Search for a command to run...
22 Oct 1970
సంపూర్ణతకు గుర్తు - మచ్చ లేకుండుట
22 October 1970 · తెలుగు
మాస్టర్ జానీ జానన్‌హార్(సర్వమూ తెలిసినవారు)గా అయ్యారా? మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారా? మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అవ్వటం ద్వారా జ్ఞానమునంతటినీ తెలుసుకున్నారా? మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా, మాస్టర్ జానీ జానన్హార్గా అయిపొయ్యారా లేక అవుతూ ఉన్నారా? ఇప్పటివరకు అవుతూ ఉన్నారా? నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారా లేక నాలెడ్జ్‌ఫుల్‌గా అవుతున్నారా? నాలెడ్జ్‌ఫుల్‌గా అవుతున్నారా లేక బ్లిస్ఫుల్ (ఆనందమయం)గా అవుతున్నారా? అవుతున్నారా లేక అయిపొయ్యారా? (అవుతున్నాము). ఎంతవరకైతే అంతిమ స్థితిని సాకార రూపములో చూసారో అంతవరకు నాలెడ్జ్‌ఫుల్‌గా, జానీ జానన్హార్గా అయ్యారా? సాకార తండ్రి సమానంగా అవ్వటంలో అంతరము మిగిలిపోయింది. కావుననే ఫుల్ (సంపూర్ణము) అని అనడం లేదు. ఎంతవరకు ఫుల్‌గా అవ్వాలి అన్నదానికి ఎగ్జాంపుల్(ఉదాహరణ) స్పష్టంగా ఉంది కదా! ఎక్కువగా మాస్టర్ రచయిత నషాలో ఉంటున్నారా లేక రచన నషాలో ఉంటున్నారా? ఏ నషాలో ఎక్కువ సమయము ఉంటున్నారు? ఈ రోజు ఈ ప్రశ్నను ఎందుకు అడిగాము? ఎంతవరకు ఫ్లాలెస్(మచ్చలేకుండా)గా ఉన్నారు అనగా ఫుల్‌గా ఉన్నారు అని ఈ రోజు అన్ని రత్నాలను చూసి, పరిశీలించాము. ఒకవేళ ఫుల్‌గా లేనట్లయితే ఫెయిల్. కావున ఈ రోజు ఫుల్ మరియు ఫెయిల్ రేఖలను చూసాము. కావుననే ఫుల్‌గా అయ్యారా అన్న ప్రశ్నను అడిగాము. అన్నింటిలో ఫుల్‌గా ఉంటడము తండ్రి మహిమ కదా, మరి పిల్లలు కూడా మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే అవ్వవలసిందే. కేవలము జ్ఞానములో కాదు, మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అవ్వాలి. అందుకే మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారా అన్న ప్రశ్నను కూడా అడిగాము. మాస్టర్లు కదా! మాస్టర్ నాలెడ్జ్ఫుల్లో కూడా ఉండలేరా? ఒకవేళ మీకు రెండు లెక్కలు ఉంటే బాప్‌దాదాకు కూడా రెండు రహస్యాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్కరిలో మూడు విషయాలను విశేష రూపములో చూసాము. ఈ రోజు అమృతవేళ దినచర్యలో ఏమి చూసాము అన్నది వినిపిస్తున్నాము. ఈ రోజు బాప్‌దాదా ఒక్కొక్క రత్నములో మూడు విషయాలను చూసారు. అవి ఏవి? ఇది కూడా ఒక డ్రిల్లును చేయిస్తాము.
ఈరోజు ఈ మూడు విషయాలను చూసాము - ఒకటి ప్రతి ఒక్కరి లైట్, రెండు మైట్(శక్తి), మూడవది రైట్. రైట్ అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, రైట్ను యథార్థమునకు వాడుతారు, రెండవది రైట్ అని అధికారమును గూర్చి వాడుతారు. రైట్‌గా, అధికారిగా కూడా ఎంతమంది తయారయ్యారు మరియు యథార్థ రూపములో ఎంతవరకు ఉన్నారు? లైట్, మైట్, మరియు రైట్. ఈ మూడు విషయాలను చూసాము. రిజల్టు ఏమి వెలువడిందో కూడా చెప్తాము. ఇప్పుడు చాలా సేవను చేసారు కదా! మరి దాని రిజల్టును చూసాము. ఇప్పటివరకు కేవలము శబ్దము వ్యాపించే వరకు రిజల్టు ఉంది. శబ్దమును వ్యాప్తి చేయడంలో పాస్ అయ్యారు, కానీ ఆత్మలను తండ్రి సమీపంగా తీసుకువచ్చేందుకు ఆహ్వానమును ఇప్పుడు చెయ్యాలి. శబ్దము వ్యాపించింది కానీ ఆత్మల ఆహ్వానమును చెయ్యాలి. ఆహ్వానము చెయ్యటము మరియు తండ్రి సమీపంగా తీసుకురావటము ఇప్పుడు ఈ పురుషార్థము మిగిలి ఉంది. ఎందుకంటే స్వయముకూడా శబ్దము నుండి దూరంగా ఉండాలనే ఇచ్ఛుకులుగా ఉన్నారు, అభ్యాసకులుగా కాదు. అందుకే శబ్దముతో శబ్దము వ్యాపిస్తుంది. కానీ ఎంతగా స్వయం శబ్దము నుండి దూరంగా అయ్యి స్వయంలో సంపూర్ణతను ఆహ్వానిస్తారో అంతగా ఆత్మల ఆహ్వానమును చెయ్యగలరు. ఇప్పుడు ఆహ్వానమునైతే చేస్తున్నారు కూడా. కానీ రిజల్టు ఆవాగమనములో ఉంది. ఆవాగమనంలో రావడమూ ఉంటుంది, వెళ్ళడమూ ఉంటుంది. కానీ ఆహ్వానము తరువాత ఆహుతి అయిపోవటము, ఈ పనిని ఇప్పుడు చెయ్యాలి. నాలెడ్జ్ వైపుకు ఆకర్షితమవుతున్నారు కానీ నాలెడ్జ్ఫుల్పైన ఆకర్షితము చెయ్యాలి. ఇప్పటివరకు మాస్టర్ రచయితలు అక్కడక్కడ రచన ఆకర్షణలో ఆకర్షితమవుతున్నారు. అందుకని ఎవరు ఎంతగా మరియు ఎలా స్వయం ఉన్నారో అంతగానే మరియు అలానే ఋజువును ఇస్తున్నారు. ఇప్పటివరకు శక్తిరూపము, శూరవీరతా స్వరూపము దృష్టి-వృత్తిలో లేవు.
శక్తి మరియు శూరవీరతతో కూడిన ముఖము ఎలా కనిపించాలంటే , అసుర లక్షణాలున్నవారు ఎవరూ ధైర్యమును ఉంచలేకపోవాలి. కానీ ఇప్పటివరకు అసుర లక్షణాలతో పాటు, అసుర లక్షణాలు ఉన్నవారు కూడా అక్కడక్కడా ఆకర్షిస్తున్నారు. వాయుమండలము అలా ఉంది, వైబ్రేషన్లు అలా ఉన్నాయి లేక సమస్య అలా ఉంది, కావుననే ఓటమి కలిగింది అని మాయ యొక్క రాయల్ రూపాన్ని మీరు వర్ణిస్తారు. కారణము చెప్పడము అంటే స్వయాన్ని కారాగారములోకి దాఖలు చేసుకోవడమే అవుతుంది. ఇప్పుడు సమయము గడచిపోయింది, ఇప్పుడు ఇక కారణాలను వినము. చాలాకాలము కారణాలను విన్నాము, కానీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యమును చూడాలి, కారణమును కాదు. ఇప్పుడు కొద్ది సమయములోనే ధర్మరాజు రూపమును ప్రత్యక్షముగా అనుభవము చేస్తారు. ఎందుకంటే ఇది అంతిమ సమయము. ఇంత సమయము తండ్రి రూపంలో కారణాన్ని విన్నారు, స్నేహాన్ని కూడా ఇచ్చారు, దయ చూపించారు, రాయితీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈ రోజులు ఇక చాలా తక్కువ ఉన్నాయి అని అనుభవము చేసుకుంటారు. ఒక్క తప్పుడు సంకల్పానికి, ఒకటికి వందరెట్ల దండన ఎలా లభిస్తుంది అన్నదానిని కూడా అనుభవము చేస్తారు. ఇప్పుడిప్పుడే చేసారు మరియు ఇప్పుడిప్పుడే దాని ఫలము లేక దండనను ప్రత్యక్ష రూపములో అనుభవము చేసుకుంటారు, ఇప్పుడు ఆ సమయము చాలా త్వరగా రానున్నది. కనుకనే బాప్‌దాదా సూచనను ఇస్తున్నారు, ఎందుకంటే ఎంతైనా బాప్‌దాదా పిల్లల స్నేహీలు కదా!
ఇప్పుడు మాస్టర్ రచయిత యొక్క నషాను ధారణ చేసి రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి మిమ్మల్ని మీరు దూరము చేసుకుంటూ వెళ్ళండి. తండ్రి ముందు రచనయే కానీ, ఇప్పుడు ఎటువంటి సమయము వచ్చేదుందంటే ఎవరైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యి ఆ ఆకర్షక శక్తిశాలీ స్థితిలో స్థితులై ఉండనట్లయితే రచన ఇంకా భిన్న-భిన్న రంగులను, రూపాలను రచిస్తుంది. కావున ఫుల్‌గా అయ్యేందుకు స్టేజ్‌పై పూర్తిగా స్థితులైతే ఇక ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వరు. ఇప్పుడు ఇంకా చిన్నతనపు పొరపాట్లు, నిర్లక్ష్యపు పొరపాట్లు, సోమరితనపు పొరపాట్లు, లెక్కలేనితనపు పొరపాట్లు ఉన్నాయి. సత్యయుగ ప్రపంచములో మరచిపోయినట్లుగా ఈ నాలుగు రకాల పొరపాట్లను మరచిపోవాలి. కావున అటువంటి పవర్ఫుల్ శక్తిస్వరూపము, శస్త్రధారీ స్వరూపము, సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపమును మీ ప్రత్యక్ష రూపముగా చూపించండి. ఇప్పుడు మీ మీ భక్తులు గుప్త వేషధారీ దేవతలైన మిమ్మల్ని మరల పొందేందుకు తపిస్తూ ఉన్నారు. మీ సంపూర్ణ మూర్తి ప్రత్యక్షమైనప్పుడే మీ భక్తులు ప్రత్యక్ష రూపములో తమ ఇష్టులను పొందగలరు. ఇప్పుడైతే అనేక రకాలుగా ఉన్నారు. శబ్దమునైతే వింటారు, కానీ ఒకవైపు అసుర ఆత్మల శబ్దము ఇంకా కూడా ఆకర్షక రూపంలో మరియు ఫుల్ ఫోర్స్ లో ఉంటుంది, మరొకవైపు మీ భక్తుల శబ్దము కూడా అనేక రకాలుగా ఇంకా ఫుల్ ఫోర్సులో ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో ఏమి తీసుకురావాలి మరియు ఏమి తీసుకురాకూడదు అన్నదానిని పరిశీలించటము బుద్ధి పని. కావున ఇప్పుడు రియాయత్ (క్షమించే) సమయము గడచిపోయింది, ఇప్పుడు ఇది రుహానియత్(ఆత్మికత) సమయము. ఇప్పుడు ఆత్మికత లేనట్లయితే భిన్న-భిన్న రకాల మాయ దృశ్యాలలోకి వచ్చేస్తారు. కావున బాప్‌దాదా ఈరోజు మళ్ళీ సూచనను ఇస్తున్నారు.
ఎలా అయితే మిలిటరీ మార్షల్ (సైన్యంలో అత్యున్నత పదవి ఉన్న వ్యక్తి) మొదట ఒక విజిల్‌ను మ్రోగిస్తారు, మరల ఫైనల్లో లాస్ట్ విజిల్‌ను మ్రోగిస్తారు. మరి ఈ రోజు నాజూకు సమయపు సూచన యొక్క మొదటి విజిల్ ఇది. తయారైపోవాలని విజిల్ మ్రోగిస్తారు. కావున ఇప్పుడు పరీక్షల పేపరును రాయడానికి సిద్ధమైపోండి. బాప్‌దాదా అయితే అవ్యక్తమయ్యారు, మేము వ్యక్తములో ఏమైనా చెయ్యచ్చు అనుకోకండి. అలా కాదు. ప్రతి ఒక్కరి ఒక్కొక్క క్షణము యొక్క సంకల్ప చిత్రము అవ్యక్త వతనములో స్పష్టమవుతూ ఉంటుంది. కావున నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. ఈశ్వరీయ మర్యాదలలో నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. అసుర మర్యాదలు మరియు మాయను లక్ష్యపెట్టకండి, అంతేకానీ ఈశ్వరీయ మర్యాదలలో నిర్లక్ష్యంగా ఉండకండి. లక్ష్యపెట్టనివారి కొన్నికొన్ని ప్రవాహాలు వతనము వరకు చేరుకుంటాయి. అందుకే ఈరోజు బాప్‌దాదా మళ్ళీ గుర్తు తెప్పిస్తున్నారు. సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి. సమస్యలను దూరంగా తరిమికొట్టాలి మరియు సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి. ఒక్కోచోట సంపూర్ణతకు బదులుగా సమస్యలను ఎదురుగా ఉంచుకుంటారు. సమస్యలను ఎదుర్కుంటే సమస్య సమాప్తమైపోతుంది. ఎదుర్కోవటము రానట్లయితే ఒక సమస్య నుండి అనేక సమస్యలు వచ్చేస్తాయి. పుట్టినప్పుడు అక్కడే అంతము చేసినట్లయితే వృద్ధి చెందవు. సమస్యను వెంటనే సమాప్తము చేస్తే మళ్ళీ వంశము ఉత్పన్నమవ్వదు. అంశము ఉంటే వంశమైపోతుంది. అంశమునే సమాప్తము చేస్తే ఇక వంశము ఎక్కడినుండి వస్తుంది! మరి అర్థమైందా, సమస్యల జన్మను కంట్రోల్ చెయ్యాలి. ఇప్పుడు సంకేతము ఇస్తున్నాము, తర్వాత ప్రత్యక్ష రూపంలో మీ స్థితి మాట్లాడుతుంది. దాగలేరు. నారదుని ముఖము సభముందు దాగిందా? ఇప్పుడైతే బాబా గుప్తముగా ఉంచుతున్నారు, కానీ కొద్ది సమయము తరువాత గుప్తముగా ఉండజాలదు. వారి ముఖము చరిత్రను ప్రత్యక్షము చేస్తుంది. ఎలా అయితే, సైన్సులో, ఈ రోజుల్లో ఏ గుప్త వస్తువైనా ప్రత్యక్షమైపోయేలా ఇన్వెన్షన్లు చేస్తూ వెళ్తున్నారో, అలాగే సైలెన్సు శక్తి కూడా స్వతహాగనే ప్రత్యక్ష రూపమైపోతుంది. చెప్పటము మరియు చెయ్యటము ద్వారా అవ్వదు. అర్థమైందా?
కావున భవిష్య సమయం గురించి సూచన ఇస్తున్నాము. ఇప్పుడు నాజూకు నమయమును ఎదుర్కొనేందుకు నాజూకుతనమును వదలాలి, అప్పుడే నాజూకు సమయమును ఎదుర్కోగలరు. అచ్ఛా! హర్షితముఖంగా ఉండే గుణమేదైతే ఉందో అది పురుషార్థములో చాలా సహాయకారిగా అవ్వగలదు. ఏవిధంగా ముఖము హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. ఈ సహజ గుణాన్ని ఆత్మలో తీసుకురావాలి. సదా హర్షితంగా ఉంటే ఎటువంటి మాయ ఆకర్షణ ఉండదు. ఇది తండ్రి ఇచ్చే గ్యారంటీ. కానీ ఎప్పుడైతే ఆత్మను సదా హర్షితంగా ఉంచుకుంటారో అప్పుడే అది అవుతుంది. అప్పుడు మాయ ఆకర్షణ నుండి మిమ్మల్ని దూరంగా ఉంచటము తండ్రి పని. ఈ గ్యారంటీని తండ్రి మీకు విశేషంగా ఇస్తున్నారు, అందరికీ ఇవ్వటం లేదు, ఎందుకంటే ఎవరైతే ఆది రత్నాలుగా ఉన్నారో వారితో ఆదిదేవుడికి విశేష స్నేహము ఉంటుంది. కావున ఆదిని అనాదిగా చెయ్యండి. ఎప్పుడైతే అనాదిగా అయిపోతారో అప్పుడిక మాయ ఆకర్షణ ఉండదు. సమస్యలు ఎదురుగా రావు. ఎప్పుడైతే తండ్రి స్నేహము స్మృతిలో ఉంటుందో అప్పుడు సర్వ శక్తివంతుని స్నేహము ముందు ఈ సమస్య ఎంత? ఎక్కడ ఆ స్నేహము, ఎక్కడ ఈ సమస్య? అది ఆవగింజ, ఇది పర్వతము. అంత తేడా ఉంది. కావున అనాది రత్నంగా అయ్యేందుకు సర్వశక్తిమంతుని శక్తి మరియు స్నేహమును ఎల్లప్పుడూ తోడుగా ఉంచుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా భావించవద్దు. సహచరుడు లేకుండా జీవితంలో ఒక్క క్షణము కూడా ఉండకూడదు. స్నేహీ సహచరులు ఎప్పుడూ వేరుగా ఉండరు. సహచరుడిని తోడుగా పెట్టుకోనందువలన, ఒంటరిగా ఉన్నందువలన మాయ గెలిచేస్తుంది. అచ్ఛా!
ఓంశాంతి