Search for a command to run...
17 Oct 1970
దృష్టి ద్వారా సృష్టి రచన
17 October 1970 · తెలుగు
(టీచర్స్ ట్రైనింగు క్లాసు - ఓపనింగ్ సెరిమనీ)
అందరూ అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తములో కార్యము చేస్తున్నారా? ఎలా అయితే తండ్రి అవ్యక్తమై, వ్యక్తములో ప్రవేశించి కార్యము చేస్తారో అలా తండ్రి సమానంగా అయ్యారా? తండ్రి సమానంగా అయినప్పుడే ఇతరులను కూడా తండ్రి సమానంగా తయారు చెయ్యగలరు. దృష్టి తండ్రి సమానంగా అయ్యిందా? వాణి మరియు సంకల్పము తండ్రి సమానంగా అయ్యాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తండ్రికి స్మృతిలో ఏముంటుంది? తెలుసా? తండ్రి స్మృతిలో ఎల్లప్పుడూ ఏముంటుంది మరియు మీ స్మృతిలో ఎల్లప్పుడూ ఏముంటుంది? తేడా ఏమిటి? సమాన స్మృతి ఉంటుందా? మీకు ఏదైనా స్మృతి ఉంటుందా లేక ఏ స్మృతీ ఉండదా? స్మృతి ఉంటుందా లేక స్మృతి నుండి కూడా దూరంగా ఉంటారా? ఏదైనా విషయంలో తండ్రి సమానమైన స్మృతి మీకు ఉందా? (లేదు) అంతిమ సమయానికైనా స్మృతిలో సమానత వస్తుందా? (నంబరువారు). మొదటి బిడ్డకు తండ్రికి తేడా ఉంటుందా? బాబా మరియు దాదా మధ్య తేడా ఉంటుందా? సమానత వచ్చేస్తుందా? తండ్రి ఎలా అయితే అనంతమైన తండ్రో అలాగే దాదా కూడా అనంతమైన తండ్రి. బాప్‌దాదాకు సమీపము, సమానత ఉండాలి. ఎంతెంత సమీపత ఉంటుందో అంతంత సమానత. ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారు కూడా అంతిమంలో తమ రచనకు రచయితలుగా అయ్యి ప్రాక్టికల్‌గా అనుభవము చేస్తారు. ఎలా అయితే రచనను చూస్తే రచయిత స్వరూపము అనగా తండ్రి రూపము స్వతహాగనే గుర్తుకు వస్తుందో అటువంటి స్థితి నంబరువారీగా పిల్లలకు కూడా రావాలి. దృష్టి ద్వారా సృష్టిని రచించడము వచ్చా? మీ రచన ఎటువంటిది? కుఖ రచననా లేక నయన రచననా? దృష్టితో రచనను రచిస్తారా? దృష్టి ద్వారా సృష్టి అన్న నానుడి ఉంది. సృష్టియే మారిపోయేటువంటి దృష్టి. అటువంటి దృష్టిలో దివ్యత్వాన్ని అనుభవం చేసుకుంటున్నారా? దృష్టి మోసగిస్తుంది కూడా మరియు దృష్టి పతితులను పావనంగా కూడా చేస్తుంది. దృష్టి మారితే సృష్టి మారి తీరుతుంది. మరి దృష్టి ఎంతవరకు మారింది? దృష్టి మారటమంటే ఏమిటో తెలుసా? ఆత్మిక దృష్టిని తయారు చేసుకోవాలి. ఆత్మిక దృష్టి, దివ్యదృష్టి మరియు అలౌకిక దృష్టి తయరైందా? ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా వారు ఆత్మిక స్వరూపంగా కనిపించాలి. అలా దృష్టి మారిందా? ఎప్పుడైతే దృష్టిలో అనగా నయనాలలో ఏదైనా లోపము ఉంటే ఒక వస్తువు ఒకేసారి రెండుగా కనిపిస్తుంది. అలాగే దృష్టి పూర్తిగా మారనట్లయితే ఇక్కడ కూడా రెండు వస్తువులు కనిపిస్తాయి. దేహము మరియు దేహి (ఆత్మ), ఒక్కోసారి ఇది, ఒక్కోసారి అది కనిపిస్తుంది, అలా జరుగుతుంది కదా! ఒక్కోసారి దేహాన్ని చూస్తే, ఒక్కోసారి దేహీని చూస్తారు. ఎప్పుడైతే కళ్ళు పూర్తిగా బాగైపోతాయో అప్పుడు ఏ వస్తువు ఏలా ఉందో అలాగే యథార్థ రూపములో కనిపిస్తుంది. అలాగే ఈ దృష్టి మారినప్పుడు యథార్థ రూపము ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. యథార రూపము ఏమిటి? దేహి, దేహము కాదు. కావున యథార్థ రూపము ఏదైతే ఉందో అది అలాగే కనిపించినప్పుడు దృష్టి సరిగ్గా ఉందని భావించండి. దృష్టిపై చాలా శ్రద్ధ ఉంచాలి. దృష్టి మారితే ఎప్పుడూ మోసగించదు. సాక్షాత్కారమును దృష్టి ద్వారానే చేసుకుంటారు, ఒక్కొక్కరి దృష్టిలో తమ యథార్థ రూపము, యథార్థమైన ఇల్లు మరియు రాజధానిని చూస్తారు. ఒకవేళ యథార్థ దృష్టి ఉన్నట్లయితే దృష్టిలో అంతటి శక్తి ఉంటుంది. కావున ఎల్లప్పుడు మిమ్మల్ని మీరు ఇలా పరిశీలించుకోండి - ఇప్పుడు ఎవరైనా ఎదురుగా వస్తే నా దృష్టి ద్వారా ఏ సాక్షాత్కారమును చేసుకుంటారు. మీ వృత్తిలో ఏదైతే ఉందో దానిని ఇతరులు మీ దృష్టి ద్వారా చూడగలరు. ఒకవేళ వృత్తి దేహ అభిమానమునకు చెందినదై ఉంటే, చంచలముగా ఉంటే మీ దృష్టి ద్వారా అయ్యే సాక్షాత్కారము కూడా అదే ఉంటుంది. ఇతరుల దృష్టి, వృత్తి కూడా చంచలమవుతాయి, యథార్థ సాక్షాత్కారమును చేసుకోలేరు. అర్థం చేసుకున్నారా? వీరి ట్రైనింగు జరుగుతోంది కదా! ఈ గ్రూపు కొరకు ముఖ్యమైన విషయము - మీ వృత్తి పరివర్తన ద్వారా మీ దృష్టిని దివ్యంగా తయారుచేసుకోవడము. ఎంతవరకు తయారైంది? అవ్వలేదంటే ఎందువల్ల తయారవ్వలేదు? వీటి గురించి వీరికి స్పష్టంగా అర్థం చేయించాలి (జానకి దాదీకి సూచన) అర్థమైందా! సృష్టి మారకపోవటానకి కారణమేమిటి? దృష్టి మారకపోవటము. దృష్టి మారకపోవటానికి కారణము వృత్తి మారకపోవటము. దృష్టి మారినట్లయితే సృష్టి కూడా మారుతుంది. ఈ రోజుల్లో పిల్లలందరికీ బాప్‌దాదా ఇచ్చే విశేష సూచన - మీ దృష్టిని మార్చండి. సాక్షాత్కారమూర్తులుగా అవ్వండి. ఇవి నయనాలు కావు, ఇంద్రజాలము చేసే డిబ్బీలు అని మిమ్మల్ని చూసేవారు అనుభనం చేసుకోవాలి. ఎలా అయితే మ్యాజిక్ బాక్సులో భిన్నభిన్నమైన వాటిని చూస్తారో అలాగే మీ నయనాలలో దివ్య దృశ్యములు చూడాలి. నయనాలు సాక్షాత్కారానికి సాధనాలుగా తయారవ్వాలి.
ఈ గ్రూపు ఎటువంటి గ్రూపో తెలుసా? వీరిలో ఏ విశేషత ఉంది? మొత్తము విశ్వములోకెల్లా విశేష ఆత్మలు. మేము సాధారణమైన వారిమనైతే భావించటం లేదు కదా. ఇలా ఎప్పుడూ భావించకండి. విశ్వమంతటిలోకి విశేష ఆత్మలు ఎవరు? ఒకవేళ మీరు విశేష ఆత్మలు కానట్లయితే తండ్రి తమవారిగా ఎందుకు తయారు చేసుకున్నారు? స్వయాన్ని విశేష ఆత్మగా భావించినప్పుడు విశేషత వస్తుంది. ఒకవేళ స్వయాన్ని సాధారణంగా భావిస్తే కర్తవ్యము కూడా సాధారణంగా చేస్తారు. ప్రతి ఒక్క ఆత్మ తనును తాను విశేషమైన వారిగా భావించి ఇతరులలో కూడా విశేషతను తీసుకురావాలి. మీరు విశేష ఆత్మలు, ఈ నషా ఈశ్వరీయ నషా. దేహభానముతో కూడిన నషా కాదు. ఈశ్వరీయ నషా ఎలప్పుడూ నయనాలలో కనిపించాలి. మరి ఈ గ్రూపు విశేషత ఏమిటి? మీరు మీ గ్రూపు యొక్క విశేషతను తెలుసుకున్నారా? (తెల్లని కాగితము, కొందరు విభిన్న విషయాలను వినిపించారు). ఈ గ్రూపు టైటిల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ట్రైనింగ్ తరువాత కూడా ఈ గుణాలు స్థిరంగా ఉండాలి, ఈ ట్రైనింగ్ కూడా కావాలి. ఇప్పుడైతే విశేషతలను చాలా మంచిగా వినిపిస్తున్నారు. తెల్ల కాగితంపై ఏది వ్రాసినా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంతటి స్పష్టతయో అంతటి శ్రేష్ఠత. ఒకవేళ స్పష్టతలో లోపము ఉంటే శ్రేష్ఠతలో కూడా లోపము ఉంటుంది. ఇతరమైన దేనినీ కలపవద్దు. కొందరు చాలా మిక్స్ చేస్తుంటారు. దీనితో ఏమవుతుంది? యథార్థ రూపము కూడా అయథార్థమవుతుంది. ఆ జ్ఞానము విషయాలే మాయ రూపంగా కూడా అయిపోతాయి. కావున ఈ గ్రూపు సదా స్పష్టంగా మరియు శ్రేష్ఠంగా ఉన్నారు అని ఈ గ్రూపు విశేషత చిత్రములో కనిపించాలి. ఎల్లప్పుడూ మీ యథార్థ రూపంలో ఉండండి. ఏది ఎలా ఉందో దానిని ఆ రూపములోనే తెలుసుకొని, ధారణ చెయ్యాలి మరియు నడుస్తూ ఉండాలి, ఇదే స్పష్టత, ఈ గ్రూపుకు బాప్‌దాదా ఏ టైటిల్‌ను ఇస్తున్నారు? ఛోటే సుభానల్లాహ్ (చిన్నవారు ధన్యులు) అన్న నానుడి ఉంది. కానీ, చిన్నవారైతే సమానల్లాహ్ (భగవంతునితో సమానము) అని బాప్‌దాదా అంటారు. అన్ని విషయాలలో, అడుగడుగులో సమానతను ఉంచండి. కానీ సమానత ఎలా వస్తుంది? సమానత కొరకు రెండు విషయాలపై శ్రద్ధ ఉంచాలి. సాకార రూపములో ఏ విశేషతలు ఉండేవి? ఒకటేమో మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆధారమూర్తులుగా భావించండి. మొత్తము విశ్వానికి ఆధారమూర్తులు. దీనితో ఏమవుతుందంటే ఏ పని చేసినా బాధ్యతతో చేస్తారు. నిర్లక్ష్యము ఉండదు. బాప్‌దాదా ఏ విధంగా సర్వులకు ఆధారమూర్తులో అలా పిల్లలు ప్రతి ఒక్కరూ విశ్వానికి ఆధారమూర్తులు. మీరు ఏ కర్మ చేస్తారో దానినే అందరూ చేస్తారు. సంగమ యుగములో ఏ పద్ధతులు నడుస్తాయో అవే భక్తి మార్గములో మారి ఆచరించబడతాయి. పూర్తి విశ్వానికి మీరు ఆధారమూర్తులు. మీరు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆధారమూర్తులుగా భావించాలి మరియు రెండవది, ఉద్ధారమూర్తులుగా అవ్వాలి. ఎంతగా మీ ఉద్ధరణ చేసుకుంటారో అంతగా ఇతరుల ఉద్ధరణ చేస్తారు. ఎంతగా ఇతరులను ఉద్ధరిస్తారో అంతగా మిమ్మల్ని కూడా ఉద్ధరించుకుంటారు. మీ ఉద్ధరణ చేసుకోనట్లయితే ఇతరుల ఉద్ధరణ ఎలా చేస్తారు? మీరు ఉద్ధారమూర్తులుగా అయినప్పుడే ఇతరుల ఉద్ధరణ చేస్తారు. చిన్నవారైనాగానీ కర్తవ్యము తండ్రి సమానంగా చెయ్యాలి. ఇది గుర్తుంచుకుంటే సమానత వస్తుంది. అప్పుడు ‘‘చిన్నవారు తండ్రి సమానము’’ అని ఈ గ్రూపుకు టైటిల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని మరచిపోవద్దు. అచ్ఛా, ఇప్పుడు ఏమి చెయ్యాలి? (తిలకము పెట్టాలి) ఈ టీకా(తిలకము) కూడా సాధారణమైనది కాదు. తిలకాన్ని ఎందుకు పెడ్తారో తెలుసా? తిలకము సౌభాగ్యానికి గుర్తు. ఏ విషయాలనైతే విన్నారో వాటన్నింటిలో స్థిరమయ్యేందుకు గుర్తు ఈ తిలకము. తిలకము మస్తకములో ఉండిపోతుంది, అలాగే బుద్ధిలో ఈ అన్ని విషయాలు ఉండిపోవాలి. ఈ టీకాను ఇంకా ఎందుకు పెట్టడం జరుగుతుంది? (బిందురూప స్థితికి గుర్తు, రాజ తిలకము, విజయ తిలకము, బాధ్యతా తిలకము, రకరకాల ఆలోచనలను వినిపించటం జరిగింది). బాప్‌దాదా ఏదైతే వినిపిస్తారో అది వేరుగా ఉంటుంది. టీకా అని తిలకమునే కాదు, దానికి ఇంకేదైనా అర్థం ఉందా? (ఇంజెక్షన్) ఈ టీకా (జ్ఞాన ఇంజెక్షన్) సదా మాయా రోగాలను నివృత్తి చేసేందుకు కూడా టీకా. సదా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా టీకా, ఒక టీకా అంటే ఏవైతే మీరందరూ వినిపించారో అవి. మరొక టీకా అంటే ఇది కూడా. రెండు టీకాలను పెట్టుకోవాలి. ఒకటి శక్తిశాలిగా అయ్యేందుకు, రెండవది సదా సౌభాగ్యవతులుగా ఉండేందుకు మరియు భాగ్యములో స్థితులయ్యేందుకు. రెండు తిలకాలనూ బాప్‌దాదా దిద్దుతారు. గుర్తు ఒక్కటే, అందులోని రహస్యాలు రెండు. గుర్తు అన్నది స్థూలమైనది కానీ రహస్యాలు రెండున్నాయి. కావున కేవలం తిలకాన్ని దిద్దుకోవద్దు. తిలకాన్ని పెట్టుకోవటము అనగా సదాకాలము కొరకు ప్రతిజ్ఞ చెయ్యటము. ఏ ప్రతిజ్ఞను చెయ్యాలి? ఈ టీకా ప్రతిజ్ఞకు గుర్తు. ఎల్లప్పుడూ ప్రతి విషయములో పాస్ విత్ ఆనర్‌గా అవుతాము. ఈ ప్రతిజ్ఞా తిలకము ఇది. అంతటి ధైర్యము ఉందా? పాస్ అవ్వటము కాదు కానీ పాస్ విత్ ఆనర్. పాస్ విత్ ఆనర్‌కు పాస్ అవ్వడానికి తేడా ఏమిటి? పాస్ విత్ ఆనర్ అనగా మనసులో కూడా సంకల్పాల ద్వారా శిక్షలు తినకూడదు. ధర్మరాజు శిక్షలు అన్నవి తరువాతి సంగతి కానీ మీ సంకల్పాల అలజడుల నుండి లేక శిక్షల నుండి దూరంగా ఉండటము, దీనినే పాస్ విత్ ఆనర్ అని అంటాము. మీ పొరపాటుకు మీరే స్వయానికి శిక్షను వేసుకుంటారు. చిక్కుకుంటారు, పిలుస్తారు, తికమక పడతారు, వీటి నుండి కూడా దూరంగా ఉండటము. పాస్ విత్ అనర్ అని వీరినే అంటారు. అటువంటి ప్రతిజ్ఞను చెయ్యటానికి తయారుగా ఉన్నారా? సంకల్పాలలో కూడా చిక్కుకోకూడదు. వాణి, కర్మ, సంబంధ-సంపర్కాల మాటైతే వదలిపెట్టేయండి. అవి స్థూల విషయాలు. అటువంటి ప్రతిజ్ఞను చేసే గ్రూపేనా? ధైర్యవంతులు.
ధైర్యము స్థిరంగా ఉంటే సర్వులకు సహాయం చేసే ఆకులుగా ఉంటారు. సహయోగులుగా అవుతూ ఉంటే స్నేహము లభిస్తూ ఉంటుంది. వృక్షములో కోమలమైనవి మరియు చిన్న చిన్న క్రొత్త ఆకులు వెలువడుతున్నప్పుడు చాలా ప్రియంగా అనిపిస్తాయి, కానీ పక్షులు కూడా ఈ లేత చిగుర్లనే తింటాయి. కేవలము ఎవరికి ప్రియంగా ఉండాలి? బాప్‌దాదాకు ప్రియంగా ఉండాలి, అంతేగానీ మాయారూపీ పక్షులకు కాదు. మరి వీరు కూడా కోమలమైన ఆకులు. కోమలమైన ఆకులు కమాల్ (అద్భుతము) చెయ్యాలి. ఏ కమాల్ చెయ్యాలి? మీ ఈశ్వరీయ చరిత్ర వైపుకు సర్వులను ఆకర్షించాలి, అంతేగానీ మీపై కాదు, చరిత్రపై. ఈ గ్రూపుపై పూర్తి శ్రద్ధ ఉంది. ఈ గ్రూపు తమపై కూడా అంతటి శ్రద్ధను ఉంచాలి. అచ్ఛా!
ఓంశాంతి