‘‘పరివారంతో ప్రీతిని నిర్వర్తించడానికి నాలెడ్జ్‌ఫుల్‌గా అయి తండ్రి సమానంగా సాక్షి స్థితిలో ఉండాలి. తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారము నాలుగింటిలో నిశ్చయబద్ధిగా అయి విజయులుగా అవ్వాలి’’
3-4-20 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” - వీడియో - 15-12-09 మధువనం
పరివారంతో ప్రీతిని నిర్వర్తించడానికి నాలెడ్జ్‌ఫుల్‌గా అయి తండ్రి సమానంగా సాక్షి స్థితిలో ఉండాలి. తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారము నాలుగింటిలో నిశ్చయబద్ధిగా అయి విజయులుగా అవ్వాలి
ఈరోజు సమర్థుడైన బాబా సమర్థులైన తమ పిల్లలను చూస్తున్నారు ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అయ్యే పురుషార్థాన్ని స్నేహంతో, ఎంతో తపనతో చేస్తున్నారు. బాప్‌దాదా పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తారు మరియు వాహ్ పిల్లలు వాహ్! అని పిల్లల పాటను పాడుకుంటారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి కిరీటంవంటి వారు. చూడండి, పిల్లల పూజ డబల్ రూపంలో జరుగుతుంది, తండ్రి పూజ ఒక్క రూపంలోనే జరుగుతుంది. అంటే పిల్లలు తండ్రి ద్వారా తండ్రికన్నా ముందుకు వెళ్తారు అందుకే బాబా పిల్లల పురుషార్థాన్ని చూసి సంతోషిస్తున్నారు. నంబరువారీగా అయితే ఉన్నారుగానీ పురుషార్థం యొక్క లక్ష్యము ముందుకు తీసుకువెళ్తుంది.
ఈరోజు అమృతవేళ నలువైపుల ఉన్న పిల్లల్లో జ్ఞానానికి పునాది అయిన ఒక విషయాన్ని చూసాము. నిశ్చయమే పునాది. నిశ్చయబుద్ది విజయంతి అని కూడా అంటారు. మరి మీ అందరి నిశ్చయాన్ని చూసాము, అందరికీ నంబరువారీగా బాబాపై నిశ్చయమైతే ఉంది. అందుకు గుర్తుగా అందరూ బాబాను గుర్తించి బాబాకు చెందినవారిగా అయ్యారు మరియు ఇక్కడకు బాబాను కలుసుకోవడానికి కూడా వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ తండ్రిపై ఎడతెగని నిశ్చయము ఉంది కానీ తండ్రితో పాటు మరి కొన్ని నిశ్చయాలు కూడా పక్కాగా ఉండాలి. అవి - స్వయంపై నిశ్చయము. దీనితోపాటు డ్రామాయందు నిశ్చయము మరియు పరివారంపై నిశ్చయము. ఈ నాలుగు ప్రకారాల నిశ్చయాలలో పక్కాగా ఉండటము అనగా నిశ్చయబుద్ది విజయంతులుగా అవ్వడము అని అర్థము. మరి ఈ నాలుగింటిలో పక్కా నిశ్చయము ఉందా అని పరిశీలించుకోండి. బాబా విషయంలో అయితే అందరూ నా బాబా మరియు నేను బాబాకు చెందినవాడను అని అంటారు. తండ్రి నావాడు అంటూ పూర్తిగా తండ్రిపై అధికారాన్ని పొందేసారు. తండ్రి ద్వారా సదా అధికారులుగా అయి సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. దీనితోపాటు స్వయంపై కూడా నిశ్చయము తప్పనిసరి, ఎందుకని? ఒకవేళ స్వయంపై నిశ్చయం లేనట్లయితే మనసు కృంగిపోతుంది. స్వయంపై నిశ్చయము అనగా నేను తండ్రి ద్వారా స్వమానధారిని, స్వరాజ్య అధికారిని. స్వయంగా తండ్రి నాకు ఎన్ని స్వమానాలను ఇచ్చారు! ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంత నషా ఉంటుంది! ఈరోజుల్లో ఎవరికైనా ఏదైనా టైటిల్ లభిస్తే అది వారి భాగ్యంగా భావిస్తారు. కానీ పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానాన్ని ఇచ్చినది ఎవరు! స్వయంగా బాప్‌దాదా పిల్లలందరినీ స్వమానధారులుగా చేసారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో ఎగరండి. కనుక స్వయంపై కూడా ఇంతగా నిశ్చయమను నషా ఉండాలి - నేను తండ్రి ద్వారా స్వరాజ్య అధికారిని, స్వమాన అధికారిని, కోట్లలో కొద్ది ఆత్మను. బాబాపై నిశ్చయమున్నట్లుగా స్వయంపై నిశ్చయము ఉండటము అవసరము ఎందుకంటే ఒకవేళ స్వయంపై నిశ్చయమున్నట్లయితే ఎక్కడ నిశ్చయముంటుందో అక్కడ ప్రతి కర్మలో నిశ్చయబుద్ది అనగా స్వమానధారి విజయులుగా ఉంటారు. నిశ్చయానికి అర్థము సఫలత. మాకైతే బాబాపై నిశ్చయము ఉంది కదా అంటే సరిపోదు, బాబాపై ఉంది, అది చాలా మంచిది కానీ దానితోపాటు నేను ఎవరిని అన్న స్వ నషా ఉండాలి! ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే నిశ్చయము మరియు నషా మీ నడవడిక మరియు ముఖంలో కనిపిస్తుంది. కనిపిస్తూ ఉంది మరియు కనిపిస్తూ ఉంటుంది. మూడవ విషయము, డ్రామాపై కూడా నిశ్చయము చాలా తప్పనిసరి ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు సఫలత కూడా లభిస్తుంది. ఒకవేళ డ్రామాపై పక్కా నిశ్చయమున్నట్లయితే డ్రామాపై నిశ్చయముతో ఎవరైతే నిశ్చయబుద్ధిగా ఉన్నారో వారు సమస్యను సమాధాన స్వరూపంలోకి మార్చేస్తారు ఎందుకంటే నిశ్చయము అనగా విజయము. ఎందులో విజయులుగా అవుతారు? పరివర్తన చెందడంలో, ఒక్క సెకండులో సమస్య పరివర్తన చెంది సమాధాన రూపంగా అవుతుంది. అలజడిలోకి రారు, అచలంగా ఉంటారు ఎందుకంటే డ్రామా జ్ఞానంతో నిశ్చలంగా, అచలంగా అవుతారు. నేనే కల్ప క్రితం కూడా సమాధాన స్వరూపంగా అనగా సఫలమైన ఆత్మగా అయ్యాను, అవుతున్నాను మరియు కల్పం తర్వాత కూడా అవుతాను అన్న నిశ్చయము ఉంటుంది. మరి ఈ నషా డ్రామాపై నిశ్చయాన్ని పక్కాచేస్తుంది. నేను అలా ఉన్నాను, ఇప్పుడూ ఉన్నాను మరియు నేనే అలా అవుతాను అన్న శుద్ధమైన గర్వముంటుంది, నషా ఉంటుంది అందుకే ఈ పురుషార్ధీ జీవితంలో డ్రామాపై నిశ్చయము కూడా అవసరము. దీనితోపాటు నాల్గవది పరివారంపై నిశ్చయము ఎందుకంటే బాబా వచ్చిన వెంటనే పరివారానికి జన్మను ఇచ్చారు. ఎలా అయితే తండ్రిపై నిశ్చయము ఉందో అలాగే పరివారంపై నిశ్చయము కూడా అవసరము ఎందుకంటే పరివారము ఎవరిది? ఇంత పెద్ద పరివారము ఇంకెవరికైనా ఉంటుందా! కనుక పరివారంపై నిశ్చయము కూడా అతి అవసరము ఎందుకంటే ఇంత పెద్ద పరివారము విశ్వంలోనే ఇంకెవరికైనా ఉందా? మీ అంతటి పరివారం విశ్వంలో ఇంకెవరికైనా ఉందేమో చెక్ చేయండి. పరివారం ప్రకారంగా ఏ డివైన్ ఫాదర్ కూడా లేదు, అక్కడ ఫాలోవర్స్ (శిష్యులు) ఉంటారు, ఇక్కడ పరివారము ఉంది. పరివారంతోపాటే సేవలో, సంబంధాలలో ఉంటారు. అంతేకానీ మాకైతే బాబాతోటే కనెక్షన్ చాలు, పరివారంతో లేకపోతే ఏమవుతుంది అని అనుకోవద్దు. పరివారంపై ఉన్న నిశ్చయంతో మీరు 21 జన్మలు నడిచేదుంది. తెలుసు కదా! పరివారంతో పాటుగా సంబంధాలలోకి వచ్చినప్పుడు నేను ఎంత పెద్ద పరివారానికి చెందినవాడను, అందరితో నిశ్చయబుద్దిగా అయి నడుచుకుంటున్నానా అని తెలుస్తుంది. పరివారంతో కలిసి నడవడానికి పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నంగా ఉంటాయి అన్న విషయంపై శ్రద్ధ వహించాలి. మీకు స్మృతిచిహ్నము మాల. మాలలో చూడండి, ఎక్కడ మొదటి నంబరు ఎక్కడ 108వ నంబరు పూస ఎందుకంటే పరివారంలో భిన్న భిన్న సంస్కారాలు ఉంటాయి. మరి ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ సంస్కారాలను అర్థం చేసుకుంటూ పరస్పరంలో ఒకే పరివారము, ఒకే తండ్రి, ఒకే రాజ్యము, ఒక్కటిగా అయ్యి నడవాలి. పరివారంలో కూడా పెద్ద పరివారము కదా, అలాగే ఇతరుల పట్ల పెద్ద మనసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామనల స్థితిని ఉంచుకుని నడుచుకోవాలి. ఎందుకంటే పరివారం మధ్యనే సంస్కార స్వభావాలు వస్తాయి. కానీ పరివారంతో మాకేమిటి, బాబాతో అయితే ఉంది కదా అని కొందరు అనుకుంటారు. కానీ ఇక్కడ ధర్మము మరియు రాజ్యము రెండింటి స్థాపన జరుగుతుంది, కేవలం ధర్మము కాదు. ఇతర ధర్మ పితలు వచ్చారు కానీ వారిది కేవలం ధర్మము మాత్రమే, రాజ్యము లేదు. ఇక్కడైతే మీరందరూ రాజ్యము కూడా చెయ్యాలి. మరి రాజ్యంలో పరివారం యొక్క అవసరము ఉంటుంది మరియు 21 జన్మలు భిన్న భిన్న రూపాలతో పరివారంతోటే ఉండాలి, పరివారాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళలేరు. కనుక పరిశీలించుకోండి. అంతేకానీ బాబాకు తెలుసు, నాకు తెలుసు అని అనుకోకండి. బాబాతోటే కార్యము జరుగుతుంది. కానీ ఈ నాలుగు నిశ్చయాలలో ఒక్క దానిలో అయినా నిశ్చయము తక్కువగా ఉన్నా కానీ అలజడిలోకి వచ్చేస్తారు. సేవా సహచరులు, బాబా అయితే సకాశ్ను ఇస్తూ ఉంటారు కానీ సహచరుడు ఎవరు? సాకార తోడుగా అయితే పరివారమే ఉంటుంది కదా. బాబా ఏమి చూసారంటే మూడు నిశ్చయాలలో మెజారిటీ మంచిగా ఉన్నారు కానీ పరివారంతో నిర్వర్తించడము, సంస్కారాలను కలుపుకుపోవడము, ప్రతి ఒక్కరినీ కళ్యాణ భావనతో చూడటము మరియు అదే విధంగా నడుచుకోవడము, ఇందులో పిల్లలు యథాశక్తిగా అయిపోతున్నారు. కానీ బాబా చూసిందేమిటంటే పరివారంపై నిశ్చయంతో నాలెడ్జ్‌ఫుల్‌గా అయి ఎవరైతే సదా తండ్రి సమానంగా సాక్షి స్థితిలో తోడుగా ఉంటారో వారు నంబర్‌వన్ లేక నంబర్‌వన్ డివిజన్‌లోకి వస్తారు. మరి పరిశీలించుకోండి, భావ స్వభావాలు పరివారంలోనే వస్తాయి, చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి, విఘ్నాలు వస్తాయి - ఇవన్నీ పరివార సంబంధాలలోనే వస్తాయి. కనుక అన్నింటికన్నా అవసరమైనది ఈ పరివార సంబంధంలో పాస్ అవ్వడము. ఒకవేళ పరివారంతో కలిసి నడవడము, తోడును నిర్వర్తించడంలో ఏదైనా లోపము ఉంటే అది చిన్న విఘ్నమైనా పెద్ద విఘ్నమైనా విసిగిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు, ఇది ఎలా అని పరివార సంబంధంలోనే వస్తుంది. కనుక ఎందుకు అనేందుకు బదులుగా, ఎందుకు చెయ్యకూడదు అనుకోవాలి. మేము కలిసి నడవాలి, పరివారంలో ప్రీతిని నిర్వర్తించాలి ఎందుకంటే ఇది తండ్రి పరివారము, భగవంతుని పరివారము. మామూలు పరివారము కాదు. వాహ్ బాబా, వాహ్ డ్రామా, వాహ్ నేను మరియు వాహ్ పరివారము అని నషా ఉండాలి. సరేనా? పరిశీలించుకుంటున్నారా? నాలుగింటిలో పాస్ అయ్యారా? నాలుగింటిలో? ఒక్క దానిలో కూడా తగ్గకూడదు. పరిశీలించుకోండి. ఇప్పుడే పరిశీలించుకోండి ఎందుకంటే విజయులుగా అవ్వడానికి ఇదే సాధనము. పరివారం మధ్యలోనే సంస్కారాలు తలెత్తుతాయి మరియు ఆ సంస్కారాలతో కలుపుకుపోవడము అంటే స్వయము పరివర్తన చెందడము మరియు పరివారాన్ని అంతటి ఉన్నత దృష్టితో చూడటము అని అర్థము. బాప్‌దాదా తమ చివరి బిడ్డను కూడా అతి భాగ్యశాలిగా చూస్తారు అని ముందు కూడా చెప్పి ఉన్నారు, ఎందుకని? భగవంతుడిని గుర్తించడము, సాధారణ రూపంలో ఉన్న తండ్రిని గుర్తించడము, పెద్ద పెద్ద మహాత్ములు కూడా గుర్తించలేకపోయారు కానీ బాప్‌దాదా లాస్ట్ బిడ్డ కూడా నా బాబా అని అంటాడు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు. బాప్‌దాదా లాస్ట్ బిడ్డలో కూడా విశేషతను చూస్తారు. ఎలా అయితే ఇతర పిల్లలకు ప్రేమను, ప్రియస్మృతులను ఇస్తారో అలాగే లాస్ట్ పిల్లలకు కూడా ఇస్తారు. మరి పరిశీలించుకోండి, మూడింటిలో మంచిగా ఉన్నారా లేక నాలుగింటిలో మంచిగా ఉన్నారా లేక రెండింటిలో మంచిగా ఉన్నారా లేక ఒక్క దానిలో మంచిగా ఉన్నారా? పరిశీలించుకున్నారా? పరిశీలించుకున్నారా? నేను నాలుగింటిలో అనగా తండ్రి, మీరు, డ్రామా మరియు పరివారము నాలుగింటి నిశ్చయాలలో మంచిగా ఉన్నాను అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మంచిగా ఉన్నారా? అచ్ఛా, మంచిగా ఉన్నారా, మరి ఈ పరీక్షను తీసుకోమంటారా? చేతులెత్తండి. అచ్ఛా, పరివారంలో కూడా పాస్ అయ్యారా? పరివారంలోని సంబంధాలలోకి రావాలి, ఎందుకంటే పరివార సంబంధాలను విడిచి ఎక్కడికీ వెళ్ళలేరు, ఇందులో ఉండాల్సిందే, నిర్వర్తించాల్సిందే. మరి ఇందులో పాస్ అయ్యారా? వీరు లేకపోతే బాగుంటుంది, వీరిలా ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు జరుగుతుంది అని సంకల్పాలు ఎప్పుడైనా వస్తాయా... పూర్తిగా పరివార నషా. నాలుగు నిశ్చయాలు ఉన్నవారు సంకల్పంలో కూడా అలాంటి ఇలాంటి సంకల్పాలు చెయ్యరు. ఇలా ఎందుకు జరుగుతుంది అని సంకల్పంలో రావచ్చు కానీ ఆ ఎందుకు, ఏమిటి అన్నది నన్ను కదిలించకూడదు, మూడ్ మార్చకూడదు. నాలుగింటిలో పాస్ అని దీనినంటారు. చేతులైతే ఎత్తారు, బాప్‌దాదాను సంతోషపెట్టారు కానీ పరివారం విషయంలో బాప్‌దాదా కొన్నిటిని వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది. పూర్తిగా పెద్ద మనసు చేసుకోవాలి, అందరినీ శుభ భావన, శుభ కామనలతో మంచిగా చెయ్యాలి, ఎందుకంటే పరివారం ఒక్కటే. ఏకమతంతో నడుచుకోవాలి, నడిపించాలి. కేవలం నడవడం కాదు, నడిపించాలి కూడా. అందుకే బాప్‌దాదా ఏమంటున్నారంటే పరివారంలో ఎవరైతే అలజడులలో పాస్ అవుతారో, వ్యర్థం రాదో, వారు ఇతరులను ఇలా తయారు చెయ్యడంలో అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడైతే మీరు తమ తమ సెంటర్లలో ఎంతమంది ఉంటారు. ఎక్కువలో ఎక్కువ 25-50, ఇంతమంది ఉండరు కానీ పెద్ద స్థానమైతే అందులో కూడా 50-60 మంది, సరే ఎక్కువ అంటే 100 మంది అనుకోండి. ఇంతమంది లేరు కానీ ఉన్నారనుకోండి. బాప్‌దాదా సెంటర్లలోని పిల్లలందరినీ లాస్ట్ వారిని కూడా నాకు ప్రియమైనవారు అంటూ నడిపించారు. ప్రేమకు గుర్తుగా బాబా రోజూ ప్రియస్మృతులలో ఏమని చెప్తారు? మధురాతి మధురమైన అని అంటారు, పుల్లని పిల్లలు కూడా ఉన్నారని తెలుసు, కానీ మధురమైన, పుల్లని పిల్లలకు అని ఎప్పుడైనా చెప్పారా? వారిని గారాల పిల్లలు అనే అంటారు, నా పిల్లలు అని కేవలం అనడమే కాదు, నావారు అన్న భావంతో నడిపిస్తారు కూడా ఎందుకంటే డ్రామాలో, మాలలో అందరూ ఒక నంబర్లో లేరు, ఇది రిజల్ట్. సంస్కారాలు భిన్నంగా ఉంటాయి, ఉండాల్సిందే, లేకపోతే అందరూ రాజులైపోతే ప్రజలుగా ఎవరు అవుతారు! ఎవరిపై రాజ్యం చేస్తారు? మంచి ప్రజలు కూడా కావాలి కదా, రాయల్ ప్రజలు, రాజధాని కదా. ఇలా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి, పరివారంలో ఏ విషయంలో అయినా ఎవరి సంస్కారాలైనా చెడుగా ఉన్నాయనుకోండి, కానీ మరి నా సంస్కారము ఏమిటి? ఒకవేళ చెడును చూసి నా సంస్కారము కూడా పాడైతే, అప్పుడు నేను కూడా పాడైపోయినట్లే కదా. మంచిని కూడా చెడు పాడు చేస్తుంది.
బాబా స్థాపన సమయంలో 350-400 మందిని ఒకేసారి సంభాళించారు, ఇంతమంది కలిసి ఉండే పరివారమైతే ఇప్పుడు ఎక్కడా లేదు. సరే, డ్యూటీ వేరువేరుగా ఉండవచ్చు కానీ అది డ్యూటీ మరియు పరివారంలో డ్యూటీ. రివాజీ పరివారము, రివాజీ డ్యూటీ, రివాజీ పద్ధతిలో దినచర్యను గడపడము, ఇది కాదు. ప్రియమైన మరియు అతీతమైన పరివారము. ఇందులో డిస్టర్బ్ అవ్వడము, మళ్ళీ అందుకు సాకు ఏమంటారంటే వారు చేసారు కాబట్టి ఇలా జరిగింది అని. వీరు చేసారు కాబట్టి ఇది జరిగింది, కానీ బాబా ఎదుట అపోజిషన్ జరుగలేదా! పారిపోయారు కూడా! ఇది అపోజిషన్ కాదా! అయినప్పటికీ బాబా అన్నారు, ఎవరు పారిపోయినా కానీ వారికి టోలిను పంపండి, వారిని పిలిచేందుకు ప్రయత్నించండి, సేవ చెయ్యండి, గుర్తు తెప్పించండి. ఇలా నాలుగింటి నిశ్చయములో పాస్ అవ్వాలా లేక మూడు, రెండింటిలో మాత్రమేనా? నంబర్‌వన్‌గా కావాలి. ఇందుకోసం వినాశనం తయారీలు జరిగి ఉన్నప్పటికీ వినాశనం ఆగి ఉంది. ప్రకృతి కూడా బాబా వద్దకు వస్తుంది, ఇప్పుడు చాలా భారంగా ఉంది అని ప్రకృతి అంటుంది. ఆ భారం నుండి ప్రకృతి దూరం కావాలనుకుంటుంది. మాయ కూడా ఇలా అంటుంది, నాకు తెలుసు ఇప్పుడిక నా పాత్ర వెళ్ళేదే ఉందని, కానీ బ్రాహ్మణ పరివారంలో ఎటువంటి పిల్లలు కూడా ఉన్నారంటే చిన్న విషయంలో కూడా నాకు తోడుగా ఉంటారు. నన్ను వారి వద్ద కూర్చోబెట్టుకుంటారు. మరి తమ రాజ్యాన్ని తీసుకోవడంలో ఈ నాలుగు నిశ్చయాలు శాతంలో ఉన్నాయి అందుకే సమయం కూడా ఆగి ఉంది. నిజానికి మాయ మరియు ప్రకృతి రెండూ సిద్ధంగా ఉన్నాయి. మరి చెప్పండి, వాటిని ఆజ్ఞాపించమంటారా? పిల్లలు ఒకవేళ ఎవరెడీగా లేకపోతే మాయ మరియు ప్రకృతికి ఆర్డర్ చెయ్యమంటారా? చెయ్యమంటారా? చేతులెత్తండి. తయారుగా ఉన్నారా? ఊరికే చేతులెత్తకండి. పరీక్ష వస్తుంది, ఎవరెడీ?
ఇప్పుడు బాప్‌దాదాకు పిల్లలందరిపై ఉన్న ఆశ ఏమిటంటే ఎలా అన్నదానిని ఇలా అని మార్చండి. ఎలా చెయ్యను, ఎలా అవుతుంది అని అనవద్దు. ఇలా చెయ్యాలి. ఏమి చెయ్యను కాదు, ఇలా చెయ్యాలి. ఈ ఆశను ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? ఎంత సమయము కావాలి? ఎందుకంటే అందరూ తయారు కావాలి. ఒకవేళ మీరు తయారుగా ఉంటే, ఎవరైతే చేతులెత్తారో మీ పని ఏమిటి? ఇతరులను తమ సమానంగా చెయ్యడము. ఎవరైతే చేతులెత్తారో వారు తమ సమానంగా చెయ్యగలరా? ఎంత సమయం కావాలి? ఒక సంవత్సరము? టీచర్లు చెప్పండి, ఎంత సమయము కావాలి? పాండవులు చెప్పండి... చేతులైతే ఎత్తారు, ఎంత సమయము కావాలి? పరివారము ఇది, మరీ పరివారంలో సహయోగమును ఇవ్వవలసి ఉంటుంది కదా. పరివారం నుండి తొలగిపోవడం అనేది ఉండదు, వదిలి వెళ్ళడం అనేది లేదు, ఉండవలసినది ఇక్కడే అయినప్పుడు పరివారాన్ని కూడా తయారు చేయాలి కదా. లౌకికంలో కూడా మంచి బుద్ధి ఉన్నప్పుడు, (ఈరోజుల్లో కాదు) ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళేవారు, గ్రామాన్ని కూడా తమ పరివారంగా భావించేవారు. ఇదైతే అలౌకిక పరివారము. గొడవలైతే జరుగుతాయి, మాయ వచ్చేది పరివారం విషయంలోనే, సంబంధాలలోనే వస్తుంది. సంబంధాల విషయంలో వ్యర్థ ఆలోచనలు వస్తాయి.
బాబా అంటారు “ఒకే బలము ఒకే నమ్మకము”. ఈ రెండూ ఉన్నట్లయితే ఏమి చెయ్యలేరు! బాబా ఎంత కొద్ది సమయంలో స్థాపనా పాత్రను పూర్తి చేసారు! ఇప్పుడైతే అందరూ నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారు. డబల్ లైట్‌గా కూడా అయ్యారు. ఈ సబ్జెక్ట్ కొంచం అటెన్షన్‌ను ఇవ్వవలసిన విషయము అని బాప్‌దాదాకు తెలుసు.
మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి? తపన అనే అగ్నిని వెలిగించండి. చెయ్యాల్సిందే. ఇందుకోసం ఒక్క విషయంలో అందరూ పాస్ అయ్యారు, బాప్దాదాపై మాకు మనస్ఫూర్తిగా 100 శాతం ప్రేమ ఉంది అనుకునేవారు చేతులెత్తండి. 100 శాతం ఉందా? పెద్దగా చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు). మరి ప్రేమకు రిటర్న్ ఏముంటుంది? ప్రేమకు రిటర్న్ సమానంగా అవ్వడము, సంపన్నంగా అవ్వడము, సంపూర్ణంగా అవ్వడము. ఇప్పుడు బాప్‌దాదా ఒక డ్రిల్ చెప్తారు, బాబా మరియు దాదా ఇద్దరిపై ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా. చేతులెత్తారు, నంబరువారీగా ఉంటారు కానీ చేతులెత్తారంటే బాప్‌దాదా నమ్ముతారు. ఇద్దరిపై ప్రేమ ఉంది కదా. బ్రహ్మా బాబా మరియు శివబాబా ఇద్దరిపై ప్రేమ ఉంది కదా! ఇద్దరిపై ఉంది కదా? చేతులెత్తండి. అచ్ఛా, ఇద్దరిపై ఉంది. చాలా మంచిది, ధన్యవాదాలు. అచ్ఛా, ఇద్దరి సమానంగా అవ్వాలనుకుంటున్నారు. చేతులెత్తకండి, తల ఊపండి. అచ్ఛా. ఇద్దరిపై ప్రేమ ఉంటే శివబాబా నిరాకారుడు, సరేనా మరియు బ్రహ్మా బాబా ఫరిశ్తా. ఫరిశ్తా కదా! మరి రేపటి నుండి కాదు, ఈరోజు నుండి, ఇప్పటి నుండి రోజంతటిలో ఇద్దరు తండ్రులపై ప్రేమ ఉన్నట్లయితే ఒకసారి స్వయాన్ని నిరాకార తండ్రి సమానంగా నిరాకార స్థితిలో అభ్యాసం చేసుకోండి, ఫాలో ఫాదర్. మరోసారి ఫరిశ్తాగా అయి, సాకార రూప బ్రాహ్మణుడిగా కాదు, ఎలాగూ బ్రాహ్మణులే, కర్మలు చేయండి కానీ కర్మలను చేస్తూ కూడా ఫరిశ్తా స్థితిలో ఉండండి అప్పుడు కర్మల భారము దాని ప్రభావాన్ని చూపదు. బ్రహ్మా బాబాపై ప్రేమ ఉన్నట్లయితే బ్రహ్మా బాబా అన్ని కర్మలను చేసారు కానీ నిమిత్తమై చేసారు. బ్రహ్మా బాబాపై ఎంత భారము ఉండేది. మీలో ఎవ్వరిపైనా ఇంత భారము లేదు, ఉందా ఏమైనా, బ్రహ్మా బాబాకన్నా కూడా ఎక్కువ భారము, బాధ్యత ఎవరికైనా ఉన్నాయా? వారు చేతులెత్తండి. ఎవ్వరూ ఎత్తరు. మరి బ్రహ్మా బాబా ఇంతటి బాధ్యతలను నిర్వహిస్తూ కూడా కార్యంలో ఎలా ఉండేవారు, కర్మలలో ఫరిశ్తాగా అయి ఉండేవారు కదా! మీకు బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా, కనుక ఒకసారి ఫరిశ్తా రూపంలో ఉండండి, ఒకసారి నిరాకార స్థితిలో ఉండండి. ఈ అభ్యాసాన్ని చేస్తూ బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తాగా అయిపోండి మరియు శివ నిరాకార తండ్రిని గుర్తు చేస్తూ నిరాకార స్థితిలో స్థితులవ్వండి, ఇది చెయ్యగలరా? ఇది చెయ్యగలరా లేక కష్టమా? దీనిని మధ్య మధ్యలో చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో ఎలా చెయ్యాలంటే అది నిరంతరంగా అయిపోవాలి. మీ కర్మల అనుసారంగా మీ దినచర్యను బట్టి దీనిని ఫిక్స్ చేసుకోండి. కనీసం రోజంతటిలో 12 సార్లు ఫరిశ్తాగా, 12సార్లు నిరాకారి స్థితిలో స్థితులవ్వండి, ఇది చెయ్యగలరా? చేతులెత్తండి. చెయ్యగలరా? కష్టం కాదు కదా! సహజమే కదా! సహజమేనా? సహజమైతే చేతులెత్తండి. అచ్ఛా, చెయ్యాలి. దీనిని పక్కా చేసుకోండి.
నేను ఇందులో నంబర్‌వన్‌గా కావాలి అని అందరూ నిశ్చయం తీసుకోండి. నంబరువారీగా కావద్దు, నంబర్‌వన్ ఎందుకంటే బాప్‌దాదా వద్దకు సమయము చాలా వస్తూ ఉంటుంది. ప్రకృతి అయితే మొరపెట్టుకుంటూ ఉంటుంది. భారము సహించడం వీలవడం లేదు. మాయ కూడా వీడ్కోలు తీసుకోవాలనుకుంటుంది, కానీ అంటుంది నేనేమి చెయ్యను, బ్రాహ్మణులు తమ సంస్కారాలకు వశమై చేసే కర్మలతో నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, అప్పుడు నేను వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మరి బాప్‌దాదా ఏమని జవాబివ్వాలి! అందుకే ఎలా అయితే సమయము ముందుకు వెళ్తూ ఉందో, ఇప్పుడు మీరు సేవలో కూడా తేడాను గమనిస్తున్నారు కదా! సేవా రిటర్న్‌ను ఇప్పుడు అందరూ ఆశిస్తున్నారు, ఏదైనా జరగాలి, ఏదైనా జరగాలి అని. బ్రహ్మా కుమారీలు ఏదైతే చెప్పేవారో అది నిజమవుతుంది. ముందైతే వినాశనము, వినాశనము అని అనవద్దు అనేవారు. ఇప్పుడైతే వినాశనం ఎప్పుడు జరుగుతుంది, మీరే తారీఖును చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు వినాలనుకుంటున్నారు, ముందైతే సాకులు చెప్పేవారు, ఇది కూడా తేడా కనిపిస్తుంది కదా! ప్రాక్టికల్‌గా చూస్తున్నారు కదా అందుకే ఇప్పుడు బాప్‌దాదాతో ఏదైతే ప్రతిజ్ఞను చేసారో దానిని నిర్వర్తిస్తూ ఉండండి. సరేనా! అందుకే ఇప్పుడు లక్ష్యము పెట్టుకోండి - అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, సమాప్తిని సమీపంలోకి తీసుకురండి. మీరు కొంచం కదిలితే సమాప్తి కూడా దూరంగా పోతుంది. సమాప్తిని మీరే సమీపంలోకి తీసుకురావాలి ఎందుకంటే రాజ్యం చేసేవారు తయారుగా లేకపోతే సమయము ఏమి చెయ్యగలదు! అందుకే అన్ని సాకులు, కారణాలు, కారణం అన్న పదాన్ని సమాప్తం చెయ్యండి. నివారణను ముందుకు తీసుకురండి. చేతులు కొద్దిమందే ఎత్తినాకానీ దుఃఖితులకు సందేశాన్ని ఇచ్చి ముక్తిని ఇవ్వాలి అన్నదే కదా మీ అందరి లక్ష్యము. వారికి ముక్తిని ఇవ్వనిదే మీరు ముక్తిలోకి వెళ్ళలేరు. కావున వీరిని ముక్తులుగా చెయ్యండి ఎందుకంటే బాబా వచ్చారు కదా మరి విశ్వంలోని వారందరికీ వారసత్వాన్ని ఇస్తారు కదా. మీకు జీవన్ముక్తి వారత్వాన్ని ఇస్తారు కానీ అందరూ పిల్లలే కదా. వారికి కూడా వారసత్వమును ఇవ్వాలి కదా. మరి వారి వారసత్వము ముక్తి, మీ వారసత్వము జీవన్ముక్తి. ముక్తిని ఇవ్వనంతవరకు మీరు కూడా వెళ్ళలేరు. ఇందుకోసం ఈ డ్రిల్‌ను చెయ్యండి. 24 సార్లు. రాత్రిపగలు కలిపి 24 గంటలు ఉన్నాయి, 24 సార్లు చెయ్యండి. నిద్రించే సమయంలో నిద్రించండి. నిద్రించకండి అని బాప్‌దాదా చెప్పడం లేదు. నిద్రించండి కానీ పగలు సమయంలో పెంచండి. ఎప్పుడైనా ఫంక్షన్ చేసినప్పుడు పగలంతా పని చేస్తారు కదా. మేలుకుంటారు కదా! ఇప్పుడు ఈ డ్రిల్‌లో అందరూ సదా కోసం తమ పురుషార్థ గతిని తీవ్రం చేసుకోవాలి ఎందుకంటే బహుకాలం కావాలి. తర్వాత చేసినా కానీ బహుకాలపు పురుషార్థానికి కూడా సంబంధం ఉంది అందుకే అందరూ అటెన్షన్ పెట్టండి, నేను చెయ్యాలి, ఎవరు చేసినా చెయ్యకపోయినా కానీ నేను ఎవరెడీగా కావలసిందే.
ఇప్పుడు త్వరత్వరగా చేయండి. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు, మీకు సేవ చేయడానికి సమయం కూడా లభించదు. ఇటువంటి పరిస్థితులు కూడా మధ్యమధ్యలో రావచ్చు అందుకని ఎలా అయితే తీవ్ర పురుషార్ధీ గ్రూప్‌ను తయారు చేసారు కదా, అలాగే ఈ తీవ్ర సర్వీస్ గ్రూప్‌ను తయారు చేసి తయారవ్వండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న తండ్రి స్నేహి, ఎవరైతే స్నేహిగా ఉంటారో వారు తప్పకుండా సహయోగులుగా ఉంటారు. స్నేహానికి రిటర్న్‌గా వారు ప్రత్యక్షంగా ప్రతి కార్యంలో తనువు-మనసు-ధనము-జనముతో ఇతరులకు సహయోగులుగా తప్పక అవుతారు. ఇటువంటి స్నేహి మరియు సహయోగి పిల్లలు, ఎవరైతే సదా తండ్రి ప్రేమలో లవ్లీనమై ఉంటారో, లవ్‌లో కాదు, లవ్లీనం అయ్యి ఉండేవారికి మరియు సదా తండ్రి యొక్క సర్వ కార్యాలలో సమయాన్ని, సంకల్పాన్ని పెట్టేవారికి, ఎందుకంటే సంగమయుగంలో సమయము మరియు సంకల్పానికి ఎంతో విలువ ఉంది, ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేవారికి, ఇటువంటి తీవ్ర పురుషార్థి, ప్రతి గుణము, ప్రతి శక్తిని, ప్రతి సమయానుసారంగా కార్యంలో వినియోగించే గుణ సంపన్నులకు, శక్తి సంపన్న పిల్లలకు చాలా చాలా పదమా పదమారెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
