‘‘హోలీ జరుపుకోవడమంటే హైయెస్ట్ మరియు హోలియెస్ట్గా అవ్వడము’’
ఈరోజు బాప్‌దాదా తమ సర్వ హైయెస్ట్ మరియు హోలియెస్ట్ (అతి ఉన్నతమైన మరియు అతి పవిత్రమైన) పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ ఈ అనంతమైన డ్రామాలో లేక సృష్టి చక్రములో అందరికంటే ఉన్నతమైనవారు కూడా మరియు అందరికంటే ఎక్కువ పవిత్రమైనవారు కూడా. ఆది నుండి ఇప్పుడు సంగమ సమయము వరకు చూడండి - ఆత్మలైన మీకంటే మరెవరైనా అతి ఉన్నతులుగా, శ్రేష్ఠంగా అయ్యారా? మీరు ఎంతగా శ్రేష్ఠ స్థితిని, శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకుంటారో అంతగా మరే ఆత్మలు, వారు ధర్మపితలైనా లేక మహానాత్మలైనా, ఎవ్వరూ కూడా ఇంతటి శ్రేష్ఠులుగా ఉండలేదు ఎందుకంటే మీరు ఉన్నతోన్నతుడైన భగవంతుని ద్వారా డైరెక్ట్ పాలనను, చదువును మరియు శ్రేష్ఠ జీవితము యొక్క శ్రీమతాన్ని తీసుకునే ఆత్మలు. మీ గురించి మీకు తెలుసు కదా? మీ అనాది కాలాన్ని చూడండి, అనాది కాలములో కూడా పరంధామములో తండ్రికి సమీపంగా ఉండేవారు. మీ స్థానము గుర్తుంది కదా? కనుక అనాది కాలములో కూడా హైయెస్ట్‌గా ఉన్నారు, సమీపంగా, తోడుగా ఉన్నారు మరియు ఆదికాలములో కూడా సృష్టి చక్రములోని సత్యయుగ కాలములో దేవ పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మలు. దేవ ఆత్మల సమయమైన ఆదికాలము కూడా సర్వ శ్రేష్ఠమైనది మరియు సాకార మనుష్య జీవితములో సర్వ ప్రాప్తి సంపన్నులు, శ్రేష్ఠమైనవారు. సృష్టి చక్రములో ఈ దేవ పదవి అనగా దేవతా జీవితమే ఎటువంటి జీవితమంటే అక్కడ తనువు, మనసు, ధనము, జనము, ఈ నాలుగు రకాలలోనూ సర్వ ప్రాప్తులు ప్రాప్తిస్తాయి. మీ దైవీ జీవితము గుర్తుందా? లేక మర్చిపోయారా? అనాది కాలము కూడా గుర్తొచ్చింది, ఆది కాలము కూడా గుర్తొచ్చింది! బాగా గుర్తు చేసుకోండి. అలా రెండు సమయాలలోనూ హైయెస్ట్‌గా ఉన్నారు కదా!
దాని తరువాత మధ్య కాలములోకి రండి. అక్కడ ద్వాపరములో ఆత్మలైన మీ జడచిత్రాలు తయారవుతాయి అనగా పూజ్య ఆత్మలుగా అవుతారు. పూజ్యులలో కూడా చూడండి, అందరికంటే విధిపూర్వకమైన పూజ దేవ ఆత్మలకే జరుగుతుంది. మీ అందరి మందిరాలు తయారయ్యాయి. డబల్ విదేశీయుల మందిరాలు తయారయ్యాయా? లేక కేవలము భారతవాసులవే తయారవుతాయా? తయారయ్యాయి కదా! ఎలా అయితే దేవ ఆత్మల పూజ జరుగుతుందో అలా మరే ఇతర ఆత్మల పూజ జరగదు. ఎవరైనా మహాత్ములు మొదలైనవారిని మందిరంలో కూర్చోబెట్టినా కానీ ఇలా భావనా పూర్వకంగా మరియు విధిపూర్వకంగా ప్రతి కర్మకు పూజ జరగటము అనేది ఉండదు. కనుక మధ్య కాలములో కూడా పూజ్య రూపములో శ్రేష్ఠమైనవారు, అతి ఉన్నతమైనవారు. ఇప్పుడు అంతిమములోకి రండి, ఇప్పుడు సంగమయుగములో కూడా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు ‘బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా’ ఆత్మలుగా అవుతారు. కనుక అనాది, ఆది, మధ్యమము మరియు అంతిమములో హైయెస్ట్‌గా అయ్యారు కదా. ఇంతటి నషా ఉందా? ఆత్మిక నషా ఉంది కదా! అభిమానము కాదు, కానీ ఇది స్వమానము, స్వమానము యొక్క నషా ఉంది. స్వ అనగా ఆత్మ యొక్క, శ్రేష్ఠ ఆత్మ యొక్క ఆత్మిక నషా ఉంది. కనుక మొత్తము చక్రములో అతి ఉన్నతమైనవారు కూడా, అలాగే అతి పవిత్రమైనవారు కూడా. ఇతర ఆత్మలు కూడా హోలీగా అనగా పవిత్రంగా అవుతారు కానీ మీ వర్తమాన సమయములోని పవిత్రత, అలాగే దేవతా జీవితములోని పవిత్రత అందరికంటే శ్రేష్ఠమైనది మరియు అతీతమైనది. ఈ సమయములో కూడా సంపూర్ణ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు.
సంపూర్ణ పవిత్రత యొక్క నిర్వచనము చాలా శ్రేష్ఠమైనది మరియు సహజమైనది కూడా. సంపూర్ణ పవిత్రతకు కల అర్థమే స్వప్నమాత్రము కూడా అపవిత్రత మనసు మరియు బుద్ధిని స్పర్శించకూడదు. ఇటువంటివారినే సత్యమైన వైష్ణవులు అని అంటాము. ఇప్పుడు నంబరువారు పురుషార్థులైనప్పటికీ పురుషార్థము యొక్క లక్ష్యము సంపూర్ణ పవిత్రతకు చెందినది. అంతేకాక సహజంగా పవిత్రతను ధారణ చేసే ఆత్మలు. ఎందుకని సహజము? ఎందుకంటే ధైర్యము పిల్లలది మరియు సహాయము సర్వశక్తిమంతుడైన తండ్రిది, కనుక కష్టతరమైనది మరియు అసంభవమైనది కూడా సంభవమైంది మరియు నంబరువారుగా అవుతూ ఉంది. కనుక హోలీ అనగా పవిత్రతలో కూడా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవము బ్రాహ్మణ ఆత్మలైన మీకు ఉంది. సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? సంపూర్ణ పవిత్రత కష్టమా లేక సహజమా? ఒక్కోసారి కష్టము, ఒక్కోసారి సహజమా? సంపూర్ణంగా అవ్వాల్సిందే, ఈ లక్ష్యము ఉంది కదా. లక్ష్యమైతే చాలా ఉన్నతమైనది కదా! లేక - ఏం ఫరవాలేదులే, అన్నీ నడుస్తాయిలే అని లక్ష్యమే ఢీలాగా ఉందా? అలా ఉండకూడదు. కొద్దో-గొప్పో అయితే జరుగుతూనే ఉంటుంది అని ఇలా ఆలోచించరు కదా. ‘‘కొద్దిగా అయితే నడుస్తుందిలే, నడిపించేద్దాము, ఎవరికేం తెలుస్తుంది, మనసునైతే ఎవరూ చూడనే చూడరు, కర్మలోకైతే రానే రాదు కదా’’ అని ఇలా ఆలోచించరు కదా? కానీ మనసులోని వైబ్రేషన్లు కూడా దాగి ఉండలేవు. అలా నడిపించేసేవారి గురించి బాప్‌దాదాకు బాగా తెలుసు. కానీ అలాగని బయటకు చెప్పరు, లేదంటే పేరు కూడా చెప్పగలరు. కానీ ఇప్పుడు అలా చెయ్యరు. నడిపించేవారు స్వయమే నడుస్తూ- నడుస్తూ, నడిపిస్తూ- నడిపిస్తూ త్రేతా వరకు చేరుకుంటారు. కానీ లక్ష్యమైతే అందరిదీ సంపూర్ణ పవిత్రతకు చెందినది.
మొత్తము చక్రంలో చూడండి, శరీరము కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉన్నది కేవలము దేవ ఆత్మలకే. ఇతరులు ఎవరు వచ్చినా, వారి ఆత్మ పవిత్రంగా అయినా గానీ శరీరమైతే పవిత్రంగా ఉండదు. ఆత్మలైన మీరు బ్రాహ్మణ జీవితములో ఎటువంటి పవిత్రులుగా అవుతారంటే, మీరు శరీరాన్ని కూడా, ప్రకృతిని కూడా పవిత్రంగా తయారుచేస్తారు, అందుకే శరీరము కూడా పవిత్రమైనది, ఆత్మ కూడా పవిత్రమైనది. ‘శరీరము’ మరియు ‘ఆత్మ’ - ఈ రెండింటి పరంగా పవిత్రంగా అయ్యే ఆ ఆత్మలు ఎవరు? వారిని చూసారా? ఎక్కడ ఉన్నారు ఆ ఆత్మలు? మీరే ఆ ఆత్మలు! మీరందరూ అటువంటివారేనా లేక కొద్దిమంది మాత్రమేనా? మేమే అలా ఉండేవారిమి, మేమే అలా తయారవుతున్నాము అన్నది పక్కా కదా. కనుక మీరు హైయెస్ట్ కూడా మరియు హోలియెస్ట్ కూడా. రెండూ కదా! అలా ఎలా అయ్యారు? ఎంతో అలౌకికమైన ఆత్మిక హోలీని జరుపుకోవటం ద్వారా హోలీ (పవిత్రం)గా అయ్యారు. ఏ హోలీని ఆడడం ద్వారా హోలియెస్ట్గా కూడా అయ్యారు మరియు హైయెస్ట్‌గా కూడా అయ్యారు?
అన్నింటికంటే అతి మంచి శ్రేష్ఠమైన రంగు ఏది? అన్నింటికంటే అవినాశీ రంగు తండ్రి సాంగత్యపు రంగు. ఎటువంటి సాంగత్యము ఉంటుందో అటువంటి రంగు అంటుకుంటుంది. మీకు ఎవరి రంగు అంటుకుంది? తండ్రిది కదా! కనుక తండ్రి సాంగత్యపు రంగు అనేది ఎంత పక్కాగా అంటుకుంటుందో అంతగానే హోలీగా అవుతారు, సంపూర్ణ పవిత్రులుగా అవుతారు. సాంగత్యపు రంగు అయితే సహజమైనది కదా! సాంగత్యములో ఉన్నట్లయితే రంగు దానికదే అంటుకుంటుంది, శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. సాంగత్యములో ఉండటము వస్తుందా? లేక డబల్ విదేశీయులకు ఒంటరిగా ఉండటము, ఒంటరితనాన్ని అనుభూతి చెందటము త్వరగా వస్తుందా? నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని అప్పుడప్పుడు కంప్లైంట్ వస్తుంది కదా. ఎందుకు ఒంటరిగా ఉంటారు? ఎందుకు ఒంటరితనాన్ని అనుభవం చేస్తారు? అలవాటు వల్లనా? బ్రాహ్మణ ఆత్మలు ఒక్క క్షణము కూడా ఒంటరిగా అవ్వలేరు. అవ్వగలరా? (అవ్వలేరు) ఒంటరిగా అవ్వకూడదు కానీ అలా అవుతారు! బాప్‌దాదా స్వయంగా తమ సహచరులుగా చేసుకున్నారు, మరి ఒంటరిగా ఎలా అవ్వగలరు! చాలామంది పిల్లలు ఏమంటారంటే - తండ్రిని కంపానియన్ (సహచరుని)గా అయితే చేసుకున్నాము కానీ సదా కంపెనీ (తోడు) ఉండదు. ఎందుకని? కంపానియన్‌గా చేసుకున్నారు, అదైతే చాలా మంచిది. మీ కంపానియన్ ఎవరు అని అందరినీ అడుగుతారు? అప్పుడు ‘బాబా’ అనే అంటారు కదా.
బాప్‌దాదా చూసారు – కంపానియన్‌గా చేసుకోవటం వలన కూడా పని అవ్వకపోతే, అప్పుడప్పుడు మళ్ళీ ఒంటరిగా అయిపోతారు. ఇప్పుడు ఇంకే యుక్తిని అలవర్చుకోవాలి? కంపానియన్‌గా చేసుకున్నారు కానీ కంబైండ్‌గా అవ్వలేదు. కంబైండ్ స్వరూపము ఎప్పుడూ వేరవ్వదు. కంపానియన్ (సహచరుని)తో అప్పుడప్పుడు సరదాగా గొడవలు కూడా వస్తుంటాయి కనుక వేరవుతారు. అప్పుడప్పుడు ఇటువంటి సంగతులేవైనా జరుగుతుంటాయి కదా, అప్పుడు తండ్రి నుండి వేరవుతారు. కనుక కంపానియన్‌గా అయితే చేసుకున్నారు కానీ కంపానియన్ను కంబైండ్ రూపములో అనుభవము చెయ్యండి. వేరుగా అవ్వనే అవ్వలేరు, కంబైండ్ రూపముగా ఉన్న నన్ను వేరు చెయ్యగల శక్తి ఎవ్వరికీ లేదు, ఇటువంటి అనుభవాన్ని పదే-పదే స్మృతిలోకి తీసుకువస్తూ-తీసుకువస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. పదే-పదే చెక్ చేసుకోండి – కంబైండ్‌గా ఉన్నానా, పక్కకు వచ్చేయలేదు కదా? కంబైండ్ రూపము యొక్క అనుభవాన్ని ఎంతగా పెంచుకుంటూ వెళ్తారో, అంతగా బ్రాహ్మణ జీవితము చాలా ప్రియమైనదిగా, మనోరంజక జీవితముగా అనుభవమవుతుంది. మరి అటువంటి హోలీని జరుపుకోవటానికి వచ్చారు కదా. లేక కేవలము రంగుల హోలీని జరుపుకుని హోలీ అయిపోయింది అని అంటారా? సదా గుర్తుంచుకోండి - సాంగత్యపు రంగు యొక్క హోలీతో హోలియెస్ట్గా మరియు హైయెస్ట్‌గా సహజంగా అవ్వాలి. ఇది కష్టము కాదు, సహజము. పరమాత్మ సాంగత్యము ఎప్పుడూ కష్టాన్ని అనుభవము చేయించదు. బాప్‌దాదాకు కూడా పిల్లలు శ్రమపడటము లేక కష్టాన్ని అనుభవము చెయ్యటము మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తిమాన్ మరియు సర్వశక్తిమాన్ యొక్క కంబైండ్ రూపము, ఇక కష్టము ఎలా ఉండగలదు! తప్పకుండా ఏదైనా నిర్లక్ష్యము లేక సోమరితనము లేక పాత, గత జీవిత సంస్కారాలు ఇమర్జ్ అయినప్పుడు కష్టమనిపిస్తుంది. మరజీవులుగా అయినప్పుడు పాత సంస్కారాల మృత్యువు కూడా జరిగింది, పాత సంస్కారాలు ఇమర్జ్ అవ్వలేవు. పూర్తిగా మర్చిపోండి, అవి పాత జన్మకు చెందినవి, బ్రాహ్మణ జన్మలోనివి కావు. పాత జన్మ సమాప్తమైనప్పుడు, కొత్త జన్మను ధారణ చేసినప్పుడు, ఇక కొత్త జన్మ, కొత్త సంస్కారాలు.
ఒకవేళ మాయ పాత సంస్కారాలను ఇమర్జ్ చేయించినా కూడా ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా ఇతరుల వస్తువును మీకు ఇచ్చినట్లయితే మీరు దానినేమి చేస్తారు? ఉంచుకుంటారా? స్వీకరిస్తారా? ఇది నా వస్తువు కాదు, ఇతరుల వస్తువును నేను ఎలా తీసుకోగలను? అని ఆలోచిస్తారు. ఒకవేళ మాయ పాత జన్మ సంస్కారాలను ఇమర్జ్ చేసే రూపములో వచ్చినా కూడా, అది మీ వస్తువైతే కాదు. ఇది నా వస్తువు కాదు, ఇది పరాయివారిది అని ఆలోచించండి. పరాయి వస్తువును సంకల్పములో కూడా తమదిగా భావించలేరు. భావించగలరా? ఆలోచించండి, పరాయి వస్తువు తప్పకుండా మోసగిస్తుంది, దుఃఖాన్నిస్తుంది. ఇలా ఆలోచించి ఆ క్షణమే పరాయి వస్తువును వదిలేయండి, విసిరేయండి అనగా బుద్ధి నుండి తీసెయ్యండి. పరాయి వస్తువును మీ బుద్ధిలో ఉంచుకోకండి. లేదంటే అది వ్యాకులపరుస్తూ ఉంటుంది. సదా ఇదే ఆలోచించండి - బ్రాహ్మణ జీవితములో తండ్రి ఏమేమి ఇచ్చారు, బ్రాహ్మణ జీవితము యొక్క అనగా నా అసలైన స్వభావము, సంస్కారము, వృత్తి, దృష్టి, స్మృతి ఎటువంటివి? ఇవి నిజమైనవి, అవి పరాయివి. ఇతరుల సామాగ్రి మంచిగా అనిపిస్తుందా లేక మీ సామాగ్రి మంచిగా అనిపిస్తుందా? అది రావణుని సామాగ్రి మరియు ఇది తండ్రి సామాగ్రి, ఏది బాగా అనిపిస్తుంది? ఎప్పుడూ పొరపాటున కూడా, సంకల్పములో కూడా ఇలా రానివ్వకండి - ‘‘ఏం చెయ్యాలి, నా స్వభావమే అటువంటిది, నా సంస్కారమే అటువంటిది? ఏం చెయ్యాలి? సంస్కారాలను తొలగించుకోవటము చాలా కష్టము’’. అవి మీవి కానే కావు. నావి అని ఎందుకు అంటారు? నావి కానే కావు. రావణుని వస్తువును నాది అని అంటారా! నాదిగా చేసుకుంటారు కదా, అప్పుడే ఆ సంస్కారము కూడా - వీళ్ళు నన్ను తనవారిగా అయితే చేసుకున్నారు, కనుక ఇప్పుడు చాలా మంచిగా నన్ను పాలన చెయ్యండి అని అంటుంది. నిజ సంస్కారాలను, నిజ స్వభావాన్ని ఇమర్జ్ చెయ్యండి, అప్పుడు అవి స్వతహాగానే మర్జ్ అయిపోతాయి. ఏం చెయ్యాలో అర్థమైందా?
మరి ఇటువంటి హోలీని జరుపుకోవటానికి వచ్చారు కదా. వారు హోలీ ఉంది అని ఒకరోజు అంటే, మరుసటి రోజు హోలీ అయిపోయింది అని అంటారు. మరి మీరేమంటారు? మీరు అంటారు - మేము సదా సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకుంటున్నాము మరియు హోలీగా అయ్యాము. హోలీని జరుపుకుంటూ-జరుపుకుంటూ హోలీగా అయిపోయారు. హోలీని జరుపుకున్నారా లేక జరుపుకోవాలా? ఎప్పటినుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటినుండే హోలీని జరుపుకుంటున్నారు ఎందుకంటే సంగమయుగ సమయమే సదా ఉత్సవాల సమయము. ప్రపంచములోని వారైతే అదనంగా డబ్బులను ఖర్చు పెట్టి ఆనందాలను జరుపుకుంటారు. కానీ మీరు సదా ప్రతి క్షణము ఆనందాన్ని జరుపుకునేవారు, ప్రతి క్షణము నాట్యం చేస్తూ-పాడుతూ ఉంటారు. సదా సంతోషములో నాట్యము చేస్తారా లేక కల్చరల్ ప్రోగ్రాములు ఉన్నప్పుడే నాట్యం చేస్తారా? సదా నాట్యం చేస్తూ ఉంటారు కదా? సదా తండ్రి మహిమను మరియు మీ ప్రాప్తుల పాటలను పాడుతూ ఉండండి. అందరికీ పాడడం వస్తుంది కదా. అందరూ పాడగలరు, అందరూ నాట్యం చేయగలరు. సదా నాట్యం చేయడం, పాటలు పాడటం కష్టమా? ఇది సహజము మరియు సదా సహజముగా అనుభవము చేస్తూ సంపన్నంగా అవ్వాల్సిందే. ఎప్పుడూ ఇలా ఆలోచించకండి - ఏమో తెలియదు, మేము సంపన్నంగా అవుతామో లేదో. ఇటువంటి బలహీన సంకల్పాలను ఎప్పుడూ రానివ్వకండి. సదా ఇదే ఆలోచించండి - అనేక సార్లు నేనే అయ్యాను మరియు నేనే అవ్వాల్సిందే. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా పరమాత్మ సాంగత్యపు రంగు అనే హోలీని జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సృష్టి చక్రములో సదా హైయెస్ట్ పాత్రను పోషించే శ్రేష్ఠ ఆత్మలకు, సర్వాత్మల కంటే శ్రేష్ఠమైన హైయెస్ట్ ఆత్మలకు, సదా కంబైండ్‌గా ఉండే పదమాపదమ భాగ్యవాన్ ఆత్మలకు, సదా సర్వుల కష్టాన్ని కూడా సహజం చేసే బ్రాహ్మణ ఆత్మలకు, సదా కొత్త జన్మ యొక్క కొత్త స్వభావ-సంస్కారాలు, కొత్త ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే ఎగిరే కళ యొక్క అనుభవీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
జానకి దాదీజీతో బాప్‌దాదా యొక్క వరదానీ మహావాక్యాలు
మంచిగా నడుస్తున్నారు కదా. రథాన్ని నడిపించే పద్ధతి వచ్చేసింది. దాదీలను మంచిగా ఉండడం చూస్తే సంతోషపడతారు. శరీరము గురించి కూడా నాలెడ్జ్‌ఫుల్, ఆత్మ గురించి కూడా నాలెడ్జ్‌ఫుల్. వెనుకటి లెక్కాచారాన్ని సమాప్తము చేసుకోవలసే ఉంటుంది కానీ నాలెడ్జ్ ఫుల్ అవ్వడం వలన అది సహజంగా సమాప్తమైపోతుంది. పద్ధతి వస్తుంది కదా. నడవడానికి మరియు నడిపించడానికి, రెండు పద్ధతులూ వస్తాయి. ఎంతైనా సేవ బలము కూడా ఆశీర్వాదాలుగా పని చేస్తుంది. ఈ ఆశీర్వాదాలు ఔషధంలా పని చేస్తున్నాయి. త్వరత్వరగా తయారైపోతే సేవ చేయవచ్చు అని సేవ యొక్క ఉల్లాసమైతే వస్తుంది కదా. కనుక ఆ ఉల్లాసమేదైతే వస్తుందో, ఆ ఉల్లాసము శూలము నుండి ముల్లులా చేస్తుంది. మంచిది, అయినా ధైర్యము బాగుంది.
(సభతో) నిమిత్త ఆత్మలను చూసి సంతోషిస్తారు కదా. ఇప్పుడు అవ్యక్త సంవత్సరములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అద్భుతాన్ని చేసి చూపించండి. సేవలో అద్భుతము జరుగుతూ ఉంది, అదైతే జరిగేదే ఉంది. కానీ వ్యక్తిగత పురుషార్థములో ఎటువంటి అద్భుతాన్ని చూపించండంటే, అది చూసేవారు అవును, అద్భుతము అని అనాలి! అద్భుతము అని ఇతరుల నోటి నుండి రావాలి. నడుస్తున్నాను కదా, ముందుకైతే వెళ్తున్నాను కదా అని కేవలము ఇంతమాత్రమే అనుకోకూడదు. కానీ ఏ అద్భుతము చేసారు? ఎవరైనా అసంభవాన్ని సంభవము చేసి చూపిస్తే, కష్టాన్ని సహజము చేసి చూపిస్తే, అప్పుడు దానిని అద్భుతము అని అంటారు. ఎవరి స్వప్నములో కూడా లేనిదానిని సాకారములో చేసి చూపించినట్లయితే దానిని అద్భుతము అని అంటాము. సమయ ప్రమాణంగా అద్భుతము జరగటమనేది వేరే విషయము. అదైతే జరగాల్సిందే, జరిగే ఉంది. కానీ స్వయము యొక్క అటెన్షన్‌తో ఏదైనా అటువంటి అద్భుతాన్ని చేసి చూపించండి. బ్రహ్మా బాబా అవ్యక్తమై 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎవరి ఉత్సవాన్ని అయినా జరిపేటప్పుడు, ఎవరిదైతే జరుపుతున్నారో వారికి ఇష్టమైన ఏదో ఒక కానుకను ఇవ్వటం జరుగుతుంది. బ్రహ్మా బాబాకు ఇష్టమైనదేంటి? అదైతే తెలుసు కదా. ఏదైతే స్వయానికి కూడా కష్టమనిపిస్తుందో, అది ఎలా సహజమవ్వాలంటే దానిని స్వయము కూడా అనుభవం చేయాలి, అప్పుడు అది అద్భుతము. సరేనా? ఏమి చేస్తారు? తండ్రికి ఇష్టమైనది చేసి చూపించండి. ఏమేమి ఇష్టము అన్నదైతే తెలుసు కదా. తండ్రికి ఏమి ఇష్టము, తెలుసు కదా. అచ్ఛా! ఏ ఏ కానుకలను ఇస్తారో చూస్తాము. ఎలా అయితే స్థూలమైన కానుకలను చాలా ప్రేమతో తీసుకువస్తారు కదా. మంచిది, డబల్ విదేశీయులు తమ భాగ్యాన్ని మంచిగా ప్రాప్తి చేసుకుంటున్నారు. వృద్ధి చేస్తున్నారు కదా. వృద్ధి చేసేవారు ముందుగా తపస్యతోపాటు త్యాగము కూడా చెయ్యవలసి ఉంటుంది. వృద్ధి జరుగుతుంటే సంతోషిస్తారు కదా లేక మాకు తక్కువైపోతుంది అని భావిస్తారా? మంచిది, మంచిగా వృద్ధి చేస్తున్నారు. మాకు తక్కువవుతుంది అని ఇలా ఆలోచించకండి. పెరుగుతూ ఉంది. మొత్తము సూక్ష్మవతనపు మెషినరీ నడుస్తూ ఉంది.
డబల్ విదేశీ సోదర-సోదరీమణుల వేర్వేరు గ్రూపులతో అవ్యక్త బాప్‌దాదా యొక్క పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1
స్థూల కర్మలు చేస్తూ కూడా మనసా ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవ చేయండి
అందరూ సదా తమను తాము విశ్వంలోని సర్వాత్మలకు కళ్యాణకారీ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? రోజంతా విశ్వ కళ్యాణ కార్యంలో బిజీగా ఉంటున్నారా లేక రెండు-నాలుగు గంటలా? ఎంతటి స్థూల కార్యం ఉన్నప్పటికీ, స్థూల కార్యం చేస్తూ కూడా మనసా ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవ చేయవచ్చు. ఎందుకంటే ఎవరి కార్యం ఏదైతే ఉంటుందో, వారు ఎక్కడున్నా కానీ తమ కార్యాన్ని ఎప్పుడూ మరచిపోరు. ఉదాహరణకు, ఒక వ్యాపారి ఉంటే స్వప్నంలో కూడా తన వ్యాపారాన్నే చూస్తాడు. అలాగే మీ వ్యాపారమే విశ్వ కళ్యాణం చేయడం. మిమ్మల్ని ఎవరైనా ‘మీ ఆక్యుపేషన్ (వృత్తి) ఏమిటి?’ అని అడిగితే టైపిస్ట్ అనో, ఇంజనీర్ అనో లేదా బిజినెస్‌మ్యాన్ అనో అంటారా? అది కేవలం నిమిత్తమాత్రం, కానీ సదా విశ్వ-కళ్యాణకారీ అనే ఆక్యుపేషన్ యొక్క స్మృతి ఉండిపోతుంది. మీకు లభించిన కార్యం ఎంత పెద్దదంటే ఇతర విషయాలలోకి వెళ్ళడానికి అసలు సమయమే దొరకదు. ఇలా బిజీగా ఉంటున్నారా? మనస్సు-బుద్ధి బిజీగా ఉంటున్నాయా? ఎప్పుడైనా ఖాళీగా ఉంటున్నాయా? సదా మనస్సు-బుద్ధితో బిజీగా ఉంటే మాయాజీతులుగా అయిపోయినట్లే! ఎందుకంటే మాయకు కూడా సమయం కావాలి కదా. మీకు సమయమే లేనప్పుడు మాయ ఏమి చేస్తుంది? మిమ్మల్ని బిజీగా చూసి వచ్చే మాయ స్వతహాగానే వెనక్కి తిరిగిపోతుంది. మరి మాయాజీతులుగా అయ్యారా? మనస్సు-బుద్ధిని ఖాళీగా ఉంచడం అంటే మాయను ఆహ్వానించడమే!
వర్తమాన సమయంలోని విశేష మాయ ఏమిటంటే - వ్యర్థంగా ఆలోచించడం, వ్యర్థంగా మాట్లాడడం, వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకోవడం. కాబట్టి ఈ మాయ మధ్యమధ్యలో వస్తూ ఉంటుంది కదా, దానర్థం మీరు ఖాళీగా ఉంటున్నారన్నమాట! అందరికంటే పెద్ద బిజినెస్‌మ్యాన్ లేదా ఇండస్ట్రియలిస్ట్ మీరే. ఎవరికైనా ఎంత పెద్ద వ్యాపారమున్నా, ఫ్యాక్టరీ ఉన్నా వారు సంపాదిస్తే ఎంత సంపాదిస్తారు? రోజుకు ఒక కోటి సంపాదించినా, రోజంతా మీ సంపాదన ఎంత ఉంది? (అనంతమైన సంపాదన). అంత గొప్పవారు కదా మీరు! ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు వేరే వైపు బుద్ధి వెళ్ళడానికి అసలు సమయమే ఉండదు. మరి మీ మనస్సు లేదా బుద్ధి వేరే ఎక్కడికైనా వెళ్ళగలవా? వెళ్ళలేవు! కాబట్టి మాయాజీతులుగా అయిపోయారు కదా! మాయ రావడం, దానిని మీరు తరిమికొట్టడం... ఆ రోజులు దాటిపోయాయి. ఇప్పుడు సదా బిజీగా ఉండండి, అప్పుడు ఏ కంప్లైంట్ (ఫిర్యాదు) ఉండదు. అందరికంటే సహజమైన సాధనం ఏమిటంటే బిజీగా ఉండడమే. దీనివల్ల ఒకటి మాయాజీతులుగా అవుతారు, రెండవది సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాప్తిలో సంతోషం ఉంటుంది కదా! ఇక ఏమి కావాలి? సంతోషమే కావాలి కదా! బిజీగా ఉండడం వల్ల మాయ రాదు, సంతోషము పోదు.
పిల్లలను చూసి బాప్‌దాదాకు సంతోషమవుతుంది - వీరు ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ నంబర్లో వస్తారు. ‘ఫస్ట్’ అనేది ఒకటా లేక చాలా ఉంటాయా? ఫస్ట్ డివిజన్లో వస్తారు. ధైర్యం చాలా బాగుంది, అందుకే ఎక్స్ట్రా సహాయం కూడా లభిస్తోంది. అలా అనుభవం చేసుకుంటున్నారు కదా! (తుపాకీ గుండు కంటే వేగంగా వెళ్తున్నారు)... ఈ రోజుల్లో తుపాకీ గుండు వేగం ఏమీ కాదు, రాకెట్ వేగంగా వెళ్తుంది. రాకెట్ కంటే వేగంగా! సోల్ (ఆత్మ) రూపంలో స్థితమవ్వడం అనగా వేగంగా కావడం. ఫాస్ట్‌గా వెళ్ళాల్సిందే! సేవలు రకరకాలుగా చేస్తున్నారు, కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్‌లు చేసి, ఉదాహరణకు యోగ శిబిరాలలో అనుభవం చేయించినట్లుగా రిట్రీట్ ప్రోగ్రామ్‌లను చేయాలి. అన్ని చోట్లా అనుభవం చేయించండి. కేవలం విని వెళ్ళిపోకూడదు, అనుభవం చేసుకుని వెళ్ళాలనే అటెన్షన్ ఉంచండి. అచ్ఛా! అందరూ ఏమి గుర్తుంచుకుంటారు? మీరు ఎవరు? నడుస్తూ-తిరుగుతూ మీ ఆక్యుపేషన్ గుర్తుంచుకోండి - నేను ప్రతి సమయం విశ్వ కళ్యాణకారీ ఆత్మను, కాబట్టి విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా అవ్వాలి. అచ్ఛా!
గ్రూప్ నం. 2
శరీరం పోయినా కూడా సంతోషం పోకూడదు - ఈ దృఢ ప్రతిజ్ఞ చేయండి
సదా మిమ్మల్ని మీరు పదమాపదమ భాగ్యశాలురుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే తండ్రి ద్వారా వారుసత్వము లభించింది. మరి వారుసత్వములో ఎన్ని అవినాశి ఖజానాలు లభించాయి! ఖజానాలే అవినాశిగా ఉన్నప్పుడు, భాగ్యం యొక్క స్మృతి కూడా అవినాశిగా ఉండాలి కదా! అవినాశి అంటే అర్థం ఏమిటి? సదానా లేక ఎప్పుడైనానా? సదా మేము పదమాపదమ భాగ్యశాలి ఆత్మలము - ఈ స్మృతిని ఉంచుకోండి మరియు ఖజానాలను సదా ఎదురుగా ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి. ఎన్ని ఖజానాలు లభించాయి! ఒకవేళ సదా ఖజానాలను ఎదురుగా ఉంచుకుంటే, నషా లేదా సంతోషం కూడా సదా ఉంటాయి, ఎప్పుడూ తగ్గడం-పెరగడం ఉండవు, అనంతంగా ఉంటాయి. కాబట్టి ఖజానాలను పెంచండి, ఇమర్జ్ రూపంలో కూడా ఉంచుకోండి. పెంచే సాధనం ఏమిటి? ఎంత పంచితే అంత పెరుగుతుంది! ఈరోజు ఖజానాను పెంచానా లేక ఎంత ఉందో అంతే ఉందా? అని సదా ఆలోచించండి. ఖజానా ఎంత పెరిగితే, పెరిగే కొద్దీ సంతోషం పెరుగుతుంది. పెరుగుతూపోతున్నాయి కదా! ఎందుకంటే ఈ ఖజానాలు సదా సంతోషాన్ని పెంచేవి. అందుకే ఎప్పుడూ సంతోషం తగ్గకూడదు. ఎంత పెద్ద విఘ్నం వచ్చినా, ఆ విఘ్నం సంతోషాన్ని తగ్గించకూడదు. ఎలాంటి విఘ్నమైనా మీ సంతోషాన్ని తగ్గించడం లేదు కదా? శరీరం పోయినా సంతోషం పోకూడదు అని బాప్‌దాదా ముందే చెప్పారు. అంతటి దృఢ ప్రతిజ్ఞ మీతో మీరు చేసుకున్నారా? కాబట్టి సంతోషం పోదు అని సదా దృఢ సంకల్పం చేయండి. బ్రాహ్మణ జీవితానికి ఆధారమే ‘సంతోషం’. సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు. బ్రాహ్మణ జీవితం అనగా సంతోషంగా ఉండడం మరియు ఇతరులకు సంతోషాన్ని పంచడం. వర్తమాన సమయంలో అందరికీ అవినాశి సంతోషం అవసరముంది, సంతోషానికి బికారులుగా ఉన్నారు. మీరు దాత యొక్క పిల్లలు! దాత పిల్లల పని ఇవ్వడమే. సంబంధ-సంపర్కాల్లోకి ఎవరు వచ్చినా సంతోషాన్ని పంచుతూ ఉండండి, ఇస్తూ ఉండండి. ఎవ్వరూ ఖాళీగా వెళ్ళకూడదు. అంత నిండుగా ఉన్నారు కదా!
మాస్టర్ దాతగా అయి ఏమైనా ఇస్తున్నానా లేక నాలోనే నేను సంతోషంగా ఉన్నానా? అని ప్రతి సమయం చెక్ చేసుకోండి. ఏ సమయంలో ఎవరికి ఏ వస్తువు అవసరమో, ఆ అవసరమైన సమయంలో ఆ వస్తువును వారికందిస్తే వారి హృదయం నుండి ఆశీర్వాదాలు వెలువడతాయి. ఆ దీవెనలు కూడా మిమ్మల్ని సహజ పురుషార్థీలుగా చేయడంలో సహయోగిగా మారతాయి. కాబట్టి మీ బాధ్యత దీవెనలు ఇవ్వడం మరియు దీవెనలు తీసుకోవడం. దీనిలోనే బిజీగా ఉంటున్నారు కదా! మొత్తం విశ్వానికి ఇది అవసరం. కాబట్టి ఎంత పని ఉందో చూడండి! లేదా, మేము ఎక్కడ ఉంటున్నామో ఆ దేశానికే ఇవ్వాలి అని అనుకుంటున్నారా? విశ్వానికి ఇచ్చే దాతలు మీరు. విశ్వ మహారాజన్గా అవ్వాలి కదా! లేదా స్టేట్స్ (రాష్ట్రాల) రాజుగా అవ్వాలా? విశ్వానికి ఇస్తేనే కదా విశ్వ మహారాజన్గా అవ్వగలరు! మరి మీ దేశంలో ఉంటూ విశ్వానికి ఎలా ఇస్తారు? మనసా సేవ చేయడం వచ్చా? లేక వ్యర్థ సంకల్పాలు మనస్సులో నడుస్తున్నాయా? వ్యర్థ సంకల్పాలు మనస్సులో ఉన్నప్పుడు మనసా సేవ చేయగలరా? కాబట్టి సదా మనసా సేవ చేస్తున్నారా లేక ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు కూడా వచ్చేస్తున్నాయా?
మనస్సు-బుద్ధిని ఎంతగా బిజీగా ఉంచాలంటే వ్యర్థ సంకల్పాలు రానే కూడదు. వ్యర్థ సంకల్పాలు రావడం, ఆ తర్వాత తరిమికొట్టడం అంటే టైమ్ వేస్ట్ అయిపోతుంది! వేస్ట్ థాట్స్ (వ్యర్థ సంకల్పాలు) రాకుండా ఉండటానికి విధి ఏమిటంటే - మీ మనస్సును సదా మనసా, వాచా మరియు కర్మణా సేవలో బిజీగా ఉంచడం. మనస్సును బిజీగా ఉంచడానికి ప్రతిరోజూ మురళి ఒక సాధనం. ప్రతిరోజూ మురళి వింటున్నారు, చదువుతున్నారు. కాబట్టి బిజీగా ఉంచుతున్నారు కదా! అలా వేస్ట్ సమాప్తము! ఎందుకంటే ఇప్పటి నుండే వేస్ట్‌ను సమాప్తము చేస్తే ఫైనల్ సమయం వచ్చినప్పుడు పాస్ అవ్వగలరు. లేకపోతే వ్యర్థ సంకల్పాలు నడిచే అభ్యాసమే ఉంటే సమయానికి పాస్ అవ్వలేరు. మరి పాస్ విత్ ఆనర్‌గా అయ్యేవారా లేక కేవలం పాస్ అయ్యేవారా? సదా పాస్ విత్ ఆనర్‌గా అయ్యే లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుని అభ్యాసం చేయండి. అచ్ఛా!
గ్రూప్ నం. 3
హృదయ సింహాసనాధికారులుగా అవ్వడానికి స్మృతి యొక్క తిలకధారులుగా అవ్వండి
సదా మిమ్మల్ని మీరు తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఇలాంటి సింహాసనం పూర్తి కల్పంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, ఇంకెప్పుడూ లభించదు. శ్రేష్ఠమైన విషయం మరియు లభించడం కూడా ఒకే ఒక్కసారి అయినప్పుడు ఆ సింహాసనాన్ని ఎప్పుడూ వదలకుండా ఉండాలి. ఎవరైతే తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారో, సదా ఉంటారో... ఆ సింహాసనాధికారి గుర్తు ఏమిటి? సింహాసనంపై కూర్చోవడం వల్ల ఏమవుతుంది? సింహాసనంపై కూర్చుంటే తమను తాము నిశ్చింత చక్రవర్తులుగా అనుభవం చేసుకుంటారు. మరి సదా నిశ్చింతగా ఉంటున్నారా లేక ఎప్పుడైనా కొద్దిగా చింత వస్తోందా - అది స్వయం కొరకైనా, సేవ కొరకైనా, ఇతరుల కొరకైనా? సదా హృదయ సింహాసనంపై కూర్చునే ఆత్మ నషాలో ఉంటుంది, నషా ఉండడం వల్ల స్వతహాగానే నిశ్చింతగా ఉంటుంది. ఎందుకంటే ఈ సింహాసనంలో ఉన్న విశేషత ఏమిటంటే - ఎవరు హృదయ సింహాసనాధికారిగా ఉంటారో వారు అన్ని విషయాలలో నిశ్చింతగా ఉంటారు. ఈ రోజుల్లో కూడా కొన్ని స్థానాలకు విశేషమైన కొత్తదనము, విశేషత లభించి ఉంటాయి కదా! అలాగే హృదయ సింహాసనము యొక్క విశేషత ఏమిటంటే అక్కడ చింత రానే రాదు. మరి కిందకు ఎందుకు వస్తారు? పని చేయడానికి కిందకు రావలసి వస్తోందా? హృదయ సింహాసనమునకు ఈ వరదానం కూడా లభించింది - ఏ పని చేస్తున్నా కానీ హృదయ సింహాసనాధికారిగా ఉండవచ్చు. మరి సదా ఎందుకు ఉండలేకపోతున్నారు?
ఇంకేమైనా అట్రాక్షన్ (ఆకర్షణ) ఉందా? లేదు కానీ అయిపోతోంది. ఎప్పుడైనా ఏ విషయమైనా ఎదురుగా వస్తే వెంటనే హృదయ సింహాసనాధికారిగా అయిపోండి, అప్పుడు ఏ విషయమూ మిమ్మల్ని తనవైపు ఆకర్షించదు. కూర్చునే అభ్యాసం ఉందా లేక మధ్యమధ్యలో అభ్యాసాన్ని మరచిపోతున్నారా? సింహాసనాధికారిగా అవ్వడానికి తిలకధారిగా కూడా అవ్వాల్సిందే. తిలకం ఏది? స్మృతి యొక్క తిలకం! తిలకం ఉంటే సింహాసనాధికారి, తిలకం లేకపోతే సింహాసనం లేదు. అవినాశి తిలకం దిద్దబడి ఉందా? లేక ఎప్పుడైనా చెరిగిపోతూ, ఎప్పుడైనా దిద్దబడుతోందా? అవినాశి తిలకమే కదా! స్మృతి తిలకం దిద్దబడి సింహాసనాధికారిగా ఉంటే సదా స్వయం కూడా నషాలో ఉంటారు, ఇతరులకు కూడా నషాను స్మృతి చేయిస్తారు. తిలకం దిద్దుకోవడం కష్టమా లేక సహజమా? సదా ఈజీనే కదా! ‘సదా’ అనే మాట వినగానే నవ్వుతారు. ఒకవేళ బాప్‌దాదా మిమ్మల్ని, 21 జన్మలలో ఎప్పుడైనా రాజ్యాధికారిగా, ఎప్పుడైనా ప్రజాగా అవ్వండి, పూర్తి రాజ్యాధికారిగా అవ్వకండి అని అడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు! కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఉంది. ఎందుకంటే భవిష్యత్తు యొక్క ఆధారం వర్తమానం పైనే ఉంది. ఇప్పుడు సదా సింహాసనాధికారిగా ఉంటే అక్కడ కూడా సదా రాజ్యాధికారిగా అవుతారు. కాబట్టి ‘సదా’ అనే పదాన్ని అండర్లైన్ చేయండి. పిల్లలు ఎప్పుడైనా తండ్రి వారసత్వము మరచిపోతారా ఏమిటి! కాబట్టి ఈ హృదయ సింహాసనము కూడా తండ్రి వారసత్వమే, కాబట్టి వారసత్వమును సదా తోడే ఉంటుంది కదా! ఏమి గుర్తుంచుకుంటారు? మీరు ఎవరు? నిశ్చింత చక్రవర్తులు. పదే పదే ఈ స్మృతిని ఇమర్జ్ చేస్తూ ఉండండి. మేము సాధారణ ఆత్మలము కాదు, విశేష ఆత్మలము అనే నషా సదా ఉండాలి. మీలాంటి విశేష ఆత్మలు మొత్తం విశ్వంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమందిలో మీరు ఉన్నారు అనే సంతోషంలో సదా ఉండండి. అచ్ఛా!
గ్రూప్ నం. 4
కష్టానికి కారణం స్వయం బలహీనతే, అందుకే మాస్టర్ సర్వశక్తిమాన్గా అవ్వండి
అందరూ తమను తాము సహజయోగులుగా అనుభవం చేసుకుంటున్నారా? సహజమైన విషయం సదా సహజంగానే ఉంటుంది, లేక ఎప్పుడైనా కష్టమవుతుందా? యోగం కష్టమా లేక మీరే కష్టం చేసుకుంటున్నారా? మరి ఎందుకు కష్టం చేసుకుంటున్నారు? కష్టంగా ఉండడం బాగుంటుందా? స్వయంలో ఏదో ఒక బలహీనత తెచ్చుకున్నప్పుడు కష్టమైపోతుంది. బలహీనతే కష్టంగా మారుస్తుంది. మరి బలహీనతను ఎందుకు రానిస్తున్నారు? మీరు ఎవరి పిల్లలు? మరి తండ్రి బలహీనుడా? అలాంటప్పుడు మీరెందుకు బలహీనులుగా ఉన్నారు? మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వ శక్తిమాన్ అని చెప్పుకుంటారా లేక మాస్టర్ బలహీనులనా? మాస్టర్ సర్వ శక్తిమాన్! మరి ఎందుకు బలహీనులుగా ఉన్నారు? ఒకవేళ బలహీనత వస్తోంది, వద్దనుకున్నా వస్తోంది అంటే... అలా రావడం-పోవడానికి కారణం ఏమిటి? చెకింగ్ సరిగ్గా లేదు! నడుస్తూ-నడుస్తూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక విషయంలో అలసత్వం వచ్చేస్తుంది, అప్పుడు బలహీనత వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడా, ఎప్పుడూ అలసత్వం రాకుండా సదా అటెన్షన్ ఉంచండి. అలసత్వం అనేక రకాలుగా వస్తుంది. అలసత్వానికి అత్యంత రాయల్ రూపం ఏమిటంటే - పురుషార్థం చేస్తున్నాం, అయిపోతుంది, సమయానికి తప్పకుండా చేసి చూపిస్తాం అనుకోవడం. పురుషార్థం చేస్తారు కానీ సమయంపై ఆధారం పడతారు, స్వయ' పై ఆధారం పడరు, దాంతో అలసత్వంగా మారిపోతారు. మరి మీరు ఎవరు? అలసత్వం ఉన్నవారా లేక తీవ్ర పురుషార్థీలా?
సదా ఈ స్మృతి ఉండాలి - ప్రతి సమయం ఎవరెడీగా ఉండాలి. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మేము సదా ఎవరెడీగా ఉంటాము! రేపే వినాశనం జరిగినా సిద్ధంగా ఉన్నారా? సంపూర్ణంగా అయ్యారా? లేదు! మరి ఎవరెడీ ఎలా అయ్యారు? ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమే సంపూర్ణంగా అవ్వడం. ఎవరెడీ అనగా సంపూర్ణంగా అవ్వడం. మరి ఎంత టైమ్ కావాలి? కాబట్టి ఎవరెడీగా ఉన్నారు కదా! ఎవరెడీగా ఉంటే టైమ్-కాన్షియస్గా ఉండరు. తండ్రికి చెందినవారిగా అయిపోయారు, ఇక తండ్రి తప్ప వేరే ఎవరైనా ఉన్నారా? మరి ఏమి తయారుకావాలి? ఒక్క తండ్రి, మరెవ్వరూ లేరు అనేది తయారీయే కదా! అది ఎలాగూ ఉన్నారు! మరి ఎందుకు ఒక సంవత్సరం కావాలి, రెండు సంవత్సరాలు కావాలి అని అంటారు? ఉన్నదే ఒక్కరైనప్పుడు, ఆ ఒక్కరి వైపే మన్మనాభవ అయ్యారు కదా! కాబట్టి ఎవరెడీగా ఉన్నారు కదా! ఎలాంటి శ్రమ లేదు.
అనేకమందిని స్మృతి చేయడం కష్టం, ఒక్కరిని స్మృతి చేయడం చాలా సహజం. ఒక్క తండ్రి వైపే బుద్ధి లగ్నమైనప్పుడు ఇక మిగిలినది ఏమి చేయాలి! ఇదే పురుషార్థం. ఇందులో కష్టమేముంది! తండ్రి స్మృతియే ఉన్నప్పుడు, తండ్రి స్మృతిలో మాయ ఏమీ చేయలేదు. మాయ రాగలదా ఏమిటి? ఎవరెడీగా అయి సేవ చేస్తే సేవలో కూడా ఇంకా సహాయం లభిస్తుంది, సహజమవుతూ పోతుంది, సఫలత లభిస్తుంది. కాబట్టి సదా ఈ స్మృతి ఉంచుకోండి - ఉన్నది ఒక్క తండ్రియే, రెండవదేదీ లేదు! ఒకవేళ వన్ బాబా (ఒక్క తండ్రి) ఉంటే విజయం (విన్) నిశ్చితం. సహజయోగులు కదా! మాస్టర్ సర్వ శక్తిమాన్ ఎదుట దాడి చేసే ధైర్యం మాయకు లేదు. పైగా, మాయే సరెండర్ అవుతుంది తప్ప దాడి చేయదు. సర్వ శక్తిమంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు... సదా ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ విజయమే విజయం ఉంటుంది. కల్పకల్పాలనికి విజయులు మీరు, ఇప్పుడూ విజయులే, సదా విజయులుగానే ఉంటారు. ఈ స్మృతి ఉంది కదా! ఎన్నిసార్లు విజయులు అయ్యారు? మరి అనేకసార్లు చేసిన కార్యాన్నే మళ్ళీ చేయడం, అందులో కష్టమేముంది! కొత్త విషయమేమీ కాదు కదా! కాబట్టి నషాతో చెప్పండి - మేము సహజయోగులుగా అవ్వకపోతే ఇంకెవరవుతారు! అని. అలాంటి నషా ఉందా?
అందరి మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ దిద్దబడి ఉంది. ఎందుకంటే భాగ్యవిధాత యొక్క పిల్లలు! మరి ఎవరి తండ్రి భాగ్యవిధాతయో, వారి భాగ్యం ఎంత పెద్దది! కాబట్టి సదా మీ శ్రేష్ఠ భాగ్య రేఖను చూసి హర్షితమవుతూ ఉండండి, సదా అలాగే ఉండండి. ఈ భాగ్య రేఖ కేవలం ఒక్క జన్మ కొరకే కాదు, అనేక జన్మలు ఈ భాగ్యం తోడుగా ఉంటుంది. భాగ్యం మీతోటే వస్తుంది కదా! గ్యారెంటీ ఉంది కదా! ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం అని ప్రపంచం వారు అంటారు. కానీ మీరు, మేము భాగ్యవిధాత పిల్లలము, నిండుగా వెళ్తాము, ఖాళీగా వెళ్ళము అని చెప్తారు. ఈ నిశ్చయం ఉంది కదా! భాగ్యం యొక్క అనుభవం చేసుకుంటున్నారు కదా! అందరూ అనుభవజ్ఞులే. కాబట్టి ఈ అనుభవాన్నే సదా పెంచుతూ ఉండండి. స్మృతిలో ఉంచుకోవడం అంటేనే పెంచడం. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీ శ్రేష్ఠ భాగ్యం కంటే ఉన్నతమైన భాగ్యం ఇంకెవరికీ లేదు. ఇప్పుడు ఏ కొత్తదనం (నవీనత) చేస్తారు? తక్కువ సమయంలో ఎక్కువ సేవ చేసి సఫలత పొందడమే నవీనత. దానికోసం ఏమి చేస్తారు? ఒక్కరి శబ్దంతో అనేకమంది సహజంగా తండ్రికి సమీపంగా వచ్చేలాంటి ఆత్మలను నిమిత్తంగా తయారుచేయండి. ఇప్పుడు బిగ్గరగా శబ్దం చేసే మైక్‌లను తయారుచేయండి అని బాప్‌దాదా చెప్పారు కదా. అచ్ఛా!
గ్రూప్ నం. 5
‘సంపూర్ణ పవిత్రత’యే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ
సంగమయుగానికి లభించిన విశేష వరదానం ఏమిటి? సంగమయుగానికి లభించిన విశేష వరదానం సహజ ప్రాప్తి! శ్రమ తక్కువ, సఫలత ఎక్కువ. అందుకే మీ యోగం పేరు కూడా సహజయోగం. ఎంతటి ప్రాప్తి పొందుతున్నారో దాని ముందు మీరు చేసిన శ్రమ ఎంతటిది! శ్రమ లేకుండానే సదాకాలం కొరకు సర్వ ప్రాప్తులు పొందే అధికారులుగా అయిపోయారు. అన్నింటికంటే పెద్ద ప్రాప్తి తండ్రి లభించారు, అంతా లభించేసింది! మరి తండ్రి సహజంగా లభించారా లేక కష్టంగా లభించారా? ఇంట్లో కూర్చునే లభించారు కదా! ఏమైనా ఖర్చు చేశారా? ఖర్చు చేసే శ్రమ కూడా పడలేదు. మీరు అర్థకల్పం శ్రమపడ్డారు, కానీ శ్రమతో తండ్రి లభించలేదు. తండ్రిని వెతికే ప్రయత్నం చేశారు, కానీ పరిచయం లేకుండా వెతకలేకపోయారు, మరి తండ్రే మిమ్మల్ని సహజంగా వెతికి పట్టుకున్నారు కదా! ఎంత దూరంలో ఉన్నప్పటికీ తండ్రే వెతికి పట్టుకున్నారు.
సంగమయుగానికి ఉన్న విశేష వరదానమే సహజ ప్రాప్తి! స్మృతి చేయడం కష్టంగా అనిపిస్తోందా లేక సహజంగా ఉందా? ఏదైతే సహజంగా ఉంటుందో అది స్వతహాగానే నిరంతరమవుతుంది. కాబట్టి నిరంతర సహజయోగులు కదా! తండ్రి తోడుగా ఉన్నప్పుడు, తండ్రితో ప్రేమ ఉన్నప్పుడు... ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో వారి తోడును వదులుతారా ఏమిటి? మరి తోడును ఎందుకు వదిలేస్తున్నారు? కాబట్టి సదా తోడుగా ఉండాలి. సదా తోడుగా ఉండడం వల్ల మాయాజీతులుగా అవ్వడం కూడా సదా సహజమవుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ వదలం, ఎప్పుడూ మరచిపోం అని వాగ్దానం చేస్తారు కదా! మరి ఎందుకు వదిలేస్తున్నారు? కాబట్టి చేసిన వాగ్దానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఎందుకంటే డ్రామా అనుసారంగా లభించిన సమయం కూడా వరదాని సమయం. కాబట్టి సమయం కూడా సహయోగిగా ఉంది. తండ్రి వచ్చేదే ప్రతీదీ సహజం చేయడానికి! కాబట్టి మీరు వేసే ప్రతి అడుగులో సహజాన్ని అనుభవం చేసుకోవడమే బ్రాహ్మణ జీవితం. ఎందుకంటే తండ్రి సర్వ ప్రాప్తుల భండారాలను నిండుగా చేసేస్తారు. మరి ఎక్కడైతే ప్రాప్తుల భండారా నిండుగా ఉంటుందో, అక్కడ ఏ విషయమూ కష్టం కాదు. సర్వ శక్తుల భండారా నిండుగా ఉందా? జ్ఞానయుక్తులుగా ఉన్నవారి సర్వ ఖజానాల భండారాలు నిండుగా ఉంటాయి. శక్తులలో కానీ, గుణాలలో కానీ, ఏ ఖజానాలో అయినా కొరత ఉందంటే జ్ఞానంలో కొరత ఉన్నట్లే! మరి తండ్రి సమానంగా అవ్వాలి కదా! కాబట్టి ఏ ఖజానా తక్కువగా ఉందో చెక్ చేసుకుని దాన్ని నింపుకుంటూ ఉండండి. అచ్ఛా!
అందరూ హోలీ జరుపుకున్నారా లేక ఇంకా జరుపుకోవాలా? హోలీ జరుపుకోవడం అనగా హోలీ (పవిత్రంగా) అవ్వడం. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే హోలీ అనగా పవిత్రం. పవిత్రత అనే విశేషత వల్లే ఇప్పుడు కూడా మహానాత్ములుగా ఉన్నారు, సదా మహానాత్ములుగానే ఉంటారు. ప్యూరిటీ సహజంగా అనిపిస్తోందా లేక కష్టంగా ఉందా? మరి పవిత్రతను ధారణ చేశారా లేక పవిత్రతను ధారణ చేయడానికి ఇంకా టైమ్ కావాలా? సమస్త వికారాలు వెళ్ళిపోయాయా? లేక ఇంకా కొద్దిగా అంశం మిగిలి ఉందా? పాండవులకు ఎప్పుడైనా కోపం వస్తుందా? మాతలకు మోహం వస్తుందా? సంపూర్ణ పవిత్రం అనగా అపవిత్రత యొక్క అంశమాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత పవిత్రత ఉంటే అంత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ తక్కువగా ఉన్నట్లే. ఈ ప్యూరిటీ పర్సనాలిటీయే సేవలో కూడా సహజ సఫలతను అందిస్తుంది. ఎలాంటి పర్సనాలిటీ అయినా తన ప్రభావం చూపుతుంది కదా! కాబట్టి అన్నింటికంటే పెద్ద పర్సనాలిటీ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ! ఒకవేళ ఒక్క వికారం యొక్క అంశమాత్రం ఉన్నా, దానితో పాటు మిగిలిన తోటివి కూడా తప్పకుండా వస్తాయి. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి, పవిత్రత లేకపోతే సుఖశాంతులు ఉండవు అని మీరు ఇతరులకు చెప్తుంటారు కదా! పవిత్రతకు సుఖశాంతులతో ఎలాగైతే లోతైన సంబంధం ఉందో, అలాగే అపవిత్రతకు కూడా ఐదు వికారాలతో లోతైన సంబంధం ఉంది. అందుకే ఏ వికారం యొక్క అంశమాత్రం కూడా ఉండకూడదు. దీనినే పవిత్రత అంటాము. మీ లక్ష్యం కూడా అంతే కదా, లేక కొద్దిగా మిగిలిపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారా? కాబట్టి సదా లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుని, లక్ష్య ప్రమాణంగా లక్షణాలను ధారణ చేస్తూ ఎగురుతూ ఉండండి. నంబర్‌వన్ రావలసిందే అని అందరూ అంటారు; ఎవ్వరూ నంబర్ టూ అని అనరు. మరి ఏ ఆధారంతో నంబర్‌వన్ అవుతారు? పవిత్రత ఆధారంగానే కదా! కాబట్టి నంబర్‌వన్ ప్యూర్‌గా అవ్వండి. అచ్ఛా!
వీడ్కోలు సమయంలో బాప్‌దాదా పిల్లలందరికీ హోలీ అభినందనలు తెలిపారు
నలువైపులా ఉన్న హోలీ హంసలకు హోలీ ఉత్సవం యొక్క ఉల్లాస-ఉత్సాహ భరితమైన ప్రియస్మృతులు. పిల్లలందరూ ఆత్మిక హోలీని జరుపుకున్నందుకు, సంతోషం యొక్క ఉల్లాస-ఉత్సాహాలను సంకల్పాల ద్వారా, ఉత్తరాల ద్వారా, కార్డుల ద్వారా, బొమ్మల ద్వారా తెలిపిన ప్రియస్మృతులు లభించాయి. ఆత్మిక పిల్లలకు సంగమయుగంలో సదా హోలీగా ఉండే హోలీ ఉత్సవం. అయినప్పటికీ, సంగమం అనేది ఆనందాలను జరుపుకునే యుగం. అందుకే విశేషంగా సదా తండ్రి సాంగత్యంలో ఉండే, సదా సంపూర్ణ హోలీగా అయ్యే మరియు సదా గతించినదాన్ని గతించినట్లుగా చేసే హోలీ ఉత్సవానికి అందరికీ చాలా చాలా అభినందనలు! అభినందనలు!! అభినందనలు!!!
*** ఓంశాంతి ***
