"సేవలతోపాటు ఒకరికొకరు సహయోగులుగా అయ్యి వాయుమండలంలో తీవ్ర పురుషార్థపు అలను వ్యాప్తి చెయ్యండి, మన్జీతులుగా అయ్యి ఆత్మలకు మనసా సేవను చెయ్యండి"
ఓం శాంతి 18-01-26 ‘‘బులెటిన్’’ మధుబన్
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి స్నేహీలు, సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండే తీవ్ర పురుషార్థులు, బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తాలుగా అయ్యి, బాప్‌దాదా పాలనకు రిటర్న్ ఇచ్చేటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదర సోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము – మధురమైన బాప్‌దాదా యొక్క అవ్యక్త పాలనకు 57 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. బ్రహ్మా బాబా అవ్యక్త వతనవాసిగా అయ్యి, శివబాబాతో కంబైండ్‌గా ఉంటూ విశ్వ కళ్యాణం యొక్క మహాన్ సేవలు చేస్తున్నారు. దేశవిదేశాలలో వేలాది బాబా పిల్లలు అవ్యక్త పాలనను అనుభవం చేస్తూ, సదా ముందుకు వెళ్తున్నారు. బాప్‌దాదా అవ్యక్త వతనం నుండి ఎలా తమ గుప్తమైన పాత్రను చేస్తున్నారో ఈ విషయాన్ని బ్రహ్మా వత్సలందరూ అనుభవం చేసుకుంటూనే ఉన్నారు.
ఈసారి ప్రియమైన బాప్‌దాదా యొక్క స్మృతి దివసం సందర్భంగా మహారాష్ట్ర జోన్ వారి సేవ టర్న్ ఉన్నది. మహారాష్ట్ర, ముంబయి, ఆంధ్రప్రదేశ్ నుండి అనేకానేక పిల్లలు బాబా ఇంటికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం వలె పాండవ భవన్‌లోని నాలుగు ధామాలలో చాలా సుందరంగా సుగంధభరిత పూల మాలలతో అలంకరించడం జరిగింది. అనేక స్థానాల నుండి వెరైటీ పుష్పాలు వచ్చాయి. శాంతివన్ సోదరులు మరియు ఇతర స్థానాల నుండి వచ్చిన అనేక సేవాధారి సోదర సోదరీలు రాత్రిపగలు మేలుకుని బాబా యొక్క అన్ని స్థానాలను ఎంతో అందంగా అలంకరించారు. అమతవేళ నుండే బాబా పిల్లలు నాలుగు ధామాల పరిక్రమ చేస్తూ, ప్రియమైన బాప్‌దాదాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తూ తమ ఒడిని వరదానాలతో నింపుకున్నారు. బాబా అంటారు పిల్లలు, ఈ స్నేహమే యోగానికి ఆధారము. ఈ స్నేహ దివసము నాడు ఎవ్వరూ యోగం చేయడాని కష్టపడనవసరం లేదు. అందరూ ఆ ప్రేమ సాగరుడి ప్రేమ అలలలో మునుగుతూ ఉంటారు. విశేషంగా అనేక శిక్షణలు నిండిన సాకార మరియు అవ్యక్త మహావాక్యాలు కూడా అందరూ శ్రద్ధగా విన్నారు మరియు జీవితంలో ధారణ చేయాలన్న శుభ సంకల్పం చేసారు. ఆ తర్వాత, ప్రియమైన బాప్‌దాదాకు భోగ్ స్వీకరించడం జరిగింది. అన్ని స్థానాలలో రోజంతా యోగ తపస్సు జరుగుతూ ఉండింది. సాయంత్రం సమయంలో అవ్యక్త అవసరణ సమయంలో అందరూ పరుగు పరుగున డైమండ్ హాల్‌కు చేరుకున్నారు, ఆ భావనతోటే అందరూ బాబా ప్రేమలో ఇమిడిపోయి అవ్యక్త మహావాక్యాలను వినడానికి చేరుకున్నారు మరియు తమ ఒడిని అనేక వరదానాలతో నింపుకున్నారు.
ఈసారి మధురమైన బాప్‌దాదా మనసా సేవ చేయడానికి మన్జీత్గా అవ్వమని మధురమైన శిక్షణ ఇచ్చారు. బాప్‌దాదా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు – పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ ఉల్లాస-ఉత్సాహం, దృఢ నిశ్చయం ఉంచి తీవ్ర పురుషార్థం చేయాలి – నేను ఇప్పుడు బాబా సమానంగా ఫరిశ్తాగా అవ్వవలసిందే ఎందుకంటే ఇప్పుడు అందరూ బాబాతో కలిసి రిటర్న్ జర్నీ చేయాలి. ఎలా అయితే బ్రహ్మా బాబా ఫరిశ్తాగా అయ్యి అవ్యక్త వతనవాసిగా అయ్యారో, తమ జీవితంతో ఫరిశ్తాతనపు జీవితాన్ని చూపించారో అలాగే పిల్లలైన మనం కూడా ఫాలో ఫాదర్ చేసి ఇప్పుడు మన ఫరిశ్తా స్థితిని తయారు చేసుకోవాలి. చెప్పండి, ఈ లక్ష్యమునే పెట్టుకుని అందరూ తపస్సు చేస్తున్నారు కదా. మధుబన్ అనంతమైన బాబా ఇల్లు బాబా పిల్లలందరినీ ఎంతో ఆకర్షిస్తుంది, అన్ని స్థానాలు సదా ఫుల్‌గా ఉంటాయి. మీరందరూ కూడా తమ-తమ స్థానాలలో అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనం యొక్క అనుభూతులను చేసుకుని ఉంటారు.
అచ్ఛా - అందరికీ చాలా-చాలా స్నేహపూర్వక స్మృతి... ఓం శాంతి.
18-01-26 ఓం శాంతి ‘‘అవ్యక్త బాప్‌దాదా’’ రివైజ్ వీడియో 18-01-12 మధుబన్
సేవలతోపాటు ఒకరికొకరు సహయోగులుగా అయ్యి వాయుమండలంలో తీవ్ర పురుషార్థపు అలను వ్యాప్తి చెయ్యండి, మన్జీతులుగా అయ్యి ఆత్మలకు మనసా సేవను చెయ్యండి
ఈరోజు విశేషంగా స్నేహ దివసము. నలువైపుల ఉన్న పిల్లలు స్నేహ స్వరూపంతో మిలనము జరుపుకుంటున్నారు. మీరందరూ కూడా స్నేహ స్వరూపంలో మగ్నమై ఉన్నారు. ఈరోజు అమృతవేళనుండి నలువైపుల ఉన్న పిల్లలు అమృతవేళ కన్నా ముందే హృదయపూర్వక స్నేహ ముత్యాల మాలలను తీసుకుని చేరుకున్నారు. అనేక ప్రకారాల భిన్న భిన్న మనో భావాలను బాబా ఎదుట వర్ణిస్తూ ఉన్నారు. పిల్లల స్నేహము ఎంత ప్రియమైనదో మీకు తెలుసు కదా. భిన్న భిన్న భాషలలో, భిన్న భిన్న భావాలతో బాప్‌దాదా ఎదుట తమ మనసులోని మాటలను చెప్తున్నారు. నయనాలతో, నోటితో తమ భావాలను స్పష్టం చేస్తున్నారు. బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల స్నేహ భావాలను చూసి అందరి స్నేహములో మునిగిపోయారు మరియు మనస్ఫూర్తిగా వాహ్ పిల్లలూ! వాహ్ అని కూడా అంటున్నారు. అలాగే పిల్లల నోటి నుండి వాహ్ బాబా వాహ్! అన్న పాట వినబడుతూ ఉంది. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూస్తూ పిల్లల ప్రేమలో లీనమై ఉన్నారు మరియు పిల్లలు బాబా ప్రేమలో లీనమై ఉన్నారు.
ఈరోజు బాబా తమ పిల్లలను బాలక్ సో మాలికులుగా తయారుచేసే దృష్టితో చూస్తున్నారు. పిల్లలకు రాజ్య తిలకాన్ని దిద్దిన రోజు ఇది. ఈరోజు బాప్‌దాదా స్వయంగా ఫరిశ్తా రూపంలో ఉండి పిల్లలను విశ్వ సేవకు నిమిత్తం చేసిన రోజు. స్వయం వెన్నెముకగా అయ్యి, పిల్లలను విశ్వమనే స్టేజీపై ప్రత్యక్షం చేసారు. బాప్‌దాదా ఇప్పుడు పిల్లల సేవను చూసి, ఏ బాధ్యతనైతే ఇచ్చారో దాని రిజల్టును చూసి పిల్లలపై చాలా చాలా సంతోషంగా ఉన్నారు మరియు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు.
ఇప్పుడు ఏమి చెయ్యాలి? సేవ కోసం అభినందనలనైతే బాప్‌దాదా ఇచ్చేసారు. ఇప్పుడు బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ, ‘ఇప్పుడు బాబా సమానంగా ఫరిశ్తాగా అవ్వవలసిందే’ అన్న ఉల్లాస-ఉత్సాహాలను ఉంచి, దృఢ నిశ్చయము, తీవ్ర పురుషార్థము చెయ్యవలసిందే ఎందుకంటే ఇప్పుడు అందరూ బాబాతోపాటు రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణం) చెయ్యాలి. ఫరిశ్తా సమానంగా అవ్వవలసిందే ఎందుకంటే కలిసి వస్తాము, కలిసి రాజ్యం చేస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేసారు కదా. మరి బ్రహ్మా బాబా కూడా ఫరిశ్తాగా అయ్యారు, మరి కలిసి ఎలా వెళ్తారు? బ్రహ్మా బాబా అయితే జీవిస్తూనే ఫరిశ్తా స్వరూపాన్ని చూపించారు. ఎంత బాధ్యత ఉండింది! అందరినీ యోగ్యులుగా చెయ్యవలసిందే కానీ ఇంతటి బాధ్యత ఉన్నప్పటికీ ఎంత అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారో మీరందరూ చూసారు. సదా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు, చింత కాదు, నిశ్చింత చక్రవర్తి. అలాగే పిల్లలైన మీరు కూడా ఇప్పుడు బాబా సమానంగా నిశ్చింత చక్రవర్తులుగా, ఫరిశ్తాలుగా అవ్వవలసిందే. అవ్వవలసిందే అన్న దృఢ సంకల్పం ఉందా లేక అవుతాములే అని అనుకుంటున్నారా!
ఇప్పుడు బాప్‌దాదా ఏమి చూసారంటే ఇప్పుడు సమయానుసారంగా ఎంతైతే సేవపై ఉల్లాస ఉత్సాహాలు ప్రాక్టికల్‌గా ఉన్నాయో అంతే ఉత్సాహము తీవ్ర పురుషార్థీలుగా అవ్వడంలో మరియు తయారు చెయ్యడంలో, సంపన్నంగా అవ్వడంలో మరియు తయారుచెయ్యడంలో ఉండాలి. ఈ పాయింట్‌పైన కూడా ఇప్పుడు స్వయం ఉల్లాస-ఉత్సాహాలలో ఉండాలి మరియు వాయుమండలంలో కూడా ఉల్లాస-ఉత్సాహాలను నింపాలి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ఇప్పుడు వాయుమండలంలో తీవ్ర పురుషార్థపు అలను వ్యాప్తి చెయ్యండి. ఎలా అయితే ఒకరికొకరు పరస్పరంలో సేవా ఉత్సాహాన్ని వాయుమండలంలో వ్యాప్తి చేసారో అలాగే ఇప్పుడు తీవ్ర పురుషార్థపు అల వాయుమండలంలో వ్యాప్తి చెయ్యాలి అని బాప్‌దాదా ఇప్పుడు పిల్లలపై శుభ ఆశను పెట్టుకున్నారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇప్పటికీ పురుషార్థము ఉంది, కానీ తీవ్ర పురుషార్థము చెయ్యాలి. బాప్‌దాదా ఆశ ఏమిటంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరిలో, పిల్లలందరూ బాప్‌దాదా ఆశా సితారలు కదా! కదా? మేము బాబా ఆశల సితారలుగా అయ్యి ఉల్లాస ఉత్సాహాలను వాయుమండలంలో వ్యాప్తి చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్‌దాదా చేతులను చూసి సంతోషిస్తారు. మెజారిటీ చేతులెత్తారు. వెనుకవారిది కనిపించలేదు కానీ ముందువారిది కనిపించింది. వెనుకవారు ఇప్పుడు ఎత్తుతున్నారు. అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
బాప్‌దాదా ఏమి చూసారంటే విశేషంగా మనసులో ఏదైనా విషయంపై ఉల్లాస-ఉత్సాహాలు ఉంటే ఆ కార్యము మంచిగా సాకారమవుతుంది. కావున బాప్‌దాదా ఈసారి ఈ స్నేహ దివసమున ఈ హోమ్‌వర్కును ఇస్తున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ మనసు కారణంగా వ్యర్థంగా పోతున్న సంకల్పము మరియు సమయమును సమాప్తం చెయ్యండి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా వ్యర్థ సంకల్పం వస్తే అందులో ఎంత సమయం వృధా అవుతుందో అందరికీ అనుభవం ఉంది. శక్తి కూడా చాలా వృధా అవుతుంది. కావున బాప్‌దాదా ఏ హోమ్‌వర్కును ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ రెండు నెలలు పిల్లలు ప్రతి ఒక్కరూ మనసులోని వ్యర్థ సంకల్పము మరియు వ్యర్థ సమయమును సమాప్తం చెయ్యాలి. ఇందుకు స్వయం కోసం ఒక విధిని తయారుచేసుకోండి. ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరూ తమ చార్టును పెట్టుకోండి. వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలను ఎంత కంట్రోల్ చేసాను? ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీరందరూ మీ మనసా శక్తితో ఆత్మలకు మనసా సేవను చేసే సమయమిది. ఇందుకోసం సదా మనసుపై అటెన్షన్ ఉంచడం అవసరము. మన్జీత్ జగత్జీత్ అని కూడా చెప్పబడి ఉంది. కనుక మన్మనాభవ అనే వాయుమండలంలో మనసులోని వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాలి. చెయ్యగలరా? చేస్తారా? వారు చేతులెత్తండి. బాప్‌దాదా బహుమతిని ఇస్తారు. మీ రిజల్టును మీరే చూసుకోండి. మనసు సంతోషంగా ఉంటే మనసులోని సంతోషాన్ని పంచగలరు. ఈ పురుషార్థంలో అందరూ మొదటి నంబరును తీసుకోవడంలో అటెన్షన్ ఉంచండి. వ్యర్థము సమాప్తము. సమయము మరియు సంకల్పాలు రెండింటిలోనూ వ్యర్థము సమాప్తము మరియు సమర్థ సంకల్పాలు, సమర్థ సమయము రాబోవు సమయంలో వాయుమండలంలో వ్యాపిస్తాయి.
బాప్‌దాదా ఒక విషయంలో పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అది ఏ విషయము? పిల్లలందరూ సేవనైతే చేసారు కానీ దానితోపాటు డబల్ రాజుగా అవ్వమని బాప్‌దాదా ఇచ్చిన సూచన గురించి తెలుసు కదా! ఒకటి స్వరాజ్య అధికారి, రెండు భవిష్య రాజ్య అధికారి. స్వరాజ్య అధికారి. తన ప్రతి పిల్లవాడు స్వరాజ్య అధికారిగా అయిన తండ్రి బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్నది బాబాకున్న నషా. మీరందరూ స్వరాజ్య అధికారులు కదా! స్వ పై ఆత్మ రాజ్యం చేస్తుంది. కర్మేంద్రియాలకు వశమవ్వదు, రాజ్య అధికారి. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారిగా సదా ఉండాలి, అప్పుడప్పుడూ కాదు అన్నది బాప్‌దాదా ఆశ. అవ్వగలరా? మీకిచ్చిన ఈ రెండు నెలలలో, స్వరాజ్య అధికారిగా ఉన్నానా లేక కర్మేంద్రియాలకు వశమయ్యానా అన్న విషయాన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు కర్మాతీతులుగా అవ్వాలి, సమయము సమీపిస్తుంది. మరి ఏమి చెయ్యాలి? నడుస్తూ తిరుగుతూ స్వరాజ్య అధికారిగా అవ్వవలసిందే. ఈ సంస్కారము బ్రాహ్మణ పిల్లలైన మీదే. డబల్ రాజ్యము, స్వరాజ్యము మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్యము. బాప్‌దాదా అంతటా తిరుగుతూ పిల్లల రిజల్టును నోట్ చేసుకుంటూ ఉంటారు. సదా స్వరాజ్య అధికారి అన్న విషయంలో అటెన్షన్ అవసరము. బాప్‌దాదా రెండు కార్యాలను చెయ్యమని ఇచ్చారు. ఒకటి, ఈ రెండు నెలలు స్వరాజ్య అధికారిగా ఎంత ఉన్నాను? ఈ రిజల్టును చూసుకోవాలి. దీనితోపాటు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాలి. ఇందులో ఎవరు నంబరును తీసుకుంటారో వారికి బాప్‌దాదా బహుమతిని ఇస్తారు. ఇష్టమేనా? చెయ్యాలి కదా! చేస్తారా? చేస్తారు కదా? తల ఊపండి. అచ్ఛా.
బాప్‌దాదా ఈరోజు పిల్లలందరి స్నేహాన్ని స్వీకరించారు. అమృతవేళ అయితే వతనంలో కూడా చాలామంది పిల్లల సందడి ఉంది. అడ్వాన్స్ పార్టీవారు కూడా వతనంలో ఈరోజు తమ హృదయపూర్వక స్నేహాన్ని అందించడానికి, తీసుకోవడానికి వచ్చారు.
అందరికీ స్నేహము ఉండటాన్ని బాప్‌దాదా కూడా చూసారు. కానీ స్నేహముతో పాటు శక్తి కూడా కావాలి. ఇందుకోసం అమృతవేళను పవర్‌ఫుల్‌గా చేసుకోండి. కూర్చుంటున్నారు, కూర్చుంటున్నందుకు బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు కానీ కూర్చున్నప్పుడు వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి కదా, అలా ఉండటం లేదు. ఒకరు ఒకలా కూర్చుంటారు, ఇంకొకరు ఇంకోలా కూర్చుంటారు. ఒకవేళ ఫోటో తీస్తే ఇంకేదో ఉండాలి అని మీకే అనిపిస్తుంది. బాప్‌దాదా చెప్పిన జ్వాలాముఖి యోగంపై ఇప్పుడు మరింత అటెన్షన్ ఇవ్వండి. అందరూ పురుషార్థం చేస్తున్నారు కానీ పురుషార్థం ముందు ‘తీవ్ర’ అన్న పదాన్ని జోడించండి. ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరికీ రెండు నెలల సమయాన్ని ఇచ్చారు. ఇందులో ఎంత అటెన్షన్ ఇస్తారో, అటెన్షన్‌తో పాటు బాప్‌దాదా కూడా ఎక్స్ట్రా సహాయాన్ని అందిస్తారు. మనసుకు యజమానులు మీరు, మీ పాదాలను, చేతులను సునాయాసంగా నడిపించినంతగా మీ మనసును నడిపించాలి. మీ శరీరంతో ఏది కావాలంటే అది చేస్తారు కదా. ఇది ఇక్కడ కాక అక్కడ పెట్టాలి అని అనుకుంటే పెట్టగలరు కదా. అలాగే మైండ్ కంట్రోల్, ఏది అవసరమో అదే సంకల్పం చెయ్యండి. రోజూ రాత్రి రిజల్టును చూసుకోండి. ఈ రోజు మనసు యొక్క రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఎంత ఉంది? ఇప్పుడు వ్యర్థాన్ని త్వరత్వరగా సమాప్తం చెయ్యాలి. ఇప్పుడు సమర్థులుగా అయ్యి వాయుమండలంలో సమర్థ శక్తిని వ్యాపింపజేయండి. బాప్‌దాదా అయితే పిల్లల దుఃఖాన్ని, బాధను, మొరను విని పిల్లల ద్వారా ఇప్పుడు త్వరగా సమాప్తి చేయాలని ఆశిస్తున్నారు. వినిపించాము కదా, పురుషార్థము అందరూ చేస్తున్నారు కానీ ఇప్పుడు తీవ్రతను ఏడ్ చెయ్యండి. చెయ్యవలసిందే. చేస్తాములే చూద్దాములే... ఈ లే, లే... ఇక నడవదు.
స్నేహ దృశ్యాన్ని కూడా ఈరోజు చూసాము. ప్రతి ఒక్కరి మనసులో ఎంత ప్రేమ ఉంది! కానీ ఎంత ప్రేమ ఉందో, దానితోపాటు అంతే శక్తి కూడా కావాలి. ఇప్పుడు శక్తిని నింపుకోండి. ఎప్పుడూ ఏ సోదరి కూడా తమను తాము కేవలం శక్తిగా కాక శివ శక్తిగా భావించాలి. శివశక్తి, బాబా తోడుగా ఉన్నారు. పాండవులతో పాండవపతి తోడుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? పురుషార్థము అన్న పదం ముందు తీవ్ర అని పెట్టండి. వాయుమండలాన్ని తయారు చెయ్యండి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి, ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఉంటున్నారో, మీ స్థానాలను శక్తిశాలిగా చెయ్యండి. మీ తోటివారిని శక్తిశాలిగా చెయ్యండి. మరి ఇప్పుడు ఏమి చేస్తారు? నవీనత చేస్తారు కదా? నా బాబా అని అంటున్నప్పుడు ‘నా’ సమానంగా అవ్వాలి కదా. ప్రతి ఒక్కరూ తమ మనసులో దృఢ సంకల్పం చెయ్యండి. సంకల్పాలు మంచి మంచిగా చేస్తారు. ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేస్తాము అంటూ అమృతవేళ ఎంతో మంచి సంకల్పాలను చేయడాన్ని బాప్‌దాదా చూస్తారు కానీ కర్మయోగిగా అయినప్పుడు, సంబంధ-సంపర్కంలోకి వచ్చినప్పుడు అక్కడ తేడా కనిపిస్తుంది. కర్మయోగి స్థితిలో అటెన్షన్ ఎక్కువ అవసరము. అచ్ఛా.
అందరూ సంతోషంగా ఉన్నారు కదా! సంతోషంగా ఉన్నారా? అచ్ఛా.
సేవ టర్న్ మహారాష్ట్ర జోన్ వారిది:- బాప్‌దాదాకు పిల్లలను చూసి సంతోషంగా ఉంటుంది, వాహ్! పిల్లలూ వాహ్! అని హృదయం నుండి వెలువడుతుంది. మీరు ఎంత మనస్ఫూర్తిగా వాహ్! బాబా వాహ్! అని అంటారో అంతకంటే ఎక్కువగా బాబా, వాహ్! పిల్లలూ వాహ్! అని అంటారు. అచ్ఛా. సేవ కోసం వచ్చారు. ఒక్కొక్క జోన్‌కు ఇలా చాలా మంచి ఛాన్స్ లభించడం చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. ఎక్కువ సంఖ్యను తీసుకు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. కావున ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా తయారైంది. ప్రతి జోన్‌కు అవకాశం లభిస్తుంది కానీ అవకాశం తీసుకుని తిరిగి అందుకు రిజల్ట్‌ను కూడా చూపాలి, బాప్‌దాదా ఎదుటకు తీసుకురావాలి. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- చాలా మంచిది. డబల్ విదేశీయులు యజ్ఞానికి అలంకారము. ఎప్పుడు వచ్చినాకానీ యజ్ఞానికి అలంకారంగా నిలుస్తారు. అందరూ ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మీలో ఒక విశేషత మంచిగా ఉంది. ఏది చెయ్యాలనుకుంటే దానిని వెంటనే చేసేస్తారు, పొడిగించరు. ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. డబల్ విదేశీయులు ఉండని టర్న్ ఏదీ ఉండదు. బాప్‌దాదా డబల్ విదేశీయులకు డబల్ పురుషార్థీలు అని టైటిల్ ఇస్తారు. ఇప్పుడు చేసి చూపించండి. డబల్ పురుషార్థీలుగా అయ్యి రిజల్టును చూపించండి. సేవ పెరుగుతూ ఉందని బాప్‌దాదాకు తెలుసు. సమాచారము వస్తూ ఉంటుంది. సేవ కూడా మంచిగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కేవలం ఈరోజు ఏదైతే చెప్పామో, పురుషార్థం ముందు ‘తీవ్ర’ అని సదా జోడించండి. తీవ్ర పురుషార్థీ పిల్లలు సదా బాబాను తమ హృదయంలో పెట్టుకుంటారు మరియు బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తమ హృదయంలో పెట్టుకుంటారు. అందరి హృదయాలలో బాప్‌దాదా ఉన్నారు కదా! చేతులెత్తండి. మీ హృదయంలో ఎవరున్నారు? బాప్‌దాదా. బాప్‌దాదా హృదయంలో పిల్లలైన మీరు ఉన్నారు. డబల్ విదేశీయులకు బాప్‌దాదా హృదయపూర్వక ప్రియస్మృతులను తెలుపుతున్నారు. మధువనానికి ప్రత్యేకమైన అలంకరణగా అయ్యి వస్తున్నందుకు విశేషంగా అభినందనలు కూడా తెలుపుతున్నారు. మీకు మంచిగా అనిపిస్తుంది కదా? అచ్ఛా. పిల్లలందరికీ కూడా మీ రాక ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరి మనసుల నుండి వాహ్! వాహ్! అని వస్తుంది.
నలువైపుల ఉన్న అతి స్నేహి, సహయోగి, సేవాధారి పిల్లలకు బాప్‌దాదా స్నేహ దివసమున స్నేహము నిండిన ప్రియస్మృతులను ఇస్తున్నారు. దీనితోపాటు బాప్‌దాదా ప్రతి స్నేహి పిల్లలకు ఈ విషయమును చెప్తున్నారు - ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థములో నంబర్‌వన్‌ను తీసుకోవాలన్న లక్ష్యాన్ని ఉంచండి. అవ్వవలసిందే, డ్రామా తయారు చెయ్యవలసిందే. నలువైపుల ఎక్కడ కూర్చున్నాకానీ, ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో వింటున్నారు, చూస్తున్నారు అన్నది బాప్‌దాదా అందరినీ చూస్తున్నారు. పిల్లలందరికీ స్నేహపూర్వక ప్రియస్మృతులు మరియు అభినందనలు, అభినందనలు.
*** ఓంశాంతి ***
