"పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తు - హోలియస్ట్, హైయస్ట్ మరియు రిచెస్ట్"
01-02-26 ఓం శాంతి ‘‘బులెటిన్’’ మధుబన్
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి గారాబాల పిల్లలు, సదా హోలియస్ట్, హైయస్ట్ మరియు పూర్తి కల్పానికి రిచెస్ట్ అయిన సర్వ సంగమయుగ పదమాపదమ్ భాగ్యశాలి ఆత్మలు, నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదర సోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము – ప్రియమైన బాప్‌దాదా యొక్క స్మృతి మాసమును అందరూ అవ్యక్త రూపంలో జరుపుకున్నారు. నలువైపుల చక్కని యోగ తపస్యల అల ఉండింది. బాప్‌దాదా సమానంగా అందరూ స్వ స్థితిని బంధనముక్తి జీవనముక్తిగా చేసుకోవాలని తమ సూక్ష్మ చెకింగ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి మాసము విశేషంగా సేవల మాసము. నలువైపుల శివబాబా యొక్క అవతరణకు స్మృతి చిహ్నమైన త్రిమూర్తి శివరాత్రి మహా పర్వమును అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇప్పుడు అందరి మనసులలో ఈ జెండా ఎగరాలి - సర్వులకు తండ్రి, గతి సద్గతి, ముక్తి జీవన్ముక్తి దాత ప్రియమైన తండ్రి 90 సంవత్సరాల నుండి విశ్వ పరివర్తన అనే మహా కార్యాన్ని చేస్తున్నారు. సర్వ ఆత్మలు దుఃఖము అశాంతి నుండి ముక్తిని పొంది తమ ముక్తిధామ ఇంటికి చేరుకునే రోజు దగ్గరలోనే ఉంది, ఆ తర్వాత స్వర్ణిమ యుగము ప్రారంభమవుతుంది. సంగమయుగము యొక్క సుందరమైన క్షణాలు అతీంద్రియ సుఖాన్ని, పరమానందాన్ని అనుభూతి చేయించేవి.
బాబాకు ఉన్న శుభమైన ఆశ – నా పిల్లలు ఇప్పుడు స్వయాన్ని సర్వ అవినాశి ఖజానాలతో సంపన్నంగా చేసుకుని, సదా నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేసుకోవాలి. బాబా అంటారు, పిల్లలూ, సదా మూడు బిందువుల స్మృతిలో ఉండి స్వయాన్ని సంపన్నంగా చేసుకుంటూ ఉండండి. సంపన్నతకు గుర్తు – సదా సంతుష్టత. సంగమయుగంలో సదా సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టంగా చేయాలి, ఇదే వరదానము బాప్‌దాదా తమ పిల్లలకు ఇస్తున్నారు.
బాప్‌దాదా పదే-పదే పిల్లలు ప్రతి ఒక్కరికీ సమయం యొక్క సూచనను ఇస్తున్నారు. ఈ వర్తమాన సంగమ సమయమే పూర్తి కల్పంలో శ్రేష్ఠ కర్మలకు బీజాలు వేసే సమయము, ప్రత్యక్ష ఫలాన్ని పొందే సమయము. ఇందు కోసం కేవలం ఒక్క క్షణంలో అశరీరి స్థితిలో స్థితి అయ్యే అభ్యాసం చేయండి. నిరంతరం స్మృతిలో ఉండే విధిని మీ సొంతం చేసుకోండి. రోజంతటిలో అనేకసార్లు ఏదైతే అంటూ ఉంటారో, ‘‘నేను’’ మరియు ‘‘నాది’’, నేను అన్న పదం అన్నప్పుడు ‘‘నేను ఒక శ్రేష్ఠ ఆత్మను’’ మరియు నాది అన్న పదం అన్నప్పుడు ‘‘నా బాబా’’ అన్న స్మృతి సహజయోగిగా చేస్తుంది. మరి చెప్పండి, ఈ అటెన్షన్‌ను పెట్టి నిరంతరం స్మృతి యాత్రలో ఉండే అభ్యాసం చేస్తున్నారు కదా.
ఇకపోతే గుజరాత్ జోన్ యొక్క సేవ టర్న్ ఇది, గుజరాత్ అయితే మధుబన్కు పక్కింటివారే. అందరూ సమీపత నుండి చాలా చక్కని లాభాన్ని తీసుకుంటున్నారు. చాలా సంఖ్యలో గుజరాత్ మరియు ఇతర స్థానాల నుండి సోదరసోదరీలు చేరుకున్నారు. అందరూ బాగా రిఫ్రెష్ అవుతున్నారు.
అచ్ఛా - అందరికీ స్మృతి... ఓం శాంతి.
01-02-26 ఓం శాంతి ‘‘అవ్యక్త బాప్‌దాదా’’ రివైజ్ వీడియో 02-02-07 మధుబన్
పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తు - హోలియస్ట్, హైయస్ట్ మరియు రిచెస్ట్
ఈరోజు విశ్వ పరివర్తకుడైన బాప్‌దాదా తమ తోటి పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు పరమాత్మ విశేష ప్రాప్తులను చూస్తున్నారు. ఒకటి హోలియస్ట్ (పవిత్రాతి పవిత్రులు), 2-హైయస్ట్ (ఉన్నతాతి ఉన్నతులు) మరియు 3- రిచెస్ట్ (అతి సంపన్నులు). ఈ జ్ఞానం యొక్క ఫౌండేషనే హోలీ అనగా పవిత్రంగా తయారు కావడం. కనుక, పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియస్ట్ పిల్లలు, పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, మనసా-వాచా- కర్మణ, సంబంధ-సంపర్కంలో పవిత్రత. మీరు చూడండి, పరమాత్మ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆది-మధ్య-అంతము మూడు కాలాలలోనూ హోలియస్ట్గా ఉన్నారు. మొట్టమొదట ఆత్మగా ఎప్పుడైతే పరంధామంలో ఉన్నారో, అక్కడ కూడా హోలియస్ట్గా ఉన్నారు. తరువాత ఆదికాలంలో కూడా దేవతా రూపంలో హోలియస్ట్ ఆత్మగా ఉన్నారు. హోలియస్ట్ అనగా పవిత్ర ఆత్మ యొక్క విశేషత - ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండటము. మిగతావారు కూడా పవిత్రంగా ఉంటారు కానీ మీ పవిత్రత యొక్క విశేషత - స్వప్నమాత్రంగా కూడా అపవిత్రత మనసు-బుద్ధిని టచ్ చేయకుండా ఉండటము. సత్యయుగంలో మీ ఆత్మకూడా పవిత్రముగా తయారవుతుంది మరియు మీ శరీరము కూడా పవిత్రముగా తయారవుతుంది. అత్మ మరియు శరీరము రెండింటి పవిత్రత ఏదైతే దేవాత్మ రూపంలో ఉంటుందో, అది శ్రేష్ఠ పవిత్రత. ఎంతగా హోలియస్ట్గా తయారవుతారో అంతగా హైయస్ట్‌గా కూడా తయారవుతారు. అందరికంటే ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ అత్మలుగా మరియు ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలుగా అయ్యారు. ఆదిలో పరంధామంలో కూడా హైయస్ట్ అనగా తండ్రితో పాటుగా ఉంటారు. మధ్యలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎంత సుందరమైన మందిరాలు తయారవుతాయి, ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. ఎంతగా మీ దేవాత్మల మందిరములో విధి పూర్వకంగా పూజ జరుగుతుందో అంతగా వేరేవారి మందిరాలు తయారైనాకానీ విధిపూర్వకంగా పూజ మీ దేవతా రూపాలకే జరుగుతుంది. కనుక మీరు హాలియస్ట్ కూడా మరియు హైయస్ట్ కూడా, దానితో పాటు రిచెస్ట్ కూడా. రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ అని ప్రపంచంలో అంటారు కానీ శ్రేష్ఠ అత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ ది కల్ప. పూర్తి కల్పము రిచెస్ట్‌గా ఉంటారు. మీ ఖజానాలు స్మృతిలోకి వస్తున్నాయా, ఎన్ని ఖజానాలకు యజమానులు! ఈ ఒక్క జన్మలో పొందిన అవినాశి ఖజానాలు అనేక జన్మల వరకు ఉంటాయి. మిగతా ఎవరి ఖజానా అనేక జన్మల వరకు రాదు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయము యొక్క ఖజానా, ఈ సర్వ ఖజానాలు జన్మ జన్మల వరకు వస్తాయి. ఒక్క జన్మలో పొందిన ఖజానాలు తోడుగా ఉంటాయి ఎందుకంటే సర్వ ఖజానాల దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తిస్తాయి. మరి మా ఖజానాలు అవినాశి అయినవి అన్న నషా ఉందా?
ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకొనేందుకు సహజయోగులుగా అయ్యారు. స్మృతి యొక్క శక్తితో ఖజానాలను జమ చేసుకుంటారు. ఈ సమయములో కూడా మీరు ఈ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న నిశ్చింత చక్రవర్తులు, ఏదైనా చింత ఉందా? ఉందా ఏదైనా చింత ? ఎందుకంటే ఈ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వీటిని దొంగలు దొంగిలించలేరు, రాజులు తినలేరు, నీళ్ళు ముంచేయలేవు, అందుకే నిశ్చింత చక్రవర్తులు. మరి ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా! స్మృతి కూడా ఎందుకు సహజమైనది? ఎందుకంటే, అన్నింటికన్నా ఎక్కువగా స్మృతికి ఆధారమైనటువంటివి, ఒకటి సంబంధము, రెండవది ప్రాప్తి. ఎంతగా ప్రియమైన సంబంధము ఉంటుందో అంతగా స్మృతి స్వతహాగా వస్తుంది ఎందుకంటే సంబంధములో స్నేహము ఉంటుంది మరియు ఎక్కడైతే స్నేహముంటుందో అక్కడ స్నేహితుడిని గుర్తు చేయడం కష్టం కాదు కానీ మరిచిపోవడం కష్టమవుతుంది. మరి తండ్రి సర్వ సంబంధాల ఆధారాన్ని తయారు చేసారు. అందరూ తమనుతాము సహజయోగులుగా అనుభవం చేసుకుంటున్నారా? లేక కష్టమైన యోగులుగానా? సహజమేనా? లేక అప్పుడప్పుడు సహజము, అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? ఎప్పుడైతే తండ్రిని సంబంధంతో మరియు స్నేహముతో స్మృతి చేస్తారో అప్పుడు స్మృతి కష్టమనిపించదు మరియు ప్రాప్తులను గుర్తుచేసుకోండి. సర్వ ప్రాప్తుల దాత సర్వ ప్రాప్తులను చేయించేసారు. మరి మిమ్మల్ని మీరు సర్వ ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాప్‌దాదా వినిపించారు. అవినాశి ఖజానాలేవైతే ఉన్నాయో వాటన్నింటిని పొందేందుకు విధి - బిందువు. ఏ విధముగానైతే వినాశి ఖజానాలలో కూడా బిందువు పెడుతూ పోతే పెద్దగా అవుతూ ఉంటుంది కదా. అలాగే అవినాశి ఖజానాలను జమ చేసుకొనే విధి, బిందువు పెట్టడము. మూడు బిందువులు ఉన్నాయి. ఒకటి ఆత్మ బిందువు, తండ్రి బిందువు మరియు డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో అది ఫుల్స్టాప్ అనగా బిందువు. మరి బిందువు పెట్టడం వస్తుందా? అన్నింటికన్నా ఎక్కువ సహజమైన పొల్లు ఏది? బిందువు పెట్టడము కదా! కనుక అత్మనైన నేను బిందువును, తండ్రి కూడా బిందువు, ఈ స్మృతితో స్వతహగానే ఖజానాలు జమ అయిపోతాయి. కనుక బిందువును సెకండులో గుర్తు చేస్తే ఎంత సంతోషము కలుగుతుంది! ఈ సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితానికి అధికారాలు ఎందుకంటే పిల్లలుగా కావడమంటే అధికారులుగా తయారుకావటం మరియు విశేషంగా మూడు సంబంధాల అధికారము ప్రాప్తిస్తుంది - పరమాత్ముడిని తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకునిగా కూడా చేసుకున్నారు మరియు సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ మూడు సంబంధాలతో పాలన, చదువుతో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మరియు సద్గురువు ద్వారా వరదానము లభిస్తాయి. ఎంత సహజముగా వరదానము లభిస్తుంది? ఎందుకంటే తండ్రి నుండి వరదానము పొందడం, ఇది పిల్లల జన్మ సిద్ధ అధికారము.
బాప్‌దాదా ప్రతి పిల్లవాని జమ ఖాతాను చెక్ చేస్తారు. మీరందరు కూడా మీ ప్రతి సమయము యొక్క జమ ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయిందా లేక కాలేదా, దానికి విధి ఏమిటంటే, ఏ కర్మ చేసినా ఆ కర్మలో స్వయం కూడా సంతుష్టంగా ఉండడం మరియు ఎవరితో కలసి కర్మ చేసారో వారు కూడా సంతుష్టంగా ఉండడం. ఒకవేళ ఇద్దరు కూడా సంతుష్టంగా ఉన్నట్లయితే ఆ కర్మ యొక్క ఖాతా జమ అయినట్లు అర్థము. ఒకవేళ స్వయంలో లేక సంబంధమున్న వారిలో సంతుష్టత రాలేదంటే జమ కాదు.
బాప్‌దాదా పిల్లలందరికీ సమయము యొక్క సూచనను కూడా ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగమ సమయం పూర్తి కల్పంలో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన సమయము ఎందుకంటే ఈ సంగమమే శ్రేష్ఠ కర్మల బీజమును నాటేందుకు సమయము. ప్రత్యక్ష ఫలాన్ని పొందే సమయము. ఈ సంగమ సమయములో ఒక్కొక్క సెకండ్ శ్రేష్ఠాతిశ్రేష్ఠమైనది. అందరూ ఒక్క సెకండులో అశరీరి స్థితిలో స్థితులు కాగలరా? బాప్‌దాదా సహజ విధిని వినిపించి ఉన్నారు. నిరంతర స్మృతి కొరకు ఒక విధిని తయారుచేయండి. రోజంతటిలో, రెండు పదాలను అందరూ అంటారు మరియు అనేక సార్లు అంటారు. ఆ రెండు పదాలు “నేను” మరియు “నాది”. ఎప్పుడైతే నేను అనే పదాన్ని అంటారో నేను అత్మను అన్న పరిచయాన్ని తండ్రి ఇచ్చి ఉన్నారు. ఎప్పుడెప్పుడు నేను అన్న పదాన్ని అంటారో నేను అత్మను అని గుర్తు తెచ్చుకోండి. కేవలం నేను అని అనుకోవద్దు, నేను ఆత్మను అని అనుకోండి ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను శ్రేష్ఠ ఆత్మను అని, పరమాత్మ పాలనలో ఉన్న ఆత్మను అని మరియు ఎప్పుడైతే నాది అన్న పదాన్ని అంటారో, మరి నాది ఏది? నా తండ్రి అనగా తండ్రి పరమాత్మ. కాబట్టి ఎప్పుడైతే నేను మరియు నాది అన్న పదాన్ని అంటారో అప్పుడు వీటిని చూడండి, నేను ఆత్మను మరియు నా తండ్రి. ఎంతగా నాది అనే భావనను తండ్రిలో తీసుకువస్తారో అంతగా స్మృతి సహజముగా జరుగుతుంది ఎందుకంటే నాది అనేదానిని ఎప్పుడూ మరచిపోవడం జరగదు. రోజంతటిలో చూడండి నాది అనేదే గుర్తుకువస్తుంది. కాబట్టి ఈ విధితో సహజముగా నిరంతర యోగిగా కావచ్చు. బాప్‌దాదా, ప్రతి పిల్లవానిని స్వమానము యొక్క సీట్‌పై కూర్చోపెట్టారు. స్వమానాల లిస్టును స్మృతికి తీసుకువస్తే ఎంత పెద్దదిగా ఉంటుంది! ఎందుకంటే స్వమానములో స్థితులై ఉంటే దేహాభిమానము రాలేదు. దేహాభిమానమైనా ఉంటుంది లేదా స్వమానమైనా ఉంటుంది. స్వ మానము అనగా - స్వ అనగా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్మృతి యొక్క స్థానము. మరి అందరూ తమ స్వమానంలో స్థితి అయి ఉన్నారా? ఎంతగా స్వమానములో స్థితులవుతారో అంతగా ఇతరులకు సమ్మానం(గౌరవం) ఇవ్వడం స్వతహాగా జరిగిపోతుంది. కాబట్టి స్వమానములో స్థితులవ్వడం ఎంత సహజము!
మరి అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషంగా చేసేస్తారు. రోజంతటిలో సంతోషం పోగొట్టుకోకూడదని బాప్‌దాదా ఎల్లప్పుడు అంటారు. ఎందుకు? సంతోషము ఎటువంటిదంటే, ఒక్క సంతోషంలోనే ఆరోగ్యముంది, ఐశ్వర్యముంది మరియు ఆనందము కూడా ఉంది. సంతోషము లేకుంటే జీవితం నీరసంగా ఉంటుంది. సంతోషం గురించే అంటారు - సంతోషాన్ని మించిన ఖజానా లేదు అని. ఎన్ని ఖజానాలు ఉన్నాకానీ సంతోషము లేకుంటే ఖజానా నుండి కూడా ప్రాప్తి పొందలేరు. సంతోషం లాంటి మందు వేరొక మందు లేదని సంతోషాన్ని గురించి అంటారు. కాబట్టి సంతోషము సంపద కూడా మరియు సంతోషము ఆరోగ్యము కూడా మరియు పేరే సంతోషం కాబట్టి ఆనందం కూడా దానిలో ఉండనే ఉంది. కాబట్టి సంతోషంలో మూడు విషయాలూ ఉన్నాయి. తండ్రి అవినాశి సంతోషమనే ఖజానాను ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఖజానాను పోగొట్టుకోకూడదు. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారా?
బాప్‌దాదా హోమ్‌వర్క్ ఇచ్చారు. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి ఎందుకంటే సంతోషము ఎటువంటిదంటే ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతుంది. అనుభవం చేసి చూసారు కదా! చేసారు కదా అనుభవం? సంతోషాన్ని పంచినట్లయితే పంచడానికి ముందే అది మీ దగ్గర పెరుగుతుంది. ఎవరిని సంతోష పెడ్తున్నారో వారి కంటే ముందే స్వయం సంతోషపడతారు. మరి అందరూ హోమ్‌వర్క్ చేసారా? చేసారా? ఎవరైతే చేసారో వారు చేతులెత్తండి. ఎవరైతే చేసారో సంతోషంగా ఉండాలి, కారణాలు కాదు నివారణ చేయాలి, సమాధాన స్వరూపంగా తయారుకావాలి, వారు చేతులెత్తండి. ఇది అయిపోయింది అని ఇప్పుడు అనరుకదా. బాప్‌దాదా వద్ద కొందరు పిల్లలు ఎంత శాతం ఓ.కేగా ఉన్నారో ఆ రిజల్టును వ్రాసారు. లక్ష్యం పెట్టుకుంటే లక్షణము కూడా స్వతహాగానే వచ్చేస్తుంది. అచ్ఛా. ఇప్పుడు ఏమి చేయాలి?
సేవ టర్న్ గుజరాత్ వారిది:- మంచిది, పిల్లలు తమ పుణ్య ఖాతాను భిన్న భిన్న విధులతో పెంచుకుంటున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. బాప్‌దాదా వినిపించారు కదా - మూడు ఖాతాలను జమ చేసుకోవాలి, ఒకటి తమ పురుషార్థము ద్వారా జమ చేసుకున్న ఖాతా, రెండవది ఇతర ఆత్మలను సంతుష్టపరచిన పుణ్య ఖాతా. సంతుష్టత పుణ్యము యొక్క ఖాతాను జమ చేస్తుంది మరియు మూడవది మనసా-వాచా-స్నేహ సంబంధము ద్వారా సేవ యొక్క ఖాతా. కనుక మూడు ఖాతాలను పరిశీలించుకోవాలి. మూడూ తక్కువ కాకూడదు. మరి నంబర్‌వన్ తీసుకుంటారా? జమ ఖాతాలో నెంబర్‌వన్ తీసుకోవాలి. ఏమి చేస్తారు? అద్భుతం చేస్తారు కదా. అద్భుతం చేయండి, నంబర్ తీసుకోండి. సరే, కూర్చోండి. మరి అందరూ సదా తమ మనసును బిజీగా పెట్టుకోండి ఎందుకంటే మనసే మోసపోతుంది. మనసులోనే టెన్షన్ వస్తుంది. మనసే అటూ ఇటూ పరిగెడుతుంది. కనుక మనసును బిజీగా పెట్టుకోవడము అంటే సంపన్న స్థితిలో త్వర త్వరగా స్థితి కావడము. స్థూల కర్మేంద్రియాలను నావి అని చెప్పుకుంటారు కదా, నా చేయి అని అంటారు కదా. మీ చేతిని మీ కంట్రోల్లో పెట్టుకోగలరు కదా! ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఉపయోగిస్తారు కదా! మరి బాప్‌దాదా అంటారు, మనసు మీదా, లేక మీరు మనసుకు చెందినవారా? మనసుకు యజమానులు కూడా మీరే కదా! నేను మనసును అని అయితే అనరు కదా? మనసు రాజు అయితే కాదు, ఆత్మ రాజు. కనుక కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్‌ను ధారణ చేసినప్పుడు మనసు మీకు అతి మంచి నంబర్‌వన్ సహయోగి సహచరునిగా అవుతుంది. చేసి చూడండి. కేవలం యజమానిగా కండి. రాజుగా కండి.
డబల్ విదేశీయులు:- విదేశీయులు మీ ఒరిజినల్ విదేశాన్ని మర్చిపోవడం లేదు కదా. మీరు ఒరిజినల్‌గా ఏ దేశానికి చెందినవారు? అదైతే గుర్తుంటుంది కదా. అందుకే అందరూ మిమ్మల్ని డబల్ విదేశీయులు అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. మరైతే మీరు మీ స్వీట్ హోమ్‌ను మర్చిపోరనుకుంటాను. ఎలా అయితే డబల్ విదేశీయులో అలాగే డబల్ సేవ, అంటే, మనసు మరియు వాచ సేవలను కలిపి చేయండి. మనసా శక్తి ద్వారా ఆత్మల ఆత్మిక వృత్తిని తయారు చేయండి. వాయుమండలాన్ని తయారు చేయండి.
మంచిది – ప్రతి సీజన్లో, ప్రతి టర్న్‌లో వస్తుంటారు. ఇది అందరికీ సంతోషంగా ఉంటుంది. కావున ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. మంచిది, ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో ఫాస్టుగా వెళ్ళడాన్ని రిజల్టులో చూసాము. స్వ పరివర్తనా గతి విశ్వ పరివర్తనా గతిని పెంచుతుంది. అచ్ఛా.
బాప్‌దాదా చెప్పిన ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా! ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరితో, క్రొత్తవారు కావచ్చు పాతవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, చిన్నవారు మరింత త్వరగా బాబా సమానంగా అవ్వగలరు. ఇప్పుడు సెకండులో మనసును ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ మనసు ఏకాగ్రం అవ్వాలి. ఈ ఏకాగ్రత డ్రిల్‌ను సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క సెకండులో మనసుకు యజమానిగా అయ్యి నేను మరియు నా బాబాయే ప్రపంచం, మరెవ్వరూ లేరు అన్న ఏకాగ్ర స్మృతిలో స్థితులవ్వండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే కళతో అనుభవీమూర్తులైన పిల్లలకు, సదా తమ స్వమానము అనే సీట్‌పై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయాహృదయులై విశ్వాత్మలకు మనసా శక్తి ద్వారా ఎంతో కొంత సుఖశాంతుల దానమును ఇచ్చే దయాళువు, కృపాళు, సదా బాబా స్నేహంలో ఇమిడిపోయే హృదయ సింహాసనాధికారి పిల్లలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
