Search for a command to run...
19 Jul 1969
జీరో మరియు హీరోగా అవ్వండి
19 July 1969 · తెలుగు
ఈరోజు ఎందుకు పిలిచారు? (బలాన్ని నింపుకోవడానికి). బలాన్ని నింపుకోవడానికి పిలిచినట్లయితే ఏ విషయంలో నిర్బలత ఉందని భావిస్తున్నారు? విశేషంగా ఏ విషయంలో బలాన్ని నింపుకోవాలి? సేవలో కూడా దేనివలన బలం నిండుతుంది? మరి మీలో ఎంత బలం నిండి ఉందని చూసుకోవాలి. మీ అందరి పేరు శివశక్తి. మరి శక్తులలో శక్తి ఉండనే ఉన్నదా లేక శక్తి స్వరూపులుగా అవుతున్నారా? బాప్‌దాదా సృష్టిని అలంకరించడానికి ఏ ఆభరణము తయారుగా ఉందో చూడటానికి బాప్‌దాదా వచ్చారు. ఇప్పుడు ఆభరణాలైతే తయారయ్యాయి. కానీ తయారయ్యాక ఏమి చేస్తారు? పాలిష్. ఇప్పుడు కేవలం పాలిష్ చేయాలి. అందరూ చాలా ఎక్కువగా అవ్యక్త స్థితిలో ఉండటంలో విశేష సమయాన్ని ఇవ్వాలి, ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయంలోనే పాలిష్ జరగాలి. అవ్యక్త స్థితి అను పాలిష్ మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. పరస్పరం మాట్లాడుకునే సమయంలో ఆత్మిక రూపాన్నే చూడండి. శరీరంలో ఉంటూ కూడా ఆత్మనే చూడండి. ఇది మొదటి పాఠము, ఇప్పుడు దీని ఆవశ్యకతే ఉంది. ఏ ఏ ధారణలనైతే విన్నారో వాటన్నింటినీ జీవితంలోకి తీసుకురావడానికి ఈ మొదటి పాఠాన్నే పక్కా చేసుకోవాలి. ఈ ఆత్మిక దృష్టి యొక్క అవస్థ ప్రాక్టికల్‌లో తక్కువగా ఉంది. సేవలో ఎక్కువ సఫలత లభించడానికి కూడా ముఖ్య సాధనము, ఆత్మిక స్థితిలో ఉండి సేవ చేయడము. ఈ మొదటి పాఠమే పాలిష్. దీని ఆవశ్యకతే ఉంది. రోజంతటిలో ఈ ఆత్మిక దృష్టి, స్మృతి ఎంత ఉంటుంది అని ఎప్పుడైనా నోట్ చేసారా? ఈ స్థితిని సేవ యొక్క రిజల్టు ద్వారా కూడా గుర్తించవచ్చు. ఈ స్థితి దీపము వంటిది. దీపము వద్దకు దీపపు పురుగులు వద్దన్నా వెళ్తాయి.
మీరందరూ టీచర్లే. అయితే టీచర్ల నుండి ఇంకా ఏమి అవ్వాలని భట్టీకి వచ్చారు? మీరు చాలా ఆలోచిస్తారు. కానీ చాలా సహజము. బాబా సమానంగా తయారు చేయడానికి పిలిపించారు. బాబా సమానంగా అంటే జీరోగా చేయడానికి. జీరోలో బీజము లేక బిందువు కూడా వస్తుంది. అలాగే ఏదైనా కార్యం జరిగితే అప్పుడు వారిని కూడా జీరోగా చేయాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా జీరోను గుర్తు చేయడానికి పిలిచాము. టీచరు రూపమైతే చాలా పెద్దది కానీ చాలా పెద్దవారు చాలా చిన్నగా చేయడానికి వచ్చారు. అందరికంటే చిన్న రూపము బాబాది మరియు మీది కూడా. కనుక ఇప్పుడు జీరోను గుర్తుంచుకుంటే హీరోగా అవుతారు. వారు హీరో యాక్టర్‌గా కూడా అవుతారు మరియు బాప్‌దాదాకు ప్రియంగా కూడా ఉంటారు. రత్నాన్ని కూడా వజ్రము అంటారు. ముఖ్య యాక్టర్‌ను కూడా హీరో అంటారు. ఎందుకు పిలిచామో ఇప్పుడు అర్థమయిందా? ఈ రెండు విషయాలను గుర్తుంచుకుంటే బాబా సమానంగా సర్వ గుణాలలో సంపన్నంగా అయిపోతారు. విస్తారాన్ని సర్దడం జరుగుతుంది కదా. 15 రోజులు ఎంతో స్టడీ చేసారు, ఎన్నో కాపీలు, పుస్తకాలు నింపారు. బాప్‌దాదా మీ విస్తారాన్ని బీజంలో వినిపిస్తున్నారు. మిగతా అన్నీ మర్చిపోయినా కానీ ఈ విషయాన్ని మర్చిపోకండి. దీనిని గుర్తుంచుకుంటే సేవలో ఎంత త్వరగా మార్పు వస్తుందో చూడండి. మేమూ మారాలి, సమయము కూడా మారాలి అన్నది మీ అందరి కోరిక. ఇంటికి వెళ్ళాలి అన్నది కోరిక. ఇంటికి వెళ్ళాలన్న కోరిక ఉన్నప్పుడు ఈ రెండు విషయాలను గుర్తుంచుకోండి. అప్పుడు బలహీనతలు (కమీ) కాకుండా అద్భుతాన్ని (కమాల్) చేసి చూపిస్తారు. బలహీనతలు సమాప్తమైపోతాయి. ఎక్కడ చూసినా, విన్నాగానీ అద్భుతమే అద్భుతము కనిపిస్తుంది. మరి ఈ భట్టీ నుండి ఎలా తయారై వెళ్తారు? జీరో. జీరోలో ఏమీ ఉండదు. ఎటువంటి గత సంస్కారాలు ఉండవు. విడిచిపెట్టడం కోసం ఇక్కడకు వచ్చారు. మరి వదలాల్సినదంతా బాగా వదిలి వెళ్తున్నారా లేక కొంత మీతో తీసుకువెళ్తున్నారా? ఏమి వదిలారు మరియు ఎంత వదిలారు? కొద్ది సమయం కోసం వదిలారా లేక సదా కోసం విడిచిపెట్టారా, ఇది కూడా చూసుకోండి. సంగఠన శక్తితో విడిచిపెట్టారా లేక స్వ శక్తితో విడిచిపెట్టారా? సంగఠన శక్తి ఆధారాన్నయితే ఇస్తుంది కానీ సంగఠన శక్తితోపాటు స్వ శక్తి కూడా అవసరము. ఎప్పుడు ఏది విడిచిపెట్టినా కానీ సదాకాలం కోసం విడిచిపెట్టండి.
బాప్‌దాదాకు మీ అందరూ ప్రియమే. ఎందుకంటే బాబా కూడా పిల్లలైన మీ సహకారంతో కార్యాన్ని చేయిస్తున్నారు. మరి కార్యంలో సహయోగిగా ఉండేవారిపై ప్రేమ ఉండనే ఉంటుంది. కానీ సహయోగులతో పాటు ధైర్యవంతులుగా ఉండటంలో ఎక్కడో లోటు చేస్తున్నారు. ఇక్కడ ధైర్యాన్ని వదిలేస్తున్నారు. ధైర్యం ఉంటే సహాయం తప్పకుండా లభిస్తుంది. కనుక సహయోగులతో పాటు కొంత ధైర్యవంతులుగా కూడా అవ్వండి. చిన్న చిన్న విషయాలలో ధైర్యహీనులుగా కాకండి. ధైర్యవంతులుగా అవ్వడం వలన అందరికీ ఉన్న కోరిక తీరుతుంది. ఇప్పుడు ధైర్యము యొక్క ఆవశ్యకత ఉంది. ధైర్యం ఎలా వస్తుంది? ప్రతి సమయము, ప్రతి అడుగుపై, ప్రతి సంకల్పంలో బలిహారం కావడం వలన. ఎవరైతే బలిహారం అవుతారో వారిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కనుక ఎంతెంతగా స్వయాన్ని బలిహారం చేసుకుంటారో అంతగా మెడలోని హారంలోకి సమీపంగా వస్తారు. ఇప్పుడు బలిహారము అయితే తర్వాత ప్రభువు మెడలో హారము అవుతారు. బలిహారమై కర్మ చేస్తే ఇతరులను కూడా బలిహారం చేస్తారు. వారిని వారసులు అంటారు. అప్పుడు ప్రజలు చాలామంది అవుతారు, వారసులు తక్కువ అవుతారు. ఎంతగా ఎక్కువ తయారు చేస్తారో అంతగా సమీపంగా వస్తారు. మరి ఇప్పుడు వారసులను తయారు చేసే ప్లాన్‌ను ఆలోచించండి. అచ్ఛా.
ఓంశాంతి