‘‘సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము - అన్నింటినీ సఫలము చేయండి’’
ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చే రచయిత అయిన తండ్రి తమ కొత్త జీవితాన్ని తయారుచేసుకునే పిల్లలను చూస్తున్నారు. ఈ కొత్త జీవితము అనగా శ్రేష్ఠమైన బ్రాహ్మణ జీవితము ఉన్నదే కొత్త యుగాన్ని రచించడానికి. కావున ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క కొత్త జీవితము, కొత్త యుగాన్ని తీసుకురావడానికే ఉంది, ఆ యుగంలో అన్నీ కొత్తవే కొత్తవి ఉంటాయి. ప్రకృతి కూడా సతోప్రధానంగా అనగా కొత్తగా ఉంటుంది.
ప్రపంచం లెక్కలో వారు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇస్తారు మరియు పరస్పరం ఒకరికొకరు కొత్త సంవత్సరానికి గుర్తుగా కానుకలను కూడా ఇస్తారు. కానీ తండ్రి మరియు మీరు కొత్త యుగం యొక్క శుభాకాంక్షలను ఇస్తారు. సర్వాత్మలకు ఏ శుభవార్తను వినిపిస్తారంటే - ఇప్పుడు కొత్త యుగం అనగా బంగారు ప్రపంచమైన ‘సత్యయుగము’ లేక ‘స్వర్గము’ రానే వచ్చింది అని! ఈ సేవనే చేస్తారు కదా. ఈ శుభవార్తనే వినిపిస్తారు కదా. కొత్త యుగం యొక్క బంగారు కానుకను కూడా ఇస్తారు. ఏ కానుకను ఇస్తారు? అనేక జన్మలలో ప్రతి జన్మకు విశ్వ రాజ్య భాగ్యము. ఈ బంగారు కానుకలో అనేక కానుకలన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఈ నాటి ప్రపంచంలో ఎవరైనా అతి పెద్ద కానుకను లేక అతి గొప్ప కానుకను ఇచ్చినా కూడా, ఏమిస్తారు? ఒకవేళ ఎవరైనా ఎవరికైనా ఈరోజుల్లోని కిరీటము లేక సింహాసనము ఇచ్చినా కూడా, అది మీ సతోప్రధాన బంగారు కానుక ఎదురుగా ఏపాటిది? అదేమైనా పెద్ద విషయమా?
నవ జీవన రచయిత అయిన తండ్రి పిల్లలైన మీ అందరికీ ఈ అమూల్యమైన అవినాశీ కానుకను ఇచ్చారు. అధికారులుగా అయ్యారు కదా. బ్రాహ్మణాత్మలు సదా తరగని నిశ్చయం యొక్క నషాతో ఏమంటారంటే - ఈ విశ్వ రాజ్య భాగ్యము మా జన్మసిద్ధ అధికారము! ఇంతటి నషా ఉంది కదా లేక అప్పుడప్పుడు తగ్గుతుంది మరియు అప్పుడప్పుడు పెరుగుతుందా? ‘‘నిశ్చయముంది మరియు అది నిశ్చితము’’ - ఈ నిశ్చిత అధికారాన్ని ఎవ్వరూ తప్పించలేరు. నిశ్చయబుద్ధి కల ఆత్మల కొరకు ఇది నిశ్చితమైన విధి. నిశ్చితమే కదా లేక లభిస్తుందో లేదో అంటూ కొద్దిగా చింత ఉందా? ఎప్పుడైనా ఇటువంటి సంకల్పం వస్తుందా? ఒకవేళ బ్రాహ్మణులుగా అయ్యారంటే బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా, ఫరిశ్తాల నుండి దేవతలుగా అవ్వడం నిశ్చితము. పక్కా నిశ్చయం ఉంది కదా లేక కొద్దిగా అలజడి ఉంటుందా? అచలంగా, స్థిరంగా ఉన్నారా? కనుక ఇటువంటి బంగారు కానుకను తండ్రి మీకు ఇచ్చారు, మరి మీరేమి చేస్తారు? ఇతరులకు ఇస్తారు. అల్పకాలికమైన కానుకైతే ఆ సమయం సమాప్తమవుతూనే కానుక కూడా సమాప్తమవుతుంది. కానీ ఈ అవినాశీ కానుక ప్రతి జన్మలో మీతో పాటు ఉంటుంది.
వాస్తవికంగా జరుపుకోవడమంటే కొత్త యుగాన్ని జరుపుకోవడము. కానీ ఈ సంగమయుగంలో ప్రతి రోజూ జరుపుకునే రోజే, ప్రతి రోజూ ఆనందంలో ఉండే రోజు, ప్రతి రోజూ సంతోషమనే ఊయలలో ఊగే రోజు లేక సంతోషంలో నాట్యం చేసే రోజు, అవినాశీ పాటను పాడే రోజు, అందుకే బ్రాహ్మణ జీవితంలో ప్రతి రోజును జరుపుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులకు ప్రతి రోజూ ఉల్లాస-ఉత్సాహాలను పెంచే ఉత్సవము, అందుకే స్మృతిచిహ్న రూపంలో కూడా భారత్‌లో అనేక ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. భారత్‌లో సంవత్సరంలోని అన్ని రోజులు జరుపుకునే రోజులే అన్నది ప్రసిద్ధము. భారత్‌లో ఎన్ని ఉత్సవాలైతే ఉన్నాయో, అన్ని ఇంకెక్కడా ఉండవు. కావున ఇది బ్రాహ్మణులైన మీరు ప్రతి రోజూ ఉత్సవం జరుపుకున్నందుకు స్మృతిచిహ్నము, అందుకే కొత్త సంవత్సరం యొక్క రోజును కూడా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి కేవలం ఒక్క రోజే జరుపుకుంటారా? మొదటి తారీఖు సమాప్తమైతే జరుపుకోవడం కూడా సమాప్తమవుతుందా?
శ్రేష్ఠ ఆత్మలైన మీ కొత్త జన్మ యొక్క అనగా ఈ బ్రాహ్మణ జన్మ యొక్క శ్రేష్ఠ రాశి ఏమిటంటే - ప్రతి రోజూ జరుపుకోవడము, ప్రతి రోజూ ఉత్సవము. ప్రతి రోజూ సదా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా ఉంటుందని మీ జన్మపత్రికలో రాసి ఉంది. బ్రాహ్మణులైన మీ శ్రేష్ఠ రాశియే సదా ఎగిరే కళ. రెండు రోజులు చాలా బాగుండటము, మళ్ళీ రెండు రోజుల తర్వాత కాస్త తేడా ఉండటము, ఇలా ఉండకూడదు. మంగళవారం బాగుంటుంది, గురువారం అంతకన్నా బాగుంటుంది, శుక్రవారం మళ్ళీ విఘ్నం వస్తుంది - మీ రాశి ఇలాంటిదా? ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా మంచిది మరియు ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది! దీనిని బ్రాహ్మణుల ఎగిరే కళ యొక్క రాశి అని అంటాము. బ్రాహ్మణ జీవితం యొక్క రాశి మారిపోయింది ఎందుకంటే కొత్త జన్మ కలిగింది కదా. కనుక ఈ సంవత్సరం ప్రతి రోజూ మీ శ్రేష్ఠ రాశిని చూసి ప్రాక్టికల్లోకి తీసుకురండి.
ప్రపంచం లెక్కలో ఇది కొత్త సంవత్సరం మరియు బ్రాహ్మణులైన మీ లెక్కలో విశేషంగా అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరాన్ని అనగా అవ్యక్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు. కావున ఈ కొత్త సంవత్సరం లేక అవ్యక్త సంవత్సరం యొక్క విశేషమైన స్లోగన్‌గా సదా ఇదే గుర్తుంచుకోండి - సదా సఫలతకు విశేషమైన సాధనం ఏమిటంటే ప్రతి సెకెండును, ప్రతి శ్వాసను, ప్రతి ఖజానాను సఫలం చేసుకోవడము. సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారము. ఏ రకమైన సఫలత కావాలన్నా, సంకల్పాలలోనైనా, మాటలలోనైనా, కర్మలలోనైనా, సంబంధ-సంపర్కంలోనైనా అన్ని రకాల సఫలతను అనుభవం చేయాలనుకుంటే సఫలం చేసుకుంటూ వెళ్ళండి, వ్యర్థంగా పోకూడదు. స్వయం పట్లనైనా సఫలం చేయండి, ఇతర ఆత్మల పట్లనైనా సఫలం చేయండి. అప్పుడు స్వతహాగా సఫలత యొక్క సంతోషాన్ని అనుభూతి చేస్తూ ఉంటారు ఎందుకంటే సఫలం చేయడం అనగా వర్తమానం కోసం సఫలత మరియు భవిష్యత్తు కోసం జమ చేసుకోవడము.
ఈ జీవితంలో ఎంతగా ‘సమయాన్ని’ సఫలం చేసుకుంటారో, సమయం యొక్క సఫలతకు ఫలస్వరూపంగా రాజ్య-భాగ్యం యొక్క పూర్తి సమయమంతా రాజ్యాధికారిగా అవుతారు. ప్రతి శ్వాసను సఫలం చేసుకుంటారు, దీని ఫలస్వరూపంగా అనేక జన్మలు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ నడుస్తూ-నడుస్తూ ఉండగా శ్వాస ఆగిపోదు, హార్ట్ ఫెయిల్ అవ్వదు. ఒకటికి వేల రెట్ల సఫలత యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ విధంగానే అన్ని ఖజానాలను సఫలం చేసుకుంటూ ఉంటారు. అందులోనూ విశేషంగా జ్ఞాన ఖజానాను సఫలం చేసుకుంటారు. జ్ఞానము అనగా వివేకము. దీని ఫలస్వరూపంగా ఎంత వివేకవంతులుగా అవుతారంటే భవిష్యత్తులో అనేక మంత్రుల సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉండదు, స్వయమే వివేకవంతులుగా అయి రాజ్య భాగ్యాన్ని నడిపిస్తారు. రెండవ ఖజానా - సర్వ శక్తుల ఖజానా. శక్తుల ఖజానాను ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో, సఫలం చేసుకుంటారో అంతగా మీ భవిష్య రాజ్యంలో ఏ శక్తి యొక్క లోటూ ఉండదు. సర్వ శక్తులు స్వతహాగానే అఖండంగా, స్థిరంగా, నిర్విఘ్నంగా కార్యం యొక్క సఫలతను అనుభవం చేయిస్తాయి. ఏ శక్తి యొక్క లోటూ ఉండదు. ధర్మ సత్తా మరియు రాజ్య సత్తా రెండూ కలిసి-కలిసి ఉంటాయి. మూడవది - సర్వ గుణాల ఖజానా. దీని ఫలస్వరూపంగా ఎలాంటి గుణమూర్తులుగా అవుతారంటే నేడు చివరి సమయంలో కూడా మీ జడ చిత్రాలకు ‘సర్వగుణ సంపన్న దేవతలు’ అన్న రూపంలో మహిమ జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఖజానా యొక్క సఫలతకు ఫలస్వరూపం ఏమిటో మననం చేయండి. అర్థమయిందా? పరస్పరంలో ఈ విషయంపై ఆత్మిక సంభాషణ చేయండి. కావున ఈ అవ్యక్త సంవత్సరంలో సఫలం చేసుకోండి మరియు సఫలతను అనుభవం చేస్తూ ఉండండి.
ఈ అవ్యక్త సంవత్సరాన్ని విశేషంగా బ్రహ్మా బాబా స్నేహంలో జరుపుకుంటున్నారు. మరి స్నేహానికి గుర్తు ఏమిటంటే - స్నేహీకి ఏది ప్రియమో, స్నేహం చేసేవారికి కూడా అదే ప్రియమనిపించాలి. మరి బ్రహ్మా బాబాకు దేని పట్ల స్నేహముండేది? మురళి పట్ల. అన్నింటికన్నా ఎక్కువ ప్రేమ మురళి పట్ల ఉండేది కదా, అందుకే మురళీధరునిగా అయ్యారు. అందుకే భవిష్యత్తులో కూడా మురళీధరునిగా అయ్యారు. మురళి పట్ల ప్రేమ ఉంది కావున భవిష్య శ్రీకృష్ణుని రూపంలో కూడా ‘మురళి’ని గుర్తుగా చూపిస్తారు. కనుక తండ్రికి దేనిపై ప్రేమ ఉందో, దానిపై ప్రేమ ఉండడము, ఇదే ప్రేమకు గుర్తు. అంతేకానీ బ్రహ్మా బాబాపై మాకు చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అని కేవలం చెప్పేవారిగా అవ్వకూడదు. ప్రేమకు గుర్తు ఏమిటి? బ్రహ్మా బాబాకు దేనిపై ప్రేమ ఉండేదో మరియు ఇప్పుడు కూడా ఉందో, దాని పట్ల ప్రేమ సదా కనిపించాలి. అటువంటివారినే బ్రహ్మా బాబాకు ప్రియమైనవారని అంటాము. లేదంటే నంబరువారుగా ప్రియమైనవారని అంటాము. నంబర్‌వన్ అని అనము, నంబరువారు అని అంటాము. అవ్యక్త సంవత్సరం యొక్క లక్ష్యము ఏమిటంటే - తండ్రిపై ప్రేమకు గల గుర్తులను ప్రాక్టికల్‌లో చూపించాలి. ఇదే జరుపుకోవడము. దీనినే మీరు మరో మాటలో తండ్రి సమానంగా అవ్వడము అని అంటారు.
ఏ కర్మ చేసినా విశేషంగా అండర్లైన్ చేసుకోండి - కర్మ కన్నా ముందు, మాట కన్నా ముందు, సంకల్పం కన్నా ముందు - ఇది బ్రహ్మా బాబా సమానంగా ఉందా, ఇది ప్రేమకు గుర్తుగా ఉందా అని చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆ సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి, మాటను నోటి ద్వారా మాట్లాడండి, కర్మలు కర్మేంద్రియాల ద్వారా చేయండి. మొదట చెక్ చేసుకోండి, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా చేయండి. అంతేకానీ అనుకోలేదు కానీ జరిగిపోయింది అన్నట్లు ఉండకూడదు. అలా కాదు. బ్రహ్మా బాబా యొక్క విశేషమైన విశేషత ఏమిటంటే - ఏది ఆలోచించారో అదే చేసారు, ఏది చెప్పారో అదే చేసారు. కొత్త జ్ఞానము అయిన కారణంగా ఎంతగా అపోజిషన్ ఉన్నా కానీ, తమ స్వమానం యొక్క స్మృతితో, తండ్రి తోడు యొక్క సమర్థతతో మరియు దృఢత, నిశ్చయం అనే శస్త్రాలతో, శక్తితో తమ పొజిషన్ అనే సీటుపై సదా అచలంగా, స్థిరంగా ఉన్నారు. కావున ఎక్కడైతే పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏం చేస్తుంది. అపోజిషన్ అనేది పొజిషన్‌ను దృఢంగా చేస్తుంది. అది కదిలించదు, మరింత దృఢంగా చేస్తుంది. విజయులుగా అయ్యారు అన్నందుకు ప్రాక్టికల్ ఋజువు స్వయంగా మీరే, నలువైపులా జరుగుతున్న సేవ కూడా ఋజువుగా ఉంది. ఎవరైతే మిమ్మల్ని మొదట్లో - వీరు అల్లకల్లోలం చేసేవారు అని అన్నారో, వారే ఇప్పుడు అద్భుతం చేసి చూపించారు అని అంటున్నారు! మరి ఇది ఎలా జరిగింది? అపోజిషన్‌ను శ్రేష్ఠ పొజిషన్ ద్వారా సమాప్తం చేసారు.
కావున ఇప్పుడీ సంవత్సరంలో ఏం చేస్తారు? బ్రహ్మా బాబా నిశ్చయం ఆధారంగా, ఆత్మిక నషా ఆధారంగా నిశ్చితమైన విధి యొక్క జ్ఞానిగా అయి సెకండులో అంతా సఫలం చేసారు, తమ కోసం అంటూ ఏమీ ఉంచుకోలేదు, సఫలం చేసేసారు. దీని ప్రత్యక్ష ఋజువు ఏమి చూసారంటే - చివరి రోజు వరకు తనువు ద్వారా ఉత్తరాల ద్వారా సేవ చేసారు, నోటి ద్వారా మహావాక్యాలు ఉచ్ఛరించారు. చివరి రోజున కూడా సమయాన్ని, సంకల్పాలను మరియు శరీరాన్ని సఫలం చేసారు. కనుక స్నేహానికి గుర్తు - సఫలం చేయడము. సఫలం చేయడమంటే అర్థమే శ్రేష్ఠం వైపు ఉపయోగించడము. కావున ఎప్పుడైతే సఫలత యొక్క లక్ష్యం పెట్టుకుంటారో అప్పుడు వ్యర్థం స్వతహాగానే సమాప్తమవుతుంది. ఏ విధంగానైతే ప్రకాశంతో అంధకారం స్వతహాగా సమాప్తమవుతుంది. ఒకవేళ అంధకారాన్ని తొలగించాలి అని అదే ఆలోచిస్తూ ఉంటే సమయం కూడా వ్యర్థమవుతుంది, శ్రమ కూడా వ్యర్థమవుతుంది. ఇలాంటి శ్రమ చేయకండి. ఈరోజు క్రోధం వచ్చింది. ఈరోజు లోభం వచ్చింది. ఈరోజు వ్యర్థం విన్నాను, మాట్లాడాను, ఈరోజు వ్యర్థంగా గడిచిపోయింది... ఇలా ఆలోచిస్తూ-ఆలోచిస్తూ శ్రమ చేస్తూ నిరాశ చెందుతారు. కానీ ‘‘సఫలం చేయాలి’’ - ఈ లక్ష్యంతో వ్యర్థం స్వతహాగానే సమాప్తమవుతుంది. సఫలం చేసుకోవాలనే లక్ష్యం పెట్టుకోవడమనగా ప్రకాశాన్ని తీసుకురావడము. అప్పుడు అంధకారం స్వతహాగానే సమాప్తమవుతుంది. అవ్యక్త సంవత్సరంలో ఏం చేయాలో అర్థమయిందా? నంబర్‌వన్ ప్రియమైనవారిగా అవుతారా లేక నంబరువారు ప్రియమైనవారిగా అవుతారా అని బాప్‌దాదా కూడా చూస్తారు. అందరూ నంబర్‌వన్‌గా అవుతారా? డబల్ విదేశీయులు ఏమవుతారు? నంబర్‌వన్‌గా అవుతారా? ‘నంబర్‌వన్’ అని అనడం చాలా సులభము! కానీ లక్ష్యము దృఢంగా ఉంటే లక్షణాలు తప్పకుండా వస్తాయి. లక్ష్యము అనేది లక్షణాలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు పరస్పరంలో ప్లాన్ తయారుచేయండి, ఆలోచించండి. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఒకవేళ అందరూ నంబర్‌వన్‌గా అయితే చాలా సంతోషము. ఫస్ట్ డివిజన్ అయితే చాలా పెద్దది, అలా తయారవ్వచ్చు. ఫస్ట్ డివిజన్లో అందరూ ఫస్ట్‌లో ఉంటారు. కనుక కొత్త సంవత్సరంలో అందరూ నంబర్‌వన్‌గా అవ్వబోతున్నందుకు శుభాకాంక్షలు.
వ్యర్థంపై విన్ అయితే (విజయం పొందితే) వన్ లోకి వస్తారు. వ్యర్థంపై విన్ అవ్వకపోతే వన్‌గా అవ్వలేరు. ఇప్పటికీ వ్యర్థం యొక్క ఖాతా ఉంది - కొందరికి సంకల్పాలలో, కొందరికి మాటలలో, కొందరికి సంబంధ-సంపర్కంలో వ్యర్థ ఖాతా ఉంది. ఇప్పుడింకా పూర్తి ఖాతా సమప్తమవ్వలేదు, అందుకే అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కానీ లక్ష్యమనేది మీ గమ్యాన్ని తప్పకుండా ప్రాప్తి చేయిస్తుంది. వ్యర్థానికి స్టాప్ అని చెప్పగానే అది స్టాప్ అవ్వాలి. ఎప్పుడైతే స్టాప్ చేసే శక్తి వస్తుందో, అప్పుడు పాత ఖాతా యొక్క స్టాక్ ఏదైతే ఉందో, అది సమాప్తమవుతుంది. అంతటి శక్తి ఉండాలి. ఇది పరమాత్మ-సిద్ధి. రిద్ధి-సిద్ధి వారు అల్పకాలికమైన చమత్కారాన్ని చూపిస్తారు మరియు పరమాత్మ-సిద్ధి కలవారు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. పరమాత్మ-సిద్ధి ఏం చేయలేదు! ‘స్టాప్’ అని ఆలోచించగానే స్టాప్ అవుతుంది. ఇంతటి శక్తి ఉందా? లేదా స్టాప్ అని అన్న తర్వాత కూడా స్టాప్ అయ్యేందుకు 1-2 రోజులు పడుతుందా, లేక ఒక గంట లేక 10 గంటలు కూడా పడుతుందా? స్టాప్ అంటే స్టాప్, అంతే. ఈ గుర్తును బాబాకు చూపించాలి. అర్థమయిందా?
సేవ యొక్క సఫలత లేక ప్రత్యక్షత అయితే డ్రామానుసారంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా. ఇంతకుముందు మీరు ఆహ్వానించేవారు, ఇప్పుడు వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. కనుక సేవా సఫలత యొక్క ప్రత్యక్షత జరుగుతుంది కదా. మీకు ఎటువంటి స్టేజీ లేక డిగ్రీ లభించాల్సిన అవసరం లేదు, ఇది సేవ యొక్క ప్రత్యక్షత. భగవంతుడు ఇచ్చే డిగ్రీ ముందు ఈ డిగ్రీ ఏపాటిది. (ఉదయపూర్ విశ్వవిద్యాలయం వారు దాదీజీకి గౌరవనీయ డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారు). ఇది కూడా ప్రత్యక్షతకు సాధనము. సాధనము ద్వారా సేవ యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంది. అంతా రెడీగా ఉన్న స్టేజీ లభించేదే ఉంది. ధర్మ నేతలు మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్నే ముఖ్య అతిథిగా చేసే రోజు కూడా వచ్చేదే ఉంది. ఇప్పుడు కొద్దిగా బాహ్య రూపురేఖల కోసం వారు ముఖ్య అతిథిగా ఉండాల్సి వస్తుంది, కానీ లోపల వారు అనుభూతి చేస్తారు - ఈ పవిత్ర ఆత్మలకు సీటు లభించాలి అని. రాజకీయ నేతలైతే ఇలా అంటారు కూడా - మీరు మమ్మల్ని ముఖ్య అతిథిగా చేస్తున్నారు కానీ మీరే ముఖ్య అతిథిగా అయితే చాలా బాగుంటుంది అని. కానీ డ్రామాలో పేరు వచ్చేది వారికి, పని జరిగేది మీది.
ఎలాగైతే సేవలో ప్రత్యక్షత జరుగుతూ ఉందో, విధి మారుతూ ఉందో, అలా ప్రతి ఒక్కరూ స్వయంలో సంపూర్ణతను మరియు సంపన్నతను ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు దీని అవసరం ఉంది మరియు తప్పకుండా సంపన్నమయ్యేదే ఉంది. కల్ప-కల్పము సఫలత అయ్యే ఉంది అని మీ గుర్తు ఋజువు చేస్తుంది. ఈ విజయ మాల ఏమిటి? విజయులుగా అయ్యారు, సఫలతా మూర్తులుగా అయ్యారు, అందుకే ఈ గుర్తు ఉంది కదా! ఈ విధిని తప్పించలేరు. ఇప్పుడింకా అంతగా తయారవ్వలేదు, ఇప్పుడింకా ఘర్షణ జరుగుతూ ఉంది అని ఎవరెంతగా అనుకున్నా కానీ, ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. కల్ప-కల్పపు సఫలత యొక్క గ్యారంటీ ఈ స్మృతి చిహ్నము. ‘ఏమవుతుంది’, ‘ఎలా అవుతుంది’ అనే ప్రశ్నార్థకాల అవసరం కూడా లేదు. అవ్వాల్సిందే. ఇది నిశ్చితమై ఉంది కదా. నిశ్చితమైన విధిని ఎవ్వరూ కదిలించలేరు. ఒకవేళ నావ మరియు నావికుడు దృఢంగా ఉంటే ఎలాంటి తుఫాను అయినా ముందుకు తీసుకువెళ్ళేందుకు సాధనంగా అవుతుంది. తుఫాను కూడా కానుకగా అవుతుంది, అందుకే మధ్యమధ్యలో ఇలాంటి ఉపకథలు జరుగుతూ ఉంటాయి. కానీ ఖచ్చితమైన విధి నిశ్చితమై ఉంది. ఇంతటి నిశ్చయముందా? లేదా ఎప్పుడైనా కొద్దిగా కింద-మీద అవ్వడం చూస్తే ‘ఎలా అవుతుందో, ఎప్పుడవుతుందో తెలియదు’ అని భయపడతారా? ప్రశ్నార్థకం వస్తుందా? ఈ తుఫానే కానుకగా అవుతుంది. అర్థమయిందా? ఇటువంటి వారిని నిశ్చయబుద్ధి విజయీ అని అంటాము. కేవలం ఫాలో ఫాదర్ చేయండి. అచ్ఛా!
స్థిరమైన నిశ్చయబుద్ధి కల విజయీ ఆత్మలందరికీ, సదా ప్రతి ఖజానాను సఫలం చేసుకునే సఫలతామూర్త ఆత్మలకు, సదా ప్రతి అడుగులో బ్రహ్మా బాబాను సహజంగా ఫాలో చేసేవారికి, సదా కొత్త జీవితము మరియు కొత్త యుగము యొక్క స్మృతిలో ఉండే సమర్థ ఆత్మలకు, సదా స్వయంలో తండ్రి స్నేహం యొక్క గుర్తులను ప్రత్యక్షం చేసే విశేష ఆత్మలకు, శ్రేష్ఠ పరివర్తన మరియు అవ్యక్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము: - డ్రామా దృశ్యాన్ని చూసి హర్షిస్తున్నారు కదా. ‘‘వాహ్ డ్రామా వాహ్! వాహ్ బాబా వాహ్!...’’ ఈ పాటయే అనాదిగా, అవినాశీగా నడుస్తూ ఉంటుంది. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు మరియు తండ్రి శక్తి సైన్యాన్ని ప్రత్యక్షం చేస్తారు. మంచి సేవ జరిగింది. కొత్త రూపురేఖలు రావాల్సిందే. ఇలాగే అందరి నోటి నుండి ‘‘బాబా- బాబా’’ అన్న మాట వెలువడుతూ ఉండాలి ఎందుకంటే వారు విశ్వపిత. కనుక బ్రాహ్మణాత్మల హృదయం నుండి, నోటి నుండి అయితే ‘బాబా’ అని వెలువడుతూనే ఉంటుంది, కానీ సర్వాత్మల హృదయం నుండి మరియు నోటి నుండి ‘‘బాబా’’ అని వెలువడాలి, అప్పుడే సమాప్తి జరుగుతుంది కదా. ‘‘ఓహో ప్రభూ’’ అన్న రూపంలో వెలువడినా లేక ‘‘వాహ్ బాబా’’ అన్న రూపంలో వెలువడినా కానీ ‘బాబా’ అనే పదం యొక్క పరిచయమైతే లభించాల్సిందే. ఒక మైక్ ఎంత సేవ చేయగలరు అన్న సేవా సాధనాన్ని ఇప్పుడు అనుభవం చేసారు. సందేశమిచ్చే కార్యమైతే తప్పకుండా జరుగుతుంది కదా. కావున ఇప్పుడు మైక్‌లను తయారుచేయాలి. వీరు (రాజస్థాన్ గవర్నర్ డాక్టర్.ఎమ్.చెన్నారెడ్డి) ఒక శ్యాంపుల్ వంటి వారు. మైక్‌ను తయారు చేయడంలోనైతే భారత్ నంబరును తీసుకుంది. ఇప్పుడు ఇలాంటివారిని తయారుచేయాలి! రాజస్థాన్ యొక్క మైక్‌ను ఆబూ తయారుచేసింది, రాజస్థాన్ కాదు. బాణమైతే ఆబూ నుండి తగిలింది కదా. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1 :- మహావీరుడు అనగా స్వప్నంలో కూడా దుఃఖపు అల రానివారు
అందరూ తమను తాము మహావీరులుగా అనుభవం చేసుకుంటున్నారా? మహావీరుడు అనగా మాస్టర్ సర్వశక్తిమాన్. ఎవరైతే మహావీర ఆత్మయో వారికి సర్వ శక్తులు సదా సహయోగిగా ఉంటాయి. ఏదో ఒక శక్తి సహయోగిగా ఉండి, ఇంకొక శక్తి సమయానికి మోసం చేసేదిగా ఉండకూడదు! ప్రతి శక్తీ ఆర్డర్‌పై నడిచేదిగా ఉండాలి. ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది సహయోగిగా అవుతుందా లేక టైమ్ దాటిపోయాక శక్తి పనిచేస్తుందా? ఆర్డర్ ఇవ్వడం, జరిగిపోవడం. చేయకుండా ఉండాల్సింది కానీ చేసేశాను, మాట్లాడకుండా ఉండాల్సింది కానీ మాట్లాడేశాను అని ఆలోచించాల్సిన లేదా అనాల్సిన అవసరం రాకూడదు. దీనిని బట్టి సమయానికి శక్తి సహయోగిగా అవ్వడం లేదు అని రుజువవుతుంది. వినకూడనిది కానీ వినేశాను అంటే చెవులు అనే కర్మేంద్రియం మీ వశంలో లేనట్లే కదా! వినాలని లేకపోయినా వినేశారు అంటే చెవులు మోసం చేశాయి. తమ కర్మేంద్రియాలే సమయానికి మోసం చేస్తే ఇక వారిని రాజు అని ఎలా అంటాము!
రాజయోగి అనగానే ప్రతి కర్మేంద్రియమూ ఆర్డర్‌పై నడవాలి. ఏది కావాలంటే, ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే సర్వ కర్మేంద్రియాలూ అలాగే చేయాలి. సమయం అలాంటిది, పరిస్థితులు అలాంటివి, సమస్య అలాంటిది అని మహావీరుడు ఎన్నడూ సాకులు చెప్పలేరు. కాదు. రావడం సమస్య పని, సమస్యను పరిష్కరించడం మహావీరుని పని తప్ప ఓటమి పాలు కావడం కాదు. కాబట్టి పరీక్ష సమయంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. పరీక్షే రాలేదు కదా, నేను బాగున్నాను అని ఇలా కాదు! పరీక్ష టైమ్‌లోనే కదా పాస్ కావాల్సి ఉంటుంది! లేక అసలు పేపరే రాకుండా నేను పాస్ అయిపోయాను అంటారా? కాబట్టి సదా నిర్భయంగా ఉంటూ విజయిగా అవ్వండి. చెప్పడం కాదు, చేసి చూపించాలి! చిన్నచిన్న విషయాలలో బలహీనపడకూడదు. ఎవరైతే మహావీర విజయి ఆత్మగా ఉంటారో వారు సదా ప్రతి అడుగులోనూ తనువుతో, మనసుతో సంతోషంగా ఉంటారు. ఉదాసీనంగా ఉండరు, చింతలోకి రారు. సదా సంతోషంగా మరియు నిశ్చింతగా ఉంటారు. మహావీర ఆత్మ వద్దకు దుఃఖపు అల స్వప్నంలో కూడా రాలేదు. ఎందుకంటే సుఖ సాగరుని పిల్లలుగా అయ్యారు. మరి ఎక్కడ సుఖ సాగరుడు, ఎక్కడ దుఃఖపు అల! స్వప్నాలు కూడా పరివర్తన చెందుతాయి. కొత్త జన్మ లభించాక స్వప్నాలు కూడా కొత్తవే వస్తాయి కదా! సంకల్పాలూ కొత్తవే, జీవితమూ కొత్తదే.
తండ్రివారిగా అయినప్పుడు తండ్రి ఎలాగో పిల్లలు అలాగే ఉంటారు. తండ్రి సాగరుడై ఉండి పిల్లలు ఖాళీగా ఉండటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? సాగరుడు అనగా సదా నిండుగా ఉండేవారు. సాగరుని పిల్లలై సుఖం లేకుండా ఖాళీగా అయిపోతే ఎవరు నమ్ముతారు! సాగరుడు ఎన్నడూ ఎండిపోలేడు. ఎంతగా ఎండగట్టినా సాగరుడు సమాప్తమైపోగలడా? కాబట్టి సదా తండ్రి విశేషతలను గుర్తుంచుకోండి - తండ్రి ఏమిటి, నేను ఏమిటి? మనసులో కూడా ఎన్నడూ ఏడుపు రాకూడదు. దుఃఖానికి గుర్తు ఏడవడం మరియు సంతోషానికి గుర్తు నాట్యం చేయడం, పాటలు పాడటం. మనసులో కూడా ఏడుపు వస్తే దుఃఖపు అల ఉన్నట్లే అని అర్థం చేసుకోండి. సుఖ సాగరుని పిల్లలైనప్పుడు ఇక దుఃఖం ఎక్కడి నుండి వచ్చింది? అవుతుందిలే, అంతిమంలో సరిదిద్దుకుంటాములే అని ఇలాంటి అలసత్వంతో ఉండకూడదు. కాదు. మోసపోతారు. కాబట్టి సదా సుఖపు ఊయలలో ఊగుతూ ఉండండి. వీరినే మహావీరుడు అంటారు.
గ్రూప్ నం. 2 :- ఫరిశ్తాగా అవ్వడం అనగా కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి ముక్తులు కావడం
అందరూ తమను తాము డబల్ లైట్ అనగా ఫరిశ్తాగా భావిస్తున్నారా? ఫరిశ్తా యొక్క విశేష గుర్తు ఏమిటంటే - ఫరిశ్తా అనగా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండేవారు, పాత ప్రపంచంతో మరియు పాత దేహంతో మోహపు సంబంధం ఉండదు. దేహంతో ఆత్మకు సంబంధం అయితే ఉంది, కానీ మోహపు సంబంధం కాదు. ఒకటి ‘సంబంధం’ మరియు రెండవది ‘బంధనం’. ఒకటి కర్మ-బంధనము మరియు రెండవది కర్మ-సంబంధము. సంబంధం అయితే ఎలాగూ ఉండాల్సిందే. కర్మేంద్రియాలు ఉన్నంతవరకు కర్మ సంబంధం అయితే ఉంటుంది కానీ బంధనం ఉండకూడదు. బంధనానికి గుర్తు ఏమిటంటే - ఎవరి బంధనంలో ఉంటారో వారి వశమై ఉంటారు. సంబంధంలో ఉండేవారు స్వతంత్రంగా ఉంటారు, వశం కారు. కర్మేంద్రియాలతో కర్మ సంబంధంలోకి రావడం వేరే విషయం, కానీ కర్మ బంధనంలోకి రాకూడదు. ఫరిశ్తా అనగా కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనం నుండి ముక్తులుగా ఉండేవారు. ఈరోజు కన్ను ఇది చేయాల్సిందే, చూడాల్సిందే అంటే దానికి వశమైపోయి చూసేశాము అని ఇలా ఉండకూడదు. జైలు బంధనంలో ఉన్న ఖైదీని జైలర్ ఎలా కావాలంటే అలా కూర్చోబెడతాడు, నడిపిస్తాడు, తినిపిస్తాడు. మరి బంధనంలో ఉన్నట్లే కదా! నేను జైలు నుండి వెళ్ళిపోతాను అంటే వెళ్ళగలడా? బంధనం ఉంది కదా. అలాగే పాత శరీరపు బంధనం ఉండకూడదు, కేవలం సేవార్థమై సంబంధం ఉండాలి. అలాంటి అవస్థ ఉందా? లేక అప్పుడప్పుడు బంధనము, అప్పుడప్పుడు సంబంధమా? బంధనం మాటిమాటికి కిందకు తీసుకువస్తుంది. కాబట్టి ఫరిశ్తా అనగా బంధనముక్తులు. ప్రయత్నిస్తాము అని అనకూడదు. ‘ప్రయత్నం’ అనే పదమే పాత ప్రపంచపు ఆకర్షణ ఉంది అని రుజువు చేస్తుంది. ‘ప్రయత్నం’ అనే పదం ఉండకూడదు. చేయాల్సిందే, జరగాల్సిందే – ఇది ఎగురవేస్తుంది, చూద్దాములే, చేస్తాములే – లే, లే... కిందకు తెస్తుంది. కాబట్టి ‘ప్రయత్నం’ అనే పదాన్ని సమాప్తం చేయండి. ఫరిశ్తా అనగా జీవన్ముక్తులు, జీవన-బంధీలు కారు. దేహ బంధనము లేదు, దేహ సంబంధాల బంధనము లేదు, దేహ పదార్థాల బంధనమూ లేదు. ఇలా జీవన్ముక్తులుగా ఉన్నారా? అవ్యక్త సంవత్సరం అనగానే ఫరిశ్తా స్థితిలో స్థితులై ఉండడమే.
ఏ మోహము కిందకు తీసుకువస్తుందో చెక్ చేసుకోండి? తమ దేహ మోహాన్ని సమాప్తం చేస్తే సంబంధాల మరియు పదార్థాల మోహాలు వాటంతట అవే సమాప్తమైపోతాయి. తమ దేహ మోహమే ఉంటే సంబంధాలు మరియు పదార్థాల మోహము కూడా తప్పక లాగుతుంది. అందుకే దేహాభిమానాన్ని వదలండి, మీరు దేహం కాదు ఆత్మ అని మొదటి పాఠం నేర్పిస్తారు. మరి ఈ పాఠాన్ని మొదట మీకు మీరు నేర్చుకున్నారా? దేహాభిమానాన్ని వదిలేందుకు అత్యంత సహజమైన ఉపాయం ఏమిటి? సరే, ఆత్మ బిందువు గుర్తురావట్లేదు, జారిపోతుంది అనుకోండి. కానీ తనువు నీదే, మనస్సు నీదే, ధనము నీదే... అనే ప్రతిజ్ఞ అయితే ఉంది కదా. దేహమే నాది కానప్పుడు ఇక మోహము ఎవరితో? నాది అనేది లేనప్పుడు ఇక మమకారం ఎక్కడి నుండి వస్తుంది? నాది అన్నదానిలోనే మమకారం ఉంటుంది! నేను సమర్పించేసినప్పుడు మోహము సమాప్తమైపోయింది. ఈ ఒక్క విషయం ద్వారానే సర్వ మోహాలూ సహజంగా సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఈ దేహం సేవ కొరకు బాబా యొక్క అమానతు. కాబట్టి సదా ఫరిశ్తాగా అవ్వడానికి ముందుగా - ఇది సేవార్థమై ఉంది, అమానతు, నేను ట్రస్టీని అనే ఈ ప్రాక్టికల్ అభ్యాసం చేయండి. ట్రస్టీయే ట్రస్ట్ వస్తువుపై విశ్వాసం ఉంచకపోతే ఏమంటారు? ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. అప్పుడు చూడండి, ఫరిశ్తాగా అవ్వడం ఎంత సహజంగా అనిపిస్తుందో! ‘నా ఒక్క బాబా’; మరియు నాదైన సర్వస్వమూ ఈ ‘ఒక్క నా బాబా’లోనే ఇమిడిపోయింది. అందరూ సర్దుకోవడం మరియు ఇమడ్చడంలో నిపుణులే కదా! ఆ నాది-నాది అనేది చిక్కుల్లో పడేసేది మరియు ఈ ఒక్క నా బాబా అనేది విడిపించేది. ‘ఒక్క నా బాబా’ అనగానే సర్వస్వం వీడిపోతుంది. అచ్ఛా!
ఢిల్లీ నివాసులు ఎలాంటి మైక్‌ను సిద్ధం చేశారు? ఢిల్లీలో మైక్లైతే చాలామంది ఉన్నారు కదా! ఢిల్లీలో ఉన్నంతమంది మైక్‌లు ఇంకెక్కడా లేరు. ఆబూ వారు మైక్‌ను సిద్ధం చేసి చూపించారు. కానీ ఢిల్లీ వారు ఇంకా చేయలేదు. కాబట్టి హెడ్ క్వార్టర్స్‌ను ఫాలో చేయండి. మైక్ ద్వారా జరిగే సేవకు మరియు మీరు చేసే సేవకు ఎంత తేడా ఉంది! మీ పరిచయం మీరే స్వయంగా ఇచ్చుకోవడానికి మరియు ఇతరులు మీ పరిచయం ఇవ్వడానికి - ఎవరి ప్రభావం ఎక్కువగా పడుతుంది? కాబట్టి మీ పరిచయం ఇవ్వడమే మైక్ పని! దీని ప్రభావం అయితే పడుతుంది కదా. నమ్మినా, నమ్మకపోయినా ఏదో విషయం ఉంది అని అయితే అర్థం చేసుకుంటారు కదా... మొదట ఈ బాణం నాటుకుంటుంది, ఆ తర్వాత కొద్దిగా నుండి సర్వస్వం అవుతుంది. కాబట్టి మొదట బాణం వేయండి. మైక్‌ను సిద్ధం చేయండి. ఎందుకంటే ఢిల్లీ నుండి బయలుదేరే మైక్ యొక్క శబ్దము మరింత ఉచ్ఛస్థాయిలో ఉంటుంది. ఢిల్లీ మైక్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది, అది ప్రపంచంలో శబ్దాన్ని వ్యాపింపజేయగలదు. ఈ సంవత్సరమే సిద్ధం చేస్తారా లేక వచ్చే సంవత్సరమా? ఢిల్లీ ధరణి దేవాత్మలను ఆహ్వానిస్తోంది. ఢిల్లీ ధరణిలోకే దేవాత్మలు వస్తారు. కాబట్టి ఢిల్లీ వారు సేవ కూడా అలాగే చేయాలి. మంచిది! ధైర్యము ఉంచేవారికి సహాయం లభిస్తుంది.
గ్రూప్ నం. 3 :- విశ్వరాజ్యపు సింహాసనాధికారిగా అవ్వడానికి ఆధారము - అకాలసింహాసనాధికారిగా అవ్వడమే
తమను తాము సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఆత్మ సదా ఏ సింహాసనంపై విరాజిల్లి ఉంటుందో తెలుసా? దీనిని ఏ సింహాసనము అంటారు? అకాలము కదా. ఆత్మ అకాలమైనది, అందుకే దాని సింహాసనం పేరు కూడా అకాలసింహాసనము. శరీరంలో ఆత్మ సదా భృకుటి మధ్యలో అకాలసింహాసనాధికారిగా ఉంది. సింహాసనాధికారిగా ఉండేవారిని రాజు అంటారు. సింహాసనంపై రాజుయే కదా కూర్చునేది. కాబట్టి ఆత్మలైన మీరు కూడా అకాలసింహాసనాధికారి అయిన రాజు. మరియు అకాలసింహాసనాధికారి ఆత్మలు బాబా హృదయ సింహాసనాన్ని మరియు విశ్వరాజ్యపు సింహాసనాన్ని కూడా పొందుతారు. మరి మూడు సింహాసనాలూ స్థిరంగా ఉన్నాయా? సింహాసనంపై కూర్చోవడం వచ్చా? లేక ఘడియ ఘడియకూ కిందకు దిగిపోతున్నారా? మొదట ఎవరైతే అకాలసింహాసనాధికారులు కాగలరో వారే బాబా హృదయ సింహాసనాధికారులు కాగలరు మరియు ఎవరైతే హృదయ సింహాసనాధికారులో వారే విశ్వరాజ్యపు సింహాసనాధికారులు కాగలరు. కాబట్టి మొదటి ఆధారం - అకాలసింహాసనము. స్వరాజ్యం ఉంటేనే విశ్వరాజ్యం ఉంటుంది. స్వరాజ్యం చేయడం రానివారు విశ్వరాజ్యం చేయలేరు. స్వరాజ్యపు సింహాసనం ఈ భృకుటి-అకాలసింహాసనము. తండ్రి మరియు పిల్లల సంబంధపు సింహాసనం తండ్రి హృదయ సింహాసనము. ఈ రెండు సింహాసనాల ఆధారంగా విశ్వరాజ్యపు సింహాసనము లభిస్తుంది. కాబట్టి మొదటి పునాది ఏమి అయింది? అకాలసింహాసనము.
అకాలసింహాసనాధికారి ఆత్మ సదా నషాలో ఉంటుంది. సింహాసనం యొక్క నషా అయితే ఉంటుంది కదా. కానీ ఇది ఆత్మిక నషా. స్వల్పకాలపు నషా కాదు, నష్టం కలిగించే నషా కాదు. ఈ ఆత్మిక నషా హద్దు నషాలను సమాప్తం చేస్తుంది. హద్దు నషాలు అనేక రకాలు, కానీ ఆత్మిక నషా ఒక్కటే. నేను బాబావారిని, బాబా నావారు అనేది ఆత్మిక నషా. బాబావారిగా అయిపోయాము అనేది ఆత్మిక నషా. మరి ఈ ఆత్మిక నషా సదా ఉంటుందా? లేక ఎక్కుతూ దిగుతూ ఉంటుందా - అప్పుడప్పుడు ఎక్కువగా ఎక్కడం, అప్పుడప్పుడు తక్కువగా ఎక్కడం జరుగుతుందా? ఎవరైనా రాజుగా అయి ఉండి, సింహాసనమూ ఉండి, కానీ సింహాసనపు, రాజరికపు నషాయే లేకపోతే ఆ రాజు నషా లేకుండా రాజ్యాన్ని నడపగలడా? ఆత్మ ఆత్మిక నషాలో లేకపోతే స్వరాజ్యాన్ని ఎలా నడపగలదు? రాజ్యంలో అలజడి జరుగుతుంది. చూడండి, ప్రజా రాజ్యం ఉంటే అలజడి ఉంటుంది కదా. ఆత్మ స్వరాజ్యపు నషాలో లేకపోతే కర్మేంద్రియాలనే ప్రజల రాజ్యమైపోతుంది. కర్మేంద్రియాలే రాజ్యం చేస్తాయి. అప్పుడు ప్రజా రాజ్యం అయినట్లే కదా. దాని ఫలితం అలజడి అవుతుంది. కాబట్టి సదా సింహాసనాధికారి ఆత్మ యొక్క ఆత్మిక నషాను ఉంచుకోండి. ఇంత శ్రేష్ఠమైన తండ్రి హృదయ సింహాసనం పూర్తి కల్పంలో లభించదు. విశ్వరాజ్య సింహాసనం అనేక జన్మలు లభిస్తుంది, కానీ తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అయ్యేది ఇప్పుడు మాత్రమే. కాబట్టి దాని ప్రయోజనాన్ని పొందాలి కదా.
తండ్రి హృదయ సింహాసనాధికారుల ఎదుటకు ఏ విఘ్నమూ, ఏ సమస్యా రాలేదు. ప్రకృతి దాడి చేయలేదు, మాయ కూడా దాడి చేయలేదు. హృదయ సింహాసనాధికారిగా అవ్వడం అనగా సహజంగా ప్రకృతిజీత్, మాయాజీత్గా అవ్వడమే. మరి ఇలా ప్రకృతిజీత్, మాయాజీత్గా అయ్యారా? ప్రకృతి కూడా అలజడిలోకి తెస్తుంది కదా. ప్రకృతి యొక్క అలజడి బ్రాహ్మణ ఆత్మలను కదిలించేస్తుందా? మరి అలజడి జరగకూడదు కదా. సింహాసనాధికారిగా లేకపోతేనే అలజడిలోకి వస్తారు. సింహాసనాధికారిగా ఉంటే అలజడిలోకి తెచ్చే ధైర్యము ఎవరికీ ఉండదు. మరి అలజడిలోకి రావడం బాగుంటుందా? బాగుండదు కానీ జరిగిపోతుంది. అంటే పరవశులైపోయినట్లే కదా. బంధించబడటం ఎవరికీ నచ్చదు, కానీ పరవశమైనప్పుడు బంధీ అయిపోతారు. మరి పరవశ ఆత్మలా లేక స్వతంత్ర ఆత్మలా? ఎప్పుడు ముక్తులు అవుతారు? జీవన్ముక్తి యొక్క మజా ఇప్పుడే ఉంది. భవిష్యత్తులో జీవన్ముక్తులు మరియు జీవన-బంధీల కాంట్రాస్ట్ ఉండదు. కానీ ఈ సమయంలో జీవన-బంధీ అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటో అర్థం చేసుకుంటున్నారు కదా. ఈ సమయపు జీవన్ముక్తి అనుభవం ఎంతో శ్రేష్ఠమైనది. జీవితంలో ఉన్నారు కానీ ముక్తులుగా ఉన్నారు, బంధనంలో లేరు. ముక్తి మరియు జీవన్ముక్తి మా జన్మ సిద్ధ అధికారము అనేది మీ స్లోగన్. మరి అధికారాన్ని పొందారా? లేదా పరమధామానికి వెళ్ళినప్పుడు పొందుతారా? అక్కడైతే ముక్తి ఏమిటో, జీవన్ముక్తి ఏమిటో తెలియనే తెలియదు. దీని అనుభవం ఇప్పుడే కలుగుతుంది. అనుభవజ్ఞులే కదా. అందరూ జీవన్ముక్తి అనుభవాన్ని చేశారా లేక సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు చేస్తారా? బ్రాహ్మణ జీవితంలో జీవన్ముక్తి అనుభవం సాధ్యమేనా? (సాధ్యమే) మరి జరుగుతుందా?
బాప్‌దాదా మునుపే వినిపించారు - మీ రచన అయిన కమల పుష్పానికే అతీతంగా ఉండే విశేషత ఉన్నప్పుడు, నీటిలో ఉంటూ నీటి బంధనం నుండి ముక్తంగా ఉన్నప్పుడు, మనుష్యాత్మ రచయిత, అది రచన. మరి రచనలోనే ఈ విశేషత ఉన్నప్పుడు మాస్టర్ రచయితలో ఉండదా? ఉంది కదా. ఎప్పుడైనా బంధనముక్తులకు బదులుగా బంధనయుక్తులుగా అయితే, బంధనంలో చిక్కుకుపోతే మీ ఎదుట కమల పుష్ప దృష్టాంతాన్ని ఉంచుకోండి - కమల పుష్పమే అతీతంగా మరియు ప్రియంగా మారగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తిమాన్ కాలేరా! కాబట్టి సదా తయారైపోతారు. కొద్దిసేపు అవ్వడం, కొద్దిసేపు కాకపోవడంలో మజా లేదు కదా. అప్పుడప్పుడు బంధనము, అప్పుడప్పుడు బంధనముక్తులుగా ఉండటం బాగుంటుందా? నచ్చని వస్తువును వదిలేస్తారు. లేదా కొద్దికొద్దిగా ఉంచుకుంటారా? మరి జీవన్ముక్తులుగా అయ్యే విధి ఏమిటి? అతీతంగా మరియు ప్రియంగా అయ్యే విధి ఏమిటి? సింహాసనాధికారిగా అవ్వండి. సదా సింహాసనాధికారి ఆత్మగా అయి జీవన్ముక్తి అనుభవాన్ని చేసుకుంటూ ఉండండి. ఈ జీవన్ముక్తి స్థితి చాలా ప్రియమైనది.
అందరూ సదా రాజీగా (సంతృప్తిగా) ఉండేవారేనా? ప్రతి విషయంలోనూ రాజీ - ఎవరైనా దూషించినా రాజీయే, ఎవరైనా అవమానించినా రాజీయే! లేక ఆ సమయంలో ఖాజీ (తీర్పరి)గా మారిపోతారా? సదా సంతోషంగా ఉండేవారు, సదా రాజీగా ఉండేవారు సమీపంగానూ అవుతారు మరియు సమానంగానూ అవుతారు. రాజీగా ఉండటం అనగా సర్వ రహస్యాలను తెలుసుకోవడం. నారాజ్ (అసంతృప్తి) అనగా రహస్యం తెలియకపోవడం వల్ల అసంతృప్తిగా ఉంటారు. మీరైతే సర్వ రహస్యాలనూ తెలుసుకున్నారు కదా. మరి రహస్యాలు తెలిసినవారు రాజీగానే ఉంటారు కదా. రహస్యం తెలియనివారే అసంతృప్తి చెందుతారు. మీరైతే త్రికాలదర్శి, నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారు కదా. మరి సర్వ రహస్యాలు తెలిసిన సదా రాజీగా ఉండేవారా లేక ప్రవృత్తిలో కాస్త చికాకు ఎదురైతే నారాజ్ అయిపోతారా? సదా రాజీగా ఉంటున్నారా? మేము ఉండకపోతే ఇంకెవరు ఉంటారు అని దృఢ నిశ్చయంతో (ఫలక్) చెప్పండి! భగవంతుడైన తండ్రివారిగా అయ్యాక ఇప్పుడు రాజీగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటాము అనే స్మృతిని సదా ఉంచుకోండి? ఇప్పుడే కదా అవ్వాల్సింది. అందుకే ఖుష్-రాజీ (సంతోషంగా-సంతృప్తిగా) అని అంటారు. సంతోషంగా ఉండేవారు రాజీగా ఉంటారు, రాజీగా ఉండేవారు సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు క్షేమ సమాచారాలు (ఖుష్-రాజీనా అని) అడుగుతారు కదా? కాబట్టి సదా రహస్యాలను తెలుసుకున్నవారు అనగా సదా సంతోషంగా ఉండే ఖుష్-రాజీలు. ఇక్కడేమో ‘అవును’ అని, అక్కడికి వెళ్ళాక ‘ఏం చేస్తాం?’ అని అనకూడదు.
గ్రూప్ నం. 4 :- విశేషతలు తండ్రి ఇచ్చిన కానుక, అందువలన ఎన్నడూ నాది అనే భావం రాకూడదు
బాబా ద్వారా లభించిన సర్వ ఖజానాల తాళంచెవి ఏమిటి? ఏ తాళంచెవి పెట్టడం వల్ల అనుభవమవుతుంది? ‘నా బాబా’ అనేదే తాళంచెవి. ‘నా’ మరియు ‘బాబా’. మరి నావారు అయినప్పుడు తండ్రిది ఏదైతే ఉందో అది మీది అయిపోయింది మరియు ‘బాబా’ అనగానే ఆస్తికి అధికారులుగా అయ్యారు. ఖజానాలు సర్వ ఆత్మలకూ ప్రాప్తించాయి, కానీ ‘నా బాబా’ అని హృదయపూర్వకంగా స్మృతిలో ఉన్నప్పుడే ఖజానాల అనుభవాన్ని చేసుకోగలరు. తండ్రి అనగానే ఆస్తి గుర్తుకొస్తుంది.
యజమానితో పాటు బాలకులు కూడా మరియు బాలకులతో పాటు యజమానులు కూడా. బాలకులుగా అవ్వడం వల్ల సదా నిశ్చింతగా, సదా డబల్ లైట్‌గా ఉంటారు మరియు యజమానిగా అనుభవం చేసుకోవడం వల్ల యజమానితనం యొక్క ఆత్మిక నషా ఉంటుంది. కాబట్టి బాలకతనపు అనుభవమూ ఆవశ్యకమే మరియు యజమానితనపు అనుభవమూ ఆవశ్యకమే. ఇప్పుడే యజమాని, ఇప్పుడే బాలకుడు అనే ఈ రెండు విధులూ వచ్చా? సంబంధ-బాంధవ్యాలలోకి రావడం వల్ల ఎన్నో సందర్భాలు వస్తాయి, వాటిలో ఎక్కడో ఒకచోట యజమానిగా అవ్వాల్సి వస్తుంది, ఇంకెక్కడో బాలకులుగా అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ బాలకులుగా అవ్వాల్సిన సమయంలో యజమానిగా అయితే అలజడి జరుగుతుంది మరియు యజమానిగా కావాల్సిన సమయంలో బాలకులుగా అయినా అలజడి జరుగుతుంది. సమయానికి తగిన స్వరూపం. ఏ కార్యం చేసినా యజమానిగా అయి చేస్తారు, కానీ పెద్దలు ఈ పని ఇలా కాదు, ఇలా జరగాలి అని ఫైనల్ చేసినప్పుడు ఆ సమయంలో తిరిగి బాలకులుగా అయిపోతారు. సలహా ఇచ్చే సమయంలో యజమాని మరియు మెజారిటీ ఫైనల్ చేసినప్పుడు ఆ సమయంలో బాలకుడు; ఆ సమయంలో నేను ఆలోచించిందే కరెక్ట్ అనే యజమానితనపు నషా ఉండకూడదు. ఇప్పుడే యజమాని, ఇప్పుడే బాలకుడు. సమయానికి తగిన స్వరూపంలో స్థితులై ఉండే ఈ విధి వచ్చా? వీరిని ఆల్‌రౌండ్ పాత్రను అభినయించేవారు అంటాము. రాయ్-బహదూర్ (మంచి సలహాలు ఇచ్చేవారు)గానూ అవుతారు మరియు ‘హా జీ’ (శిరసావహించేవారు)గానూ ఉంటారు. మరి ఇలా చేయడం వచ్చా? ఎందుకంటే ఈ ఈశ్వరీయ మార్గంలో నా బుద్ధి యొక్క ప్లాన్ చాలా బాగుంది, నా సలహా చాలా బాగుంది, నా సలహాను ఎందుకు అంగీకరించలేదు అని ఎవరూ అనలేరు. ‘నాదా’? నా బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది, నా బుద్ధికి గౌరవం ఇవ్వలేదు అని అంటారా. మరి ‘నాదా’? ఏ విశేషత ఉన్నా అది ‘నాదా’ లేక ‘తండ్రి’ ఇచ్చిన కానుకా? తండ్రి ఇచ్చిన కానుకలో నాది అనే భావం రాలేదు. అందువలన సదా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. కాబట్టి ఇది కూడా బాలకులు మరియు యజమానిగా అయ్యే ఒక నిచ్చెన. ఎప్పుడైనా ఎక్కే, ఎప్పుడైనా దిగే నిచ్చెన ఇది. అప్పుడప్పుడు బాలకుడిగా అవ్వండి, అప్పుడప్పుడు యజమానిగా అవ్వండి. దీని ద్వారా సదా తేలికగా ఉంటారు, ఎలాంటి భారమూ ఉండదు.
అన్ని రకాల భారాలనూ బాబాకు ఇచ్చేశారు కదా. భారం మోసే అలవాటు అయితే లేదు కదా. భారం మోసే అలవాటు ఉంటే ఎంత చెప్పినా భారాన్ని తప్పక మోస్తారు. భారాన్ని మోసేవారు కాదు, తేలికగా ఉండేవారు. ఎంత తేలికగా ఉంటే అంత ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉంటారు. భారం ఉన్నవారి గుర్తు వారు స్వతహాగానే కిందకు వచ్చేస్తారు మరియు తేలికగా ఉండేవారి గుర్తు వారు స్వతహాగా సహజంగా పైకి ఎగురుతూ ఉంటారు. మరి మీరు ఎవరు? ఎగిరేవారే కదా. సమయమే ఎగిరే కళ యొక్క సమయమైనప్పుడు, ఎగిరే కళ సమయంలో ఎగరడంలోనే ప్రాప్తి ఉంది. రెండింటిలోనూ బిజీగా ఉంటున్నారా - స్మృతిలోనూ మరియు సేవలోనూ. రాత్రింబవళ్ళు సేవ లేకుండా నిజమైన సేవాధారికి ప్రశాంతత ఉండదు. అలాంటి సేవాధారులా? లేక ఛాన్స్ దొరికినప్పుడు సేవ చేస్తారా? సేవలో ఎలాగైతే ముందుకు సాగుతున్నారో అలాగే స్మృతిలో కూడా సదా ముందుకు సాగండి. ‘స్మృతి మరియు సేవల బ్యాలెన్స్’ సదా ముందుకు నడిపిస్తుంది. బ్యాలెన్స్ ఉంచడం వచ్చా? సేవలో చాలా ముందుకు వెళ్ళిపోయి, లేదా స్మృతిలో ముందుకు వెళ్ళి సేవను మరచిపోవడం - అలా ఉండకూడదు. స్మృతి మరియు సేవ రెండూ సదా తోడుండాలి. అచ్ఛా!
ప్రవృత్తిలో ఉంటూ అందరూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటున్నారు కదా. ఏ బంధనంలోనూ చిక్కుకుపోవట్లేదు కదా? అర్థ కల్పం తమను తాము చిక్కుల్లో పడేసుకుంటూ వచ్చారు, బయటపడే ప్రయత్నం చేస్తూ కూడా చిక్కుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాబా అన్ని బంధనాల నుండి అతీతంగా చేశారు, కాబట్టి సంకల్పమాత్రంలో కూడా ఏ సంబంధంలోనూ, తమ దేహంలోనూ, పదార్థాలలోనూ చిక్కుకోకూడదు. 63 జన్మలు అనుభవం చేసి చూసేశారు కదా, చిక్కుకోవడం వల్ల ఏమి లభించింది? ఉన్నదంతా పోగొట్టుకున్నారు కదా. కాబట్టి సంకల్పంలోనూ బంధన-ముక్తులు. దీనినే అతీతంగా మరియు ప్రియంగా ఉండటం అంటాము. సంకల్పంలో కూడా బంధనం ఆకర్షించకూడదు. ఎందుకంటే సంకల్పంలోకి వస్తే ఆ తర్వాత కర్మలోకి వచ్చేస్తుంది. అందువల్ల సంకల్పంలోనే అంతం చేసేయండి. ఈ అతీతంగా మరియు ప్రియంగా అనగా అవ్యక్త స్థితిని విశేషంగా అభ్యాసం చేయాలి. వ్యక్త భావంలోకి వస్తూ కూడా వ్యక్త భావపు ఆకర్షణలోకి రాకూడదు. అవ్యక్తం అనగానే వ్యక్త భావానికి అతీతంగా ఉండటము. అవ్యక్తంగా అవ్వడం వచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ‘సదా’ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషం ఎప్పుడైనా వెళ్ళిపోవట్లేదు కదా? ఎప్పుడైనా తగ్గుతుందా? మీ ఖజానా అయినప్పుడు అది పెరుగుతూనే ఉండాలి తప్ప తగ్గకూడదు. కాబట్టి సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి. మంచిది, సేవను కూడా పెంచుతూ ఉండండి మరియు స్వయాన్ని కూడా ఎగరేస్తూ ఉండండి.
గ్రూప్ నం. 5 :- గంభీరత మరియు హర్షితముఖము యొక్క బ్యాలెన్స్‌తో ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి
అందరూ బాబా తోడు మరియు చేయి యొక్క అనుభవాన్ని సదా చేసుకుంటున్నారా? సదా తోడు అనగా ప్రతి అడుగులోనూ బాబా సహాయం సహజంగా అనుభవమవుతూ ఉండాలి. చిన్నపిల్లాడికి తండ్రి లేదా తల్లి తోడుంటే ఎంత సహజంగా ముందుకు సాగుతూ ఉంటాడో! మరి అలాంటి తోడు అనుభవమవుతుందా? ‘సదా’ అవుతుందా లేక ‘అప్పుడప్పుడు’ అవుతుందా? సమ్‌టైమ్ (అప్పుడప్పుడు) సమాప్తమైందా లేక ఇప్పటికీ సమ్‌టైమ్ ఉందా? బాబా తోడు సహజం చేస్తుంది మరియు బాబా తోడు లేకపోతే, బాబాకు దూరమైతే కష్టమవుతుంది. బాబా ఈ సమయంలో పిల్లలకు తోడుగా ఉండే ఆఫర్‌ను ఇస్తున్నారు. మరి బాబా ఆఫర్ ఇస్తున్నప్పుడు ఈ ఆఫర్‌ను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి కదా! 63 జన్మలు రకరకాల నామ-రూపాలలో పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి లభించారు కాబట్టి సదా తోడు యొక్క అనుభవం చేసుకోండి.
మీ అందరికీ బ్రహ్మా బాబాపై ఎంత ప్రేమ ఉంది? బ్రహ్మా బాబాపై ప్రేమ ఉన్నప్పుడు బ్రాహ్మణ కల్చర్‌తో కూడా ప్రేమ ఉంటుంది కదా. అన్నింటికంటే శ్రేష్ఠమైన దృష్టి అనుభవపు దృష్టియే. అనుభవపు నేత్రంతో చూసేవారు ఎన్నడూ ఎవరి మాటల వల్లా అలజడిలోకి రాలేరు. చూసినదానిని మళ్ళీ సరిగ్గా చూశామో లేదో అని ఆలోచించాల్సి వస్తుంది. కానీ అనుభవపు కన్నుతో చూసే, అనుభవం చేసుకునే విషయం సదా యథార్థంగా ఉంటుంది. అందరూ అనుభవం అయితే చేసుకున్నారు కదా. ఒక లక్ష మంది ఆత్మలు వచ్చి మీరు బ్రహ్మా బాబాను చూడలేదు అని మీతో చెప్పినా; అప్పుడు ఏమంటారు? చూశాము అనే అంటారు. దీని నుండి మిమ్మల్ని ఎవరూ తొలగించలేరు.
ఫారెన్‌లో ఎన్ని మాలలను సిద్ధం చేశారు? 108 మాలను సిద్ధం చేశారా లేక 16,108 నా? మరి డబల్ ఫారెనర్స్ కొరకు ప్రత్యేకంగా 108 మాల తయారవుతుందా లేక మిక్స్‌లో వస్తారా? వేరుగా ఏమీ లేదు కదా. కాబట్టి అందరూ 108 లోనే ఉన్నారు! మరి ఇండియా వారు ఏ మాలలోకి వస్తారు? (అందరూ ఒకే మాలలోకి వస్తాము) ఇంతవరకు మంచి ధైర్యాన్ని ఉంచుకుంటూ వచ్చారు మరియు ముందుముందు కూడా ధైర్యము సదా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసే మాయ అయితే రావట్లేదు కదా. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుందా? మూడ్ ఛేంజ్ అవ్వట్లేదు కదా? కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మరియు ఏ విషయానికీ మూడ్ ఛేంజ్ చేసుకోకూడదు. సదా ప్రతి కర్మలోనూ ఫాలో బ్రహ్మా బాబా. బ్రహ్మా బాబా కూడా సదా ఉల్లాసము మరియు గంభీరత రెండింటి బ్యాలెన్స్ యొక్క ఏకరస స్థితిలో ఉన్నారు. కాబట్టి ఫాలో ఫాదర్. వేరే ఏ మాయా రావట్లేదు కదా. సదా తమను విజయి అనగా మాయాజీత్గా అనుభవం చేసుకుంటూ ఎగురుతూ సాగండి. అందరూ మాయాజీతులే కదా. సంకల్పంలో కూడా మాయ రావట్లేదా? వేస్ట్ థాట్స్ (వ్యర్థ సంకల్పాల) రూపంలో వస్తుందా? మరి మాయాజీత్ టైటిల్ లభించిందా లేక తీసుకోవాలా? వేడుక (సెరిమనీ) జరిగిపోయిందా లేదా? ఫరిశ్తా డ్రెస్ వేసుకున్నారా? లభించిందా? దాదీకి డాక్టరేట్ డ్రెస్ లభించినట్లుగా, మీ అందరికీ కూడా ఫరిశ్తా డ్రెస్ లభించిందా? మరి వ్యర్థ సంకల్పాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఫరిశ్తాకు వేస్ట్ థాట్స్ వస్తాయా ఏంటి! ఇప్పుడు వేస్ట్ యొక్క నామరూపాలను సమాప్తం చేసేయాలి. పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. కేవలం ‘సదా’ అనే పదాన్ని మాటిమాటికి అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. మరి ఇది ఏ గ్రూప్? ఫరిశ్తా గ్రూప్. డబల్ ఫారెనర్స్ గ్రూప్ కాదు, ఫరిశ్తా గ్రూప్. అచ్ఛా! ఎలాగైతే సంకల్పం చేశారో అలాగే సదా స్వయంగానూ ఫరిశ్తాగా అయి ఎగురుతూ ఉండండి మరియు ఇతరులను కూడా ఫరిశ్తాగా తయారుచేస్తూ ఎగురవేస్తూ ఉండండి.
గ్రూప్ నం. 6 :- నిశ్చింతగా ఉండేందుకు బుద్ధిని స్వచ్ఛంగా తయారుచేసుకోండి
సదా తమను తాము నిశ్చింత చక్రవర్తిగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే నాది అనే భావం ఉన్నప్పుడే చింత కలుగుతుంది. సర్వస్వాన్నీ తండ్రికి అప్పగించినప్పుడు ఇక నిశ్చింతగా అయిపోయారు కదా! సర్వస్వాన్నీ తండ్రికి ఇచ్చి నిశ్చింత చక్రవర్తిగా మారారు. తమ దేహమూ లేదు, దేహ సంబంధాలూ లేవు. మరి నిశ్చింతగా అయిపోయారు కదా! సర్వ రకాల చింతలనూ తండ్రికి ఇచ్చేశారు. నిశ్చింతగా మారడం వల్ల చింత సమాప్తమైపోయింది మరియు ఫఖుర్ అనగా నషా వచ్చేసింది! ఏమవుతుంది, ఎలా అవుతుంది, రేపు ఏమిటి, ఎల్లుండి ఏమిటి అనే ఈ చింత ఉంటుందా? పరిస్థితులు బాగోలేనప్పుడు చింత కలుగుతుందా? చింత పెట్టుకుంటే చేయగలిగే మంచి పనులను కూడా చేయలేరు. ఎవరికైతే చింత కలుగుతుందో వారి బుద్ధి యథార్థ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం సరిగ్గా లేకపోవడం వల్ల కష్టాలు మరింతగా పెరుగుతూ పోతాయి. అందువల్ల సదా నిశ్చింతగా ఉంటే బుద్ధి మంచి నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం బాగుంటే సఫలత జరిగే ఉంది. చూడండి, ఈరోజు లక్షాధికారిగా ఉన్నవారు రేపు గడ్డిపోచ సమానంగా నిరుపేదగా మారిపోతారు. కారణం ఏమిటి? నిర్ణయ శక్తి సరిగ్గా పనిచేయదు; ‘అవును’ అనాల్సిన చోట ‘కాదు’ అని, ‘కాదు’ అనాల్సిన చోట ‘అవును’ అనేశారు; ఇక సమాప్తం. బుద్ధి ఖాళీగా ఉన్నప్పుడే నిర్ణయ శక్తి యథార్థంగా పనిచేస్తుంది. చింత నుండి బుద్ధి ఫ్రీగా లేకపోతే మరింత నష్టం జరుగుతుంది. అందువల్ల నిశ్చింత అనగా సదా మనస్సు మరియు బుద్ధి ఫ్రీగా ఉండడం. మరి అలా ఫ్రీగా ఉన్నారా లేదా ఏదైనా చెత్త ఉందా? యోగాగ్ని ద్వారా ఉన్న చెత్తంతా భస్మమైపోయింది! అగ్ని తీవ్రంగా లేకపోతే కొంత కాలుతుంది, కొంత మిగిలిపోతుంది. యోగాగ్ని ద్వారా బుద్ధిలో ఉన్న చెత్తంతా సమాప్తమైపోయింది! ఎవరి బుద్ధి అయితే ఇంత స్వచ్ఛంగా ఉంటుందో వారే సదా నిశ్చింతగా ఉండగలరు. అందుకే సదా స్వచ్ఛత అందరికీ ప్రియంగా ఉంటుంది. ఎక్కడైనా మురికి ఉంటే దాన్ని ఎవరు ఇష్టపడతారు! ఎలాంటి బలహీనత అయినా అది మురికే. కాబట్టి సదా స్వచ్ఛత ఉందా అని చెక్ చేసుకోండి? మిశ్రమం ఏమీ లేదు కదా? చిన్న వ్యర్థ సంకల్పం కూడా చెత్తే.
ఉదయాన్నే తమ బుద్ధిని బిజీగా ఉంచే టైమ్‌టేబుల్ తయారుచేసుకోండి. తమ స్థూల దినచర్యను ఎలాగైతే తయారుచేసుకుంటారో, అలాగే బుద్ధి యొక్క టైమ్‌టేబుల్‌ను కూడా తయారుచేసుకోండి - ఈ సమయంలో బుద్ధిలో ఈ సమర్థ సంకల్పంతో వ్యర్థాన్ని సమాప్తం చేయాలి అని. బిజీగా ఉండేవారి వద్దకు ఎవరూ రారు, వెళ్ళిపోతారు. ఫ్రీగా ఉంటే అందరూ వచ్చి కూర్చుంటారు. కాబట్టి బుద్ధిని బిజీగా ఉంచే విధిని సదా అవలంబిస్తూ ఉండండి. పెద్ద వ్యక్తుల ప్రతి ఒక్క సెకనూ నిర్ణయించబడి (ఫిక్స్ అయి) ఉంటుంది. మరి మీరెంతటి గొప్పవారు! కాబట్టి మీ ప్రతి సమయపు దినచర్యను సెట్ చేసుకోండి. వ్యర్థాన్ని సమాప్తం చేయడానికి అత్యంత సహజ సాధనం సదా బిజీగా ఉండడమే. బిజీగా ఉండేవారు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులై ఉండటం వల్ల నిశ్చింతగా మరియు డబల్ లైట్‌గా ఉంటారు! మరి డబల్ లైట్‌గా ఉన్నారు కదా! దృఢత్వం ఉంటే సఫలురవుతారు. ఈ సంవత్సరం అంతటిలోనూ రోజంతా, ఏడాది పొడవునా నిశ్చింతగా ఉన్నామా అని చెక్ చేసుకోండి? ఎలాంటి ఒక్క సెకను చింత కూడా ఉండకూడదు. అచ్ఛా!
అమృతవేళ 2.30 గంటలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బాప్‌దాదా ఇలా పలికారు:- నలువైపులా ఉన్న అతి స్నేహపూర్వక, సదా సమీపంగా ఉండే సర్వ పిల్లలకు నూతన సంవత్సరపు ప్రతి రోజూ పదమా రెట్ల అభినందనలు. ఎందుకంటే సంవత్సరంలోని ప్రతి రోజూ ఏదో ఒక నవీనతను తీసుకువస్తుంది. బ్రాహ్మణ ఆత్మలందరూ ప్రతి సమయం తమలోనూ మరియు సేవలోనూ ఏదో ఒక నవీనతను తప్పక తీసుకురావాలి. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి రోజూ స్వ-ఉన్నతి పట్ల లేదా సేవ పట్ల ఏమి నవీనతను తీసుకువచ్చాము అని చెక్ చేసుకోవాలి? సదా తమ శ్రేష్ఠ స్థితి మరియు పురుషార్థపు స్పీడ్‌ను ముందుకు పెంచుకుంటూ ఉండాలి. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ ముందుకు సాగడమే విశ్వ-పరివర్తన కార్యం ముందుకు సాగుతుందనడానికి గుర్తు. కాబట్టి సదా ప్రతి సమయం నవీనత యొక్క అభినందనలు తీసుకుంటూ ఉండండి మరియు ఇతరులను కూడా నూతన ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు నడిపిస్తూ ఉండండి. సదా ఉల్లాస-ఉత్సాహాలతో ప్రతి రోజూ ఉత్సవం జరుపుకుంటూ ఉండండి. సదా ఉత్సవంలో సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి మరియు తండ్రి గుణాల గీతాలను పాడుతూ ఉండండి. మధురత అనే మిఠాయితో స్వయంగా నోటిని తీపి చేసుకుంటూ ఉండండి మరియు మధురమైన మాటలు, మధురమైన సంస్కారాలు, మధురమైన స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా తీపి చేస్తూ ఉండండి. అలాంటి నూతన సంవత్సరానికి పదమారెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా!
ప్రియస్మృతులు పంపినవారికి, కార్డులు పంపినవారికి, గిఫ్ట్‌లు పంపినవారికి - ఆ పిల్లలందరికీ, ప్రతి దేశానికీ మరియు ప్రతి ఆత్మకూ పేరుపేరునా విశేష అభినందనలు మరియు ప్రియస్మృతులు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
