Search for a command to run...
6 Aug 1970
బంధనముక్త ఆత్మ గుర్తులు
6 August 1970 · తెలుగు
ఇప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులై వ్యక్త దేహ ఆధారమును తీసుకొని చూస్తున్నాము, ఈ అనుభవమును చేస్తున్నారా? ఏదైనా స్థూల స్థానములో ప్రవేశిస్తారు కదా అలాగే ఈ స్థూల దేహములో ప్రవేశించి ఈ కార్యమును చేస్తున్నాము అన్న అనుభవము కలుగుతుందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించటము మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరల అతీతమై పోవటము, ఇలా అనుభవము చేస్తున్నారా? ఒక్క క్షణములో ధారణ చెయ్యటము మరియు ఒక్క క్షణములో వదలటము, ఈ అభ్యాసము ఉందా? ఎలా అయితే స్థూల వస్తువులనుకూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవటము మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదలటము చెయ్యగలరు కదా అలా ఈ దేహ భానమును ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేసి దేహి అభిమానిగా అయిపోవటము - స్థూల వస్తువుల విషయములో ఎంత సహజమో అంత సరళంగా ఈ ప్రాక్టీసు ఉందా? రచయిత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచన ఆధారమును తీసుకోవటము, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచన ఆధారమును వదలటము - ఇటువంటి రచయితగా అయ్యారా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీతము, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రియముగా అయిపోవాలి. అంతటి బంధనముక్తులుగా అయ్యారా? ఈ దేహ బంధనముకూడా ఉంది. దేహము తన బంధనములో బంధిస్తుంది. ఒకవేళ దేహ బంధనము నుండి ముక్తులైపోయినట్లయితే ఈ దేహము బంధనము వెయ్యదు. కానీ కర్తవ్యమునకు ఆధారముగా భావించి ఆధారమును ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు, అటువంటి అభ్యాసము జరుగుతూ ఉందా? దేహ భానమును వదిలి అనగా దానినుండి అతీతంగా అయ్యేందుకు ఎంత సమయం పడ్తుంది? ఒక్క క్షణం పడ్తుందా? ఎప్పుడూ ఒక్క సెకండు పడ్తుందా లేక ఒక్కోసారి ఒక్కోరకంగా సమయం పడ్తుందా? (ఒక్కోసారి ఒక్కోవిధంగా) ఇప్పుడు అన్ని బంధనాలనుండి ముక్తులవ్వలేదని దీనిద్వారా నిరూపణ అవుతుంది. ఎంత బంధనముక్తులో అంతగానే యోగుయుక్తులుగా అవుతారు మరియు ఎంత యోగయుక్తులుగా ఉంటారో అంతగానే జీవనముక్తిలో ఉన్నత పదవి ప్రాప్తి ఉంటుంది. ఒకవేళ బంధనముక్తులుగా లేనట్లయితే యోగయుక్తులుగా కూడా ఉండరు. వారిని మాస్టర్ సర్వ శక్తిమంతులు అని అంటారా? దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాలనుండి మోహమును తొలగించటము సులభమే కానీ దేహ భానమునుండి ముక్తులవ్వటమన్నది శ్రమతోకూడుకున్న విషయము. ఇప్పుడు ఏ బంధనము మిగిలిపోయి ఉంది? ఇదే. దేహ భానమునుండి ముక్తులైపోవటము. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వ్యక్తములోకి రావాలి. ఇటువంటి అభ్యాసమును ఇప్పుడు చాలా ఎక్కువ వేగముతో చెయ్యాలి. ఏవిధంగా ఇప్పుడు తండ్రి ఆధారమును తీసుకొని మాట్లాడుతున్నారో అలాగే మనము కూడా దేహ ఆధారమును తీసుకొని కర్మ చేస్తున్నామని భావించాలి. ఈ అతీతత్వపు అవస్థ ప్రమాణంగానే ప్రియంగా అవ్వాలి. ఎంతగా ఈ అతీతత్వపు అభ్యాసములో ముందు ఉంటారో అంతగానే విశ్వమును ప్రియముగా భావించటములో ముందు ఉంటారు. సర్వుల స్నేహిగా అయ్యేందుకు మొదట అతీతంగా అవ్వాలి. సేవ చేస్తూ, సంకల్పము చేస్తూ కూడా వీరు చాలా అతీతులు మరియు చాలా ప్రియమైనవారు అని మీకూ మరియు ఇతరులకుకూడా అనుభవము అవ్వాలి. ఎంతగా స్వయము అతీతులుగా అవుతారో అంతగా ఇతరులను తండ్రికి ప్రియమైనవారుగా తయారుచెయ్యగలరు.
సేవా సఫలత స్వరూపము ఏమిటి? (అందరినుండి భిన్న-భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి). సర్వ ఆత్మలను తండ్రికి స్నేహీలుగా మరియు తండ్రి కర్తవ్యములో సహయోగులుగా మరియు పురుషార్థములో ఆ ఆత్మలను శక్తి స్వరూపులుగా తయారుచెయ్యటము - ఇదే సేవా సఫలత స్వరూపము. ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో ఆ ఆత్మలలో ఈ మూడు క్వాలిఫికేషన్లు(అర్హతలు) ప్రత్యక్షరూపంలో కనిపించాలి. ఒకవేళ ఈ మూడింటిలో ఏ ఒక్క గుణమైనా తక్కువ ఉన్నట్లయితే సేవా సఫలత కూడా తక్కువగా ఉంటుంది. అర్థమైందా!
ఏ ఒక్క విషయమును ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి మరియు ధారణ చెయ్యాలి? దీని ద్వారానే ఈ సఫలతా స్వరూపమును ప్రాక్టికల్లోకి తీసుకురాగలరు. అది ఏ విషయము? చాలా సహజము. కష్టమైన పనిపై ఎక్కువ శ్రద్ధ చూపించి ధారణచేస్తున్నారు, సహజ విషయమును వదిలేస్తున్నారు కనుక సహజ విజయాన్ని ధారణ చెయ్యటంలో ఆలస్యమవుతుంది. ఇది తెలుసా? ఇదేమంత పెద్ద విషయం కాదు, అయిపోతుంది అని అర్థం చేసుకుంటారు. కానీ జరిగేదేమిటి? అయిపోతుందిలే - అయిపోతుందిలే అని అనుకుంటూ అనుకుంటూనే ధ్యానమునుండి తొలగిపోతుంది. కావుననే ధారణా రూపులుగా కూడా అవ్వరు. మరి అది ఏ విషయము? ఒకవేళ ఆ విషయమును ధారణ చేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అవ్వగలరు. (సాక్షి స్థితి). ఈ విషయము సరైనది. ఈరోజు బాప్దాదా సాక్షి అవస్థ అనే రాఖీని కట్టడానికి వచ్చారు. ఒకవేళ ఈ సాక్షీపన్ యొక్క రాఖీ ఎల్లప్పుడూ కట్టబడి ఉంటే సేవా సఫలత చాలా త్వరగా వెలువడుతుంది. ఇప్పుడు ఏ కర్తవ్యమునకైతే ఒక మాసము పడ్తుందో ఆ కర్తవ్యమునకు ఒక గంటకూడా పట్టదు. ఈ సాక్షీపన్ రాఖీ కట్టుకోవాలి. ఇతరులకైతే పవిత్రతా రాఖీని కట్తారు కానీ బాప్దాదా ఈరోజు ఈ సాక్షీపన్ రాఖీని కడ్తున్నారు. ఎంతగా సాక్షిగా ఉంటారో అంతగా సాక్షాత్కారమూర్తి మరియు సాక్షాత్తు మూర్తిగా అవుతారు. సాక్షీపన్ తక్కువగా ఉన్న కారణంగా సాక్షాత్తు మరియు సాక్షాత్కారమూర్తిగాకూడా తక్కువగా అయ్యారు. కావున ఈ అభ్యాసమును చెయ్యండి. ఏ అభ్యాసము? ఇప్పుడిప్పుడే ఆధారమును తీసుకున్నారు, ఇప్పుడిప్పుడే అతీతమైపోయారు. ఈ అభ్యాసమును పెంచుకోవటము అనగా సంపూర్ణత మరియు సమయమును సమీపముగా తీసుకురావటము. మరి ఇప్పుడు ఏ ప్రయత్నమును చెయ్యాలి? సమయము మరియు సంపూర్ణతను సమీపములోకి తీసుకురండి. మరొక విషయమునుకూడా విశేషంగా ధ్యానములో ఉంచుకోవాలి, అది - మీ రికార్డును మంచిగా ఉంచుకొనేందుకు అందరికీ రిగార్డు(గౌరవము)ను ఇవ్వండి. ఎంతగా సర్వులకు రిగార్డును ఇస్తారో అంతగానే మీ రికార్డును మంచిగా ఉంచుకోగలరు. ఇతరులకు రిగార్డును ఇవ్వటము అనగా మీ రికార్డును మంచిగా తయారు చేసుకోవటము. ఒకవేళ తక్కువ రిగార్డును ఇచ్చినట్లయితే మీ రికార్డులో లోపము చేసుకుంటారు. కావున ఈ ముఖ్యమైన విషయము యొక్క ఆవశ్యకత ఉంది. అర్థమైందా! ఏ విధంగా యజ్ఞమునకు మదద్గార్(సహాయకులు)లుగా అవ్వటమే మదద్(సహాయము) తీసుకోవటమో అలా రిగార్డును ఇవ్వటమే రికార్డును తీసుకోవటము. తీసుకొనేందుకే ఇస్తారు. ఒక్కసారి ఇవ్వటము అనేకసార్లు తీసుకొనేందుకు హక్కుదారుగా తయారుచేస్తుంది. చిన్నవాళ్ళకు ప్రేమను, పెద్దవారికి గౌరవమును ఇవ్వాలని అంటారుకదా! కానీ అందరినీ పెద్దవారిగా భావించి రిగార్డును ఇవ్వటము - ఇదే సర్వుల స్నేహమును ప్రాప్తి చేసుకొనేందుకు సాధనము. ఈ విషయముకూడా విశేష ధ్యానమును ఉంచేందుకు యోగ్యమైనది. ప్రతి విషయములోనూ మొదట మీరు. దీనిని వృత్తి, దృష్టి మరియు వాణి, కర్మలో తీసుకురావాలి. ఎంతగా మొదట మీరు అని అంటారో అంతగానే విశ్వ తండ్రి సమానంగా అవ్వగలరు.
విశ్వ తండ్రి సమానము అన్నదాని అర్థం ఏమిటి? ఒకటేమో విశ్వ తండ్రి సమానంగా అవ్వటము. రెండవది ఎప్పుడైతే విశ్వ రాజులుగా అవుతారో అప్పుడు కూడా విశ్వ తండ్రి అనే అంటారు కదా! విశ్వరాజే విశ్వ తండ్రి కదా! కావున విశ్వ తండ్రిగాకూడా అవుతారు మరియ విశ్వ తండ్రి సమానంగాకూడా అవుతారు. దేనితో అవుతారు? మొదట మీరు చెయ్యటంద్వారా. అర్థమైందా?
నిర్మానులుగా అవ్వటంద్వారా ప్రత్యక్ష ప్రమాణులుగా అవ్వగలరు. నిర్మానులుగా అవ్వటముద్వారా విశ్వ నిర్మాణము చెయ్యగలరు. అర్థమైందా? అటువంటి స్థితిని ధారణ చేసేందుకు సాక్షీపన్ రాఖీని కట్టుకోవాలి. ఎప్పుడైతే మొదటినుండే సాక్షీపన్ రాఖీని కట్టుకొని ఉన్నట్లయితే రాఖీ సేవ సఫలతాపుర్వకంగా జరుగుతుంది. అర్థమైందా!
పార్టీలతో:-
సమ్మేళన చేస్తున్నారు. సమ్మేళనము అంటే అర్థము ఏమిటి? సర్వ ఆత్మల మిలనము. సర్వ ఆత్మల మిలనమును ఎవరితో చేయిస్తారు? తండ్రితో. ఇప్పుడు ఏ సమయము? సంపూర్ణతా సమయము సమీపముగా వచ్చే సమయము కావున వర్తమాన సమయ ప్రమాణంగా సఫలత నిశ్చితయ్యే ఉంది. ఏవిధంగా కల్పపూర్వముకూడా పురుషార్థమును నిమిత్తమాత్రముగా చేయించారు. పురుషార్థము ఈరోజు, ప్రాప్తి ఎప్పుడో అని అలాకూడా కాదు. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రాప్తి. అటువంటి పురుషార్థీలేనా? ఎప్పుడైతే స్వయం ప్రాప్తి స్వరూపులుగా అవుతారో అప్పుడు ఇతర అనేక ఆత్మలకు ప్రాప్తిని చేయించగలరు. ఒకవేళ స్వయమే ప్రాప్తి స్వరూపులుగా అవ్వనట్లయితే ఇతరులకు ఎలా ప్రాప్తి చేయించగలరు? ఇప్పుడు చేయించకపోతే మరింకెప్పుడు చేయిస్తారు? వినిపించి ఉన్నాము కదా – ‘‘ఎప్పుడో’’ అన్న మాటకూడా సమాప్తము, ప్రతి విషయములో ‘‘ఇప్పుడు’’. వాణి, కర్మ మరియు సంకల్పములో ఇంతటి పరివర్తనను తీసుకురావాలి. సంకల్పములోకూడా ఎప్పుడో చేస్తాములే లేక ఎప్పుడో అవుతుందిలే అన్న మాటకూడా రాకూడదు. ఇప్పుడు అయిపోనే అయిపోతుంది. అలా పరివర్తన చెయ్యాలి అప్పుడే సేవా సఫలత ఉంటుంది. ఒకవేళ స్వయములోనే ఎప్పుడో అవుతుందిలే అని ఉన్నట్లయితే మీ ప్రజలుకూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది, ఎప్పుడో చేస్తాములే లేక ఎప్పుడో అయిపోతుందిలే అని అంటారు. ఎప్పుడో అన్నదానిపై వదిలేసే వారు వెనుక వచ్చే ప్రజలుగా ఉంటారు కావున ఇప్పుడు సమీప ప్రజలను తయారు చెయ్యాలి. సమీప ప్రజలను తయారుచేసేందుకు నాజూకుతనమును వదలవలసి ఉంటుంది. సుకుమారంగా నడవడం వదిలిపెట్టి రహస్యయుక్తంగా నడుచుకోవాలి. నిర్లక్ష్యము నాజూకుతనము అవుతుంది. ఎంతెంతగా రాజయుక్తంగా (రహస్యయుక్తంగా) ఉంటారో అంతంతగా నాజూకుతనము వదిలిపోతూ ఉంటుంది. ఆత్మికతకు చెందిన ఒకటే రూపము ఎల్లప్పుడూ ఉంటుందా? రూపమును మార్చేందుకు బదులుగా ఈ శరీరభానమును వదలాలి, ఈ ప్రాక్టీసులో ఉండాలి. శరీరమును వదిలే అభ్యాసము ఉన్నట్లయితే రూపము మారటము వదిలిపోతుంది. చదువులోకూడా రెగ్యులర్గా ఉండటముకూడా ముఖ్యమైన విషయము. అదికూడా కేవలము క్లాసుకు రావటములోనే కాదు, ప్రతి విషయములో రెగ్యులర్, ఎంతటి రెగ్యులర్లో అంతటి రూలర్లుగా అవుతారు. కావున ఏమి చెయ్యవలసి ఉంటుంది? అన్ని విషయాలలో రెగ్యులర్. అమృతవేళ లేవడం నుండి ప్రతి కర్మ, ప్రతి సంకల్పము మరియు ప్రతి మాటలోకూడా రెగ్యులర్. ఒక్క మాటకూడా వ్యర్థమైన మాట వెలువడకూడదు. ఈ ప్రపంచములోని పెద్ద పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు ఉపన్యాసమును ఇచ్చే సమయములో వారు మాట్లాడే మాటలుకూడా ఫిక్స్ చెయ్యబడి ఉంటాయి. మీరుకూడా చాలా పెద్ద మనుష్యులుకదా! కావున మీ మాటలుకూడా ఫిక్స్ అయ్యి ఉండాలి. మాయ మిక్స్ ఉండకూడదు. ఇలా రెగ్యులర్లుగా ఉండేవారి సేవ సఫలమయ్యే ఉంటుంది. సమ్మేళనపు ప్రతి కార్యమును చేస్తూకూడా మేము విశ్వము ముందు సాక్షాత్కారమూర్తులము అన్నదానిని ఎప్పుడూ మరువకూడదు. సాక్షాత్కారమూర్తిగా అవ్వటంతో మీద్వారా బాప్దాదా సాక్షాత్కారము స్వతహాగనే జరుగుతుంది. స్వయమును ఎప్పుడైతే జ్ఞాన, యోగములకు ప్రత్యక్ష ప్రమాణంగా తయారుచేస్తారో అప్పుడే దానిని చెయ్యగలరు. ఎంతగా స్వయమును ప్రత్యక్ష ప్రమాణంగా తయారుచేస్తారో అంతగానే తండ్రిని ప్రత్యక్షము చెయ్యగలరు. అచ్ఛా!
ఓంశాంతి