Search for a command to run...
22 Jul 1969
సంస్కారాలలో నిరాధారంగా ఉంటూ నియమాలలో పరిపక్వంగా అవ్వండి
22 July 1969 · తెలుగు
అందరూ సంతోషంగా ఉన్నారా? క్షేమ సమాచారాలు అడగడం అవసరమా? ఇప్పుడు ఇది అడగాల్సిన అవసరం లేదని బాప్దాదా భావిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు మేజర్లుగా అయ్యారు. అందరూ నరకాన్ని స్వర్గంగా మార్చే బాధ్యతా కిరీటాన్ని ధరించారు. కిరీటధారులు ఇతరుల యోగక్షేమాలను అడుగుతారు. సత్యయుగంలో మీరు రాజుగా అయినప్పుడు మీ ప్రజలను మీరు యోగక్షేమాలను అడుగుతారు. మరి ఆ సంస్కారాన్ని ఇక్కడే నింపుకోవాలి. ఇప్పుడు నింపుకున్న సంస్కారాలే అనేక జన్మల వరకు వస్తాయి. అందులో ముఖ్య సంస్కారము – దానిని ‘నిరాధారము’ అంటాము. నిర్ ఆధారము అంటే దైవీ సంబంధ నియమాల ఆధారం కూడా తీసుకోవద్దు అని కాదు. నియమాలలో పూర్తిగా పరిపక్వంగా అవ్వాలి. నియమాలలో పూర్తిగా ఉండాలి అలాగే నిరాధారంగా కూడా పూర్తిగా ఉండాలి. ఇటువంటి స్థితిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? సాకార రూపంలో రుజువును అందరూ చూసారు. ఎంతగా నియమాలలో సంపూర్ణంగా ఉన్నారో అంతగానే నిరాధారంగా ఉన్నారు. నిరాధారంగా ఉన్నప్పటికీ ఏ విషయాన్ని అయినా చేయాలంటే పిల్లల సలహా తీసుకోనిదే చేసేవారు కాదు. నియమ పాలనను చేసి నేర్పించడం అంటే ఇది. కొంతమంది పిల్లలు నిరాధారంగా అయితే అవుతారు కానీ నిరాధారంగా అవుతూ-అవుతూ ఎక్కడో చిన్న చిన్న నియమాలను విడిచి పెట్టేస్తారు. కానీ రెండు విషయాలు కలిసి ఉండటాన్నే బ్రాహ్మణ కుల మర్యాద లోపల ఉండటము అంటారు. బ్రాహ్మణుల ముఖ్యమైన పని ఏముంటుంది? ఇతరులను కూడా బంధనంలో బంధించడము. బంధనము అంటే స్వయం కూడా అందులో బంధింపబడి ఉండటం. ఎంతగా మర్యాదల బంధనంలో బంధింపబడి ఉంటారో అంతగా అతీతంగా మరియు ప్రియంగా ఉండటము. బ్రాహ్మణ కుల మర్యాదలలో ఎంతగా నడుస్తున్నాను – ఇది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. బ్రాహ్మణుల ముఖ్యమైన మర్యాద ఏమిటి? మర్యాదల లోపల ఉండాలి. మరి శ్రీమతముపై నడుస్తూ ముఖ్యమైన మర్యాదలను పూర్తి రీతిలో పాటిస్తున్నారా? ఒకవేళ ఎవరైనా మర్యాదను ఉల్లంఘిస్తే వారిని కులం నుండి తీసేస్తారు. కలియుగంలో కులం నుండి తీసేస్తారు. అయితే ఇక్కడ తీసివేయడం జరగదు, ఇక్కడ స్వయమే వెళ్ళిపోతారు. మరి ఈ ముఖ్య మర్యాదపై ఎంతవరకు నడుస్తున్నాము అని దీనిని పూర్తిగా పరిశీలించుకోవాలి. రోజంతటిలో ఏ కర్మలైతే చేస్తున్నామో, వాటిని చెక్ చేసుకోవాలి. బ్రాహ్మణ కుల మర్యాద అనుసారంగా నా మనసు, వాచ, కర్మణ నడుచుకున్నాయా? ఒకవేళ బ్రాహ్మణ కుల మర్యాద అనుసారంగా నడుచుకోకపోతే, ఎప్పుడు అటువంటి కర్మ జరుగుతుందో, అప్పుడు మీరు కులం నుండి బయటకు వెళ్ళిపోయినట్లే. బ్రాహ్మణతనం యొక్క నషా ఉండదు. విస్మృతి కలుగుతుంది. నేను మర్యాదలో ఉంటేనే ఇతరులకు మర్యాదలను నేర్పించగలను అని అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులు అని నామాన్ని ధరించినవారి కర్తవ్యం ఇదే. ఏ కర్తవ్యమైనా దానికి సంబంధించిన మర్యాదలను బ్రాహ్మణులే వచ్చి నేర్పిస్తారు, చేయిస్తారు. బ్రాహ్మణులైన మీరు మర్యాదలలో నడుస్తున్నారు, ఇందుకు స్మృతిచిహ్నమే ఇప్పటి వరకు నడుస్తుంది. స్వయం నేర్చుకున్నవారు ఇతరులకు నేర్పించగలరు. శ్రీమతము అనేది ఒక పదము. కానీ దాని రహస్యము చాలా పెద్దది. శ్రీమతం అనుసారంగా సంకల్పాలు రావాలి, సంకల్పాలు ఏమి చేయాలి, ఎలా చూడాలి, ఏమి మాట్లాడాలి, ఏ స్థితిలో స్థితి అయ్యి కర్మలు చేయాలి, భోజనం ఎలా చేయాలి, నిద్రపోతే ఎలా పడుకోవాలి? వీటన్నింటికీ శ్రీమతము లభించింది. స్మృతిలో ఉండి పడుకోవాలి, మీ చార్టును చూసుకుని పడుకోవాలి. ఇది కూడా శ్రీమతంలోని మర్యాద. సంకల్పాలకు సంబంధించి ఉన్న మర్యాదలు ఏమిటో కూడా అన్నీ తెలుసు. అందులో అన్నీ వచ్చేస్తాయి. కావున ప్రతి కర్మను చెక్ చేసుకోండి – వృత్తి, దృష్టి, స్మృతి ఎలా ఉంటున్నాయి. ప్రతి విషయము మర్యాద లోపల ఉండాలి. కొన్ని విషయాల నుండి దూరంగా ఉండాలి, కొన్ని విషయాలలో బంధింపబడి ఉండాలి! కొద్ది సమయం యొక్క ఈ మధురమైన బంధనము అనేక బంధనాల నుండి విముక్తి చేస్తుంది. ఎవరైనా మా చార్టు చూసి రిజల్టు అడిగితే అప్పుడు మేము ముందుకు వెళ్తాము అన్న ఆధారం పెట్టుకోకండి. వద్దు. మిమ్మల్ని మీరే చూసుకుంటూ ముందుకు సాగండి. బాప్దాదా ఆధారమైతే ఉండనే ఉంది కానీ చిన్న చిన్న విషయాలలో మీపై మీరే శ్రద్ధ వహించాలి. మీ రోజువారీ చార్టును చూసుకుంటూ స్వయమే పరిశీలించుకుని ముందుకు సాగండి. అందరూ రాబోయే రాజ్యాన్ని సంభాళించబోయేవారు. ఇతరులను సంభాళించేవారు తమను తాము సంభాళించుకోలేరా? తమ లెక్కను సంభాళించలేనివారు రాజధానిని ఎలా సంభాళించగలరు? అచ్ఛా, మా రిజల్టు ఎప్పుడు చెప్తారు అని కుమారీలు ఆలోచిస్తున్నారు. రిజల్టు చెప్పే యోగ్యులుగా ఉన్నారా? రిజల్టులో సగం మందైనా పాస్ అయ్యారా! ఎంత పెద్ద కఠినమైన పరీక్ష పెట్టినాగానీ షుమారుగా సగమైనా పాస్ అవుతారా? పరీక్ష కూడా పెద్దదే తీసుకుంటాము. నిజానికి పరీక్ష పేపరును ముందే వినిపించరు కానీ ఇక్కడ వినిపిస్తాము. ఒక పరీక్ష ఏమిటంటే, 8 గంటలు స్మృతిలో ఉండగలరా? వాచలో కూడా పరీక్ష తీసుకుంటాము. మూడు నిమిషాలలో పూర్తి జ్ఞానం యొక్క ముఖ్యమైన పాయింట్లను ఎలా స్పష్టంగా చెప్పవచ్చు? మూడు నిమిషాలలో జ్ఞాన సారాన్ని ఎంత బాగా వివరించాలంటే మరుసటి రోజు వారు మరింత ఇచ్ఛుకులై జ్ఞానాన్ని వినడానికి రావాలి. కర్మణలో కూడా కఠినమైన పరీక్ష తీసుకుంటాము. అప్పుడు రిజల్టు చెప్తాము. ఇక్కడి వరకే కాదు, ఎక్కడకు వెళ్ళినా కానీ అక్కడ నుండి ఒక నెల యొక్క రిజల్టు తెలుస్తుంది. అప్పుడు ఫైనల్ మార్కులు లభిస్తాయి. ఇటువంటి తయారీ చేసుకోండి అప్పుడు రిజల్టులో ఎంతమంది పాస్ అయ్యారో చూస్తాము. అచ్ఛా.
ఓంశాంతి