‘‘పవిత్రత యొక్క దృఢ వ్రతము ద్వారా వృత్తి పరివర్తన’’
ఈరోజు ఉన్నతోన్నతుడైన తండ్రి మహానులైన తమ పిల్లలందరినీ చూస్తున్నారు. మహానాత్మలుగా అయితే పిల్లలందరూ అయ్యారు ఎందుకంటే మహానులుగా అయ్యేందుకు అన్నింటికంటే ముఖ్య ఆధారమైన ‘పవిత్రత’ను ధారణ చేసారు. పవిత్రతా వ్రతాన్ని అందరూ ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేసారు. ఏ రకమైన దృఢ సంకల్పము రూపీ వ్రతాన్ని అయినా ఆచరించటము అనగా తమ వృత్తిని పరివర్తన చేసుకోవటము. దృఢ వ్రతము వృత్తిని మార్చేస్తుంది, అందుకే భక్తిలో వ్రతం తీసుకుంటారు కూడా మరియు వ్రతము పెట్టుకుంటారు కూడా. వ్రతము తీసుకోవటము అనగా మనసులో సంకల్పం చేయటము మరియు వ్రతము పెట్టుకోవటము అనగా స్థూల రీతిగా ఉపవాసము ఉండటము. ఆహార-పానీయాల విషయములో అయినా, నడవడికలో అయినా రెండింటి లక్ష్యము - వ్రతము ద్వారా వృత్తిని మార్చుకోవటము. మీరందరూ కూడా పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు మరియు వృత్తిని శ్రేష్ఠంగా తయారుచేసుకున్నారు. సర్వాత్మల పట్ల ఏ వృత్తిని తయారుచేసుకున్నారు? ఆత్మ భాయి-భాయి. బ్రదర్హుడ్ (సోదరత్వము), ఈ వృత్తి ద్వారానే బ్రాహ్మణులు మహానాత్మలుగా అయ్యారు. ఈ వ్రతము అయితే అందరిదీ పక్కాగా ఉంది కదా?
బ్రాహ్మణ జీవితము యొక్క అర్థమే పవిత్ర ఆత్మ, మరియు ఈ పవిత్రత బ్రాహ్మణ జీవితానికి పునాది. పునాది దృఢంగా ఉందా లేక కదులుతోందా? ఈ పునాది సదా స్థిరంగా-దృఢంగా ఉండటమే బ్రాహ్మణ జీవితము యొక్క సుఖాన్ని ప్రాప్తి చేసుకోవటము. అప్పుడప్పుడు పిల్లలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేస్తూ తమ సత్యమైన చార్టును ఇచ్చేటప్పుడు ఏమంటారు? ఎంతగా అతీంద్రియ సుఖము అనుభవమవ్వాలో, ఎంతగా శక్తులు అనుభవమవ్వాలో అంతగా అవ్వటం లేదు, లేదంటే మరో మాటలో ఏమంటారంటే, అనుభవమవుతుంది కానీ సదా అవ్వటం లేదు. దీనికి కారణము ఏమిటి? అనటానికైతే మాస్టర్ సర్వశక్తిమాన్ అని అంటారు, ఒకవేళ మీరు మాస్టర్ సర్వశక్తిమంతులా అని అడిగితే ఏమంటారు? ‘కాదు’ అనైతే అనరు కదా. అవును, మేము మాస్టర్ సర్వశక్తిమంతులము అనే అంటారు. ఒకవేళ మాస్టర్ సర్వశక్తిమంతులైతే మరి శక్తులు ఎక్కడకు వెళ్ళిపోతాయి? మరియు ఉన్నదే బ్రాహ్మణ జీవనధారులుగా. నామధారులు (పేరుకు మాత్రమే) కారు, మీరు జీవనధారులు. బ్రాహ్మణుల జీవితములో సంపూర్ణ సుఖ-శాంతుల అనుభూతి లేకపోతే లేక బ్రాహ్మణులు సర్వ ప్రాప్తులతో సదా సంపన్నంగా లేకపోతే, మరి బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు అలా ఉంటారు? ఇంకెవ్వరైనా అలా ఉండగలరా? బ్రాహ్మణులే అలా ఉండగలరు కదా. మీరందరూ మీ సంతకం ఎలా చేస్తారు? బి.కె.ఫలానా అని రాస్తారు కదా. పక్కానే కదా? బి.కె. అంటే అర్థమేమిటి? ‘బ్రాహ్మణ్’. కావున బ్రాహ్మణుల నిర్వచనము ఇదే.
‘ఎంతగా’ మరియు ‘అంతగా’ అనే పదాలు ఎందుకు వస్తాయి? పవిత్రత సుఖ-శాంతులకు జనని అని అంటారు. ఎప్పుడైనా అతీంద్రియ సుఖము లేక స్వీట్ సైలెన్స్ యొక్క అనుభవము తక్కువైతే, దానికి కారణము పవిత్రతా పునాది బలహీనంగా ఉండటము. ఇంతకుముందు కూడా వినిపించాము, పవిత్రత అంటే కేవలము బ్రహ్మచర్య వ్రతమనే కాదు, ఆ వ్రతము కూడా గొప్పదే ఎందుకంటే ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ రోజుల్లో మహానాత్మలుగా పిలువబడేవారు కూడా కష్టమని కూడా కాదు, అసలు అది అసంభవమనే భావిస్తారు. కావున అసంభవాన్ని మీ దృఢ సంకల్పము ద్వారా సంభవము చేసారు మరియు సహజంగా పాలన చేసారు, అందుకే ఈ వ్రతాన్ని ధారణ చేయటము కూడా తక్కువైన విషయమేమీ కాదు. బాప్‌దాదా ఈ వ్రతాన్ని పాలన చేసే ఆత్మలకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాల సహితంగా అభినందనలను ఇస్తారు. కానీ బాప్‌దాదా బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరినీ సంపూర్ణంగా మరియు సంపన్నంగా చూడాలనుకుంటున్నారు. కావున ఎలా అయితే ఈ ముఖ్యమైన విషయాన్ని జీవితములో అలవరచుకున్నారో, అసంభవాన్ని సహజంగా సంభవము చేసారో, అటువంటివారికి అన్ని రకాలుగా పవిత్రతను ధారణ చెయ్యటము ఏమంత పెద్ద విషయము. పవిత్రత యొక్క నిర్వచనము గురించి అందరికీ చాలా బాగా తెలుసు. ఒకవేళ మిమ్మల్నందరినీ - ‘‘పవిత్రత అంటే ఏమిటి’’ అనే టాపిక్‌పై భాషణ చెయ్యండి అని చెప్తే చాలా బాగా చెయ్యగలరు కదా? మరి తెలుసు అన్నప్పుడు, దానిని నమ్మినప్పుడు మళ్ళీ ఈ ‘అంతగా’, ‘ఎంతగా’ అన్న మాటలు ఎందుకు? సుఖము, శాంతి మరియు శక్తుల అనుభూతి తక్కువైపోవటానికి ఏ పవిత్రత బలహీనం అవుతుంది? పవిత్రత ఏదో ఒక స్టేజ్‌లో అచలంగా ఉండటం లేదు, కనుక పవిత్రత యొక్క ఏ రూపములో అలజడి ఉందో చెక్ చేసుకోండి. బాప్‌దాదా పవిత్రత యొక్క అన్ని రూపాలను స్పష్టం చెయ్యరు ఎందుకంటే మీకు తెలుసు, అనేక సార్లు విని ఉన్నారు, వినిపిస్తూ ఉంటారు కూడా, మీతో మీరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు - అవును, పవిత్రత అంటే ఇది, పవిత్రత అంటే అది... అని. మెజారిటీ వారి రిజల్టు చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? జ్ఞానం చాలా ఉంది, యోగం యొక్క విధిలో కూడా విధాతలుగా అయ్యారు, ధారణ విషయాలను వర్ణించటంలో కూడా చాలా తెలివైనవారిగా ఉన్నారు మరియు సేవలో కూడా ఒకరికంటే ఒకరు ముందున్నారు, ఇంకేం మిగిలింది? నంబర్‌వన్ జ్ఞానవంతులుగా అయితే అయ్యారు, కేవలము ఒక్క విషయములో నిర్లక్ష్యులుగా అవుతారు, అదేమిటంటే - స్వయము ఒక్క క్షణములో వ్యర్థము ఆలోచించటము, చూడటము, మాట్లాడటము మరియు చెయ్యటములో ఫుల్స్టాప్ పెట్టి దానిని పరివర్తన చెయ్యటము. ఈ బలహీనతయే సుఖ అనుభూతిలో తేడా తీసుకువస్తుందని, శక్తి స్వరూపంగా అవ్వటంలో లేక తండ్రి సమానంగా అవ్వటంలో విఘ్న స్వరూపంగా అవుతుందని అర్థం చేసుకుంటారు కూడా, అయినా కూడా ఏం జరుగుతుంది? స్వయాన్ని పరివర్తన చేసుకోలేకపోతారు, ఫుల్స్టాప్ పెట్టలేకపోతారు. ‘సరే, నాకు అర్థమైంది’ అని ఆలోచిస్తూ కామా (,) పెడతారు. లేదా ఇతరులను చూసి - ఇలా అవుతుందా! ఇలా అవ్వాలి కదా! అని ఆశ్చర్యార్థక గుర్తును (!) పెడతారు. లేదా ప్రశ్నార్థకముల (?) క్యూ (లైన్) కడతారు, ఎందుకు అనే క్యూ కడతారు. ఫుల్స్టాప్ (.) అనగా బిందువు. బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ - ఈ రెండింటి స్మృతి ఉన్నప్పుడే ఫుల్స్టాప్ పెట్టగలరు. ఈ స్మృతి ఫుల్స్టాప్ పెట్టడంలో అనగా బిందువు పెట్టడంలో సమర్థంగా చేస్తుంది. ఆ సమయంలో కొంతమంది లోలోపల ఎలా ఆలోచిస్తారంటే - నేను ఆత్మిక స్థితిలో స్థితి అవ్వాలి కానీ మాయ తన స్క్రీన్ ద్వారా ఆత్మకు బదులుగా వ్యక్తులను లేక విషయాలను పదే-పదే ఎదురుగా తీసుకువస్తుంది, దానివల్ల ఆత్మ దాగిపోతుంది మరియు పదే-పదే వ్యక్తులు మరియు విషయాలు స్పష్టంగా ఎదురుగా వస్తాయి. కావున మూల కారణము ఏమిటంటే - స్వయాన్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉంది. ఇతరులను కంట్రోల్ చెయ్యటము చాలా బాగా వస్తుంది కానీ స్వయముపై కంట్రోల్ అనగా పరివర్తనా శక్తిని కార్యములో ఉపయోగించటము తక్కువగా వస్తుంది.
బాప్‌దాదా కొంతమంది పిల్లల మాటలు విని చిరునవ్వు నవ్వుతుంటారు. స్వయాన్ని పరివర్తన చేసుకునే సమయము వచ్చినప్పుడు లేక సహనం చేసే సమయము వచ్చినప్పుడు లేక ఇముడ్చుకునే సమయము వచ్చినప్పుడు, అటువంటి సమయములో ఏమంటారు? చాలావరకు ఏమంటారంటే - ‘నేనే మరణించాలా’, ‘నేనే మారాలా’, ‘నేనే సహించాలా’. కానీ ‘మరణిస్తే స్వర్గానికి వెళ్తారు’ అని లోకులు అంటారు కదా, ఆ మరణించటములో ఎవరూ స్వర్గానికి వెళ్ళరు కానీ ఈ మరణించటములో స్వర్గములో శ్రేష్ఠమైన సీట్ లభిస్తుంది. కావున ఇది మరణించటము కాదు కానీ స్వర్గములో స్వరాజ్యాన్ని తీసుకోవటము. కనుక మరణించటము మంచిదే కదా? కష్టమనిపిస్తుందా? ఆ సమయములో కష్టమనిపిస్తుంది. నేనసలు తప్పే చెయ్యలేదు, వారిదే తప్పు, కానీ తప్పును ఒప్పుగా ఎలా చెయ్యాలి, ఇది రాదు. తప్పు చేసేవారు మారాలా లేక ఒప్పు చేసేవారు మారాలా? ఎవరు మారాలి? ఇద్దరూ మారాల్సి ఉంటుంది. ‘మారటము’ అన్న పదాన్ని ఆధ్యాత్మిక భాషలో ‘ముందుకు వెళ్ళటము’ అని భావించండి. ‘మారటము’ అని అనుకోకండి, ‘ముందుకు వెళ్ళటము’ అని భావించండి. తప్పుగా మారటము కాదు, మంచిగా మారటము. స్వయాన్ని మార్చుకునే శక్తి ఉందా? లేక ఎప్పుడో ఒకప్పుడు మారుతాములే అని అనుకుంటారా?
పవిత్రత యొక్క అర్థమే - సదా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధాలు మరియు సంపర్కాలలో మూడు బిందువుల మహత్వాన్ని ప్రతి సమయము ధారణ చెయ్యటము. ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే క్షణములో ఫుల్స్టాప్ పెట్టడములో సదా స్వయాన్ని ముందుగా ఆఫర్ చేసుకోండి ‘‘నేను చెయ్యాలి’’ అని. ఇలా ఆఫర్ చేసుకునేవారికి మూడు రకాల ఆశీర్వాదాలు లభిస్తాయి. 1. స్వయానికి స్వయము యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి, సంతోషము లభిస్తుంది, 2. తండ్రి ద్వారా ఆశీర్వాదాలు, 3. బ్రాహ్మణ పరివారానికి చెందిన శ్రేష్ఠ ఆత్మలెవరైతే ఉన్నారో, వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. కావున అది మరణించటము అయ్యిందా లేక పొందటము అయ్యిందా, ఏమంటారు? పొందారు కదా. కావున ఫుల్స్టాప్ పెట్టే పురుషార్థాన్ని మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా పరివర్తనా శక్తిని తీవ్రగతితో పెంచుకోండి. ఇలా అయితే అవుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది... అని నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి, ఇవి నిర్లక్ష్యముతో కూడిన సంకల్పాలు. నిర్లక్ష్యాన్ని పరివర్తన చేసి అలర్ట్‌గా అవ్వండి. అచ్ఛా!
నలువైపుల ఉన్న మహానాత్మలకు, సర్వ శ్రేష్ఠమైన పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసే ఆత్మలకు, సదా స్వయానికి క్షణములో ఫుల్స్టాప్ పెట్టే శ్రేష్ఠ పరివర్తక ఆత్మలకు, సదా స్వయాన్ని శ్రేష్ఠ కార్యములో నిమిత్తులుగా చేసుకునేందుకు ఆఫర్ చేసుకునే ఆత్మలకు, సదా మూడు బిందువుల మహత్వాన్ని ప్రాక్టికల్‌గా ధారణ చేసి చూపించే తండ్రి సమానమైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? (బాప్‌దాదా అందరినీ అడుగుతున్నారు) దాదీలను చూసి సంతోషిస్తారు కదా? ఎందుకు సంతోషిస్తారు? ఎందుకంటే వారు తమ వైబ్రేషన్లు మరియు కర్మల ద్వారా సంతోషాన్ని ఇస్తారు, అందుకే సంతోషిస్తారు. ఎప్పుడైనా ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలను కలిసినప్పుడు సంతోషాన్ని అనుభవము చేస్తారు కదా. (టీచర్లతో) ఫాలో కూడా చేస్తారు కదా. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే - తండ్రి అయితే తండ్రే కదా, సమానంగా ఎలా అవ్వగలము? కానీ నిమిత్త ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు మీ తోటి వారే కదా? మరి వారు అవ్వగలిగినప్పుడు మీరు అవ్వలేరా? కావున అందరి లక్ష్యము సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి అని. ఒకవేళ 16 కళలు కలవారిగా అవ్వాలా లేక 14 కళలు కలవారిగా అవ్వాలా అని చేతులెత్తిస్తే ఎందులో ఎత్తుతారు? 16 కళలలో కదా. మరి 16 కళలు అంటే అర్థమేంటి? సంపూర్ణము అని కదా. లక్ష్యమే అటువంటిదైనప్పుడు అలా అవ్వాల్సిందే. కష్టమేమీ కాదు, అలా అవ్వాల్సిందే. చిన్న-చిన్న విషయాలలో గాభరా పడకండి. మూర్తిగా అవుతున్నారు కనుక ఎన్నో కొన్ని ఉలి దెబ్బలైతే పడతాయి కదా, లేదంటే అటువంటి మూర్తిగా ఎలా అవుతారు. ఎవరు ఎంతగా ముందు ఉంటారో వారు తుఫానులు కూడా అందరికంటే ఎక్కువగా దాటాల్సి ఉంటుంది కానీ ఆ తుఫాను వారికి తుఫానులా అనిపించదు, తోఫా (కానుక)లా అనిపిస్తుంది. ఈ తుఫాను కూడా అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుక అవుతుంది, కావున కానుకలా అయ్యింది కదా. మరి కానుకను తీసుకోవటము మంచిగా అనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? కావున ఇది కూడా తీసుకోవటమవుతుంది, ఇవ్వటము కాదు. ఇవ్వటము కష్టమనిపిస్తుంది, తీసుకోవటమైతే సహజమే.
నా పాత్రే ఇలా ఉందా, అన్ని విఘ్నాల అనుభవాలు నావద్దకే రావాలా! అని ఇలా ఆలోచించకండి. రండి అని వాటిని వెల్కమ్ చేయండి. అవి కానుకలు. ఎక్కువలో ఎక్కువ కానుకలు లభిస్తాయి, అందులో ఏముంది? చాలా సరియైన మూర్తిగా అవ్వటము అనగా ఉలి దెబ్బలు పడటము. ఉలి దెబ్బలు వేసి-వేసి దానిని సరిగ్గా తయారుచేస్తారు. మీరైతే అనుభవజ్ఞులుగా అయ్యారు, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఆటలా అనిపిస్తుంది. చూస్తూ ఉంటారు మరియు నవ్వుతూ ఉంటారు, ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. టీచర్లు ధైర్యవంతులా లేక అప్పుడప్పుడు గాభరా పడతారా? ఇలా అవుతుందని ఆలోచించనే ఆలోచించలేదు, ముందే తెలిసి ఉంటే ఆలోచించేవారము... డబల్ ఫారెనర్స్ ఇలా అనుకుంటారా - బ్రాహ్మణులుగా అవ్వటంలో కూడా ఇలా అవుతుంది అని మేము ఆలోచించనే ఆలోచించలేదు అని? బాగా ఆలోచించి, అర్థం చేసుకుని వచ్చారు కదా లేక ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుందా? అచ్ఛా!
ఎవరు ఎలా ఉన్నా కానీ బాప్‌దాదా మంచినే చూస్తారు, అందుకే బాప్‌దాదా అందరినీ మంచివారు అనే అంటారు, చెడ్డవారు అని అనరు. తొమ్మిది చెడు విషయాలు ఉండి, ఒక్క మంచి విషయము ఉన్నా కూడా తండ్రి ఏమని అంటారు? మంచివారు అని అంటారా లేక వీరు చాలా చెడ్డవారు, వీరు చాలా బలహీనులు అని అంటారా? అచ్ఛా. ఇది చాలా పెద్ద గ్రూప్ (21 దేశాల వారు వచ్చారు) మంచిది. హౌస్‌ఫుల్ అయితే అప్పుడు ఇంకొకటి తయారవుతుంది. ఒకవేళ ఫుల్ అవ్వకపోతే ఇంకొకటి తయారయ్యే అవకాశం ఉండదు. అవసరమే సాధనాలను ఎదురుగా తీసుకువస్తుంది.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1
ప్రకృతిని, మనుష్యాత్మలను పరివర్తన చేయడానికి మీ వైబ్రేషన్లను మరియు వృత్తిని శక్తివంతంగా తయారు చేసుకోండి
ఢిల్లీ గ్రూప్‌తో:- ఢిల్లీని పరిస్తాన్గా ఎప్పుడు తయారుచేస్తారు? ఎంత సమయం కావాలి? సమయం కావాలా లేక ఎవరెడీగా ఉన్నారా? (ఎవరెడీగా ఉన్నాము) అయితే రేపే ఢిల్లీ పరిస్తాన్ అయిపోతుందా? (బాబా తల్చుకుంటే అవుతుంది) కానీ నిమిత్తం అయితే మీరే కదా! బాబా పిల్లలనే నిమిత్తంగా చేశారు. పిల్లలను ముందుంచి బాప్‌దాదా బ్యాక్‌బోన్ (వెన్నుముక) గా ఉంటారు. మరి ఎప్పుడు పరిస్తాన్ తయారుచేస్తారు? తయారు చేయాల్సిందే కదా, తయారవ్వాల్సిందే! అందరూ ఢిల్లీ పరిస్తాన్గా తయారవ్వాలి, తాము వెళ్లాలి అని ఎదురుచూస్తున్నారు. నిమిత్తం అయితే ఢిల్లీ వాళ్లే కదా! అందరి సహకారంతో అయినా, జరగాల్సిందే. అయినా ఢిల్లీలో ఉన్నవారికి విశేషమైన పాత్ర ఉంది కదా! మరి మొదట కబరిస్తాన్ (స్మశానం) గా తయారై, ఆ తర్వాత పరిస్తాన్గా తయారుచేసేంత తయారీ చేస్తున్నారా? ఏం చేస్తారు? (సమయమే చేయిస్తుంది) సమయం చేయించదు, సమయాన్నే మీరు తీసుకురావాలి. ఎందుకంటే అనేకసార్లు మీరు నిమిత్తమయ్యే పాత్ర అభినయించారు, ఇప్పుడు కేవలం రిపీట్ చేయాలి అంతే. మరి మీ శ్రేష్ఠమైన వైబ్రేషన్ల ద్వారా, శుభ భావన, శుభ కామనల ద్వారా పరివర్తన చేస్తున్నారా? ఎంతెంత శక్తివంతమైన సతోప్రధాన వైబ్రేషన్లు ఉంటాయో, అంతగా ఈ ప్రకృతి మరియు మనుష్యాత్మల వృత్తి రెండూ చేంజ్ (పరివర్తన) అయిపోతాయి. మనుష్యాత్మలను వృత్తి ద్వారా చేంజ్ చేయాలి, ప్రకృతిని వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయాలి. కావున పరివర్తన చేసేవారి వృత్తి సదా శక్తివంతంగా ఉండాలి, సాధారణంగా కాదు. సాధారణ వృత్తి లేదా సాధారణ వైబ్రేషన్ల ద్వారా పరివర్తన కావడం కష్టం. కాబట్టి ఢిల్లీ వాళ్లకు పెద్ద బాధ్యత ఉంది. మీ బాధ్యతగా భావిస్తున్నారా లేదా అయిపోతుందిలే అని అనుకుంటున్నారా? లేదు, నిమిత్తం అవ్వాలి. డ్రామాలో తెలుసు, బ్రహ్మాబాబాకు కూడా తెలుసు మరియు ఉండేది - తాను నారాయణుడిగా కావాల్సిందేనని, అయినా ఏం చేశారు? నిమిత్తంగా అయ్యారు కదా! జగదాంబకు తెలుసు తాను లక్ష్మిగా కావాల్సిందేనని, అయినా నిమిత్తమై చూపించారు. కాబట్టి సదా మీ బాధ్యతను స్మృతిలో ఉంచుకోండి. బాధ్యత ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఏదైనా కార్యం యొక్క బాధ్యత ఉంటే అలర్ట్ అయిపోతారు. కాబట్టి సదా అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడో ఒకసారి కాదు, సదా! ఎంత పెద్ద బాధ్యత! ప్రతి ఆత్మకు తండ్రి ద్వారా ఏదో ఒక వారసత్వాన్ని ఇప్పించాల్సిందే. ముక్తి వారసత్వం ఇప్పించండి, లేదా జీవన్ముక్తి వారసత్వం ఇప్పించండి, కానీ వారసత్వానికి అధికారులుగా అవుతారు కదా! కాబట్టి ఢిల్లీ వాళ్లకు ఎంత పని ఉంది! అందుకే అలసత్వంగా కావద్దు. ఇది అందరి బాధ్యతా లేక ఇది పెద్దల బాధ్యత, మేము చిన్నవాళ్లము అని భావిస్తున్నారా? ఇందులో చిన్నవాళ్లు ‘సుభాన్ అల్లా’. పెద్దలు పెద్దలే, చిన్నవాళ్లు సుభాన్ అల్లా! అందరికీ సదా ఈ శుభ సంకల్పం ఇమర్జ్ అవ్వాలి - దాత యొక్క పిల్లలుగా అయి, ఆత్మలందరికీ వారసత్వాన్ని ఇప్పించడానికి నిమిత్తం కావాలి, ఏ ఒక్కరూ వంచితం కాకూడదు. ఏది ఏమైనా సహోదరులు కదా! కాబట్టి బ్రదర్స్ అయినందున దయ వస్తుంది కదా! ఎలాంటివాడైనా తండ్రికి చెందినవాడే కదా! మీరు కూడా ‘భాయి-భాయి’ (సహోదరులమే) అంటారు కదా, అజ్ఞాని భాయి, జ్ఞాని భాయి అని అనరు కదా! అందరినీ భాయి-భాయి అనే అంటారు కదా! సరే, ఇంకేమీ లేకపోయినా, అందరి కోరిక అయిన ‘జన్మమరణాల నుండి ముక్తి పొందడం’ - ఆ అనుభవాన్నయినా చేయిస్తారు కదా! ఆ ఆశనైనా పూర్తి చేస్తారు కదా!
మీ ఆశ ఏమిటి? ముక్తిలో ఉండాలా? ముక్తిలో ఉంటే చాలా విశ్రాంతి లభిస్తుంది. ఒక యుగం ఉండి ఆ తర్వాత వస్తారా? సత్యయుగం తర్వాత త్రేతాయుగంలో వస్తారా, వద్దా? ముక్తిలో ఉండకూడదా? జీవన్ముక్తిలోకి రావాలా? అచ్ఛా, పాండవులకు ముక్తి కావాలా? జీవన్ముక్తి కావాలా? డబల్ కావాలి, సింగిల్ వద్దు. జీవితమూ ఉండాలి, ముక్తి కూడా ఉండాలి. తీసుకోవడంలో చాలా తెలివైనవారు. కాబట్టి సదా ఈ పాటనే పాడుతూ ఉంటారు కదా - వాహ్! నా శ్రేష్ఠ భాగ్యం! భగవంతుడూ లభించాడు, భాగ్యమూ లభించింది. ఎవరైనా అడిగినా లేదా ఆలోచించినా - ‘నా భాగ్యం ఏమిటి?’ అని, అజ్ఞానులు ఆలోచిస్తారు కదా ‘నా భాగ్యం ఏంటో ఏమో!’ అని. మీరు ఆలోచిస్తారా నా భాగ్యం ఏమిటి అని? ఎప్పుడైనా ఆ సంకల్పం వస్తుందా, రాదా? మీ భాగ్యంపై మీకు నిశ్చయం ఉందా? భాగ్య విధాతయే మనవాడైపోయినప్పుడు భాగ్యం ఎక్కడికి పోతుంది? ఎక్కడ భాగ్య విధాత ఉంటారో అక్కడే భాగ్యం ఉంటుంది. కాబట్టి ‘ఏమవుతుందో’ అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు! మరి అంత సంతోషం ఉందా లేక హెచ్చుతగ్గులు అవుతుందా? ఇప్పుడు తగ్గకూడదు. ఎంత ఎక్కువైతే అంత మంచిది, కానీ తగ్గకూడదు.
(ఢిల్లీని పరిస్తాన్గా తయారుచేయడానికి విశేషంగా ఏం చేయాలి?)
విశేషంగా అయితే మైక్‌లను తయారుచేయాలి. అందులో శ్రమ తక్కువ, సఫలత సహజంగా ఉంటుంది. ఒక్కరి ద్వారా అనేకులకు సందేశం లభిస్తుంది మరియు కార్యంలో కూడా సహయోగులుగా అవుతారు. ఎంతెంత నిమిత్తంగా అవుతారో అంతగా కార్యంలో కూడా సహజ సహయోగులుగా అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఇదే లక్ష్యం ఉంచుకోండి - విభిన్న వర్గాలకు చెందిన మైక్‌లను తయారుచేయాలి, వారు స్వయంగా తమ తమ వర్గానికి నిమిత్తంగా అయిపోవాలి. కాబట్టి అలాంటి నిమిత్తమయ్యే ఆత్మలను తయారుచేయండి.
(మైక్‌ను తయారు చేయడానికి ఏం చేయాలి?)
దాని కోసం ఒకే సమయంలో మూడు రకాల సేవలు కావాలి. ఉదాహరణకు, ఎవరైనా చాలా తెలివైన యోధుడు కానీ, తీవ్రవాది కానీ ఉన్నారనుకోండి, వారిని పట్టుకోవడానికి ఏం చేస్తారు? నలువైపుల నుండి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, అప్పుడే దొరుకుతారు. అలాగే ఇక్కడ కూడా ఒకే సమయంలో మనసాలో, వాణిలో, సంబంధ-సంపర్కాలలో, వాతావరణంలో - ఈ నలువైపులా ముట్టడి చేసినప్పుడే ఈ విశేష నిమిత్తమయ్యే ఆత్మలు సమీపంలోకి వస్తారు. కాబట్టి శ్రేష్ఠమైన వైబ్రేషన్ల ద్వారా వారిని సమీపానికి తీసుకురండి. ఎందుకంటే వాణి ద్వారా సమీపానికి వెళ్లే సమయం తక్కువే లభిస్తుంది కదా! కానీ వైబ్రేషన్, వాతావరణాన్ని తయారుచేసే సేవ సదా జరుగుతూ ఉండాలి. నలువైపులా వైబ్రేషన్ల ద్వారా ఆ ఆత్మలను పట్టుకోవాలి. కేవలం ఒక్కరిద్దరు కాదు, సంగఠిత రూపంలో కావాలి. కాబట్టి ఢిల్లీ వాళ్లు చాలా పని చేయాల్సి ఉంది. ఢిల్లీలో శబ్దం బిగ్గరగా వస్తే విశ్వంలో చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఢిల్లీలో ఒక పెద్ద మైక్ తయారైతే, నలువైపులా వైబ్రేషన్లు తమంతట తామే వ్యాపిస్తాయి. కాబట్టి ఢిల్లీ వాళ్లు ఇప్పుడు వైబ్రేషన్ల ద్వారా సేవ చేసి మైక్‌లను తయారుచేయండి. వేరే ఏ వైబ్రేషన్లలోకీ వెళ్లవద్దు. చాలా పెద్ద బాధ్యత ఉంది. బాధ్యత ఉన్న సమయంలో ఎవరూ వ్యర్థ సమయాన్ని, వ్యర్థ ఎనర్జీని (శక్తిని) వృధా చేసుకోరు. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొత్త అద్భుతాన్ని (జలవా) చూపించండి. ఢిల్లీలో నంబర్‌వన్ సేవా కేంద్రం తెరిచినట్లే, ఢిల్లీ నుండి మైక్ కూడా బయలుదేరాలి. సేవ యొక్క స్థాపన ఢిల్లీ నుండే అయింది కదా! మరియు ఢిల్లీ అనేక మంచి మంచి సేవలను ప్రాక్టికల్లోకి కూడా తీసుకువచ్చింది. సమయానుకూలంగా సేవలో సహయోగులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు ఇందులో నంబర్ తీసుకోండి. విదేశాల వాళ్లు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ మొదట ‘చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్’ (దానం ఇంటి నుండే ప్రారంభమవ్వాలి) జరగాలి కదా! మంచిది, అందరి లక్ష్యం మంచిదే, సేవపై ప్రేమ కూడా ఉంది. ఇప్పుడు కేవలం మధ్యమధ్యలో వచ్చే వ్యర్థాన్ని సమాప్తం చేసి, సమర్థవంతమైన వైబ్రేషన్ల ద్వారా సమీపానికి తీసుకురండి. అర్థమైందా, ఏం చేయాలో? చూద్దాం, ఎంత సమయంలో చేస్తారో! త్వరగా చేస్తారా లేక సమయం వచ్చినప్పుడే చేస్తారా? (జరిగే ఉంది) కానీ ఎంత టైమ్‌లో జరిగిపోతుంది? (గేట్ తెరుచుకున్నప్పుడు) గేట్ ఎవరు తెరవాలి? బ్రాహ్మణులు ఫరిశ్తాలుగా తయారైతే గేట్ తెరుచుకుంటుంది. మరి కమాల్ (అద్భుతం) చేసి చూపిస్తారా లేక అక్కడికి వెళ్లి మీ పనుల్లో బిజీ అయిపోతారా? మీకు ఎలాంటి నిమిత్త సేవ లభించినా అది అనంతమైన సేవై ఉండాలి కానీ హద్దుది కాకూడదు. కాబట్టి అనంతమైన పరివర్తన సేవలో తీవ్ర గతిని తీసుకురండి. ‘చేస్తూనే ఉన్నాం కదా, ఎంత బిజీగా ఉన్నామంటే టైమే లభించడం లేదు...’ అని అనకండి. దీనికి టైమ్ కూడా అవసరం లేదు. నిమిత్త సేవ చేస్తూ కూడా అనంతమైన సహయోగిగా కావచ్చు. మాతలు కాగలరా లేక అసలు ఖాళీయే లభించడం లేదా? సమయం లభిస్తుందా లేక పిల్లలు మాట వినడం లేదు, ఏం చేయాలి అనుకుంటున్నారా? ఎంత అనంతంలో బిజీగా ఉంటే, లభించిన డ్యూటీ అంత సహజమైపోతుంది. కాబట్టి అర్థమైందా ఏం చేయాలో? సదా మిమ్మల్ని మీరు అనంతమైన సేవాధారిగా మరియు సదా సేవాధారిగా - ప్రతి సంకల్పంలో, ప్రతి సెకనులో సేవాధారిగా తయారుచేసుకోండి. వీరిని ‘అనంతమైన సేవాధారులు’ అంటాము. అంతేకానీ నాలుగు గంటలు సేవ చేశాం అనకూడదు. లేదు, సదా సేవాధారి. చిన్న పిల్లలు కూడా సేవ చేస్తారు కదా? అచ్ఛా!
గ్రూప్ నం. 2
అన్నిటినీ తండ్రికి అప్పగించడం అంటే డబల్ లైట్‌గా అవ్వడం
సదా మిమ్మల్ని మీరు కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఎంత అతీతత ఉంటే అంత తండ్రికి ప్రియమవుతారు. ఎలాంటి పరిస్థితులు, సమస్యలు వచ్చినా సమస్యలకు ఆధీనం కాకుండా, అధికారులుగా అయి సమస్యలను దాటాలి - ఎలాగంటే ఆడుతూ పాడుతూ ఆటలాగా దాటాలి. ఆటలో సదా సంతోషం ఉంటుంది. ఎలాంటి ఆటైనా, కానీ అదొక ఆట! మరి ఎలాంటి పాత్ర అభినయిస్తున్నా లోపల సంతోషంగా ఉంటున్నారా? బయట ఏడ్చే పాత్ర ఉన్నప్పటికీ లోపల మాత్రం ‘ఇదంతా ఒక ఆట’ అనే భావన ఉందా? అలాగే ఏ విషయాలు ఎదురైనా - ఇది అనంతమైన ఆట, దీనినే డ్రామా అంటారు. డ్రామాలో మీరందరూ హీరో యాక్టర్లు, సాధారణ యాక్టర్లు కారు కదా! హీరో యాక్టర్ అంటే అక్యురేట్గా (ఖచ్చితమైన) పాత్రను అభినయించేవారు. అప్పుడే వారిని హీరో అంటారు. మరి సదా ఇది అనంతమైన ఆట అని అనుభవం చేసుకుంటున్నారా? లేక ఎప్పుడైనా ఆట మరిచిపోయి, సమస్య సమస్యగా అనిపిస్తుందా? ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉన్నప్పటికీ, ఆటగా భావిస్తే కఠినమైన సమస్య కూడా తేలికైపోతుంది. కాబట్టి ఎవరైతే అతీతంగా, ప్రియంగా ఉంటారో వారు సదా తేలికగా అనుభూతి చెందడం వల్ల డబల్ లైట్‌గా ఉంటారు. ఏ భారమూ ఉండదు. ఎందుకంటే తండ్రికి చెందినవారిగా అవ్వడం అంటే సమస్త భారాన్నీ తండ్రికి ఇచ్చేయడమే! మరి సమస్త భారాన్నీ ఇచ్చేశారా లేక కొద్దికొద్దిగా మీ దగ్గర ఉంచుకున్నారా? కొంచెం భారం మోయడం మంచిగా అనిపిస్తుందా? అన్నిటినీ తండ్రికి అప్పగించేశారా లేక కొద్దిగా పాకెట్ మనీ (జేబు ఖర్చు) ఉంచుకున్నారా? చిన్న పిల్లలు పాకెట్ మనీ ఉంచుకోరు. రోజూ వారికి జేబు ఖర్చు ఇస్తారు, తినండి, తాగండి, సరదాగా ఉండండి అంటారు. ఏదైనా వస్తువు ఉంచుకుంటే దొంగలు వస్తారు. వీరు ఐశ్వర్యవంతులు, ఏదో ఒకటి లభిస్తుంది అని తెలిసినప్పుడే దొంగతనం చేస్తారు. ఏమీ లభించదని తెలిస్తే దొంగతనం చేసి ఏం చేస్తారు? ఒకవేళ కొద్దిగా ఉంచుకున్నా దొంగ అయిన మాయ తప్పకుండా వస్తుంది, అది ఆ వస్తువునే కాక బాబా ద్వారా లభించిన శక్తులను కూడా తనతో పాటు పట్టుకుపోతుంది. అందుకే ఏదీ ఉంచుకోకూడదు, సమస్తం ఇచ్చేయాలి. డబల్ లైట్ అంటేనే సమస్తాన్ని తండ్రికి అప్పగించడం! శరీరం కూడా నాది కాదు. ఈ శరీరం సేవ కోసమే తండ్రి ఇచ్చారు. మీరందరూ వాగ్దానం చేశారు కదా - శరీరం నీదే, మనస్సు నీదే, ధనమూ నీదే అని! ఈ వాగ్దానం చేశారా లేక శరీరం నీది, మిగతాది నాది అని అన్నారా? శరీరమే నాది కానప్పుడు ఇక మిగతాది ఏముంటుంది? కాబట్టి సదా కమల పుష్పం యొక్క దృష్టాంతం స్మృతిలో ఉండాలి - నేను కమల పుష్ప సమానంగా అతీతంగా, ప్రియంగా ఉన్నాను. మీ రచన అయిన ‘కమలం’ అతీతంగా ఉండగలిగినప్పుడు, మాస్టర్ రచయితలైన మీరు దానికంటే ఎక్కువగా ఉండగలరు కదా! మరి మీరందరూ కమల పుష్ప సమానంగా అతీతంగా, ప్రియంగా ఉన్నారు కదా! ఇంకేం కావాలి, పరమాత్మకు ప్రియమైనవారిగా అయిపోయినప్పుడు ఇంకేం కావాలి! ప్రపంచంలో ఎవరు ఏ శ్రమ చేసినా, ఏ ప్రయత్నం చేసినా దేనికోసం చేస్తారు? ప్రియమైనవారిగా అవ్వడం కోసమే! ప్రేమ లభించాలి, ప్రేమను ఇవ్వాలి. మరి మీకు పరమాత్మ ప్రేమ యొక్క అధికారం లభించింది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సమస్తం ఉంటుంది, ఎక్కడ సమస్తం ఉండి ప్రేమ ఉండదో అక్కడ ఏమీ లేనట్లే! మరి మీరు ఎంత అదృష్టవంతులు! పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయ్యారు! అదీ ఎంత సహజంగా! ఏమైనా కష్టమైందా?
మాతలూ! పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకుంటున్నారా లేక పిల్లల, మనవళ్ల ప్రేమను అనుభవం చేసుకుంటున్నారా? పరమాత్మ ప్రేమలో అన్ని ప్రేమాలూ ఇమిడి ఉన్నాయి. మనవళ్ల ప్రేమ, మనవరాళ్ల ప్రేమ - అంతా ఇమిడి ఉంది, ఎందుకంటే ఆయన రచయిత కదా! రచయితలో రచన వచ్చేస్తుంది. ఏ రూపంలో స్నేహం కావాలన్నా ఆ రూపంలో స్నేహాన్ని అనుభవం చేసుకోవచ్చు. కానీ ఆత్మల ప్రేమ కాదు, పరమాత్మ ప్రేమ! మరి అలాంటి అధికారులుగా ఉన్నారు కదా? పూర్తి అధికారాన్ని తీసుకున్నారా? కొద్దిదానికే సంతుష్టపడేవారు కారు కదా! దాత ఫుల్‌గా (పూర్తిగా) ఇస్తున్నప్పుడు తక్కువ ఎందుకు తీసుకోవాలి? అచ్ఛా!
మోదీనగర్ హాస్టల్ కుమారీలతో:-
హాస్టల్ కుమారీలు ఏం కమాల్ (అద్భుతం) చేస్తున్నారు? స్కూల్లో లేదా కాలేజీలో ఎక్కడ చదువుకుంటున్నారో అక్కడ వారు మిమ్మల్ని ‘ఈ కుమారీలు అతీతంగా ప్రత్యేకంగా ఉన్నారు’ అని అనుకుంటున్నారా? లేక వారిలాగే మీరు కూడా ఉన్నారా? ఎందుకంటే బ్రహ్మాకుమారీలు అంటే ప్రత్యేకమైన కుమారీలు. కుమారీలు అందరూ ఉన్నారు, కానీ మీరు బ్రహ్మాకుమారీలు. బ్రహ్మాకుమారీలు అద్భుతం చేసేవారు. ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రత్యేక ఆత్మగా అనుభవమవ్వాలి. మరి తండ్రితో పూర్తి ప్రేమే ఉంది కదా? పక్కానా, ఏ వ్యక్తి వైపూ, వైభవం వైపూ దృష్టి లేదు కదా? ఒక్క తండ్రితో ప్రేముంటే సేఫ్‌గా ఉంటారు. తండ్రితో ప్రేమ తగ్గితే ఎక్కడో ఒకక్కడ చిక్కుకుపోతారు. మరి ఎక్కడైనా చిక్కుకునేవారు కారు కదా? చూడండి, సర్టిఫికేట్ లభిస్తుంది! అచ్ఛా, ధైర్యాన్ని ఉంచారు కాబట్టి ధైర్యం మరియు సహాయంతో ముందుకు సాగుతూ ఉండండి.
గ్రూప్ నం. 3
సర్వశక్తిమంతుడైన తండ్రితో సదా కంబైన్డ్‌గా ఉంటే సఫలత మీ వెనుకే తిరుగుతుంది
సదా మిమ్మల్ని మీరు మెరిసే సితారగా అనుభవం చేసుకుంటున్నారా? ఆకాశంలోని సితారలు అందరికీ వెలుగును ఇచ్చినట్లే, మీరు కూడా దివ్య సితారలుగా అయి విశ్వానికి వెలుగును ఇచ్చేవారు కదా! సితారలు ఎంత అందంగా ఉంటాయో! మరి మీరు దివ్య సితారలు కూడా ఎంత ప్రియమైనవారు! సితారలలో కూడా రకరకాల సితారలను వర్ణిస్తారు. ఒకటి సాధారణ సితారలు, రెండోది అదృష్ట (లక్కీ) సితారలు, మూడోది సఫలతా సితారలు. మరి మీరు ఏ సితారలు? అందరూ సఫలతా సితారలేనా! సఫలత లభిస్తుందా లేక శ్రమపడాల్సి వస్తుందా?
కంబైన్డ్‌గా తక్కువగా ఉంటారు, అందుకే సఫలత కూడా తక్కువగా లభిస్తుంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడు కంబైన్డ్‌గా ఉన్నప్పుడు శక్తులు ఎక్కడికి పోతాయి? తోడుగానే ఉంటాయి కదా! ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత ఉండకపోవడం అనేది అసంభవం. కాబట్టి సదా తండ్రితో కంబైన్డ్‌గా ఉండటంలో లోపం ఉంది, ఆ కారణం వల్లే సఫలత తక్కువగా ఉంటోంది లేదా శ్రమపడిన తర్వాత సఫలత లభిస్తోంది. ఎందుకంటే తండ్రి లభించడం అంటేనే సఫలత జన్మసిద్ధ అధికారము అని అర్థం. పేరే అధికారము అయినప్పుడు అధికారం తక్కువ లభించడం అనేది జరగదు. కాబట్టి సఫలతా సితారలు విశ్వానికి జ్ఞాన వెలుగును ఇచ్చేవారు. మాస్టర్ సర్వశక్తిమంతుడి ముందు సఫలత చుట్టూ తిరుగుతుంది. మరి కంబైన్డ్‌గా ఉంటున్నారా లేక ఎప్పుడైనా కంబైన్డ్‌గా ఉండి, ఎప్పుడైనా మాయ మిమ్మల్ని వేరు చేస్తుందా? తండ్రియే కంబైన్డ్‌గా అయినప్పుడు అలాంటి కంబైన్డ్ రూపాన్ని వదలిపెట్టడం సాధ్యమేనా? లౌకికంలో కూడా మంచి తోడు లభిస్తే వారిని వదలిపెట్టగలరా? వీరైతే అవినాశి తోడు! ఎప్పటికీ మోసం చేయని సహచరుడు! సదా తోడుగా నిలిచే సహచరుడు! మరి ఈ నషా, సంతోషం ఉన్నాయి కదా! స్వయంగా తండ్రియే నా తోడుగా ఉన్నారనే నషా ఎంత ఉంటే అంత సంతోషం ఉంటుంది. మరి సంతోషం ఉంటుందా? (చాలా ఉంటుంది) పెరుగుతూ ఉందా లేక హెచ్చుతగ్గులు అవుతుందా? ఏదైనా విషయం వస్తే తగ్గుతుందా? కొద్దిగా తగ్గుతుంది! అప్పుడు ఆలోచిస్తారు - ఏం చేస్తాం, మామూలుగా అయితే బాగానే ఉంటాం కానీ విషయమే అలాంటిది కదా అని! ఎంత పెద్ద విషయమైనా మీరు మాస్టర్ రచయితలు, విషయమనేది రచన! మరి రచయిత పెద్దదా, రచన పెద్దదా?
ఎప్పుడైనా ఏదైనా విషయానికి భయపడేవారు కారు కదా? అక్కడికి వెళ్లాక ఏదైనా విషయం వస్తే భయపడరు కదా? చూడండి, అక్కడికి వెళ్తే మాయ వస్తుంది. అప్పుడు ‘నేననుకోలేదు, ఇలా కూడా జరుగుతుందని!’ అని అనరు కదా? కొత్త కొత్త రూపాల్లో వస్తుంది, పాత రూపంలో రాదు. అయినా మీరు ధైర్యవంతులు. అనేకసార్లు అయ్యాము, ఇప్పుడు ఉన్నాము, ముందూ అవుతాము అనే నిశ్చయం ఉంది. నిశ్చయానిదే విజయం! మాస్టర్ సర్వశక్తిమంతుడిని అనే స్మృతిలో ఉండేవారు ఎప్పటికీ భయపడలేరు.
అందరూ ఎవరెడీ అయిపోయారా లేక ఇంకా కొద్దికొద్దిగా తయారవ్వాల్సి ఉందా? రేపే వినాశనం వస్తే సిద్ధంగా ఉన్నారా? లేక ఇంకా ఇది చేయాల్సి ఉందే అని ఆలోచిస్తారా? ఎవరెడీగా ఉన్నారా, సంపూర్ణంగా అయిపోయారా? (సంపూర్ణంగా అవ్వాలి) మరి ఎవరెడీ ఎలా అయినట్లు? అవ్వాల్సి ఉంది అంటే ఆలస్యం ఉన్నట్లే కదా! ఆ సమయానికి అయిపోతాంలే అని అనుకోకండి. దీని కోసం బహు కాలం యొక్క అభ్యాసం కావాలి. ఆ సమయంలో ప్రయత్నిస్తే కష్టం, కాజాలరు, నిలబడలేరు. అందుకే ఇప్పటి నుండే ఎవరెడీ సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి.
మాతలకు విశేషమైన సంతోషం ఉంది కదా - ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాము అని! ప్రపంచం వారు ఎంతగా పడేస్తే, తండ్రి అంతగా పైకి లేపారు. మాతలకు ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? అచ్ఛా! పాండవులకు ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? బిజినెస్‌లో, ఉద్యోగంలో నష్టం వస్తే? దివాళా తీస్తే? అంత పక్కాగా ఉన్నారా? ఎందుకంటే ‘తండ్రికి సచ్ఛమైన (నిజమైన) పిల్లలుగా అయితే, తండ్రి పప్పు రొట్టె తినిపిస్తూనే ఉంటారు’ అనే నిశ్చయం ఉంది. ఎక్కువగా ఇవ్వకపోయినా పప్పు రొట్టె అయితే ఇస్తారు. కావాల్సింది కూడా ఏంటి? పప్పు రొట్టెయే కదా! రొట్టె కాకపోతే అన్నమైనా లభిస్తుంది. అంత పక్కా నిశ్చయం ఉంది కదా! అంతే, ఇలాగే నిశ్చయంలో స్థిరంగా, అఖండంగా ఎగురుతూ ఉండండి.
గ్రూప్ నం. 4
శ్రేష్ఠ కర్మకు ఆధారం - శ్రేష్ఠ స్మృతి
మిమ్మల్ని మీరు సదా సంగమయుగీ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? శ్రేష్ఠ బ్రాహ్మణులు అంటే వారి ప్రతి సంకల్పం, ప్రతి సెకను శ్రేష్ఠంగా ఉంటాయి. అలా శ్రేష్ఠంగా అయ్యారా లేక ఎప్పుడైనా సాధారణంగా, ఎప్పుడైనా శ్రేష్ఠంగా ఉంటున్నారా? ఇప్పుడు సాధారణం, శ్రేష్ఠం రెండూ నడుస్తున్నాయా లేక కేవలం శ్రేష్ఠమైనవే నడుస్తున్నాయా? ఏమవుతోంది? కొద్దికొద్దిగా నడుస్తోందా? కాబట్టి, నేను ఉన్నతోన్నతుడైన శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను అనే స్మృతిని సదా ఇమర్జ్ ఉంచుకోండి.
చూడండి, నేటికాలంలో పేరుకే బ్రాహ్మణులుగా ఉన్నవారితో కూడా ఎలాంటి కార్యాలు చేయిస్తారు? ఎక్కడైనా ఏదైనా శ్రేష్ఠ కార్యం జరుగుతుంటే బ్రాహ్మణులనే పిలుస్తారు. మరి ఇది మీ యొక్క స్మృతిచిహ్నమే కదా! ఎందుకంటే శ్రేష్ఠ బ్రాహ్మణులైన మీరు సదా శ్రేష్ఠ కార్యాలే చేశారు, అందుకే ఇప్పటికీ స్మృతిచిహ్నంగా బ్రాహ్మణులే శ్రేష్ఠ కార్యానికి నిమిత్తంగా ఉన్నారు. ఒకవేళ ఏ బ్రాహ్మణుడైనా అలాంటి ఇలాంటి పని చేస్తే, ఇతను బ్రాహ్మణుడే కాదు అంటారు. కాబట్టి బ్రాహ్మణుడు అంటే శ్రేష్ఠ కార్యం చేసేవారు, శ్రేష్ఠంగా ఆలోచించేవారు, శ్రేష్ఠంగా మాట్లాడేవారు. ఏ కులమైతే ఉంటుందో కులానికి తగినట్లే కర్తవ్యం కూడా ఉంటుంది. శ్రేష్ఠ కులానికి చెందినవారు అలాఁటిఇలాంటి పనులు చేస్తే, ఏంటిది, ఇలా చేస్తున్నావు! అని సిగ్గుపడేలా చేస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నేను ఉన్నతోన్నతమైన ఆత్మను, శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను, మరి అలాంటి-ఇలాంటి పనులు ఎలా చేయగలను? ఎందుకంటే శ్రేష్ఠ కర్మకు ఆధారం శ్రేష్ఠ స్మృతి! స్మృతి శ్రేష్ఠంగా ఉంటే కర్మలు స్వతహాగానే శ్రేష్ఠమవుతాయి. కాబట్టి సదా ఈ శ్రేష్ఠ స్మృతిని ఉంచుకోండి - మేము శ్రేష్ఠ బ్రాహ్మణులము అని. ఇది సదా గుర్తుంటుందా లేక గుర్తుచేసుకోవాలా? ఎప్పుడైనా శరీరాన్ని గుర్తుచేసుకుంటారా - ‘నేను ఫలానా వాడిని, ఫలానా దాన్ని’ అని? ఎందుకంటే మరిచిపోయినప్పుడే గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా విషయం మరచిపోనప్పుడు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే, నేను బ్రాహ్మణ ఆత్మను అనేది కూడా స్వతహాగానే గుర్తుండాలి గానీ, గుర్తుచేసుకోవాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి , నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను అని స్వతహాగా మరియు సదా గుర్తుండాలి. ఎంతవరకు బ్రాహ్మణ జీవితం ఉందో అంతవరకు ఇది స్వతహాగా గుర్తుండాలి.
అచ్ఛా, మహారాష్ట్ర లేదా ఆంధ్రా వాళ్లు ఇప్పుడు ఏదైనా కొత్త విషయం చేసి చూపించండి, అప్పుడే ‘కమాల్ (అద్భుతం) చేశారు’ అని అంటాము. ఏదైనా కొత్త ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) చేసి, ఏదైనా నవీనతను చూపిస్తే - ఇది మేం కూడా చేస్తాం అని అందరూ అనాలి. ఎవరూ చేయనిదాన్ని మీరు చేసి చూపించినప్పుడే దాన్ని ‘కమాల్’ అంటాము. అందరూ చేసేదే మీరు కూడా చేస్తే దాన్ని కమాల్ అనము. తక్కువ ఖర్చు, తక్కువ సమయం మరియు రిజల్ట్ (ఫలితం) వంద రెట్ల కంటే ఎక్కువ వచ్చేలా ఏదైనా ప్లాన్ తయారుచేయండి. తక్కువ సమయంలో వందరెట్ల ఫలితం రావడాన్నే కమాల్ అంటాము. కాబట్టి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు కొత్త కార్యం చేసే వస్తారు కదా లేక ‘చేస్తాం’ అని అంటారా? ‘చేస్తాం, చేస్తాం’ అని అనరు కదా!
గ్రూప్ నం.5
ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే యుగము – సంగమయుగము (డబల్ విదేశీ సోదరసోదరీలతో)
మిమ్మల్ని మీరు పదమాపదమ భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతూ ఉందా? మరి ఎన్ని పదమాలను జమ చేసుకున్నారు? లెక్కలేనన్నా? ఎందుకంటే జమ చేసుకునే సమయము ఇప్పుడే అన్నది తెలుసు. సత్యయుగములో జమ అవ్వదు. కర్మలు అక్కడ కూడా ఉంటాయి కానీ అవి అకర్మలుగా ఉంటాయి ఎందుకంటే అక్కడి కర్మలకు ఇక్కడి కర్మ ఫలము యొక్క లెక్కతో సంబంధము ఉంటుంది. కనుక ఇక్కడున్నది జమ చేసుకునే సమయము మరియు అక్కడున్నది తినే సమయము. మరి అంతటి అటెన్షన్ ఉంటుందా? ఎన్ని జన్మలకు జమ చేసుకోవాలి? (84) జమ చేసుకోవటంలో సంతోషము ఉంటుంది కదా? కష్టమనిపించదు కదా? ఎందుకు కష్టమనిపించదు? ఎందుకంటే ప్రత్యక్ష ఫలము కూడా లభిస్తుంది. ప్రత్యక్ష ఫలము లభిస్తుందా లేక భవిష్యత్తుపై ఆధారపడి నడుస్తున్నారా? భవిష్యత్తు కంటే ప్రత్యక్ష ఫలము అతి శ్రేష్ఠమైనది. సదా శ్రేష్ఠ కర్మలు మరియు శ్రేష్ఠ ప్రత్యక్ష ఫలము లభించేందుకు సాధనమేమిటంటే - సదా ఇది గుర్తుంచుకోండి ‘‘ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు’’. ఏ విధంగా డబల్ ఫారెనర్స్ అని పేరు ఉంది, డబల్ అన్న టైటిల్ చాలా బాగుంది. కావున అన్నింటిలో డబల్ - సంతోషంలో, నషాలో, పురుషార్థములో, అన్నింటిలో డబల్. సేవలో కూడా డబల్. ఉండేది కూడా సదా డబల్గా, కంబైండ్‌గా ఉంటారు, సింగల్‌గా ఉండరు. ఎప్పుడైనా డబల్ అవ్వాలి అన్న సంకల్పము వస్తుందా? కంపెనీ కావాలా లేక కంపానియన్ కావాలా? కావాలంటే చెప్పండి. కంపానియన్ కావాలి అని అక్కడకు వెళ్ళి చెప్పకండి. ఎంతమందిని కంపానియన్‌గా చేసుకున్నా కానీ ఇటువంటి కంపానియన్ లభించరు. ఎంత మంచి కంపానియన్ అయినా కానీ అందరూ తీసుకునేవారిగానే ఉంటారు, ఇచ్చేవారిగా ఉండరు. ఈ ప్రపంచములో అటువంటి కంపానియన్ ఎవరైనా ఉన్నారా? అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మొదలైన దేశాలలో కాస్త వెతికి రండి, లభిస్తారా! ఎందుకంటే మనుష్యాత్మలు ఎంత ఇచ్చేవారిగా ఉన్నా కానీ ఇస్తూ-ఇస్తూ తప్పకుండా తీసుకుంటారు. మరి దాత కంపానియన్‌గా లభించినప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సే వస్తుంది. వీరంతా వెళ్ళేవారు కారు. ఎవరూ బలహీనంగా అయితే లేరు కదా? ఫోటో తీస్తున్నారు. మీరు ఇలా అన్నారు అని తర్వాత మీకు ఫోటో పంపిస్తాము. మేము వెళ్ళిపోవడం అనేది జరగనే జరగదు అని చెప్పండి. బాప్‌దాదా కూడా మీరందరూ లేకుండా ఒంటరిగా ఉండలేరు. అచ్ఛా!
క్రిస్మస్ లేదా పెద్ద రోజు సందర్భంగా శుభాకాంక్షలు :-
క్రిస్మస్ జరుపుకున్నారా లేక ఇంకా జరుపుకుంటారా? క్రిస్మస్ అంటేనే ఫాదర్ నుండి గిఫ్ట్ (కానుక) తీసుకోవడం. వారు క్రిస్మస్ ఫాదర్, వీరు గాడ్ ఫాదర్. మరి క్రిస్మస్ ఫాదర్ ఏమిస్తారు? చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇస్తారు. మరి గాడ్ ఫాదర్ ఏ గిఫ్ట్ ఇస్తారు? జన్మజన్మల కోసం శ్రేష్ఠమైన ప్రాప్తులకు అధికారులుగా చేస్తారు. స్వర్గాన్ని చేతికి ఇస్తారు. స్వర్గం మీ చేతిలో ఉందా? ఇది మీ చిత్రమా లేక కేవలం బ్రహ్మా బాబాదా? ఎందుకంటే చిత్రంలో అయితే ఒక్కరినే చూపిస్తారు? కానీ అధికారులు అందరూ అవుతారు. ఈ నషా ఉందా?
దీనిని పెద్ద రోజు అని జరుపుకుంటారు, కానీ మీ ప్రతి ఘడియా పెద్ద ఘడియగా మారింది. ఎందుకంటే ఒక్క సెకనులో ఎంత సంపాదన చేసుకుంటారు, కాబట్టి పెద్దదైంది కదా! మరియు క్రిస్మస్కు గుర్తుగా ఏమి చూపిస్తారు? (క్రిస్మస్ ట్రీ) మరి సంగమంలో మీకు కూడా ట్రీ జ్ఞానం లభించింది కదా. మీ ట్రీ ఎంత పెద్దది! మరి మీరు ఎక్కడ కూర్చున్నారు? కల్పవృక్షం (కల్ప ట్రీ) లోపల కూర్చున్నారు. ఈ సంగమయుగం యొక్క స్మృతిచిహ్నాన్నే ఒక రోజుగా జరుపుకుంటారు. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు లభించాయా? ఈ కలవడమే శుభాకాంక్షలు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
