‘‘సత్యమైన హృదయంతో బాబాకు మరియు పరివారానికి స్నేహిగా అయ్యి శ్రమనుండి ముక్తులయ్యేందుకు ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని పొందండి’’
ఓం శాంతి 01-11-20 మధుబన్
ప్రాణప్రదమైన అవ్యక్త తల్లి-తండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా తమ మెరిసే ఫరిశ్తా డ్రస్ ద్వారా అవ్యక్త ఆత్మిక సంభాషణను అనుభవం చేసేవారు, సర్వ స్వమానధారి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - ప్రియమైన బాప్‌దాదాతో జరుపుకునేందుకు ఉన్న ఈ మంగళకరమైన మిలనము అలౌకిక సీజన్లో కూడా అనేక ఆనందకరమైన అనుభూతులను చేయిస్తుంది. బాబా పిల్లలందరూ ఆన్లైన్ వీడియో ద్వారా చక్కని భావనను మరియు పాలనను అనుభవం చేసుకుంటున్నారు. ఈ రెండవ టర్న్ ఇండోర్ జోన్ (ఆరతి అక్కయ్య) వారిది. కొద్దిమంది సోదరసోదరీలు మాత్రమే తమ సాధనాలలో శాంతివన్‌కు చేరుకున్నారు. అందరూ ఏకాంత, ప్రశాంతమైన వాతావరణంలో యోగం యొక్క గుహ్య అనుభూతులను చేసుకుంటున్నారు.
బాప్‌దాదా పిల్లలందరికీ ఉన్నతోన్నతమైన స్వమానాలను గుర్తు తెప్పిస్తూ ఇలా అంటారు. పిల్లలూ, సదా స్వమానంలో ఉండి అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఈ స్వమానమే దేహ అభిమానాన్ని తొలగిస్తుంది. ఇటువంటి మధురమైన అవ్యక్త మహావాక్యాలను వింటూ అందరిలో తీవ్ర పురుషార్ధపు అల వచ్చేస్తుంది. మధురమైన బాబా అయితే పిల్లలైన మనకు డ్రామా పాఠాన్ని ఎంతగా పక్కాగా నేర్పించారంటే అది మన స్థితిని అచలంగా, నిశ్చలంగా మరియు ఏకరసంగా చేసేస్తుంది.
ఇప్పుడు పండుగల సమయం. ఈసారి నలువైపుల కొన్ని సేవాకేంద్రాలలో దేవతల చాలా సుందరమైన చైతన్య కొలువులను అలంకరించి ఆన్లైన్ ద్వారానే భక్తులందరికీ దేవతల దర్శనం చేయించడం జరిగింది. ఈ సైన్స్ సాధనాలు కూడా సేవకు మంచి సాధనాలుగా అయ్యాయి. ఎటువంటి పరిస్థితులలోనైనాగానీ బాబా తమ అనంతమైన సేవలను చేయిస్తారు. ఇప్పుడు ధన త్రయోదశి, దీపావళి, నూతన సంవత్సరం మరియు భయ్యాదూజ్కు గుర్తుగా నిలిచే దీపావళి రానుంది. అందరికీ ముందుగానే ఉల్లాస ఉత్సాహాలు నింపే ఈ పండుగలకు అనేకానేక అభినందనలు. ఈ సంవత్సరం దీపరాజు బాబాతో కలిసి అందరం మంగళకర మిలనమును చేసుకుని విశేషంగా యోగ తపస్సు చేయండి. ఇకపోతే డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ వాహ్! బాబా వాహ్! మీ ప్రభు లీల వాహ్! అనే పాటను పాడుతూ, సదా హర్షితంగా ఉంటూ సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి. ప్రతి దృశ్యంలోనూ ఎంతో కళ్యాణం ఇమిడి ఉంది. అచ్ఛా - అందరికీ ప్రియస్మృతులు... ఓం శాంతి.
01-11-20 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” రివైజ్ వీడియో 15-11-05 మధుబన్
సత్యమైన హృదయంతో బాబాకు మరియు పరివారానికి స్నేహిగా అయ్యి శ్రమనుండి ముక్తులయ్యేందుకు ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని పొందండి
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ శ్రేష్ఠ స్వరాజ్యాధికారి, స్వమానధారి పిల్లలను చూస్తున్నారు. పిల్లలకు బాబా తమకంటే ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు. బాబా తమ పిల్లలందరినీ పాదాలు పట్టుకోవడం నుండి విడిపించి శిరోకిరీటాలుగా చేసారు. స్వయాన్ని సదా ప్రియమైన పిల్లలకు సేవాధారి అన్నారు. ఇంత ఉన్నతమైన అధికారం యొక్క స్వమానాన్ని పిల్లలకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా మిమ్మల్ని మీరు స్వమానధారిగా భావిస్తున్నారా? స్వమానధారి యొక్క విశేష లక్షణాలు ఏమిటి? ఎవరు ఎంత స్వమానధారిగా ఉంటారో అంతగానే సర్వులకు గౌరవాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. ఎంత స్వమానధారిగా ఉంటారో అంతగా నిర్మానంగా, సర్వులకు స్నేహిగా ఉంటారు. స్వమానధారి యొక్క గుర్తు - బాబాకు ప్రియంగా ఉండటంతోపాటు సర్వులకు ప్రియంగా ఉంటారు. పరిమితమైనవారికే ప్రియంగా కాదు, అపరిమితంగా అందరికీ ప్రియంగా ఉంటారు. బాబా అందరికీ ప్రియమైనవారే అందువలనే ఒక నెల పిల్లలైనా, ఆదిరత్నాలైనా నేను బాబా వాడిని, బాబా నావారు అని అంగీకరిస్తారు. సర్వులకు అతీతంగా ఉండటానికి, శ్రేష్ఠ స్వమానానికి ఇదే గుర్తు ఎందుకంటే అటువంటి పిల్లలు ఫాలో ఫాదర్ చేస్తుంటారు. చూడండి, బాబా ప్రతి ఒక వర్గం వారికి, చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరికీ స్వమానాన్ని ఇచ్చేవారు. యువకులకు వినాశకారి నుండి విశ్వ కళ్యాణకారి అనే స్వమానాన్ని ఇచ్చారు. మహాన్‌గా చేసారు. ప్రవృతిలో ఉండేవారిని మహాత్మలు, జగద్గురువుల కంటే ఉన్నతంగా చేసారు, ప్రవృత్తిలో ఉంటూ పర-వృత్తిలో ఉండే మహాత్ముల తలను కూడా వంచేవారిగా చేసారు. కన్యలకు శివశక్తి స్వరూపం యొక్క స్వమానాన్ని స్మృతి తెప్పించారు, అలా తయారుచేసారు. వృద్ధ పిల్లలను బ్రహ్మా బాబాకు సమ అనుభవీలు అనే స్వమానాన్ని ఇచ్చారు. అలాగే స్వమానధారి పిల్లలు ప్రతి ఆత్మను ఈ విధంగా స్వమానంతో చూస్తారు. కేవలం అలా చూడటమే కాదు, సంబంధ, సంపర్కంలోకి వస్తారు, ఎందుకంటే స్వమానం దేహాభిమానాన్ని తొలగిస్తుంది. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహం యొక్క అభిమానం ఉండదు. దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి సహజ సాధనం - సదా స్వమానంలో ఉండటము. సదా ప్రతి ఒక్కరిని స్వమానంతో చూడటము. కాలిబలంవారైనా, 16 వేలలో చివరి నెంబర్ అయినా కానీ చివరి నెంబర్లో కూడా డ్రామానుసారంగా బాబా ద్వారా వారిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. స్వమానధారి విశేషతలను చూసి స్వమానాన్ని ఇస్తారు. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది. ఎవరు బాబా పిల్లలుగా అయినా విశేషాత్మలే. నెంబర్వార్ అయినా ప్రపంచంలో కొద్దిమందిలో కొద్దిమంది. ఇలా మిమ్మల్ని మీరు విశేషాత్మగా భావిస్తున్నారా? స్వమానంలో స్థితులవ్వాలి, దేహాభిమానంలో కాదు.
బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంటుంది, ఎందుకు? ఎందుకంటే నన్ను గుర్తించి, నా వారిగా అయ్యారు అని. ఈ మేళాలోకి మొదటిసారి వచ్చినాకానీ నా బాబా అనైతే అన్నారు. బాబా ప్రేమకు పాత్రులు అయ్యారు. బాప్‌దాదాకు నలువైపుల ఉన్న పిల్లలందరూ ప్రియమైనవారే. అలా ఫాలో ఫాదర్ చేయండి. ఎవరూ అప్రియమైన వారు లేరు, అందరూ ప్రియమైనవారే. చూడండి, పిల్లలు నా బాబా అని అంటున్నారంటే ఈ నా అన్న భావన ఎలా వచ్చింది? స్నేహం ద్వారా. ఇక్కడ కూర్చున్నవారందరూ స్నేహమే బాబా వారిగా చేసింది అని భావిస్తున్నారు! బాబా స్నేహం అయస్కాతం వంటిది, ఈ స్నేహమనే అయస్కాంతమే బాబా వారిగా చేసింది. హృదయపూర్వక స్నేహం ఉండాలి, కేవలం చెప్పటం వరకు కాదు. హృదయపూర్వక స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. బాబాను కలుసుకోవడానికి ఎందుకు వస్తున్నారు? స్నేహమే తీసుకువచ్చింది కదా! ఇక్కడ కూర్చున్న వారందరూ ఎందుకు వచ్చారు? స్నేహమే ఆకర్షించింది కదా! ఎంత స్నేహం ఉంది? 100 శాతమా లేక ఇంకా తక్కువ ఉందా? ఎవరైతే 100 శాతం ఉంది అంటారో వారు చేతులు ఎత్తండి! స్నేహంలో 100 శాతం ఉందా, కొద్దిగా కూడా తక్కువ లేదు కదా? మంచిది. మరి ఇంత స్నేహమే బ్రాహ్మణ పరివారంపై ఉందా? దీనిలో చేతులు ఎత్తతున్నారా? దీనిలో శాతం ఉంది. ఎలా అయితే బాబాకు అందరిపై స్నేహం ఉందో అలాగే పిల్లలకు కూడా సర్వులతో స్నేహం ఉండాలి, సర్వులకు స్నేహి. ఇతరుల బలహీనతలు చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారాలకు వశీభూతం అయితే ఎవరిని అనుసరించాలి? వశమై ఉన్నవారినా? మీరు వశీకరణ మంత్రాన్ని ఇచ్చేవారు, వశీభూతం నుండి విడిపించే మంత్రం ఇచ్చేవారు, విడిపించేవారు కదా! లేక చూస్తూ ఉండేవారా? కనిపిస్తుంది కదా అంటారా? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపిస్తే ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక తప్పుకుంటారా? ఎందుకంటే ఎవరైతే బాబాపై మనస్ఫూర్వకమైన స్నేహం పెట్టుకుంటారో వారు సర్వులకు తప్పకుండా స్నేహిగా అవుతారు. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు సహజమైన విధి - హృదయపూర్వక స్నేహం. ఎవరు ఎంత జ్ఞానిగా ఉన్నా కానీ ఒకవేళ హృదయపూర్వక స్నేహం లేకపోతే బ్రాహ్మణ జీవితంలో రమణీకత ఉండదు. నిస్సారమైన జీవితం ఉంటుంది ఎందుకంటే జ్ఞానంలో స్నేహం లేకుండా ఒకవేళ జ్ఞానం ఒకటే ఉంటే దానిలో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. కానీ జ్ఞానసహితమైన స్నేహం ఉంటే స్నేహి సదా స్నేహంలో లవలీనమై ఉంటారు. స్నేహితుడికి స్మృతి చేయడానికి శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. కేవలం జ్ఞానిగా ఉండి స్నేహం లేకపోతే శ్రమ చేయవలసి వస్తుంది. వీరు శ్రమ యొక్క ఫలం తింటారు, వారు ప్రేమ యొక్క ఫలం తింటారు. జ్ఞానమనేది బీజం స్నేహమనేది నీరు. జ్ఞాన బీజానికి స్నేహమనే నీరు లభించకపోతే ఫలం రాదు.
మరి ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి హృదయపూర్వక స్నేహాన్ని పరిశీలిస్తున్నారు. బాబాతో మరియు సర్వులతో ఎంత స్నేహం ఉంది? మరి మీరందరూ మిమ్మల్ని మీరు ఏమని భావిస్తున్నారు? స్నేహితులేనా? స్నేహితులేనా? హృదయపూర్వక స్నేహం మాకు ఉంది అనే వారు చేతులు ఎత్తండి! (మెజారిటీ అందరూ చేతులెత్తారు) అచ్ఛా - సర్వులకు స్నేహితులు. బాబాతో హృదయపూర్వక స్నేహం ఉంది అలాగే సర్వులతోనూ ఉందా? ఉందా సర్వులతో? వీరు నా సోదరి లేదా సోదరుడు అని అందరూ భావిస్తున్నారా? వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? భావిస్తున్నారా? లేక కొందరే భావిస్తున్నారా? బాబాపై స్నేహం విషయంలో అందరూ చేతులు ఎత్తుతారు కదా, అవును బాబాకు స్నేహితులము అని, అదే విధంగా వీరు సర్వులకు స్నేహితుడు అని మీరు అందరికోసం చేయి ఎత్తగలరా, అంతగా సర్వులకు స్నేహిగా ఉన్నారా? ఈ సర్టిఫికెట్ మీకు లభిస్తుందా? ఎందుకంటే బాప్‌దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - కేవలం బాబాతోనే సర్టిఫికెట్ తీసుకోవటం కాదు, బ్రాహ్మణ పరివారం నుండి కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో బాబా ధర్మం మరియు రాజ్యము రెండింటినీ ఒకేసారి స్థాపన చేస్తున్నారు. రాజ్యంలో కేవలం బాబాయే ఉండరు, పరివారం కూడా ఉంటుంది. కనుక బాబాకి మరియు పరివారానికి కూడా ప్రియంగా ఉండాలి.
జ్ఞానిగా అయ్యారు కానీ అలాగే స్నేహీగా కూడా తప్పక కావాలి. స్వమానంలో ఉండాలి మరియు సర్వులకు గౌరవాన్ని ఇవ్వాలి. రెండూ తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాబా ప్రతి ఒక్క పిల్లవానికి గౌరవాన్ని ఇచ్చారు, అప్పుడే మీరు ఉన్నతంగా అయ్యారు. ఈ ఒక్క జన్మలో గౌరవం ఇవ్వటం ద్వారా దానికి ప్రాలబ్ధంగా కల్పమంతా గౌరవం ప్రాప్తిస్తుంది. అర్థకల్పం రాజ్యాధికారి యొక్క గౌరవం లభిస్తుంది, మిగతా అర్ధకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది. కానీ ఇందుకు, పూర్తి కల్పానికి ఆధారం ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వడము, గౌరవాన్ని తీసుకోవడము.
అచ్ఛా - డబల్ విదేశీయులు కూడా వచ్చారు. డబల్ విదేశీయులు తెలివైనవారు. ఏ మిలనాన్ని వదులుకోరు. మంచిది. ఛాన్స్ తీసుకునేవారిని ఛాన్సలర్ అని అంటారు. అవకాశం తీసుకోవటంలో తెలివైనవారు. డబల్ విదేశీయులకు బాప్‌దాదా ఒక విషయం గురించి విశేష శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఏ విషయం గురించి? ఎక్కడెక్కడికో చెల్లాచెదురైపోయారు, దేశం మారిపోయారు, కొందరైతే ధర్మం కూడా మారిపోయారు, సంస్కృతి కూడా మారిపోయింది కానీ మారిపోయి కూడా మరలా గుర్తించే నేత్రం శక్తివంతంగా ఉంది. గుర్తించడంలో తెలివైనవారు. గుర్తించారు మరియు బాబాని తమవారిగా చేసుకున్నారు. పరివారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. బ్రాహ్మణ సంస్కృతిని అలవరుచుకున్నారు అంటే తెలివైనవారు కదా! బాప్‌దాదా సదా వీరిలో ఏమి విశేషత చూస్తారంటే బాబాతో కూడా ప్రేమ ఉంటుంది, సేవతో కూడా చాలా ప్రేమ ఉంటుంది, సేవతో ప్రేమ ఉన్న కారణంగా చాలా బిజీగా ఉంటారు. డబల్ సేవ చేస్తారు. డబల్ సేవ కాదు త్రిబల్ సేవ చేస్తారు. అంటే మూడు రకాల సేవలు చేస్తారు. ఒకటి - లౌకిక ఉద్యోగం, రెండు - జ్ఞానం చెప్పే సేవ, మరియు వీటితో పాటు ఎక్కువ మంది సెంటర్లో కర్మణా సేవలో కూడా సహయోగి అవుతారు. బాప్‌దాదా ఎప్పుడు చూసినా కానీ మూడు రకాల సేవలలో పిల్లలు బిజీగా ఉంటారు. అది చూసి బాబా సంతోషిస్తారు, మనస్సులోనే శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా బాప్‌దాదా చూస్తున్నారు - నలువైపుల విదేశాలలో కొందరు రాత్రిలో, కొందరు పగలులో కలయిక జరుపుకుంటున్నారు.
స్నేహమంటే లవలీనమైపోవటం. స్నేహముంటే స్మృతి చేయటం కష్టమనిపించదు, మర్చిపోవటం కష్టమనిపిస్తుంది. కనుక శ్రమ అనిపిస్తుందంటే మనస్సు యొక్క స్నేహాన్ని పరిశీలించుకోండి. ఎక్కడా లీకేజ్ లేదు కదా? వ్యక్తితో కానీ, వ్యక్తి యొక్క విశేషతతో కానీ, సాధనాలతో కానీ, సాల్వేషన్తో కానీ ఆకర్షణ ఉంటే లీకేజ్ ఉన్నట్లు. నియమ ప్రమాణంగా సాల్వేషన్ కోరుకోవడం మంచిదే, కానీ ఎక్స్ట్రా సాల్వేషన్ పైన కూడా ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఆ సాల్వేషన్ గుర్తుకు వస్తూ ఉంటుంది. దానికి గుర్తు ఏమిటంటే - ఎక్కడైనా కానీ లీకేజ్ ఉంటే జీవితంలో సదా ఏదో ఒక కారణంగా అసంతుష్టత అనుభవం అవుతుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సదా ప్రసన్నత ఉంటుంది. అత్నిక గులాబి వలె సదా నవ్వుతూ ఉంటారు, వికసించి ఉంటారు, మూడ్ ఆఫ్ అవ్వరు. సదా డబల్ లైట్‌గా ఉంటారు. కనుక ఇప్పుడు అర్థమైందా! శ్రమ నుండి రక్షించబడండి. పిల్లల యొక్క శ్రమ బాప్దాదాకి ఇష్టమనిపించదు. అర్థకల్పం శ్రమ చేసారు, ఇప్పుడు మజాగా ఉండండి. ప్రేమలో లవలీనమై ఉండండి. జ్ఞానసాగరం యొక్క లోతులో అనుభవం యొక్క ముత్యాలు పొందండి. కేవలం సాగరంలో మునిగి వచ్చేయకండి. లవలీనం అవ్వండి.
అందరూ ప్రతిజ్ఞ అయితే చేసారు కదా! బాబా మీ వెంటే ఉంటాము, నీ వెంటే వెళ్తాము అని, చేసారా? వెంట ఉంటారా లేక వెనుక వస్తారా? వెంట వెళ్ళడానికి తయారుగా ఉన్నవారు చేతులు ఎత్తండి? తయారేనా? ఆలోచించుకుని చేయి ఎత్తండి! తయారేనా అంటే బాబా సమానమేనా? బాబా వెంట ఎవరు వెళ్ళగలరు? బాబా సమానమైనవారే బాబా వెంట వెళ్ళగలరు. ఎవరెడీయేనా? మొదటి వరసలో వారు ఎవరెడీయేనా? ఎవరెడీయేనా? రేపే వెళ్ళేందుకు ఆజ్ఞ ఇస్తే వెళ్తారా? అచ్ఛా, ప్రవృత్తిలోని వారు సిద్ధమేనా? పిల్లలు జ్ఞాపకం రారా? మాతలు వెళ్తారా? తయారేనా మాతలు? ఎవరూ గుర్తుకురారా? టీచర్లకు సెంటర్ గుర్తుకు వస్తుందా? విద్యార్థులు గుర్తుకు వస్తారా? గుర్తుకురారా? మంచిది, అందరూ నిర్మోహిగా అయిపోయారా? అయితే చాలా మంచిది. అప్పుడిక శ్రమ చేయవలసిన అవసరం లేదు.
ఈరోజు బాప్‌దాదా అందరినీ అంటే ఎదురుగా కూర్చున్నా కానీ దూరంగా కూర్చున్నా కూడా బాబా హృదయంలో కూర్చున్న వారందరినీ శ్రమ నుండి ముక్తులు చేయాలనుకుంటున్నారు. అవుతారా? చప్పట్లు అయితే కొట్టేసారు. కానీ తయారవుతారా? రేపటి నుండి ఎవరూ దాదీల దగ్గరికి రారు కదా? శ్రమ ఇవ్వరు కదా? ఆనందంగా కలుసుకుంటారు కదా? జోన్ హెడ్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదులు(కంప్లెయింట్) చేయరు కదా! సంపూర్ణంగా (కంప్లీట్) ఉంటారు కదా? సరేనా? ఇప్పుడు చేతులు ఎత్తండి? ఆలోచించుకుని ఎత్తండి? మామూలుగా ఎత్తేయటం కాదు. ఏ ఫిర్యాదు ఉండకూడదు. నేను అనేది ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు, సమాప్తం. ప్రతిజ్ఞ అయితే చేసారు కదా, మంచిది, శుభాకాంక్షలు. కానీ ఆ ప్రతిజ్ఞ యొక్క లాభం పొందటం లేదు. ప్రతిజ్ఞ చాలా త్వరగా చేసేస్తున్నారు కానీ దాని యొక్క లాభం పొందేందుకు ఒకటి రియలైజేషన్, రెండు ఆ ప్రతిజ్ఞను రివైజ్ చేసుకోండి. అమృతవేళ బాబాని కలుసుకున్న తర్వాత ప్రతిజ్ఞ మరియు దాని యొక్క లాభం రెండింటి సమానత యొక్క చార్ట్‌ను తయారు చేయండి. ఏ ప్రతిజ్ఞ చేసాము మరియు ఎంత లాభాన్ని పొందుతున్నాను? రియలైజ్ అవ్వండి, రివైజ్ చేయండి. సమానత ఉంటే మంచిది. బాప్‌దాదా పిల్లలందరినీ చూసి వాహ్! పిల్లలూ! వాహ్! అని పాటను పాడుతున్నారు. అచ్ఛా - ఇప్పుడు ఏమి చేయాలి?
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- మంచిది, ప్రతి జోన్ వారికి ఛాన్స్ లభిస్తుంది, విశేష ఛాన్స్ లభించడంతో వాయుమండలం నుండి లాభాన్ని, యజ్ఞ సేవ చేసి పుణ్య ఖాతాను మరియు సేవతో సర్వ బ్రాహ్మణుల సంబంధ సంపర్కం ద్వారా ఈశ్వరీయ ప్రేమ బంధాన్ని పెంచుకుంటున్నారు. మరి చాలా మంచిగా చేస్తున్నారు మరియు రేపటి నుండైతే వెళ్ళడం కూడా మొదలవుతుంది. చాలా మంచిగా చేసారు, సేవా బలాన్ని సదా కోసం నింపుకుని వెళ్ళండి. మంచిది. సేవా అవకాశాన్ని అయితే తీసుకున్నారు, ఇప్పుడు ఏ ప్రతిజ్ఞనైతే చేసి వెళ్తున్నారో దాని లాభాన్ని విశేషంగా సేవ యొక్క రిటర్న్ రూపంలో ఇస్తూ ఉండండి. ప్రతిజ్ఞతో లాభాన్ని పొందండి. కేవలం ప్రతిజ్ఞ కాదు, లాభం. మంచిది.
అందరూ శ్రమ నుండి ముక్తులమవుతాము అని ప్రతిజ్ఞ చేసారు కదా! (అందరూ చేతులెత్తారు) అచ్ఛా - వీరి ఫోటో తీయండి. ఇప్పుడు ఒక్క నిమిషం కోసం తమ హృదయంతో చేసిన ప్రతిజ్ఞను దృఢత్వంతో అండర్లైన్ చేయండి. మీ మనసులో పక్కా చేసుకోండి. (డ్రిల్) అచ్ఛా.
నలువైపుల ఉన్న స్వమానధారి పిల్లలకు, సదా బాబా యొక్క మనస్సు యొక్క స్నేహీ, సర్వుల యొక్క స్నేహీ శ్రేష్టాత్మలకు, సదాశ్రమ నుండి ముక్తులుగా, జీవన్ముక్తులుగా అనుభవం చేసుకునే తీవ్ర పురుషార్ధి పిల్లలకు, సదా ప్రతిజ్ఞ మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని తీసుకునే వారికి, సమానత ఉంచుకునే పరమానంద పిల్లలకు, సదా ఆనందంలో ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందంలో ఉంచేవారికి, ఇలా సంగమయుగ శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు మనోభిరాముని యొక్క మనస్సు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి. ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
