"వరదాత నుండి ప్రాప్తించిన వరదానాలను వృద్ధిలోకి తెచ్చేందుకు విధి"
ఈరోజు బాప్‌దాదా తమ ఆత్మిక చాత్రక పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు బాబా నుండి వినడంలో, బాబాను కలుసుకోవడంలో, అలాగే బాబా సమానంగా అవ్వడంలో చాత్రకులుగా ఉన్నారు. వినటం వలన జన్మ జన్మాంతరాల దాహం తీరుతుంది. జ్ఞాన అమృతము దాహంతో ఉన్న ఆత్మలను తృప్త ఆత్మలుగా చేస్తుంది. వింటూ-వింటూ ఆత్మలు కూడా బాబా సమానంగా జ్ఞాన స్వరూపులుగా అయిపోతారు లేదా జ్ఞాన మురళిని వింటూ-వింటూ స్వయంకూడా ‘మురళీధరులైన పిల్లలు’గా అయిపోతారు అని చెప్పవచ్చు. ఆత్మిక మిలనమును జరుపుకుంటూ బాబా స్నేహములో ఇమిడిపోతారు. మిలనము చేస్తూ లవలీనురై, మగ్న స్థితి కలవారుగా అవుతారు, మిలనము చేసుకుంటూ ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్న ఈ అనుభూతిలో ఇమిడిపోయి ఉంటారు, మిలనాన్ని జరుపుకుంటూ నిర్విఘ్నలుగా, సదా బాబా యొక్క సాంగత్యపు రంగులో ప్రియమైనవారిగా అయిపోతారు. ఇలా కలిసిపోయినప్పుడు, స్నేహములో లవలీనురైపోయినప్పుడు ఏ ఆశ ఉంటుంది? ‘బాబా సమానంగా’ అవ్వాలన్న ఆశ ఉంటుంది. బాబా యొక్క ప్రతి అడుగులో అడుగు వేసేవారు అనగా బాబా సమానంగా అయ్యేవారు. బాబాది ఏవిధంగా సదా సర్వ శక్తిమంతమైన స్వరూపమో, అలా పిల్లలు కూడా సదా మాస్టర్ సర్వశక్తివంతమైన స్వరూపులుగా అవుతారు. బాబాది ఏవిధంగా సదా శక్తిశాలీ స్వరూపమో, సదా లైట్ స్వరూపమో అలా సమానంగా అయిపోతారు.
సమానంగా అవ్వాల్సిన విశేష విషయాలైతే తెలుసు కదా, ఏ ఏ విషయాలలో బాబా సమానంగా అవ్వాలి? సమానంగా అవుతున్నారు మరియు అయ్యారు కూడా. బాబా పేరు ఏదో అదే పిల్లల పేరు కూడా. విశ్వ కల్యాణకారి - ఇదే కదా మీ అందరి పేరు. బాబా రూపము ఏదో అదే పిల్లల రూపము, బాబా గుణము ఏదో అదే పిల్లల గుణము. బాబా యొక్క ప్రతి గుణాన్ని ధారణ చేసేవారే బాబా సమానంగా అవుతారు. బాబా కార్యమే పిల్లల కార్యము. అన్ని విషయాలలో బాబా సమానంగా అవ్వాలి. అందరి లక్ష్యమైతే అదే కదా. సమ్ముఖంలో ఉండేవారు కారు, కానీ సమానంగా అయ్యేవారు. తండ్రిని అనుసరించేవారు అని వీరినే అంటాము. కనుక అన్ని విషయాలలో ఎంతవరకు బాబా సమానంగా అయ్యాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సమానంగా అయ్యే వరదానమును బాబా ఆదినుండి పిల్లలకు ఇచ్చారు. ఆది వరదానము – “సర్వ శక్తులతో సంపన్న భవ”. లౌకిక జీవితములో తండ్రి లేక గురువు వరదానమును ఇస్తారు. ‘ధనవాన్ భవ’, ‘పుత్రవాన్ భవ’, ‘ఆయుష్మాన్ భవ’ లేక ‘సుఖీ భవ’ అన్న వరదానాన్ని ఇస్తారు. బాప్‌దాదా ఏ వరదానాన్ని ఇచ్చారు? ‘సదా జ్ఞాన ధనము, శక్తుల ధనముతో సంపన్న భవ’. ఇదే బ్రాహ్మణ జీవిత ఖజానా.
ఎప్పటినుండైతే బ్రాహ్మణ జన్మను తీసుకున్నారో, అప్పటినుండి సంగమయుగ స్థాపన కార్యములో ఆంతిమము వరకు జీవించి ఉండాలి అనగా ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఒకవేళ మధ్యలో బ్రాహ్మణ జీవితమునుండి తొలగిపోయి పాత సంస్కారాలు, పాత ప్రపంచములోకి వెళ్ళిపోయినట్లయితే అటువంటివారిని జన్మ తీసుకున్నారు కానీ అల్పాయుష్కులు అని అంటాము ఎందుకంటే బ్రాహ్మణ జీవితము నుండి చనిపోయారు. కొందరైతే కోమాలోకి వెళ్ళిపోయినట్లుంటారు, ఉన్నాగానీ లేనట్లుగా ఉంటారు, అప్పుడప్పుడు మేల్కొంటారు కానీ వారు బ్రతికున్నా మరణించినట్లుగానే ఉంటారు. కనుక ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అనగా సదా ఆది నుండి అంతిమము వరకు బ్రాహ్మణ జీవితములో, శ్రేష్ఠ దివ్య జీవితములో సర్వ ప్రాప్తులతో జీవించి ఉండటము. దీర్ఘాయువుతోపాటు ‘నిరోగి భవ’ అన్న వరదానము కూడా అవసరము. ఆయువు ఎక్కువ ఉన్నాగానీ ఒకవేళ మాయ వ్యాధి పదే-పదే బలహీనపరుస్తున్నట్లయితే అటువంటివారు జీవించినా జీవించనట్లే. కనుక ‘దీర్ఘాయుష్మాన్ భవ’ తోపాటు సదా ఆరోగ్యంగా ఉండాలి అనగా నిర్విఘ్నంగా ఉండాలి. పదే-పదే చిక్కుల స్థితి లేక దుఃఖపడే స్థితి అనే మంచమెక్కకూడదు. ఎవరైనా అనారోగ్యం పాలైతే బెడ్‌లోనే ఉంటారు కదా. చిన్న చిన్న చిక్కులనైతే నడుస్తూ-తిరుగుతూనే పరిష్కరించుకుంటారు కానీ ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, చిక్కులలోకి వచ్చినప్పుడు బాధపడ్తే మనసు పరిస్థితి ఎలా ఉంటుంది? శరీరము మంచాన పడితే లేవాలని, తిరగాలని, తినాలని, త్రాగాలని అనిపించదు. అలాగే ఇక్కడ కూడా యోగములో కూర్చున్నాగానీ మనసు నిలవదు, జ్ఞానాన్ని విన్నాగానీ మనసుతో వినరు. సేవను కూడా మనస్ఫూర్తిగా చెయ్యరు. ఆడంబరానికో, భయానికో, లోకనిందకో చేస్తారు. దీనిని సదా ఆరోగ్యకర జీవితము అని అనరు. కనుక ‘దీర్ఘాయువు భవ’ అనగా ‘నిరోగి భవ’ అని వీరిని అంటాము.
‘పుత్రవాన్ భవ’ లేక ‘సంతాన భవ’. మీ సంతానము ఉందా? ఇద్దరు-నలుగురు పిల్లలకు జన్మనిచ్చారా? ‘సంతాన భవ’ అన్న వరాదానము ఉంది కదా. ఇద్దరు-నలుగురు పిల్లల కొరకు వరదానము లభించదు కానీ ఎప్పుడైతే బాబా సమానంగా మాస్టర్ రచయిత అన్న స్థితిలో స్థితులవుతారో అప్పుడు అందరూ మీ రచన అని అనిపిస్తుంది. అనంతమైన మాస్టర్ రచయితలుగా అవ్వటము, ఇది అనంతమైన ‘పుత్రవాన్ భవ’, ‘సంతాన భవ’గా అయిపోతుంది. ఇద్దరు-నలుగురు జిజ్ఞాసువులను మేము తయారుచేసాము, వీరు మావారు, ఇలా హద్దులో ఉండకూడదు. మాస్టర్ రచయిత స్థితి అనంతమైన స్థితి. ఏ ఆత్మనైనా లేక ప్రకృతి తత్వాలను కూడా తమ రచనగా భావించినట్లయితే విశ్వ కల్యాణకారీ స్థితితో ప్రతి ఒక్కరి పట్ల కల్యాణకారి శుభ భావన, శుభ కామనలు ఉంటాయి. రచనకు రచన పట్ల ఇవే భావనలు ఉంటాయి. అనంతమైన మాస్టర్ రచయితలుగా అయినప్పుడు ఎటువంటి హద్దు ఆకర్షణలు ఆకర్షితము చెయ్యజాలవు. స్వయమును ఎల్లప్పుడు ఎక్కడ నిల్చుని ఉన్నట్లుగా చూస్తారు? వృక్ష రచయిత బీజము, వృక్షము యొక్క అంతిమ స్థితి వచ్చినప్పుడు ఆ బీజము పైకి వస్తుంది కదా. అలాగే అనంతమైన మాస్టర్ రచయిత సదా స్వయమును ఈ కల్ప వృక్షము పైన నిలబడి ఉన్నట్లుగా అనుభవము చేస్తారు, బాబాతోపాటుగా వృక్షము పైన నిలబడి మాస్టర్ బీజరూపులై శక్తుల, గుణాల, శుభ భావన-శుభ కామనల, స్నేహ సహయోగాల కిరణాలను వ్యాపింపచేస్తారు. సూర్యుడు పైన ఉంటాడు కనుక మొత్తము విశ్వములో స్వతహాగనే కిరణాలు వ్యాపిస్తాయి కదా. అలా మాస్టర్ బీజరూపులే మొత్తము వృక్షమునకు కిరణాలను లేక నీటిని ఇవ్వగలరు. మరి మీకు ఎంతమంది సంతానమయ్యారు? మొత్తము విశ్వమంతా మీ రచన అయ్యారు కదా! కనుక ‘మాస్టర్ రచయిత భవ’. దీనినే ‘పుత్రవాన్ భవ’ అని అంటాము. ఎన్ని వరదానాలు ఉన్నాయి! దీనినే బాబా సమానంగా అవ్వటము అని అంటారు. జన్మించినప్పుడే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు బాబా ఈ అన్ని వరదానాలను ఇచ్చారు. వరదానాలు లభించాయి కదా లేక ఇప్పుడు లభించాలా?
ఎవరికైనా ఏదైనా వరదానము లభించినప్పుడు ఆ వరదానముతోపాటు వరదానమును కార్యములో పెట్టే విధిని కూడా వినిపించటం జరుగుతుంది. ఒకవేళ ఆ విధిని అనుసరించనట్లయితే వరదానము యొక్క లాభాన్ని తీసుకోలేరు. వరదానాలైతే అందరికీ లభించాయి, ప్రతి ఒక్క వరదానముతో విధి ద్వారా వృద్ధిని ప్రాప్తి చేసుకోగలరు. వృద్ధిని ఎలా ప్రాప్తి చేసుకోవచ్చు అన్న విధిలో అన్నింటికన్నా సహజమైనది మరియు అన్నింటికన్నా శ్రేష్ఠమైనది ఇదే - ఎటువంటి సమయమో దాని అనుసారంగా వరదానము స్మృతిలోకి రావాలి. స్మృతిలోకి రావటం ద్వారా సమర్థులుగా అవుతారు మరియు సిద్ధి స్వరూపులుగా అవుతారు. సమయప్రమాణంగా ఎంతగా కార్యములో వినియోగిస్తారో, అంతగా వరదానము వృద్ధిని ప్రాప్తి చేసుకుంటుంది అనగా సదా వరదానము యొక్క ఫలమును అనుభవము చేస్తుంటారు. ఎంతటి శ్రేష్ఠ శక్తిశాలీ వరదానము లభించిందంటే - కేవలము మీ కొరకే కార్యములో వినియోగించి ఫలమును ప్రాప్తి చేసుకోగలగటమే కాకుండా ఇతర ఆత్మలను కూడా వరదాత బాబా నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు యోగ్యులుగా తయారుచెయ్యగలరు. సంగమయుగములోని ఈ వరదానము 21 జన్మలు వివిధ రూపాలలో తోడుగా ఉంటుంది. ఈ సంగమ రూపము వేరు మరియు 21 జన్మలు ఈ వరదానము జీవితము లెక్కతో నడుస్తూ ఉంటుంది. కానీ వరదాత మరియు వరదానములను ప్రాప్తి చేసుకునే సమయము ఇప్పుడే. కనుక అన్ని వరదానాలను కార్యములో పెడుతూ సహజంగా ఉన్నతి చెందుతున్నానా అని పరిశీలించుకోండి.
ఈ వరదానము యొక్క విశేషత ఏమిటంటే వరదానీలు ఎప్పుడూ కష్టపడవలసిన అవసరము ఉండదు. భక్త ఆత్మలు కూడా కష్టపడి అలసిపోయినప్పుడు బాబా నుండి వరదానమునే కోరుకుంటారు. మీవద్దకు కూడా లోకులు వచ్చినప్పుడు, యోగము చెయ్యాలని అనుకోనప్పుడు వారు ఏమి మాట్లాడుతారు? మాకు కేవలము వరదానాన్ని ఇవ్వండి, తలపై చెయ్యి పెట్టండి అని అంటారు. బ్రాహ్మణ పిల్లలైన మీ తలపై వరదాత అయిన బాబా హస్తము ఎల్లప్పుడు ఉంటుంది. శ్రేష్ఠ మతమే చెయ్యి. స్థూల చేతినైతే 24 గంటలూ పెట్టి ఉంచరు కదా. బాబా యొక్క శ్రేష్ఠ మతమనే ఈ వరదానీ రూప చెయ్యి ఎల్లప్పుడు పిల్లలపై ఉంటుంది. అమృతవేళ నుండి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి శ్వాస కొరకు, ప్రతి సంకల్పము కొరకు, ప్రతి కర్మ కొరకు శ్రేష్ఠ మతమనే చెయ్యి ఉండనే ఉంటుంది. ఈ వరదానమును విధిపూర్వకంగా నడిపిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కష్టపడాల్సిన అవసరము ఉండదు.
ఎలా అయితే దేవతల కోసం గాయనము ఉంది కదా - ఇచ్ఛా మాత్రమ్ అవిద్య (కోరికల గురించిన పూర్తి అజ్ఞానము). ఇది ఫరిస్తా జీవితము యొక్క విశేషత. దేవతా జీవితములో కోరికల విషయమే ఉండదు. బ్రాహ్మణ జీవితము నుండి ఫరిస్తా జీవితముగా అయిపోతుంది అనగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. ఏ విధమైనటువంటి శుద్ధ కర్మలోగానీ లేక వ్యర్థ కర్మలోగానీ లేక వికర్మలలోగానీ లేక వెనుకటి కర్మలలోగానీ, ఏ కర్మయొక్క బంధనములోనైనా బంధింపబడి చెయ్యటము - దీనిని కర్మాతీత స్థితి అని అనము. ఒక్క కర్మకే సంబంధము ఉంటుంది, మరొకటి బంధనము ఉంటుంది. కనుక హద్దు కోరికల నుండి అవిద్యులు అన్న గాయనము ఎలా అయితే ఉందో, అలా ఫరిస్తా జీవితము లేక బ్రాహ్మణ జీవితము అనగా ‘కష్టము’ అన్న మాట యొక్క అవిద్యులు, భారము నుండి అవిద్యులు, అదేమిటో కూడా తెలియని స్థితి! కనుక వరదానీ ఆత్మ అనగా కష్టతరమైన జీవితమును అవిద్యగా అనుభవము చేసేవారు. వీరినే వరదానీ అత్మ అని అంటాము. కనుక బాబా సమానులుగా అవ్వటము అనగా సదా వరదాత నుండి ప్రాప్తించిన వరదానాలతో పాలింపబడటము, సదా నిశ్చింతతను, నిశ్చిత విజయమును అనుభవము చెయ్యటము.
కొంతమంది పిల్లలు పురుషార్థమునైతే చాలా బాగా చేస్తారు. కానీ పురుషార్థపు భారము అనుభమవ్వటము - ఇది యథార్థ పురుషార్థము కాదు. అటెన్షన్ పెట్టడము ఇది బ్రాహ్మణ జీవిత విధి. కానీ అటెన్షన్ టెన్షన్‌లోకి మారిపోతుంది. సహజమైన అటెన్షన్ ఉండదు. దీనిని కూడా యథార్థ అటెన్షన్ అని అనబడదు. ఇది మంచిది, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని జీవితములో స్థూలమైన జ్ఞానము ఉంటుంది కనుక జ్ఞానము ఆధారంగా ఎవరైతే జ్ఞాన సంపన్నులుగా అవుతారో వారి లక్షణము - ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని వారికి సహజ అటెన్షన్ ఉంటుంది. ఇది చెయ్యాలా-చెయ్యద్దా, ఇది తినాలా-తినద్దా, ఇలా నడవాలా-వద్దా అని ప్రతి అడుగులో టెన్షన్ ఉండదు. సహజ జ్ఞానము యొక్క శక్తితో అటెన్షన్ ఉంటుంది. ఇలా యథార్థ పురుషార్థి యొక్క ప్రతి అడుగులో, ప్రతి కర్మలో నహజసిద్ధమైన అటెన్షన్ ఉంటుంది ఎందుకంటే జ్ఞానము యొక్క లైట్-మైట్ స్వతహాగానే యథార్థ రూపముతో, యథార్థ రీతితో నడిపిస్తుంది. కనుక పురుషార్థమైతే చెయ్యండి, తప్పకుండా అటెన్షన్ పెట్టుకోండి కానీ ‘టెన్షన్’ రూపంతో చెయ్యకండి. చాలా పని చెయ్యాలనుకుంటారు, నంబర్‌వన్‌గా అవ్వాలనుకుంటారు, కానీ టెన్షన్‌లోకి వచ్చినప్పుడు, ఆ టెన్షన్ ఎంత అనుకుంటారో అంత చెయ్యనివ్వదు, ఎలా అవ్వాలనుకుంటారో అలా అవ్వనివ్వదు, అంతేగాక టెన్షన్ టెన్షన్‌ను కలిగిస్తుంది ఎందుకంటే అనుకున్నది జరగదు కాబట్టి టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది.
మరి పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కానీ కొంతమంది పురుషార్థాన్ని ఎక్కువ భారీగా చేస్తారు మరియు కొంతమంది ఏది జరిగేదుందో అదే జరుగుతుంది, చూస్తాములే, ఎవరు చూస్తారు, ఎవరు వింటారు... అని ఇలా పూర్తి నిర్లక్ష్యులుగా అయిపోతారు. కనుక అదీ మంచిది కాదు, ఇదీ మంచిది కాదు. బ్యాలెన్స్ ద్వారా బాబా ఆశీర్వాదాలను, వరదానాలను అనుభవము చెయ్యండి. బాబా చెయ్యి ఎల్లప్పుడు నా తలపై ఉంది - ఈ అనుభవమును ఎల్లప్పుడు స్మృతిలో పెట్టుకోండి. తలపై వరదానీ హస్తము ఉంది అన్న స్థూల చిత్రాన్ని భక్త ఆత్మలు ఏవిధంగా ఎదురుగా పెట్టుకుంటారో, అలా మీరు కూడా నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో ఈ అనుభవము యొక్క చిత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. అర్థమైందా? చాలా పురుషార్థము చేసారు, ఇప్పుడు వరదానాలతో పాలింపబడుతూ ఎగురుతూ ఉండండి. బాబాను జ్ఞాన దాత, విధాతగా అనుభవమును చేసారు, ఇప్పుడు వరదాతగా అనుభవమును చెయ్యండి. అచ్ఛా!
సదా ప్రతి అడుగులో బాబాను అనుసరించేవారు, సదా స్వయమును వరదాత బాబా యొక్క వరదానీ శ్రేష్ఠ ఆత్మగా అనుభవము చేసేవారు, సదా ప్రతి అడుగును సహజంగా దాటేవారు, సదా సర్వ వరదానాలను అవసరమైన సమయములో కార్యములో పెట్టేవారు, అటువంటి బాబా సమానంగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా నుండి వరదాత రూపములో ప్రియస్మృతులు మరియు నమస్తే.
ముఖ్యమైన మహారథి సోదరులతో మిలనము
జన్మించినప్పటినుండే ఎన్ని వరదానాలు లభించాయి! ప్రతి ఒక్కరికీ తమ తమ వరదానాలు లభించాయి. జన్మయే వరదానాలతో నిండి ఉంది. లేదంటే, ఈరోజు ఇంత ముందుకెళ్ళే వారు కాదు. వరదానముతో జన్మ జరిగింది, కనుక ఉన్నతి చెందుతున్నారు. పాండవుల మహిమ తక్కువైనది కాదు. ప్రతి ఒక్కరి విశేషతను వర్ణించినట్లయితే ఎంత అవుతుంది! ఈ భాగవతము ఉంది కదా, అంత అవుతుంది. బాబా దృష్టిలో ప్రతి ఒక్కరిలో విశేషతలు ఉన్నాయి. వేరేది చూస్తున్నా చూడరు, తెలిసినా తెలిసినట్లు ఉండరు. కనుక విశేషతలు ఎల్లప్పుడు ముందుకు తీసుకు వెళ్తున్నాయి మరియు తీసుకువెళుతూ ఉంటాయి. ఎవరైతే జన్మించినప్పటినుండే వరదానీ ఆత్మలో, వారు ఎప్పుడు కూడా వెనుకకు మరలలేరు. సదా ఎగిరేటువంటి వరదానీ ఆత్మలు. వరదాత బాబా యొక్క వరదానము ముందుకు తీసుకువెళ్తుంది. పాండవులు గుప్తంగా ఉంటారు కానీ బాప్‌దాదా మనసులో సదా ప్రత్యక్షంగా ఉంటారు. మంచి-మంచి ప్లాన్లనైతే పాండవులే తయారుచేస్తారు. శక్తులు వేటాడ్తారు కానీ వేటను తీసుకువచ్చేవారిదే అద్భుతము. ఒకవేళ తీసుకువచ్చేవారు తీసుకురానట్లయితే ఏం వేటాడ్తారు? కనుక పాండవులకు వారి విశేష వరదానము ఉంది. ‘స్మృతి’ మరియు ‘సేవ’ల బలము విశేషంగా లభించి ఉంది. ‘స్మృతి బలము’ కూడా విశేషంగా లభిస్తుంది మరియు ‘సేవ బలము’ కూడా విశేషంగా లభిస్తుంది, ఎందుకు? దానికి కూడా కారణము ఉంది ఎందుకంటే ఎవరైతే ఎంతగా అవసరమైన సమయములో కార్యములోకి వచ్చారో, వారికి విశేష వరదానము లభించింది. ఆది సమయములో స్థాపన జరిగినప్పుడు పాండవులైన మీరు మర్జ్ అయ్యి ఉన్నారు, ఇమర్జ్ అయ్యి లేరు. శక్తులు ఉదాహరణగా అయ్యారు, వారి ఉదాహరణను చూసి ఇతరులు ముందుకు వెళ్ళారు. వీరు అవసరమైన సమయములో ఉదాహరణగా అయ్యారు కనుక అవసరమైన సమయములో ఎవరు ఎంతగా సహయోగులుగా అయ్యారో, అది జీవితముతోనైనా, సేవతోనైనా సరే.... వారికి డ్రామా అనుసారంగా విశేష బలము లభిస్తుంది. మీ పురుషార్థమైతే ఉండనే ఉంది కానీ అదనంగా బలం లభిస్తుంది. అచ్ఛా!
సేవ చెయ్యటం వలన సర్వాత్మలు ఎవరైతే సంతోషాన్ని పొందుతారో, వారి నుండి కూడా చాలా బలము లభిస్తుంది. అనుభవీ ఆత్మల సేవ అవసరము ఉంది ఎందుకంటే ఎవరైతే సాకారములో పాలనను తీసుకున్నారో, వారిని చూస్తుంటే ఎల్లప్పుడు బాబాయే గుర్తుకు వస్తారు. మీరు(దాదీలు) ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని విశేషంగా ఏమడుగుతారు? చరిత్రను వినిపించండి, బాబా విషయాలు ఏవైనా వినిపించండి అని అడుగుతారు. విశేషత ఉంది కదా కనుక సేవ విశేషత యొక్క వరదానము లభించింది. స్టేజ్‌పై నిలబడి భాషణ చెయ్యకపోయినాగానీ ఇది అన్నింటికన్నా పెద్ద భాషణ. చరిత్రను వినిపించి చరిత్రవంతులుగా అయ్యేందుకు ప్రేరణను ఇవ్వటము - ఇది అన్నింటికన్నా పెద్ద సేవ. కనుక సేవలో వెళ్ళాల్సిందే మరియు సేవకు నిమిత్తులుగా అవ్వాల్సిందే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
