైన్స్ సాధనాలు మీకోసమే వెలువడ్డాయి. బ్రహ్మా బాబాలో ప్రవేశించక ముందు 100 సంవత్సరాల మునుపు ఈ సైన్స్ వెలువడింది, మీకు కూడా ఉపయోగపడనున్నాయి కావున వాటిని ఉపయోగించండి. లాభాన్ని పొందండి.
అచ్ఛా, ఎదురుగా కూర్చుని ఉన్న వారికి, దూరంగా ఉండి వింటున్న పిల్లలకు అందరికీ బాప్‌దాదా యొక్క హృదయము మరియు ప్రాణము, ప్రేమతో ప్రియస్మృతులు మరియు నమస్తే,
*** ఓంశాంతి ***
